పరమహంస కాస్త 5వ డైమన్షన్ లోనికి అడుగు పెట్టే దృశ్యము ఈ ముగ్గురు చాలా విచిత్రముగా చూస్తున్నారు.ఎందుకంటే పరమహంస కాస్త అగ్నికాంతి ఆత్మశరీర కాంతిపుంజముతో 4వ డైమన్షన్ బ్రహ్మకపాలము యొక్క బ్రహ్మరంధ్రము నుండి బయటికి వచ్చి ఆ ప్రక్కన్నే ఉన్న 5వ డైమన్షన్ బ్రహ్మకపాలము యొక్క ముక్కు రంధ్రము ద్వారా లోపలకి ప్రవేశించడము జరిగింది.ఇదేవిధముగా కాలాముఖాచార్యుడు గూడ తన అంతర్యామిగా తన యోగచక్రములోని 64 కపాలధారిలో 4వ కపాలము నుండి 5వ కపాలములోనికి నీలిరంగు కాంతి శరీరముతో ప్రయాణించడము జరిగింది.ఈ దృశ్యాలు చూస్తునా ఈ ముగ్గురికి ఒకే కారును బుక్ చేస్తే అది ఎక్కడ ఉందో ఎలా అయితే జి.పి.అస్.విధానములో తెలుస్తుందో అలా వీరిద్దరి కపాల కాల ప్రయాణమున్నదని వీళ్లకి అర్ధమైంది.అంటే బ్రహ్మరంధ్రము ద్వారా డైమన్షన్ నుండి బయటపడితే మరొక డైమన్షన్ లోనికి ముక్కు ద్వారా ప్రవేశించడము జరుగుతోందని కాలము అనేది శ్వాస గమనము బట్టి నడుస్తుందని అందుకే పరమహంస కాస్త కపాల ముక్కు రంధ్రము ద్వారా లోపలికి వెళ్లుతూ అదే కపాల బ్రహ్మరంధ్రము బయటికి వస్తున్నారని వీరికి అర్ధము అయ్యింది.
5 వ డైమన్షన్ లోనికి అడుగుపెట్టిన పరమహంసకి మేలుముత్యపు రంగు శరీరాలతో స్వాతి ముత్యాల హారాలు ధరించిన కొద్దిమంది ప్రతినిధులు ఈయనికి స్వాగతము పలకటానికి రావడము జరిగింది.ఇది చంద్రలోకమని ఈయనికి అర్దమైంది.ఎందుకంటే ఈ లోక అంతరిక్షములో 16 కళలతో చంద్రబింబాలు వరుసగా ఒకదాని తర్వాత మరొకటి ఉన్నట్లుగా దర్శనమిస్తున్నాయి.అంటే పౌర్ణమి చంద్రుడి నుండి అమావాస్య చంద్రుడి దాకా 16 కళలతో 16 రూపాలతో చంద్ర దర్శనాలు అయినాయి.ఈ లోకవాసులు కాంతి జలమునే అహారముగా దాహార్తి తీసుకోవడము అలాగే కాంతి కృష్ణ జింకలను తమ వాహనాలుగా వాడుకోవడము ఈయన గమనించారు.ఆ తర్వాత భూలోక కాలమాన ప్రకారము అక్కడ గురు పౌర్ణమి తిధి నడుస్తూ ఉండటముతో పూర్ణ చంద్రుడి కళ దగ్గరికి ఈయనను తీసుకొని వెళ్ళడము జరిగింది.చంద్రదేవుడితో సంభాషణలు పూర్తి అయ్యి వారి అతిధి సత్కారాలు పూర్తి చేసుకొని వాళ్ళు ఇచ్చిన చంద్రబ్రహ్మ పదవి మీద ఆశలేదని
పరమహంస కాస్త 6 వ డైమన్షన్ ప్రధాన ద్వారము దగ్గరికి చేరుకోవడము జరిగింది.6వ డైమన్షన్ అంతా గూడ విశ్వములోని అంతరిక్షములోని నక్షత్రాల సముదాయమని అనగా నక్షత్ర గ్రహలోకమని ఈయనికి అర్ధమై వీరి ప్రతినిధుల అనుమతి తీసుకొని పరమహంస యధావిధిగా 7వ డైమన్షన్ ప్రధాన ద్వారము వద్దకు చేరుకోవడము జరిగింది.ఇది బుధగ్రహలోకమని ఇందులో బుధగ్రహలోకవాసులు అలాగే బుధగ్రహ లోకాంతరవాసులు ఉంటారని ఈయనికి అర్ధమై వీరి అనుమతితో 8వ డైమన్షన్ కి వెళ్లితే అది కాస్త శుక్రగ్రహలోకముగాను ఆపై 9వ డైమన్షన్ అనేది కుజగ్రహ లోకమని ఆ తర్వాత 10 వ డైమన్షన్ గురు గ్రహ లోకమని ఆపై 11వ డైమన్షన్ అనేది శనిగ్రహ లోకమని ఆయా డైమన్షన్స్ లోనికి పరమహంస వెళ్ళి తెలుసుకొని వారి అనుమతితో ఇలా 11 డైమన్షన్స్ యాత్ర పూర్తి చేయడము జరిగింది.ఆ తర్వాత 12 డైమన్షన్ నుండి సప్తర్షి మండలాలు మొదలై 18 డైమన్షన్స్ దాకా కొనసాగాయి.అనగా అత్రి,అంగీరస,పులస్త్యుడు,పులహుడు,క్రతువు, మరీచి,వశిష్ఠ ఇలా సప్తరుషులను ఆయా డైమన్షన్స్ లలో పరమహంస కలుసుకొని వారి అతిధి సత్కారాలను పొంది వారి అనుమతితో ఈ సప్తర్షి డైమన్షన్స్ యాత్ర పూర్తి చేయడము జరిగింది.ఆ తర్వాత 19 డైమన్షన్ ధ్రువ మండలమని ఇందులో ఉన్న ధ్రువుడిని కలుసుకొని వారి అనుమతితో పరమహంస కాస్త 20వ డైమన్షన్ లోకి అడుగు పెట్టడము జరిగింది.ఇది కాస్త సప్త లోక డైమన్షన్స్ అనగా నిజానికి ఈ లోకాలు వరుసగా భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం,సత్యలోకం అయితే ఇందులో భూలోకం,భువర్లోకం,సువర్లోకం ఈ మూడులోకాలు 3వ డైమర్షన్ కి చెందిన లోకాలు అన్నమాట.అందుకే మనకి ఈ లోకాలవాసులైన సర్వదేవతలు గూడ భూలోకమునందు విగ్రహలు రూపములో..దైవాత్మల రూపములో భూలోకవాసులకి పూజలయందు. ధ్యానాలయందు, కలలయందు కనపడటం జరుగుతుంది.
