పరమహంస మనో దృష్టికి ఎవరు గూడ కానరాలేదు. సరేగదాయని గోముఖ తీర్థమును సేవించగానే.... ఈయన మనోనేత్రానికి అమితమైన సూక్ష్మగ్రాహకశక్తి వచ్చింది. అపుడు చూస్తే....
తనకి కెదురుగా....
ధ్యాన తపస్సు చేసుకుంటున్న పద్మాసనములో కూర్చునియున్న అస్థిపంజరము దర్శనమైంది. అంటే ఈయన ఎవరో ఏనాడో జీవసమాధి చెంది ఉండి ఉంటారు. శరీరాలు పోయాయి. ఆస్థి పంజరము మిగిలింది. కాని ఇది ఎవరిది అనుకునే లోపుల ఆజ్ఞ చక్ర ముద్రతో ధ్యానము చేస్తున్న ముద్ర చూడగానే.... బహుశ ఆదిదేవుడు ఎవరో ఈయన అయ్యుంటాడు అనుకొనే లోపుల ఒక కపాలము దర్శనమైంది. ఆ తర్వాత రెండవ వరుసలో వరుసగా మూడు కపాలాలు, మూడవ వరుసలో అయిదు కపాలాలు, నాలుగవ వరుసలో ఏడు కపాలాలు, ఐదవ వరుసలో తొమ్మిది కపాలాలు ఆరవ వరుసలో పదకొండు కపాలాలు, ఏడవ వరుసలో 13 కపాలాలు, ఏనిమిదవ వరుసలో 15 కపాలాలు అనగా 1+3+5+7+9+11+13+15=64 కపాలాలు దర్శనమిచ్చాయి. అంటే తను స్థూలశరీరముతో ధ్యానము చేస్తున్న సమయములో ఇలాగే 36 కపాలధారి దర్శన మయినట్లుగా ధ్యాన అనుభవము అయింది. కాని అది 36 కపాలాలు గాదని 64 కాపాలధారియని ఇపుడు దర్శనమిచ్చింది.
ఈ 64 కపాలాలే కాలానికి 64 డైమెన్షన్స్ అని....
ఈయనే కాలపురుషుడని, పైగా ఒక పిరమిడ్ ఆకారములో ఏనిమిది వరుసలో కపాలాల అమరికను బట్టి చూస్తుంటే మూల ప్రకృతికి మూల పురుషుడు ఈయనేనని పైగా పిరమిడ్ యొక్క లక్షణము ఏమిటంటే చనిపోయినవారి జీవశక్తిని పునః ఉత్పత్తి చేసే గుణము ఉంటుందని ఈయనకి తెలుసు. అందువలనే విశ్వములో ఇపుడికి ఎన్నో యుగ ప్రళయాలు వచ్చిన గూడ ఈ విశ్వము మళ్లి మళ్లి పునః సృష్టికి ఈ పిరమిడ్ అమరికలోని 64 బ్రహ్మ కపాలాలే మూల కారకమని ఈయనకి జ్ఞానస్పురణ అయింది. ఈ కపాలధారి కున్న కపాలాలలో మొదటి, రెండవ బ్రహ్మ కపాల బ్రహ్మ రంధ్రాలు తెరుచుకొని ఉంటే మిగిలిన అన్ని కపాలాలకి ఉన్న బ్రహ్మ రంధ్రాలు మూసుకొని ఉన్నట్లుగా ఈయన గమనించాడు. ఈ లెక్కన చూస్తుంటే తెరిచియున్న ఈ రెండు కపాలాలు ఖచ్చితంగా 1 వ మరియు 2 వ డైమెన్షన్స్ కి చెంది ఉండి ఉంటాయి. తను గత జన్మలలో ఈ రెండు డైమెన్షన్స్ సాధన పూర్తీ చేసి ప్రస్తుతము ఉన్న ఈ జన్మలో మూడవ డైమెన్షన్ సాధన చెయ్యాల్సి ఉంటుందని..... ఇక్కడ నుండి 4th to 64th డైమెన్షన్స్ దాకా తను ఆత్మ శరీరముతో సాధన చెయ్యాల్సి ఉంటుందని ఈయనకి జ్ఞానస్పురణ అయింది. ఇలా తను సాధనలో 64 వ బ్రహ్మ కపాలము యొక్క బ్రహ్మ రంధ్రము వరకు