కర్కోటకుడు.... .....
తీవ్రమైన మధన పడుతున్నాడు. అగ్ని భేతాళుడు చెప్పినట్లుగా తను ఏ మాయలో లేడు, పడలేదు. మరి తప్పుడు వ్యక్తి మీద 'ఛోడ్' ప్రయోగము చేస్తున్నానని అగ్ని భేతాళుడు ఎందుకు అన్నాడో వీడికి అర్ధము గావడము లేదు. ఒకవేళ అగ్ని భేతాళుడు అబద్ధము చెప్పాడా? లేక తను తనకి తెలియకుండా ఏదైనపొరబాటు లేదా మాయలో ఉన్నాడో కర్కోటకుడికి ఒక పట్టాన అర్ధము కాలేదు.
తన కాళ్ల క్రింద ఉన్న గంగానది నీటిని తడుతూండగా.... కనుచూపుమేరలో విశ్రాంతి తీసుకుంటూ పరమహంస కన్పించేసరికి... ఇది ఆయన భౌతిక శరీరము కాదని సూక్ష్మశరీరమని క్షణాలలో వీడు గ్రహించాడు. ఏక్కడో రహస్య గదిలో ధ్యాననిష్ఠలో ఉన్న పరమహంస ఇక్కడికి ఇలా సూక్ష్మ శరీరముతో ఎందుకు వచ్చాడు. ఒక వేళ తను ఏమి చేస్తున్నాడో తెలుసుకోవటానికి సూక్ష్మముగా అతి రహస్యముగా తన సూక్ష్మ శరీరముతో వచ్చాడా? ఛ! ఛ! పరమహంస కి అంత నీచ బుద్ధి లేదు. ఏదైన ఉంటె మోహన అడిగి వేసే మనస్సు, బుద్ధి ఉన్నవాడు. ఇలా చవట పనులు చెయ్యడు. చేస్తే తను చెయ్యాలి కాని ఆయన చెయ్యడు అని కర్కోటకుడు అనుకుంటూండగా....
సూక్ష్మ శరీరము యొక్క ప్రేగు బంధము నీటిలో నుండి ఉన్నదని అర్ధమయ్యి ఒక క్షణము వీడికి బుర్ర పని చెయ్యలేదు. ఉంటే గాలిలో ఉండాలి. ఎందుకంటే పరమహంస రహస్య గదిలో భూమ్మీద సాధన చేస్తూ తన మనో దృష్టికి కన్పిస్తూ వచ్చాడు. మరి ఈయన సూక్ష్మ శరీర ప్రేగు బంధము నీటిలో ఉంది అంటే....అంటే...కొంపతీసి... తనకి మించిన శక్తితో పరకాయ ప్రవేశ విద్యతో మళ్లీ ఈయన మాయ చెయ్యలేదు కదా. ఎందుకైనా మంచిదని తనకి వచ్చిన జలసిద్ధితో..... పరమహంస సూక్ష్మశరీరము గమనించకుండా నెమ్మదిగా కర్కోటకుడు కాస్త తన భౌతిక శరీరముతో గంగానది అడుగు భాగమున చేరుకొనేసరికి అక్కడ ధ్యాన నిష్ఠలో ఉన్న పరమహంసను చూసి చూడగానే వీడికి ఒక క్షణము మెదడు మొద్దు బారింది. అంటే... అంటే.... ఈయన నిజమైన పరమహంస?
తను ఇన్నాళ్లుగా గదిలో ధ్యానము చేస్తూ కన్పించిన పరమహంస.... నకిలివాడు! మాయగాడు! మోసగాడు! తను ఈ విషయము గ్రహించక వాడి రక్తముతో 'ఛోడ్' తంత్ర ప్రయోగము చెయ్యడము అగ్ని భేతాళుడు వీడిని చంపడానికి నిరాకరించాడు. అసలు చంపవలసింది ఈయనని! అనుకొని..... ఎలాగో ఇక్కడికి వచ్చాము గదా.... ధ్యానములో ఉన్నాడు. భౌతికశరీరము సమాధిలో ఉంది. సూక్ష్మ శరీరము బయట ఉంది. ఇంతకు మించి అవకాశము మరొకటి దొరకదని తనకి రాదని... తనకు వచ్చిన ఖడ్గ సిద్ధి ఒక మహత్తరమైన ఖడ్గమును సృష్టించుకొని ధ్యానములో ఉన్న పరమహంసను చంపడానికి కర్కోటకుడు శరవేగముగా బయలుదేరాడు. ఆయనను సమీపించిన
మరుక్షణమే.....
