అధ్యాయము 56

 పరమహంస ... ...


ధ్యానిష్టలో కారణ శరీరముతో జీవనాడి మార్గములోనికి ప్రవేశించగానే... అక్కడ ఆయనకి ఎదురుగా అంతరిక్షము నందు సజీవమూర్తిగా హనుమంతుడి దర్శనమైంది. ఈయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడలేదు. ఇద్దరు ఒకరినొకరు మౌనముగా చూస్తున్నారు, చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు గూడ సమకాలీకులే గదా. ఒకరు నరుడు నుండి మాధవుడైతే మరొకరు వానరుడు నుండి నారాయణుడయ్యారు. దానితో హనుమ కాస్త త్రోవ నుండి ప్రక్కకి తప్పుకోగానే... పరమహంసకి జీవనాడి యందు ప్రవేశించే మార్గము తెరుచుకుంది. అపుడు ఈ మార్గములో ఈయనకి వరుసగా హనుమ నవ అవతారాల స్వరూపాలు దర్శనమిచ్చాయి. అనగా ప్రసన్నంజనేయ స్వామిగా, వీరాంజనేయ స్వామిగా, చతుర్భుజ ఆంజనేయ స్వామిగా, అష్టభుజ ఆంజనేయ స్వామిగా, ద్వాత్రింశభుజ ఆంజనేయ స్వామిగా, వింశతిభుజ ఆంజనేయ స్వామిగా, సువర్చలాంజనేయ స్వామిగా, పంచముఖ ఆంజనేయ స్వామిగా ఆఖరిగా వానరాకార ఆంజనేయస్వామిగా దర్శనమిచ్చి....


ఉన్నట్టుండి పరమహంస కారణ శరీరము మీద తన  చేతితో మోదేసరికి... ఈ శరీరము ప్రక్కకి జరిగిపోతూ ఈయన తల నుండి మూడు అంగుళాల వాయు శరీరము బయటికి వచ్చే దృశ్యాలు అన్నిగూడ హార్వే పరికరములో చూస్తున్న ఈ ముగ్గురికి నోటమాట రాలేదు. అంటే స్థూలశరీరము పోయి సూక్ష్మ శరీరము అది గూడ పోయి కారణ శరీరము అది గూడ పోయి ప్రస్తుతము వాయు శరీరముతో పరమహంస సాధన కొనసాగుతోందని వీరికి అర్ధమయింది.


ఈ హనుమ దృశ్యము చూస్తున్న హర్వేకి ఒక సందేహము వచ్చి అక్కడే ఉన్న దేవితో..దేవి..హనుమంతుడు చిరంజీవుడని..ఆయన సజీవమూర్తి అంటారు గదా.ఈ లెక్కన చూస్తే ఈ భూమ్మీద ఇన్ని యుగాలైన సజీవముగా ఉన్నాడా?ఆయనని ప్రత్యక్షముగా చూసినవాళ్ళు ఉన్నారా? అనగానే..దేవి కాస్త..హర్వే ఇదే సందేహము మన గురూజీ పరమహంసకి వచ్చింది.దానితో ఈయన కాస్త ఏకముగా హనుమ మీద పరిశోధన చేసి ఈ రిపోర్ట్ ను ఒక తన అనుభవ కధగా వ్రాసుకున్నారు అనగానే హర్వే ఈ రిపోర్ట్ చదవడము ఆరంభించాడు.ఇందులో 

--------------------------హనుమ దర్శనం--------------------------------------

పవన్ మరియు శ్రీనివాస చక్రవర్తి మంచి యోగమిత్రులు! ఎల్లప్పుడూ వీరిద్దరి మధ్య ఆధ్యాత్మిక విషయాలే చర్చకి వస్తుంటాయి! పైగా శ్రీనివాసమూర్తి హనుమంతుడికి మహాభక్తుడు! ఎంతటి భక్తుడు అంటే తన భార్యగూడ సువర్చల అనే పేరు ఉన్న అమ్మాయినే వివాహము చేసుకున్నాడు! గాకపోతే హనుమంతుడిలాగా బ్రహ్మచర్య దీక్షతో ఉండాలని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే సువర్చల అమ్మాయి పరిచయంతో కాస్త చేసే ప్రణవ మంత్రము కాస్త ప్రణయ మంత్రమైంది! బ్రహ్మచర్యమును తన ఇష్టదైవమైన హనుమంతుడికి ఇచ్చి తాను సంసారి అయినాడు! అయినగూడ హనుమత్ భక్తి మారలేదు! ఎలాగైనా ఈ జన్మలో హనుమత్ సాక్షాత్కార అనుభవ అనుభూతి పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు! దీని కోసము ఎంతోమంది గురువులను కలిసినాడు! ఎన్నో సత్  గ్రంధాలు చదివినాడు! ఎన్నో మంత్ర తంత్ర యంత్ర సాధనలు చేసిన గూడ ఎట్టి ప్రయోజనము కనిపించలేదు.


