ఈమె స్నేహితురాలికి వివాహామై ఒక పుత్రుడు కూడ ఉండుటవలన ఈమె చితికి ఈమె కుమారుడు నిప్పు పెట్టే దృశ్యము వీరందరు చూడసాగినారు.ఆతర్వాత జరిగే దశదిన పిండప్రదాన కార్యక్రమాలలో భాగముగా పుత్రుడు చేసిన మొదటి దినం అపరకర్మ చేసే రోజున చేసే పిండం వల్ల శిరస్సు,2వరోజు చేసే పిండం వల్ల కంఠం-భుజాలు, మూడవరోజు పిండం వల్ల వక్షం,నాలువ రోజు పిండము వల్ల పొట్ట,5వ రోజు పిండము వల్ల బొడ్డు,6వరోజు పిండం వల్ల పిరుదులు,7వరోజు పిండం వల్ల గుహ్యావయవాలు,8వ రోజు పిండం వల్ల తొడలు,9వరోజు పిండం వల్ల కాళ్ళు,10వ రోజు పిండము వల్ల పూర్తి శరీరము హస్త పరిమాణము అంతా పిండదేహముఏర్పడము ఆటుపై 11వరోజు మరియు 12వ రోజు పిండ ప్రధాన కార్యక్రమము వలన ఈ పిండదేహము భుజించి తన ఆకలిదప్పికలు తీర్చుకోవడము జరగడము స్వాతి ఆత్మ గమనించింది.ఇలా 12 రోజులపాటు జరుగవలసిన దిన కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వెలిగించిన దీపకాంతితో...ఆ తర్వాత 13వ రోజున తమతో ఉన్న దూతలు కాస్త ఈ పిండదేహమును తమ పాశాలతో బంధించి కట్టిసిన కోతిలాగా దూతలు చూపించిన ఒక గుహ మార్గమునందు ఈమె ఆత్మ 13వ రోజున నుండి ప్రయాణించడము మొదలు పెట్టింది!ఈమెతో పాటుగా ఎలాంటి శిక్షలు లేని ఆత్మగా స్వాతి సూక్షదేహము వీరిని అనుసరించ సాగింది. నరకమార్గమున 86 వేల ఆమడల దూరములో ఉన్న యమపూరి వైపుకి ప్రయాణము కొనసాగిస్తారు.ఈ మార్గమును తను ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక రోజు కాలములో 247 ఆమడల చొప్పున నడవడము జరిగింది.ఈ మార్గప్రయాణములో తనతో వచ్చిన దూతలు తమ పాశాలతో తన స్నేహితురాలి పిండదేహమును చేసిన పాపపు ఆలోచనలకి శిక్షగా విపరీతముగా హింసించడముతో పాటుగా ఒక్కొక్కచోట కాళ్ళలో దిగే ముళ్ళవలన,విషపూరితమైన పాముల,తేలు కాట్లు వలన,ఈ పిండదేహము విపరీతమైన యాతనలకి గురి అవుతూ ప్రయాణము కొనసాగించడము స్వాతి ఆత్మ గమనించింది. ఇలా నడుస్తూ దశదిన కార్యక్రమాలలో ఇచ్చిన దశదానాల వస్తువులు ఈ మార్గ ప్రయాణములో ఉపయోగించుకుంటూ అనగా గొడుగు , చెప్పులు , మంచినీళ్ల కుండ , దీపదానం , పుస్తక దానం , భూదానం , గోదానం , తిలదానం , శయ్యాదానం , వస్త్రదానము ఇలా చేసిన పది రకాల దానాలు ఈ మార్గ ప్రయాణానికి ఉపయోగపడతాయని స్వాతి ఆత్మ గ్రహించింది.అలాగే యమపురికి వెళ్ళటానికి 16 పురాలు మరియు వైతరిణి నది దాటవలసి ఉంటుందని స్వాతి ఆత్మ తెలుసుకుంది.
