తాపీగా విశ్రాంతి స్థితిలో ఉన్న కాలాముఖుడితో....
దేవి వెంటనే.......
స్వామి! ఇప్పుడు మనము చూసిన గ్రహాంతర వాసుల దృశ్యాలు నిజమేనా? లేక మా గురూజీ ధ్యానానుభవాలా? అని అడిగింది.
అమ్మాయి! ధ్యాన అనుభవము అంటే మనస్సు అనుకున్న చోటుకి వెళ్లి అక్కడున్న దృశ్యాలను మనో దృష్టికి చూపించడము లాంటిది. ఆయన మనస్సుకి అంతటి శక్తి ఉన్నది కాబట్టి ఉన్న చోటు నుండి కదలకుండా తన మనస్సును అనుకున్న చోటుకి పంపించారు. అందుకే ఆయన ఇంద్రియ జితేంద్రుడు అయ్యాడు. ఎవరైతే తమ మనస్సును ఆధీనము చేసుకుంటారో వారికి అసాధ్యమనేది ఉండదు. సాధ్యము కానిది ఉండదు. గాకపోతే ఇలాంటి వాళ్లు ఇలాంటి ప్రయోగాలు చెయ్యడానికి ఇష్టము చూపించరు. ఇదంతా మనస్సు మాయలుగా పట్టించుకోరు. గాకపోతే మీ గురువు అలాంటివాడు గాడు. సందేహము వస్తే సమాధానము అందేదాకా మనస్సుకి విశ్రాంతి ఇవ్వడు.శరీరమును పట్టించుకోరు. ఇలాంటివారు యుగానికి ఒక్కరు ఉంటారు.ఇకపోతే ఆయన చూపించిన ధ్యాన దృశ్యాలు నీ పరికరము ద్వారా అంతరిక్షములో ఏ ప్రాంతాలను చూపించాయి అనగానే....
దేవి తప్పు చేసినట్లుగా తలవంచుకోగానే....
అమ్మాయి! మీ గురూజీ అనుభవాలు అనుమానించలేదు. గాకపోతే అవి ఏ గ్రహ ప్రాంతాలు చూపిస్తున్నాయో ఉత్సుకతతో తెలుసుకున్నావు. అది తప్పు కాదు. ఎందుకంటే జనాలకి శాస్త్రీయ ఆధారాలు కావాలి గదా అనగానే......
దేవి ముఖము 1000 వోల్ట్ బల్బ్ లాగా వెలిగి.....
స్వామి! నిజముగానే బుధ, శని, గురు గ్రహ పరిసరాల ప్రాంతాలలో వీళ్లు ఉన్నట్లుగా అంతరిక్షములో కన్పించింది. అది గూడ శనిగ్రహానికి ఉన్న 82 ఉపగ్రహాలలో ఒకటైన ఎన్ సెలాడ్ ఉపగ్రహము నందు శని గ్రహ గ్రహాంతరవాసులు ఉన్నట్లుగా నా పరికరము చూపింది.విచిత్రము ఏమిటంటే ఈ ఉపగ్రహ ఉపరితలము మీద 30 km మందమైన మంచు పొరతో నిండి ఉంది. మంచినీళ్లు గూడ ఉన్నట్లు గా కనిపించింది. అలాగే బుధ, గురు గ్రహ పరిసరాలలో నివసించే గ్రహాంతర వాసులున్నచోటు గూడ మంచు దిబ్బలు, మంచినీళ్లు అపారముగా ఉన్నట్లుగా కన్పించింది.అంటే ఈ మూడు గ్రహాంతరవాసులకి జలమే ప్రాణమని తెలుస్తోంది. మంచు దిబ్బలే ఆధారమని గమనించాను ఎందుకంటే గురు గ్రహము చుట్టూ తిరిగే ఐరోపా ఉపగ్రహము మీద మంచు, నీళ్లు ఉన్నట్లు గా కనిపించింది. విచిత్రము ఏమిటంటే ఇవే విషయాలు మన శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల ద్వారా తెలుసుకొని నిరూపించారు గూడ
అనగానే......
హార్వే వెంటనే.....
స్వామి! వీళ్లంతా గూడ ఎందుకు అంతరించే స్థితిలో ఉన్నారు. ఎందుకు మన రేడియో తరంగాలకి సిగ్నల్స్ పంపించడము లేదు అనగానే.......
