అధ్యాయము 64

ఇంతలో పరమహంస మనోదృష్టి దృశ్యాలు తమ పరికరములో కనిపించడముతో ఈ ముగ్గురు కాస్త ఈ ధ్యానదృశ్యాలను చూడటం ఆరంభించారు.

పరమహంస మనోదృష్టి ముందు.... ...... ...... 

ఉన్నట్టుండి..చిన్ముద్ర ఉన్న హస్తము యొక్క చూపుడు వ్రేలు మరియు బొటన వ్రేలు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశములోనికి గోముఖ తీర్ధములో అపుడికే చేరియున్న ఈశ్వర ఆత్మలింగము బయటికి వచ్చి ఈ చిన్ముద్ర ఖాళీ ప్రాంతములోనికి చేరింది.దానితో ఈ చిన్ముద్ర హస్తము యొక్క చిటికెన వ్రేలు  మీద చింతామణి, ఉంగరపు వ్రేలు మీద కౌస్తుభమణి, మధ్యవ్రేలు మీద ఇంద్రమణి, చూపుడు వ్రేలు మీద శమంతకమణి, బొటన వ్రేలు మీద నాగమణి, అర చెయ్యిలో రుద్రమణి అమరితే చూపుడు వ్రేలు అలాగే బొటనవ్రేలు మధ్యభాగములోకి ఈశ్వర ఆత్మ లింగము చేరగానే ఇదికాస్తా ఆత్మమణిగా మారింది.ఆత్మలింగమంటే ఎలాంటి కోణాలు లేకుండా ఉంటే అదే ఆత్మమణిలో 64 త్రికోణాలు ఉంటాయి.ఇలా ఉన్నట్టుండి ఆత్మలింగము కాస్తా ఆత్మమణిగా ఎందుకు మారిందో పరమహంసకి అర్ధం కాలేదు.

కొన్ని క్షణాల తర్వాత ఈయన ప్రశ్నలకి సమాధానముగా ఉన్నట్టుండి ఆత్మమణి మీద ఎక్కడ నుండో తెల్లని కాంతి ప్రసారము అవ్వడము మొదలైంది.ఈ మణి మీద పడిన ఈ కాంతి కాస్త ఏడు రంగులతో విభజన చెంది చిన్ముద్రకి అమరియున్న ఆరుమణుల మీద ఆరు రంగుల కాంతి ప్రసారము అవ్వడము మొదలైంది.మొదట నాగమణి మీద ఆఖరిగా చింతామణి మీద పడటము జరుగుతోంది.తద్వారా ఈ ఆరుమణుల కాంతుల వలన ఒక్కొక్క మణి యొక్క రూపాలుగా అనగా చిన్ముద్ర రూపము, నాగ పాము రూపము, మత్స్యావతార రూపము, రుద్ర రూపము, పాంచజన్య శంఖు రూపము, ఏనుగుదంత రూపాలు యొక్క హాలోగ్రాం చిత్రాలేర్పడ్డాయి.ఈ భావరూపాల నుండి వరుసగా ఙ్ఞాన మాయ, భావమాయ, ఆత్మరూపమాయ, ఆకారరూపమాయ, దైవమాయ,జీవమాయ లేర్పడి 64 వ బ్రహ్మకపాలముగా ఇదియే 1 వ బ్రహ్మకపాలముగా ఏర్పడ్డాయి.ఈ బ్రహ్మకపాలము స్వయంభూ ఆలోచన చెయ్యడము ఆరంభమైంది.ఎలాంటే ఆరు మాయల శక్తి కాంతి కాస్త ఈ ఆది ఏక బ్రహ్మకపాలము యొక్క బ్రహ్మరంధ్రము మీద కాంతి ప్రసారము జరగడముతో ఇది కాస్తా ఆలోచన మొదలైంది.ఆ తర్వాత దీనియొక్క త్రినేత్ర రంధ్రము,రెండు బౌతిక నేత్రాల రంధ్రాలనుండి కాంతి ప్రసారము జరిగి సంకల్పము,స్పందన,ఆశ అనే మూడు కపాలాలు ఏర్పడ్డాయి.ఇది ఈ మూడు కపాలాల యొక్క త్రికాంతి ప్రసారమే త్రిమాత అయిన విశ్వమాత హాలోచిత్రము ఏర్పడినది.ఈ త్రిమాత త్రిశక్తితో పంచకోశాలతో గూడిన పంచభూత పంచకపాలేర్పడ్డాయి.ఈ కపాలాల యొక్క బ్రహ్మరంధ్రాల నుండి కాంతి ప్రసారము జరిగి ఈసారి సప్త ధాతువులతో గూడిన సప్త కపాలాలు ఏర్పడ్డాయి.ఆ తర్వాత ఈ కపాలాల కాంతి ప్రసారశక్తి వలన నవ రంధ్రాలున్న చర్మము,ఎముకలు, రక్తమాంసములు,మలము,మూత్రము, వీర్యము,అండము నవకపాలాలేర్పడ్డాయి.ఆ తర్వాత కపాలాల కాంతి ప్రసారశక్తి వలన పంచేంద్రియాలు+పంచ ఙ్ఞానఏంద్రియాలు మరియు మనస్సు యున్న పదకొండు కపాలాలేర్పడ్డాయి.ఈ కపాలాల కాంతి ప్రసారశక్తి వలన పదమూడు కపాలాలు అనగా ఏకాదశ రుద్రులు మరియు పురుష స్త్రీ రూపాలు ఏర్పడ్డాయి.ఆ తర్వాత వీటి కాంతి శక్తి ప్రసారము వలన ఈసారి 15 కపాలాలు అనగా పురుష ప్రకృతి సప్త అంగాలతో స్త్రీ ప్రకృతి సప్త అంగాలతో కలిసి ఏకతల అస్థిపంజరము ఉన్న సంపూర్ణ జీవుడిగా ఏర్పడ్డాయి.ఇలా ఏక కపాలము నుండి 64 కపాలాలు ఏర్పడినాయి.ఈ కపాలాల యొక్క బ్రహ్మరంధ్రము యొక్క కాంతిశక్తి ప్రసారము వలన ఆయా కపాలాలయందు ఈ కాంతి ప్రసార హెచ్చుతగ్గుల తేడాల వలన వివిధ లోకాల రూపాలుగా హాలోగ్రాం చిత్రాలు ఏర్పడ్డాయని పరమహంసకి ఙ్ఞానస్ఫురణ అయింది.15వ కపాలాలలోని మధ్య కపాలము యొక్క అస్థిపంజరము యొక్క బ్రహ్మరంధ్ర కాంతి శక్తి కాస్తా హృదయ చక్రం మీద పడి సహస్ర, ఆఙ్ఞా,విశుద్ధి,అనాహత,మణిపూరక, స్వాధిష్టాన, మూలాధార చక్రమునకు చేరి ఇందులో ఉన్న పాము చుట్టుకొని ఉన్న శివలింగము మీద కాంతి ప్రసారము పడుతోందని ఎపుడైతే ఈ కాంతి ప్రసారము పడటము ఆగిపోతుందో ఆ క్షణమే ఆ జీవుడికి వాడి కర్మానుసారము భౌతిక,అశాశ్వత, ముక్తి, శాశ్వత మరణాలు సంభవిస్తాయని పరమహంసకి అవగాహన అయింది.అంటే ఆత్మమణి మీద పడే కాంతి ప్రసారము కాస్తా జీవుడి యొక్క మూలాధార చక్రము యొక్క జీవాత్మ లింగము మీద పడేదాకా కొనసాగుతోందని ఈయనికి అర్ధమైనది.

అపుడు పరమహంసకి సందేహము వచ్చింది.అది ఏమిటంటే భగవంతుడి ఉనికి లేకుండా ఈ విశ్వ సృష్టి,స్థితి,లయ ప్రక్రియలు ఎలా జరుగుతున్నాయో అర్ధము కాలేదు.దీనికి సమాధానముగా ఈయనికి బ్రహ్మరంధ్రములో ఉన్న కపాలాగ్ని,64 కపాలధారి,మణులు,శివలింగాలు, ఆ ఆత్మ లింగము దర్శనానుభవాలు ఙ్ఞాపకము వచ్చాయి.అంటే ఈ లెక్కన చూస్తే కపాలాగ్నికి రూప గుణతత్వముంది.దానితో అగ్ని రూపాలు ఏర్పడుతున్నాయి.ఈ నీడలు కాస్త నాగమణి మీద పడుతున్నాయి.దీనికున్న కామరూప విద్య వలన ఈ నీడలకి స్వరూపాలు ఏర్పడతాయి.వీటికి అష్ట కోరికలు కలిగించడానికి చింతా మణి ఉంది.ఈ కోర్కెలు తీర్చడానికి శమంతకమణి ఉంది.కోరికలు అదుపులో ఉంచడానికి ఇంద్రమణి ఉంది.కోరికలు తీర్చుకోవడానికి కావలసిన శక్తినివ్వడానికి కౌస్తుభమణి ఉంది.కోరికల మీద వైరాగ్యము కలిగించడానికి రుద్రమణి ఉంది.ఇలా ఏర్పడిన స్వరూపాలు స్త్రీ ప్రకృతిలోను పురుష ప్రకృతిలోను ఉండటానికి స్త్రీ,పురుష శివలింగాలున్నాయి.ఈ స్వరూపాలకి సప్త శరీరాలు ఇవ్వడానికి ఆత్మలింగము ఉంది.ఇలా సృష్టించబడిన స్వరూపాలు కాలానుగుణముగా లయము చెందటానికి పునఃజన్మలు ఎత్తటానికి అలాగే విశ్వస్థితికి 64 కపాలధారి ఏర్పడటము జరిగింది.ఇదే అంతర్వేదమని పరమహంసకి ఙ్ఞానస్ఫురణ కలిగింది.

పైగా ఈ మణులు కాస్త యోగచక్రాల అలాగే లోకాల మీద,గ్రహల మీద ప్రభావము చూపుతున్నాయి.అనగా మూలాధార నుండి బ్రహ్మాండ చక్రముదాకా వరుసగా ... ఇంద్రమణి మూలాధార,స్వాధిష్టాన చక్రాలు,కౌస్తుభమణి అయితే మణిపూరక,అనాహత చక్రాలు,రుద్రమణి అయితే విశుద్ధ,ఆఙ్ఞా చక్రాల మీద,శమంతక మణి సహస్ర చక్రము మీద, చింతామణి అయితే హృదయ చక్రము మీద బ్రహ్మరంధ్రము మీద నాగమణి ప్రభావము చూపుతున్నాయి.అలాగే సూర్య చంద్ర గ్రహాల మీద శమంతకమణి ప్రభావం,కుజుడు మీద నాగమణి,గురువు మీద రుద్రమణి,శుక్రుడు మీద కౌస్తుభమణి,శని మీద ఇంద్రమణి,బుధుడు మీద చింతామణి ప్రభావము చూపుతున్నాయి.అలాగే తపోలోకము మీద రుద్రమణి,సత్యలోకము మీద చింతామణి, సువర్ణలోకము మీద ఇంద్రమణి, భూలోక,భువర్లోక మీద శమంతకమణి ప్రభావము అలాగే మహర్లోకము మీద కౌస్తుభమణి ప్రభావముంటే..జనలోకము మీద నాగామణి ప్రభావముంది.అంటే మొత్తము మీద అండలోకాలమీద 64 కపాలాధారి ప్రభావము అలాగే పిండలోకాలమీద మణుల ప్రభావము అలాగే బ్రహ్మండలోకము మీద ఆత్మలింగ ప్రభావముంటుందని పరమహంసకి ఙ్ఞానస్ఫురణ కలిగింది.


అసలు ఈ ఆత్మ మణి మీద ఎక్కడనుండి కాంతి పడుతుందో  తెలుసుకోవాలని పరిశీలించి చూడగా..బ్రహ్మరంధ్రము నుండి ఈ కాంతి ప్రసారము జరిగి మొదట ఆత్మమణి మీద పడి చివరికి అంతిమముగా జీవాత్మ జీవలింగము మీద పడి అంతమవుతుందని పరమహంసకి అవగాహన అయింది.ఇది ఇలా ఉంటే ఈ బ్రహ్మరంధ్రము నిజానికి చూడటానికి సూది బెజ్జము అంత పరిమాణములో ఉంటుంది.మరి దీనికి ఎక్కడ నుండి కాంతి ప్రసారము అవుతుందో అలాగే పురుష, స్త్రీ శివ లింగాలు, 64 కపాలాలు ఈ బ్రహ్మరంధ్రములోనికి ఎలా ఐక్యము చెంది శూన్యము అయినాయో ఒక పట్టాన అర్ధముకాలేదు.ఇందులో తనకి తెలియని మర్మ రహస్యము దాగియున్నదనీదియే చిదంబర రహస్యమని పరమహంసకి అర్ధమైంది.ఎలాగైనా ఈ రహస్య చేధన చేయాలని అనుకుంటున్న సమయములో..

ఉన్నట్టుండి..ఈ ఛిన్ముద్ర నుండి విడివడి ఆత్మమణి కాస్తా చిన్నదికాస్తా పెద్దదిగా మారుతూ తనలో ఉన్న 64 త్రికోణాలను  అదృశ్యమవుతూ చివరికి ఏలాంటి కోణాలు లేని పరిశుద్ధ ఆత్మలింగముగా అవతరించింది.ఇది చూడటానికి టాబ్లెట్ ఆకారములో ఉన్న శుద్ధ స్ఫటిక లింగముగా మారింది.ఇపుడు దీని మీద బ్రహ్మరంధ్రం నుండి యధావిధిగా కాంతిశక్తి  ప్రసారము జరుగుతూ ఉంది.కాని ఎలాంటి మార్పులు కనిపించలేదు.అదే ఆత్మమణికి ఉన్న 64 త్రికోణాల మీద ఈ కాంతి పడినప్పుడు ఇది కాస్తా 64 భాగాలుగా విభజన చెందినట్లుగా అగుపిస్తే అదే త్రికోణాలు లేని ఆత్మలింగము మీద కాంతి ప్రసారము జరిగిన ఎలాంటి విభజన లేకుండా ఏకత్వముగా కనబడసాగింది.

ఉన్నట్టుండి.. 

ఆత్మలింగము కాస్తా పరమహంస ఆత్మ శరీరమును తన ఆత్మ శక్తితో ఆకర్షించడము మొదలుపెట్టింది.పరమహంసకి అసలు ఏమి జరుగుతుందో అర్ధము కాలేదు.ఎందుకు తన శరీరమును ఈ ఆత్మలింగము ఆకర్షించుకొని తనలో ఎందుకు ఐక్యము చేసుకోవాలని ప్రయత్నిస్తుందో అర్ధముకాలేదు.

ఇంతలో ఈయన మనోదృష్టి యందు ... ...... .......

నీలిరంగు ఆజానుభాహుడు అటవిక మధ్య వయస్కుడు కనిపించాడు.ఈయన వెనకవైపు అరచెయ్యంత స్ఫటిక ఆత్మ లింగము ఉన్నట్లుగా పరమహంసకి అగుపించింది.ఉన్నట్టుండి ఈ లింగము కాస్త అంతకంతకు పెరిగి పెద్దది అవుతూ ఈ వ్యక్తిని తనలోనికి ఐక్యము చేసుకోవడానికి ఆకర్షించడము మొదలుపెట్టింది.ఈ వ్యక్తి ఈ లింగములోనికి ఐక్యము గాకుండా ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసిన గూడ ఎలాంటి ప్రయోజనము కనిపించలేదు.చివరికి ఈ వ్యక్తి ఆత్మ శరీరము కాస్తా ఈ స్ఫటికలింగములోనికి ఐక్యమై..ఆత్మలింగముగా మారిపోయే దృశ్యము పరమహంసకి కనపడసాగింది.అంటే మొదట ఆకర్షించిన ఆత్మలింగము అనేది ఈశ్వర ఆత్మలింగము అని ఎపుడైతే ఈ వ్యక్తి అందులోనికి ప్రవేశించాడో అదికాస్తా సదాశివ ఆత్మలింగముగా మారినదని..ఇపుడు తన ఆత్మ శరీరము గూడ ఈ ఆత్మ లింగము ఆకర్షించుకొని తన ఆత్మశరీరమును తనలో ఐక్యము చేసుకుంటే అదే తనకి ఆత్మలింగ మోక్షమవుతుంది.దీని వలన తను మాత్రమే ఆత్మ మోక్షము పొందిన వ్యక్తి అవుతాడు.కాని విశ్వానికి మోక్షము రాదు.ఎందుకంటే ఆత్మలింగము తనని లోనికి ఐక్యము చేసుకుంటుంది గదా.తను విశ్వానికి మోక్షము కలిగించాలంటే ఈ ఆత్మలింగమును తన ఆత్మశరీరము ఆధీనము చేసుకొని తనలోనికి ఆత్మలింగము ప్రవేశించే విధముగా చేసుకుంటే...ఈ ఆత్మ లింగము మీద

పడే కాంతి శక్తి ఎక్కడ నుండి వస్తుందో అక్కడికి తను చేరుకునే అవకాశము ఉంటుంది.అలాగే విశ్వానికి విముక్తి కలిగించి విశ్వమోక్షము కలిగించే అవకాశముంటుంది.ఇంతలో పరమహంసకి ఎదురుగా ఉన్న ఆత్మలింగము యొక్క ఆత్మశక్తి కాస్త ఆరుమణుల శక్తిగా విడిపోయి పరమహంస ఆత్మశరీరమును తిరిగి ఆకర్షించడము మొదలుపెట్టింది.అపుడు పరమహంస కాస్తా తన ఆత్మశరీరములో ఉన్న స్థూల,సూక్ష్మ,కారణ,వాయు,సంకల్ప,ఆకాశ శరీర శక్తి అనగా శరీరము, మనస్సు,బుద్ధి,అహము,ఙ్ఞానము,ఆత్మశక్తులను బయటకు తియ్యడము మొదలుపెట్టి.. ఎదురుగా ఉన్న ఈశ్వర ఆత్మలింగ ఆరు శక్తులతో తన ఆరు శక్తులతో ఎదుర్కోవడము ఆరంభమైంది.    

ఇలా 48ని||పాటు ఈ ఇద్దరిలో ఆలోచన,స్పందన, సంకల్పము,ఆశ,భయము,ఆనంద అను ఆరు స్థితులు పొందకుండా ఇంద్రియ నిగ్రహముతో సాక్షిభూతముగా దేనికి స్పందించని రాహిత్య స్థితిలో ఎవరైతే ఉండగలుగుతారో వారికి అంతిమ విజయము కలిగి వారికి ఎదుట వారు ఆధీనమవుతారు.అంటే ఈశ్వర ఆత్మలింగానికి అలాగే పరమహంస ఆత్మశరీరానికి జరిగే అంతిమ పోరాటములో ఎవరికి విజయము కలుగుతుందో ఎవరికి ఎరుక.ఇంతలో..పరమహంస ఆత్మ శరీర ఆరుశక్తులు కాస్త శరీర ప్రాణశక్తి,మనఃశక్తి,బుద్ధిశక్తి, అహముశక్తి,ఙ్ఞానశ్కతి, ఆత్మశక్తి కాస్త వరుసగా ఎదురుగా ఉన్న ఆత్మలింగములోని ఆరుమణుల శక్తులు అనగా చింతామణి,కౌస్తుభమణి, రుద్రమణి,ఇంద్రమణి, నాగ మణి, శమంతకమణి మీద ప్రభావము చూపిస్తూ..ఈ మణులకి ఉన్న కోణాలను సమసిపోయేట్లుగా చేయడముతో ఈ మణుల కాంతి ప్రసారము జరుగక మణులు కాస్త కాంతి విహీనము అవ్వడము ఆరంభమైనది.దానితో ఆత్మలింగము యొక్క ఆత్మశక్తి కాంతి గూడ కాంతి విహీనమవ్వడంతో ఈ ఆత్మలింగము కాస్త బలహీనపడి ఆకర్షణశక్తిని కోల్పోవడముతో పరమహంస ఆత్మశరీర శక్తికి ఆకర్షించబడి ఈ ఆత్మలింగము కాస్త ఈయన ఆత్మ శరీరములోనికి ప్రవేశించింది.దానితో ఆత్మలింగము కాస్త ఆధీనమైనదని సంకేతముగా పరమహంస మెడలో పురుష,స్త్రీ ప్రకృతుల ఆధీన ఆత్మలింగానికి సంకేతముగా కంది బద్ధ పరిణామములో ఉన్న 64స్ఫటికాలుండి మణిపూసగా ఆత్మలింగము ఉన్న స్ఫటిక మణిహారము ఈయన మెడలో పడినది.ఎపుడైతే ఈ ఆత్మలింగ హారము పడినదో ఆ క్షణమే ఈయన ఆత్మశరీరము కాస్త పరమహంస ఆత్మలింగముగా మారింది.లేదంటే ఈశ్వర ఆత్మలింగముగా మారేవాడు అన్నమాట.ఎపుడైతే ఈయన కాస్త ఆత్మలింగముగా మారాడో ఆ క్షణమే 64800 విశ్వగోళాలు నశించి ఏక గోళముగా మారింది.ద్వైత స్థితి నుండి ఏకత్వ స్థితికి వచ్చింది.అనగా పాప-పుణ్యాలు,ఙ్ఞాన-అఙ్ఞానాలు, దేవుడు-జీవుడు,మానవుడు-మాధవుడు,విద్య-అవిద్య,స్త్రీ-పురుష ఇలా ఉన్న ద్వైత స్థితి నుంది ఏకత్వ స్థితిగా అనగా ఆత్మ స్థితిగా ఆత్మ జీవిగా ఈ విశ్వము మారింది.