ఇలా వీరందరు సుమారు 17 రోజులపాటు నడిచి 18వ రొజున సౌమ్యపురము చేరడము ఈమె గమనించింది.ఈ పురమునందు ప్రేతాత్మలు అనగా అపమృత్యుదోషముతో మరణించినవారు,అకాల మరణాలు పొందినవారు, ఆత్మహత్యలు చేసుకున్నవారు..పిండప్రదాన కార్యక్రమాలు జరగనివారు,దహనసంస్కారాలు జరగనివారు,తీరనికోరికలున్న వారు...ఇలా ప్రేతాత్మలుగా ఈ పురమునందు ఆవాసము చేస్తూంటారని ఈమె తెలుసుకుంది.అలాగే ఈ పురము నందు పుష్పభద్ర పేరుతో నది ప్రవహించడము చూసింది.అలాగే ఇక్కడున్న అతిపెద్ద మర్రిచెట్టు క్రింద తనస్నేహితురాలిగా లాగా తీసుకొనిరాబడిన ఇతర జీవుల దేహలు విశ్రాంతి తీసుకోవడము ఈమె గమనించింది.అక్కడ ఈమె స్నేహితురాలికి మొదటినెల శ్రాద్ధ భోజనము అందించడము దానిని భుజించిన తర్వాత ఈమెను అక్కడనుండి 2వ పురము అయిన సౌరపురానికి తీసుకొని వెళ్లడము జరిగింది.అక్కడ ఈ పురమును యముడు లాగా ఉన్న జంగముడ అనే రాజు పాలకుడిగా ఉండటము స్వాతి ఆత్మ గమనించినది.అక్కడ ఈమె స్నేహితురాలికి రెండు నిమిషాలుపాటు ఎలాంటి శిక్షలు లేకుండా విశ్రాంతిని ఇస్తూ ఈమెకి 2వ నెల మాసికభోజనము అందించడము జరిగింది.ఇది తిన్న తర్వాత ఈమెను 3వ పురము అయిన నగేంద్రపురమునకు తీసుకొని వెళ్ళడము జరిగింది.ఇక్కడ ఉన్న అసిపత్ర వనం స్వాతి ఆత్మ చూసింది.దీని పొడవు సుమారుగా 2వేల యోజనలు ఉందని..ఇందులో భయకరమైన గ్రద్ధలు, కాకులు, పులులు, సింహలు, గుడ్లగూబలు,విపరీత రోదనలు చేసే తేనెటీగలు,దోమలు ఉండటము..పైగా ఈ వనములో అతి భయకరమైన కార్చిచ్చు ఉండటము ఈమె గమనించింది.ఈ దావానలం వలన తన పిండదేహనికి తట్టుకోలేని వేడి సెగలు..దీనితో పాటుగా ఈ వనములో ఉన్న చెట్ల ఆకుల వలన తన స్నేహితురాలి దేహనికి విపరీతమైన భాదపూరితమైన గాట్లు పడటముతో ఈ వన ప్రయాణము ఈమె చెయ్యలేక పోతుంది.ఆగితే తనతో వచ్చిన దూతల పాశాల దెబ్బలు తినవలసి రావడముతో..వీళ్లు నిర్ధయతో ఈడుచుకొని తీసుకొని వెళ్లుతూండము స్వాతి ఆత్మ గమనించినది.ఈ వన ప్రయాణము పూర్తి అయిన తర్వాత ఈమె స్నేహితురాలికి మూడు నిమిషాలుపాటు ఎలాంటి శిక్షలు లేకుండా విశ్రాంతిని ఇస్తూ ఈమెకి మాసికభోజనము అందించడము జరిగింది.ఇది తిన్న తర్వాత ఈమెను 4వ పురము అయిన గంధర్వపురమును తీసుకొని వెళ్ళినారు.అక్కడ ఈమెకి మూడవ నెల మాసిక భోజనాలు అందించడము స్వాతి ఆత్మ గమనించినది.ఆతర్వాత ఈమెను అక్కడించి 5వ పురము అయిన నిరంతరంగా కురిసే రాళ్ళ వర్షాపురమైన శైలాగ పురమునకు వెళ్లడము ఈమెకి నాలుగవ మాసిక భోజనము అందించడము ..ఆపై అటునుంచి 6వ పురమైన క్రౌంచపురమునకు అక్కడ ఈమెకి 5వ నెల మాసికభోజనము అందించడము..ఇలా 7వ పురమునందు క్రూరపురమునకు వీరందరు చేరుకోవడము జరిగింది. అంటే వీళ్ళ ప్రయాణము భూమ్మీద కాలప్రమాణ ప్రకారము ఈ పురము చేరుకోవటానికి 171 రోజులు పట్టినట్లుగా స్వాతి ఆత్మ గమనించినది.అక్కడ ఈమె స్నేహితురాలి పిండదేహానికి ఊనషాణ్మాసికం పిండాలు పెట్టడము దానితోపాటుగా ఈమె వాళ్ళు జరిపిన ఉదకుంభదానం వల్ల ఈమె దాహదప్పికలు తీరడము స్వాతి ఆత్మ గమనించినది.