అధ్యాయము 36

 పరమహంస

48  నిమిషాలకు పైగా..... పద్మాసనములో కూర్చుని..... మూలాధార చక్ర జాగృతి కోసము పృధ్వి హస్త ముద్రతో అభ్యాససిద్ది చేస్తున్నారు. అపుడు ఈయన ముక్కులకి ఎక్కడనించో సువాసనలు రావడము మొదలైంది. అవి తన శరీరము నుంచే ఈ వాసనలు వస్తున్నాయని అర్థమైంది. కొద్దిసేపటికి సువాసనలకి బదులుగా అశుధ్ధవాసనలు అనగా చీము వాసన, మలము వాసన,  మూత్ర వాసన, జుట్టు కాలిన వాసన, శవాలు తగలబడుతున్న వాసన ఇలా పలురకాల చెడు వాసనలు గూడ ఈయన ముక్కుకి చేరాయి. విచిత్రము ఏమిటంటే ఈ రెండు రకాల వాసనలు గూడ కాలాముఖుడు, జోషి, హార్వే,దేవి ముక్కు రంధ్రాలకి సోకాయి. వాళ్లకి ఈ వాసనలు ఎక్కడ నుంచి ఎందుకు వస్తున్నాయో వీళ్లకి అర్ధము కాలేదు కాని కాలాముఖుడికి అర్ధమైన మౌనము వహించాడు. 


[ ఈ చక్ర జాగృతి సమయములో ఈ వాసనలు వస్తాయి. మన కర్మలు పుణ్యమైతే సువాసనలు, పాపాలు అయితే చెడు వాసనలు వస్తాయి.కర్మ ఫల నివారణలు అవుతున్నపుడు ఇలాంటివి వస్తాయి. ఎందుకంటే మూలాధార చక్రములోనే అన్ని రకాల కర్మ ఫలాలు నిక్షిప్తము చెయ్యబడతాయి.]


కొద్దిసేపు అయిన తర్వాత.....

పరమహంస నోటి నుండి విచిత్రమైన శబ్దాలు రావడమైంది. ఏనుగు ఘీంకారము, ఆవు అరుపులు, పులి గాండ్రింపులు, పాము బుసలు, ఎలుక అరుపులు ఇలా జంతువుల అరుపులు రావడము మొదలైంది. ఈ శబ్దాలను గూడ మిగిలిన వారందరు గూడ పరికరముల ద్వారా వినడము జరిగింది. గాకపోతే ఇవి ఎందుకు వచ్చినాయో వీళ్లకి అర్థము కాలేదు.

ఆ తర్వాత..... దీనిని శ్రద్ధ భక్తితో వింటున్న తుమ్మెదల  నాదము వినబడింది. పరమహంస యొక్క గుద స్థానము నందు నాలుగు పలకలుగా ఉండి త్రికోణాకృతిలో ఉన్న మూలాధార చక్ర దర్శనమైంది.  ఈ త్రికోణము మధ్యలో వెనుపూస దిగువ లోపలి భాగములో పువ్వు మొగ్గలాగా ఉండి మధ్యలో ఒక చిన్నరంద్రమున్నట్లుగా అందరికి పరికరము  యందు స్పష్టముగా కనబడింది. ఈ మొగ్గ చూడటానికి ఒక శివలింగాకృతిలో ఉంది.  దీనిని మహా దివ్య తేజస్సుతో బంగారపు వర్ణముతో మూడున్నర చుట్లు చుట్టుకొని ఒక దివ్య దేవత సర్పములాగా ఉండి తన తోకను తానే నోటిలో పెట్టుకొని ఈ లింగాన్ని కప్పిఉంచినట్లుగా దృశ్యము అందరికి కనిపించింది. గాకపోతే వీళ్లకి ఇది ఏమిటో అర్ధము కాలేదు.


ఆ తర్వాత....

ఈ చక్రము అంతా గూడ ఎరుపు రంగులో ఉండి నాలుగు కోణాలతో, 'లం' అనే మధ్యస్థ మూల బీజాక్షరముగా మూలాధార చక్ర దర్శనమైంది.

కొద్ది సేపటికి.....