కొన్ని క్షణాల తర్వాత పరమహంస ఆత్మలింగము మీద బ్రహ్మరంధ్ర కాంతి శక్తి పడటముతో ఇది గూడ గాలిలోకి లేస్తూ పడే నీలికాంతి మార్గము ద్వారా ప్రయాణము చేస్తూ బ్రహ్మరంధ్రములోకి చేరుకుంది.అపుడు 64 కపాలము యొక్క బ్రహ్మరంధ్ర గుహ అదృశ్యమవ్వడముతో అంటే ఈ కపాలము గూడ కపాలమోక్షము పొందటము జరిగినదన్నమాట.సూది బెజ్జమంత ఉన్న బ్రహ్మరంధ్రము కాస్త విశ్వము యొక్క రంధ్రమంత పరిమాణములో కనిపించసాగింది.అంటే తను ఇన్నాళ్ళుగా అంటే 64 కపాలాలు,పురుష,స్త్రీ శివలింగాలాలు అనేవి విడిగా విశ్వ శూన్యములోనికి ఐక్యము అవుతున్నాయని అనుకున్నాడు.కాని నిజానికి బ్రహ్మరంధ్ర శూన్యమే విశ్వ శూన్యమని పరమహంసకి అర్ధము అయింది.అందుకే శబ్ద పాండిత్యము కంటే అనుభవ పాండిత్యము మిన్నయని పెద్దలు చెప్పడము జరిగింది.ఈ బ్రహ్మరంధ్ర విశ్వ శూన్యములో మధ్యలో పిండిరేణువు పరిమాణములో ఒక పూర్ణ బింధువు దివ్యకాంతితో మెరుస్తున్నట్లుగా ఇపుడుదాకా ఇదంతా చూస్తున్న కాలాముఖుడి ఆత్మ శరీరానికి ఙ్ఞానస్ఫురణ అయింది.  

పరమహంస ఆత్మలింగము కాస్త ఈ విశ్వ శూన్య మధ్య బిందువైన పూర్ణబిందువు వైపుకి ప్రయాణించడము కాలాముఖుడి ఆత్మశరీరము గమనిస్తూ ఈ ఆత్మలింగమును అనుసరించడము మొదలుపెట్టాడు.ఈ దృశ్యాలు అన్నిగూడ హార్వే పరికరములో చాలా స్పష్టముగా కనబడుతూ ఉండటముతో..ఈ ముగ్గురు గూడ అదే హార్వే,జోషి,దేవి గూడ ఏమి జరుగునో అని చాలా ఉత్కంఠముగా చూస్తున్నారు.ఇంతలో..పరమహంస ఆత్మలింగము కాస్త ఈ విశ్వ పూర్ణబిందువు దగ్గరికి చేరిచేరగానే ఇది బిందువుగాదని పరమ స్ఫటిక లింగమని..

అంటే పూర్ణశూన్యము కాస్త ..

ఆకాశమే లింగముగా.......

భూమియే పానవట్టముగా ..........

పరిశుద్ధ స్ఫటిక పరమలింగముగా 

ఇది అందరికి కనబడసాగింది.అంటే విశ్వబ్రహ్మాండమే విశ్వపూర్ణ లింగమైనది అన్నమాట.  


ఇంతలో పరమహంస ఆత్మలింగము కాస్తా..ఈ పరమలింగమునందు పూర్ణస్థితిలో లయం చెందుతున్నపుడు ఈ మహత్తర దృశ్యము చూస్తున్న కాలాముఖుడి ఆత్మశరీరము కాస్తా..శివ ఉపాసన స్తోత్రము అనగా..


నిధపతయే నమః నిధనపతాంతికాయ నమః

ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః

హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః

సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః

దివ్యాయ నమః దివ్యలింగాయ నమః

భవాయ నమః భవలింగాయ నమః

శర్వాయ నమః శర్వలింగాయ నమః

శివాయ నమః శివలింగాయ నమః

జ్వలాయ నమః జ్వలలింగాయ నమః

ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః

పరమాయ నమః పరమలింగాయ నమః


చేస్తూండగా..పరమహంస ఆత్మలింగము కాస్తా..ఈ పరమలింగమునందు పూర్ణస్థితిలో లయం పూర్తి అయ్యి పూర్ణశూన్యమవ్వడముతో.....


ఉన్నట్టుండి .... ...... 

అపుడిదాకా నిశ్చలస్థితిలో ఉన్న పరమలింగము కాస్తా తన చుట్టు తాను తిరగడము ఆరంభించినది.ఇలా నెమ్మదిగా నెమ్మదిగా తిరుగుతూ వేగమును పెంచుకుంటూ..శరవేగముగా మనోవేగముగా తిరగడము ఆరంభమైంది.అపుడు ఉన్నట్టుండి ఈ పరమలింగము నందు పగుళ్ళు రావడము మొదలైంది.దానితో గోళాకారముగా ఉన్న ఈ లింగము కాస్త నెమ్మది నెమ్మదిగా  తన ఆకారమును కోల్పోతూ స్ఫటికము కాస్తా స్ఫటిక రేణువులుగా మారిపోవడము అదిగూడ  నీలము,తెలుపు,పసుపు,ఎరుపు, నలుపు రంగుల అణువులుగా పరమాణువులుగా రేణువులుగా మారిపోతూ ఇది కాస్తా బ్లాక్ హోల్ గా మారిపోయింది.అంటే ఆకార పరమలింగము కాస్తా నిరాకార బ్లాక్ హోల్ గా మారింది అన్నమాట.అపుదు ఈ బ్లాక్ హోల్ కాస్త తన చుట్టు ఉన్న వాటిని తనలోనికి నెమ్మది నెమ్మదిగా ఇముడ్చుకొని వాటిని నాశనము చేస్తూ అదృశ్యము చేయడము ఆరంభించింది.కొన్ని నిమిషాల తర్వాత ఈ బ్లాక్ హోల్ కాంతి రేణువులు కాస్త నెమ్మది నెమ్మదిగా కాంతిహీనమవ్వడము ఆరంభమైనది.ఇలా ఈ బ్లాక్ హోల్ కాస్త లోపలి భాగములో ఒక కోన్ వంటి ఆకారములో ఒక సొరంగ మార్గముగా ఏర్పడసాగింది.దీని లోపలి అడుగుభాగములో చివరిలో విద్యుత్,అయస్కాంత తరంగాలేర్పడి విద్యుత్,అయస్కాంత వలయ క్షేత్రమును ఏర్పరచడము జరిగింది.అంటే ఇది చూడటానికి విష్ణు సాలగ్రామ శిలయందు లోపలివైపు ఎలా అయితే రెండు సుదర్శన చక్రాలు ఒకటిపైన మరొకటి క్రింద అమరి వీటి మధ్య బిందువులు కలిపినట్లుగా ఎలా అయితే ఉంటాయో అలా ఈ బ్లాక్ హోల్ అడుగుభాగములో ఏర్పడిన విధ్యుత్ అయస్కాంత తరంగ నిర్మాణము ఏర్పడుతుందో అలా ఈ నిర్మాణము ఉన్నదని కాలాముఖుడికి అర్ధమైంది.ఈ రెండు బిందువుల మధ్య భాగములో జల్ వంటి జిగురు పదార్ధము ఏర్పడటము ఈ బ్లాక్ హోల్ లో పడిన ప్రతి పదార్ధము లేదా వస్తువు గూడ ఈ జల్ పదార్ధము దగ్గరకు రాగానే వాటి ఆకారాలు కోల్పోయి కాంతి రేణువులుగా మారిపోతూ నిరాకారమవుతూ శూన్యమవ్వడము మొదలైంది.ఇదంతా తన ఆత్మశరీరముతో చూసిన కాలాముఖుడికి అంతులేని బ్రహ్మానందమునకు గురి అవ్వుతుండేసరికి ఈయన ఆత్మశరీరము కాస్త ఆత్మ లింగముగా మారి పరమ లింగము యొక్క బ్లాక్ హోల్ కి ప్రవేశిస్తున్న సమయములో భూమ్మీద ఉన్న గాజ్ బాక్స్ లో ఉన్న స్థూల శరీరము కాస్త స్ఫటిక ఆత్మలింగముగా మారింది.ఈ విషయము గమనించిన హార్వే,జోషి,దేవి ఆశ్చర్యానందములకి గురి అవుతుండగా..  


పరమలింగము కాస్త పంచ వర్ణ కాంతి రేణువులుగా విడిపోతూ బ్లాక్ హోల్ గా మారి..చివరికి ఇది గూడ నిరాకారమవుతున్న దృశ్యము చూస్తున్న వీరు కాస్త..ఆదిలో ఏ పూర్ణ శూన్యము నుండి ఉద్భవించి ఆకారమును ఏర్పరుచుకొని చివరికి తిరిగి అదే పూర్ణశూన్యస్థితిలోనికి నిరాకారమై పూర్ణశూన్యమైనదనుకొంటూ..దీనిని బట్టి చూస్తే ఆదిలో అనగా జీవుడి మూలాధార చక్రము నందు ఉన్న ఆత్మలింగము కాస్త బ్రహ్మరంధ్రములోని పరమలింగములోనికి ఐక్యమవ్వడమే పూర్ణమోక్షమవుతుంది.అలాగే ఆదిలోను అంతములోను శివలింగమే ఉన్నదని శివలింగమంటే పూర్ణశూన్యమునకు సంకేతమని చెప్పిన శాస్త్రవచనము బట్టి చూస్తే ఈ విశ్వము యొక్క ఆదిలోను అలాగే అంతములోను పరమశూన్యమే ఉంటుందని పైగా శివోపాసన మంత్రము ద్వారా భారతీయ పూర్విక మహర్షులు చెప్పిన దానిని పరమహంస తన సాధనతో సాధనాత్ సాధ్యతే సర్వం అన్నింటిని శాస్త్రీయముగా శాస్త్ర నిదర్శనాలతో నిరూపించి లోకానికి తన సాధనానుభవాలను అనుభవ పాండిత్య ఙ్ఞానముతో నిరూపించి చూపడమే కాకుండా ఎవరికి వారే సాధన చేసి కపాలమోక్షమును పొందుతుంటే తనతోపాటుగా విశ్వానికి శాశ్వతవిముక్తి కలిగించి దానికి విశ్రాంతినిచ్చే విశ్వమోక్షము ఇవ్వాలని ప్రయత్నించి జయము పొందటము అసాధ్యమైన దానిని గూడ సుసాధ్యమేనని పరమహంస శాస్త్రీయముగా సాధించి నిరూపించారు గదా.


ఉన్నట్టుండి దేవి కాస్త శివోపాసన మంత్రాలు చదవడము ఆరంభించింది.


నిధపతయే నమః నిధనపతాంతికాయ నమః

ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః

హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః

సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః

దివ్యాయ నమః దివ్యలింగాయ నమః

భవాయ నమః భవలింగాయ నమః

శర్వాయ నమః శర్వలింగాయ నమః

శివాయ నమః శివలింగాయ నమః

జ్వలాయ నమః జ్వలలింగాయ నమః

ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః

పరమాయ నమః పరమలింగాయ నమః


ఇవి చదవడము పూర్తి అయిన తరువాత హార్వే,జోషి.వెంటనే దేవితో,,.ఇపుడు ఈ మంత్రాల యొక్క నిజమైన అర్ధాలు,పరమార్ధాలునీకు తెలుసా? అడగానే..

దేవి వెంటనే..... .....  

నాకు తెలుసు అంటే వీటిని యోగ చక్రాలుగా మార్చి చూస్తే అనగా హిరణ్యలింగమంటే చావు పుట్టుకలు నిచ్చే మూలాధారములోని స్వయంభూ లింగమని,సువర్ణలింగమంటే ధనమాయలు ఇచ్చే స్వాధిష్టాన చక్ర లింగమని,దివ్యలింగమటే దివ్యానుభవాలు ఇచ్చే మణిపూరక చక్ర లింగమని,భవలింగమంటే అన్ని రకాల మృత్యుభయాలనుండి భవ విముక్తి ఇచ్చే అనాహత చక్ర లింగమని,శర్వ లింగమంటే శర్వాణి నివసించే విశుద్ధ చక్ర లింగమని,అదే శివలింగమంటే రుద్రుడు ఆవాసమైన ఆఙ్ఞాచక్ర లింగమని,జ్వాల లింగమంటే సహస్ర చక్రములో ఉండే చితాగ్ని జ్వాలయే ఈ లింగమని,ఆత్మలింగమంటే అష్టదళ హృదయ పద్మములోని హృదయ చక్రలింగమని,ఇక పరమలింగమంటే బ్రహ్మరంఫ్హ్రములోని పరమశూన్యస్థితి ప్రతీక లింగమని పరమహంస సాధనానుభవాలు ద్వారా మనకి శాస్త్రీయముగా శాస్త్ర నిదర్శనమైనది.మన భారతీయ    పూర్వీక మహర్షులు, యోగులు తెలుసుకున్న నగ్న సత్యాలను ఇలా అంతర్గత భావాలతో మంత్రాలుగా అమర్చడము జరిగితే వాటిని తన సాధనానుభవాలుగా లోకానికి శాస్త్రీయముగా మన గురూజీయైన పరమహంస నిరూపించారు.శాస్త్రవచనాలను శాస్త్రీయముగా చెప్పడము జరిగింది గదా అని అంటుండగా 


ఇక మన ముగ్గురి సంకల్పము తీరింది గదా.ఇక శ్వాసతో ఏమి పని అనుకుంటూ ఈ ముగ్గురు కాస్తా తమ ఆది జన్మలు అనగా 

ఇంతలో ఉన్నట్టుండి.......


దేవి కాస్త త్రిశూలముగా

జోషి కాస్త ఏకముఖ రుద్రాక్షగా

హార్వే కాస్త బ్రహ్మకపాలమాలగా   


 మారిపోయారు.వీళ్ళకి భోజనము వడ్డించడానికి పనివాడు కాస్త భోజనాలు తీసుకొని ఈ రహస్యగదికి రాగానే నలుగురు కాస్త దైవాలుగా మారిపోయారని తెలుసుకొని

ఈ రహస్య ప్రయోగ గది కాస్త కాలాముఖ దేవాలయము అయ్యింది.వంటవాడు కాస్త ఈ ఆలయ పూజారిగా మారాడు.కర్కోటక తాంత్రికయోగి కాస్త మారిన కర్కోటక సర్పము కాస్త ఈ ఆలయమునకు రక్షణకవచముగా మారి కాలాముఖ ఆత్మలింగమునకు నాగాభరణముగా మారాడు.


--అయిపోయింది---

శుభం భూయాత్

..............................................................


ముగింపు

ఈ విశ్వములో ఆదిలోను అలాగే అంతములోను స్ఫటికలింగమే ఉన్నదని తెలుసుకోండి.అనగా మన మూలాధార చక్రములోను స్వయంభూ శివలింగముగా మన ఆత్మలింగముంటే అదే బ్రహ్మరంధ్రములోని బ్రహ్మాండచక్రములో స్ఫటిక పరమలింగమున్నదని గమనించండి. శివలింగమంటే పూర్ణశూన్యస్థితికి సంకేతమని..ఈ శూన్యము ఆకారము దాల్చితే అదే శివలింగమని గ్రహించండి.అలాగే యోగసాధన సిద్ధి అంటే మన మూలాధర చక్రములోని ఆత్మలింగము కాస్త బ్రహ్మరంధ్రములో బ్రహ్మాండచక్రములో ఉన్న పరమలింగములో ఐక్యము చెయ్యడమే ఆత్మలింగమోక్షము అవుతుంది.చాలామందికి మోక్షము అంటే కపాలమోక్షమే అనుకొంటారు.

కాని నిజానికి మోక్షాలలో  ఏడు రకాల మోక్షాలు ఉంటాయి.అవి సప్తశరీరాల మోక్షం,64 కపాలాల మోక్షం,పురుష,స్త్రీ శివలింగాల మోక్షం,మణుల మోక్షం,శివలింగాల మోక్షం,ఆత్మలింగ మోక్షం,పరమమోక్షం అన్నమాట.ఇందులో సప్తశరీరాల మోక్షం అంటే సర్వ కర్మలు నివారణ చేయడము అలాగే కపాల మోక్షము అంటే కర్మ జన్మల నుండి విముక్తి పొందటము ఇక మణూల మోక్షము అంటే  మన మనస్సుకి కోరికల రాహిత్యస్థితి ఇవ్వడము శివలింగాల మోక్షము అంటే అన్నింటి యందు పరిపూర్ణరాహిత్య స్థితి పొందటము ఇక ఆత్మలింగ మోక్షము అంటే అన్నింటియందు ఇంద్రియనిగ్రహముతో ఉండి జితేంద్రియుడవ్వడము అన్నమాట.ఇక ఆఖరిదైనా పరమమోక్షం అంటే పూర్ణశూన్యమునందు పూర్ణముగా శూన్యమవ్వడము అన్నమాట.మధుర,కాశీ,ద్వారక,ఉజ్జయిని,కంచి,అయోధ్య,హరిద్వార్....అంటే ఈ పురాలు బట్టి చూస్తే ఖచ్చితముగా సప్తమోక్షాలు ఉండి ఉండాలి.అవి ఏమై ఉంటాయి అని ఆలోచింస్తుండగా...ఒక పట్టనా అర్ధము కాలేదు.అపుడు ఈ సప్తపురాలను విశ్లేషణ చెయ్యడము అనగా మధుర పురమంటే శ్రీకృష్ణుడి జనన ప్రాంతము గావడము వలన ఇది జీవుడి సప్త శరీరాల జనన మరియు మోక్షమిచ్చే శరీరమోక్షపురము అయ్యిండాలి.ఆ తర్వాత కాశీక్షేత్రానికి వస్తే ఇక్కడ ప్రతినిత్యము శవదహనాలు జరగడమువలన ఇక్కడ కపాలమోక్షం జరుగుతుంది.అందువలన ఇది కపాలమోక్షపురము అయ్యిండాలి.ఇక ద్వారకక్షేత్రమునకు వస్తే శ్రీకృష్ణుడు దగ్గర శమంతకమణి ఉండుటవలన ఈ పురము కాస్త మణిమోక్షపురము అయ్యిండాలి.ఇక ఉజ్జయినిక్షేత్రానికి వస్తే ఇక్కడ ఉన్న శివలింగము పురుషశివలింగము గావడము వలన ఈపురము కాస్త పురుషశివలింగమోక్షపురము అయ్యిండాలి.ఇక కంచిక్షేత్రానికి వస్తే ఈ పురము కామాక్షిదేవత ఆధీనముగావడము వలన ఈ పురము కాస్త .స్త్రీ శివలింగమోక్షపురము అయ్యిండాలి.ఇక అయోధ్యక్షేత్రానికి వస్తే శ్రీరాముడు కాస్త తన ఆత్మలింగమును రామేశ్వరక్షేత్రమునందు మూడు అడుగుల స్ఫటిక ఆత్మలింగమును ప్రతిష్టించడమువలన ఈ పురము కాస్త ఆత్మలింగమోక్షపురము అయ్యిండాలి.ఇక హరిద్వార్ క్షేత్రానికి వస్తే రుషికేశి క్షేత్ర శివలింగము అనేది మహాశివుడు కాస్త హాలహలము సేవించడము వలన ఈ నీలిరంగుశివలింగము ఉద్భవించినదని చెప్పడము బట్టిచూస్తే ఈపురము కాస్త పరమమోక్షపురము అయ్యిండాలి.అంటే ఈ లెక్కన చూస్తే సప్తమోక్షాలు అనగా శరీరమోక్షం.. కపాలమోక్షం.. పురుషశివలింగమోక్షం.. స్త్రీశివలింగమోక్షం..మణిమోక్షం..... ఆత్మలింగమోక్షం..పరమమోక్షం అను ఏడు రకాల మోక్షాలుంటాయని...ఎవరైతే వారి వారి కర్మలనుసరముగా ఆయా క్షేత్రాలయందు 9 రోజులనుండి 9 సం!!రాలుపాటు ఆవాసము చేస్తారో వారికి ఆయా మోక్షం కల్గుతుందని....