అక్కడించి ఈమె పిండదేహమును 8వ పురమైన యముడు సోదరుడైన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవన పురమునకు వీరందరు చేరుకోవడము జరిగింది.అక్కడ ఈమె దేహనికి ఎనిమిది నిమిషాలుపాటు ఏలాంటిశిక్షలు వెయ్యకుండా విశ్రాంతిని ఇవ్వడము స్వాతి ఆత్మ గమనించినది.అక్కడ ఈమె మాసికభోజనము తిన్న తర్వాత ఈమె స్నేహితురాలి పిండదేహము దగ్గరికి కొంతమంది బెస్తవాళ్ళు వచ్చి"ఓ దేహమా?రేపు నీవు భయంకరమైన వైతరణి నదిని దాటాలి.అది దాటించడానికి మేము పడవ నడిపేవాళ్ళము.ఈ పడవ ప్రయాణము చెయ్యాలంటే నీవు భూలోకము నందు గోదానం చేసి ఉండాలి.అది నీవు చేసినావా? అని అడగటానికి మేము నీ దగ్గరికి వచ్చినాము అనగానే ఈ పిండదేహము ఎలాంటి గోదానము చెయ్యలేదని చెప్పడముతో ...వాళ్ళలో ఒకడు కనీసము గోవు సంకర్షణార్ధము ఏమైన దానము చేసినావా? అడిగితే దానికి ఈ పిండదేహము ఏమి చెయ్యలేదని చెప్పడముతో...బెస్తవాళ్ళలో సహనము తగ్గి ఆవేశము ఎక్కువై...కనీసము వరుసగా ఏడు మహాశివరాత్రులైన రాత్రి జాగరణ చేసినావా? అడిగితే దానికి ఈ పిండదేహము లేదని చెప్పేసరికి...ఈ బెస్తవాళ్ళలో ఒకడుఈమెతో ఓ దేహమా!ఈ భయకరమైన ఈ వైతరణి నది ఓడ్డున శవాల ఏముకల గుట్టలుంటాయి.ఈ నది లోపల కుళ్ళి విపరీతముగా దుర్గంద వాసనలు ఇచ్చే మాంసాలు, నెత్తురు,చీము,ప్రవాహాలు,వెంట్రుకలే నాచుగా..మాంసమే బురదగా ...పైగా ఇందులో క్రూరమైన జలపక్షులు,మొసళ్ళు,విషపూరిత జలపాములు,సూదులాంటి ముక్కులు గల విచిత్ర పురుగులు,నీటికోతులు,వాడి ముక్కులు గల గద్దలు,బొంతకాకులు,మాంసభక్షణ చేసే చేపలు మరియు తాబేళ్ళు,జలగలు ..ఇలా జీవులు ఇందులో ఆవాసము చేస్తూ ఉంటాయి.పైగా ఈ నది జలము సల సల మండే రక్తము గావడము..దీనినే జలముగా త్రాగవలసి రావడము జరుగుతుంది.ఇలాంటి భయంకరమైన ఈ నదిని నీవు ఈదుకుంటు దాటవలసి ఉంటుంది.అదే గోదానము చేసినట్లయితే నీవు మా పడవలో కూర్చుని విశ్రాంతిగా ఈ నది ప్రవహామును దాటేదానివి.అదే గోసంరక్షణార్ధము ఏదైన ఆవు పోషణనకి గడ్డిదానము,ధనదానం ఇలా ఏదో ఒకటి చేసి ఉన్నట్లయితే ఆ ఆవు ఈ నది దగ్గరికి వచ్చి తన తోకను నీకు అందించి...తోకను గాలిలో ఉంచి..నిన్ను ఈ నదిని దాటించేది.అదే శివరాత్రి జాగరణ చేసి ఉన్నట్లే అయితే నీవు ఆకాశ గమన మార్గము ద్వారా ఈ నదిని దాటేదానివి అని చెప్పి వాళ్ళు అక్కడనుండి వెళ్లిపోవడముతో ఇలాంటి దానాలు ఏమి చెయ్యకపోవడముతో ఈ పిండదేహము ఏడ్వడము అలాగే భూమీద జరిగే గోదాన కార్యక్రమము వెనుక ఇంత కధ ఉన్నదా అని స్వాతి ఆత్మ తెలుసుకోవడము జరిగింది. మర్నాడు ఈ బెస్తవాళ్ళు వచ్చి తన స్నేహితురాలి పిండదేహమును పాశాలతో బంధించి వైతరణి నది వద్దకి తీసుకొని వెళ్ళడము స్వాతి ఆత్మ గమనించినది.ఆ తర్వాత స్వాతి ఆత్మ అలాగే ఈమెతో వచ్చిన ముగ్గురు దూతలు ఆకాశమార్గమున ఈ నదిని దాటుతుంటే...ఈ స్నేహితురాలి పిండదేహము మాత్రము సలసల మండే రక్తమున్న ఈ నది ప్రవహమును అందులో దిగి నడుచుకుంటూ..బెస్తవాళ్ళ చేపకి ముల్లు గుచ్చి చేపను పైకి లాగినట్లుగా ఈమె పిండదేహమును ఈ నదిలో ఈడ్చుకుంటూ ఈ నదిని దాటించడము...ఈ నదిలో భయంకరమైన భీభీత్సమైన పరిస్ధితులకి ఈమె దేహము చేసే ఆర్తనాదాలు వినలేక స్వాతి ఆత్మ మౌనముగా రోదించింది.