నగ్నముగా ఉండి తన తొండమును తన ప్రక్కనే ఉన్న భార్య యొక్క యోని భాగమును తాకుతున్న ఉచ్చిష్ట గణపతి నిజ రూప దర్శనము అయింది. ఈయన పరికరాలలో చూసిన ముగ్గురికి నోటమాట రాలేదు. ఇంతవరకు అందమైన రూపములో ఉన్న గణపతి విగ్రహాలు, ఫోటోలు చూశారు కాని నగ్నరూపములో ఆది గూడ శృంగార భంగిమలో ఉన్న గణపతి రూపాన్ని వీళ్లు   ఇంతవరకు చూడలేదు. ఈ గణపతి రూపాన్ని చూసిన గూడ పరమహంస అలాగే కాలముఖుడు మనస్సులు ఇసుమంత గూడ చలించక పోయేసరికి..... వరుసగా.... అష్ట రూపాలలో నగ్న స్త్రీ మూర్తులు అనగా భూలోక మానవ స్త్రీ,రాక్షస, పిశాచ, భూత, ప్రేత, యక్షిణి, కిన్నెర, గంధర్వ జాతుల స్త్రీలు కనిపించిన ఈయన పట్టించుకోలేదు. ఆపై దేవత స్త్రీమూర్తి కాస్త 'లజ్జాగౌరి' రూపములో నగ్నముగా వచ్చిన ఈయన స్పందించలేదు.


ఈ దృశ్య రూపాలన్ని గూడ హార్వే పరికరములో కనబడుతున్నాయి. వీటిని చూస్తున్న ఈ ముగ్గురికి నోటమాట రావడములేదు. హార్వే, జోషి, అయితే ఈ నగ్న స్త్రీమూర్తుల అందమైన దేహ వర్ఛస్సు, ఓంపు సొంపులు, నడుము సొగసులు, 24 -36 -24 కొలతలున్న అంగ సోష్టవాలు చూసి సొంగ కార్చుకుంటున్నారు.

ఆ తర్వాత ఇలాగే ఎనిమిది జాతుల నగ్న యువకుల  దర్శనమయ్యేసరికి.....

ఈ దృశ్యము చూసిన దేవి మనస్సులో గూడ ఏదో తెలియని తలంపులు రావడము మొదలైంది. వీళ్లు ఎంత నిగ్రహించుకున్న మనస్సు అదుపులోనికి రావడము లేదు. ఈ ముగ్గురు గూడ మానవ మాత్రులే గదా.

ఆశలు, కోరికల మాయా బంధాలలో ఎపుడో బందీ అయిన వల్లే గదా.

ఆ తర్వాత......

ఎప్పుడైతే ఈ నగ్న దృశ్యాలు చూసిన గూడ పరమహంసలో ఎలాంటి స్పందనలు లేకపోయేసరికి ఉచ్చిష్ట గణపతి స్థానములో జీవముతో ఉన్న స్వయంభూ శ్వేతార్క గణపతి దర్శనము అయింది. కొన్ని క్షణాల తర్వాత ఈయన అదృశ్యమై... ఈయన స్థానములో చింతామణి,గణపతి శిల దర్శనమైంది. ఇది ఏమిటో తెలిసిన గూడ పరమహంస ఏమీ ఆశించలేదు. ఆశపడలేదు. ఇది గూడ అదృశ్యమై... దీని స్థానములో స్వయంభూ....కాఫీ పొడి రంగులో..... ఏనుగు తలలో..... మూల గణపతి దర్శనమైంది.

ఈయనను గూడ పరమహంస కొన్ని క్షణాలపాటు సాక్షీభూతముగా చూడగానే....

ఈ గణపతి ఉన్నట్టుండి మొదట 32 గణపతులుగా విడిపోయాడు. ఆపై సుమారుగా ఏడు కోట్ల గణపతులుగా విడిపోయి దర్శనమిచ్చాడు. అయిన గూడ పరమహంసలో  ఎలాంటి స్పందనలు కనిపించలేదు. ఈ దృశ్యాలు అన్ని గూడ హార్వే పరికరములో స్పష్టముగా కనబడుతూనే ఉన్నాయి. వీటిని చూస్తున్న ఈ ముగ్గురికి ఆశ్చర్యానందము వేస్తోంది.