అలాగే మన ఆత్మ లింగములు అనేవి హరిద్వార్ క్షేత్రములో ఉంటాయి.ఇక్కడ మన 48 తరాలు ఆత్మల రూపములో ఆవాసము చేస్తూ ఉంటారు. పైగా ఈ క్షేత్రము కూడ మూలాధారచక్రమునకు సంభంధించినది.కాబట్టి ఈ క్షేత్రములో నుండి ఒక అంగుళము ఉన్న టాబ్లెట్ ఆకారములో ఉన్న ఒక స్ఫటిక సాలిగ్రామము అలాగే మూడు అంగుళాలు ఉన్న గోళాకారముగా ఉన్న స్ఫటికబాణలింగమును తెచ్చుకోండి.టాబ్లెట్ ఆకారములో ఉన్న స్ఫటికబాణలింగము మన ఆత్మలింగమైతే గోళాకారముగా ఉన్న స్ఫటికబాణలింగము పరమలింగము అవుతుందని గ్రహించండి.నిజానికి స్ఫటిక లింగారాధన వలన అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ప్రస్తుతము ఉన్న తరముతో కలిపి 15 తరాల వారికి ఏదో ఒక మోక్షస్థితి కలుగుతుందని లింగపురాణము చెప్పడము జరిగింది.కాబట్టి మీలో ఎవరికైన ప్రస్తుత జన్మయే ఆఖరి జన్మ అవ్వాలని ఉంటే అలాగే కర్మ,జన్మ,స్పందన,కోరిక,సంకల్ప రాహిత్య స్థితి పొందాలని ఉంటే అలాగే మోక్షగామిగా మారాలని ఉంటే ఈ హరిద్వార క్షేత్ర స్ఫటికలింగాల ఆరాధన చేసుకోండి.ఆత్మలింగమును మెడలో చచ్చేదాకా ధరించండి.పరమలింగమును నిత్య ఆరాధన పూజలో ఉంచండి.మీ గతజన్మల కర్మఫలితమును బట్టి మీకు ఏ మోక్ష ప్రాప్తి ఉందో అది ఖచ్చితముగా వస్తుంది.

ఈ నవలాంశములో చెప్పబడిన పరమహంస పాత్ర అలాగే ఈయన పొందిన ధ్యానానుభవాలు అక్షర సత్యమే. బ్రహ్మరంధ్రము నుండి బ్రహ్మరంధ్ర అంతర్గత గుహలో ఉన్న పురుష లేదా స్త్రీ లేదా కపాలధారి దర్శనానుభవము మీకు ప్రత్యక్ష దర్శనానుభూతిగా గావాలంటే కాశీక్షేత్రములో 40 అడుగుల లోతులో ఉండే రహస్య శివలింగమును చూస్తే..మీకు ఖచ్చితముగా బ్రహ్మరంధ్రము నుండి చూసిన అనుభూతి కలుగుతుంది.ఎందుకంటే ఈ రహస్య శివలింగమును ప్రత్యక్షముగా చూడటానికి వీలుండదు. 40 అడుగుల పైన ఉన్న ఒక చిన్న రంధ్రము ద్వారానే మాత్రమే చూడాలి.ఒక కార్తీక పౌర్ణమి,శివరాత్రి రోజు మాత్రమే ఈ శివలింగమును ప్రత్యక్షముగా చూసుకొనే అవకాశముంటుంది.మిగిలిన అన్ని రోజులు గూడ ఈ పైన ఉన్న రంధ్రము ద్వారానే చూడవలసి ఉంటుంది.ఈ గుడి వీడియో కోసము    the historical hidden shivaling of kashi అని సెర్చ్ చేస్తే ఈ వీడియో వస్తుంది.చూసి తరించండి.

కాని మిగిలిన పాత్రలు మరియు వాటి ఉద్ధేశ్యాలు అన్నిగూడ ప్రస్తుతకాలములో జరుగుతున్న లోకతీరును బట్టి నా మదిలోంచి వచ్చిన కల్పితాంశాలతో సృష్టించబడ్డాయి.అయితే వీళ్ళకి వచ్చిన ధర్మసందేహలు అన్నిగూడ నేను సత్యాన్వేషణ అలాగే దైవాన్వేషణ సమయములో వచ్చినవాటిని అలాగే ధ్యానానుభవాలు ద్వారా కలిగిన జ్ఞానవిచారణ వలన వచ్చిన సమాధానాలు చెప్పడము జరిగింది.ఈ కధాంశము ఒక కథ కాదని ఒక ధ్యాన అనుభవమని గ్రహించండి.మీకు నమ్మకము కలిగితే మీకు ఇష్టమైన సాధనామార్గమును ఒకటి ఎంచుకొని సాధన సాధ్యతే సర్వం సాధ్యమని ఎవరికి వారే సాధన చేసి నిజఙ్ఞానమును పొందండి.ఆత్మ ఙ్ఞానమును పొంది ఆత్మయోగిగా మారండి.సాధనకి అలాగే స్ఫటికలింగారాధనకి  కులము, మతము, స్త్రీ, పురుష, చిన్న, పెద్ద,బ్రహ్మచారి లేదా సంసారి మరియి భోగిగా లేదా యోగి అనే బేదభావము ఉండదని తెలుసుకోండి.ఎందుకంటే అందరు గూడ ఆత్మ జీవులే.ఆత్మలింగాలే.కాని మాయ, మోహ, వ్యామోహలలో పడి వచ్చిన దారి మర్చిపోయి సాలెగూడులో చిక్కుకున్న పురుగులా కర్మ-జన్మ బంధాలలో చిక్కుకొని బాధలు పడుతున్నాము.అవిశ్రాంతిగా కొట్టుమిట్టాడుతున్నాము.కనిపించేది సత్యమని కనిపించనిది అసత్యమని భ్రమ భ్రాంతిలో ఉండిపోతున్నాము.నిజానికి మన జన్మకి విశ్రాంతి,శాంతిని ఇచ్చేది అలాగే ఏ శూన్యము నుండి మనము పుట్టామో తిరిగి అదే శూన్యములో శూన్యము అయ్యే విధముగా చేసేది మరియు కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని చేప్పే ఆత్మఙ్ఞానము ఇచ్చేది మోక్షగామిగా మారి మోక్షానుభూతి పొందటమే మనకి ఉన్న ఏకైక మార్గమని గ్రహించండి.ఈ మార్గానికి దిక్చూచిగా మార్గదర్శిగా ఉండటానికి సూక్ష్మంలో మోక్షముగా నా 27సం|| నా ధ్యానానుభవాలు అలాగే అందరికి అర్ధము అయ్యే విధముగా నా పరిశోధనలో నేను తెలుసుకున్న నిజయోగానుభవాలు ఆధారముగా ఈ నవలాంశ యొక్క పరమహంస పాత్ర సృష్టించబడింది.

ఈ పాత్ర పొందిన ధ్యానానుభవాలు నిజమో కాదో మీరే స్వయముగా తెలుసుకోవాలంటే మీరు మోక్షగామిగా మారకతప్పదు.తద్వారా ఆత్మమోక్షము పొందకతప్పదు.

యత్ భావము తత్ భవతి.

సాధానాత్ సాధ్యతే సర్వం


ఏమి తెలియని వాడు.......

ఏదో తెలుసుకోవాలని... సాధన చేస్తే

ఏమి లేదని …. సర్వం శూన్యము అని తెలుసుకోవడమే

సంపూర్ణ బ్రహ్మజ్ఞాన స్ధితియని.......

మనో నిశ్చలస్ధితి పొందితే

సంపూర్ణ యోగసాధన పరిసమాప్తి స్ధితియని...

ఆనందరహితమైన పరమ ప్రశాంత స్ధితిని పొందితే

ఇదియే పూర్ణ మోక్షస్ధితి...


ఇదే ఈ దేహజీవితము తెలుసుకున్న అంతిమ సత్యము


శుభం భూయాత్

**********************************

కొన్ని రోజుల తర్వాత నాకు ఒక సందేహము వచ్చింది.అది ఏమిటంటే నా అంతిమ ధ్యానానుభవముగా అండ,పిండ,బ్రహ్మండమును కలుపుతూ ఒక అండకార స్ఫటిక పరమలింగము దర్శనమైంది గదా.మరి ఈ భూమ్మీద గూడ ఎక్కడో ఒక చోట పరమలింగము అంశ ఉండి ఉండాలి గదా..అది ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలని నాలో సంకల్పము మొదలైంది.దానితో పుస్తక గ్రంథాలు తిరగవేశాను.వీటిలో అంతిమ రూపము పరమలింగమే అని చెపుతున్నాయి కాని అది ఎక్కడ ఉన్నదో చెప్పలేదు.దానితో నేను కాస్త నాకున్న మనోజపసిద్దిని ఉపయోగించుకొని మనస్సు చెప్పిన చోటుకి వెళ్ళి పరమలింగము యొక్క జాడ తెలుసుకోవాలని నిశ్చయించుకోని ధ్యాననిష్ట కొనసాగించాను.  

కొన్నిరోజుల తర్వాత నాకు ధ్యానములో చిదంబర క్షేత్ర దర్శనమైంది.దానితో నేను కాస్త ఈ క్షేత్రదర్శనానికి వెళ్ళాను.ఉదయము ఈ ఆలయము తెరిచిన దగ్గర నుండి మూసేదాకా ఈ ఆలయ పరిసరాలలో ఉండి నామ జపము చెయ్యడము ఆరంభించాను.ఎందుకంటే ఈ ఆలయములో ఒక ప్రత్యేకత ఉంది.అది ఏమిటంటే ఈ ఆలయములో రాత్రి పది గంటలకి శేషహరతిని ఒక తెల్లని వస్త్రమునకు ఇస్తారు.ఎందుకంటే ఈ వస్త్రము వెనుక శ్రీచక్ర లేదా శివశక్తి లేదా శివ యంత్రమున్నదని..అందుకు గుర్తుగా ఈ వస్త్రము మీద బంగారపు బిల్వపత్రమాలను దండగా వేసి ఉంటుంది.కాని నిజానికి ఈ క్షేత్ర చిదంబర రహస్యము ఏమిటంటే ఈ తెల్లని వస్త్రము మీద ఎవరికైతే శివలింగదర్శనమవుతుందో వారికి మోక్షప్రాప్తి కల్గుతుందని స్వయంగా సదాశివుడు సప్తరుషులకి చెప్పడము జరిగినదని కాశీఖండము నందు శ్రీనాథుడు చెప్పిన విషయము నాకు లీలగా గుర్తుకు వచ్చింది.దానితో ఎలాగైన ఈ తెల్లని వస్త్రము మీద శివలింగదర్శన ప్రాప్తి కల్గితే కాని ప్రత్యక్షానుభవము వలన ఈ దేహనికి మోక్షము కల్గుతుందని నమ్మకము కల్గుతుంది గదా అనిపించేది.ఎందుకంటే ఇపుడిదాకా ధ్యానయోగిగా నాకు ధ్యానానుభవాలు కల్గిగాయి కాని అనుభూతి కల్గలేదు.దానితో ఈ క్షేత్రములో నా అంతమధన సాధన మొదలై పదిరోజులు గావస్తోంది.అయిన ఏలాంటి ఫలితము కనిపించలేదు.ప్రాణత్యాగము చేసుకోవాలని నిశ్చయించుకున్నాను.మూడు రోజులు గడిచాయి.ఒకరోజు ఉదయము నా ధ్యానము తీవ్రస్ధాయిలో ఉండగా..నా మనో దృష్టికి యందు ఒక స్త్రీ మూర్తి యొక్క కుడి అరచెయ్యి కనిపించి నా కంఠము మీద ఈ చెయ్యి ఉంచి ఉంచగానే నా కంఠ మధ్యభాగములో దివ్యతేజస్సుతో కాంతులు చిమ్ముతో ఒక స్ఫటిక శివలింగ దర్శనమైంది.కొన్ని క్షణాలు తర్వాత ఈ దృశ్యము అదృశ్యమవ్వడముతో నాకు ధ్యానభంగమైంది.ఆ తర్వాత యధావిధిగా దర్శనానికి వెళ్ళితే ఎపుడు గూడ ఖాళీగా కనిపించే తెల్లనివస్త్రము మీద ఈ సారి నాకు స్ఫటిక శివలింగము అచ్చుగుద్దినట్లుగా నా కంఠములో ఉన్న నందు కనిపించిన లింగమూర్తి లాగా కొన్ని క్షణాలు కనిపించి అదృశ్యమైంది. ఎవరైతే పూర్ణజ్ఞానస్దితికి వస్తారో వారికి  ఇలా జ్ఞాన స్ఫటిక శివలింగ దర్శనము అవుతుందని..ఎందుకంటే కంఠము నందు ఉండే విశుద్ధ చక్రము అనేది జ్ఞానానికి ప్రతీక పైగా ఈ చక్ర క్షేత్రము చిదంబర క్షేత్రము అలాగే ఎవరైతే పూర్ణజ్ఞానస్ధితిని పొందుతారో వారికి ఖచ్చితముగా ఈ క్షేత్రమునందు తెల్లని వస్త్రము మీద ఇలా జ్ఞానలింగము కనపడుతుందని..కనపడాలని..అపుడే ఆ ఆత్మజీవికి కైవల్యముక్తియగు మోక్షానికి అర్హత ఉన్నట్లేనని నాకు జ్ఞానస్ఫురణ అయింది.ఇంతలో నా మనస్సు కాస్త లయతప్పడముతో నేను కాస్త ధ్యాననిష్టలోనికి వెళ్ళితే ఈ సారి నా మనోదృష్టియందు మళ్ళీ ఆ స్త్రీ మూర్తి చెయ్యి కనిపించి ఈ సారి నా కంఠములో ఉన్న స్ఫటిక శివలింగమును తన చేతితో పికివేసింది.అపుడు ఈ శివలింగ స్ధానములో ఒక గుంట ఏర్పడింది.అపుడు నా శరీరములో ఒక వెండిరంగు పాము పాకుతూ ఈ గుంట లోపలకి వెళ్ళే దృశ్యము లీలగా కనిపింస్తూండగా నాకు ధ్యానభంగమైంది.ఈ పాము గోల ఏమిటో..శివలింగమును బలవంతముగా నా కంఠము నుండి పెకిలించడము ఏమిటో నాకు ఒక పట్టనా అర్థము కాలేదు.బాధతో..ఆవేదనతో నాకు ఏడ్పుపు తన్నుకొస్తోంది.ఆపుకోలేకపోయాను.నేను ఏమైన తప్పు చేశానా...లేదా మాయలో పడ్డానా... లేకపోతే నా కంఠములో ఉన్న జ్ఞానలింగమును ఎందుకు బలవంతముగా తొలగించబడింది.కారణము లేనిదే కార్యముండదు.ఎదో జరిగింది.ఎదో జరుతోంది.కాని అది నాకు అర్ధము గావడము లేదని నాకు అర్ధమైంది.మళ్ళీ ధ్యానములోనికి వెళ్ళాను.ఈ సారి నా మనో దృష్టియందు కాశీక్షేత్రము దర్శనమైంది.దానితో ఈ దేహము కాస్త కాశీయాత్రకి ప్రయాణమైంది.

యధావిధిగా కాశీ క్షేత్ర దర్శనాలు పూర్తి చేసుకొని నా ఆత్మగురువైన శ్రీ త్త్రైలింగస్వామి మఠమునకు చేరుకొని నా ఆవేదనను తీర్చామని అక్కడున్న ఆయన విగ్రహమూర్తిని వేదుకొని ధ్యానములో కూర్చునాను.ఏమి కనిపించలేదు.ఇలా ఈ క్షేత్రములో 41 రోజులున్నాను. ఫలితము శూన్యము..నా ప్రశ్నకి సమాధానము లేదు.నాలో తీవ్రమైన ఆవేదన ఉండటము వలన నా మనస్సు కాస్త తీవ్రమైన ఒత్తిడికి గురై తట్టుకోలేక ఈ క్షేత్రము నందు ఆత్మహత్య చేసుకోవాలని తీవ్ర ప్రయత్ననాలు చెయ్యడము ఆరంభిచింది.ఇలాంటి పరిస్ధితిలో ఉండగా నేను కాస్త మణికర్ణిక ఘాట్ చేరుకొని తీవ్రమైన ధ్యాననిష్టలో ఉండగా నా మనోదృష్టి యందు యధావిధిగా నా కంఠము నందు ఉన్న శివలింగమును పెకలించిన దృశ్యము లీలగా కనిపించింది.నాలో ఆవేదన మొదలైంది.ఇంతలో అదే చెయ్యి కాస్త నా కుడి చెవిలో నర్మదానది బాణలింగము ఉంచగానే నాలో నమ:శివాయ అను శివతారక మంత్రోపదేశము మూడుసార్లు చేసినట్లుగా చాలా స్ఫష్టముగా అనిపించింది.అంటే కాశీ క్షేత్రములో ఎవరైతే పూర్ణజ్ఞానము పొందిన ఆత్మజీవిగా మరణమును పొందుతారో..అపుడు ఆ జీవుడికి స్వయంగా ఈ క్షేత్ర కాశీవిశ్వనాధుడే ఇచ్చే శివతారక మహా మంత్రోపదేశము ఇదేనని నాకు జ్ఞానస్ఫురణ అవుతుండగా నా ధ్యానభంగమైంది.ఆర్తితో నేను కాస్త నా గురుదేవుడైన శ్రీ త్త్రైలింగస్వామి మఠమునకు వెళ్ళి ధ్యానములో కూర్చున మరుక్షణములో నా మనోదృష్టి యందు పంచశిఖరాలున్న ఒక కొండ దర్శనమైంది.ఆ మరుక్షణమే ఏదో ఒక గుహలో నగ్నముగా ఉండి తన చుట్టు తాను తిరుగుతున్న నా రామ తారక మంత్ర గురువైన శ్రీ రమణ మహర్షి వారు కనిపించడముతో ..నాకు కనిపించిన కొండ అనేది అరుణాచల క్షేత్రములో ఉండే అరుణాగిరి అని నాకు అర్ధమైంది.అంటే కాశీక్షేత్రములో పొందిన శివతారకమంత్రమును తపస్సుగా అరుణచల క్షేత్రము చెయ్యాలని నాకు జ్ఞానస్ఫురణ అవ్వడముతో...అంటే కాశీ క్షేత్రములో మరణము పొందినగూడ మోక్షము రాదని..కానీ ఈ మోక్షమును పొందే యోగ్యతను పొందటానికి తగ్గట్లుగా ఇక్కడి విశ్వనాధుడు మనకి శివతారక మంత్రోపదేశము చేస్తాడని దీనిని 13 సం!!రాలు పాటు తపస్సులాగా అరుణచల క్షేత్రములో చెయ్యాలని..ఎందుకంటే అంతిమ పరమలింగము ఈ అరుణాగిరి అని నాకు జ్ఞానస్ఫురణ అయింది.అంటే కాశీక్షేత్రములో ఏ పూర్ణజ్ఞాన ఆత్మజీవి మరణము పొందుతుందో..ఆ జీవికి తన తారకమంత్రోపదేశము ఇవ్వడముతో ఈ ఆత్మజీవి కాస్త ఆత్మలింగముగా మారుతుందని ఎందుకంటే ఆదియోగి సదాశివుడు గూడ ఈ కాశీ క్షేత్రములో ఆత్మలింగముగా మారి కాశీ విశ్వనాధుడైనాడని పురాణ శాస్త్రవచనము గదా.అలా ఈ దేహము గూడ ఈ కాశీక్షేత్రము నందు ఆత్మజీవి నుండి ఆత్మలింగముగా మారినదని..ఈ లింగము కాస్త పరమలింగమునందు ఐక్యమవ్వాలంటే ఈ పరమలింగము ఉన్న అరుణాచల క్షేత్రమునకు ఈ దేహము ప్రయాణమైంది.