చేరగల్గితే ఆపై ఏమి ఉన్నదో అది 65 వ డైమెన్షన్ అవుతుంది. బహుశ అదియే మోక్ష డైమెన్షన్ అయ్యి ఉండవచ్చునని ఈయనకి జ్ఞానస్ఫూరణ అయింది. అంటే తను ఇపుడు ఆత్మ శరీరముతో సాధన చేసి తను ప్రస్తుతము ఉన్న 3rd డైమెన్షన్ నుండి 4th డైమెన్షన్ లోనికి వెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చెయ్యాలని ఈయనకి అర్ధమై.... 64 కపాలధారి ఎదుట ధ్యాన నిష్ఠలోనికి వెళ్లే ఈ మహత్తర దృశ్యాలు అన్నిగూడ హార్వే పరికరములో చూస్తున్న జోషికి, హార్వేకి, దేవికి అలాగే మనో దృష్టి ద్వారా చూస్తున్న కాలాముఖాచార్యుడికి నోట మాట రావడము లేదు. చెప్పలేని అద్వితీయమైన ఆనందస్థితికి వీరంతా ఎపుడో వెళ్లిపోయారు. ఎందుకంటే వీళ్ల గురుజీ కాస్త విశ్వానికి మూల పురుషుడైన 64 కపాలధారియైన కాలపురుషుడి దగ్గరికి చేరుకోవడము జరిగింది.
ఈ 64 కపాలధారి దృశ్యమును చూసిన హార్వేకి సందేహము వచ్చి దేవితో.....
ఇది నిజమని నువ్వు నమ్ముతున్నావా? లేదా ఈయన భ్రమ పడుతున్నాడా? అనగానే....
నాకు తెలిసి శాస్త్రాలలో అలాగే వేద పురాణాలలో 36 కపాలధారి ఉన్నట్లుగా ఆయన పేరు సదాశివుడిగా పైగా ఈయన నివాసము కైలాష్ పర్వతమని చెప్పడము నేను విన్నాను. అలాగే బౌద్ధ ధర్మములో గూడ 24 తలలతో బుద్ధులున్నట్లుగా మరియు 12 బుద్ధుడి అవతారాలను కలిపి చూస్తే 36 తలలున్న మహా బుద్ధులు మనకి ఈ ధర్మము నందు కనబడతారు.పైగా 25 తలలు ఉన్న సదాశివుడి విగ్రహమూర్తిని మధుర క్షేత్రములోని మధుర మీనాక్షి ఆలయ ఉత్తర గోడ మీద మనము చూడవచ్చును. అలాగే ప్లేట్ శాస్త్రవేత్త ఈ విశ్వము ఏర్పడటానికి కారకమైన మూలకాలు అన్ని గూడ ఒక పిరమిడ్ ఆకార నిర్మాణము అమరి ఉన్నాయని ఆనాడే చెప్పడము జరిగింది.పైగా చదరంగము (చెస్) ఆట బోర్డ్ లో 64 గడులున్నాయి.ఈ విషయాలు బట్టి చూస్తుంటే ఇది నిజమని తెలుస్తోంది గదా అనగానే
హార్వే వెంటనే...దేవి..నీకు ఒక పరీక్ష..ఈ చదరంగ ఆటను నువ్వు ఆధ్యాత్మికపరంగా చెప్పగలవా? అనగానే
దేవి అందుకొని...హర్వే..నేను చెప్పడము గాదు.ఏనాడో మన పూర్వీక మహర్షలు మన ప్రకృతి తత్త్వమును ఈ ఆట ద్వారా లోకానికి అర్ధము,పరమార్ధము,మూలార్ధముతో చెప్పడము జరిగింది.అది ఏలాగో నీ నోటి ద్వారా చెప్పిస్తాను అంటూ నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పు చాలు.విషయమే నీకు అర్ధమవుతుంది
మన ప్రకృతి ఎన్ని రకాలు అనగానే..
హర్వే వెంటనే .... స్త్రీ మరియు పురుష ప్రకృతులు అనగానే...