20వ డైమర్షన్ కాస్త మహార్లోకమని..ఇందులో కల్పాంతజీవులు ఆవాసము చెయ్యడము పరమహంసకి కనపడింది.వీరి అనుమతి తీసుకొని ఈయన 21వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ జనలోకము దర్శనమైంది.ఇందులో ఆది బ్రహ్మ మానస పుత్రులైన సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారుడు కనిపించారు.దానితో పరమహంస వీరి అనుమతిని తీసుకొని 22వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అది తపోలోకముగా దర్శనమైంది.ఇందులో విదేహిలు,కర్మ-జన్మరాహిత్యులు,వివిధ రకాల ముక్తులు పొందిన ముక్తిజీవులు తమకున్న ఇష్ట కోరిక నుండి కోరిక రాహిత్య స్ధితిని పొందుటకు తీవ్రమైన ధ్యాననిష్ఠలో తపస్సు చేసుకుంటూ కనిపించారు.వీరు లోకాల కళ్యాణార్ధముకోసము కారణజన్ములుగా ఆయా లోకాల యందు జన్మించి తమకి కల్గిన జ్ఞానస్ఫురణలు లోకాలకి అందించే అవతారపురుషులని పరమహంసకి అర్ధమై వీరి అనుమతి తీసుకొని 23వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ ఒక దివ్య బ్రహ్మకమలము నందు చతుర్ముఖ బ్రహ్మ కాస్త వారి కర్మలానుసారముగా జీవకోటికి అలాగే దైవ కోటికి విధిరాతను వారి కపాలము నుదట రాస్తూ కనిపించగానే అంటే ఈయన విధాతబ్రహ్మయని ఈ లోకము సత్యలోకమని ఈయనకి జ్ఞానస్ఫురణ కల్గడముతో వీరి అనుమతిని తీసుకొని పరమహంస కాస్త 24వ..25వ..26వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ బ్రహ్మ.విష్ణు,మహేశ్వర లోకాలైన త్రిమూర్తుల త్రిలోకాలు దర్శనమిచ్చాయి.దానితో పరమహంస ఈ ముగ్గురిని ఏకకాలములో దర్శించి వారి అనుమతులు తీసుకొని 27వ డైమర్షన్ లోనికి అడుగు పెట్టడము జరిగింది.దీనితో పరమహంస సప్త ఉర్ధ్వో లోకాల మరియి త్రిలోకాలయాత్ర పూర్తి అయింది అన్నమాట.
పరమహంస కాస్త 28వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే
శ్రీ వైకుంఠధామము కనపడింది.ఇందులో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి తల్పము మీద ఉండి ఈ విశ్వ స్ధితికారకుడిగా మూడు భాగాలుగా అనగా కర్నాడక సాయి విష్ణువుగా..గర్బోదన సాయి విష్ణువుగా..క్షీరోదకసాయి విష్ణువుగా మారి లోకపరిపాలకుడిగా ఉన్నట్లుగా పరమహంసకి దర్శనమైంది.ఒక రకముగా చెప్పాలంటే ఈయన చూడటానికి తిరువంతపురములోని అనంతపద్మనాభుడిలాగా ఉన్నారని పరమహంసకి అనిపించినది.
దానితో వీరి అనుమతి తీసుకొని 29వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే...మూడు తలాలతో త్రిముఖ ఈశ్వరుడు కాస్త విశ్వసృష్టి,స్ధితి,లయ ప్రక్రియలు చేస్తూ కనిపించగానే..ఈయనే రుద్రమహేశ్వరుడని..ఈ లోకమే మహేశ్వర లోకమని పరమహంసకి జ్ఞానస్ఫురణ కల్గడముతో.. ఈయన కాస్త
వీరి అనుమతి తీసుకొని 30వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే ఒక దివ్యజ్యోతి మాత్రమే దివ్యతేజస్సు కాంతులు వెదజల్లుతూ కనపడింది.ఈ జ్యోతియే పరంజ్యోతి యని పరమహంసకి జ్ఞానస్పురణ అయింది.దీనినే బ్రహ్మజ్యోతిగా పిలువడము జరుగుతోందని ఈయనకి అర్ధమై అక్కడ నుండి
31వ డైమర్షన్ లోనికి అడుగుపెట్టడము జరిగింది.ఇందులో బ్రహ్మ మరియు గాయత్రి,బ్రహ్మణి సమేతముగా మహాబ్రహ్మలోకముగా దర్శనమవ్వడముతో పరమహంస వీరి అనుమతి తీసుకొని
32వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అదికాస్త నవ నారాయణులున్న నారాయణుడు,నారాయణి సమేతముగా ఉన్న మహా వైకుంఠలోకముగా ఈయనకి దర్శనమైంది.దానితో వీరి అనుమతి తీసుకొని
33వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే పరమేశ్వరుడు..పరమేశ్వరీ కుటుంబ సమేతముగా మహా కైలాస లోకముగా దర్శనమివ్వడముతో వీరి అనుమతి తీసుకొని పరమహంస 34వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ జ్యోతిబిందువుగా ఒక దివ్యజ్యోతి దర్శనమివ్వడముతో ఇది కాస్త ఆత్మజ్యోతియని జ్ఞానస్పురణ అందుకున్న పరమహంస కాస్త 35వ డైమర్షన్ లోనికి అడుగుపెట్టడము జరిగింది.ఇందులో చతుర్ముఖ పంచబ్రహ్మలోకాలున్న ఆది బ్రహ్మలోకముగా దర్శనమివ్వడముతో పరమహంస కాస్త ఈయన అనుమతి తీసుకొని 36వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ ఈయనకి అష్టవసువులున్న అష్టలోకాలుగా ఉన్న ఆది విష్ణులోకముగా దర్శనమివ్వడముతో పరమహంస కాస్త ఈయన అనుమతి తీసుకొని 37వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ ఈయనకి ఏకాదశ రుద్రలుగా ఉన్న రుద్రలోకాలతో ఆదికైలాస లోకముగా దర్శనమివ్వడముతో పరమహంస కాస్త ఈయన అనుమతి తీసుకొని 38వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ ఈయనకి
