అధ్యాయము 41

 పరమహంస తదేకదీక్షతో.... ...... ......

ఆకాశముద్ర తో సాధన  చేస్తుండగా ....

ఈయన చెవులకి వినసొంపుగా సంగీతము, ఘంట శబ్దాలు, గజ్జెల సవ్వడులు, అడుగులు వేస్తున్న శబ్దాలు వినబడుతూండేసరికి ఈ చక్రమునకు 'శబ్ద' గుణముండుట వలన ఈ చక్ర జాగృతి అయినదని ఈయన గ్రహించాడు. కొన్ని క్షణాల తర్వాత ఉన్నట్టుండి మేఘగర్జనలు,పిడుగు పడిన శబ్దాలు వినిపించేసరికి ఈ చక్రశుద్ధి ప్రారంభమైనదని గ్రహించి ఈ మేఘగర్జన నాదమును మరింత శ్రద్ధగా వినడము  ఆరంభించాడు. అపుడు కొన్ని నిమిషాల తర్వాత తన కంఠము నందు నీలము రంగులో చుక్కలు చుక్కల రూపముగా 16 రేకుల మధ్యలో 'హాం'అనే బీజాక్షరముగా చక్ర పద్మము కనిపించింది. ఈ చక్ర ఆధీన సమయము ఆరంభమైనదని అనుకునే లోపల ఈ చక్ర మాయ దేవతగా నీలి సరస్వతి దేవి సాక్షాత్కారమై...... క్షణాలలో అదృశ్యమైంది. తనకి ఈ  చక్ర మాయయైన జ్ఞాన మాయ ఆరంభమైనదని గ్రహించాడు. ఈ దృశ్యమును చూసిన కాలాముఖుడికి ఒక్క క్షణముపాటు మెదడు పని చెయ్యలేదు. ఎందుకంటే ఈ దేవి అన్ని రకాల జ్ఞానాలకు అధిదేవత. వామాచార,దక్షిణాచార, సమయాచార వేదాల జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, ఆత్మజ్ఞానము, విజ్ఞానము ఏది గావాలన్నా క్షణాలలో సాధకుడికి అమితమైన ఊహాశక్తి రూపములో అందిస్తుంది. గాకపోతే ఈమె ఓ పట్టాన ఎవరికి అంత తేలికగా వశము కాదు. వశము అయితే వాడికి జ్ఞాన ప్రవాహానికి తిరుగే ఉండదు. అసాధ్యమైన విషయాలు,అతి క్లిష్టమైన సమస్యలు, గుప్త జ్ఞాన రహస్యాలు ఇలా ఎన్నో క్షణాలలో సమాధానాలు స్ఫురణకి వస్తాయి. అంతెందుకు వశిష్ఠ మహర్షియే ఈమె అనుగ్రహమును పొందలేకపోయాడు. వేదవ్యాసుడు ఈమె అనుగ్రహము పొందిన జ్ఞానముతో వేదాల విభజన, పురాణాలు, ఇతిహాస గ్రంధాలు రచించడము జరిగింది. అలాంటి దేవి ఈ పరమహంసకి దర్శనమైన ఈయన స్పందించక పోవడము ఆశ్చర్యముగా ఉంది. తను  ఈయన స్థానములో ఉండి ఉంటే ఆమె పాదాల మీద పడి జ్ఞాన ప్రసాదము పెట్టమని కోరుకొనేవాడు. అందుకని ఇంతటి నిగ్రహశక్తి ఆయనకి ఉండుట ఆయన అక్కడ ఉన్నాడు.తను ఇక్కడ ఉన్నానని అనుకొని జరగబోయే ధ్యాన దృశ్యాల మీద దృష్టి పెట్టడము ప్రారంభించాడు.

        పరమహంస కళ్ల ముందు వేదాల కొండంత రాశులుగా కనిపించాయి. వీటిలోనినాలుగు పిడికెల భాగమే వేదవ్యాసుడు గ్రహించి మనకి నాలుగు వేదాలుగా చెప్పడము జరిగింది. అంటే ఇపుడు వేద జ్ఞాన రాశికి తను స్పందిస్తే క్షణాలలో సంపూర్ణ వేద జ్ఞానము తనకి అందుతుందని అనుభూతి ద్వారా తెలిసిన ఈయన పెద్దగా స్పందించలేదు. పట్టించుకోలేదు. ఎంతటి వేదాంత జ్ఞానియైన చివరికి మౌనఃబ్రహ్మగా మారక తప్పదు గదా.  అలాంటప్పుడు ఈ జ్ఞానము పొంది ఏమి చెయ్యాలి. ఒకవేళ తను ఈ జ్ఞానము పొందిన తనకి తప్ప వేరే వారికి ఈ జ్ఞాన సంపద అర్థము గాదు. ఎందుకంటే తన జ్ఞాన స్థాయి అలాగే అందుకొనే వాళ్ల జ్ఞాన స్థాయిలలో తేడాలుంటాయి.అందుకొనే వాళ్లు తన జ్ఞాన స్థాయికి వస్తే కాని ఈ జ్ఞాన సంపద అర్థము గాదు. ఇలా గాకుండా అందరికీ అర్థమయ్యే జ్ఞాన సంపదను తన అనుభవ జ్ఞానముగా అందరికీ అందిస్తే..... అదే పంచ వేదముగా  "అంతర్వేదం" అవుతుంది గదా. తన ధ్యాన అనుభవాలు శాస్త్రీయముగా నిరూపించబడుతున్న ఆత్మ జ్ఞానమే అంతర్వేదము అవుతున్నప్పుడు ఇంకా తనకి వేదాలతో ఏమి పని ఉంటుంది. వేదాలు కేవలము శబ్ద పాండిత్య జ్ఞానమునే ఇస్తాయి. తన అంతర్వేదము అనేది అనుభవ పాండిత్య జ్ఞానమును ఇస్తుంది. శబ్ద పాండిత్యము కన్నా అనుభవ పాండిత్యము మిన్న గదా. తన అంతర జ్ఞానమే....అంతర్వేదముగా  మారుతున్న ఇంక ఇతర జ్ఞానలతో అవసరము లేదని స్పందించలేదు.