ఇలా గాదనుకొని పవన్తో కలిసి ఏ కాశీ క్షేత్రములో తులసి రామాయణము రచించిన గోస్వామి తులసీదాస్ కి హనుమ కనిపించిన హనుమాన్ ఘాట్ కి వీరిద్దరూ చేరుకున్నారు! కొన్ని రోజులు గడిచినాయి! ఈ ఘాట్ యందు కాదు ఈ కాశీ క్షేత్రములో గూడ హనుమత్ జాడ ఉన్నట్లుగా వీళ్ళకి అగుపించలేదు! ఏమి చెయ్యాలో అర్ధము కాని అయోమయ పరిస్థితి!

   ఇది ఇలా ఉంటే ఒక రోజు వీరిద్దరు ఈ ఘాట్ యందు అరటి పండ్లు తింటూ ఉండగా... ఒక పెద్ద ముదుసలి కోతి వీరి దగ్గరికి వచ్చింది! పైగా తెల్లని పండు కోతి! ఇలాంటి తెల్లని కోతి పైగా అయిదు అడుగుల కోతిని చూడటము వీరిద్దరికి ఇదే మొదటిసారి! భయము వేసింది! ఒకవేళ ఈ కోతియే హనుమంతుడు కాదు గదా అనే సందేహ అనుమాన భయము వీరిద్దరికి వచ్చింది! చేతిలో ఉన్న అరటిపండు కాస్త శ్రీనివాస మూర్తి దానికి ఇచ్చాడు! అది సగము తిని మిగిలిన సగము ఇతడి చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది! విచిత్రముగా


సగము తిన్న అరటిపండు ఇచ్చేసరికి వీళ్ళు కాస్త భక్తిగా ఈ ఎంగిలి ప్రసాదము వీరిద్దరు ఆప్యాయముగా తిన్నారు! కొద్ది సేపటికి స్పృహ కోల్పోయారు! యోగమత్తులోనికి అదే నిద్ర మెలుకువ కానీ యోగ నిద్ర స్థితికి చేరుకున్నారు!

        అప్పుడు ఇదే కోతి వీరిద్దరి దగ్గరకి వచ్చి వారిని ఒక చోటుకి తనతో రమ్మని చెప్పి... త్రిలోచన ఘాట్ యందు ఉన్న నాగకన్యలు సంచరించే అంతర్గత గుహ వైపుకి తీసుకొని వెళ్ళింది! గుహ ద్వారము తెరుచుకొంది! లోపల అంత గాఢాంధకారముగా ఉంది! సుమారుగా వీళ్ళు 8 km  పైగా ఈ గుహ యందు నడవగా... అవతలి వైపుకి చేరుకోగానే.... హిమాలయ మంచు పర్వతాలు స్వాగతము పలికినాయి! అంటే తామిద్దరిని ఈ కోతి కాస్త హిమాలయాలకు చేర్చినదని వీరిద్దరు గ్రహించినారు! అప్పుడు ఈ కోతి ఎటు వెలితే వీళ్లు గూడ దానిని అనుసరించసాగినారు! ఇది కాస్త సెలయేరు లాగా ప్రవహించే గోముఖ ప్రవాహాన్ని దాటి సన్నని


 రోడ్డు వంటి దారి వెంబడి ప్రయాణించారు! ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్న కొండ చరియలలో చాలా ఏపుగా పెరిగిన ఆకుపచ్చని రంగుతో ఆకులు లేని దేవదారు వృక్షాలు వీళ్ళకి కనిపించాయి! వింత వింత పక్షులు వాటి వింత ధ్వనులు కనిపించాయి! ఉన్నట్టుండి ఇలాంటి వాతావరణ మధ్యలో ఒక చోట ఈ పండుకోతి ఆగిపోయింది! అప్పుడు వీళ్లకి ఒక సుగంధ పుష్పాల సువాసనలతో పాటుగా బాగా మగ్గిన అరటిపండ్ల పరిమళం గూడ సోకింది! ఎప్పుడైతే ఈ పుష్పాల సువాసన ముక్కుని తగలగానే పవన్ వెంటనే శ్రీనివాస్ చక్రవర్తిని