వరుసగా అమ్మవారి సప్త మాతృక దేవతలు అనగా బ్రాహ్మణి ,మహేశ్వరి ,కౌమారి , వైష్ణవి ,వారాహి ,ఇంద్రాణి మరియు చాముండ లోకాల దర్శన చేసుకొని వారి అనుమతి తీసుకొని ఈ సారి అమ్మవారి శ్రీచక్ర నవారణలోకాలలో ఉన్న 123 దేవతలను దర్శించుకొని వీళ్ళు అనుమతులు తీసుకొని ఆదిపరాశక్తి మాత లోకము అయిన శ్రీ బిందులోకము నందు ఉండే శ్రీ లలితా రాజరాజేశ్వరీ మాతను దర్శించుకొని వారి అనుమతితో ఈ 17 అమ్మవారి లోక డైమర్షన్స్ యాత్రపూర్తి చేసుకొని ఆ తర్వాత
55వ నుండి 59వ డైమర్షన్స్ వరకు మహశివుడి పంచముఖ అవతరాలైన ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత లోకాలు దర్శనమివ్వడముతో వీరి అనుమతులు తీసుకొని పరమహంస కాస్త 60వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ శివ అర్ధనారీ తత్త్వలోక దర్శనమివ్వడముతో వీరి అనుమతి తీసుకొని 61వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే శివకేశవ తత్త్వలోకము దర్శనమివ్వడముతో
వీరి అనుమతి తీసుకొని 62వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే అక్కడ అష్ట ఇష్టకోరికలు తీర్చే ఇష్టకామేశ్వరుడు,ఇష్టకామేశ్వరీ,ఇష్టలింగమున్న ఇష్టలోకము దర్శనమివ్వడముతో వీరి అనుమతి తీసుకొని
పరమహంస కాస్త 63వ డైమర్షన్ లోనికి అడుగుపెడితే ఈ విశ్వమాతగా ఆదిశక్తి త్రితలలుగా అనగా దుర్గ,కాళీ,చంఢీ తలలున్న త్రిమాత దర్శనమైంది.అంటే నిజానికి ఈ విశ్వములో ప్రతినిత్యము జరిగే సృష్టి,స్ధితి,లయలకి మూలకర్త ఈమేనని పరమహంసకి జ్ఞానస్పురణ అందడముతో వీరి అనుమతి తీసుకొనే సమయములో విశ్వమాత కాస్త విశ్వమాయను చూపడము ఆరంభించింది.అనగా ఏకకాలములో పరమహంస మీద ఉన్నట్టుండి దుర్గాదేవి కాస్త గురు వాత్సల్యం..కాళీ కాస్త భర్త వాత్సల్యం..చంఢీ కాస్త పుత్ర వాత్సల్యం చూపడము ఆరంభించారు.అంటే ఈ విశ్వసృష్టి ఆరంభములో ఆదిపరాశక్తి తన నుండి వచ్చిన మహా శివుడిని ఇలాగే ఈ మూడు స్ధితులలో అనగా భర్తగా (పరమేశ్వరుడు..పరమేశ్వరీ).. కుమారుడిగా(తారాదేవి-శివుడు).. గురువుగా(శివుడు-పార్వతి) చూసిన సంఘటనలు లీలగా పరమహంసకి స్ఫురణ రావడముతో...అయినగూడ వీరి మధ్య సంయోగాలు జరిగి విశ్వసృష్టి జరిగినదని..ఇదియే ఈ సృష్టి ఆది తప్పు యని బృహదారణ్యకోపనిషత్తు చెప్పిన విషయము నిజమేనని పరమహంసకి అర్ధమై విశ్వమాత కేసి చూస్తూ మౌనభాషతో..
"అమ్మా..నాకు నీ యందు ఎలాంటి మనోవికారాలు లేవు.మమకారాలు.మోహాలు,వాత్సల్యాలు గూడ లేవు.నువ్వు నాకు ఒక కూతురువి" అనగానే..
ఈయన తన విశ్వమోహమాయను దాటాడని గుర్తుగా విశ్వమాత కాస్త నవరత్నఖచిత బంగారపు పీఠము వరముగా ఇచ్చి దర్శనమివ్వగా..దాని క్రింద మోక్షజ్ఞ పీఠము అన్న పేరు ఉండడము గమనించిన పరమహంసకి శ్రీ ఆదిశంకరాచార్యుడు యొక్క సంఘటన ఈయనకి ఆ కాలములో జ్ఞానసరస్వతి కాస్త సర్వజ్ఞ పీఠమునకు ఈయనకి అర్హత,యోగ్యత ఉన్నదో లేదో అని జ్ఞానపరీక్ష పెడితే ఆయన అందులో నెగ్గి ఈ పీఠమును అధిరోహించి లోకానికి భారతీయ ఆధ్యాత్మికతను చాటించిన విషయము లీలగా గుర్తుకు వచ్చింది.గాకపోతే బుద్ధుడిలాగా కోరిక లేని సమాజము చూడాలనే కోరిక పెట్టుకొని సాధన చేసినట్లుగా...ఈయన గూడ జ్ఞాన ప్రచారము చెయ్యాలనే ఉద్ధేశ్యములో కీర్తికాంత మాయలో పడి సర్వజ్ఞ పీఠాధిపతిగా మారారు.ఇపుడు తను గూడ తనకి ఇచ్చిన ఈ మోక్షజ్ఞ పీఠము గూడ ఇలాంటిదేనని పరమహంసకి జ్ఞానస్ఫురణ అవుతూండగా..మహా కాళీ మాత కాస్త తండ్రి..నీకు ఈ పీఠమును అధిరోహించలంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానమివ్వాలి..
అసలు మోక్షాలెన్ని రకాలు అనగానే..
పరమహంస ఆలోచనలో పడ్డాడు.ఎందుకంటే ఇపుడు దాకా తను కపాలమోక్షమే ఉన్నదని అనుకున్నాడు.ఇపుడు కాళీ అడిగిన ప్రశ్న బట్టి చూస్తే ముక్తికి పంచముక్తులున్నట్లుగా ఖచ్చితముగా ఇలాగే మోక్షానికి గూడ రకాలు ఉండి ఉండాలి.అవి ఏమై ఉంటాయా? అని ఆలోచిస్తుండగా ఒకసారిగా సప్తమోక్షపురాలు జ్ఞాపకము వచ్చాయి. మధుర, కాశీ, ద్వారక ,ఉజ్జయిని, కంచి, అయోధ్య,హరిద్వార్....అంటే ఈ పురాలు బట్టి చూస్తే ఖచ్చితముగా సప్తమోక్షాలు ఉండి ఉండాలి.అవి ఏమై ఉంటాయి అని ఆలోచింస్తుండగా...ఒక పట్టనా అర్ధము కాలేదు.