అయితే ఈ రెండు రకాల ప్రకృతులకి అధిదేవతలు ఏవరు మరియు వారి రంగులు ఏమిటి అనగానే...
స్త్రీ ప్రకృతికి అమ్మవారు..ఈవిడ నల్లగా ఉంటుంది.అదే పురుష ప్రకృతికి శివుడు..ఈయన తెల్లగా ఉంటారు.
సరే ఈ ప్రకృతులు అంగాలు మరియు తత్త్వాలు ఎన్ని అనగానే..
స్త్రీ మరియు పురుష ప్రకృతులకి చేరో ఎనిమిది అంగాలున్నాయి.అలాగే 16 తత్త్వాలున్నాయి.
సరే..ఈ ఆట ప్రత్యేకత ఏమిటి అనగానే..
ఏముంది దేవి...ఎవరికి వారే ఎత్తులు వేసి అవతలివారిని చంపుతూ రాజును ఏకాకి చెయ్యడము లేదా ఏటు కదల్చకుండా చెయ్యడమే గదా అనగానే...
హర్వే..నువ్వు చెప్పిన సమాధానాలను ఈ ఆటలో ఎలా ఆధ్యాత్మికముగా మారుతాయో విను అంటూ..చెస్ ఆటలో నలుపు మరియు తెలుపు గడులు మొత్తము కలిపి 64 గడులుంటాయి.ఈ ఆటను ఇద్దరు మాత్రమే అదిగూడ నలుపు,తెలుపు మొత్తము 32 (16+16) పావులతో ఆడతారని లోకవిధితమే..ఇపుడు ఈ ఆటలో నలుపు పావులు కాస్త స్త్రీ ప్రకృతియైన అమ్మవారికి సంకేతమైతే..తెలుపు పావులు కాస్త పురుష ప్రకృతియైన అయ్యవారికి సంకేతము అన్నమాట. ఎందుకంటే అమ్మవారు నల్లగాను..అయ్యవారు తెల్లగాను ఉంటారు గదా.ఇక వీరి పావుల విషయానికి వస్తే అమ్మవారి 16 నల్లపావులు కాస్త ఎనిమిది సైనిక పావులు కాస్త అమ్మవారు అష్టాంగాలు అనగా పంచభూతాలు,మనస్సు,బుద్ధి,అహంకారమునకు సంకేతాలు అయితే మిగిలిన ఎనిమిది పావులు కాస్త అమ్మవారి తత్త్వాలు అనగా ఆలోచన, సంకల్పం, స్పందన, ఆశ, భయం, ఆవేశం,ఆనందం,కోరిక లకి ప్రతీకలైతే..ఇక అయ్యవారి 16 పావుల విషయానికి వస్తే..ఇందులోని ఎనిమిది తెల్లని సైనిక పావులు కాస్త ఈయన పురుష ప్రకృతి అష్టాంగాలు అనగా పంచభూతాలు, సూర్యుడు,చంద్రుడు,జీవుడు అన్నమాట.ఇక్కడ విచిత్రమైన విషయము ఏమిటంటే ఈ రెండు ప్రకృతులలో అష్టాంగాలలో పంచభూతాలు ఒక్కటే అవ్వడము వలన ఈ ఆటలో ఒకరకమైన సైనికపావులను పెట్టడము జరిగింది.ఇక అయితే మిగిలిన ఎనిమిది పావులు కాస్త ఈయనకున్న ఏనిమిది తత్త్వాలు చూస్తే.. కామము, క్రోధము,పిసినారితనము,అసూయ, అహము,మధము, మోహము, ప్రేమ అనేవి ఉంటాయి.