ఆ తర్వాత....

ఒక శక్తి మాత నిజ రూప దర్శనము అయింది. ఈమె చూడటానికి నాలుగు చేతులు, అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంది.

ఉన్నట్టుండి.....

పరమహంస కాస్త నీటి అడుగు భాగము నుండి ఒక అడుగు ఎత్తులో పైకి లేవడము జరిగింది. కొన్ని నిమిషాల తర్వాత యధార్థ స్థితికి రావడము.ఇలా ఎందుకు జరిగిందో ఈ దృశ్యము చూస్తున్న ఈ ముగ్గురికి అర్థముకాలేదు. ఇది తెలిసిన కాలాముఖుడు ప్రస్తుతానికి మౌనఃముగా ఉండి అన్ని రకాల దృశ్యాలను తన మనో దృష్టితో సాక్షి భూతముగా చూస్తూనే ఉన్నాడు.

ఆ తర్వాత.....

ఒక త్రికోణము దాని మధ్యలో మహా గణపతి దర్శనమైనాడు.ఈయన చుట్టు దాదాపుగా 20 త్రికోణాలు ఈయనతో కలిపి మొత్తము 21 త్రికోణాలు కన్పించాయి. వీటిలో ఏవో గ్రహాలున్నట్లుగా కన్పించాయి. అంటే 21 గ్రహ వ్యవస్థలకి ఈయనే అధిపతియని సంకేతముగా అన్పించసాగింది. 

ఇంతలో ఈ చక్ర గ్రహ లోకమైన కుజగ్రహ లోకము దర్శనమైంది. అప్పుడు ఈయనకి ఈ లోకవాసుల ఎలా ఉంటారో  చూడాలన్పించి పరమహంస సూక్ష్మ శరీరము ఈ గ్రహ లోకములోనికి ఎరుపు రంగులో ఉన్న ఆకాశము నుండి ఈ లోకములోనికి దిగినట్లుగా కన్పించింది. విచిత్రము ఏమిటంటే ఈయనకి భూలోక వాసులు ఎవరైతే ఉన్నారో వారంతా గూడ ఈ లోకములో కన్పించారు. గాకపోతే వాళ్లకి

వీళ్లకి వేష భాషలలో తేడాలున్నాయి. వృత్తులు ప్రవృత్తులలో తేడాలున్నట్లుగా..... తనని ఎవరు గుర్తు పట్టడము లేదు కాని తను అందరిని గుర్తు పట్టడము  జరుగుతోంది. తనని వీళ్లు భూలోక సంచార వాసిగా  గుర్తించారని పరమహంస గమనించాడు. అంతే  విచిత్రముగా తనలాంటి రూపధారులు ఈ లోకములో

64 మంది దాకా ఉండటము గమనించిన గూడ మౌనంగా ఉన్నాడు. ఎవరి పనులలో వాళ్లు బిజీగా ఉన్నారు. ఈయన తన శరీరములో ఈ లోకమును గమనించాడు. భూలోకములో ఉన్న టెక్నాలజీకి వీళ్లు ఉపయోగించే టెక్నాలజీ ఉన్నత స్థితిలో ఉన్నదని గ్రహించాడు. వీరంతా 8D టెక్నాలజీ ఉపయోగిస్తున్నా  

వాతావరణము అంతా గూడ ఎరుపు రంగులో ఉండటము, మట్టి గూడ, మనుషులు గూడ ఇదే రంగులో ఉండటము గమనించాడు. గాకపోతే వీళ్లంతా గూడ సూక్ష్మశరీరధారులుగా ఉన్నారు. ఎవరు గూడ స్థూలశరీరముతో ఈయనకి కనిపించలేదు. సూర్యుడి నుండి ఎల్లప్పుడు ఎరుపు వర్ణములో ఎర్రటి కాంతినే

ప్రసరింప చెయ్యడము గమనించాడు. వీళ్లకి కోపతాపాలెక్కువని,కామోద్రేకాలు గూడ ఎక్కువేనని, ఎప్పుడు గొడవలు, కొట్లాటలు, యుద్ధాలు చేసే మనః స్తత్వమున్నవారని

సరైన పరిష్కారాలు వెతికే సమర్థులున్నవారని, జ్ఞాన సంపన్నులని, శారీరక బలమున్నవారని అమాయకత్వము, పిల్లల వంటి మనః స్తత్వమున్న వారని ఈయన గ్రహించి ఈ లోకము నుండి అదృశ్యమయినారు.ఇలాంటి కుజ గ్రహ లోకాలు సుమారుగా ఏడు వేల దాకా కనిపించాయి.