భగవంతుడున్నాడు

భగవంతుడున్నాడు.అవును మీరు విన్నది నేను చెపుతున్నది నిజమే.ఈ సృష్టిలో నాకు భగవంతుడు జాడ ....ఆయన భగవత్ తత్త్వము తెలిసింది.అది ఏమిటి..ఇపుడు దాకా దేవుడు లేడు..ఆత్మ లేదు..నేను లేను..ఉన్నదింతా ఏమిలేని పరమశూన్యము మాత్రమే ఉన్నదని చెప్పి ఇపుడు కొత్తగా భగవంతుడున్నాడని చెపుతున్నారు అంటారు.అవును అది చెప్పాను.ఇది చెపుతున్నాను.ఈ రెండు సందేశాలు గూడ సత్యమే..అంటే భగవంతుడు వేరు అలాగే దైవము వేరు అని ముందు తెలుసుకొండి.ఎందుకంటే భగవత్ తత్త్వము నుండి దైవ తత్త్వము వచ్చింది.దీని నుండి పురుష దేవుడు తత్త్వము దీని నుండి స్త్రీ దేవత తత్త్వము అలాగే దీని నుండి ఆత్మ తత్త్వము వచ్చాయి.

ఇందులో భగవత్ తత్త్వము అనేది నేను కాని నేను అయితే..దైవ తత్త్వము అనేది అహము అయితే..దేవుడు తత్త్వము నాది అయితే దేవత తత్త్వము నీది అయితే ఆత్మతత్త్వము అనేది నేను అవుతుంది.ఇపుడు దాకా నా ధ్యానానుభవాలు అన్నిగూడ అనగా కపాల మోక్ష గ్రంథ అనుభవాలు సృష్టి ప్రకృతి అనగా బ్రహ్మకపాలధారి దర్శనము...ది బుద్ధ కోడ్ పుస్తక అనుభవాలు స్ధితి ప్రకృతి అనగా ఆరు మణుల దర్శనము..అంతర్వేదం పుస్తక అనుభవాలు లయ ప్రకృతి అనగా పరమ లింగ దర్శన అనుభవాలతో అనగా పురుష..స్త్రీ..అర్ధనారీతత్త్వ ప్రకృతులతో...సృష్టి..స్ధితి..లయ ప్రక్రియలతో..సత్వ,రజో,తమో గుణాలతో ఈ మూడు ప్రకృతులలోని అన్ని దైవ,ఆత్మ స్వరూపాలు దర్శనమిచ్చి చివరికి అశాశ్వత మరణాలు పొంది పరమ శూన్యము నందు లయము చెందడము చూశాము గదా.దీనిని బట్టి ఈ మూడు ప్రకృతులలో శాశ్వతమైనది..శాశ్వతమైనవాడు ఏది నాకు కనిపించకపోవడముతో నేను కాస్త దేవుడు లేడు..ఆత్మ లేదు..నేను లేను..ఉన్నదింతా పరమశూన్యమేనని చెప్పడము జరిగింది.కాని ఈ మూడు ప్రకృతులు దాటితే..ఈ మూడు గుణాలు దాటితే..మనకి నాలుగోవ ప్రకృతి స్ధితి అదే మూల ప్రకృతి అయిన లాస్య ప్రకృతి..నాలుగువ గుణరూపమైన శుద్ధసత్వగుణము.. శాశ్వతుడు.. మృత్యుంజయుడు.. సర్వజ్ఞుడు.. సర్వశక్తిమంతుడు.. సర్వదక్షడు అయిన శ్రీ మేధాదక్షిణామూర్తి యొక్క భౌతిక..ఆత్మ..జ్యోతి..నేను కాని నేను తత్త్వస్వరూపముగా మనకి అరుణాచల క్షేత్రము నందు ఇపుడికి సజీవమూర్తిగా కనపడుతుంది.నేను ఏది గూడ శాస్త్ర..శాస్త్రీయ నిదర్శన ఆధారాలు లేకుండా నమ్మనని నా ధ్యానానుభవాలు చదివిన తర్వాత మీరందరికి తెలిసే ఉంటుంది.

అరుణాచల అనుభవాలు: 

నిజానికి అరుణాచల గిరి ఆధ్యాత్మిక విద్యుత్ అయస్కాంత గిరి..దీని వలన ఈ క్షేత్రానికి 1000 కి.మీ పరిధిలో ఉన్న అర్హత,యోగ్యత ఉన్న యోగులను ఈ గిరి ఆకర్షించుకుంటుంది.తన దగ్గరికి రమ్మని స్వయంగా మనకి ధ్యానము నందు లేదా స్వప్నము నందు పంచ శిఖరాలున్న ఈ గిరి కనిపించి చెప్పడము నా స్వానుభవము కాదు ఎంతో మంది యోగులస్వానుభవాలు నిరూపింస్తున్నాయి.ఇలా నాకు ధ్యానములో ఈ అరుణాగిరి కనిపించడముతో నేను కాస్త ఈ క్షేత్రానికి వెళ్ళడము జరిగింది.నేను మొట్టమొదటిసారి ఈ గిరిని చూసిచూడగానే నా చంచల మనస్సు కాస్త అచలము అనగా స్ధిరమైంది.పనిచెయ్యడము ఆగిపోయింది.ఆలోచనాలు ఆగిపోయాయి.నా ఆది జన్మ తల్లి..తండ్రి..గురువును చూస్తున్నా అనుభవ అనుభూతి..ఈ అరుణాపురము నా స్వంత ఊరు అని..ఈ అగ్నిలింగ దేవాలయము నా పూజ గది అని  బలంగా అనిపించి నా ప్రమేయము లేకుండా  నా కళ్ళ వెంట కన్నీరు ధారాపాతముగా కారడము మొదలైంది.కాని అలాగే నాలో పూర్ణజ్ఞాని..పూర్ణగురువు ..పూర్ణయోగి అనే మద..అహము..అహంకారాలు అను మూడు  మాయస్వరూపాలు బయటికి రావడము మొదలైంది.దానితో నా మనస్సు 48 ని దాటగానే ఈ జ్ఞానాంహర మాయకి గురియై...నేను ఏమిటి..ఒక ప్రక్క దేవుడు లేదు..ఆత్మ లేదు..నేను లేను అని చెపుతూ..మరోప్రక్క ఈ గిరికి నమస్కారము చెయ్యడము ఏమిటి..ఎముంది..ఇపుడు నేను చూసిన ఈ మూడు ప్రకృతులలోని దైవ,ఆత్మ స్వరూపాలు గూడ శాశ్వతముగా ఉన్నట్లుగా..సత్యముగా.. కనిపించి చివరికి కాలానుగుణముగా అశాశ్వత మరణాలు పొంది అసత్యాలుగా మారినట్లుగా ఈ గిరి దేవుడు గూడ మారవచ్చు గదా అనిపించింది.దానితో నా సిద్ధ మంత్ర,తంత్ర,యంత్ర ప్రయోగాలు ఈ గిరి మీద ప్రయోగించాను.ఎందుకంటే ఈయన శాశ్వతుడో కాదో తెలుసుకోవాలి  అదిగూడ నా స్వానుభవాలు ద్వారా తెలుసుకోవాలి అనిపించి..కట్టా శివ అను చెరువును ఉన్న ప్రాంతమునకు చేరుకొని అక్కడున్న ఒక గుహయందు చేరి అర్ధరాత్రి యందు ఈ మంత్రప్రయోగాలు చేసాను.దుర్గాయంత్రము ప్రయోగించాను.అదికాస్త ఈ గిరి దగ్గరికి చేరిగానే ఈ గిరికి గీసిన మంత్రయుతమైన గీత యొక్క అతీశక్తివంతమైన రేడియాషన్ వలన ఈ యంత్రము దగ్ధమైంది.ఆ తర్వాత నా దగ్గరున్న సుదర్శనచక్ర సాలిగ్రామ ప్రయోగము చేసాను.ఇదిగూడ ఈ గిరిగీతను దాటలేకపోయింది.ఇలాగాదనుకొని స్ఫటిక బాణలింగ ప్రయోగము చేసాను.ఇది మాత్రము గిరిగీతను దాటుకొని గిరి అగ్రభానికి చేరుకొన్న కొన్ని క్షణాలకే అక్కడున్న లింగజ్యోతి యందు ఇది ఐక్యమైంది.దానితో నా బుర్ర తిరిగింది.ఇది గాదనుకొని శివుడిని ఎపుడు గూడ శంఖముతో పూజ చెయ్యరాదని చెప్పిన సూత్రము ఆధారముగా నా దగ్గరున్న గోమతీ శంఖ ప్రయోగము చేశాను.ఇదీ కాస్త ఈ గిరి చేరుకొని గిరి దక్షిణ భాగమునందు రంపములాగా కొయ్యడము ఆరంభించిన కొన్ని క్షణాలకే ఈ శంఖముగూడ అగ్నికి ఆహూతి అయింది.దానితో నాలో కోపావేశాలు అమితముగా పెరగడముతో ఈ గిరిని నా కపాలాగ్ని సిద్ధితో దహనము చెయ్యాలని ప్రయోగము చేశాను.గిరి  దగ్ధమవ్వడము ఆరంభమైన కొన్నిగంటలకి ఈ గిరి కున్న రహస్య సొరంగమార్గము నుండి ఈ గిరి అంతరభాగములో ఉన్న అగ్నితీర్ధము బయటికి వచ్చి ఈ కపాలాగ్ని చల్లారిచ్చే దృశ్యమును చూడగానే నాలో ఉన్న త్రీ మాయలు గూడ దగ్ధమవుతూండగా నాలో సంస్కారమేర్పడి ఈ గిరికి నమస్కారభక్తితో చేసి నా ఆత్మను శరణాభక్తితో ఆత్మనివేదన చెయ్యగానే నా మనోదృష్టియందు సప్తరుషులలో ఒకరైన గౌతమ మహర్షి కనిపించి..నాయనా..బాధపడకు.నువ్వు నా అంశవి గావడము వలన ఈ మంత్రప్రయోగాలు చేసావు.చింతించకు.మేముగూడ నీకు లాగానే ఈయన మీద ప్రయోగాలు చేసి విఫలమైనాము.ఆయన శాశ్వతుడు..నిత్యుడు... మరణము లేనివాడు..నేను కాని నేను వాడు..ఏమి లేనివాడు..ఏమి కానివాడు..అన్నింటికి సాక్షిభూతుడు.. ఆధారభూతుడు.. మర్మయోగి..మౌనయోగి..అంటూ అదృశ్యమవ్వడముతో..గుడి గంటలు మ్రోగడముతో..నా ఆత్మమాయ మాయం అయింది.దానితో ఆత్మవిచారణ చేసుకొని ఈ క్షేత్ర విశేషాలు కోసము ఇంటర్నెట్ చూడటము అందులో ఒక వీడియోలో సప్తరుషులు ఈ క్షేత్ర దారుకావనము నందు నిత్యహోమాలు చేస్తూ ఈ సృష్టి అంతాగూడ కర్మానుసారముగా నడుస్తోందని..ఈ కర్మకి జీవుడే కర్త కాబట్టి ఇందులో దేవుడు ప్రమేయము లేదని ...జీవుడే దేవుడని వీళ్ళకి ఉన్న జ్ఞాన అహంకారముతో అనుకోసారు.ఇది తెలుసుకున్న ఈ క్షేత్ర నిత్య సత్య నివాసి  యైన అరుణాచలేశ్వరుడు కాస్త భిక్షామూర్తిగా వీరి దగ్గిరికి వచ్చి వీరి అహమును భిక్షగా తీసుకోవాలని అనుకుంటున్న సమయములో ఈయన ముగ్ధమనోహర నగ్నదేహమును చూసిన ఈ సప్తరుషుల సతులు కాస్త ఈయన యందు ప్రేమ,మోహ,వ్యామోహలు చెంది తమ భర్తలను వదిలిపెట్టి ఈయన వెంటబడిన దృశ్యాలను చూసిన ఈ రుషులు కాస్త తమ దివ్యదృష్టితో వచ్చినవాడు సాక్షాతు శివుడేనని గ్రహించి ఈయనను చంపాలని మంత్ర తంత్ర ప్రయోగాలు చెయ్యడము ఆరంభించారు.మొదట హోమాగ్ని నుండి అగ్నిపులిని ప్రయోగిస్తే..ఆయన దీనిని చంపి దాని చర్మమును ఆసనముగా చేసుకొన్నాడు.ఆతర్వాత జింకను ప్రయోగము చెస్తే దీనిని ఈయన కాస్త దీనిని తన మనస్సు అనే ఆయుధముగా చేసుకున్నాడు.ఇలాగాదనుకొని ఈ సారి అగ్ని సర్ప ప్రయోగము చేస్తే దీనిని ఈయన తన కంఠమునందు నాగాభరణముగా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఏనుగు ప్రయోగము చెస్తే ఆయన దీనిని చంపి దీనిని చర్మమును తన వస్త్రముగా చేసుకొన్నాడు.ఈ సారి సమస్త ప్రేతా,భూత,రాక్షస ఇలా 8 రకాల జాతులను ప్రయోగము చేస్తే ఈయన కాస్త వీరందరిని తన రుద్రగణాలుగా మార్చుకోవడముతో ఈ సప్తరుషులలో మార్పు వచ్చి మాయను తొలగించుకొని ఈయనకి తమ అహము అనే మాయను భిక్షగా వేసి ఈయనకి దాసోహలై మౌనదీక్ష చేపట్టి పూర్ణజ్ఞాన మునులుగా మారి ఇపుడికి కూడ  హిమాలపర్వతాలలో ఒకటైన నందాదేవి పర్వతము మీద సూక్ష్మశరీరాలలో ఆవాసము చేసే వీరంతా గూడ  బ్రహ్మీముహర్త కాలము అనగా తెల్లవారుజామున 3:45 కాలము నందుఈ గిరికి చేరుకొని ఈ గిరి అంతరమునందు ఉన్న ఆవాస మర్మయోగి అయిన శ్రీమేధా దక్షిణామూర్తికి చేసే సప్తరుషి పూజలు,హరతి జరిగే విధివిధానము దీనిని చూడటానికి సమస్త దైవాలు,వివిధ లోకావాసులు, ఆత్మజీవులు,ఆత్మయోగులు,ఆత్మగురువులు,ఆత్మజ్ఞానులు, ఆత్మసాధువులు ఇలా ఎందరో గూడ వచ్చి చూసి తరించే అంతాగూడ నా మనోదృష్టియందు కనిపించడముతో నేను మౌనముని అయ్యాను.ఎందుకంటే నా గోత్రము గౌతమస్య..ఇది గౌతమ ముని ది గావడము విశేషము.ఇది ఇలా ఉంటే మనకి సాధనలో నేను అనేది పూర్ణశూన్యమనే అనుభవము మాత్రమే కల్గుతుంది కాని అనుభూతి కల్గుదు.ఎందుకంటే నేను అనేది అంతరించిపోతుంది కాని నేను కాని నేను అనే జ్ఞానము శాశ్వతముగా మిగిలిపోతోంది.అదే శ్రీ మేధా దక్షిణామూర్తి ఆత్మస్వరూపము..దీనిని ఎవరు నాశనము చెయ్యలేరు.ఏది నాశనము చెయ్యలేదు.ఎందుకంటే ఈ ఆత్మశక్తి అనేది సైన్స్ ప్రకారముగా చూస్తే శక్తి దేనితో సృష్టించబడదు.దేనితో నాశనము చెయ్యబడదు.అలా దీని ప్రకారము చూస్తే ఆఖరిగా మిగిలే ఆత్మస్వరూపమును దాటితే మనకి ఈ గిరిలోపుల ఉన్న అగ్ని తీర్ధము నందు మనకి గుండ్రాని ఆరు విద్యుత్ అయస్కాంత శక్తితరంగాలను ప్రతినిత్యము..ప్రతిక్షణము ప్రసరింప చేసే ఒక స్ఫటిక అగ్నిశిఖ కనపడుతుంది.దీని ఉన్న నవవిధశక్తులైన న్యూక్లియర్ రేడియోషను శక్తి కాస్త శ్రీ మేధాదక్షిణామూర్తి ఆత్మస్వరూపానికి చేరి ఆత్మశక్తిగా మారడము..ఈ ఆత్మశక్తిగా కాస్త అగ్నిశక్తిగా మారి ఈ అరుణాగిరికి అందడము..ఈ అగ్ని శక్తి కాస్త ఈ గిరి బయట ఉన్న అగ్నిలింగానికి జ్ఞానాగ్నిగా మారి సకల దైవ,ఆత్మస్వరూపాలకి అందడము..వీరి నుండి ఈ శక్తి కాస్త సకలజీవులకి కామాగ్నిశక్తి మారి అందడముతో ఈ విశ్వములో సృష్టి..స్ధితి..లయ..లాస్య ప్రక్రియలు  అవిశ్రాంతిగా కొనసాగుతున్నాయని నాకర్ధమైంది.అంటే ఈ లెక్కన మనము కేవలము ముక్తిన్ని మాత్రమే పొందుతాము కాని మోక్షము పొందలేము.ఎందుకంటే నేను అనేది సమసిపోతుంది.ఇది కైవల్యముక్తిన్ని ఇస్తుంది.కాని నేను కాని నేను అనేది శాశ్వతముగా మిగిలిపోవడముతో మోక్షము పొందలేము.సాధన అనేది ఎవరికి వారే చేసుకోవాలి.జ్ఞానమును గూడ ఎవరికి వారే తెలుసుకోవాలి.అంటే ఎవరి చావు వారే చావాలి.అది గూడ కేవలము ముక్తి మార్గము ద్వారా మాత్రమే జరుగుతుంది.నేను అంటే ఆత్మ అయితే నేను కాని నేను ఆత్మస్వరూపము అన్నమాట.మనకి ఉన్న పంచముక్తులు అనగా శరస్ధి..సారూప్య..సామీప్య..సాలోక్య..సాయుజ్య అను ముక్తులలో చివరిదైన సాముజ్యముక్తి అగు కైవల్యముక్తి మనకి ఈ అరుణాగిరి యందు జరుగుతుంది.అనగా మన ఆత్మలింగము కాస్త ఈ ముక్తి ద్వారా పరమలింగమగు ఈ అరుణాగిరిలో ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి ఆత్మస్వరూపమునందు నేనుగా..నేరుగా ఐక్యము చెందుతుందని నాకు జ్ఞానస్ఫురణ అవ్వడముతో..ఏలాగైన నేను ఈ కైవల్యముక్తి న్ పొందకుండా మోక్షము పొందాలని అనగా ఈయనలో ఐక్యము కాకుండా అగ్నితీర్ధము నందు ఉన్న బడావాగ్ని అని అగ్నిశిఖ పూర్ణబిందువు ఐక్యము చెందాలని ఈ అరుణాగిరి మీద నేను కాస్త మంత్ర,తంత్ర.యంత్ర ప్రయోగాలు చెయ్యడము జరిగింది.అవి విఫలము చెందడముగూడ జరిగిందని ఈపాటికి మీకు తెలిసింది గదా.అంటే నేను అనేను పూర్ణశూన్యము అనే ధ్యానానుభవము మాత్రమే కలుగుతుందని..ఇది అనుభూతి పొందకుండా ఈ అరుణాగిరి ఆవాసి శ్రీదక్షిణామూర్తి చేస్తున్నాడని ఈపాటికి మీరందరికి అర్దమైంటుంది.ఈ అనుభూతి పొందితే ఈయన లేనట్లే..శాశ్వత మరణమును పొందినట్లే..ఉన్నదో లేదో తెలియని పూర్ణశూన్యము అనుభూతి పొందినట్లే..ఇదే అసలు సిసలైన మోక్షము అవుతుంది.దీనిని సాధించడానికి..దీనిని పొందడానికి నాకు లాగా ఎందరో యోగులు,దైవాలు,ఆత్మజీవులు, ఈ గిరి మీద ప్రయోగాలు ఎన్నో కోట్లానుకోట్ల బ్రహ్మకల్పాలు నుండి చేస్తున్నారు.ఆయనకి శాశ్వతమరణము ఇవ్వాలని ప్రయత్నప్రయోగాలు చేసి విఫలమై పంచముక్తులు పొందుతున్నారు. అనగా ఆత్మశరీర జీవులుగా.. ఆత్మజ్ఞానలింగాలుగా.. ఆత్మలింగాలుగా..ఆత్మజ్యోతులుగా.. అరుణజ్యోతిగా అనగా శరస్ధ... సారూప్య..సామీప్య..సాలోక్య..సాయుజ్య అను పంచముక్తులు పొందుతున్నారు అన్నమాట.ఇక్కడ చాలామందికి ఒక సందేహము రావచ్చును.అది ఏమిటంటే ఏ పాపము చేసాడని అరుణాగిరి వాసియైన శ్రీ దక్షిణామూర్తి మీద మంత్ర ప్రయోగాలు చేసి చంపాలని చూడటము ఎందుకు? అన్నపుడు ఏవరికి అయితే తమ ధ్యానము నందు కుడిచెవియందు నర్మదానది బాణలింగమున్నట్లుగా కనపడితే వాడు శివోహం..అనగా సాక్షాత్తు శివుడే అన్నమాట.అంటే ఈ లెక్కన చూస్తే అరుణాగిరి దక్షిణామూర్తికి వీడికి ఏమి తేడా ఉండదు అన్నమాట.కాని అద్ధములో బింబ..ప్రతిబింబములాగా వీరిద్దరుగా కవలపిల్లలుగా కనపడతారు.కాని నిజానికి వీరు ఇద్దరు కాదు ఒక్కరే గదా..ముక్తి అనేది  ద్వైతస్ధితి అనగా నేను వేరు..నువ్వు వేరు భావము కల్గించి ఆత్మలింగము కాస్త పరమలింగములో ఐక్యము చెందేటట్లుగా చేస్తుంది.అదే మోక్షము అయితే అద్వైతస్ధితి అనగా ఉన్నది ఒక్కటే..అదే ఏకత్వ స్ధితి అను భావము కల్గించి భిన్నభావాలు కల్గించే మనస్సును నాశనము చేసి అనగా బింబ..ప్రతిబింబాలు చూపించే మనస్సు అనే అద్ధము నాశనము అయితే మనకి ఏకత్వసిద్ది కలిగి మనము ఆత్మలింగము గాదని పరమలింగమేనని భావప్రాప్తి కలుతుంది.దీని కోసమే అందరు గూడ తమ జ్ఞానమును పరీక్షించుకోవటానికి ఈ అరుణాగిరి మీద అనగా తమ మీద తామే మంత్రప్రయోగాలు చేసుకొని చావటానికి వచ్చేటపుడు బ్రతకటానికి ఏర్పాట్లు చేసుకొని వచ్చి ఈ ప్రయోగాలు చేస్తున్నారని నాకర్ధమైంది.ఎందుకంటే మనమంతా గూడ కోరిక లేని  సమాజము చూడాలని కోరిక పెట్టుకొని సాధన చేస్తున్న ఆత్మజీవులే.ఎందుకంటే మోక్షము పొందాలి అనేది గూడ కోరికయో గదా.ఈ కోరిక కోసం రూపము లేని మన మనస్సు కాస్త రూపభావాలోచన ఆత్మస్వరూపముగా ఏర్పడింది.మోక్షమంటే మనస్సు లేని స్ధితి..అనగా ఇది పొందామో లేదో తెలియని అయోమయ వింత స్ధితి..అనగా చచ్చేవాడికి తాను చచ్చానని ఎన్నడికి తెలియని స్ధితియే నిజ మోక్షస్ధితి..దీనిని అనుభవముగా మనము పొందామో లేదో తెలియడానికి ఈ అరుణాగిరి మీద మంత్రప్రయోగాలు చేసి ఆయనను  జయించినట్లేతే మనకి మోక్షానుభూతి కల్గుతుందని ఈ ఏర్పాట్లు చెయ్యడము జరిగింది.అనగా శ్రీశైలము నంది త్రిశూలశిఖర దర్శనము..అలాగే కాశీలో నీడ చూపించని బావి ఉన్నట్లుగానే ఈ అరుణాచలములో ఈ ఏర్పాటు చేసారు.ఎవరైతే పూర్ణస్ధితికి వస్తారో వారి మనోదృష్టికి ఇప్పుడికి ఈ గిరిచుట్టు సప్తరుషులు ప్రయోగాలు చేసి సృష్టించిన ఏనుగు, పులి,పాము,జింక,కుక్క,అస్ధిపంజరాలు,ప్రేతాత్మలు, భూతాలు,మంత్రదేవతలు,శంఖ ప్రయోగాలు ఈ అరుణాగిరి నాశనము చేసే విశ్వప్రయత్నానాలు చూడవచ్చును.అరుణాగిరి మంత్రగీత శక్తి..గిరిప్రదక్షిణశక్తి..అష్టలింగాల దిగ్భంధన శక్తిని మన భౌతిక నేత్రాలతో చూడవచ్చును. అలాగే దక్షిణామూర్తి రూపము గూడ మన భౌతిక నేత్రాలకి అర్ధరూపముగా అనగా జగ్గీవాసుదేవా ఆశ్రమములో ఉన్న 112 అడుగుల ఆదియోగి శివ స్వరూపమే అరుణాగిరి యందు కనిపించే ఈయన భౌతికరూపము అన్నమాట.ఇక త్రినేత్ర దృష్టికి ఈ రూపము మనకి శ్రీశంకరాచార్యుడు చెప్పిన శ్రీదక్షిణామూర్తి సోత్ర వర్ణములో వర్ణించినట్లుగా ఈయన ఆత్మస్వరూపము కనపడుతుంది.ఈ రెండు రూపాలు గూడ మనకి ఈ గిరి యందు కనిపించడము లేదంటే ఇక మన సాధన పరిసమాప్తి అవ్వకపోవాలి అన్నమాట.అలాగే మనకి ఈ క్షేత్రములో సిద్దిపొందిన ఆత్మజ్ఞానుల ఆత్మశరీరాల దర్శనం మొదలుకొని గిరి అగ్రభాగములో స్వయంభూ పద్మాకార  అగ్నిలింగము..ధ్యానయోగి అయిన సదాశివుడి దర్శనము..అమ్మవారి అభయ హస్త దర్శనము..మహాలక్ష్మీ స్వరూప అనుభవదర్శనము..దక్షీణామూర్తి రూపదర్శనాలు...గిరి లోపుల ఉన్న అగ్నితీర్ధ దర్శనము..అగ్నిబిందు దర్శనముతో మన మనోదృషి దర్శనాలు సంపూర్తి అవుతాయి.నిజానికి ఈ క్షేత్రము దక్షిణమూర్తి రూపమైతే..ఉజ్జాయిని క్షేత్ర జ్యోత్లిలింగము దక్షిణామూర్తి శివలింగమవ్వడము విశేషము.ఇలా ఈ దర్శనాలు మనకి పూర్తీయితే మనము ఈ క్షేత్రములో చేసే శివతారకమంత్ర తపస్సు పూర్తి అయ్యినట్లే..దీనికి 13 రోజుల నుండి 13 సం!!రాలు పడుతుంది.ఈ లోపు మనకి ఈ దర్శనాలు సంపూర్తిగాకపోతే మొహమాటము లేకుండా ఈ క్షేత్రము నుండి మన ప్రమేయము లేకుండా అహము అడ్డువచ్చి గొడవలేర్పడి వెళ్ళేపోయిన యోగులు గూడ ఉన్నారు.అలాగే కొన్ని దర్శనాలు పొంది అరుణాజ్యోతి గా మారకుండా ఈ గిరి అంతర్గత గుహల యందు ఆత్మశరీరాలతో సాధన చేస్తున్న యోగులున్నారు.ఈ అరుణాగిరి యందు నా దేహ మాంస భౌతిక నేత్రాల దర్శనాలు అలాగే నా మనో దృష్టి నేత్ర దర్శనాలు సంపూర్తిగావడముతో ఇంత వివరముగా చెప్పడము జరిగింది.ఎందుకంటే నా ఆదిజ్ఞానజన్మ గౌతమ మహర్షిదని చెప్పాను గదా.ఆ జన్మలో నాకు పూర్ణాగ్ని బిందు దర్శనప్రాప్తి కాలేదు.అది ఇపుడు అయింది.కాకపోతే ఋభు మహర్షి గూడ మొదటి నుండి ఏమిలేదని..అంతా శూన్యమేని చెపుతూ వచ్చి చివరికి అరుణాగిరిలోని దక్షిణామూర్తి దర్శనము పొందడముతో ఈయనే శాశ్వతుడు..నిత్యుడని ఒప్పుకొని ఋభుగీత రచించి చెప్పడము జరిగింది.చివరికి నేనుగూడ ఇదే చేశానని నాకు అర్ధమైంది.అందుకే రమణ మహర్షి తన సమాధి మీద జరిగేది జరగక మానదు.జరగనిది ఎన్నడికి జరుగదు.అంటే మనము ముక్తిజీవులేమని..మోక్షజీవిగా మారడము ఎన్నడికి జరగదని ఆయన చెప్పకనే చెప్పిన అనుభవ నగ్నసత్యము అని తెలియటానికి నాకు 43 సంరాలు పట్టింది.అనగా మనలో జ్ఞానమున్నంత వరకు దక్షిణామూర్తి కనపడుతునే ఉంటాడు.జ్ఞానరాహిత్య స్ధితియే మోక్షమవుతుంది.అనగా అగ్ని వలన జ్ఞానాగ్ని..దీని వలన ఆలోచనాలు..దీని వలన అహము..దీని వలన ఆత్మరూపము..దీని వలన భావాలు నిరంతరగా మనకి కల్గుతున్నాయి.పోనీ వీటి అన్నింటికి కారణ అధార భూతమైన అగ్నిబిందువును నాశనము చేద్దామంటే అది నాశనము గాదు.పూర్ణబిందువుగా మళ్ళీ విభజన చెందుతుంది.అంటే ప్రవహించే పాదరసమును చేతితో విభజన చేస్తే అది పూర్ణబిందువులుగా మారి విడిపోతుందో అలా ఈ పూర్ణ అగ్నిబిందువు తత్త్వమున్నదని అనగా ఏక పూర్ణబిందువు నుండి అరుతత్త్వాలతో ఉన్న మూడు పూర్ణబిందువులు అనగా త్రిమూర్తులు విభజన చెందారని..ఆపై 5,7,9,11,13,15 అనగా 64 పూర్ణబిందువులుగా  ఏర్పడినాయని..ఇవికాస్త 64కోట్ల800 కోట్ల అత్మపూర్ణబిందులుగా మారి అండ,పిండ,బ్రహ్మండాలుగా మారినాయని....పైగా అరుణాబిందు కాంతిని ఆకులు తింటాయి.వీటిని మేకలు తింటే వీటిని పుల్లులు తింటే వీటిని మృత్యువు తింటే..దీనిని కాలము తింటే దీనిని మహా కాళిక తింటుంది.ఈవిడే మూడు ప్రకృతులను తిని నాలుగువ ప్రకృతి అయిన అరుణాక్షేత్రమునకు వచ్చి పూర్ణాగ్ని బిందువును తినేలోపుల ఇక్కడ దక్షిణామూర్తి కాస్త ఈమె ముందు బాలశివుడిగా మారి ఏడూస్తూ కనిపించగానే ఉగ్రరూప కాళీమాత కాస్త శాంతమూర్తిగా మారి చంపటానికి వచ్చిన విషయము మర్చిపోయి అనగా అపసార్మకస్ధితిని పొందే చంపే శివుడికి ఒక తల్లిగా మారి చనుపాలు ఇస్తుంది.ఈ లెక్కన ఇక మనకి మోక్షము ఏముస్తోంది.నా బొంద..నా బూడిద.అసలు మేదాదక్షిణమూర్తికి శాశ్వతమరణము పొందాలని అనుకోవడము లేదని చాలా మంది అనుకుంటారు.కాని ఆయన కాదు.ఆయన బింబమైన మనము శాశ్వతమరణము పొందాలని అనుకోవడము లేదు.ఈ ఆలోచన చేస్తున్నాము కాని ఆచరణ చెయ్యలేకపోతున్నాము.అనగా బ్రతకటానికి ఏర్పాట్లు చేసుకొని చావటానికి ప్రయత్నానాలు మనము చేస్తున్నాము.ఆయనేమి చెయ్యడు.ప్రతిదానిని సాక్షిభూతముగా చూస్తూంటాడు.అద్దములోని ప్రతిబింబములాగా..ఎందుకంటే అరుణాగిరి అద్దము...ఇది మన ఆత్మపదార్ధ స్వరూపముగా ఈయనను చూపిస్తోంది.పదార్ధ మాయను దాటితే కాని యదార్ధ మోక్షము మనకి లభించదని..అది ఎన్నడికి ఎవరికి  సాధ్యపడదని ఎందుకంటే బలహీనత లేని బలవంతుడిని ఇంతవరకు భగవంతుడు సృష్టించలేదని   తెలియడముతో నేనుగూడ మౌనము వహించి ఆత్మసన్యాసిదీక్ష తీసుకొని ఈ అరుణాచల క్షేత్రములో ఈ జన్మలో పంచముక్తులలో ఏ ముక్తి వస్తోందో తెలుసుకోవటానికి ఈ దేహము కాస్త అరుణాగిరి యాత్ర ఆరంభించింది.