అపుడు ఈ సప్తపురాలను విశ్లేషణ చెయ్యడము అనగా మధుర పురమంటే శ్రీకృష్ణుడి జనన ప్రాంతము గావడము వలన ఇది జీవుడి సప్త శరీరాల జనన మరియు మోక్షమిచ్చే శరీరమోక్షపురము అయ్యిండాలి.ఆ తర్వాత కాశీక్షేత్రానికి వస్తే ఇక్కడ ప్రతినిత్యము శవదహనాలు జరగడమువలన ఇక్కడ కపాలమోక్షం జరుగుతుంది.అందువలన ఇది కపాలమోక్షపురము అయ్యిండాలి.ఇక ద్వారకక్షేత్రమునకు వస్తే శ్రీకృష్ణుడు దగ్గర శమంతకమణి ఉండుటవలన ఈ పురము కాస్త మణిమోక్షపురము అయ్యిండాలి.ఇక ఉజ్జయినిక్షేత్రానికి వస్తే ఇక్కడ ఉన్న శివలింగము పురుషశివలింగము గావడము వలన ఈపురము కాస్త పురుషశివలింగమోక్షపురము అయ్యిండాలి.ఇక కంచిక్షేత్రానికి వస్తే ఈ పురము కామాక్షిదేవత ఆధీనముగావడము వలన ఈ పురము కాస్త .స్త్రీ శివలింగమోక్షపురము అయ్యిండాలి.ఇక అయోధ్యక్షేత్రానికి వస్తే శ్రీరాముడు కాస్త తన ఆత్మలింగమును రామేశ్వరక్షేత్రమునందు మూడు అడుగుల స్ఫటిక ఆత్మలింగమును ప్రతిష్టించడమువలన ఈ పురము కాస్త ఆత్మలింగమోక్షపురము అయ్యిండాలి.ఇక హరిద్వార్ క్షేత్రానికి వస్తే రుషికేశి క్షేత్ర శివలింగము అనేది మహాశివుడు కాస్త హాలహలము సేవించడము వలన ఈ నీలిరంగుశివలింగము ఉద్భవించినదని చెప్పడము బట్టిచూస్తే ఈపురము కాస్త పరమమోక్షపురము అయ్యిండాలి.అంటే ఈ లెక్కన చూస్తే సప్తమోక్షాలు అనగా శరీరమోక్షం..కపాలమోక్షం..పురుషశివలింగమోక్షం..స్త్రీశివలింగమోక్షం..మణిమోక్షం..... ఆత్మలింగమోక్షం..పరమమోక్షం అను ఏడు రకాల మోక్షాలుంటాయని...ఇందులో సప్తశరీరాల మోక్షం అంటే సర్వ కర్మలు నివారణ చేయడము అలాగే కపాల మోక్షము అంటే కర్మ జన్మల నుండి విముక్తి పొందటము ఇక మణూల మోక్షము అంటే మన మనస్సుకి కోరికల రాహిత్యస్థితి ఇవ్వడము శివలింగాల మోక్షము అంటే అన్నింటి యందు పరిపూర్ణరాహిత్య స్థితి పొందటము ఇక ఆత్మలింగ మోక్షము అంటే అన్నింటియందు ఇంద్రియనిగ్రహముతో ఉండి జితేంద్రియుడవ్వడము అన్నమాట.ఇక ఆఖరిదైనా పరమమోక్షం అంటే పూర్ణశూన్యమునందు పూర్ణముగా శూన్యమవ్వడము అన్నమాట...ఎవరైతే వారి వారి కర్మలనుసరముగా ఆయా క్షేత్రాలయందు 9 రోజులనుండి 9 సం!!రాలుపాటు ఆవాసము చేస్తారో వారికి ఆయా మోక్షం కల్గుతుందని..పరమహంసకి జ్ఞానస్ఫురణ కల్గడముతో
ఇదే సమాధానము కాళీఅమ్మవారికి చెప్పడముతో ఆవిడ అమితానందము చెంది బ్రహ్మపదవి గూడ ఒక మహామాయ అని తెలుసుకున్న పరమహంస వివేకబుద్దికి దానిని త్యాగము చేసిన మనోధైర్యానికి ఆశ్చార్యానందాలని గురి అవుతూ ఎప్పుడైతే పరమహంస కాస్త 63 వ డైమన్ష్ లోని త్రిమాత విశ్వమాయ అయిన మోక్షజ్ఞ బ్రహ్మ పదవిని కాదని అనుకున్నాడో అపుడు కాని ఈ విశ్వమాత ఇతనికి ఆధీనమై తన ఆత్మశక్తినంతటిని మహాకాళి అనుగ్రహము వలన 54 బాణ లింగాలుగా మార్చి ఆయన మెడలో స్ఫటికమాల రక్షణ కవచముగా పడింది.అంటే భూమిమీద ఉన్న అమ్మవారి 54 శక్తి పీఠాలకి ఎంతటి శక్తి ఉంటుందో అంతటి శక్తి ఈ బాణలింగాల స్ఫటికమాలకి ఉంటుందని పరమహంసకి ఙ్ఞాన స్ఫురణ అయింది.
నిజానికి శ్రీఆదిశంకరాచార్యుడు కాస్త లోకకళ్యాణార్ధము ప్రపంచానికి బ్రహ్మఙ్ఞానమును అందించాలని సర్వఙ్ఞ పీఠ బ్రహ్మ పదవిని అధిరోహించడము జరిగింది.ఈ ఙ్ఞాన మాయ వలన ఈయనికి విశ్వమాత ఆధీనము కాలేదు.తద్వారా ఈయనికి అమ్మవారు కాస్త పంచ స్ఫటిక పురుష శివ లింగాలను ప్రసాదిస్తే వాటిని తీసుకొని ఈయన భారత దేశానికి నాలుగువైపుల నాలుగు మఠాలు ఏర్పరిచి అనగా..ఈ నాలుగు లింగాలను ప్రతిష్టించి 5వ స్ఫటిక లింగమును కాస్త చిదంబరము క్షేత్రములో మోక్ష లింగముగా ప్రతిష్టించడము జరిగింది.అదే గుప్త యోగి అయిన పరమహంస ఉద్ధేశ్యము,ఆలోచన,సంకల్పము వేరు.అది ఏమిటంటే సాధన చేసి తను మాత్రమే కపాల మోక్షము పొందుతాడు.అదే ఏకముగా విశ్వానికి మోక్షమిస్తే తనతో పాటుగా విశ్వములోని సర్వ జీవులు గూడ మోక్షమును పొందుతాయి గదా.అందుకే ఈయన మొదటి నుండి తనకి వచ్చిన పదవులు,యోగాలు,సిద్ధులు,శక్తులు అన్నింటిని త్యాగము చేస్తూ సర్వపరిత్యాగిగా మారి ఇలా 63 వ డై|| దాకా వచ్చి విశ్వమాతను ఆధీనము చేసుకొని మోక్షఙ్ఞ బ్రహ్మపదవిని వదులుకొని 64 వ డైమన్ష్ వైపుకి ప్రయాణించాలని నిశ్చయించుకోవడము జరిగినది.లేదని ఈ పదవి ఆశిస్తే తను మాత్రమే కపాలమోక్షము పొంది అమ్మవారిలో ఐక్యము చెందుతాడు అన్నమాట.