"ఓయ్! మనము హనుమత్ నివసించే సౌగంధిక పర్వతము మీదకి వచ్చినాము! ఎందుకంటే ఈ పుష్పాల వాసన అదే! వీటిని బ్రహ్మకమలము లేదా సౌగంధిక పుష్పాలు అంటారు! ఇది ప్రతి 12  సంవత్సరాలకి ఒకసారి మాత్రమే పూస్తుంది! ఈ పుష్పాలున్న చోటనే మన హనుమంతుడు ఉంటాడని మహాభారతము చెపుతోంది అనగానే.... వెంటనే శ్రీనివాసమూర్తి"


అవును ఈ పుష్పాల గూర్చి, హనుమత్ దర్శనము గూర్చి మహాభారతములో విన్నాను! ఒకసారి ద్రౌపదీదేవి వన విహారం చేస్తున్నపుడు ఈ సుగంధ పుష్పము ఎగిరి వచ్చి పడినదని... తనకి ఇలాంటి పుష్పాలు గావాలని భీముడిని కోరడము... ఆయన ఈ పుష్పాల కోసము హిమాలయాలకి రావడము... ఈ పుష్పాల వనము నందు హనుమంతుడు ఒక ముదుసలి కోతి రూపములో భీముడికి అగుపించి... దారికి అడ్డముగా ఉంచిన తన తోకను ఎత్తమని చెప్పడము... దానిని ఎత్తలేక భీముడు నానా అవస్థలు పడి చివరికి ఇది హనుమంతుడి లీలా విన్యాసమని గ్రహించి ఆ ముదుసలి కోతి యొక్క పాదాల మీద పడగానే... ఆయన నిజరూప దర్శనమిచ్చాడని నేను విన్నానని చెప్పడము జరిగింది! కొంపతీసి మనతో వచ్చిన కోతి.... హనుమంతుడా అని అడిగేసరికి... పవన్ కాస్త స్థిమితపడి ఆయన హనుమంతుడే అయితే మనకి కాశీక్షేత్రములోనే దర్శనమిచ్చేవాడుగదా! ఇక్కడి దాకా రావడమెందుకు! అన్నాడు! ఇంతలో ఈ పండుకోతి.... ఏదో గుబురు పొదవైపు చూపించి గోలగోలగా


అరవడము.... అలాగే ప్రశాంతముగా ఉన్న వాతావరణము కాస్త భయానకముగా మారడము అక్కడే హాయిగా తిరుగుతున్న జింకలు, దుప్పిలు, కస్తూరి మృగాలు, మంచుకోతులు, అడవి దున్నలు , మంచు పులులు దేనినో చూస్తూ భయపడుతూ శర వేగముతో పరుగులు తీయడము వీరిద్దరి దృష్టికి వచ్చింది! ఆ పొదల లోపల ఏముంది అని వీరిద్దరు అనుమాన భయముతో అక్కడికి వెళ్లితే.... అక్కడ ఏదో వింత వాసన గుప్పున వీరికి వచ్చింది! ఇరవై అడుగులు ఉన్న ఆ గుబురు పాదాలను ఎవరో బలముగా కదిలిస్తున్నట్లుగా.... విదిలిస్తున్నట్లుగా పెద్ద శబ్దముతో అలికిడి చెయ్యగా... వీరిద్దరిలో ఏదో తెలియని అనుమాన భయము వెంటాడింది! ఇంతలో ఈ గుబురు పాదాలనుండి సుమారుగా ఇరవై అడుగుల ఎత్తు ఉంది దట్టమైన నలుపు తెలుపు బొచ్చుతో... అటు మనిషి గాకుండా... ఇటు వానరము గాకుండా... మనిషిలాంటి శరీరముతో వానర ముఖంతో 'v ' ఆకారమున్న బొట్టుతో ఉన్న నర వానరము ఒకటి వీళ్ల మీదకి దూకి... పెద్దగా