పిచ్చి నాయనా! నీ పిల్లలకి రేడియో గూర్చి చెప్పితే వాళ్లకి అర్థమవుతుందా ? అర్థము కాదు గదా. అలా ఈ గ్రహాంతర వాసులు ఎప్పుడో మర్చిపోయిన ఆది కాలపు రేడియో తరంగాలు ఇప్పుడు మన వాళ్లు వాళ్ల కోసము పంపిస్తే వాళ్లకి అందిన ఈనాటి క్రొత్త తర గ్రహాంతర వాసులకి అర్థము కాకపోవచ్చును.ఒకవేళ అర్థమైన వాళ్లు పంపించే సంకేతాలు అందుకొనే అత్యాధునిక పరికరాలు మన భూలోక శాస్త్రవేత్తలు దగ్గర ఉండి ఉండకపోవచ్చును. ఖచ్చితంగా గ్రహాంతరవాసులున్నారు. గాకపోతే వాళ్లు మనము ఉన్న టెక్నాలజీకి 1000 రేట్లు అధిక స్థాయిలో ఉండి ఉండాలి. అత్యాధునిక టెక్నాలజీయే వాళ్ల ప్రాణాలను తీస్తూ ఉండవచ్చును. ఎందుకంటే అధిక రేడియేషన్ వలన భూమి మీద ఉన్న ఓజోన్ పోర దెబ్బ తింటుందనే విషయము అందరికి తెలుసు గదా. అలా ఈ గ్రహాంతర వాసులు ఉపయోగించిన టెక్నాలజీ వలన ఆ గ్రహ లోకాలలో రక్షణ వాతావరణము దెబ్బతిని ఉంటుంది. పంచభూతాలు అయిన నీరు, అగ్ని, వాయువు, నేల, ఆకాశ పొరలు అంతరించిపోయే స్థితికి వచ్చి ఉంటాయి. అక్కడున్న వారికి ఇవి తగినంత స్థాయిలో లభించకపోయేసరికి ఇవి ఉన్న ఇతర గ్రహాలపై తమ దృష్టిని సారింస్తున్నారు. ఇలా మన భూమ్మీద కనిపించిన ఫ్లయింగ్ సాసర్ అన్ని గూడ నది పరిసరాల లేదా సముద్ర పరిసర ప్రాంతాలే గావడము విశేషము. అంటే వీళ్లు తమకు గావాలసిన మన నీటిని కాస్త నీటియఆవిరి రూపములో తమ వాహనాలలో తీసుకొని వెళ్లుతున్న విషయము మనము గమనించటము లేదేమో. ఎవరికి ఎరుక ఏ పుట్టలో ఏ పాముందో. ఎవరి బుర్రలో ఏ ఆలోచన ఉందో ఎవరికీ తెలియదు గదా.
అంటే రాబోవు కాలంలో అనగా 2040 నుండి 2060 లోపల పంచభూతాల కోసము గ్రహ యుద్ధాలు తప్పవు అన్నమాట. భూమ్మీద ఇప్పుడే నీళ్లు పోయి వాటర్ ట్యాంకులు వచ్చాయి.ఆక్సిజన్ లెవెల్ తగ్గించే రోగాలు రావడంతో పీల్చే గాలి పోయి ఆక్సిజన్ ట్యాంకులు వచ్చాయి. కట్టెల మంటలు పోయే గ్యాస్ మంటలు వచ్చాయి. రాను రాను భూమ్మీద మనిషి కూడా ప్రకృతి వనరుల కి దూరమై టెక్నాలజీ పేరుతో యంత్ర వనరులు మీద ఆధార పడుతున్నాడు. అక్కడేమో గ్రహాంతర వాసులు తాము తెలుసుకున్న టెక్నాలజీ వల్ల వలన అంతరించిపోతున్న ప్రకృతి వనరులు అంతరించిపోతున్నాయని పరిస్థితి చేయి దాటి పోయాయి అంటే మనము రాబోవుకాలములో మనము అంతరించిపోయే స్థితికి తీసుకొని వెళ్లే అత్యాధునిక టెక్నాలజీ వాళ్ళ ప్రపంచంలో అడుగుపెడితే స్థితి నుండి వాళ్ల ప్రపంచములో అడుగుపెడితే....వాళ్లేమో అంతరించే స్థితి నుండి వాళ్లు భూమ్మీద అవతరించడానికి గ్రహాంతరవాసులుగా వస్తారని అనుకుంటూ. అపుడికే భూమ్మీద ఇతర గ్రహాల మీద పంచభూతాల ప్రభావము సమూలముగా అంతరించిపోవడము మన చావే మనము తెచ్చుకొనే స్థితికి విశ్వములో అన్ని గ్రహవాసుల, జీవకోటి, దైవ కోటికి తెచ్చుకుంటారు. ఎవరు ఎందుకు ఛస్తున్నారో అర్థము అయ్యే లోపల ప్రాణాలు వదులుతారు. గ్రహాలు వదిలిపెడతారు. దైవ లోకాలు వదిలి పెడతారు. ఎవరు లేని ఏమీ లేని కనిపించే అంతరిక్షము