ఇంతలో 63 వ డైమన్ష్ లోని బ్రహ్మకపాలములో ఉన్న ఈశ్వర ఆత్మ లింగము కాస్త గోముఖ తీర్ధము నుండి దివ్యతేజస్సుతో బయటికి వచ్చి ప్రయాణము చేయడము మొదలుపెట్టింది.దీనిని అనుసరిస్తూ పరమహంస యొక్క ఆత్మ శరీరము ప్రయాణము మొదలైంది.అంటే ఒక రకముగా చెప్పాలంటే ఇంతవరకు నూటికి 98% మంది యోగులకి తెలియని విషయము కేవలము 2% మంది యోగులకి మాత్రమే తెలిసిన మార్గము వైపు అలాగే కనిపించే విశ్వము అసత్యమని..కనిపించని శూన్యము సత్యమని నిరూపించే అంతిమ సత్య అనుభవానుభూతి పొందే వైపు అనగా అంతిమ కపాలమైన 64వ కపాలమున్న 64 వ డైమన్ష్ వైపు తమ ప్రయాణము కొనసాగుతూందని.... పరమహంసకి ఙ్ఞాన స్ఫురణ అయినది.
ఈ ప్రయాణములో..ఆరంభముగా..ఒక 21 అడుగుల పొడవున్న తెల్లని ఏనుగు దంతము దర్శనమైనది. ఈ దంతము మధ్య భాగములో ఒక అంగుళ పరిమాణములో ఉన్న గజముఖ గణపతి దర్శనమైంది.ఈయన కాస్త ఈశ్వర ఆత్మ లింగమును తన తొండముతో పట్టుకోవాలని విశ్వప్రయత్నము చేసినా గూడ అది సాధ్యముగాక చివరికి ఈ ఆత్మలింగము దివ్యతేజస్సుకి ఈయన శరీరము దగ్ధమై..అది కాస్త అస్థిపంజరమైన క్షణాలలోనే ఈశ్వర ఆత్మలింగము తన ప్రయాణము కొనసాగిస్తుండగా..
దారి మధ్యలో ఒకచోట బంగారపు రంగుతో దివ్య తేజస్సుతో ఉన్న 24 అడుగుల మహా పాంచజన్య శంఖము దర్శనమిచ్చింది.విచిత్రముగా ఈశంఖము నుంది ఎడమ చెయ్యి బయటికి వచ్చి ఈ ఈశ్వర ఆత్మ లింగమును పట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసిన గూడ జయము పొందకపోవడముతో ఈ అభయహస్తము మీద ఈ హస్తము కాస్త క్షణాలలో అస్థిపంజరమైంది.
అ తర్వాత..ఈశ్వర ఆత్మలింగము తన ప్రయాణము కొనసాగిస్తుండగా..ఈసారి ధ్యాననిష్ఠలో యున్న అదిపురుషుడు దర్శనమైంది.ఈయన ఉలకలేదు.పలకలేదు.ధ్యానములో ఉండగా ఈ ఆత్మలింగము కాస్త ఈ శరీరమును తాకిన మరుక్షణమే ఈ దేహమునుండి యోగాగ్ని బయలుదేరి క్షణాలలో ఈ దేహము దగ్ధము అయ్యి అస్థిపంజరముగా మారింది.అయినగూడ ఆత్మలింగము తన ప్రయాణము కొనసాగిస్తూముందుకి సాగిపోతుండగా .... .....
ఈసారి..ఒక పెద్ద తిమింగలము దర్శనమిచ్చినది.ఇదిగూడ ఎలాంటి ప్రతిఘటన చేయలేదు.కదలలేదు.మెదలలేదు.కళ్ళు మాత్రము తెరిసి సాక్షిభూతముగా ఈ ఆత్మలింగముకేసి చూస్తుండగా దీని దివ్యతేజస్సుకి ఈ తిమింగళము శరీరము కాస్త క్షణాలలో దగ్ధమై అస్థిపంజరముగా మారింది.అయినగూడ ఈశ్వర అత్మలింగము తన ప్రయాణమును ముందుకి కొనసాగిస్తుండగా ఉన్నట్టుండి..
ఏకతల ఉన్న దివ్యబంగారపు కాంతి శరీరముతో సుమారుగా 60 అడుగుల పొడవున్న నాగాసర్పము దర్శనమిచ్చింది.దీని కంఠభాగములో లోపలివైపున దివ్యతేజస్సుతో ఏదో మురుపు మెరుస్తూ దివ్య కాంతులతో కనబడసాగినది.అపుడు ఈ పాము కాస్త ఈ ఈశ్వర ఆత్మలింగమును తన నోటితో మింగాలని విశ్వప్రయత్నాలు చేసిన ఏలాంటి ప్రయోజనము లేకపోయేసరికి ఈ దివ్య ఆత్మలింగము తేజస్సుకి దాని శరీరము దగ్ధమై క్షణాలలో అస్థిపంజరముగా మారింది. అయినాగూడ ఈ ఈశ్వర ఆత్మలింగము తన ప్రయాణమును ముందుకి కొనసాగించింది.ఆ తర్వాత...
దివ్యమైన అభయహస్తముతో చిన్ముద్ర దర్శనమైంది.ఈ ముద్ర యొక్క చూపుడు వ్రేలు,బొటనవ్రేలు మధ్యలో ఉన్న ఖాళి స్థలములో ఈ ఈశ్వర ఆత్మలింగము ప్రవేశించగానే ఈ ముద్ర హస్తము కాస్త ఈ లింగము బయటికి రాకుండా తన ముద్ర బంధనములో బంధించాలని విశ్వప్రయత్నాలు చేసినప్పటికి విజయము సాధించలేకపోవడముతో ఈ ఆత్నలింగము తేజస్సుకి ఈ హస్తము అదృశ్యమైంది. అయిన గూడ ఈ ఆత్మలింగము తన ప్రయాణమును ముందుకి కొనసాగిస్తుండగా..ఇదంతా గూడ పరమహంస శరీరమునకు అసలు ఏమి జరుగుతుందో ఒక పట్టాన అర్ధముగాలేదు.అంటే 63వ కపాలము నుండి ఆఖరిదైన 64వ కపాలము యొక్క ప్రవేశద్వారమునకు సుమారుగా తాము ఏనుగు దంతము యొక్క కాంత మాయను అలాగే శంఖవిష్ణు యొక్క ధనమాయను అలాగే ఆదిపురుషుడైన ఆదిరుద్రుడి యొక్క జీవమాయను ఆ తర్వాత పెద్ద తిమింగళము అంటే మత్స్యావతారము యొక్క రూపమాయను ఆ తర్వాత నాగపాము యొక్క భావరూపమాయను ఆ తర్వాత చిన్ముద్ర యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క ఙ్ఞాన మాయను దాటవలసి వచ్చినదని పరమహంసకి ఙ్ఞాన స్ఫురణ అయినది.