అరుస్తూ... ఏటో వెళ్లిపోవడము క్షణాలలో జరిగింది! దీని దూకుడు వేగానికి వీరిద్దరు అదిరిపడి అక్కడే పడిపోయినారు! కొద్ది సేపటికి వాతావరణము ప్రశాంతస్థితికి వచ్చింది! జంతువులు, పక్షులు యధావిధిగా హాయిగా సంచారము చేస్తున్నాయి! వీరిద్దరు గూడ మామూలు స్థితికి వచ్చి... ఈ మానవ వానరము వెళ్లిన వైపు చూడగా... వీళ్లకి మంచులో సుమారుగా మూడున్నర అడుగులున్న పాదముద్రలు పైగా వీటికి ఆరు వ్రేళ్లు ఉన్నట్లుగా గమనించి.... ఈ మానవ వానరమే... హనుమంతుడని గ్రహించి... ఈ పాదాలకి నమస్కరించారు! ఇంతలో తమతో వచ్చిన ముదుసలికోతి రెండు సౌగంధిక పుష్పాలను అలాగే అరటి పండ్లు తీసుకొని రావడముతో... వీటిని తింటూ ఉండగా... ఈ పుష్పాల ఘాటైన సువాసనకు వీళ్లు స్పృహ తప్పి పడి పోయినారు!

                         ఇంతలో మెలకువ వచ్చి చూస్తే వీరిద్దరు కాశీ క్షేత్రములో ఉన్నారు! అసలు ఏమి జరిగినదో శ్రీనివాసమూర్తికి అర్ధము కాలేదు! తమ చుట్టూ సుమారుగా 18 దాకా మామూలు కోతులున్నాయి! అవి


పైగా వీళ్లకి సేవలు చేస్తున్నట్లుగా గమనించాడు! అప్పుడు పవన్ కాస్త ఇతనితో "మనము స్థూల శరీరాలతో హిమాలయాలకు వెళ్ళలేదు! సూక్ష్మ శరీరాలతో వెళ్లి హనుమాన్ దర్శనము చేసుకున్నాము! అప్పడిదాకా మన స్థూల శరీరాల దగ్గరికి ఎవరు రాకుండా ఈ కోతులే కాపాడినాయి! ఎందుకంటే సూక్ష్మ శరీరము లేని స్థూల శరీరము కాస్త శవముతో సమానము! ఎవరైనా మన శరీరాలు శవాలని గ్రహించి శవ సంస్కారాలు చేస్తే... మన సూక్ష్మ శరీరానికి ప్రమాదము అని గ్రహించి ఇవి ఇన్నాళ్లు కాపలా కాసినాయి! ఇలా ౧౨ రోజుల నుంచి ఇవి మనకి సేవలు చేస్తూ మన శరీరాలను కాపాడుతున్నాయి అని చెప్పగానే... శ్రీనివాస మూర్తికి వీటిమీద ఆ క్షణము నుండి ప్రేమ, ఆప్యాయత, మోహ, వ్యామోహాలు కల్గినాయి! ఇవే లేకపోతే తమ స్థూల శరీరాలు ఉండేవిగాదని గ్రహించి వీటి మీద కృతజ్ఞత భావము

పెంచుకున్నాడు! అలాగే సూక్ష్మ శరీర యానము అంటే భయము, అనాసక్తిని , ఏదో తెలియని చెప్పలేని స్థితిని పెంచుకున్నాడు! ఆ తర్వాత వీరిద్దరు కాశీ క్షేత్రము నుండి ఇంటికి వచ్చినారు! కాని


శ్రీనివాసమూర్తిలో సూక్ష్మశరీరయానముతో హిమాలయాలకి వెళ్లి హనుమత్ దర్శన అనుభవ అనుభూతి పొందిన విషయము జీర్ణించుకోలేకపోయినాడు! చచ్చినప్పుడు వెళ్ళవలసిన చోటుకి బ్రతికి ఉండగానే వెళ్ళడము లాంటి అనుభవమును పదే పదే గుర్తుకు రావడము జరుగుతోంది! దీనిని మర్చిపోలేకపోతున్నాడు! కాని పవన్ మాత్రము యధావిధిగా ఏమి తెలియని వాడిలాగా... ఏమి జరగని వాడిలాగా.. తన నిత్యకృత్య పనులలో బిజీగా అయిపోయినాడు. కాని శ్రీనివాస చక్రవర్తి అలా ఉండలేక పోయినాడు.

