ఆ తర్వాత ....
16 సంవత్సరాల వయస్సు ఉండి నగ్న యువతి నది స్నానానికి తన చెలికతైలతో రావడము జరిగే దృశ్యము పరమహంస మనోదృష్టికి వచ్చింది. ఈ నగ్న యువతి నదిలోనికి దిగి స్నానము చేస్తుండగా ఈమెకి ఉన్నట్టుండి విపరీతముగా లైంగిక వాంఛ మొదలైంది. తట్టుకోలేకపోతోంది. అపుడు నది ఓడ్డున ఈమెకి మానవ స్త్రీ, పురుషుడు రూపములో రతి, మన్మధుడు కాస్త శృంగారము చేస్తున్న దృశ్యము కనబడింది. దానితో ఈమెకి మరింత ఎక్కువగా లైంగిక వాంఛ మొదలైంది. ఇంతలో తనతో వచ్చిన చెలికతైలు ఆకలిగా ఉన్నదని, తినడానికి ఏమైన ఇవ్వమని ఈమెను అడగడముతో.... నేల మీదకి ఈ యువతి వచ్చి చుట్టు ప్రక్కల చూసిన తినడానికి ఏమి కనిపించకపోతే తన చెలికతైల ఆకలి కోసము తన తల నరుక్కొని ఆ వచ్చిన రక్తధారలను మూడు భాగాలుగా చేసి రెండు భాగాలు ఇద్దరి చెలి కతైలకి ఇక మిగిలిన మూడవ భాగము తనే ఆహారము తీసుకొనే దృశ్యము అందరికి కన్పించింది. ఈ దృశ్యమును చూడలేక మిగిలిన వాళ్లు కొన్ని క్షణాల పాటు కళ్లు మూసుకొని ఉంటే పరమహంస మాత్రము నిగ్రహముగా సాక్షీభూతముగా ఈ దృశ్యమును చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే....
ఈమె ఎవరో గాదని.... సాక్షాత్తు చిన్నమస్తాదేవి యని ఈమె చెలి కతైలు, జయ, విజయని ఈయనకి తెలుసు. ఎలా అంటే "నారద పంచరాత్ర" పురాణములో ఈమె గూర్చి ఉంది. ఆమె స్నానము చేసే నది మందాకిని నదియని, ఈమె చెలి కతైలు డాకిని, వర్ణిని శక్తి దేవతలని, మానవుడిలో కామశక్తిని నిర్మూలన చెయ్యడమే ఈ చిన్నమస్తాదేవి యొక్క తత్త్వమని, ఎందుకంటే మానవుడిలోని కామమే పునః జన్మ కారకమవుతుందని.... అందుకని కామ గుణమును త్యాగము చేస్తే జన్మ రాహిత్యము కల్గుతుందని.... ఇలా త్యాగానికి ఈ దేవత ప్రతీకయని పైగా ఈమె ఎపుడు రతి, మన్మధుడి మీద స్వీయ విహారము చేస్తూ ఉంటుందని ఈ పురాణము చెప్పిన విషయము నిజమేనని పరమహంస గ్రహించాడు.
ఇంతలో....
ఎవరు ఊహించని విధముగా.....
పరమహంస యొక్క సూక్ష్మ శరీర తలను ఈమె ఖండించింది. దానితో ఈయన సూక్ష్మ శరీరము ప్రక్కకి జరిగిపోగానే.... ఈయన తల భాగము నుండి ఈయన లాంటి మూడు అడుగులున్న కారణ శరీరము బయటికి రావడము అందరు గమనించారు. కాలాముఖుడికి ఈ విషయము చూడగానే అమిత ఆనందమేసింది.
