కాశీ క్షేత్రానికి .... .....
కర్కోటకుడు, చారుకేశ చేరుకున్నారు. గంగాస్నానము చేశారు.అఘ◌ోరులు పూజించే అఘ◌ోరుల సాంప్రదాయ ఆది గురువైన కాలారామ్ సమాధి దర్శించుకున్నారు. అఘ◌ోరులు సంచరించే ఘాట్ లకి వెళ్లి పరమహంస అనే వ్యక్తి కోసము వివరాలు అడగడము మొదలు పెట్టారు.
ఎవరు గూడ తమకి తెలియదని, కొంతమందికి తెలిసినా గూడ చెప్పకపోవడము జరిగింది. అయిన గూడ వీళ్లు నిరుత్సాహము పడలేదు. ఖచ్చితంగా తనకి గావాలసిన వ్యక్తి ఈ క్షేత్రములోనే ఉన్నాడని కర్కోటకుడికి బలంగా అన్పించసాగింది. కాని ఎక్కడ, ఎలా ఉంటాడో తను ఇప్పుడు తెలుసుకోవాలని అనుకొని.... ఈ క్షేత్రములో దాదాపుగా అందరిని అడిగిన ఎలాంటి ప్రయోజనము కన్పించలేదు. భక్తులని, ప్రజలను, అఘ◌ోరులను విచారించిన ఎలాంటి ఫలితము లేదు.
గురూజీ! ఇప్పుడు ఏమి చేద్దాం? మనకి గావాలసిన వ్యక్తిని ఎలా పట్టుకునేది?
అనగానే.....
శిష్య! కంగారుపడకు! మనస్సుంటే మార్గము ఉండక పోదు.చచ్చినట్లుగా వాడు ఎక్కడ ఉన్నా మనకి తెలుస్తుంది. ఇప్పటిదాకా వాడు ఎక్కడ ఉన్నాడో తెలియలేదు. ఇప్పుడు ఈ క్షేత్రములోనే ఉన్నాడని తెలిసిందిగదా. కాని ఎక్కడ ఉన్నాడో తెలియాలి. దీనికి కాలమే సమాధానము చెపుతుంది. నారు పోసిన కాలము నీరు పొయ్యదా! మార్గము చూపించదా అనగానే......
గురూజీ! మనకి అంత సమయము లేదు. కేవలము 64 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ లోపల ఆయనను పట్టుకొని అమ్మకి బలి ఇవ్వకపోతే ఇలాంటి స్థితి యోగము మీకు రావాలంటే 2060 సంవత్సరాల దాకా ఎదురుచూడక తప్పదు. 108 కోట్ల జన్మలు ఎత్తాలి. ఇదంతా అవసరమా? కాలమునకు వదిలేస్తే ఉన్నది పోతుంది.ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని ఆయన ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకొని బంధించి తీసుకొని వెళ్లి బలి ఇవ్వాలి గదా. మనకి సమయము చాలా తక్కువ అని తెలుసుకోండి అంటూండగా.....
శిష్య! నువ్వు చెప్పింది అక్షర సత్యమే. ఈయనను వెతికే ఆలోచనలో మనకి అమ్మ ఇచ్చిన గడువు గుర్తుకి రాలేదు. మంచి సమయానికి గడువు గుర్తు చేశావు. ఇంకేముంది! వాళ్లని వీళ్లని అడగడము కన్నా నాకున్న 18 సిద్దులలో మనో జపసిద్ధి ఉపయోగించి ఆయన ఉండే చోటుకి వెళ్లదాం అనగానే.......
గురూజీ! మనోజప సిద్ధి అంటే?
శిష్య! ఏమిలేదురా! ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్ లలో ఉండే GPS లాగా మన మనస్సు పని చేస్తుంది. మనకి గావాలసిన వ్యక్తి గూర్చి సంకల్పము చేస్తే ఆయన ఉన్న చోటుకి ఖచ్చితంగా GPS లాగా మన మనస్సు తీసుకొని వెళ్లుతుంది. గాకపోతే మనస్సు మీద నమ్మకముంచాలి. అది చూపించిన మార్గాలలో ఎలాంటి అనుమానభయము లేకుండా వెళ్ల గల్గితే ఈ సిద్ధి వలన మనము అనుకున్న చోటుకి ఖచ్చితంగా వెళ్లగల్గుతాము. అంటూ.....
కర్కోటకుడు తన మనస్సులో పరమహంసను ఎలాగైనా చూపించు అని ముమ్మార్లు సంకల్పించుకోగానే....
వాడి కుండలీని శక్తి జాగృతి అయ్యి......
వాడికి మనస్సు ఫలానా మార్గము వైపు వెళ్లాలని సూచన ఇవ్వడముతో వీరిద్దరు అటువైపు వెళ్లారు.
ఇలా వీరంతా కాశీక్షేత్రములో ఉన్న 64 ఘాట్ లు దాటుకుంటూ ఈ క్షేత్రానికి చివర ఉన్న కపాల మోక్ష మిచ్చే కపాల తీర్ధమున్న చెరువుండే ప్రాంతానికి చేరుకున్నారు.
అక్కడ ఉన్న 12 అడుగుల నల్లటి కాపాలమోక్ష భైరవుడి విగ్రహమూర్తిని చూడగానే....
కర్కోటకుడిలో ఏదో తెలియని భయము మొదలైంది. ఈయన వలనే తన అంజన ప్రశ్నలో
పరమహంస కన్పించలేదని అర్ధమై.....అక్కడ నుండి మౌనముగా వెళ్లిపోతూ....
మనస్సు చూపిన సందులోనికి వెళ్లాడు.
ఈ సందులు గోండులు తిరుగుతూ....
చివరికి.....
దట్టమైన అడవి ప్రాంతము దగ్గరికి వీళ్లు చేరుకున్నారు.
అక్కడ ఉన్న ఆటవిక జాతి మనుష్యులు వీళ్లను చూసి.... వీళ్ల దగ్గరికి వచ్చి....
అసలు విషయము తెలుసుకొని......
అక్కడికి 2 కి.మీ దూరములో ఉంటే పరమహంస ఆశ్రమమైన పెంకుటిల్లు వీళ్లు అమాయకముగా చూపించడముతో వీరిద్దరికి అమితమైన ఆనందమేసింది. ఈ జాతి వాళ్లు పెట్టిన మాంసమును తృప్తిగా ఆరగించి అర్ధరాత్రి సమయములో వీరిద్దరు కలిసి కాలినడకగా ఈ ఆశ్రమము వైపు బయలుదేరారు.
No comments:
Post a Comment