దానితో ఈయనకి తమకి నిజముగానే నిజరూప హనుమ దర్శనం అయిందా? అని పవన్ అడిగితే... అపుడు పవన్ వెంటనే "శ్రీనివాసా ఎందుకు అవ్వదు! మనకి నిజముగానే ఆయన నిజరూప దర్శనం అయ్యింది! గాకపోతే స్థూల శరీరముతో గాకుండా సూక్ష్మ శరీరముతో అయింది! అంతే తేడా? దీనివలన నీవు నమ్మలేకపోతున్నావు! అంతెందుకు 1992  సంవత్సరములో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఒకటి చెపుతాను! విను! అది ఏమిటంటే కర్ణాటక వాసులు బద్రీనాధ్ క్షేత్రానికి వెళ్ళినారు! అప్పుడు ఒక పిల్లాడు ఈ గుడిలో ఉండిపోయినాడు! ఆరోజు ఆరు నెలల పాటు గుడిని మూసే రోజు గావడము విశేషము! అనుకోకుండా ఆలయ పూజారులు గుడిలోపుల ఉన్న పిల్లవాడిని గమనించకుండా గుడిలో అఖండ దీపారాధన చేసి అక్కడ బ్రహ్మకమలాలుంచి ఆరు నెలల పాటు ఆలయ తలుపులు మూసి యధావిధిగా వెళ్ళిపోయినారు! లోపల పిల్లవాడు అలాగే గుడిలో ఉండిపోయినాడు! ఆరు నెలల తర్వాత గుడి పూజారులు ఈ ఆలయమును తెరిచి చూస్తే... లోపల ఈ పిల్లవాడు ఉన్నాడని గ్రహించి గమనించి ఆశ్చర్యము చెందినారు! ఎందుకంటే ఆ పిల్లవాడు ఆరు నెలల పాటు ఆహారము లేకపోయినా గూడ ఆరోగ్యముగా ఉండటము గమనించి ఆపిల్లవాడిని అడిగితే నా ఆకలి తీర్చటానికి హనుమంతు స్వామి వారు ఒక యతి రూపములో వచ్చి బద్రినారాయణుడిని పూజించి ఆయనకి పెట్టిన నైవేద్యమును నాకు ప్రసాదముగా పెట్టి ప్రతిరోజు ఇలా ఈ ఆరునెలలు చేసినారని ఆ పిల్లవాడు అమాయకముగా అమిత భక్తితో చెపుతూండేసరికి... అప్పుడు కాని ఈ లోకానికి ఆరు నెలల పాటు అఖండ దీపము ఆరిపోకుండా వెలగటానికి.... అలాగే అక్కడ పెట్టిన బ్రహ్మకమలాలు వాడిపోకుండా ఉండటానికి.... కారణము సజీవ హనుమంతుడని తెలిసింది! అంటే ఈయన సజీవముగా ఉన్నట్లేగదా! ఎందుకంటే బద్రీనాధ్ పర్వతమే-గంధమాదక పర్వతము అంటారు గదా! ఇలా ఆ పిల్లవాడికి ఆయనే స్వయంగా దర్శనము ఇచ్చినపుడు మనకి కల్గిన ఆయన దర్శనము నిజమే అవుతుంది గదా అనగానే.... శ్రీనివాస్ చక్రవర్తికి తమ అనుభవము గూడ నిజమేనని రూఢి అవ్వడముతో....


ఒక మంగళ వారము రోజు రాత్రి... తన ఇంటిలో నిత్యమూ పూజించే హనుమంతుడి విగ్రహమూర్తికి మోకరిల్లి.... "స్వామి! ఓ వీర హనుమంతా! నీ ముందు నేనెంత! ప్రభూ! నా అజ్ఞానమును మన్నించు! భీముడు అంతటివాడే నిన్ను గుర్తించలేదు! నేనెంత! నిన్ను గుర్తించనందుకు! నిన్ను గుర్తించే లోపల నీవు నన్ను వదిలి పెట్టినావు! అయిన బాధలేదు! హిమాలయాలలో చిరంజీవి తత్వముతో.... ఏడుగురు యతీశ్వరులు