శ్రీ కృష్ణ మహా మాయను మన గురుజీ దాటాడు అని పెద్దగా అరిచి అందరికి చెప్పాడు. చిన్నమస్తాదేవి ఈయనకి మహా నిర్యాణ నియంత్రణ శక్తిని ప్రసాదించింది. దానితో ఈయనకి ఎలాంటి విశ్వమాయలు అనగా జీవమాయాలు, దైవ మాయలు ఈయన మీద పని చెయ్యవు. ప్రభావము చూపవు. సకల త్రికాలజ్ఞానము, త్రిలోకాలలో ఏమి జరిగేది ఈయనకి తెలుస్తోంది. కాలము ఈయన ఆధీనము లోనికి వచ్చింది. అంటే శ్రీ కృష్ణుడిలాగా మన గురూజీ గూడ కాల పురుషుడయ్యారు. అని కాలాముఖుడు చెప్పి ధ్యాన నిష్ఠలోకి వెళ్లగా.....
పరమహంస మనదృష్టి యందు అంకెలు, సంఖ్యలు, అక్షరాలు కన్పించడము మొదలయ్యాయి. మొదట 4 , ఆ తర్వాత 7 ఆ తర్వాత 7 కనిపించింది. అంటే 477 సంఖ్య అనేది విశ్వ అంతరిక్షములో కన్పించింది. దీనిని బట్టి చూస్తే ఈ సహస్ర చక్రములోని 1000 కోణాలలో తనది 477 వ కోణమని ఈయన గ్రహించాడు. ఆ తర్వాత సంస్కృతము, హిందీ, తెలుగు, మళయాళము ఇలా ఎన్నో భాషల అక్షరాలు ఈ విశ్వమంతా ఆవరించి ఉన్నట్లుగా ఈయనకి గోచరమైంది.ఈ దృశ్యాలను చూస్తున్న ఈ ముగ్గురికి ఉన్నట్టుండి " శ్రీ ఆజంనేయం" సినిమాలోని హీరోకి గూడ ఇలాంటి ధ్యానానుభవము అవ్వడము అనగా ఆ హీరో ఆత్మ కూడ ఉర్ధ్వోలోకాలను దాటుతున్నపుడు ఇలాంటి దృశ్యాలు కనిపించడము ఆఖరికి హనుమ నిజరూపదర్శనమవ్వడము దృశ్యాలు వీళ్లకి గుర్తుకి వచ్చి ఆ అనుభవాలు లాగానే వీరి అనుభవాలున్నయని గ్రహించి మౌనముగా జరగబోయే దృశ్యాలను ఆసక్తిగా చూడసాగారు. అంటే మానవునికి, జీవులకి అక్షర జ్ఞానము, భాషారాహిత్యము, బ్రహ్మ జ్ఞానాలు అనేవి ఎక్కడ నుండో వస్తున్నట్లుగా ఈయన గమనించే లోపుల....
అంతరిక్షములో చిన్ముద్ర దర్శనమైంది. ఈ ముద్ర నుండే ఈ సకల సంఖ్యలు, అక్షరాలు వస్తోన్నాయని ఈయనకి అర్ధమైంది. సహజముగా ఈ ముద్రతో మేధా దక్షిణామూర్తి ఉంటారని పరమహంసకి జ్ఞాన స్ఫురణ అందిన వెంటనే.... ఈయన మనస్సు కాస్త తనకి ఉన్న మనోజపసిద్ధితో ఎటో వెళ్లుతున్న టెంపుల్ రన్ ఆట దృశ్యాలుగా శరవేగముగా దృశ్యాలు దాటుతున్న దృశ్యము ఈయన మనో దృష్టికి వచ్చింది. అంటే తన మనస్సు తనకి ఏదో విషయము చూపించాలని ఎటో వెళ్లుతోందని ఈయనకి అర్ధమై సాక్షిభూతముగా అది చూపించే దృశ్యాలను చూస్తు ఉండిపోయారు. అపుడు ...
