అడవిలో మూలిక వేర్లు కోసము వెళ్లిన కర్కోటకుడికి అలాగే చారుకేశకి తమ దగ్గరిలో ఉన్న పొదల నుంచి పులి గాండ్రింపు వినిపించేసరికి....కర్కోటకుడు వెంటనే.... ఒరేయి! శిష్య! పులి గూర్చి భయపడకు!పులి మనల్ని ఏదో చేస్తుందనే భయమే మనల్ని చంపుతుంది! కంగారుపడకు! నేను ఏదో ఒకటి చేసి దాని దృష్టి మన మీద లేకుండా చేస్తాను అంటూ తన చేతి సంచిలోంచి తన మంత్ర దండమును తీసి వారిద్దరి చుట్టు దానితో ఒక గిరి గీసి శాంతముగా ఉండేసరికి....
చారుకేశకి ఆశ్చర్యమేసి....
గురూజీ! ఇంక నేనేమో ఆ పులి మీద ఏదైన మంత్ర ప్రయోగము చేస్తారని చూస్తోంటే మీరేమో ఏ మంత్రాలు చదవకుండా మీ దండముతో మన చుట్టు గుండ్రని గీత గీసి ఊరుకున్నారు అనగానే......
శిష్య! అన్ని సమయాలలో మంత్ర ప్రయోగాలు చేసుకుంటూ పోతే మనం సాధించిన మంత్రశక్తి సిద్ధి తగ్గిపోతుంది! అత్యవసర సమయాలలో మాత్రమే అదిగూడ పరిస్థితులు మన చేతులు దాటిపోతున్నాయి అన్నపుడే మంత్ర ప్రయోగాలకి సిద్ధపడాలి! అయిన ఇప్పుడు ఏమి జరిగింది ! పులి ఇంక మన ముందుకి రాలేదు గదా! వచ్చినపుడు ఏమి జరుగుతుందో నువ్వే చూడు అంటూండగా.....
పది అడుగుల దూరము ఎదురుగా బెంగాలి టైగర్ కనబడి గుర్రుగా.... బిగ్గరగా వీళ్లనే చూస్తూ గాండ్రించడం మొదలు పెట్టింది! అయిన వీరిద్దరు బెదరలేదు! అదరలేదు! తమ పనిగా వేర్లు సేకరిస్తుండేసరికి.... పులికి ఆవేశమెక్కువై..... చారుకేశ మీద దూకే ప్రయత్నము చెయ్యపోయి గిరిగీసిన గీత నుండి వచ్చే ఒకరకమైన వాసనను పసికట్టి.... పెద్ద పెద్దగా గాండ్రిస్తూ మరో దిక్కుకి వెళ్ళిపోయింది!
చారుకేశ ఆశ్చర్యముగా చూస్తూండగా.... కర్కోటకుడు వెంటనే.... శిష్య! నా చేతిలో ఉన్న మంత్ర దండమునకు ఏలాంటి మహత్తులు, శక్తులు లేవు! కాని దానిని తయారు చేసిన చెక్క హిమాలయాలలో మాత్రమే పెరిగే మొక్క కాండము! దీని ప్రత్యేకత దీని వాసనను మనుష్యులు పసికట్టలేరు! కాని జంతువులు, ఈ వాసనను పసికడతాయి! ఈ వాసన వాటికి ప్రాణహాని కలిగిస్తుందని వాటికి జ్ఞానముంది! అందుకే పూర్వము యోగులు, ఋషులు, సాధువులు ఇలాంటి కాండముతో చేసిన మంత్ర దండమును జపము కోసము వాడేవాళ్లు! విషజంతువుల నుండి, విష క్రిమికీటకాదులు నుండి మనల్ని తినే జంతువుల నుండి ఈ మంత్ర దండముతో ప్రాణాలను రక్షించుకొనేవారు! ఇపుడు ఆ మొక్కలు అంతరించిపోయాయి! పేరుకే ఏదో చెక్కలతో చేస్తున్న యోగదండాలు తయారు అవుతున్నాయి! అంటూ తన పనిలో నిమగ్నమైనాడు!
No comments:
Post a Comment