ఇలా అమ్మవారికి 16 పావులు కాస్త 16 కళాలు అయితే అయ్వవారి 16 పావులు కాస్త 16 తత్త్వాలకి సంకేతాలు అన్నమాట.ఇక ఈ ఆటలో ఎత్తుకి పైఎత్తులు వెయ్యడము అంటే ఆలోచనకి తగ్గట్లుగా బుద్ది కాస్త కర్మానుసారముగా ఈ విశ్వసృష్టిలో సృష్టి,స్ధితి,లయ ఎలా జరుగుతాయో చెప్పడము అన్నమాట.ఇక ఆటలో చివరి అంకముగా రాజును ఎటు కదల్చలేని స్ధితికి తీసుకొని రావడమే జయము అయితే అదే మన మనస్సును గూడ ఎపుడు గూడ ఉండే అనిశ్చల స్ధితి నుండి స్ధిరమైన నిశ్చలస్ధితికి ఈ ప్రకృతిని తీసుకొనిరావడమే అనగా మన మనస్సుకి ఉన్న అన్ని రకాల కర్మజన్మ బంధాల నుండి విముక్తి కల్గించడమే పూర్ణ నిశ్చలస్ధితి ఇవ్వడమే మోక్షం అవుతుంది.ఇదే మనము పొందే ఈ జీవనాటక ఆటలో పొందే విజయము అవుతుంది అనగా హర్వే అలాగే జోషి కాస్త ఆనందముతో చప్పట్లు కొట్టి ఆటలో ఆధ్యాత్మికతను చెప్పిన దేవిని అభినందించారు.
ఉన్నట్టుండి హర్వేకి ఒక చిలిపి ఆలోచన వచ్చి అక్కడ ఉన్నవారితో...
అవును..మన కాలానికి 64 డైమర్షన్స్ ఉన్నట్లేగానే ఈ ప్రపంచములో అత్యంత విలువైన 64వ వస్తువు ఏమై ఉంటుంది అనగానే
వెంటనే జోషి అందుకొని...ఆ వస్తువు "రోలెక్స్ వాచీ" అనగానే
దేవి వెంటనే నెట్లో వెతకగానే అది నిజమని తేలింది.అపుడు దేవి అయితే...
జోషి..నువ్వు చెప్పింది నిజమే గాని ఈ వాచీ మోడల్స్ లో ఒక మోడల్ ఇపుడున్న మన ఆధ్యాత్మిక సాధనస్ధితికి సరిగ్గా సరిపోతుంది అనగానే అందరికి ఆశ్చర్యనందాలు వేస్తుండగా...
ఇదే ఆ మోడల్ వాచీ..దీని డైయల్ పైభాగములో 36 డైమండ్స్ అదిగూడ రెయిన్ బో రంగులో ఉంటాయి.పైగా దైయల్ లోపలిభాగములో ఎనిమిది తెల్లని డైమండ్స్ ఉంటాయి. అంటే పైన 36 డైమండ్స్ అనేవి 36 కపాలాలకి సంకేతముగాను అలాగే లోపల ఉన్న 8 డైమండ్స్ అనేవి ప్రకృతి అష్టాంగాలకి సంకేతాలు అన్నమాట.అలాగే ఈ మోడల్ వాచీలో మనకి లోపలి వైపు మూడు చిన్న డైయల్స్ ఉంటే ఇక నాలుగువ పెద్ద డైయల్ కాలమానము మనకి చూపుతుంది.ఇందులో మూడు డైయల్స్ అనేవి ఈ విశ్వచక్రములోని సృష్టి,స్ధితి,లయ కి సంకేతమైతే..నాలుగోవది విశ్వకాలచక్రానికి సంకేతములాగా ఉంటుంది.పైగా ఈ వాచీ డైయల్ చుట్టున్న డైమండ్స్ గూడ సప్త వర్ణాలతో రెయిన్ బో రంగులో ఉండటము అనేది సప్తవర్ణాల ప్రకృతికి సంకేతములాగా కనపడుతుందని అనడముతో..ఇలా ఒక వాచీలో గూడ తను పొందిన ఆధ్యాత్మిక జ్ఞానమును తన అనుభవములోనికి అన్వయించుకున్న దేవి అనుభవ పాండిత్య జ్ఞానానికి అందరు చప్పట్లు ద్వారా జోహర్లు చెప్పడము జరిగింది.
నిజానికి జ్ఞానము అందుకోవడము తేలిక.కాని దానిని మనకి గావాలసిన విధానములో అర్ధము చేసుకోవడము అలాగే అన్వయించుకోవడము చాలా చాలా కష్టమని గ్రంధకర్తగా నా వ్యక్తిగతాభిప్రాయము.
ఇంతలో....