అరుణాచల క్షేత్ర దర్శనమైంది. అరుణాచల కొండ దర్శనమైంది. ఆ తర్వాత సూక్ష్మ శరీర ధారిగా అక్కడ ఆవాసము చేస్తూ ధ్యాన నిష్ఠలో ఉన్న అరుణాచల రమణ మహర్షి వారు దర్శన మిచ్చారు. ఆ తర్వాత ఈ పర్వతము లోపల వైపుకి తన మనస్సు వెళ్ళడము గమనించారు. ఏదో అంతర్గత గుహ మార్గములాగా అంతటా చీకటిగా కన్పించింది. ఆ తర్వాత చిన్నపాటి వెలుతురు మార్గము దర్శనమైంది. అపుడు ఎరుపు, నలుపు, తెలుపు, కాషాయం, నీలం, పసుపు వర్ణాలున్న సూక్ష్మ శరీరాలు వెళ్తూ వస్తూ కన్పించాయి. వీళ్లని దాటుకుంటూ వెళ్లగా... గుహకి అవతల మరో లోకము ఉన్నట్లుగా గోచరించింది. పచ్చని చెట్లు, ఎతైన చెట్లు, కొండలు, వాగులు, వంకలు, పక్షులు, జంతువులు కన్పించాయి. నిజానికి ఇవి అన్నియు గూడ భౌతిక నేత్రాలకి కన్పించవని.... కేవలము త్రినేత్రానికి దర్శనమిస్తాయని ఈయనకి అర్ధమైంది. ఆ తర్వాత ఒక ఎతైన రాయి కనిపించింది. దీని దగ్గర నలుగురు వృద్ధ మునులు ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నట్లుగా కూర్చొనియున్నారు. ఇంతలో.... ఈ రాయి మీద... అనుకోని విధంగా చిన్ముద్రతో మేధా దక్షిణామూర్తి దర్శనమైంది. అంటే ఈయన సజీవ మూర్తిగా జ్ఞాన మూర్తిగా అరుణాచల క్షేత్ర పర్వతములోని అంతర గుహ యందు ఆవాసము చేస్తున్నారని.... ఈయనే... రమణమహర్షికి 80 సంవత్సరాల వయో వృద్ధ యోగిగా తనకి దర్శన మిచ్చారని ఈయన చెప్పిన విషయము నిజమేనని పరమహంసకి అర్ధమయ్యే లోపల ఈ మహత్తర దృశ్యము కాస్త అదృశ్యమైంది. ఈ దృశ్యమును హార్వే పరికరములో చూస్తున్న హార్వే, జోషి, దేవికి కొన్ని క్షణాలపాటు మనస్సు, మెదడు పని చెయ్యలేదు. కారణము భూమ్మీద సజీవమూర్తిగా దక్షిణామూర్తి దైవమున్నారని సాక్ష్యాధారాలతో నిరూపించేసరికి నోట మాట రాలేదు. ఇంతలో దేవికి తెలివి వచ్చి ఈ పర్వత గుహ ఎక్కడ ఉన్నదని వెతకగా...
పర్వతము పైన ఒక గుండ్రని గీతగీసి ఉన్న చోటు అడుగు భాగములో అంతర్గతముగా ఈ దైవమున్నదని తెలుసుకొని బోరున ఏడ్చింది. ఎందుకంటే తను ఈ పర్వతము ఎక్కే అవకాశము కావాలని వద్దు అనుకుంది. ఈ పర్వతము పైకి ఎక్కితే అక్కడ మేధా దక్షిణామూర్తి పాదముద్రలు ఉంటాయని అక్కడ వాళ్లు తనకి చెప్పితే అది అంత కల్పితము, ఎవరో పాద ముద్రలు పెట్టి ఏకముగా దక్షిణామూర్తి పాదముద్రలని ప్రచారము చేసి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారని శ్రమ దండగ అని కొట్టి పారేసి ఆ పర్వతము ఎక్కకుండా తను జీప్ ఎక్కి వెనక్కి వచ్చినానని ఈమె అక్కడవాళ్లకి చెప్పుతూ ఏడుపు ఆపుకోలేకపోయింది.
ఈ సారి.....
పరమహంస మనోదృష్టి ముందుకి....