ఆ తర్వాత ఈ చక్ర దైవలోకమైన  భువర్లోకము ఈయనకి దర్శనమైంది. అప్పుడు ఈయనకి ఈ లోకవాసుల ఎలా ఉంటారో  చూడాలన్పించి సూక్ష్మ శరీర యానముతో ఈ లోకములోనికి అడుగు పెట్టడము జరిగింది. తీరా చూస్తే ప్రస్తుతము తను ఉన్న భూలోకమే ఈ భూగోళలమని అర్థమయింది. అంతే విచిత్రముగా ఇలాంటి భూగోళాలు సుమారుగా 21,600 దాకా అనగా అంకెలతో సహా పరమహంసకి కన్పించేసరికి అంటే ఈ భూగోళాలు అన్నిగూడ మనము ప్రతీరోజు పీల్చే శ్వాస సంఖ్యయని, అసలు మూలమైన భూగోళము ఎక్కడో ఉన్నదని...... ప్రస్తుతము తను చూస్తున్న భూగోళము అనేది దీనికి ప్రతిబింబమని ఈయనకి అర్థమైంది. వెను తిరిగి రావడము జరిగింది.

ఆ తర్వాత....

భూక్షేత్రమునందు హరిద్వార్ క్షేత్ర ప్రాంత దృశ్యాలు ఈయన మనోదృష్టికి వచ్చాయి. అంటే ఈ క్షేత్రము అనేది మూలాధారచక్రమునకు  సంబంధించినదని ఈయనకి అర్థమైంది.


ఆ తర్వాత.......

భూగోళమును అష్టదిక్కులలో అష్ట ఏనుగులు ఉండి మోస్తున్న మహత్తర దృశ్యము కన్పించింది.   కొద్దిసేపటి తర్వాత 8  భుజాలతో, 8 ఆయుధాలతో అభయ ముద్రతో సతీ సమేతముగా ఏక గజ ముఖ మహా గణపతి దర్శనమై..... ఆపై అదృశ్యమవుతూండగా.....  

పరమహంస యొక్క మూలాధార చక్రము కాస్త విబేధనము చెందడముతో.... కుండలిని శక్తి కాస్త  రెండవ చక్రమైన స్వాధిష్ఠాన చక్రము వైపు శరవేగముగా  ప్రవహించసాగింది. దానితో ఈయన ధ్యాన నిష్ఠ నుండి కళ్లు తెరవడముతో....

అక్కడ కాలముఖుడు కళ్లు తెరిచి శవాసనము నుండి  లేచి పద్మాసనము వేసుకొని...... అక్కడున్న ముగ్గురి కేసి చూస్తూ

నాయనా! మీ గురూజీ యొక్క మూలాధార చక్ర  దృశ్యాలు మీ పరికరాలలోనికి వచ్చాయని అనుకుంటాను. ఒకొక్క దృశ్యము గూర్చి వివరముగా మీకు చెపుతాను. ఆయన పృథ్వి ముద్రతో సాధన చేస్తుండగా వాసనలు రావడము జరిగింది. ఈ వాసనలు రావడము అనేది పూర్వజన్మల కర్మవాసన అన్నమాట.