ఈ నది ప్రయాణము పూర్తి అయిన తర్వాత ఈ పిండదేహనికి ఆరవ మాసిక భోజనాలు అందించడము..ఇది ఈమె తిన్న తర్వాత అక్కడనుండి 9వ పురమైన బహ్వాపదపురము చేరి అక్కడ ఏడోనెల మాసిక పిండాలు తిన్నడము స్వాతి ఆత్మ గమనించినది.ఆ తర్వాత 8వ మాసములో 10వ పురమైన దు:ఖద నగరము..అటుపై 9వ నెలలో 11వ పురమైన నానాక్రందపురము చేరడము...ఆపై 10వనెలలో 12వ పురమైన సుతప్తభవనపురము..11వ నెలలో 13వ పురమైన రౌద్రపురము చేరుకోవడము..ఆపై 12వ నెల యందు 14వ పురమైన ప్రేతాత్మలనూ భాదించే వర్షమేఘాలున్న పయోవర్షణ పురానికి చేరుకొని అక్కడ తన స్నేహితురాలి పిండదేహనికి న్యూనాబ్ధిక పిండాలు భుజించిన తర్వాత అక్కడి నుండి 15వ పురమైన తట్టుకోలేని చలి ఉన్న శీతాఢ్యపురమునకు చేరుకోవడము...అక్కడ ఉన్నవారు తన స్నేహితురాలి పిండదేహమును చూస్తూ..ఆమె చేసిన పాప పుణ్యాల లెక్కలు చెప్పడము స్వాతి ఆత్మ గమనించినది.ఎపుడైతే ఈ పిండదేహానికి పుణ్యాలు కన్నా పాపాలు ఎక్కువుగా ఉన్నట్లయితే...ఇక్కడ ప్రధమాబ్ధికం రోజు ఇచ్చిన పిండోదకాలు తినిపించి... అక్కడ నుండి 16 పురమైన బహుభీతి పురమునకు చేరుకోవడముజరుగుతుందని స్వాతి ఆత్మ గమనించినది.ఇలాగే తన స్నేహితురాలి ఆత్మ గూడ ఈ పురమునకు చేరుకోవడము...అక్కడ ఈ హస్త పరిమాణమున్న పిండదేహమునకు అన్ని రకాల బహుబంధనాల నుండి విముక్తి చెంది మరణము పొంది చేసిన ప్రారబ్ధ పాప కర్మ నివారణ కోసము బ్రొటన వ్రేలు పరిమాణమున్న వాయురూపము గల యాతన శరీరమును ఈమె స్నేహితురాలు పొందడము స్వాతి ఆత్మ గమనించినది.అక్కడ నుండి వీరంతా చేరువగా ఉన్నఈ పురానికి 44 ఆమడల దూరములో యమధర్మరాజు ఆవాసము చేసే యమపురం వైపు ప్రయాణము చేసి యమపురమునకు చేరుకొనిచేరుకోగానే అక్కడ ద్వారము వద్ద నల్లటి బొచ్చుతో...తోడెళ్ళు వంటి భయంకరమైన రూపముతో ఉన్న రెండు కుక్కలు కాస్త భయంకరమైన పదునైన వాడి పళ్ళును నోటిని తెరుస్తూ...ఓళ్ళు దడుసుకునే విధముగా ఈ కుక్కల అరుపుల ఆర్తనాదాలు వింటూండగా...ఇవి శమా...శలభా కుక్కలని స్వాతి ఆత్మ తెలుసుకొని అక్కడున్న ద్వారాలలో 60 యోజనాల పొడవు అనగా 720 అడుగుల ఉన్న (12*60=720)నాల్గు ద్వారాలలో దక్షిణ ద్వారము వైపు వీరంతావెళ్ళి అక్కడ ఈ ద్వారానికి కాపలాకాస్తున్న ధర్మధ్వజునితో ఈ దూతలు కాస్త పాపాత్మరాలు వచ్చినదని చెప్పడముతో... ఇతను లోపలకి అనుమతించడముతో...వీరంతా లోపలకి వెళ్ళుతూ ఉండటము స్వాతి ఆత్మ గమనించినది.
లోపలకి వెళ్ళిన వీళ్ళకి అపుడిదాకా సాధారణ మహరాజుగా ఉన్న యమధర్మరాజు కాస్త తన యదార్ధ స్వరూపదర్శనం అనగా మూడు యోజనాలు అనగా 36 అడుగుల ఎత్తుతో...32 చేతులతో..వివిధ రకాల దండాయుధాలతో...కాటుక వంటి నల్లని రంగు గల శరీరముతో...ఎర్రని కన్నులతో..కోరలతో..పెద్ద ముక్కుతో...ఒక దున్నపోతును వాహనము చేసుకున్న భయంకర ఉగ్రస్వరూపమును చూసిన వీరందరిలో వణుకు మొదలైంది.అపుడు ఈయన తన చేతిలో ఉన్న మృత్యుదండమును ఒకసారిగా ఝాళి పిస్తూ...తన దగ్గర ఉన్న మృత్యువు మరియు జ్వరము అను పరివారమును ఒకసారి చూసి...కొత్తగా వచ్చిన స్వాతి స్నేహితురాలి ఈ యాతన శరీరము చూసిఈమె చేసిన పాపము గూర్చి ప్రళయకాల మేఘగర్జన స్వరముతో అడుగగా...