శ్రీ చక్ర కోట దర్శనమైంది. నవ ఆవరణాలలో లేత ఆకు పచ్చ రంగుతో నిర్మితమైన కోట దర్శనమైంది. అంటే అంతరిక్షములో దేవి లోకము అనేది శ్రీ చక్ర నిర్మాణములో ఉంటుందని ఈయనకి అర్ధమైంది. అపుడు ఈయన కాస్త నవ నిర్మాణాలను పరిశీలించి చూడగా ఇవి కాస్త నవరత్న రంగులతో నవగ్రహాలకి ప్రతీకగా కనిపించాయి. అనగా వజ్ర,వైడూర్య, గోమేధిక, నీల, ముత్యపు, మరకత పచ్చ, పగడ, కెంపు, పుష్యరాగ ఆవరణాలు దర్శన మిచ్చాయి. ప్రతి ఆవరణ ప్రవేశానికి తొమ్మిది ప్రదక్షిణాలు చెయ్యాల్సి ఉంటుందని అనగా మొత్తము 81 ప్రదక్షిణాలు చేస్తే ఈ తొమ్మిది ఆవరణాలు దాటి ఆఖరిది అయిన 'బిందు' దర్శనమవుతోందని ఈయన గ్రహించారు. అంటే ప్రకృతిమాత స్థానము ఈ బిందులో ఆవాసము చేస్తుందని ఈయన మనస్సుకి అర్ధమయ్యేలోపల అంటే శ్రీ చక్రమే కాలచక్రము అని ఈయనకి అర్ధమైంది. అమ్మవారి దర్శనమైంది. అయ్యవారి దర్శనమైంది. కాని వీళ్ల పుత్రుడైన శ్రీ మహా విష్ణువు దర్శనము ఇంకా తనకి అవ్వదని పరమహంస అనుకొనేలోపులే..
విశ్వ విజ్ఞానము అలాగే బ్రహ్మజ్ఞానము తనలోనికి ప్రవేశిస్తున్న అనుభవ అనుభూతి పరమహంస పొందసాగాడు. దానితో ఈయన శరీరము కాస్త భూలోకము నుండి అంతరిక్షము దాకా విస్తరించడము మొదలైంది. అంటే భూలోకాలు, గ్రహ లోకాలు, దైవలోకాలు, శ్రీచక్రము, మేధా దక్షిణామూర్తియున్న మర్రి చెట్టు ఇలా అన్నిగూడ చాలా చిన్నవిగా....అణువులంతా అన్నట్లుగా కనిపించసాగాయి. చివరికి ఈ విశ్వమే ఒక రేణువులాగా కన్పించసాగింది. అంతగా తన శరీరము పెరిగినదని ఈయన గ్రహించి అంటే తను గూడ విశ్వరూపధారి అయ్యాడని గమనించారు. ఈ విశ్వములో ఏది అయితే ఉన్నదో అదంతా గూడ తన దేహములోను ఉన్నదని అంతర్గత భాగముగా ఉన్నదని గమనించారు. విశ్వములో సర్వాంతర్యామి కనిపించే వింత గూడ తన దేహములో అంతర్యామిగా కనిపిస్తోందని ఈయన గ్రహించే లోపల. ఈ అతి భారీగా పెరిగిన ఈయన దేహము కాస్త నెమ్మదినెమ్మదిగా తగ్గడము మొదలైంది. దానితో ఆఖరిగా తనకి కనిపించిన మర్రి చెట్టు ఆకు మీద పసి బాలుడి రూపములో వటపత్ర సాయిగా తన కాలిని చీకుతూ శ్రీ మహా విష్ణువు కాస్త బాలగోపాలుడిగా దర్శనమివ్వగానే.... అంటే విశ్వరూపధారిగా అలాగే సూక్ష్మ రూపధారిగా శ్రీ మహా విష్ణువే శ్రీ కృష్ణుడిగా ఉండి ఈ లోకాలను ఆడిస్తున్నారని ఈయన గ్రహించేలోపులే ఈయన యదార్ధ భౌతిక శరీరములోనికి మారిపోయారు. ఈ మహత్తర దృశ్యాలను హార్వే పరికరము ద్వారా చూస్తున్న ఈ ముగ్గురికి ఆశ్చర్యానందాలు వేశాయి.