దానితో వీరి అనుమతిని గూడ తీసుకొని చివరి ఆఖరిదైన 64th డైమెన్షన్ లో ఉన్న బ్రహ్మకపాలములోనికి పరమహంస ప్రవేశించడము జరిగింది. అక్కడ ఈయనకి ఏక దళమున్న పద్మము దర్శనమిచ్చింది. ఇది గుండ్రముగా తన చుట్టూ తాను తిరుగుతూ కనబడింది. ఈ పద్మము పై కోడి గ్రుడ్డు ఆకారములో ఒక దివ్య జ్యోతి దర్శనమైంది. ఈ జ్యోతి స్వరూపములో ఏక ముఖ తలతో ధ్యాననిష్ఠలో ఉన్న యోగమూర్తి దర్శనమిచ్చాడు. ఈయనే ఈశ్వరుడిని, ఆకార భగవంతుడని, ఆదిదేవుడని, ఆదియోగియని, ఆదిగురువని, సదాశివుడి అంటారని పరమహంసకి జ్ఞాన స్ఫూరణ అయింది. ఈయన ఉల్కలేదు,పలుకలేదు, కళ్లు తెరువలేదు. జీవసమాధి స్థితిలో ఉన్నారని ఈయనకి అర్ధమై మౌనము వహించాడు.
ఎప్పుడైతే ఈ ఈశ్వరా ఆత్మలింగము ఈ దేహమును తాకినదో ఆ మరుక్షణమే ధ్యాననిష్ఠలో ఉన్న అస్థిపంజరముగా మారింది.అంటే ఈయన కపాలమే 64వ అంతిమ బ్రహ్మ కపాలమని పరమహంసకి అపుడికి కాని అర్ధముకాలేదు. ఈ సదాశివుడికి ఇంతకుముందు తను చూసిన షట్ మాయల వలన ఈ సదాశివుడికి 64 కపాలాలు వరుసగా 1,3,5,7,9,11,13,15 ఏర్పడ్డాయని ఈయనికి అర్ధమైనది.
అపుడు ఈయనికి కొన్ని ధర్మ సందేహాలు రావడము ఆరంభమైనవి.
కొన్ని క్షణాల తర్వాత.....
64 బ్రహ్మ కపాలధారి కాస్త సశరీరముగా ఈయనకి లాగా మారిపోయాడు. అంటే ఈశ్వరుడు కాస్త 64 బ్రహ్మ కపాలధారిగా ఎలా ఎందుకు మారాడో పరమహంసకి సందేహము వచ్చింది. సజీవమూర్తి కాస్త ఎలా నిర్జీవమూర్తిగా మారాడో తెలుసుకోవాలనే ఆసక్తి పరమహంసలో కలిగింది. ఎందుకంటే 64 డైమెన్షన్స్ లో ఈయన సశరీరముగా ఈశ్వర తత్త్వములో ఉంటే.... అదే ఈయన కాస్త 1 వ డైమెన్షన్ లో 64 కపాలధారిగా ఎలా మారాడో తెలుసుకోవాలని పరమహంస కాస్త 64 కపాలము నందు ధ్యాననిష్ఠలోనికి వెళ్లాడు.
అపుడు ఈయన మనో దృష్టి యందు సజీవమూర్తి సశరీరముగా ఆది ఆకార స్వరూపము దర్శనమైంది. ఈయనకి ఉన్నట్టుండి ఈ ఆది దేవుని మనస్సులో "ఏకోహం బహు శ్యామ్" అనగా ఏకం నుండి అనేకం అయ్యే విధంగా కోరిక కలిగింది. మొదట తన అర్ధ శరీరము శక్తిగా అమ్మవారి జననము అయితే ఈయన వామభాగం నుండి విష్ణువు అలాగే దక్షిణ భాగం నుండి బ్రహ్మ సృష్టించబడ్డారు. అనగా ఏక తల కాస్త మూడు తలల ఈశ్వరుడిగా మారింది అన్నమాట. ఆపై వరుసగా 5,7,9,11,13,15 దాకా అనగా 64 తలలు ఏర్పడ్డాయి. దీనితో పంచభూతాలతో కాలము, కాంతి, శబ్ద నాదాలతో గూడిన అండ, పిండ, బ్రహ్మాండ లోకాలు వాటిలో జీవ, దైవ, పరమాత్మ జీవజాతుల సృష్టి జరిగింది. ఈ 64 లోకాలు అన్నిగూడ ఈయన ఆధీనములో ఉండేవి. ఈయన ఆలోచన, సంకల్ప, స్పందన కాస్త ఇఛ్ఛా, జ్ఞాన, క్రియ శక్తులుగా మారి ఈ విశ్వ సృష్టి, స్థితి, లయలు జరగడము జరిగింది. ఆ తర్వాత ఈ 64 తలలు కాస్త 64 ,800 విశ్వాలుగా అండము నందు అలాగే పిండలోకము నందు 64 శతకోటి విశ్వాలుగా అదే బ్రహ్మాండ లోకము నందు 64 సహస్రకోటి విశ్వాలుగా రూపాంతరము చెందాయి. ఆ తర్వాత ఈయన విశ్రాంతి స్థితికి వెళ్లి జీవసమాధి స్థితి చెందగానే... ఈయన ముందున్న గోముఖ తీర్ధము నుండి బడబాగ్ని మొదలై.... అది కాస్త ఈయన శరీరమును యోగాగ్నిగా దహింప చెయ్యగానే 64 శిరస్సులున్నవాడు కాస్త 64 కపాలధారి ఈ బ్రహ్మ కపాల గుహ యందు రూపాంతరము చెందినాడని.... గాకపోతే ఈయన త్రినేత్రము అలాగే చిన్ముద్ర చూపే అభయ హస్తము మాత్రము అలాగే సశరీరముతో మాత్రమే మిగిలాయి.ప్రస్తుతము త్రినేత్రమే తను ఏక పద్మ దళము మీద చుసిన జ్వాలాయని, అలాగే విశ్వములో రక్షణ చిన్ముద్ర హస్తము సజీవముగా ఉన్నట్లుగా పరమహంసకి జ్ఞానస్ఫూరణ అయింది. పైగా ఈయన త్రినేత్రము అలాగే చిన్ముద్ర అనేవి అగ్ని తత్త్వగుణముగావడము వలన ఈ యోగాగ్ని వీటిని నాశనము చెయ్యలేకపోవడముతో..... ఇవి కాస్త సజీవముగానే ఉండిపోయాయని ఈయనకి అర్ధమైంది.
ఈ దృశ్యాలు అన్నిగూడ హార్వే పరికరములోనికి రావడము వాటిని ఈ ముగ్గురు చూడటము జరిగింది. దానితో హార్వే కాస్త అంటే విశ్వములో ఏదో కన్ను గ్రుడ్డు అలాగే ఏదో చెయ్యి ఉన్నట్లుగా NASA వాళ్లు చెప్పిన విషయము నిజమేనని ఇవే లోకములో GOD eye గా, GOD Hand గా ప్రచారము పొందాయని అంటూ ఈ రెండు ఫోటోలను జోషికి, దేవికి చూపించగానే వీరికి ఆశ్చర్యానందము వేసింది. పైగా హార్వే వెంటనే వారితో GOD అంటే Generation of Division అని అనే అర్థముంది గదా. ఈ లెక్కన చూస్తే ఆది దైవమైన ఈశ్వరుడు గూడ ఏకము నుండి అనేకము అనగా ఏకత్వము నుండి బహుతత్వము లోనికి విభజన చెందాడని చెప్పడము జరిగింది గదా. అనగానే వీరిద్దరు గూడ ఇది నిజమేనని తలలూపారు.