వెంటనే అక్కడున్న చిత్రగుప్తుడు తన దగ్గర ఉన్న చిట్టాను తీసి..."స్వామి..ఈమె కాస్త భూలోకము నందు పాతివ్రత్య ధర్మమును తప్పినది" అనగానే...యమధర్మరాజువెంటనే..."అయితే ఈమెకి తప్తోర్మి నరక శిక్షను తక్షణమే అమలపర్చండి" అని ఆజ్ఞ ఇవ్వగానే అక్కడున్న పరివారము ఈ యాతన శరీరమును తీసుకొని వెళ్ళడము స్వాతి ఆత్మ గమనిస్తూండగా ఈమెను చూసిన యముడు కాస్త శాంతముగా ఓహో...కాశీ క్షేత్రమునందు ఈమెను పరమహంస పవనానంద యోగి తమ తపోశక్తితో ఈమెను మరణానంతర జీవితానుభవము కోసము ఊర్ధ్వోలోకాలకి పంపించిన మన లోక సంచార యోగాత్మ ఈమెనా...ఆయన అనుజ్ణ ప్రకారము మనలోక శిక్షలు,విశేషాలు చూపిస్తే...వారి లోకమునకు వెళ్ళి చెపుతుంది అంటూ అక్కడున్న దూతలకి ఆజ్ఞ ఇచ్చి ఈయన లోపలకి వెళ్ళుతున్న యమధర్మరాజును స్వాతి ఆత్మ చూస్తూ...యమపురినడక ప్రయాణములో నానా రకాల నరకాలు కనపడినాయి గదా అనుకుంటు ఈయనకి నమస్కరిస్తూ...దూతలు వెంట స్వాతి ఆత్మ నడుస్తూ...తన స్నేహితురాలికి వేసిన శిక్షను చూడాలని అనుకుంటూ వెళ్ళుతూండగా..ఒక చోట ఈమెకి తన స్నేహితురాలి యాతన శరీరము కనిపించగా...దగ్గరికి వెళ్ళి చూడగా..మండుచున్న ఇనుప నగ్న పురుషుడి బొమ్మతో ఈమె కాస్త శృంగారము చెయ్యలేక ఆర్తనాదాలు చేస్తూంటే...ఈమె ప్రక్కనే ఉన్న దూతలు కాస్త తమ చేతిలో ఉన్న పాశాలతో ఈమె దేహమును దండిస్తూ...నీకు భూలోకము నందు బంగారము లాంటి భర్త ఉండగా...పర పురుషుడితో కామకాలపము చేసి ఆనందించినావు గదా...మరి ఇపుడు గూడ ఈ లోకములో ఆర్తనాదాలు ఆపి ఆనందించు ...అంటూ పాశముతో విపరీతముగా కొట్టుతూండేసరికి ఈ దృశ్యమును చూసిన స్వాతి ఆత్మ మౌనముగా భాదపడి సాగింది.పడుతూ ముందుకి సాగుతూండగా ఈమెతో వచ్చిన దూతలు ఈమెతో..." యోగాత్మ...ఈ లోకములో 84 లక్షల పాపాలకి తగ్గట్లుగా 21 నరక శిక్షలు అనగా 1. తామిస్ర నరకం,2. అంధతామిస్ర,3. రౌరవము,4. మహా రౌరవము,5. కుంభీపాకము 6. సూచీముఖీ, 7. అసిపత్రనరకం,8. అవీచి, 9. అంధకూపము,10. వైతరణి,11. పుయోద,12. కృమిభోజనం, 13. నానాభోజన,14. రేత:పానం,15. కాలసూత్ర,16. ప్రాణరోధ,17. తప్తోర్మి,18. శాల్మలి,19. వినశము,20. వజ్రకంటక,21.సందర్శ నరకం ఉన్నాయి.ఈ నరక శిక్షలు ఇపుడు తను చూస్తున్న శిక్షలు అని వీటిని చూసిన వారికి లేదా జరిగిన విన్నవారికి భూలోకము నందు పాపకార్యము చెయ్యడము దేవుడెరుగు...పాపపు ఆలోచన చెయ్యడానికే గుండె ఆగి ఛస్తారని స్వాతి ఆత్మ అనుకుంటూ ఉండగా దూతలు కాస్త ఈమెతో...యోగాత్మ..ఈ శిక్షలు అనుభవించిన యాతన దేహాలకి వారి కర్మశేష నివారణ కోసము భూలోకమునందు పున:జన్మలుగా జంతు జన్మలు వారు చేసిన పాప కర్మనివారణ కోసము ఎత్తించడము జరుగుతుంది.అనగా అబద్ధాలు చెప్పినవాడికి స్ఫష్టమైన వాక్కులేని జన్మగా...మాంసము అపహరిస్తే గ్రద్ద జన్మగా...ఆత్మహత్య చేసుకున్నవాడు కాస్త కొండమీద నల్లత్రాచు జన్మ..పరపురుషుడిని కోరిన స్త్రీ కి రెండు తలాల పాము జన్మ అని అనగానే అంటే తన స్నేహితురాలు పున:జన్మ రెండు తలాల పాము జన్మయని స్వాతి ఆత్మ గ్రహించి వెళ్ళుతూండగా...