26-12-2021 తేదిన నాడు  ఈ దేహము కాస్త అరుణాచల క్షేత్రమునకు చేరుకుంది. యధావిధిగా అక్కడున శివలింగ దర్శనాలు..గిరిప్రదక్షిణము పూర్తిచేసుకొని  3-1-2022 తేదిన నాడు కాషాయవస్త్రముతో ఆత్మసన్యాసి దీక్షను తీసుకొని ఒక అంతర్గత గుహను చేరుకొని అక్కడ శివ రామ తారకమంత్రమైన నమ:శివాయ ను ఒక ధ్యానతపస్సు గా చెయ్యడము ఆరంభమైంది.48 ని నుండి మొదలై 20 గంటలు పైగా అవిశ్రాంతి 10 రోజులు కొనసాగుతుండగా...ఒక రోజు 13-1-2022 తీవ్రమైన ధ్యానతపస్సులో ఉండగా నా మనోదృష్టి యందు అరుణాగిరి అలాగే దీనిని చుట్టు ఉన్న నాలుగు శిఖరాలు కనిపించిన మరుక్షణములో..ఈ అరుణగిరి కాస్త అగ్నితో ఉన్న పరమలింగముగా దర్శనమైంది.  ఆ తర్వాత దీని ముందు ఉన్న నాలుగు శిఖరాలు కాస్త బ్రహ్మ మానస పుత్రులైన సనకనాందులుగా అను నలుగురుగా లీలగా అగుపించారు.ఆ తర్వాత ఈ అరుణాగిరి కాస్త ఆ తర్వాత ఎంతో మంది గుప్తయోగులు..పూర్ణజ్ఞానులు.. అస్ధిపంజరాలు..సకల దైవ స్వరూపాలు..వివిధలోకాలలో ఉన్న పుణ్యాత్మ జీవులు కాస్త తమ ఆత్మశరీరాలతో ఈ కొండ  అగ్రభాగము చుట్టు మూడు లేదా అయిదు ప్రదక్షిణాలు చేసి ఈ అగ్రభాగములో ఉన్న దీపజ్యోతి స్ధానములో ఉన్న బ్రహ్మరంథ్రము గుండా లోపలకి వెళ్ళడము లీలగా నాకు అగుపించింది. ఆ తర్వాత కొన్ని క్షణాలు తర్వాత  ఈ గిరి అగ్రభాగములో దీపజ్యోతి స్ధానములో పద్మకార రాతి అగ్ని శివలింగము అగుపించింది.దీని ప్రక్కనే ఉన్న రుద్రపాదాల స్ధానములో నాకు కాస్త హిమాలయ కైలాస పర్వత ఆదియోగి అయిన సదాశివుడు కాస్త ధ్యానయోగిగా మారి ధ్యానతపస్సు చేస్తున్న ఆత్మస్వరూపము దర్శనం అయింది.అంటే ఈ క్షేత్రానికి అదిశివుడే క్షేత్రపాలకుడిగా..క్షేత్ర దైవముగా శ్రీ మేధా దక్షిణామూర్తిగా ఉండటము జరుతోందని నాకు అర్ధమైంది.మరి ఈ దక్షిణామూర్తి  దర్శనము ఇంక కల్గడము లేదని అనుకుంటున్న సమయములో నాకు ధ్యానభంగమైంది.
అపుడు ఆత్మవిచారణ చేసుకొంటే రమణా మహర్షి అనుభవాలు ప్రకారము చూసుకొంటే ఈ అరుణాగిరి లోపల ఉన్న అంతర్గత గుహ యందు సిద్ధయోగిగా ఆత్మస్వరూపముతో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూపముతో సజీవమూర్తిగా ఇపుడికి ఆవాసము చేస్తున్నారని..కాకపోతే ఈయనను భౌతిక దేహముతో కాని భౌతిక నేత్రాలతో దర్శించుకోవడము ఎన్నడికి సాధ్యపడదని చెప్పిన విషయము నాకు లీలగా గుర్తుకు వచ్చింది.ఏమి చెయ్యాలో..ఏలా ఈయన దర్శనము పొందాలో నాకు అర్ధము కాలేదు. మళ్ళీ నేను తిరిగి ధ్యానములో కూర్చున్నాను. నా మనో దృష్టి యందు యధావిధిగా ఎపుడిలాగా కనిపించే ఒక స్త్రీ మూర్తి కుడి అరచెయ్యి కనిపించింది..ఈ సారి ఈ చెయ్యి మీద చిదంబర క్షేత్రములో నా కంఠము నందు పెకిలించిన స్ఫటిక జ్ఞాన శివలింగము దర్శనం అయి>ది.అంటే ఈ మహాతల్లి ఎవరో కాని నా శివలింగమును ఇంక భద్రముగానే దాచినదని అనుకోనేలోపులే...ఈ చెయ్యి తనకి లోగడ ఆరు మణులు చూపించిన చెయ్యి ఒక్కటేనని నేను తెలుసుకొనే లోపు ఈ చెయ్యి అనేది ఈ క్షేత్ర అమ్మవారిది అని గ్రహించేలోపు ఈ శివలింగమును ఒక అంతర్గత సొరంగ మార్గములో ఉన్న జలములో పడివేసినట్లుగా లీలగా నాకు అగుపించింది.ఈ మార్గము చూడగానే నా సాధన కాస్త సహస్ర చక్రములో ఉన్నపుడు ఈ మార్గము ద్వారా నా సూక్ష్మశరీరయానముతో శ్రీ మేధా దక్షిణామూర్తి అర్ధశరీర భాగ దర్శనము చేసుకున్న విషయము నాకు జ్ఞాపకము వచ్చింది.అంటే ఇపుడు ఈయనను పూర్ణజ్ఞానముతో..పూర్ణస్వరూప దర్శనమును తన జ్ఞాన శివలింగ యానముతో ఈ ఆత్మశరీర యానము చేసి దర్శనపొంది ఆపై తన ఆత్మలింగము కాస్త ఈ పరమలింగము నందు కైవల్యముక్తియగు మోక్షమును పొందుతుందని ఈ దేహనికి జ్ఞానస్ఫురణ పొందడముతో ఈ దేహత్మ కాస్త ఆత్మనందస్ధితి పొందసాగింది.ఏన్నో కోట్లానుకోట్ల సం!!రాలు పాటు అవిశ్రాంతిగా ఏన్నో కోట్లానుకోట్ల జన్మాలు ఎత్తి నానా అగచాట్లు పడి ఆత్మశాంతిని పొందలేదు.ఇపుడు ఈ తరుణములో అరుణగిరి యందు తన ఆత్మకి శాశ్వతమరణమును పొంది ఆత్మశాంతి పొందుతూందని  ఘంటాపధముగా తెలియడముతో ఈ దేహత్మకి అలివికాని..అలౌకిక ఆత్మానంద స్ధితిలో ఉండిపోగసాగింది.