ఇందులో పాపాలు చేస్తే అశుద్ధ వాసన అదే పుణ్యాలు చేస్తే సువాసనలు వస్తాయి. ఇలా ఈ రెండు కర్మలు ఈ చక్రము నందు సాధకుడు నివారణ చేసుకోవాలి. ఇలా పరమహంస చేశాడు. ఆ తర్వాత మీకు వినిపించిన జంతువుల అరుపులు అనేవి ఆయన గత జన్మలు అన్నమాట. అంటే ఈయన కర్మ, జన్మ రహిత్యము చేసుకున్నారు. ఆ తర్వాత మూలాధార చక్ర ఆకృతి, బీజాక్షరాలు, స్వయంభూ లింగము, కుండలిని శక్తికి ప్రతీకయైన కృష్ణ సర్పము  కనిపించాయి. ఆ తర్వాత ఈ చక్ర కామ మాయకి ప్రతీకగా శృంగార భంగిమ ఉచ్చిష్ఠ మహాగణపతి దర్శనము అయింది. ఆ తర్వాత ఈ కామ మాయ పరీక్ష కోసము అష్ట జాతుల నగ్న స్త్రీ మూర్తులు అలాగే పురుష మూర్తుల దర్శనము ఇవ్వడము  జరిగింది. ఈ కామ మాయకి పరమహంస కాస్త  స్పందించకపోయేసరికి ఉచ్చిష్ఠ గణపతి స్థానములో శ్వేతార్క గణపతి కనిపించాడు. అపుడు ఈ చక్రశుద్ధి ఆరంభము అయింది. ఆ తర్వాత చింతామణి శిల దర్శనమిచ్చింది. పరమహంస దీనిని ఆశించకుండ సాక్షిభూతముగా చూసేసరికి 32 గణపతుల దర్శనము  అయింది. వీళ్లు వరుసగా బాల, తరుణ, భక్తి, వీర, శక్తి,  ద్విజ, సిద్ధి, ఉచ్చిష్ఠ, విష్ణు, క్షిప్ర, హేరంబా, లక్ష్మి, మహా,విజయ, నృత్య, ఉర్దవ, ఏకాక్షర, వరద, త్రిక్షర,   క్షిప్ర ప్రసాద, హరిద్ర, ఏకదంత, శ్రద్ధ, ఉద్దండ, సంకటమోచన, ధుండి, ద్విముఖి, త్రిముఖి,సింహ, యోగ, దుర్గ, సంకటహర గణపతులు. ఆ తర్వాత వీరంతా కలిసి ఏడు కోట్ల గణపతులుగా విభజన చెందడముజరిగింది. ఇవే నాలుగు వేదాలలో ఏడు కోట్ల వేదమంత్రాలుగా మారాయి. చింతామణి గణపతి దర్శనము అనేది ఈ చక్ర ఆధీన సంకేతము అయితే ఈ 32 గణపతుల దర్శనము అనేది ఈ చక్ర విబేధన గుర్తు అన్నమాట. ఆ తర్వాత కనిపించిన శక్తి మాత పేరు ఢాకిని శక్తి. ఈ చక్ర శక్తి దేవత అన్నమాట.

ఆ తర్వాత అడుగు భాగము నుండి ఒక అడుగు పైకి ఆ తర్వాత పరమహంస నీటి అడుగు భాగము నుండి ఒక అడుగు పైకి లేవడము అనేది ఈ చక్రము ఇచ్చే భూచర సిద్ధి అవుతుంది. అనగా భూమి మీద ఆధిపత్యము పొందడము జరుగుతుంది. ఆ తర్వాత 21 గ్రహ వ్యవస్థ మండలాలు మీకు కనిపించాయి.ఇవి ఒక్కొక్క చక్రానికి మూడు చొప్పున ఏడు చక్రాలకి 21 గ్రహ వ్యవస్థలఉన్నాయి. వీటి ఆధిపత్యము ఈ చక్ర  గణపతియే వహిస్తాడని సూచన. ఆ తర్వాత ఈ మూలాధార చక్రమును నడిపించే కుజగ్రహ లోకవాసులు అలాగే దైవలోక భూలోకవాసులు లీలగా కనిపించారు.ఆ తర్వాత భూలోకము నందు ఈ చక్రానికి మోక్షమిచ్చే హరిద్వార్ క్షేత్ర దర్శనము అయింది. చిట్టచివరికి మహాగణపతి దర్శనమిచ్చి- శూన్యమవ్వడముతో.... పరమహంసకి ఈ చక్ర విబేధనము జరిగింది.