తనతో వచ్చిన దూతలు కాస్త ఉన్నట్టుండి దైవదూతలుగా మారేసరికి స్వాతి ఆత్మ ఆశ్చర్యము చెందుతూండగా ..."తల్లి...ఇపుడు మనము యమపురి దాటి వచ్చినాము..ఇక్కడ నుండి ఆరు దేవత లోకాలు అనగా భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక అనే ఊర్ధ్వ దైవ లోకాలకి సంబంధించినవి అన్నమాట. ఇందులో అత్యధికముగా పుణ్యాలు చేసిన పుణ్యజీవులు అనగా ముక్తిజీవులు ఆవాసము చేస్తూంటారు.మరి ఈ లోకాలను చూద్దాం అంటూ వీరందరు ముందుకు ప్రయాణించగా..వీరికి మొదట భువర్లోకము (భూలోకము పైన) కనిపించినది. ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుష్యములైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెరా, కింపురుష, విద్యాధరులు ఇచ్చట ఉన్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకి ప్రయాణించగా..సువఃలోకము లేక సువర్లోకము లేక స్వర్గలోకము (భువర్లోకము పైన)కనిపించినది. ఇక్కడ అధిష్ఠాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష-వాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగములనుభవింతురు. వీరికి వ్రుద్ధ్యాము, శరీర దుర్గందాధులుండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున, మాత్రు-గర్భ వాసము లేదు. స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకి ప్రయాణించగా..మహర్లోకము (సువర్లోకము పైన)కనిపించినది. ఇక్కడ దేవతలు తపమొనరించు చుందురు. ఎలా స్వర్గలోకములోని దేవతలు దివ్య సుఖమును అనుభవించుచున్నారో, అవియన్నియూ ఇక్కడ తపస్సు ద్వారా పరుపూర్ణముగా అనుభవించుచున్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకి ప్రయాణించగా..జనోలోకము (మహర్లోకము పైన) కనిపించినది.దీనిని కొందరు సత్యలోకమని కూడా అందురు. ఏ స్త్రీ భర్త మరణానంతరము సహగమనము చేయునో, ఆమె యొక్క పవిత్ర శీలప్రభావముచేత ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పిటికినీ, జన్మరాహిత్యము కలిగి, సతిపతులిరువును ఈ జనలోకములో సుఖసాంతులతో వర్ధిల్లుదురు. ఇచ్చట అయోనిజ దేవతలు కూడా తపమాచరించుచున్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకి ప్రయాణించగా..తపోలోకము (జనోలోకము పైన) కనిపించినది.ఇక్కడ అయోనిజ దేవతలు నివసించుచుందురు. పంచభూతములు, పంచేంద్రియములు వీరి ఆధీనములో ఉండును. కైలాసము, వైకుంఠము, మణిద్వీపము, స్కంధలోకము ఇచ్చటనే కలవు. ఈ లోకము సర్వదా సుగంధ ద్రవ్యముల సువాసనలతోను, శాంతియుతముగాను, సాంద్రానందముతోను కూడియుండును. భూలోకములో ఎవరెవరు, ఏయే దేవతాముర్తులను ఉపాసించిరో ఆయా మూర్తుల రూపములతో ఇచ్చట తపములాచరించుచున్నారు. ఈ రీతిగా వారు కల్పాంత-కాలము అచ్చటనే ఉంది. కర్మానుసారము భూలోకములో మరల జన్మించి, మరల పవిత్ర తపములు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయములో సర్వమూ లయమగునో అప్పుడు వీరుకూడ జన్మరాహిత్యము పొందుచున్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకి ప్రయాణించగా..సత్యలోకము (తపోలోకము పైన) కనిపించినది. ఇచ్చటనే సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మయను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేకానేక కల్పానంతరము ఒక్కక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మములో లయమగుదురు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగము తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకములోకూడ అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోకములో ఆత్మజ్ఞానము పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు వేదాంతవిచారణలు గావించుచుందురు. మహాప్రళయకాలములో బ్రహ్మలోక పర్యంతముగాగల సప్తలోకములు పరబ్రహ్మములో లయమగును. బ్రహ్మయొక్క ప్రతి రాత్రులందు ఒక్కొక్క ప్రళయము సంభవించి, భూలోకము, భువర్లోకము, సువ(స్వర్గ)ర్లోకములు లయమును పొందును. అతని యొక్క పగటి కాలమందు పునః ఈ లోకములు సృష్టింపబడుచున్నారని స్వాతి ఆత్మ గ్రహించి ఈ లోకమును దాటి వీరంతా ముందుకి ప్రయాణించగా..
ఇలా ఈ ప్రయాణము ముగింపుగా ఒక దివ్య తేజస్సు కాంతి పుంజాలు లాంటి గోళాకారపు భూమి లాంటి లోకాలను చూసింది. అందులో తనకి తెలిసిన బంధువులు , మిత్రులు , స్నేహితులు , ప్రేమికులు , శత్రువులు , బాధపెట్టినవారు , బాధించిన వారు , మోసగించిన వారు ఇలా వారందరు ఒక్కొక్కరిగా వివిధ లోకాలలో సుమారుగా ఇలా దాదాపుగా 1000 లోకాలలో ఉన్నవారిని స్వాతి ఆత్మ చూసింది! తను గుర్తు పట్టింది. కాని ఈమె ఆత్మను వీళ్ళు ఎవరు గూడ గుర్తు పట్టకపోయేసరికి ఈమెకి ఆశ్చర్యానందాలు వేసింది! మెరిసిపోయే దేహకాంతులున్న లోకమే స్వర్గమని... దేహకాంతి లేని క్రూర భయంకరముగా ఉన్న లోకమే నరకమని... పాపపుణ్యాలను బట్టి ఈ లోకాల ప్రవేశ యోగ్యతలు ఉంటాయని ఈమె స్వాతి ఆత్మ తెలుసుకొంది!
ఇంతలో ఒక దివ్యమైన బ్రహ్మ తేజస్సుతో వెలుగుతున్న జ్యోతి స్వరూపము ఒకటి ఈమె ఆత్మకి అగుపించి అదికాస్త అశరీరవాణితో " తల్లి! ఇక నన్ను దాటి వెళ్ళాలంటే నీవు అవిముక్త కేత్రమైన కాశీకేత్రమునందు మరణమును పొందితే కాని పాపపుణ్యాల కర్మఫలితము లేని కారణలోకమునకు చేరుతావు.నీవు వచ్చిన పని పూర్తి అయినది! నీకు గావాలసిన ప్రశ్నకి సమాధానము ఇదే అని చెపుతుండేసరికి...