అంతరించక తప్పదు గదా. ఎందుకంటే రక్షించే పంచభూతాలు కాస్త మానవుడి అతి తెలివితేటల వలన అత్యాధునిక టెక్నాలజీ వలన అవి కాస్త భక్షించే స్థితికి వస్తాయని నాకు తెలుస్తోంది. రక్షించేవాడే భక్షిస్తే ఇక రక్షణ ఏమి ఉంటుంది. ఎన్ని గ్రహాంతరయానాలు చేసిన పంచభూతాలతో నిర్మితమైన మన దేహాలు అనే ప్రకృతిలో లేకపోతే ఎలా నిలుస్తాయి. నిలవలేవు గదా. ఎవరికి వారే సాధన చేసి జ్ఞానము తెలుసుకొనే లోపుల ఎవరికి వాళ్లు తమకి తెలియకుండా మరణాల పేరుతో మోక్షమును పొందుతారు.అన్నమాట. బంధు జీవులు కాస్త విముక్తి పొంది అవిముక్త జీవులు అవుతారు. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, కాలము, కాంతి, శబ్దము అనే అష్టాంగాలతో భౌతిక పదార్థముగా ఏర్పడిన విశ్వమంతా ఇవి అంతరించి పోవడముతో.... శాశ్వత విశ్రాంతి తీసుకోక తప్పదు. ఇది గూడ అంతరించి శూన్యమవ్వక తప్పదు. అంటూ..... తిరిగి ధ్యాన నిష్ఠలోనికి కాలాముఖాచార్యుడు వెళ్లిపోవడముతో ఎవరి కర్మను వాళ్లే అనుభవించక తప్పదు గదా అనుకుంటూ ఈ ముగ్గురు గూడ హార్వే పరికరము నందు రికార్డు అవుతున్న పరమహంస ధ్యాన దృశ్యాలను సాక్షిభూతముగా చూస్తున్నారు.
ఇంతలో......
పరమహంసకి విశుద్ధ చక్రము గూడ విభేదనము చెందడముతో బుధ గ్రహాలు, జనలోకాలు అంతరించిపోయాయి. అలాగే బుధ గ్రహాంతర వాసులు గూడ సంపూర్తిగా అంతరించి పోయారు. దానితో.... ఈయన కుండలినీ శక్తి ప్రభావము భ్రూమధ్య ప్రాంతములో ఉన్న ఆజ్ఞ చక్రము వైపు ప్రవహించసాగింది.
ఈ దృశ్యాలు చూస్తూ హార్వే వెంటనే తన ప్రక్కనే ఉన్న జోషి......
మిత్రమా! నాకు ఒక డౌట్. భూమి మీద ఉన్న ఎతైన పర్వతాలు ఎక్కేటప్పుడు అక్కడ తగినంతగా ఆక్సిజన్ ఉండదు గదా. మరి అంతరిక్షములో నివసించే గ్రహాంతరవాసులకి ఆక్సిజన్ ఉండదు గదా? మరి వాళ్లు ఇది లేకుండా ఎలా జీవిస్తున్నారు?
డాక్టర్ జోషి వెంటనే......
హార్వే! ఆక్సిజన్ లేకుండా మనుగడ సాగించ వచ్చునని ఈ మధ్యనే మన శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇజ్రాయిల్ శాస్త్రవేత్త అయిన డయానా యాహాలోమి యొక్క పరిశోధనలో జెల్లీ ఫిష్ లాంటి పరాన్న జీవికి మైటోకాండ్రియల్ జన్యువు లేదని..... అందువలన ఇది ఊపిరి తీసుకోవడము లేదని..... తద్వారా ఆక్సిజన్ అవసరము లేకుండానే పూర్తిగా తన జీవితాన్ని గడుపుతూ ఉండటము గమనించి నిర్ధారణ చేసుకొని లోకానికి చెప్పడము జరిగింది. అంటే ఈ లెక్కన గ్రహాంతరవాసులకి మనకి లాగా ఆక్సిజన్ అవసరమే లేదు. కాని వాళ్లకి జలమే ప్రాణాధారము. అది లేకపోతే వాళ్లు ఉండలేరు. ఆక్సిజన్ లేకపోతే ఉండలేము. అందుకే వాళ్లు జల ప్రాంతాలున్న గ్రహాల సమీపాలలో ఆవాసాలుగా చేసుకోవడము జరిగింది. అనగానే.......
దేవి అందుకొని
అంటే మనము ఆక్సిజన్ యుతమైన మూలాధార చక్ర జీవులు అయితే గ్రహాంతరవాసులు అనేవి వాళ్లు జల యుతమైన స్వాధిష్టాన చక్ర జీవులు అన్నమాట. అనగానే.....
మిగిలిన వాళ్లకి నవ్వు ఆగలేదు.
No comments:
Post a Comment