ఆ తర్వాత

ఈ చక్ర అధిదైవము సదాశివుడు అలాగే ఈ చక్ర శక్తి దేవతగా 'శాకిని' ప్రత్యక్షమైన వీరిని ఎలాంటి వరాలు కొరకపోయేసరికి వీళ్లు అదృశ్యమయ్యారు. కొన్ని నిమిషాల తర్వాత తనకి ఆకాశము మీద ఆధిపత్యము వచ్చినట్లుగా అనుభవమైంది. ఎందుకంటే మెరుపు కాంతితో తన తలమీద పిడుగు పడినగూడ తనకి ఏమీ గాకపోవడము ఈయన మనో దృష్టికి వచ్చింది. ఇదంతా తను మనోజప సిద్ధి లభించడముతో ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ల దూరములో ఉన్న ఆకాశములో ఏమి జరుగుతుందో తన మనస్సు ప్రయాణించడము వలన ఈ సిద్ది వలన తెలిసినదని గ్రహించిన పెద్దగా స్పందించలేదు. సిద్ధులు, శక్తులు తనకి రాకపోయినా ఫర్వాలేదు కాని అశక్తులు రాకుండా చూసుకోవాలని...... ఎందుకంటే ఎప్పుడైతే యోగ చక్రాలు బలహీనబడితే అశక్తులు వస్తాయని తద్వారా రుచి, వాసన, చూపు, స్పర్శ, చెవుడు వస్తాయని.... అనగా పంచజ్ఞానేంద్రియాలు దెబ్బతినడము ఆరంభమవుతుందని..... ఆ తర్వాత మెదడు,గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, లివర్, మర్మాంగము ఇలా శరీరములోని అతి ముఖ్యమైన అంతర శరీరాంగాలు దెబ్బతింటే భౌతిక శరీరము సాధనకి పనికిరాకుండా బ్రతికున్న శవములాగా మారుతుంది. అందుకే సాధకులు గూడ అశక్తుల విషయములో బహు జాగ్రత్తగా ఉండాలని పరమహంస అనుకున్నాడు.


ఆ తర్వాత

ఈ చక్రము పర్యవేక్షించే బుధ గ్రహ వాసులు అలాగే ఈ చక్ర దేవలోక మైన జనలోకవాసులు కన్పించిన గూడ  ఈయన పట్టించుకోలేదు. అంతరిక్షములో 17వేల బుధ గ్రహాలు, 16వేల జనలోకాలు ఉన్నట్లుగా అనుభవము  పొందిన గూడ స్పందించలేదు. ఆ తర్వాత భూలోకము నందు ఈ చక్ర క్షేత్రమైన ఉజ్జయిని క్షేత్ర దర్శనమైంది.


ఉన్నట్టుండి......

పరమహంస మనో దృష్టి ముందుకి

గోళాకారముగా ఉండి గాజుతో నిర్మితమై ఉన్న ఫ్లయింగ్ సాసర్ ఈయన వైపు శర వేగముగా వచ్చే దృశ్యాలు హార్వే పరికరములో కనబడుతూంటే ఈ దృశ్యాలను చూస్తున్నా హార్వే.... ఆనందము ఆపుకోలేక....

అంటే.... అంటే... నిజముగానే గ్రహాంతరవాసులు అదే ఏలియన్స్ ఉన్నారా? వాళ్లే ఈయన దగ్గరికి వస్తున్నారా? అనే ఉత్సుకత విపరీతముగా మొదలైంది. ఇదే స్థితి జోషిలోను, దేవిలోను కనిపించింది. ఇన్నాళ్లుగా వీళ్లు ఉన్నారో లేరో తెలియక భూగోళ లోకవాసులు అవస్థలు పడుతున్నారు. తమలాంటి స్థూలశరీరాలతో ఉన్న మరో గ్రహ లోక  జీవులున్నారని..... వాళ్లు ఇలా తమ ముందుకి  వస్తారని ఎవరూ ఊహించలేదు, అనుకోలేదు.


No comments:

Post a Comment