పూర్ణశూన్య స్ధితి: 

నిజానికి నేను అనేది శూన్యభావమైతే..నేను కాని నేను అనేది పూర్ణశూన్యస్ధితి అనే అనుభవానుభూతిని పూర్ణసాధకుడు పొందవలసిన అంతిమస్ధితి...కాని ఇది సాధకుడికి అందకుండా నేను కాని నేను గా అరుణాచలగిరి యందు దక్షిణమూర్తి ఆత్మస్వరూపము మనకి అడ్డుగా నిలుస్తోందని నాకు అర్ధమైంది.ఈయన ఉన్నాడనే భావము మనకి తొలగాలంటే బలహీనత లేని బలవంతుడిగా మనము మారాలి.జీవుడికి బలహీనత కామమైతే..శివుడికి జ్ఞానము కాస్త బలహీనతగా మారుతోందని నాకు అవగతమైంది.జీవుడు ఎపుడికి తన బలహీనత అయిన కామమును ఎన్నడికి జయించడముండదు.కాని ఇంద్రియానిగ్రహముతో అదుపులో పెట్టుకోవచ్చును.దీని వలన తనకున్న ఈ బలహీనతను జీవుడు జయించినట్టు కాదని నాకు అర్ధమైంది.అలాగే శివుడు గూడ తన బలహీనతాయైన జ్ఞానమును గూడ దాటలేకపోతున్నాడు.ఈయన మౌనముగా ఉన్నగూడ ఈ మౌనభాషను ఆధారము చేసుకొని సనకానందాలు అలాగే సప్తరుషులు బ్రహ్మజ్ఞానమును పొందిన విషయము లోకవిదితమే గదా.అంటే ఈ లెక్కన జీవుడు లేదా శివుడు కాస్త తమకున్న బలహీనతలను రాహిత్యస్ధితిని పొందితే కాని మనకి పూర్ణశూన్యస్ధితిని పూర్ణజ్ఞాన అనుభవ అనుభూతిని పొందలేమని నాకు అర్ధమైంది.   

ఈ రాహిత్య స్ధితిని జీవుడు పొందాలంటే నేను కాస్త నేను కాని నేను గా మారాలి.అనగా జీవుడు కాస్త శివుడు అవ్వాలి.అంటే శివోహం స్ధితిని పొందాలి.ఇంతవరకు బాగానే ఉండి.ఇలాంటి శివోహం స్ధితిని ఇపుడికే ఆదియోగి దక్షిణామూర్తి పొందిన ఆయన తన బలహీనతయైన జ్ఞానరాహిత్య స్ధితి పొందలేకపోయాడు గదా.ఈ లెక్కన నేను గూడ శివోహం స్ధితిని పొందిన ఎలాంటి ఉపయోగము లేనట్లే గదా.ఎందుకంటే ఇలాంటి శివోహం స్ధితిని ఆనాటి వశిష్ఠమహర్షి నుండి ఈనాటి రమణమహర్షి వరకు ఈ స్ధ్తితిని పొందినగూడ జ్ఞానరాహిత్య స్ధితిని పొందకుండా మరో జ్ఞానశివుడిగా మారి లోకపూజ్యులై లోకానికి కొత్తదేవుడిగా..కొత్తగురువుగా మారారు.అంటే ఈ శివోహం స్ధితి వలన ఎలాంటి ప్రయోజనము లేనట్టే గదా.కాని జీవుడు ఎపుడికైనా శివుడు కాక తప్పదు.ఎందుకంటే నేను అనేది నేను కాని నేను గా మారక తప్పదు.దంతాలు రాలుకోవటానికి జీవుడైన లేదా శివుడైన ఏ రాయి అయిన ఒక్కటే గదా.గాకపొతే ఒకడు మాయప్రపంచములో ఉంటే మరొకడు జ్ఞాన ప్రపంచములో ఉంటాడు.కాని ఈ శివోహం స్ధితిలో మనకి తెలియని మర్మరహస్యము ఏదో ఉన్నదని నాకు బలముగా అనిపించసాగింది.అది ఏమిటో నాకు తెలియాలంటే నేను కాస్త శివోహం గా మారితే కాని తెలియదు అని నాకు అర్ధమైంది.

దానితో దక్షిణామూర్తి ఆరాధన మొదలైంది.ప్రతిరోజూ లింగజ్యోతి దీపారాధన అనగా ఈ దీపము అనేది శివలింగము ఆకారములో ఉండి లింగభాగములో దీపపు ఓత్తి ఉంటుంది.దీనిని వెలిగిస్తే లింగజ్యోతి అవుతుంది.ఇలా 41 రోజులు చేశాను.అపుడికే ఈ దేహము కాస్త పూర్ణజ్ఞానమునకు ఒక అడుగు దూరములో ఉండుటవలన ఈ సాధన చాలా తేలిక అయింది.ఇది ఇలాయుండగా 
1-3-2022 మహాశివరాత్రి నాడు మళ్ళీ నేను మరియు నా యోగమిత్రుడైన జిజ్ఞాసితో కలిసి అరుణాచలమునకు చేరుకున్నాము.ఇదే రోజు అనుకోకుండా ఈ దేహము కాస్త తీవ్ర ధ్యాననిష్థలో ఉండగా యధావిధిగా నాకు ధ్యానము నందు అరుణగిరి కనపడింది.కొన్ని క్షణాలు తర్వాత ఈ గిరికి ఎదురుగా ధ్యాననిష్థలో ఈ దేహముండి అదిగూడ నీలివర్ణముతో మరో శివుడిలాగా నా అత్మ శరీరము కనిపించసాగింది. అంటే ఈ దేహము కాస్త శివోహం స్ధితి అనగా మరో జ్ఞానశివుడిగా మారినదని నాకు అర్ధమైంది.ఉన్నట్టుండి ఈ స్ధితిలో ఉన్న నాకు విపరీతమైన కీర్తికాంక్ష అలాగే ధనకాంక్ష మరియి జ్ఞానాంహకారాలు మొదలైనాయి.అంటే సాధకుడు ఈ స్ధితిలో ఈ మూడింటిలో దేనికి ఆశపడకుండా..భయపడకుండా..స్పందించకుండా ఉండగల్గితే అదిగూడ 48ని..పాటూ స్ధిరచిత్తముతో ఉండగల్గితే కాని అన్నింటాయందు రాహిత్యస్ధితిని అనగా వీటికి మూలమైన జ్ఞానరాహిత్య స్ధితికి సాధకుడు చేరుకోలేడని నాకు జ్ఞానస్పురణ అవుతుండుగా ధ్యానభంగమైంది.కాని నిజానికి ఈ రాహిత్యస్ధితి పొందడము అంతతేలికైన స్ధితి కాదని నాకర్ధమైంది.ఎందుకంటే ఈ రాహిత్యస్ధితిని పొందటానికి ఆదియోగి మేధా దక్షిణామూర్తి దాదాపుగా ఏన్నో కోట్లానుకోట్ల సం!!రాల నుండి ప్రయత్నాలు చేస్తున్నాడని..మరిదేని వలనో విఫలము చెంది ఇక్కడ నుండి తిరిగి తిరోగమనము చెంది తను అపుడికే నాశనము చేసిన మూడు ప్రకృతులను పున:సృష్టి చేస్తున్నాడని ఎందుకంటే శివుడి నాలుగవ స్ధితి తిరోగమనమని చెప్పిన శాస్త్రవచనము ఉండనే ఉన్నది గదా.మరి ఈయన దేని వలన ..దేనికోసము.. ఈ జ్ఞానరాహిత్య స్ధితి పొందలేకపోతున్నాడో తనకి తెలియాలంటే లేదా నాకు తెలియాలంటే ఈ శివోహం స్ధితిలో ఈ దేహము కాస్త 48 ని..పాటు దేనికి స్పందించకుండా ఉండగల్గితే ఇక్కడ ఉన్న మర్మము గూర్చి ఈ దేహనికి జ్ఞానస్ఫురణ అయ్యే అవకాశమున్నదని నాకర్ధమైంది.దానితో శివోహం సాధన మొదలైంది.ఈ దేహము కాస్త తిరిగి జ్ఞానశివుడిగా మారుతున్న సమయములో విపరీతమైన ఆత్మానంద స్ధితికి ఈ దేహము కాస్త చేరుకోవడముతో ఆ రోజుకి నాకు ధ్యానభంగమైంది.అపుడుకి ఈ స్ధితిలో ఈ దేహము కాస్త 18ని.. ఉన్నదని నాకర్ధమైంది.ఇలాగాదనుకొని కొన్నిరోజులుపాటు ఏకధాటిగా ధ్యానములో కూర్చున్నాను.ఇలా ఒకరోజు ధ్యాననిష్టలో ఉండగా నాకు యధావిధిగా అరుణాగిరి కనపడింది.ఇది కాస్త అర్ధశరీరభాగముతో ఉన్న నల్లటి ఆకార దక్షిణామూర్తిగాను..ఆ తర్వాత శ్రీచక్రముగాను..ఆటుపై పాముపుట్టగా..ఆపై స్ఫటిక పరమలింగముగా..ఆపై అగ్ని తేజస్సుతో ఉండి విచ్చుకున్న తామరపువ్వుగా కనపడి..ఇది కాస్త ఒక పిరమిడ్ మారి తనచుట్టు తాను విపరీతముగా భ్రమణము చేస్తున్న మనోవేగానికి నా మనోదృష్టి అందుకోలేకపోవడముతో ఆ రోజుకి నాకు ధ్యానభంగమైంది.అపుడు విశ్లేషణ చేసుకుంటే దక్షిణామూర్తి కాస్త జ్ఞానమునకు ప్రతీకయైన తామరపువ్వులోని అగ్ని తేజస్సును దాటితే కాని జ్ఞానరాహిత్యస్ధితిని తను పొందలేడని...అలాగే ఈ స్ధితిని పొందే అవకాశము ఉండుటవలన ఈ గిరి చివరిలో పిరమిడ్ గా మారి భ్రమణము చేసిన దృశ్యమును బట్టి చూస్తే సాధకుడు కాస్త తప్పనిసరిగా జ్ఞానరాహిత్యస్ధితిని పొందుతాడని నాకర్ధమైంది.అంటే ఇలా తిరిగే ఈ గిరి పిరమిడ్ ఎపుడికైనా శూన్యమై పూర్ణశూన్యమునందు లయము చెందుతుందని నాకు అవగహన అయింది.ఇంతవరకు ఇది బాగానే ఉంది.ఈ పూర్ణశూన్యస్ధితిని పొందలంటే సాధకుడు కాస్త జ్ఞానరాహిత్య స్ధితిని పొందాలి గదా.ఈ స్ధితిని పొందాలంటే అగ్నితేజస్సు ఉన్న తామరపువ్వు స్ధితిని దాటాలి గదా అనుకొనేసరికి కధ మళ్ళీ మొదటికే వచ్చి ఆగింది గదా అనిపించసాగింది.అసలు ఈ తామరపువ్వు విషయములో ఏదో మర్మము దాగిఉన్నదని నాకర్ధమైంది.

అపుడు ఈ పద్మము గూర్చి విశ్లేషణ చేసుకుంటే భౌద్ద ధర్మములో ఈ జ్ఞానపద్మమును మణిపద్మముగా..అదే హైందవ ధర్మములో దీనిని మంత్రపుష్పముగా పిలుస్తున్నారని..అలాగే బుద్ధుడు కాస్త ఈ మణిపద్మమును హిమాలయాలలోని కైలాష పర్వతములో ఉన్న శంభలగ్రామములో ఉన్న చింతామణి ఉన్న పద్మమును చూసి అదే మణిపద్మము అనుకున్నాడని నిజానికి ఈ మణిపద్మము అనేది అరుణాగిరిలోనే ఉన్నదని నాకు జ్ఞానస్ఫురణ అయింది.పైగా ఈ పద్మములో అగ్నితేజస్సుకి కారకమైన బాడవాగ్నికి మూలమైన అగ్నిశిఖ అని..అలాగే ఈ అగ్నిశిఖ యే మణి అనుకుంటున్నారని నాకు అవగతమైంది.ఇంతవరకు బాగానే ఉంది.అంటే ఏ సాధకుడైతే ఈ అగ్నిశిఖకి చేరుకుంటాడో వాడికున్న జ్ఞానము కాస్త ఈ అగ్నిశిఖ ఉన్న అగ్నిశిఖలకి జ్ఞానాగ్నిగా మారి జ్ఞానరాహిత్య స్ధితిని పొంది ఆపై పూర్ణశూన్యస్ధితికి చేరుకుంటాడని నాకు అవగతమైంది.అంటే కధాంత గూడ ఈ జ్ఞానపద్మము చుట్టు ఉన్నడని నాకర్ధమైంది.ఈ లెక్కన ఈ అరుణాగిరి యందు అంతర్గతముగా జ్ఞానపద్మము అదిగూడ బంగారపు జ్ఞానపద్మ బంధనము ఉండి ఉండాలి.ఎందుకంటే ఈ గిరి అగ్రభాగములో నాకు ధ్యానదృశ్యముగా పద్మాకార శివలింగ దర్శనము అలాగే పద్మాకార ఆసన స్ధితిఉన్న అగ్నిశివుడి దర్శనాలు బట్టి చూస్తే ఈ కొండ లోపుల ఈ జ్ఞానపద్మ నిగూఢ రహస్యము దాగిఉన్నదని నాకర్ధమైంది.దానితో ఈ మర్మమును చేధించుటకు నా పూజబీరువాలో ఒక చిన్న సైజులో అరుణాచల క్షేత్రమును ఏర్పాటును మహశివరాత్రికి చేసుకున్నాను.ఎందుకంటే ఆ క్షేత్రములో పజిల్ గా ఉన్న జ్ఞానపద్మ కోడ్ ను డీకోడ్ చెయ్యాలంటే అసలు ఈక్షేత్రములో ఏర్పాటుతో ఈ జ్ఞానపద్మ బంధనము జరిగినదో నాకు తెలియాలంటే ఆ మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతే కాని ఎక్కడో ఒకచోట ఎదోఒక కోడ్ తో ఇది డికోడ్ అవ్వదు.అపుడే మనము ఈ జ్ఞాన రాహిత్య స్ధితిని పొందలేము గదా.అందుకే ఈ క్షేత్రమును నా ఇంటిలో అనగా గిరి చుట్టున్న అష్టలింగాల బంధనము అలాగే కొండపైన కనిపించిన ధ్యానశివుడు మరియి పద్మాకార శివలింగము అలాగే ఈ గిరి లోపున నాకు కనిపించిన దక్షిణామూర్తి రూపమును ఏర్పాటు చేసుకున్నాను.ఇక్కడ మీకు చిన్న సందేహము రావచ్చును.అది ఏమిటంటే ఈ గిరి యందు ఎందుకు ఈ పద్మాకార నాగలింగ బంధనము చేశారు అన్నపుడు...ఆదిలో ఆదియోగి ఈ నాలుగు ప్రకృతులను ఏర్పారచి తను కాస్త ఆత్మానంద జీవసమాధిలోనికి వెళ్ళి..ఈ ప్రకృతులలో తన లీలావిన్యాసము వలన ఏర్పడిన జీవనాటకమును జీవపాత్రలతో చూస్తూ కల విన్యాస ఆనందము పొందుతూండగా ఉన్నట్టుండి ఈయన దేహము నుండి ధ్యానాగ్ని కాస్త జ్ఞానాగ్ని మారి అది కాస్త బడావాగ్ని మారి తను ఏర్పరచిన ప్రకృతులలో మూడు ప్రకృతులు కాస్త అగ్నికి ఆహూతి అవుతుండగా ఇది తెలుసుకున్న మహర్షలు..యోగులు..గురువులు..దైవాలు కాస్త ..అరుణాగిరికి చేరుకొని బడావాగ్ని బయటికి రాకుండా గిరి లోపుల అగ్నితీర్ధమును ఏర్పరచి అందులో బడావాగ్నికి మూలమైన అగ్నిశిఖను నాగలింగభైరవితో బంధనము గావించి..కొండపైన ఈ అగ్ని బయటికి రాకుండా పద్మాకార శివలింగబంధనము చేసి..ఆపై ఎపుడికి కపుడు కొండ లోపుల ఉన్న అగ్నితీర్ధము ఎండకుండా ఉండటానికి నిత్యము కమండముతో నీళ్ళి పోసే విధముగా పద్మాకార బంధనముతో అగ్నిశివుడిని ఏర్పాటు చేసి ఈ గిరిచుట్టు ఎలాంటి మంత్రప్రయోగాలు పనిచెయ్యని విధముగా పద్మకార గిరిగీతను న్యూక్లియర్ రేడియోషన్ శక్తితో ఏర్పాటు చేసి..ఈ బంధనాల జ్ఞానము గూర్చి ఒక దక్షిణామూర్తికి ఉంటేటట్లుగా ఏర్పాటుచేసి..ఎవరైతే ఈ అంతిమ జ్ఞానశివోహం స్ధితికి వస్తారో వారు కాస్త తమకి తెలియాకుండానే అపస్మారక స్ధితిని పొందేటట్లుగా ఏర్పాటు చేసారని...ఇదింతా చెయ్యడము వలన బడావాగ్నికి ఈ నాలుగవ ఆహూతి కాకుండా ప్రకృతి నిలబడినదని..తద్వారా ఈ అంతిమస్ధితి పొందిన సాధకుడు కాస్త తాము ఏర్పాటు చేసిన పద్మాకార నాగబంధనము వలన అపస్మారక స్ధితిని పొంది ఏదో ఒక కోరిక మాయకి గురీయై ఇక్కడనుండి తిరోగమనము చెంది అనగా శాశ్వత మరణమగు మోక్షమును పొందకుండా తిరిగి తన పొందిన కోరిక మాయ కోసము పున:జన్మలెత్తే మూడు ప్రకృతులలో జన్మాలెత్తడము జరుగుతోందని నాకర్ధమైంది.అంటే ఇక్కడ ఉన్న జ్ఞానశివుడు కాస్త జ్ఞానరాహిత్య ఆపై తను లేదు..తను శాశ్వతుడు గాడని అనే పూర్ణజ్ఞానము అందకుండా దేవుడు ఛేసిన మనష్యులు కాస్త మనష్యులు చేసిన దేవుడిగా తమ జ్ఞానముతో జ్ఞానపద్మాకారబంధనము ఏర్పాటు చేసినారని మీకు ఈపాటికి అర్ధమై ఉంటుంది.నాకు అర్ధమైంది అంటే మీకు అర్ధము కాకుండా ఉంటుందా?మీకు అర్ధమైనదని నాకర్ధమైంది.

దానితో ఈ అరుణాగిరి మీద ఉన్న జ్ఞానపద్మాకార నాగశివలింగ బంధనము యొక్క కోడ్ ను డీకోడ్ చెయ్యడటానికి నా పూజబీరువాలో ఏర్పాటు చేసుకున్న అరుణాగిరి క్షేత్రమును మీద మహశివరాత్రి నాడు ఉదయము 6 గం నుండి మర్నాడు ఉదయము 6 గం దాకా మౌనదీక్షతో ..అరుణాచల శివా..నామస్మరణ చేస్తూ..ఉపవాసముండి..జాగరణతో..అఖండ లింగ జ్యోతి దీపారాధన చేస్తూ..ధ్యాననిష్థకి వెళ్తూ..ధ్యానములో కనిపించిన దృశ్యాలతో నా పూజ గదిలో ఉన్న ఈ క్షేత్ర లింగాలను చీటికి మాటికి మారుస్తూ...చివరికి ఆఖరుగా ఈ జ్ఞానపద్మాకార బంధనము డీకోడ్ అయినదని ధ్యానానుభవము పొందడము జరిగింది.ఇది  ఏలా జరిగినదో లోకానికి చెప్పరాదని నా దగ్గర ఈ కోడ్ ను డీకోడ్ చెయ్యటానికి సహయము చెసిన  ఈ గిరి మీద ఉన్న 18 సిద్దగురువులు మాట తీసుకోవడముతో ఆ చేసిన విధివిధానము చెప్పడము లేదు.అలాగే ఆదిలో ఈ బంధనము వేసిన మహర్షులలో నేను ఒకడిని గావడము వలన ఈ బంధవిముక్తికి ఈ సిద్దగురువులు సహకరించడము జరిగింది.అలాగే దక్షిణామూర్తికి బంధవిముక్తి పొందడము జరిగింది.ఆదిలో అదియోగి గావాలని బంధనము పొందాడు.ఈనాడు అయనికి ఆయన బంధవిముక్తి పొందాలని అనుకున్నాడు.ఇది జరిగింది.ఆయన సంకల్పమును బట్టి ఈ మట్టి పాత్రలు తమ పాత్రధారిగా మారతాయని..ఈ పాత్రలో ఉండి  నదిపించేది ఆయనేనని లోకవిధితమే గదా..చేసేవాడు ఎవ్వడు..చేసేదెవ్వరు..చేయించేదెవ్వరు..అంతా ఒక్కడే..అంతా ఒక్కటే..అదే ఏకత్వము..ఏకము..అద్వైతము...ఇపుడు దాకా తను ఉన్నాను అనే జ్ఞానములో ఉన్నాడు..ఇపుడు తను లేదు..ఏది లేదు అనే పూర్ణజ్ఞానస్ధితిని పొందాడు.