ఇంతలో.....
పరమహంసకి మరొక సందేహము వచ్చింది. అది ఏమిటంటే అసలు గోముఖ తీర్ధములో ఎలా బడాబాగ్ని ఏర్పడినదో తెలుసుకోవాలనే ఆసక్తి ఈయనలో మొదలైంది. అపుడు 64 వ బ్రహ్మకపాలములోని బ్రహ్మ రంధ్రము నందు దివ్య తేజస్సు సుడులు తిరుగుతున్న బ్రహ్మ చక్రము దర్శనమైంది. ఇది చూస్తుంటే భూచక్ర టపాసులాగా తిరుగుతూ కాంతి రేణువులను తనలో కలుపుకుంటుందని పరమహంస గ్రహించాడు. అంటే ఇది బ్లాక్ హ◌ోల్ అని ఈయనకి అర్ధమైంది. ఈ చక్రము యందు పంచభూతాలు, కాలము ప్రవేశించే దృశ్యాలు ఈయనకి కన్పించాయి. అంటే ఈ లెక్కన చుస్తే వీటిని నడిపించేది ఈ చక్రమేనని గాకపోతే ఈ చక్రము దేని వలన ఇలా తిరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఈయన గూడ ఈ చక్రము మధ్య బింధువైన విభూధి రేణువులోనికి ప్రవేశించాడు. ఈ చక్ర అడుగు భాగమంతా ఒక ఐస్ క్రీమ్ కోన్ నిర్మాణములాగా కనిపించింది. మొదట నాలుగు ద్వారాలు నాలుగు దిక్కులుగా కనిపించాయి. అవి ధర్మ, అర్ధ, కామ, మోక్ష మార్గాలని ఈయనకి జ్ఞానస్ఫూరణ కల్గడముతో....ఈయన కాస్త దక్షిణ దిక్కులో ఉన్న మోక్ష ద్వారము వైపు ప్రయాణించి లోపలకి వెళ్లగానే అక్కడ నక్షాత్రాకారములో సూక్షంశ పంచభూతాలు కన్పించాయి. వీటిలో ఆకాశ తత్త్వము వైపు ప్రయాణించగా.... షట్ కోణములో ఉన్న షట్ కాలాలున్నట్లుగా గమనించారు. అనగా సూర్య, చంద్రుడు, పగలు, రాత్రి, రెండు ఉభయ సంధ్యాకాలాలు కాస్త ఇలా షట్ కోణములో ఉన్నట్లుగా గమనించగానే ఈయన కాస్త సూర్యుడి వైపు ప్రయాణించడము మొదలు పెట్టారు. అపుడు దీని లోపల త్రికోణము మూడు బిందువులతో ఉన్నట్లుగా అగుపించింది. అందులో ఒక బిందువులో ఆత్మ మరొక బిందువులో ధర్మగుణము మరొక బిందువులో అధర్మ గుణము ఉన్నట్లుగా ఈయన గమనించి ఆత్మ బిందువులోనికి ప్రవేశించగా ఈ బిందువులో త్రికోణ మధ్య బిందువు దగ్గరికి తనని తీసుకొని వెళ్లింది. ఈ మధ్య బిందువు మీద ఈయన విశ్రాంతిగా కూర్చొని తను చూసిన గుర్తులను గుర్తు చేసుకోవడము ప్రారంభించాడు. మొదట నాలుగు ద్వారాలు ఆ తర్వాత పంచభూతాలు ఆ తర్వాత ఆరు కాలాలు ఆపై త్రికోణము వీటిని వరుసగా కలిపి చూస్తే అనగా 4+5+6+3=18 అంశాలున్నట్లుగా ఈయన దృష్టికి వచ్చింది. నిజానికి ఈ 18 మందే కర్మప్రదాతలుగా ఉంటారు. 4 వేదాల జ్ఞానము, పంచభూతాలు, షట్ కాలాలు, త్రిశక్తులు కర్మ ప్రదాతలు అన్నమాట. అంటే స్థూల పంచభూతాలు, కాలము అనేది జీవుడి యొక్క కర్మ బట్టి జరుగుతుంటాయని ఈయన గ్రహించాడు.
ఆ తర్వాత ఈయన కాస్త తను విశ్రాంతి తీసుకుంటున్న మధ్య బిందువులోపలికి ప్రవేశించడము జరిగింది. దీని లోపల అమృత జలము పేరుతో గోముఖ తీర్ధము ఉన్నట్లుగా గమనించాడు. అప్పుడు ఈయన కాస్త తల పైకి ఎత్తి చూస్తే బ్రహ్మ రంధ్ర గుహ కన్పించింది. అంటే తను గోముఖ తీర్ధము అడుగు భాగములో ఉన్నానని పరమహంసకి అర్ధమయ్యే లోపల ఈ నీటిలో ఉన్న స్త్రీ, పురుష పాములు ఒకదానికొకటి కాటు వేసుకుంటూ కొట్టుకోవడము ఈయనకి కనిపించింది. కొన్ని క్షణాలు తర్వాత చూస్తే బ్రహ్మ రంధ్రము నుండి కొన్ని వేల పాములు ఈ గుహలోని గోముఖ తీర్ధములోనికి పై నుండి క్రింద పడుతూ ఉండటము ఈయనకి కనిపించింది. ఈ పాములు గూడ విపరీతముగా బుసలు కొట్టుతున్న సమయములో ఈ తీర్ధ మధ్య భాగములో ఒక అష్టదళ పద్మము ఒక త్రికోణ మధ్యలో వెలిసింది.దానితో ఈ పాములు అన్ని గూడ ఈ త్రికోణము చుట్టు చేరాయి. ఈ పద్మము యొక్క మధ్యభాగములో దివ్య తేజస్సుతో ఉన్న ఒక మణికాంతులతో మణి దర్శనమైంది. ఇది చూడటానికి లేత జేగురు రంగులో ఉండి అష్ట కోణాలతో ఉన్నట్లుగా ఈయన గమనించి అంటే ఇదియే బ్రహ్మ చింతామణి ఇదియే అష్ట దిక్కులలో అష్ట కోరికలను తీరుస్తుందని పరమహంసకి జ్ఞాన స్ఫూరణ అయింది. కోరికల వలన కర్మ- జన్మలు కలుగుతున్నాయని ఈయనకి అర్ధమైంది. అంటే ఈ లెక్కన చూస్తే 64 బ్రహ్మ కపాలాలు అన్నిగూడ 64 జన్మలని, ఈ జన్మలను నడిపించేది కాలమని దీనిని నడిపించేది 18 మంది కర్మ ప్రదాతలుయని దీనిని నడిపించేది అష్టకోరికలు తీర్చే చింతామణి అని ఈయనకి అవగాహన అయింది. ఈ మణి పద్మమునే బుద్ధుడు తన మంత్రముగా 'ఓం-మణి-పద్మ-హుం' అను గురు మంత్రము చేసుకొని కోరికలు లేకుండా చేసుకోండని చెప్పిన బోధ ఈయనకి జ్ఞాపకము వచ్చింది. అంటే ఈ మణి పద్మం ఇక్కడ ఉంది అంటే బ్రహ్మ రంధ్ర గుహ అనేది భూలోకములో కైలాష్ పర్వతమని ఈయనకి జ్ఞానస్పురణ అయింది.