ఉంటారని వారే... వ్యాసమహర్షి, మార్కండేయుడు, అశ్వథ్దామ, సంజయుడు, శ్రీ దత్తాత్రేయుడు, బలిచక్రవర్తి నువ్వు ఉంటావని మా అమ్మ తాను చదివిన కధలలో చెప్పగా విన్నాను! మీరు ఉన్నగూడ మీలాంటి వాళ్లని చూసేదెలా? ఒకవేళ చూసినంత మాత్రమున గుర్తుపట్టేదెలా? మీ అనుగ్రహ బలముంటే తప్ప మిమ్మల్ని గుర్తించలేము గదా! స్వామి! నేను చేసిన పూజా ఫలముతో నీ సాక్షాత్కార అనుభవ అనుభూతిని మిగిల్చినావు! అందుకు చాలా కృతజ్ఞుడిని! అంటూ కన్నీరు కారుస్తూ ఆవేదన భక్తితో అమితమైన ఆవేదన పడుతుండగా.... గుండె వేగము అమాంతముగా పెరుగుతూండగా... తనకి సహాయము చేసిన కోతులకి ఎలాగైనా ఏదైనా సహాయ సహకారాలు అందించాలనే తుది కోరికతో తుదిశ్వాస విడిచాడు! కొన్ని సంవత్సరాల తర్వాత భద్రకాళి అమ్మవారు ఉన్న వరంగల్లు ప్రాంతమునందు గృహస్థ కర్మయోగిగా పునఃజన్మ ఎత్తి.... ఏ కోతులు అయితే సహాయ సహకారాలు ఇచ్చినాయో...ఆ కోతులకి ప్రతిరోజు ఒక డజన్ అరటిపండ్లు వాటికిస్తూ... వాటి ఆకలి కొంతమేర తీరుస్తూ... గాకపోతే


సూక్ష్మ యానము చేసే యోగులన్నా... వారి జీవిత చరిత్ర కధలు విన్న గూడ ఏదో తెలియని వీర్రా వేశమునకి గురి అవుతూ... సత్యానికి... అసత్యానికి మధ్య ఉన్న సన్నని గీతను దాటలేక అయోమయము అర్ధముకాని భక్తికి... ముక్తికి మధ్య కొట్టు మిట్టాడుతూ కాలము వెళ్లదీస్తున్నాడు! పవన్ మాత్రము యోగమునందు పరిపూర్ణ సాధన స్థితికి రావటానికి పునః జన్మ ఎత్తి పరమహంస పవనానంద స్థాయికి చేరుకొని హనుమంతుడినే తన చుట్టూ రక్షణ కవచముగా ఏర్పర్చుకుంటే... పాపము శ్రీనివాస చక్రవర్తి పునః జన్మ అయిన కర్మయోగి మాత్రము ఆ హనుమంతుడిని కోతుల రూపములో నిత్యమూ ఆరాధించే స్థితిలో ఉండిపోయినాడు! కర్మ నివారణ చేసుకుంటూ ఉండిపోయినాడు! 

---------------శుభం భూయాత్--------------------------------

అని వ్రాసి ఉంది.ఇది చదివిన హర్వే కాస్త కృతజ్ఞతభావముతో తన పరమగురువైన పరమహంస కేసి చూస్తూండగా........


అపుడు పరమహంస వాయు శరీరము కాస్త ఈ జీవనాడి మార్గమునకు చివర ఉన్న హృదయ చక్రములోనికి ప్రవేశించింది. అంటే ఒక రకముగా చెప్పాలంటే యోగ చక్రాల వాటి అనుసంధాన మార్గాలు అన్నిగూడ బ్లాక్ హోల్స్ లాంటివేనని.... వీటియందు ప్రవేశించడానికి వీరి శరీర సైజులు వాటికి తగ్గట్లుగా మారే విధంగా ఏర్పాట్లు చెయ్యబడ్డాయని.... అర్హత, యోగ్యత ఉన్నవారికి మాత్రమే ఈ మార్గాలలో ప్రయాణించే యోగముంటుందని హార్వేకి, జోషికి, దేవికి అర్ధమయింది. అందుకే పరమహంస యొక్క శరీర సైజు తగ్గుతూ వస్తోందని వీళ్లు గ్రహించారు.