" స్వాతి! స్వాతి! నిద్రలేవే! కూర్చొని నిద్రపోతున్నావా? లే! " అంటూ తన స్నేహితురాళ్ల గొంతు బిగ్గరగా వినిపించేసరికి... ఒక్కసారిగా ఉలిక్కిపడి స్వాతి కళ్ళు తెరిచి చూడగా... ఇదంతా గూడ ఒక కలయని తెలుసుకొని మృత్యు భయము తగ్గి... ఎదురుగా స్నానము చేస్తున్న నాగసాధువును చూసేసరికి " వామ్మో! ఈయనను చూసిన ఒక్క క్షణ చూపుకే ఇంతటిశక్తి! తను ఏమి అడగకుండానే... తను కదలకుండా... ఆయన మెదలకుండా... తనకి చూపు ద్వారా శక్తిపాతము చేసి తన మరణ అనుభవమే ఒక కలగా... ధ్యాన అనుభవ దృశ్యముగా లీల మాత్రముగా చూపించి తన ప్రశ్నకి సమాధానమును ఈ విధంగా ప్రత్యక్ష అనుభవ అనుభూతి చూపించిన ఆ నాగసాధువు వైపు కృతజ్ఞతతో చూడగా...
ఇది గమనించిన ఆ సాధువు ఈమె వంక అదోలా చూస్తూ బిగ్గరగా...
" ఓ మానవుడా....
అసలు మరణానికి ముందు
జీవితము ఉందా? అది
ఆలోచించు... "
శంభో శంకర! హరహర మహాదేవా
అంటూ ఆ నది నుండి బయటికి వచ్చి మౌనముగా ఈమె వంక చూస్తూ
అభయమిస్తూ వెళ్ళిపోసాగినాడు! అవునుగదా! తను ఇన్నాళ్లు మరణము తర్వాత జీవితము ఏమిటని ఆలోచించినది! కాని నిజానికి మరణము ముందు అసలు జీవితమే లేదుగదా అని అనుకుంటూండగా ఇంతలో స్వాతికి ఎక్కడ నుండో... దగ్గరిలో ఉన్న గుడి నుండి...
" మానవుడు పాత దుస్తులు
విడిచి... కొత్త వాటిని ధరించినట్లుగానే...
ఆత్మగూడ పాత శరీరాన్ని విడిచి....
క్రొత్త దేహములోనికి వెళుతుందని
మరణించిన వాడికి జన్మం తప్పదని
జన్మించిన వారికి మరణం తధ్యమని "
ఆత్మకు మరణములేదని... అది నాశనము గాదని...
అంటూ సుమధుర గాయకుడైన పూజ్య శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు చెప్పిన భగవద్గీత శ్లోకాలు గమకముగా లీలగా విన్పించ సాగింది! దానితో స్వాతి మనస్సుకి అద్వితీయమైన ఆనందము కల్గుతూ ఇన్ని సంవత్సరాలకి ఈ శ్లోకార్థమును ప్రత్యక్ష ధ్యాన అనుభవ అనుభూతి ద్వారా తెలుసుకొన్నాను అనే ఆత్మశాంతితో ఆత్మ తృప్తి పడి ఆత్మానందముతో... కాశీ గంగ స్నానము చెయ్యసాగింది!
ఇంతడితో తన రెండవ ప్రశ్న అయిన మరణము తర్వాత ఏమి జరుగుతుందో జోషికి తెలియడముతో అపుడిదాకా కనిపించిన స్వాతి కథ దృశ్యము కాస్త తన త్రినేత్రము నందు అదృశ్య మవ్వడముతో....
ఆ తర్వాత తన తల్లి మరియు కుటుంబ సభ్యులు కలిసి తన అన్న ఆస్తికలు తీసుకొని కాశీక్షేత్రానికి చేరుకున్నారు. గంగాస్నానము చేసి విశ్వనాధుడు నుండి కాలభైరవుడు దాకా దర్శనాలు పూర్తి చేసుకొని తన అన్న అస్థికలు మణికర్ణిక ఘాట్ లో తన తల్లి కలుపుతుండగా తన చెట్టంత కొడుకు తన కళ్ల ముందే చనిపోయేసరికి ఆవేదనను తట్టుకోలేక గుండెపోటుతో అక్కడికక్కడే ఆ తల్లి ప్రాణాలు గూడ పోయి తనువు చాలించింది. ఈ దృశ్యాలు గూడ జోషికి కనిపించాయి. అపుడు ఆవిడ సూక్ష్మ శరీరము కాస్త మణికర్ణిక ఘాట్ వద్ద చేరుకోగానే మహాశివుడు రామ తారక ఉపదేశము చేసే విధానము జోషికి కనిపించసాగింది.
జోషికి ఆకాశములో... శవ దహనము జరుగుతున్న ప్రాంతములో... 70 mm ధియేటరులో ఒక దేవుడి సినిమా దృశ్యము చూస్తున్నట్లుగా ఒక వీడియో దృశ్యము లీలగా కనబడసాగింది!
