అధ్యాయము 1

 కథారంభము :


డాక్టర్ జోషి, విలియమ్ హార్వే, శకుంతలాదేవి కలిసి కాశీక్షేత్రములోని పంచగంగా ఘాట్ వద్ద తాపీగా కూర్చుని....
మనము గత మూడు సంవత్సరాల నుండి ఈ క్షేత్రములో ఉన్నాడో లేడో  తెలియని పరమహంస కోసము అనవసరముగా వెతుకుతున్నామని నాకు అనిపిస్తోంది అని శకుంతలాదేవి అనగానే....
"అవును " అని మిగతా ఇద్దరు తల ఊపుతుండగా....

శకుంతలాదేవి....
ఉన్నట్టుండి..... తనకెదురుగా....
అతివేగముగా ప్రవహించే
పరమ పవిత్ర గంగానది కేసి తన చూపుడు వ్రేలు చూపిస్తూ... మిగతా వారికి సైగ చెయ్యగానే....
వాళ్ళుగూడ....
అంతే  ఆశ్చర్యానందాలకు గురి అవుతుండగా 

గంగానదిలో.....ఒక శవపేటిక తేలుతూ కనబడింది అందులోంచి....
ఒక భారీ దేహమున్న వ్యక్తి పైకి లేచి నీటిపైన నడుస్తూ....
తాము ఉన్న పంచగంగా ఘాట్ ఒడ్డుకి చేరుకొని.....
అడుగు ఎత్తులో....
నేలమీద అడుగులు వెయ్యకుండా గాలిలో తేలుతూ.....
ఈ ఘాట్ కి ఉన్న మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లుతూ....
వీళ్ల వైపు చూసి.... ఒక చిరునవ్వు నవ్వగానే అప్పుడుగాని...
ఈ ముగ్గురిలో చైతన్యము కల్గి.....
తాము చూస్తున్న దృశ్యము
నిజమా.... అబద్దమా.... భ్రమ.... బ్రాంతి అని తెల్సుకొనేలోపులే......
ఈయన కాస్త....
21 మెట్లు ఎక్కి ఎటో వెళ్ళడము గమనించి వీళ్లు ముగ్గురు గూడ  అనుసరించారు.....
తీరా....
ఈయన కాస్త ఒక మఠములోనికి వెళ్లడముతో.... వీళ్లు గూడ ఆ మఠము లోనికి వెళ్లి... ఈయనను వెతుకుతుండేసరికి....
అక్కడున్న....
ఒక వ్యక్తి ఈ ముగ్గురిని ఎగాదిగా చూసి
"ఎవరి కోసము వచ్చారు?" అనగానే....
డాక్టర్ జోషి వెంటనే....
స్వామి! ఇప్పుడు ఒక భారీ దేహమున్న యోగి లోపలకి వచ్చారు! ఆయన ఏరి? అనగానే.....
అయ్యా! అక్కడున్న ఫోటోలో కనిపించే వ్యక్తియేనా? మీరు వెతికేది అనగానే....