1000 కోట్ల శక్తి ఏదో తనకి ఒక్కసారిగా నేల మీదకి విసిరివేసింది. అసలు ఏమి జరిగిందో తెలుసుకొనే లోపులే కర్కోటకుడు ఆకాశము నుండి నేల మీద పడ్డాడు. పడ్డ అంత పెద్ద శబ్దానికి పరమహంస సూక్ష్మ శరీరము శంకించి శరవేగముగా నీటి అడుగు భాగమునకు చేరుకొని భౌతిక శరీరములోనికి ప్రవేశించింది.
పరమహంసకి స్వయంగా శ్రీ దత్తస్వామి రక్షణ కవచముగా అష్టదిగ్బంధన వేశాడని కర్కోటకుడికి తెలియదు గదా. లోకానికి తంత్ర విద్యలు పరిచయము చేసిన వాడి మీదకే తంత్ర ప్రయోగాలు చేస్తే ఏమి లాభము. దత్తుడి రక్షణ కవచమునే దాటాలని అనుకోవడము అవివేకమే గదా. నేలమీద పడ్డ కర్కోటకుడు కళ్లు తెరిచి అసలు తనకి ఏమి జరిగిందో తెలుసుకొనే ప్రయత్నము చేశాడు. ధ్యాన నిష్ఠలోనికి వెళ్లాడు. గాజు బాక్స్ లో ధ్యాన నిష్ఠలో ఒక పరమహంస అలాగే జల సిద్ధితో గంగానదిలో ఒక పరమహంస ఉన్నట్లుగా అగుపించింది. మరి ఈ రెండు దృశ్యాలు ఎందుకు మొదటిలో తనకి అగుపించలేదు. ఇపుడు ఎందుకు కనబడినాయి. కేవలము ఇపుడిదాకా గాజు బాక్స్ లో ఉన్న నకిలి పరమహంస చూపించిన తన మనోదృష్టి ఇపుడు జలసిద్ధితో ఉన్న పరమహంసను ఎందుకు చూపిస్తోందో అర్ధము కాలేదు. అంటే ఇన్నాళ్లుగా ఈయన అష్ట దిగ్బంధనలో ఉన్నాడు. ఎప్పుడైతే తన కత్తి వెళ్లిందో అష్టదిగ్బంధనానికి చిన్నపాటి గాడి అయ్యుండాలి ఒక అక్షర బంధనము తొలిగి ఉండాలి. అనుకొని
ఈసారి మళ్లీ ధ్యాననిష్ఠలోనికి వెళ్లి చూడగా.... జలసిద్ధిలో ఉన్న పరమహంస చుట్టుయున్న అష్టదిగ్బంధన కాంతి వలయము కన్పించింది. కాని ఒక మూల చివర్లలో కొద్దిగా కొంత తగ్గినట్టు వీడి మనోదృష్టికి వచ్చింది. అది గూడ చాలా చిన్నపాటి ద్వారముగా ఏర్పడింది. అంటే ఈయనను ఎలాగో చంపలేము కాని ఈ ద్వారము ద్వారా ఈయన రక్తమును స్వీకరించే అవకాశమున్నదని గ్రహించి క్యాట్ ఫిష్ గా మారి ఈ బంధ విముక్తి అయిన చోటు నుండి లోపలికి వెళ్లి పరమహంస భౌతిక శరీరము నుండి రక్తమును సేకరించి.... ఈ ఫిష్ కాస్త కర్కోటకుడిగా మారిపోయాడు. దానితో నిజ పరమహంస రక్తము వీడి చేతికి చేరడముతో... మళ్లీ రెండవసారి 'ఛోడ్' తంత్ర ప్రయోగము చెయ్యడానికి బయలుదేరాడు. కాశీ క్షేత్రమునకు దూరముగా 50 KM దూరములో ఉన్న స్మశానము వైపు వీడి నడక ఆరంభమైంది.
No comments:
Post a Comment