ఇక శివరాత్రి మర్నాడు ఉదయము అనగా ఇంక శివరాత్రి ఘడియాలు మిగిలి ఉండగా నాకు ధ్యాననిష్థ యందు మనోదృష్టికి అరుణాగిరి కనపడింది.ఆ తర్వాత ఈ శిఖారగ్రాభమున వెలుగుతున్న ఒక పెద్ద ప్రమీద కనపడింది.ఆ తర్వాత ఈ దీపజ్యోతి కాంతి నుండి ఒక అగ్నిశిఖ కనపడింది.ఈ శిఖ లోపలకి వెళ్ళితే..ఆకాశము నందు మొదట పద్మాకార బంగారపు శివలింగము దర్శనమైంది.దీనిపైన ఒక పద్మాకార స్ఫటిక శివలింగము..దీనిపైన ఒక నల్లని పద్మాకార శివలింగము..దీనిపైన తెల్లని పద్మాకార శివలింగదర్శనమైనాయి. ఆతర్వాత ఎక్కడనుండో  పాదరసపు వర్ణమున్న ఒక పాము వచ్చి ఈ తెల్లగా ఉన్న   పద్మాకార శివలింగము మీద పాకగానే తెల్లగా ఉన్న ఈ శివలింగము కాస్త పాదరస శివలింగముగా మారింది.అంతలో దీని ప్రక్కనే అగ్నిజ్వాలలతో మండుతున్న ఏర్రటి వర్ణముతో ఉన్న బడావాగ్ని అగ్నిశిఖ యందు ఈ శివలింగము ఐక్యమవ్వడముతో...కంఠాభరణము ఉన్న దివ్య కాంతి ఉన్న మెడ భాగమున్న శరీరము లీలగా కనపడింది.ఈ కంఠము మధ్యభాగములో అంగుళ పరిమాణమున్న ఒక పాదరస శివలింగము దర్శనమైంది.ఈ లింగము కాస్త గొంతు నుండి కడుపులోనికి వెళ్ళే దృశ్యము ఆతర్వాత మండుతున్న ధ్యానములో ఉన్న అస్ధిపంజరము కనపడింది.ఈ దేహము ఏవరిది అనుకొనేలోపుగా... అరుణాగిరి కాస్త పిరమిడ్ గా మారి తన చుట్టు తాను తిరుగుతూ పూర్ణశూన్యమవ్వడానికి సిద్ధమవుతూండగా..ఈ గిరి యందు నా ఆత్మశరీరము శివైక్యము చెందటానికి మనో ప్రయత్నము మొదలుపెట్టినదని నాకు అనగా ఈ సూక్ష్మశరీరానికి అవగతంవుతూండగా..ఈ మహత్తర దృశ్యము గూర్చి చెప్పటానికి ఈ దేహనికి వీలు లేని విధముగా ఈ దేహ జ్ఞాన నేత్రము కాస్త జ్ఞానాగ్నికి దగ్ధమవుతూండగా..ఈ ధ్యానానుభవ దృశ్యమును కాస్త కొన్ని యోగప్రక్రియలు ద్వారా నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి అందించడము జరిగింది.అంటే ఈ లెక్కన చూస్తే నా ఆత్మశరీరము కాస్త ఆత్మలింగముగా మారి పరమలింగము అగు ఈ అరుణాగిరియందు లయము చెంది జ్ఞానరాహిత్య స్ధితిని పొంది ఆపై అనాదిగా ఉన్న పూర్ణశూన్యమునందు లయము చెందుతుందని నాకు అంతిమ ధ్యానానుభవము కల్గుతుండగా..దీనిని అనుభూతి పొందడానికి నా ఆత్మశరీరము కాస్త ఈ గిరి యందు ఐక్యము చెందుటకు అంతిమయాత్రను మొదలుపెట్టినదని..అనగా నేను అనేది కాస్త నేను కాని నేను మారి..అపై ఇది కాస్త నేను లేను అను పూర్ణజ్ఞానము పొందడముతో..పూర్ణశూన్యము నందు నేను అనే శూన్యభావము కాస్త శూన్యమైపోయి..నేను అలాగే నేను కాని నేను అను ఈ రెండు స్ధితులు కాస్త  ఏకమై ...లేని స్ధితి  అనగా అనాదిగా ఉన్న పూర్ణశూన్యమవుతాయి.అంటే ఈ లెక్కన విశ్వానికి..విశ్వాసానికి మోక్షము ఆరంభమైంది. 

ఈ దేహము కాస్త అరుణాగిరి యందు తన ఆత్మశరీరమును శివైక్యము చెందటానికి అలవికాని ఆత్మానంద స్ధితిని ధ్యాననిష్ఠలో పొందుతూండగా..ఇంతలో..నా అంతిమ మోక్షస్ధితి ధ్యానానుభవాలు నా యోగమిత్రుడైన జిజ్ఞాసి యొక్క మనోదృష్టికి వచ్చేవిధముగా యోగప్రక్రియలు చేసి నా ఆత్మయానమును నా జ్ఞానశివలింగ యానముతో ప్రయాణము చెయ్యడము ఆరంభించాను.


 దేవతలు తిరిగే గిరి ప్రదక్షిణము చేసి ఈ మార్గము ఒక అంతర్గత సొరంగ మార్గము ద్వారా నాలుగు దారులను అనగా మొదటి మార్గము జ్ఞానలింగముగా మారి దాటగా రెండవ మార్గమును ఆత్మలింగముగా మారి మూడవ మరియు నాలువ మార్గాలను నీలి రంగు ఆత్మజ్యోతి గాను..ఆపై ఎర్రని వర్ణ అరుణజ్యోతిగా మారి ఈ శిఖర అగ్రభాగానికి చేరుకొని అక్కడ ఉన్న అగ్నిలింగమైన పద్మకార శివలింగమునందు ప్రవేశించి..ఈ గిరి లోపుల ఉన్న మేధా దక్షిణామూర్తి యొక్క ఆత్మస్వరూప దర్శనము గావిస్తుండా,,అపుడికే ఈయన చుట్టు ఉన్న సకల  దేవతలు,మహర్షులు ఈ అరుణజ్యోతి ని చూస్తూ అరుణాచల శివ..అరుణాచల శివ అను నామమును తీవ్ర స్ధాయిలో చేస్తూండగా దక్షిణామూర్తి మూడవ కన్ను త్రినేత్రము తెరుచుకోవడము...జ్ఞానాగ్ని కాంతి ఈ జ్యోతి మీద పడి కైవల్యముక్తి మార్గము మారడముతో..నాకు ధ్యానభంగమైంది.ఆ తర్వాత కొన్ని క్షణాలు తర్వాత నా ప్రమేయము లేకుండా నా మనస్సు తిరిగి తీవ్రమైన ధ్యాననిష్ట యందు లయం చెందుతూండగా..ఉన్నట్టుండి....

అరుణాగిరి పాదభాగము నుండి పై భాగము వరకు నాకు నాలుగు మార్గాల దారి లాగా అంటే మోతీ శంఖము మీద ఉన్న నాలుగు ఆవృత్తాలు లాగా నాకు ఈ మార్గము కనపడుతోంది.పైగా ఈ నాలుగు ఆవృత మార్గములో జల ప్రవహముంది.అపుడు నా కంఠములో ఉన్న స్ఫటిక శివలింగము కాస్త ఈ జలమార్గము ద్వారా క్రింద నుండి పైకి ప్రవహించి అరుణాగిరి అగ్రభాగానికి చేరుకొని...ఉన్నట్టుండి గిరి లోపలకి ప్రవేశించి అదృశ్యమైంది.ఆ తర్వాత నా కుడిచెవిలో ఉన్న నర్మదానది బాణలింగము కాస్త బ్రహ్మ ప్రతిష్ట దేవాలయమైన ఆది అణ్ణామలై అగ్నిలింగమునందు ఐక్యము చెందిన దృశ్యము కనిపించింది.ఆ తర్వాత నా మెడలో ఉన్న సహస్త్ర చక్ర ప్రతీకయైన స్ఫటిక బాణలింగము కాస్త అరుణగిరి అగ్రభాగానికి చేరుకొని తన చుట్టు తాను తిరుగుతూ...శరవేగంగా భ్రమణాలు చేస్తూ పంచవర్ణ అనగా తెలుపు,నలుపు,నీలము,పసుపు,ఎరుపు వర్ణ కాంతిరేణువులుగా విడిపోయి అదృశ్యమైన దృశ్యము కాన వచ్చింది.ఆపై అరుణాగిరి పర్వతము ముందు చిదంబర నటరాజ నాట్యభంగిమ రూపము సజీవముగా కనపడి ఈయన త్రినేత్రము నుండి ఒక కాంతిపుంజ కిరణము కాస్త నా త్రినేత్రము మీద పడిపడగానే..నాలో ఏదో తెలియని మాటలలో చెప్పలేని ఆత్మనంద స్ధితిని ఈ దేహము పొందుతూండగా..ఈ దేహము కాస్త ఈ అలివి కాని ఆనంద స్ధితిని తట్టుకోలేని స్ధితికి చేరుతూండగా నా అరికాలి పాదాలు దర్శనమిచ్చాయి.అందులో నా కుడిపాదము నందు పాదరస శివలింగమున్నట్లుగా అలాగే నా ఎడమ పాదము నందు అష్టదళ పద్మమున్నట్లుగా దర్శనమిస్తూండగా..ఉన్నట్టుండి నా పాదములో ఉన్న పాదరస శివలింగము కాస్త కదిలి మూలాధార చక్రము దగ్గరికి ప్రయాణించి..ఆపై స్వాధిష్టా చక్రమును దాటి..ఆపై మణిచక్రమునకు ఈ శివలింగమును చేరుకోగానే ఉన్నట్టుండి ఈ చక్రము వద్ద ఒక్కసారిగా ఓంకారనాదము పెద్దపెట్టున్న వినిపించడము ఆరంభమైంది.ఇది ఇలాయుండగా ఈ శివలింగము కాస్త మిగిలిన అన్ని యోగచక్రాలను దాటి బ్రహ్మరంధ్రమునకు చేరుకొని బయటికి రాగానే..అరుణాగిరి ముందు ఒక పురుషుడి పెద్ద కుడి అరచెయ్యి మీదకి నా పాదరసలింగము కనిపించింది.ఈ లింగము కాస్త భ్రమణాలు చెయ్యడము మొదలైంది.ఇంతలో ఈ చెయ్యి కాస్త ఈ శివలింగమును కాస్త అరుణాగిరి అగ్రభాగమునకు చేర్చగానే..ఇది కాస్త గిరి లోపలికి ప్రవేశించగానే..ఈ పాదరసలింగము నుండి ముఖలింగ భాగము విడిపోయి క్రింద ఉన్న అగ్నితీర్ధమునకు చేరుకోగానే...ఈ లింగభాగము కాస్త ఈ తీర్ధములో ఉన్న అగ్నిశిఖా యందు లయం చెందగానే..ఉన్నట్టుండి అరుణాగిరి అగ్రభాగము నందు ఎర్రటి అరుణాజ్యోతి దర్శనమవ్వడముతో తన ఆత్మలింగమైన పాదరస శివలింగము  అనేది అరుణాజ్యోతిగా మారి అరుణాగిరి అగు పరమలింగమునందు శివైక్యము చెందిన అంతిమ అనుభవానుభూతి తాను కైవల్యముక్తి మోక్షమును ఈ దేహము పొందినదని తెలియడముతో ....

ఆది అణ్ణామలై గుడి వద్ద కూర్చుని ధ్యాననిష్టను పొందూతూ అపుడు వారికి కల్గిన తన కపాలమోక్ష ధ్యానానుభవాలు చెపుతూండగా..వాటిని నేను (అనగా జిజ్ఞాసి) పుస్తకములో వ్రాస్తుండగా..ఆయన వాక్ బంద్ అవ్వగానే కొన్ని క్షణాలకి మౌనముగా అలివికాని ఆత్మనందస్ధితిని పొందుతూ ప్రక్కనే ఉన్న తన అద్దె ఇంటి వసారకి చేరుకొని...తన కెదురుగా ప్రతినిత్యము చాలా దగ్గరిగా కనిపించే అరుణాగిరిని చూస్తూ..స్వామి..ఈ రోజు ఈ దేహనికి కైవల్యముక్తి అగు మోక్షమును ప్రసాదింస్తున్నావా?ఇదే గదా.. ఈ దేహనికి కావలసిన మోక్షం..ఈ రోజు ఈ దేహనికి అలివికాని ఆత్మనందమునిచ్చే పండుగరోజు అంటూ..

పరమహంస తల ప్రక్కకి వాలిపోయింది.


చివరికి అపుడిదాకా ఆకార..సాకార స్వరూపముగా కనపడిన శ్రీ మేధా దక్షిణామూర్తి ఆత్మస్వరూపము కాస్త నికారమై..శూన్యమై..అనాదిగా ఉన్న పూర్ణశూన్యమవ్వడముతో..విశ్వానికి మోక్షము ఆరంభమైనదని..అంతము ఆరంభమై పూర్తీయ్యి పూర్ణశూన్యమైంది. ఈ నిజ పూర్ణజ్ఞాని శకము ముగిసింది.అపుడు ఈ క్షేత్రములోను అలాగే ఈ దేహ ఉన్న ప్రాంతములో అకాల వర్షము 48ని పాటు ఏకధాటిగా తన ఆవేదనను ఆకాశగంగా రూపముగా  కురిసింది.

ఈ రోజు మహా శివరాత్రి.....ఉదయము 6.05ని ఇదింతా జరిగింది.అంటే 1-3-2022 తేదిన ఆత్మయోగి అయిన పరమహంస పరమపదించారు.అనగా భక్తియోగి పవన్ బాబా గా..జ్ఞానయోగి గా పవనానంద సరస్వతిగా..ధ్యానయోగిగా పరమహంసగాను..అఖరిది ఆత్మయోగము నందు ఆత్మ సన్యాసి గా ఈ దేహము పరమపదించినది.

శివార్పణ మస్తు.

గమనిక: ఈ రోజు అనగా 1-3-2022 ..మహా శివరాత్రి తిధి నాడు మన ఆత్మయోగి పరమహంస గారు అరుణచల క్షేత్రములో ఆది అణ్ణామలై గుడి వద్ద కూర్చుని ధ్యాననిష్టను పొందూతూ అపుడు వారికి కల్గిన తన కపాలమోక్ష ధ్యానానుభవాలు చెపుతూండగా..వాటిని నేను (అనగా జిజ్ఞాసి) పుస్తకములో వ్రాస్తుండగా..ఆయన వాక్ బంద్ అవ్వగానే కొన్ని క్షణాలకి మౌనముగా అలివికాని ఆత్మనందస్ధితిని పొందుతూ ప్రక్కనే ఉన్న తన అద్దె ఇంటి వసారకి చేరుకొని...తన కెదురుగా ప్రతినిత్యము చాలా దగ్గరిగా కనిపించే అరుణాగిరిని చూస్తూ.."స్వామి..ఈ రోజు ఈ దేహనికి కైవల్యముక్తి అగు మోక్షమును ప్రసాదింస్తున్నావా?ఇదే గదా.. ఈ దేహనికి కావలసిన మోక్షం..ఈ రోజు ఈ దేహనికి అలివికాని ఆత్మనందమునిచ్చే పండుగరోజు" అంటూ..తట్టుకోలేని గుండె నొప్పి రావడముతో అక్కడక్కడే పరమహంస పరమపదించారు.అపుడు ఈయన హృదయము నుండి ఒక దివ్యకాంతి జ్యోతి ఒకటి బయటికి వచ్చి అగ్నిలింగమైన పరమలింగమగు అరుణాగిరి యందు  ఆత్మజ్యోతిగా శివైక్యము చెందింది.ఇంతటితో ఒక నిజపూర్ణ జ్ఞాని శకము ముగిసింది.

 
 ఇంతటితో ఈ దేహసాధన పరిసమాప్తి అవ్వడముతో...ఈ గ్రంథము ఆఖరి అంతిమభాగమును జిజ్ఞాసి అను నేను రాయడము జరిగింది. రాయటం పూర్తి అయ్యేసరికి ఏకధాటిగా అవిశ్రాంతంగా అవిచ్ఛిన్నంగా విపరీతముగా వరదలతో కూడిన అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎప్పుడూ లేనిది ఎన్నడూ లేనిది గంగా యమున అలాగే కృష్ణ గోదావరి నదులకు అలాగే ఇతర నదులకు వరదలు రావడంతో రాష్ట్రాలు- గ్రామాలు- దేవాలయాలు నీట మునుగుతున్నాయి. అంటే ఈ లెక్కన చూస్తే విశ్వం అంతం యొక్క రికార్డు దృశ్యాలు మనము చూడటము ఆరంభమైనది అని నాకు అర్థం అయినది. అనగా అంతము ఆరంభమైనది అన్నమాట. 

ఏదో ఉన్నది (నేను ఉన్నాను).........ఏమి లేదు (నేను లేను)

ఈ గ్రంథము రాసేటప్పుడు “నేను ఎవరిని” అనే ప్రశ్న సాధనతో ఆరంభమైతే… ఈ గ్రంథము ముగింపుగా “నేను లేను” అనే సమాధాన సాధనతో ముగింపు అవటంతో …. నేను లేను. సర్వము లేదు. అంతా శూన్యమే. అది కూడా లేదని… అది కూడా అంతము అయిపోయినదని మా దేహ సాధన స్వానుభవముతో అనుభవ అనుభూతి పొందడముతో…అపుడిదాకా మంది గూర్చి ఆలోచించే మేము కాస్త మా దేహ మది గూర్చి మాత్రమే ఆలోచించే మౌన:బ్రహ్మ స్ధాయికి… అలాగే ఈ విశ్వమూలమేదో తెలుసుకోవాలనే ఆలోచన అలాగే ఇలా తెలుసుకున్న జ్ఞానమును ఇతరులకి చెప్పాలనే సంకల్పము... ఇలా తెలుసుకున్నవారికి వచ్చే సాధన సందేహాలకి స్పందించడముతో...ఈ కపాలమోక్ష  గ్రంథకర్తగా చెయ్యడము జరిగినది.… ఇంతటితో ఈ దేహ నిజ సజీవ లాంటి స్వప్న ఆధ్యాత్మిక తుఫాన్ ధ్యానదృశ్యాల అనుభవసారమైన ఈ దేహ సమాధిగీత లాంటి ఈ “కపాలమోక్షం” గ్రంథం కూడ….అయిపోయింది.

******************************************************

పూర్ణ మోక్ష విధి విధానము: 

ఇది నేను మీకు ఒక యోగమిత్రుడిగా నా 32సం.రాల అధ్యాత్మికానుభవముతో ఈ విషయము చెపుతున్నాను.చెయ్యడము లేదా చెయ్యకపోవడము మీ ఇష్టము..కాని చెప్పడము మంచిదని చెపుతున్నాను.నా మనోదృష్టికి చాలామందికి మోక్షము పొందాలన్నా కోరిక ఉన్నప్పడికి అది ఎలా ఎవరు తీరుస్తారో మార్గాలు తెలియక ఒకవేళ తెలిసినగూడ అవి చెయ్యలేక..ధ్యానానుభవాలు పొందలేక..పొందిన అనుభవాలు నిజమో లేదా అబద్ధమో అర్ధము గాక అవస్ధలు పడుతూ..నకిలి గురువులను నమ్మి ధనామానాలు కోల్పోయి అగచాట్లు పడుతూ..ఈ జన్మకి మోక్షము వస్తోందో రాదో అర్ధమవ్వక..ఎవరిని అడాగాలో..ఎవరిని నమ్మాలో అర్ధము కాని అయోమయ స్ధితిలో..ఇలా చాలామంది భావితరాల యోగసాధకులు ఉన్నారని నాకు అవగహనకి వచ్చింది.ఇలాంటి వారి కోసము నా సాధానుభవముతో మీకు మోక్షము మీద అలాగే దీనిని సాధన విధివిధానము మీద అవగహన కల్పించాలని నాకు బలమైన సంకల్పము కల్గింది.చెప్పేది నేను అయిన చెప్పించేవాడు దైవమని తెలుసుకొండి..