దేవికి మాత్రమూ బాల గోపాల ముగ్ధ మనోహర రూపదర్శన దృశ్యము నుండి తన మనస్సు తప్పుకోలేకపోతుంది. రికార్డు అయిన ఈ మహత్తర ధ్యాన దృశ్యమును పదే పదే చూస్తూ కన్నయ్య... కన్నా.. బాలయ్య.... గోపాల.... బాలగోపాల అంటూ పదే పదే వటపత్ర సాయి అయిన శ్రీకృష్ణ బాలునికి ముద్దులు పెడుతున్న తృప్తి తీరడము లేదు. ఎంత అయిన తను ఎప్పుడికైనా తల్లి గావాల్సిందే గదా. ఆ మాతృ మూర్తి గుణము ఇపుడు బయటికి వస్తోందని కాలాముఖుడు ఇదంతా గమనించి విశ్రాంతి తీసుకొనే పనిలో పడ్డాడు.
కాని....
పరమహంస ఎపుడో విశ్రాంతి తీసుకొనే స్థితిని దాటిపోయారు. కాలాతీత స్థితికి చేరుకున్నారు.
అపుడు ఈయనకి ఈ చక్ర అధి దేవతగా పండరీపుర పాండురంగడు మరియు రుక్మిణి సమేతముగా దర్శనమిచ్చారు. అంటే తను శూన్యస్థితి వైపు తన ప్రయాణ సంకేతముగా వీరి దర్శనభాగ్యము కల్గినదని పరమహంస గ్రహించి...వీరితో ఎలాంటి సంభాషణలు చెయ్యకుండా మౌనముగా ఉండేసరికి వీళ్లు గూడ అదృశ్యమయ్యారు. శూన్యములో కలిసిపోయారు. దానితో ఈయనకి ఈ చక్ర విభేధన జరగడముతో అంతరిక్షములో ఉన్న ప్రతి బింబాలైన అనంతకోటి లోకాలు ఒక్కొక్కటిగా అదృశ్యమై శూన్యమవ్వడం ఆరంభమైంది. అపుడు ఈ మహా శూన్యములో నక్షత్ర వెలుగు అగుపించింది. ఈ నక్షత్ర కాంతి కాస్త పరమహంసలో లీనమయ్యేసరికి తత్త్వమసిగా మారుతూ అపుడిదాకా తెల్లని శరీరముతో శివతత్త్వములో ఉన్న ఈయన కాస్త ఎడమ భాగము అంతాగూడ నీలవర్ణముతో, శంఖు చక్రాలతో... కేశవమూర్తి అనగా ఒక భాగము శివుడిగా.... మరొక భాగము కేశవుడిగా అనగా శివకేశవ తత్త్వముగా హరిహరాదులు ఒక్కటే తత్త్వమని అన్నట్లుగా ఈయన కనిపించే దృశ్యము మిగిలిన వారంతా చూసి తన్మయత్వము పొందసాగారు. అపుడు ఆ తర్వాత ఈయన ఈ తత్త్వముతో....
ఈ సహస్ర చక్రమునకు ఉన్న జీవనాడి మార్గము వైపు తన కారణ శరీరముతో పరమహంస ప్రయాణించడము మొదలు పెట్టారు.
ఈ సహస్ర చక్రమును నడిపించే కాలమునకు ఎవరి వలన, దేని వలన ఈ కాలము నడుస్తోందని తెలుసుకోవాలని వెలుతురుకి అవతలి ప్రపంచమైన చీకటి లోకానికి వెళ్లడానికి ఉన్న జీవనాడి మార్గము వైపు పరమహంస ప్రయాణించే దృశ్యాలు కనిపించేసరికి కాలాముఖుడు విశ్రాంతి స్థితి నుండి ధ్యానస్థితికి వెళ్లాడు.
No comments:
Post a Comment