అధ్యాయము 5

 డాక్టర్ జోషి,హార్వే,దేవి.....

ఈ ముగ్గురు కలిసి....
గురుదేవుడైన పరమహంస
ధ్యానము చేస్తున్న గదిలో చూడగానే.....60 సంవత్సరాల వయస్సున్న ఒక పెద్దాయన ధ్యానము చేస్తూ కనిపించాడు!
గదిలో ఏలాంటి ఫోటోలు, పెయింటింగ్స్,విగ్రహమూర్తులు కనిపించలేదు!
కేవలము ఈయన ముందు ఒక ఖాళీ దిమ్మెమాత్రమే కనిపించింది!
దాని ముందు ఈయన ------ చాపమీద పద్మాసనములో కూర్చొని కళ్లు మూసుకొనియున్నారు! అంతే!

కాని......ఇంతలో.....
అతిస్పష్టముగా...... పెద్ద ఓంకారనాదము విన్పించసాగింది! గాకపోతే ఈయన చెయ్యడము లేదు! పెదాలు కదిలించడము లేదు! కానీ నాదము ఎక్కడ్నుంచి వస్తోందో అర్ధము కాలేదు! ఖాళీ దిమ్మె ఎదురుగా
ఈయన కూర్చొని ఎవరిని ధ్యానిస్తున్నారో వీళ్లకి అర్ధము కాలేదు!

ఇంతలో....
హార్వే.... తన చేతిలో ఉన్న కెమెరాతో.... ఈయన శరీరమును ఫోటోలు తియ్యగా.....
మణిపూరక చక్రము నుండి దాని అంతట అదే ఓంకారనాదము వస్తోందని  ఈ చక్ర శుద్ధి అయ్యిన వారికి ఇది సాధ్యపడుతుందని లో గొంతుతో శకుంతలాదేవి అక్కడ ఉన్న వారితో చెప్పడము జరిగింది!

ఈ ఫోటోలు పరీక్షించిన డాక్టర్ 
జోషి వెంటనే వారితో....
ఒక విషయము గమనించారా?
ఈయన మనకి లాగ శ్వాసక్రియను ఊపిరితిత్తులతో జరపడము లేదు! గుండెతో శ్వాస నడుస్తోంది!
అనాహత చక్ర శుద్ధి అయిన 
వారికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది!

వెంటనే హార్వే అందుకొని ....
ఇదంతా బాగానే ఉంది! కాని ఈయన సూక్ష్మశరీరము ఏమైంది? నా ఫోటోలలో ఎందుకు కనిపించడము లేదు అనగానే......
ఉన్నట్టుండి....
శివోపాసన మంత్రాలు పెద్దగా బిగ్గరగా వినిపించసాగాయి!
ఓం ఆత్మయే నమః
ఓం ఆత్మలింగాయ నమః
అంటూండగా....
ఈయన భ్రుకుటి స్థానము నుండి ఒక కాంతిరేఖ బయటికి ప్రసరిస్తూ వీళ్లకి కనిపించసాగింది!

అప్పుడు ఒక విచిత్రము జరిగింది!
అది ఏమిటంటే.....ఈ భ్రుకుటి స్థానము అనగా ఆజ్ఞ చక్ర మధ్య భాగము నుండి మూడు అంగుళాల
పరిమాణము ఉన్న ఈయన సూక్ష్మశరీరము  బయటికి వచ్చి....గాలిలో.....ఖాళీగా ఉన్న దిమ్మె మధ్య భాగమునకు చేరుకున్న దృశ్యము వీళ్లకి కనిపించసాగింది!

ఆ తర్వాత....
ఈ ఆత్మ శరీరము కాస్త ఉన్నట్టుండి మూడు అంగుళాల స్పటికలింగముగా 
మారే దృశ్యము చూసిన.....
శకుంతల దేవి వెంటనే.....
అంటే?అంటే? ఈయన తన ఆత్మశక్తితో తన ఆత్మను ఆత్మలింగముగా మార్చుకున్నారు అన్నమాట! ఈ యోగమును
శివయోగము అంటారు! ఇందులో 
ఆరు దశలలో సాధన స్థితి ఉంటుంది!