పరమహంస వాయు శరీరము కాస్త హృదయ చక్రమునకు అనగా సహస్ర చక్రముండే మెదడు భాగము నుండి జీవనాడి మార్గము ద్వారా ప్రయాణించి హృదయ చక్రముండే హృదయ భాగమునకు ఈయన చేరుకోవడము జరిగింది. అక్కడ నీలిరంగుతో 8 అంగుళాల అష్టాదశ పద్మము అందులో మధ్య భాగములో దివ్య తేజస్సుతో బిందు భాగమున్నట్లుగా ఈయనకి దర్శనమైంది. ఈ అష్టదళ పద్మ రేకులలో  వరుసగా శూన్యమైన మహాగణపతి, మహా విష్ణవు, మహా బ్రహ్మ, మహా శివుడు , మహాదేవి, శ్రీకృష్ణడు, మహా గురువు శ్రీ దత్తాత్రేయుడు, హనుమంతుడు సజీవ మూర్తులుగా దర్శనమిచ్చారు. ఇలా వీరంతా గూడ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, కాలము, కాంతి, శబ్దము అనే అష్టాంగాలుగా చేసుకొని స్త్రీ ప్రకృతి అలాగే పురుష ప్రకృతిని అష్ట చిరంజీవుల తత్త్వముతో ఈ చక్ర మూల ప్రకృతిలో ఉండి నడిపిస్తున్నారని ఈయనకి అర్ధమయింది.

ఆ తర్వాత.....

దివ్య తేజస్సు బిందువులోనికి ఈయన ప్రవేశించగానే... అక్కడ ఈయనకి ఇష్ట కామేశ్వరుడు, ఇష్ట కామేశ్వరి అలాగే ఇంద్రనీలి వర్ణమున్న ఇష్టలింగము దర్శనమిచ్చింది. ఈ శివలింగము నుండి లేత నీలిరంగు కాంతి బయటికి దివ్య తేజస్సు కాంతలతో వెలువడే దృశ్యము ఈయన కంట పడింది. అంటే జీవుల యొక్క ఆరా లోని సప్త వర్ణాలకు ఈ కాంతియే ప్రధానమని.... ఈ కాంతి శక్తి వల్లనే విశ్వములోని అన్ని జీవుల శరీరాలు కాస్త కాంతి శరీరాలుగా ఏర్పడుతున్నాయని ఈయన గమనించారు. అంటే జీవులలో హృదయ స్పందన అనేది కాంతి రూపముల  ప్రకారము అవుతుందని గ్రహించాడు. అలాగే ఇష్టకోరిక మాయ వలన కాలము నడుస్తోందని గమనించారు. అలాగే వీళ్లకున్న కామ గుణ స్పందన వలన విశ్వములో 84 లక్షల జీవజాతులు అలాగే 36 కోట్ల దైవాల సృష్టి అలాగే ఒక కోటికిపైగా పరమాత్మల సృష్టి మరియు సహస్ర కోటి లోకాలకి ఈ హృదయ చక్ర ఇష్ట కామేశ్వరుడు, కామేశ్వరి సంయోగ ఫలితమేనని ఈయన తెలుసుకున్నాడు.

ఇంతలో.....

వీళ్లు ఇద్దరు గూడ ఈయనతో తనకి ఇష్టమైన కోరిక ఏదైనా ఉంటే తీరుస్తామని అనేసరికి.... పరమహంస మౌనము వహించాడు. ఇదే స్థితికి గౌతమ బుద్దుడు సాధన స్థితికి వచ్చినపుడు ఆయన కాస్త కోరికలేని సమాజము చూడాలనే ఇష్టకోరిక కోరినట్లుగా పరమహంసకి జ్ఞాన స్ఫురణ అయింది. కోరికలేని సమాజము చూడాలని అనుకోవడము గూడ ఒక కోరికయే గదా ఆ విషయము ఆ మహానుభావుడు మర్చిపోయేంతగా ఇష్టకోరిక మాయా ప్రభావము చూపిందని పరమహంసకి అర్ధమై మౌనము వహించాడు. ఇక్కడ ఆలోచన, స్పందన,ఆశ,ఆశయం, భయం, ఆనందము, సంకల్పము ఏదైన గూడ లిప్త కాలములో అది కాస్త ఇష్టకోరికగా మారే ప్రమాదమున్నదని ఈయనకి అర్ధమై మౌనము వహించాడు. పైగా ఇలాంటి ఇష్ట కోరికలు అనగా రాజసం, పాశానుబంధం, ఐశ్వర్యం, మృత్యుభయనాశనం, రోగవినాశనం, రాక్షససంహారము, సుస్థిరం, మృత్యుజయం అనే అష్టకోరికలు తీర్చడానికి ఈ అష్ట పద్మ రేకులలో అష్ట దేవతలున్నారని ఈయనకి అర్ధమైన మౌనము వహించేసరికి వీరంతా గూడ నెమ్మది నెమ్మదిగా అదృశ్యమయ్యి శూన్యమవ్వడము ప్రారంభమైంది. అంటే తన హృదయ చక్ర విబేధన జరుగుతోందని పరమహంసకి అర్ధమైంది.