ఈ ముగ్గురు ఒక్కసారిగా ఆ ఫొటోకేసి చూసి నోళ్లు వెళ్ళపెట్టారు! ఎందుకంటే తాము చూసిన వ్యక్తి ఈ వ్యక్తియని తెలుసుకొని......
"స్వామి! ఇది ఎలా సాధ్యం?"
అయ్యా! పరమయోగులకి సాధ్యము కానిది ఏమి ఉండదు! అష్టసిద్ధులు, పంచభూతాలను తమ ఆధీనములో ఉంచుకొనే యోగులు వాళ్లు! మీరు చూసిన మహానుభావుడు ఈ మఠాధిపతి యైన శ్రీ త్రైలింగేశ్వర స్వామి వారు! ఈయన
 280  సంవత్సరాలు జీవించి జీవ సమాధి చెందిన పరమయోగి! ఈయనే అప్పుడప్పుడు ఇలా సశరీరముతో ఈ మఠానికి వస్తున్నట్లు మీలాంటి సాధకులకి కనబడుతారు! నాకు తెలిసి ఏదైన లోక కళ్యాణార్ధము లేదా లోక విపత్తు జరిగినప్పుడు
ఆ సందేశము ఇవ్వడానికి కనబడతారని ఈ క్షేత్ర వాసులకి నమ్మకము! ఒకవేళ మీకు ఆయన కనిపించారంటే ఏదో లోక కార్యము మీ వలన
జరుగుతుంది అన్నమాట అంటూ ఇంతకీ మీరెవరు? అనగానే....
స్వామి! మేము విశ్వరహస్య ఛేధన కోసము ప్రయత్నించే శాస్త్రవేత్తలము అనగానే.....
ఆ వ్యక్తి నోరు వెళ్లపెట్టాడు!
ఈ ముగ్గురు కలిసి ఈయనకి కృతజ్ఞతలు చెప్పి..... అక్కడే ఉన్న శ్రీ త్రైలింగ స్వామి విగ్రహమూర్తి దగ్గరికి   వెళ్లి.....
స్వామి! మీరు మాకు సశరీరముతో కనిపించారంటే మేము వెతుకుతున్న పరమహంస గారి గూర్చి మీరు ఏదైన సహాయము చేస్తారని.... నమ్మకము ఏర్పడింది! భారతీయ ఆధ్యాత్మిక విద్యయందు అమిత ఆసక్తి కల్గి వేదాలు, ఉపనిషత్తులు,
 శాస్త్రాలు, ఇతిహాసాలు చదివాము! శబ్దపాండిత్యము పొందాము! కాని ధ్యాన అనుభవపాండిత్యము మాకు అందలేదు! ఇది తెలిసిన వ్యక్తి
పరమహంస యని ఈ క్షేత్రానికి రావడము జరిగింది! కాని ఇంత వరకు ఆ గుప్తయోగి అడ్రసు దొరకలేదు! ఎక్కడ ఉన్నారో, ఉన్నారో లేదో గూడ తెలియడము లేదు! మా ఆశ చచ్చిపోతున్న సమయములో మీరు కన్పించి ఆశ నిలబెట్టారు!
 మా విశ్వరహస్య శోధనకి మీ సహాయ సహకారాలు అందించండి అంటుండగా ఈ విగ్రహమూర్తి నుండి ఒక పువ్వు ఈయన పాదాల మీద పడగానే అక్కడే ఉన్న పూజారి వెంటనే.... వీరితో అయ్యా! మీరు కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది!
స్వామివారు మిమ్మల్ని అనుగ్రహించారు!
అంటుండగా....
ఇంతకీ మీరు ఎవరిని కలవటానికి ఈ క్షేత్రానికి వచ్చారు అనగానే.....
స్వామి! పరమహంస గారిని కలువడానికి వచ్చాము! ఆయన ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో..... ఉన్నాడో
లేడో గూడ తెలియదు!
అనగానే....
వెంటనే ఆ పూజారి కాస్త ఒకవేళ మీరు వెతుకుతున్న వ్యక్తి మా గురువైన పరమహంస కాదు గదా! ఆయనకి పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్ఠలు, ధనవ్యామోహాలు లేవు! చాలా సింపులుగా గుప్తముగా ఉండే గుప్తయోగి! పైగా నేను పూజించే
 శ్రీ త్రైలింగస్వామి వారి ప్రియ శిష్యుడు అప్పుడపుడు ఈయన కాస్త ఆయనకి ధ్యానములో కన్పించి సందేహాలు తీరుస్తూ సందేశాలు ఇస్తారని వినికిడి! ఒక వేళ ఈ వ్యక్తియే మీరు వెతుకుతున్న వ్యక్తి గావొచ్చును గదా! ఒకసారి ప్రయత్నించి చూడండి!
సాధన సాధ్యతే సర్వం సాధ్యం గదా! అంటూ పరమహంస ఉండే అడ్రసు ఒక కాగితము మీద రాసి డాక్టర్ జోషికి ఇవ్వడము.... వీళ్లు దీనిని తీసుకొని శ్రీ త్రైలింగస్వామి విగ్రహమూర్తికి పాదాభివందనము చేసి ఆ పూజారికి కృతజ్ఞత చెప్పి.... ఆశతో.... అనుమాన భయముతో....భయముతో గూడిన గౌరవముతో.... ఈ అడ్రసున్న ఇంటివైపు బయలుదేరారు!

No comments:

Post a Comment