ఈ స్థితులలో ఆఖరిదైనా....ఆత్మను ఎవరైతే ఆత్మలింగముగా మార్చుకుంటారో వారే శివుడు అవుతారు! ఓం శివోహం!
అంటూ లో గొంతులో మిగిలిన వాళ్లకి చెపుతూండగా.....

ఈ ఆత్మ లింగము కాస్త....దివ్యమైన పసుపు రంగు కాంతి శక్తిలో.... మెరవడము మొదలైంది!
ఈ దృశ్యము చూసిన హార్వే వెంటనే...
ఈ ఆత్మలింగమును చూస్తుంటే నాకు అంజి సినిమాలో హీరోకి దొరికిన విద్యులత స్పటిక ఆత్మలింగముగా కనబడుతుంది! అంటే ఈ లెక్కన విశ్వములో ఆత్మలింగము ఉండటం అనే సిద్ధాంతము నిజమే అన్నమాట! ఇప్పుడిదాకా మహాశివరాత్రి నాడు నోటిలో శాలిగ్రామాలు లేదా 
బాణలింగాలు ఉంచుకొని వాటిని బయటికి
ఆత్మలింగాలుగా చెప్పే బురడీ బాబాలు, గారడీ స్వామీజీలను చూశాను! అంటే నిజానికి ఆత్మలింగము అంటే ఎవరైతే
తమ ఆత్మను పరిశుద్ధముగా మార్చుకుంటారో వారి ఆత్మ కాస్త పరిశుద్ధ స్పటిక లింగముగా మారి ఆత్మలింగమవుతుందని ఈ పరమహంస గారిని చూసేదాకా నాకు తెలియలేదు! వామ్మో! ఈయన పరిచయము గాకముందే ఇలాంటి షాక్ ఇస్తే పరిచయము అయితే ఇంకా ఇలాంటివి ఎన్ని చూడవలసి వస్తుందో గదా అంటూండగా...
ఉన్నట్టుండి...
ఆత్మలింగము కాస్త.... మళ్లీ తిరిగి ఈయన హృదయ పద్మము అనగా గుండెలో ఇముడిపోవడముతో.... ఈయన ధ్యాననిష్ఠ నుండి కళ్లు 
తెరవడముతో.....ఈ ముగ్గురు కాస్త భయముతో గూడిన గౌరవముతో అక్కడ నుండి బయటకి వచ్చి హాల్ లో
ఉన్న తమకి ఇచ్చిన చెక్క బల్ల మీద కూర్చొని స్థిమిత పడటము మొదలుపెట్టారు.
హార్వే తేరుకొని....
అవును! ఆయన ఇందాక చదివిన మంత్రాలు నేను పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో హీరో తన రాజనర్తకి వక్షస్థలమును చూసి శివలింగముగా భావించుకొని పూజ చేస్తున్నపుడు చెప్పిన మంత్రాలుగా ఉన్నాయి గదా! అంటే ఆ సినిమాలో హీరో చేసిన స్త్రీ శివలింగ పూజ కైలాసములో ఉన్న మహేశ్వరుడికి చేరినట్లుగా...
ఈయన చేసిన ఆత్మలింగ పూజగూడ పరమేశ్వరుడికి గూడ చేరుతుంది అన్నమాట అంటూండగా....
గది తలుపు తెరుచుకున్న శబ్దము అయింది!

గురుదేవుడు పరమహంస 
బయటికి వచ్చి....అక్కడే ఉన్న వాలుకుర్చిలో కూర్చుని వీరికేసి చిరునవ్వుతో చూసి పలకరించారు.


No comments:

Post a Comment