కాని ఈ చక్ర హృదయ గ్రంధి విబేధనము కాలేదని ఈయన తెలుసుకొనే లోపులే...

తన వాయు శరీరమును వాహనముగా చేసుకొని సుమారుగా 85 సంవత్సరాల వయో వృద్ధ స్త్రీ మూర్తి, పొడవైన గోర్లతో, రెండు కోరపళ్లతో, పొడవైన తెల్లని జుట్టుతో, గ్రద్దముక్కుతో, బాగా ముడతలు పడిన శరీరముతో ఉన్న స్త్రీ కాస్త గాలిలో తిరగడము మొదలైంది. ఈమెను చూడగానే మహా మృత్యు దేవతయని ఈయనకి అర్ధమయింది. 

ఈ దృశ్యము చూస్తున్న హార్వే వెంటనే... ఈమె ఎవరో కాని అచ్చు గుద్దినట్లుగా హ్యారి పోటర్ సినిమాలోని మంత్రిగతైలాగా ఉంది. గాకపోతే అందులో ఆమె కాస్త చీపురు మీద ప్రయాణము చేస్తే ఇక్కడ ఈమె కాస్త మన గురూజీ వాయు శరీరము మీద ప్రయాణము చేస్తోందని అనగానే ఇది నిజమేనని జోషికి, దేవికి గూడ అర్ధమైంది.

ఇంతలో....

ఈ వికట స్త్రీ పెద్దగా విరగబడి నవ్వుతూ పరమహంస కేసి చూస్తూ.... "ఓరే! నేను నీ మృత్యుదేవతను. నీ పాలిట మృత్యువును. నేను కాని నీ శరీరమునకు వాయువును అందించకపోతే నీవు ఛస్తావు. ఏంటి నీకు  భయము వేస్తుందా? మృత్యు భయం మొదలైందా? నన్ను చూసి శివుడే పరిగెత్తాడు. నువ్వు ఎంత? నీ బ్రతుకెంత? నా చేతిలో నీకు ఈ రోజు మూడింది. చావు రాసి పెట్టుకో" అంటూ పెద్దగా నవ్విన 

పరమహంస అంతే స్థాయిలో నిశ్శబ్దముగా మౌనముగా ఉన్నాడు. ఏ మాత్రము భయపడలేదు, స్పందించలేదు, అదరలేదు, బెదరలేదు. ఎపుడో చచ్చినవాడికి మృత్యు భయం ఎందుకుంటుంది. చావాలని అనుకొనే వాడికి మృత్యు భయం ఉంటుంది. తను ఎప్పుడికి నాలుగు శరీరాలతో మరణాలు పొంది ఈ శరీర సాధన స్థితికి వచ్చినవాడికి చావు భయము అలాగే మరణ భయము ఏముంటాయి అని మిగిలిన వాళ్లు అనుకొనేలోపులే....

ఈ స్త్రీ మూర్తి కాస్త పెద్దగా స్వరముతో "నచ్చావురా! నా మెప్పు పొందావురా! నన్ను గెలిచావురా! మృత్యువునే జయించినావురా! మృత్యుంజయుడివి అయ్యినావురా!" అంటూ అదృశ్యమై శూన్యమయింది. దానితో ఈయన హృదయ గ్రంధి విబేధన అవ్వడము ఆరంభమైంది.

అపుడు ఈ చక్ర గ్రంధియైన హృదయ గ్రంధి విబేధనము అయ్యేసరికి ఈయన వాయు శరీరము కాస్త అంగుళ పరిమాణమునకు అనగా సంకల్ప శరీరముగా మారింది.దానితో కాలము అనేది ఇష్ట కోరికల వలన తిరుగుతోందని ఈయనకి తెలిసింది. అసలు ఈ ఇష్ట కోరికలకి ఆలోచనలు ఇచ్చేదెవరు తెలుసుకోవాలనే సంకల్పముతో హృదయ గ్రంధి విబేధనముతో సంకల్ప శరీర ధారిగా మారి ముందుకి ప్రయాణించే ధ్యాన దృశ్యాలు హార్వే పరికరములో చేస్తున్న ఈ ముగ్గురు గూడ అంతే శ్రద్ధ భక్తితో ఈయనను గమనిస్తున్నారు.


No comments:

Post a Comment