ధ్యాన స్థితి నుండి విశ్రాంతి స్థితికి కాలాముఖుడు వస్తూ దేవి మాటలు విని.....
అమ్మాయి! నువ్వు చెప్పింది అక్షర సత్యమే. ఇపుడిదాకా సదాశివుడు 36 కపాలధారిగా లోకానికి తెలుసు. కాని నిజానికి ఈయనకి 64 కపాలాలు ఉన్నాయని పరమహంస ద్వారా లోకానికి తెలుస్తుంది. ఎందుకంటే వేదాల ప్రకారము చూస్తే ఈశ్వరుడికి 64 తత్త్వాలున్నాయని చెప్పడము జరిగింది. అదే బ్రహ్మ పురాణము ప్రకారము చూస్తే ఆది పురుషుడికి 65 తత్త్వాలున్నాయని చెప్పడము జరిగింది. 64 వ బ్రహ్మ కపాలము యొక్క బ్రహ్మరంధ్రము లోని పూర్ణ శూన్యస్థితియే 65 వ స్థితి అయ్యుండాలి. ఇది ఉందో లేదో తెలియని స్థితి గావడము వలన వేదాలు వర్ణించలేదు. ఆ తర్వాత వచ్చిన పురాణాలు ఈ స్థితిని పూర్ణశూన్యస్థితియని ఇదియే అసలు సిసలైన మోక్ష స్థితి యని చెప్పడము జరిగి ఉండాలి. ఆ తర్వాత వచ్చిన సైన్స్ కాస్త కాలానికి మొదట ఒకటి లేదా మూడు డైమెన్షన్స్ అని ఆపై 5 అని ఆపై ఏడు అని ఇపుడికి పదకొండు డైమెన్షన్స్ ఉన్నాయని చెప్పడము జరిగింది. ఆ తర్వాత 26 డైమెన్షన్స్ ఉన్నట్లుగా చెపుతున్నారు. కాని మొత్తము 64 డైమెన్షన్స్ అని వీళ్లకి ప్రస్తుతానికి తెలియదు. భవిష్యత్ లో తెలిసే అవకాశాలున్నాయి.
కాని ప్రస్తుతానికి మీ గురుజీకి రాబోవు కాలములో ఒక సమస్య రాబోతుందని నాకు అన్పిస్తోంది. ఎందుకంటే తను 3rd డైమెన్షన్ నుండి 4th డైమెన్షన్ కి వెళ్లాలంటే భూమికి వ్యతిరేక శక్తితో వెళ్లాలి. అనగా యాంటి గ్రావిటి శక్తి ఈయనకి గావాలి. అంతటి శక్తి సామర్ధ్యాలు ఈయనకి లేవు. ఎందుకంటే ఈయన సిద్ధుల జోలికి వెళ్లలేదు. వెళ్లి ఉంటే ఈ సమస్య వచ్చేది గాదు. సిద్ధుల మాయలో పడకూడదని ఈయన వీటి మీద అభ్యాసము చేసి సిద్ధి పొందలేదు. దానితో ఈయనకున్న సిద్ధులు అన్నిగూడ సాక్షిభూతముగా ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నట్లుగా దేనికి పనికి రాకుండా ఉండిపోయాయి. పోనీ ఇపుడు సిద్ధులకోసము సాధన చేస్తే ఆ సిద్ధులు ఇచ్చే సిద్ధ మాతల మాయలో ఎంతటి వాడైనా పడక తప్పదు. అన్ని మాయలు దాటిన మహామాయావి అయిన శ్రీ దత్తస్వామికే సిద్ధమాయలో పడక తప్పలేదు. అష్టసిద్ధులను తన చుట్టు రక్షణ కవచముగా ఉంచుకోక తప్పలేదు. యోగ మాయ అయిన అనఘాదేవిని వివాహమాడక తప్పలేదు. యోగ మాయ పరీక్ష దత్తుడు కాక తప్పలేదు. అనగానే....
దేవి వెంటనే...
స్వామి! అయితే ఇక్కడిదాకా వచ్చిన మా గురూజీ సాధన శ్రమ అంతా వృధాయేనా?