శవ దహనము పూర్తి అయిన జీవుడి యొక్క మూర్చబోయిన సూక్ష్మ శరీరము మహాశివుడి ఒడిలో ఉన్నట్లుగా కనిపించసాగింది! అప్పుడు శివుడు కాస్త కపాలధారిగా... తలపై చంద్రుడితో... మెదడులో నాగపాములతో... ఏనుగు చర్మము ధరించినవాడిలాగా కనబడుతున్నాడు! డుంఢి గణపతి కాస్త తన తొండముతో గంగా జలమును తీసుకొని ఈ జీవుడు పైన అభిషేకము చేస్తున్న దృశ్యము లీలగా కనిపించసాగింది! ఆ తర్వాత దండపాణి ఈ జీవునికి భస్మధారణ చేసి రుద్రాక్ష ధారణా చేసే దృశ్యము లీలగా కనిపించసాగింది! అటుపై పార్వతీదేవి ఈ జీవి మరణ వేదన నుండి ఉపశమనము కలిగించుటకు కస్తూరి, గంధ లేపనం పుయ్యడముతో పాటుగా... తన చీరకొంగును ఒక విసన కర్రలాగా.... విసురుతున్న దృశ్యము లీలగా కనిపించసాగింది! అప్పుడు సాక్షి గణపతి ఈ జీవుడు చేసిన పాపపుణ్యాల లెక్కలు చెప్పే దృశ్యము లీలగా కనిపించసాగింది! అప్పుడు కాల భైరవుడు కాస్త వాని పాప పుణ్యములను విచారించి ఆ సూక్ష్మ శరీరమును 7 క్షణాలు పాటు రుద్రపిశాచమువలె మార్చి అనేక విధాలుగా దండించి తదుపరి ఈ జీవుడికి తారక మంత్రోపదేశమునకు సిద్ధము చేస్తున్న దృశ్యము లీలగా కనిపించసాగింది! ఆ తర్వాత ఇట్టి సూక్ష్మ దేహమును దండపాణి కాస్త మహాశివుడి ఒడికి చేర్చి అందరు కలిసి ఈ జీవుడికి తారక మంత్రోపదేశముగా చేయవలసినదిగా మహాశివుడిని ప్రార్ధించే దృశ్యము లీలగా కనిపించసాగింది! అప్పుడు ఆ సూక్ష్మధారికి స్పృహ వచ్చి చూస్తే... ఆ మహాశివుడు కాస్త ముగ్ధ మనోహర రూపముతో... ఆ జీవుడి కుడి చెవిలో తారకమంత్రోపదేశము చేస్తున్న లీలా దృశ్యము కనిపించసాగింది! అటుపిమ్మట ఈ దేహము కాస్త ఊర్ధ్వలోకాల వైపు ప్రయాణించే దృశ్యము కనబడి... ఈ దృశ్యము అంతాగూడ అదృశ్యమయినది! అంటే కంచి మహాస్వామి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారికి, శ్రీ తాడేపల్లి రాఘవశాస్త్రిగారికి , శ్రీ రామకృష్ణ పరమహంసకి ఇలాంటి మనోహర దృశ్యము తాము అనుభవ అనుభూతిగా చూశామని వారి చరిత్రలలో చెప్పిన విషయమును నిజమేనని జోషి గ్రహించే లోపుల....
తనకి ఉన్నట్టుండి తన అన్న మరియు తల్లి మరణవేదన గుర్తుకు వచ్చి అనర్గళముగా తన నోటి వెంట శోకము నుండి శ్లోకము అనగా
కాశీ క్షేత్రములో మరణము పొందాలని
ఈ క్షేత్ర దేవాలయ పూజారి ఆశయం.
వేరే ప్రాంతములో ఉన్న తన తల్లికి
ఆరోగ్యం బాగులేదని కబురు వస్తే...
ఇతను అక్కడికి వెళ్ళి ఆస్పత్రిలో ఉన్న
తల్లిని చూసి తల్లడిల్లిపోయిన
ఈ పూజారి గుండె ఆగిపోయింది.
కొడుకు చితాభస్మమును తీసుకొని
కాశీగంగలో కలుపుతుండగా
ఆ తల్లి తట్టుకోలేక తనువు దాల్చింది.
అందుకే కాశీక్షేత్రానికి
చచ్చేవాళ్ళు -వృద్ధుల రూపములో
చచ్చినవాళ్ళు - అస్ధికల రూపములో
వస్తారనే నానుడి నిజమైంది.
ఈ విధంగా తన తల్లి మరణము ద్వారా కాశీ క్షేత్రములో మరణిస్తే ఏ విధంగా ఉంటుందో అలాగే తన అన్న మరణము ద్వారా వివిధ ప్రాంతాలలో చనిపోయిన వారి స్థితి గతులు ఎలా కలుగుతాయో ఈ లోకానికి చూపించారని జోషి అనుకొని తన మనస్సులోనే గురూజీకి కృతజ్ఞతలు చెప్పసాగాడు.
పరమహంస కాస్త ..... ......
నాలుగు గుహలుగా ఉన్న కర్మ, గుణ, కాల, బ్రహ్మ చక్రాల వైపు తన తదేక దీక్షతో సాధన చెయ్యడము ఆరంభించారు. ఈ ధ్యాన దృశ్యాలు గూడ కాలాముఖుడు, జోషి, హార్వే, దేవి గూడ చూడటము ప్రారంభించారు.
Gurudeva 🙏🙏🙏 janmalu, kharmalu yelavuntayo chepparu. Chesina punya paapala lekhalu telcharu. Swargam ante a enti, narakam ante yento chuparu, dhanyosmi gurudeva 🙏🙏🙏
ReplyDelete