ఇలా మీకు ప్రతీ చక్రము నందు చక్ర జాగృతి, చక్ర ఆకృతి, చక్ర బీజాక్షరాలు, చక్ర దైవము, చక్ర శక్తి  దేవత, చక్ర యోగమాయ, చక్ర శుద్ధి, చక్ర ఆధీనము, చక్ర విబేధనం, చక్రాధినేత శూన్యమవ్వడము కనబడతాయి. ప్రస్తుతానికి మీ గురూజీ విశ్రాంతి పూర్తి అయింది. మీకు ఈ చక్ర దృశ్యాల గూర్చి నా వంతుగా చెప్పడము గూడ  పూర్తి అయింది. అనగానే....


హార్వె వెంటనే స్వామి! మీరు ఏమి అనుకోకపోతే నాది ఒక చిలిపి సందేహము. గణపతి చేతితో లేదా తొండముతో తింటాడా? అనగానే


నాయనా! ఆయన రెండింటితోను తింటాడు. ఘన పదార్థాలైన లడ్డు, కుడుములు, ఉండ్రాళ్లు లాంటివి చేతితో తింటే..... ద్రవ పదార్థాలైన పానకము, చెరుకురసము, పాలపాయసము లాంటివి తొండముతో సేవిస్తారు. చిద్విలాస పురుషుడు, ఏదైనా చెయ్యగలడు. దేనినైనా సాధించగలడు.

ఇంతలో.....

దేవికి మరొక సందేహము వచ్చి.... స్వామి! పార్వతిదేవికి గణపతి వివాహానికి ముందు పుట్టాడా? తర్వాత   పుట్టాడా? అనగానే....

అమ్మాయి! పార్వతిదేవికి వివాహము అయిన తర్వాత నలుగుపిండితో మహా శివుడి రాక కోసము ఎదురుచూస్తూ తయారుచేసింది. మరి అలాంటప్పుడు ఈమె వివాహ ప్రక్రియలో గణపతి పూజలో ఎవరిని పూజించింది గదాయని నీ సందేహము. నిజానికి  గణపతి దేవుడు అంటే మూలాధార చక్ర అధిపతి గదా. మరి ఆదియోగియైన పరమేశ్వరుడి మూలాధార చక్ర అధిపతిగా అపుడికే మహాగణపతి ఉద్భవం  జరిగింది. అంటే ఈ లెక్కన చూస్తే అమ్మవారు వివాహ ప్రక్రియలో ఈ మహా గణపతిని పూజిస్తే..... వివాహము అయిన తర్వాత చేసిన నలుగుపిండి గణపతి మరో గణపతి ఉద్భావము అన్నమాట. ఇలా ఈ గణపతులు 32 దాకా ఏడు కోట్ల మంది ఉన్నారని నువ్వు తెలుసుకున్నావు గదా. అంటూ

 ఇక మీ గురూజీ......

 ఈసారి తన రెండవ చక్రమైన స్వాధిష్టానము మీద ఆధిపత్యము కోసము జలముద్రతో సాధన అభ్యాసము మొదలు పెడుతున్నారు. ఈసారి ఈయనకు ఏ దృశ్యాలు కనబడతాయో చూడాలి గదా అంటూ పద్మాసనము నుండి శవాసనము స్థితికి వెళ్లి పరమహంస ధ్యాన దృశ్యాలను ఈయన తన మనోనేత్రము ద్వారా చూడటము ఆరంభించారు.  ఈ లోపల హార్వే, జోషి, దేవి కలిసి ఈ ధ్యాన దృశ్యాలను అలాగే కాలాముఖ చెప్పిన విషయాలను రికార్డింగ్ చేసి భద్రపరిచే పనిలో ఉన్నారు.

అలాగే దేవి కాస్త  ఉచ్చిష్ఠ గణపతి దేవాలయాల కోసము వెతికితే శ్రీశైల క్షేత్రములో అడవి లోపల ఉన్న ఈ దేవాలయము అలాగే తమిళనాడు ప్రాంతములో ఉన్న ఈ దేవాలయ దర్శనము అలాగే ఈ విగ్రహ మూర్తులను  చూసిన తర్వాత గాని ఈమెకి   ఉచ్చిష్ఠ గణపతి నిజ రూప దర్శనము నిజమేనని తెలిసింది.

No comments:

Post a Comment