తల్లి! ఏ విషయము ఇపుడే ఏమి చెప్పలేము. రాబోవు కాలములో ఏమి జరుగుతుందో బ్రహ్మయ్యకే తెలియదు. మనకి ఎలా తెలుస్తుంది. కాని ఒక్కటి మాత్రము నిజము. ఆయన బ్రహ్మ రంధ్ర గుహకి చేరుకొని తన ఆత్మ శరీరముతో సాధన సిద్ది పొందితే అపుడికే జీవసమాధిలోనికి వెళ్లిన మిగిలిన ఆరు శరీరాలు గూడ ఉత్తేజము అయ్యేటట్లుగా ఈయన సాధన స్థాయికి చేరుకోవాలి. అపుడు జల సిద్ధితోయున్న ఆయన భౌతిక శరీరమునకు యాంటి గ్రావిటి శక్తి అవసరమవుతుంది. అపుడు ఈ శక్తితో ఆయన శరీరము ఇక్కడ అదృశ్యము అవ్వగలిగితే అక్కడ ఆయన ఆత్మశరీరము కాస్త 3rd డైమెన్షన్ నుండి 4th డైమెన్షన్ లోనికి ప్రవేశించే అవకాశాలున్నట్లే అన్నమాట. గాకపోతే ఆత్మ శరీరము తన ఆరు శరీరాలను జీవసమాధి స్థితి నుండి 48 క్షణాలలో మామూలు స్థితిని ఆయన తప్పించుకోగలరు. కాని ఈయన స్థూల శరీరానికి యాంటి గ్రావిటి శక్తి ఇచ్చే సిద్ధ పురుషుడు గావాలి. అపుడే ఈయన కాస్త 4th డైమెన్షన్ లోనికి అడుగు పెట్టగలడు. ఈ విషయము మాకు ఇపుడే తెలిసింది. నాకు ఇంతటి శక్తి లేదు. ఈ శక్తియున్న సిద్ధ పురుషుడు వచ్చేదాకా అంటే అదిగూడ 48 క్షణాల లోపల ఈయన దగ్గరికి ఆ సిద్ధ పురుషుడు వచ్చి ఈయన స్థూల శరీరానికి ఆ శక్తి ఇవ్వాలి. లేదంటే బ్రహ్మరంధ్ర గుహలో ఉన్న ఆత్మ శరీరము కాస్త బ్రహ్మరంధ్ర కాంతికి దహనమై... నీరుగా మారి గోముఖ తీర్ధములో కలిసిపోయే ప్రమాదముంది ఇలా ఎంతో మంది యోగులు తమ బ్రహ్మరంధ్రము వద్ద ఆత్మ శరీరాలను త్యాగము చేశారు. లోకానికి తెలియకుండా గుప్త యోగులుగా, ఆత్మ యోగులుగా గోముఖ తీర్ధ జలముగా మారిపోయారు. అదే కొంతమంది అయితే కాంతి నిచ్చే కాంతి రేణువులుగా మారిపోయారు.
మరి 48 క్షణాలలో జల సిద్ధి యోగముతో ఉన్న ఈయన భౌతిక శరీరము దగ్గరికి ఏ సిద్ధ పురుషుడైనా వస్తాడో రాడో మనము ఎదురుచూడాలి. వస్తే ఫర్వాలేదు.రాకపోతే మన కళ్ల ముందే పరమహంస యొక్క ఆత్మ శరీరము విబేధనము చెంది శుద్ధజలముగా మారే ఆఖరి దృశ్యమును మనమంతా చూడక తప్పదు. ఏమి చెయ్యాలో..... ఎలా చెయ్యాలో నాకే అర్ధముకాని అయోమయ సందిగ్ధతలో నన్నే కాలము పడేసింది అంటూ కన్నీరు కార్చారు. ఈ దృశ్యము చూసిన మిగిలిన వాళ్లకి కళ్ల వెంట కన్నీళ్లు ఆగలేదు. ఎలాగైనా తమ గురూజీ ఆత్మశరీరమును కాపాడాలని ముక్కోటి దైవాలకి, మహా గురువులను ప్రార్ధించడము మొదలు పెట్టారు.
ఎవరి చేతిలోను ఏమి ఉండదు గదా. కాలమే దీనికి సమాధానము చెప్పాలిగదా.
No comments:
Post a Comment