ఇక అసలు విషయానికి వద్దాం..మోక్షము అంటే ఏమిటి అన్నపుడు మన మనస్సుకి 64 తత్త్వబంధాలుంటాలు.వీటిని సాధన ద్వారా విముక్తి చేసుకొంటే అస్ధిర మనస్సు కాస్త స్ధిరమై ఆత్మగా రూపాంతరము చెందుతుంది.అంటే మన మనస్సుకున్న కామాత్వము పోయి దైవత్వ స్ధితిని పొందడమే ముక్తి అవుతుంది.ఈ దైవత్వస్ధితి నుండి ఆత్మస్ధితికి చేరుకొని పూర్ణశూన్యస్ధితికి చేరడమే మోక్షమవుతుంది.ఒకరకముగా చెప్పాలంటే నేనుయున్నాను అను స్ధితి నుండి నేను లేను అను పూర్ణజ్ఞానము పొంది పూర్ణశూన్యస్ధితికి చేరడమే మోక్షమవుతుంది.అదే నేను వేరు..దేవుడు వేరు అను ద్వైతస్ధితి ఉంటే అది ముక్తి అవుతుంది.అంటే ముక్తిలో నేనుయున్నాను భావముంటే..అదే మోక్షములో నేనులేను భావప్రాప్తి ఉంటుంది.ఇక వివరముగా చెప్పాలంటే ముక్తిలో మీకు మీ దైవము లేదా గురువు కాస్త మామిడి పండు రుచి గూర్చి చెపుతారు.అదే మోక్షములో మీకు మీరే మామిడిపండు తిని రుచిని స్వానుభూతిని పొందుతారు.


ఇక సాధన విషయానికి వస్తే మనకి 18 యోగమార్గాలున్నాయి.అందులో ముఖ్యముగా కర్మ,భక్తి,జ్ఞాన,ధ్యాన,ఆత్మయోగ మార్గాలున్నాయి.వీటిలో కర్మమార్గము అంటే చేసే కర్మ యందు ఫలితాలు ఆశించి చివరికి ఫలితాలు ఆశించని స్ధితి చేరుకోవాలి.అదే భక్తి మార్గములో అయితే విగ్రరాధన నుండి విశ్వారాధన స్ధితికి చేరుకోవాలి.అదే జ్ఞానమార్గము లో అయితే నేను ఉన్నాను స్ధితి నుండి నేనులేను అను స్ధితికి చేరుకోవాలి.అదే ధ్యానమార్గములో అయితే కుండలీశక్తిని జాగృతి చేసుకుని మూలాధార చక్రము నుండి బ్రహ్మరంధ్రము దాకా ఉన్న 13 యోగచక్రాలను శుద్ధిచేసుకొని ఆయా ఈ చక్రానుభవాలు ధ్యానములో పొందాలి.అదే ఆత్మయోగము నందు అయితే మన ఆత్మను కాస్త పరమాత్మ లయం చేయాల్సి ఉంటుంది.


ఇక కర్మయోగమైతే మనకి ఏ కర్మలు చేస్తే పుణ్యము లేదా పాపము వస్తోందో తెలియదు.అలాగే ఏ కర్మలు మనకి బంధమవ్వుతాయో లేదా బంధవిముక్తి కల్గిస్తాయో గూడ తెలియదు.కాబట్టి ఈ మార్గములో మనకి తెలియని మాయ ప్రమాదము ఉన్నట్లే గదా.ఇక భక్తిమార్గము తీసుకుంటే ఇందులో మనకి 36 కోట్ల దైవాలున్నారు.వీరిలో ఏవరిని పూజిస్తే మోక్షము వస్తోందో ఎవరికి తెలియదు.ఒకవేళ తెలిసి చేసిన ఆయనకి ఈ పూజలు వెళ్ళుతున్నాయో లేదో తెలియని అయోమయ పరిస్ధితులు ఉన్నాయి.కాబట్టి ఈ మార్గము గూడ మన వంటికి పడదు.ఇక జ్ఞానమార్గమునకు వస్తే నేనుయున్నాను నుండి నేనులేను స్ధితికి చేరాలంటే ముందు మనము నేను అనేది ఏమిటో తెలుసుకోవాలి.అంటే నేను ఏవరిని అనుకుంటూ ఉంటే సరిపోదు.అది ఏమిటో జ్ఞానానుభవానుభూతిగా పొందాలి.ఇది కారణజన్ముడికి తప్ప నరమానవుడికి ఈ పూర్ణజ్ఞానము అందదు.అంటే ఈ మార్గముగూడ మన వంటికి సరిపడదు.ఇక ధ్యానమార్గములో అయితే మన కుండలీశక్తి జాగృతి నుండి యోగచక్రాల ధ్యానానుభవాలు పొందుటకు మనకి వరుసగా మంత్రగురువు, శక్తిపాతగురువు, సద్గురువు, పరమగురువు,ఆదిగురువు అనే పంచ నిజగురువుల అనుగ్రహము పొందాలి.ఈ కలియుగ ప్రభావములో ఎవరు నిజగురువో లేదా నకిలి గురువో గుర్తుపట్టడము చాలా కష్టము..ఒకవేళ గుర్తుపట్టిన ఆయన అనుగ్రహము పొందడము చాలా చాలా కష్టము.ఎందుకంటే నిజగురువు పెట్టే నిత్య మాయపరీక్షలు ఎదుర్కోవడము అంత తేలికైన విషయము గాదు.ఏ చిన్న తప్పు లేదా పొరబాటు చేసిన మన కధ మొదటికే వస్తోంది.ఆయన అనుగ్రహము పొందవలసిన చోట అగ్రహామును లేదా గురుశాపమును పొందవలసి ఉంటుంది. ఈ మార్గము అనేది పులి మీద స్వారీ లాంటిది కాబట్టి ఇది గూడ మన వంటికి పడదు.ఈ నాలుగు మార్గాలలో నేను ఎన్నో కష్టాలు పడి నానా చంకాలు నాకి ప్రాణము మీదకి తెచ్చుకున్న నాకు గావాలసిన స్ధితిని..ఆనందమును ఇవి ఇవ్వలేకపోయాయి. దాదాపుగా ఈ నాలుగు మార్గాల సాధన కోసము నా జీవితములో దాదాపుగా 27సం.రాలు వృధా చేశాను.కర్మల నుండి నిజగురువులు వెతకడములో ఇన్ని సం.రాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి.ఈ తప్పు మీరు చెయ్యకూడదని ఒక యోగమిత్రుడిగా ఈ అనుభవాలు చెప్పడము జరుగుతోంది.కాబట్టి మీరు ఎవరు గూడ ఈ నాలుగు మార్గాలలో సాధన చెయ్యకండి.దైవాల నుండి నిజగురువులను వెతకడము ఆపివెయ్యండి.గురువుల కోసము ఆశ్రమాలు అలాగే దైవాల కోసము గుడులు తిరగకండి.డబ్బులు,కాలము,జీవితము వృధా చేసుకోకండి. 


ఇక ఆఖరిదైన ఆత్మయోగ మార్గములో నేను కేవలము 5 సం.రాలు ప్రయాణించి నేను ఉన్నాను ఉన్నస్ధితి నుండి నేను లేను ఉన్నతస్ధితికి నా సాధన చేరుకోవడమే కాకుండా నా ఆత్మ కాస్త పరమాత్మయందు లయమయ్యే స్వానుభవము పొందడమే గాకుండా అంతిమ స్ధితియైన ఆత్మానందస్ధితికి అలాగే కైవల్యముక్తి అగు మోక్షానుభవము పొందడము జరిగింది.నాకు తెలిసి సాధన మార్గాలలో ఉన్న 112 మార్గాలలో సాధన చేసినప్పడికి ఆఖరికి ఈ ఆత్మయోగ మార్గమునకు ప్రతిసాధకుడు రాకతప్పదు.మరి అలాంటప్పుడు కష్టసాధ్యమైన మార్గాలలో ప్రయాణించము కన్నా అతిసులువైన ఆఖరిదైన ఆత్మయోగమార్గములో ప్రయాణించి సాధన సాధ్యతే సాధ్యం అను నానుడి నిజము చేస్తూ అందరుగూడ  మోక్షగామిగా మారి మోక్షమును పొందండి.


ఇంతకి ఈ మార్గ సాధన విధివిధానము మీకు నేను చెప్పుతాను.ఇందులో మనకి ఆదిదైవముగా..ఆదిగురువుగా.... ఆదియోగిగా మనకి అరుణాచల క్షేత్ర నివాసియైన శ్రీ మేధా దక్షిణామూర్తి మనకి తోడుగా..రక్షకుడిగా..మోక్షగురుదేవుడిగా ఉంటాడు.కాకపోతే ఈయన అనుగ్రహమును మనము పొందటానిటి సాధన చేయాల్సి ఉంటుంది.అందుకు మనకి  గావాలసిన దైవిక వస్తువులు నాలుగు.అవి ఒకటి లింగజ్యోతి దీపారాధన 2. ఊదే శంఖము 3. పాదరస శివలింగము లేదా రుద్రాక్ష 4. దక్షిణామూర్తి ఫోటో లేదా విగ్రహాము... ఈ నాలుగు వస్తువులు మీకు ఇంటర్నెట్ వెతికితే దొరుకుతాయి.ఈ నాలుగు వస్తువులలో లింగజ్యోతి అంటే ప్రమీద ఆకారము ఒక శివలింగకారముగా ఉండి లింగస్ధానములో ఒక దీపము ఓత్తి ఉంటుంది.దీనిని వెలిగిస్తే ఈ కుందె కాస్త అగ్నిలింగముగా కనపడుతుంది.ఈ నిత్య దీపారాధన వలన మన జన్మాంతరాల పాపాలు..శాపాలు..బంధ కర్మాల నుండి ఈ జ్ఞానాగ్నికి దగ్ధమవుతాయి.ఎలాంటే మన జన్మకి కారకము కామాగ్ని..మన సాధనకి కారకము జ్ఞానాగ్ని...మన మరణానికి కారకము దహగ్ని..అంటే మన జీవిత సృష్టి..స్ధితి..లయలకి మూలము అగ్నియే గదా.కాబట్టి అంతిమ ఈ అగ్నిరూపము ఒక అగ్నిశిఖ అయిన అగ్నిలింగము గావడము వలన ఈ లింగజ్యోతిరాధన చెప్పడము జరిగింది.ఇక ఉదే శంఖరావము వలన మన శరీరములో మనకి తెలియకుండానే ప్రాణాయామ విధివిధానము జరిగి కుండలీనిశక్తి జాగృతి అయ్యి యోగచక్రాలలో ఈ శక్తి ప్రయాణము నిరంతరము చేస్తూంది.అలాగే అరుణాచల క్షేత్రములో ధ్యానములో ఉండే దక్షిణామూర్తికి ఈ శంఖనాదము వినబడి మనగూర్చి ఆయన ఆలోచన చేస్తాడు.ఇక పాదరస లింగము లేదా రుద్రాక్షను ప్రతినిత్యము తాకడము వలన ఏరోజు చేసిన పాపాలు..కర్మపాపఫలితాలు నాశనమవుతాయిఎందుకంటే పాదరసము అనేది ఒకవిధమైన విష ఔషదమని ఆయుర్వేద వైద్యము చెపుతుంది..అలాగే నయము కాని దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనము మరియు జ్ఞానాభివృద్ధి, ధనాభివృద్ధి, కామ్యసిద్ధి,ఆరోగ్యవృద్ధి,శాంతము కల్గుతాయని శాస్త్రవచనము.అలాగే నా అంతిమ అనుభవములో దక్షిణామూర్తి ఆత్మలింగముగా పాదరస లింగముగా దర్శనము ఇచ్చిన విషయము మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది.అందుకని ఈయన అనుగ్రహమును పొందుటకు పాదరసలింగము లేదా పాదరస రుద్రాక్షను పెట్టడము జరిగింది.ఎవరైన దీనిని పూజించవచ్చు.నిరభ్యంతరముగా ఇంటిలో పెట్టుకోవచ్చు.పైపెచ్చు ఇంటి వాస్తు దోషాలు తొలగుతాయి.అంతెందుకు దేవాలయ ప్రతిష్ట యంత్రాల సమయములో తప్పనిసరిగా పాదరసమును వాడుతారు.వాడాలని ఆలయ ఆగమ శాస్త్రములో ఉంది.ఇప్పుడికి దీనిని వాడుతున్నారు.ఇక దక్షిణామూర్తి ఫోటో లేదా అంగుళము నుండి మూడు అంగుళాల విగ్రహము అనేది మన ఇళ్ళలో ఉంచుకోవలసిన దైవిక వస్తువులలో ఇది తప్పనిసరిగా ఉండాలని శాస్త్రవచనము.కాబట్టి ఈ ఫోటోను లేదా విగ్రహామును ప్రతినిత్యము చూడటము లేదా తాకడము వలన మనకి గురుగ్రహనుకూలత కల్గి మనకి అన్ని శుభాలు కల్గుతాయని ఏకముగా జ్యోతిష్యశాస్త్ర వచనము.


ఇక సాధన విషయానికి వస్తే...ఈ నాలుగు దైవిక వస్తువులు ఎలా ఉపయోగించాలో మీకు చెపుతాను.మొదట ఆవుపేడతో చేసిన విభూది ధరించి ఆ తర్వాత ఉదేశంఖముతో ఒకసారి శంఖనాదము చేసి ఆ తర్వాత  లింగజ్యోతి దీపారాధన ... దీనిని ప్రతినిత్యము ఉదయము మరియు సాయంత్రము వెలిగించాలి.ఇది ఒక కుందెగా ఉంటుంది.ఇందులో పూర్తిగా నువ్వులనూనె పోస్తే సుమారుగా ఆరుగంటలు పాటు వెలుగుతుంది.ఈ దీపారాధన ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము 6 గం నుండి 7 గం లోపు వెలిగించాలి.ఈ దీపారాధన ఒక అగ్నిలింగము గావడము వలన దీనిని అరుణాచల నామముతో జపించాలి.అలాగే దీనికి మహనైవిధ్యముగా ఒక చెంచా శుద్ధ ఆవునెయ్యి ఈ కుందెలో వెయ్యాలి.అంతే మీ పూజ పూర్తి అయ్యినట్లే...ఆ తర్వాత ఒకసారి పాదరస శివలింగము లేదా ఈ రుద్రాక్షను తాకి మీ దగ్గరున్న జపమాలతో 11 నుండి 1080 సార్లు అరుణాచల శివా నామమును దక్షిణామూర్తి ఫోటో లేదా విగ్రహమును చూస్తూ ఈ నామజపము చెయ్యండి.ఇంతడితో జపము పూర్తి అయ్యినట్లే..ఆ తర్వాత 20 ని..పాటూ మౌనముగా ఉండి ఆలోచనరహితముగా ఉండటానికి కళ్ళు మూసుకొని మీ గురుదేవుడైన శ్రీ మేధా దక్షిణామూర్తికి మీ కోరికలు చెప్పుకొండి.కాని ఫలితాలు ఆశించకండి.ఆయన ఏమి ఫలితము ఇస్తే అదే ఆనందముగా స్వీకరించి కృతజ్ఞతలు చెప్పుకొండి.ఇలా విధివిధానము అంతా మీకు 48ని..పూర్తి చేసుకొని ఇక నిత్యకృత్య పనులలో చేసుకొండి.అంతే..ఇలా మీరు  వేళ తప్పకుండా..క్రమము తప్పకుండా 14సం.రాలు పాటు చేస్తే మీకు తప్పకుండా ఆయన అనుగ్రహము కల్గి అంతిమ కైవల్యముక్తియగు మోక్షము కల్గుతుందని నా స్వానుభవము వలన ఘంటాపధముగా చెపుతున్నాను.గాకపోతే ఈ అనుగ్రహము అనేది 14రోజుల నుండి 14 సం.రాలు పట్టవచ్చు.మీ ఈ సాధన బట్టి ఫలితము ఆధారపడి ఉంటుంది.


మనకి శ్రీ మేధా దక్షిణామూర్తి అనుగ్రహము కల్గినదో లేదో తెలియానికి కొన్ని అనుభవాలు కల్గుతాయి.అవి 1. మనకి ధ్యానములో లేదా స్వప్నములో నిరంతరముగా అరుణాచల వాసియైన రమణామహర్షి స్వప్న దర్శనము అవుతుంది.2. ఈయనను మీరు దాటకల్గితే మీకు పంచ శిఖరాలున్న అరుణాగిరి కనపడుతుంది.3.ఆ తర్వాత ఏకశిఖరమున్న అరుణాగిరి కనపడుతుంది.4. అరుణాగిరి గుడి అయిన అగ్నిలింగము కనపడుతుంది.5.ఆ తర్వాత అరుణాగిరి పైన ఉన్న పద్మకారశివ అగ్నిలింగము అలాగే అగ్నిశివుడు అలాగే ఈ శిఖారగ్రభాగములో ఉన్న శివపాదముద్రలు కనపడతాయి.6.అరుణాగిరి లోపున ఉన్న నల్లటి ఆకారముగా ఉన్న దక్షిణామూర్తి ఆత్మస్వరూపము కనపడుతుంది.7.ఆ తర్వాత ఆఖరి అంతిమ అనుభవాలుగా ధ్యానము నందు మీ శరీరములో ఉన్న 13 యోగచక్రాలలో ఉన్న యోగలింగాలు కాస్త ఒక్కొక్కటిగా ఈ అరుణాగిరియందు లయము చెందే దృశ్యాలు కనపడుతూ ఆఖరిగా మీ ఆత్మ కాస్త మోక్షగురుదేవుడు అగు పరమాత్మ దక్షిణామూర్తి యందు కైవల్య చెందే దృశ్యము చూస్తూ మీ ప్రాణాలు కపాలములోని బ్రహ్మరంధ్రము ద్వారా పోయి ఆయనలో శివైక్యము చెందుతాయి.ఈ అనుభవాలు అన్నిగూడ నాకు కేవలము 5 సం.రాలలో జరగడము వలన ఇంతా ఇదిగా చెప్పడము జరిగింది.ప్రస్తుతానికి నా యోగ శివలింగాలు అన్నిగూడ ఈ అరుణాగిరియందు ఐక్యము చెందిన ధ్యానానుభవాలు పొందడము జరిగింది.ఆత్మానంద స్ధితిని పొందడము జరిగింది.ఇంక శివైక్య విధానముగూడ రేపో మాపో జరుగుతుంది.ఈ లోపు ఈ దేహ తెలుసుకున్న ఈ మోక్షవిధానము గూర్చి మీరందరికి చెప్పడము జరిగింది.ఈ విశ్వములో విశ్వాదిడేవుడుగా..విశ్వాదిగురువుగా.. విశ్వాదియోగిగా..విశ్వాదిమోక్షగురుదేవుదిగా.. .ఒకే ఒక్కడిగా.. అరుణాచల నివాసియైన

  శ్రీ మేధా దక్షిణామూర్తిగా ఉన్నాడని ఈ ధ్యానానుభవాలు చదివి తెలుసుకొండి.


ఈయన ఒక్కడినే పూజించండి. ఆరాధించండి. జపించండి. .ధ్యానించండి.అనుగ్రహము పొంది  జ్ఞానమును పొంది కైవల్యముక్తియగు మోక్షమును పొందండి.ఈయన ఒక్కడే మనకి కష్టసాధ్యమైన సాధనలు లేకుండా ఈయన నిత్య నామస్మరణతో మనకి గావలసిన మోక్షము ఇస్తాడు.ఎందుకంటే ఈయనే ఈ విశ్వానికి మోక్షదేవుడు.ఈ అనుగ్రహము కోసము మిగిలిన 36 కోట్ల దైవాలు..ఒక కోటి పరమాత్మలు..84 లక్షల ఆత్మస్వరూప యోగగురువులు అరుణాగిరి చుట్టు తిరుగుతూ సాధన చేస్తున్నారంటే విషయము ఏమిటో ఈ పాటికి మీకు అర్ధమై ఉంటుంది.ఇపుడిదాకా మీరందరు అసలు దేవుడిని పూజించకుండా ఈ దైవమును పూజించే పూజారి  దైవ గురువులను పూజిస్తున్నారని ఇపుడికైన తెలుసుకొండి.బాగుపడండి.నేను చెప్పేది వింటే బాగుపడతారు.లేదంటే బాధపడతారు.మీకు ఈ రెండింటిలో ఏది గావాలో తెల్చుకొండి.సాధన చేసుకొని మోక్షము పొందుతారని ఆశిస్తూ..శుభంభూయాత్...

No comments:

Post a Comment