ఈ చింతామణి శిలను చూడగానే దేవికి ఏదో ఆలోచన వచ్చి..... తన చేతి బ్యాగ్ లోంచి ఇలాంటి రంగు ఉన్న శిలను బయటికి తీసి అందరికి చూపిస్తూ..... ఇది చింతామణి శిలయని ప్రచారములో ఉంటే కొన్నాను. అదిగూడ అమెరికాలోని ఆరిజోనా ఎడారి ప్రాంతములో ఈ శిలలు విరివిగా దొరుకుతాయి. అలాగే హిమాలయ పరిసర ప్రాంతాలలో గూడ ఇవి దొరుకుతాయని విన్నాను అనగానే హార్వే వెంటనే ఈ శీలా మీద లైట్ ఫోకస్ చెయ్యగానే లేత జేగురులో మెరవడము చూసి ఇది నిజమైన చింతామణి శిలయే. మన గురూజీకి కనిపించిన శిలరంగు అలాగే ఈ శిల రంగు ఇంచుమించు ఒకే విధంగా ఉన్నాయి. అనగానే ఇది నిజమేనని వీరిద్దరు తలలూపారు. అంటే తనకి నిజమైన చింతామణి శిల దొరికినదని దేవి అమిత ఆనందపడసాగింది.
ఇంతలో.....
పరమహంసకి అసలు ఈ చింతామణికి అష్టకోరికలు తీర్చేసిద్ధి ఎలా వచ్చింది అనే సందేహానికి సమాధానముగా ఈ చింతామణి అడుగు భాగములో పరిశుద్ధ స్ఫటిక శాలిగ్రామ లింగము దర్శన మిచ్చింది.దీని లోపల న్యూక్లియర్ శక్తియున్న విద్యుత్ శక్తి కాంతిని విరజిమ్ముతూ లీలగా కనిపించింది. ఈ దృశ్యము చుసిన ఈ ముగ్గురికి ఈ స్పటికమణి చూడటానికి అచుగుద్దినట్లుగా 'అంజి' సినిమాలో కనిపించే ఆత్మలింగములాగా ఉన్నదని వీళ్లు అనుకున్నారు.
ఉన్నట్టుండి....
ఈ అగ్ని స్ఫటిక లింగము కాస్త గోముఖ తీర్ధము అడుగు భాగము నుండి పైకి రావడము జరిగింది. అపుడు ఇందులోని విద్యుఛ్ఛక్తి కాంతి కాస్త అగ్నిపాముగా మారి ఈ మణి నుండి బయటికి రావడము.... అపుడికే ఈ తీర్ధములో చేరిన లక్షలాది పాములకి అగ్ని శక్తి ప్రవేశించగానే... ఈ జలమంతా ఒకసారిగా అగ్నిమయముగా మారి బడాబాగ్నిగా రూపాంతరము చెందింది. దానితో ఈ పాములు అన్నిగూడ పైకి ఎగురుతూ బ్రహ్మరంధ్రము ద్వారా బయటికి వెళ్లిపోతే.... స్పటికలింగములోని అగ్నిపాము కాస్త సశరీరముగా 64 శిరస్సులతో ఉన్న ఈశ్వరుడిని చేరి యోగాగ్నిగా మారి ఆయనను దహింప చేస్తున్న దృశ్యము కనిపించింది. అలాగే బ్రహ్మ రంధ్రము నుండి బయటికి వెళ్లిన అగ్నిపాములు కాస్త వివిధ సముద్రాలలో ప్రవేశించడము దానితో నీటిలో ఉన్న అన్ని రకాల జీవరాశులు నశించి పోవడము అలాగే పంచభూతాలలోనికి అగ్ని తత్త్వము ప్రవేశించగానే చెట్లు, కొండలు, పర్వతాలు, వాగులు, వంకలు,జీవులు అన్ని గూడ నెమ్మది నెమ్మదిగా అగ్ని మయము అవుతూ నశించడము మొదలు అయింది. అంటే ఈ లెక్కన మూల ప్రకృతియైన ఈశ్వర ప్రకృతి మూడు క్షణాలలో నాశనము అయినదని పరమహంసకి జ్ఞాన స్ఫూరణ అయింది. అంటే ఆదిలో భగవంతుడు సశరీరముగా ఉన్నాడు. ప్రస్తుతము ఈయన కాస్త అశరీరముగా మారిపోయాడు. ఒకపుడు భగవంతుడున్నాడు. ఇపుడు లేదు అన్నమాట. ఒకప్పుడు మా తాత ఉన్నాడు. ఇపుడు లేడు అన్నమాట. ఒకప్పుడు మా తాత ఉన్నాడు. ఇపుడు లేడు అన్నట్లుగా భగవంతుడు స్థితి ఉన్నదని పరమహంసకి జ్ఞాన స్ఫూరణ అయింది.
ఆ తర్వాత స్ఫటిక లింగము కాస్త అంతరిక్ష మధ్య భాగములోనికి చేరుకొని కాంతి హీనమవుతూ..... సుడులు తిరగడము మొదలైంది. కొన్ని క్షణాల తర్వాత దానిలో పగులు ఏర్పడి గోళాకార స్ఫటిక లింగము కాస్త ఆకారమును నెమ్మది నెమ్మదిగా మారిపోతూ భూచక్రములాగా కాంతి రేణువులుగా అనగా నీలం, తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు కాంతి రేణువులుగా మారిపోతూ తన చుట్టు వాటిని తనలో కలుపుకొనే బ్లాక్ హ◌ోల్ గా మారే దృశ్యమును చూసిన పరమహంసకి అంటే 64 వ బ్రహ్మ కపాలములో బ్రహ్మ చక్రముగా ఈ విధంగా ఏర్పడినదని ఈయనకి అర్ధమైంది. అలాగే ఈశ్వరుడు ఏ విధంగా శరీర త్యాగము చేశారు గూడ అర్ధమైంది. అలాగే మూల ప్రకృతి ఏనాడో అంతరించింది. కాని దీని ప్రతిబింబాలు అయిన ఇష్ట ప్రకృతి, పురుష ప్రకృతి అలాగే స్త్రీ ప్రకృతి సంపూర్తిగా అంతరించడానికి సమయము తీసుకుంటుందని ఎందుకంటే ఈశ్వరుడి ప్రకృతి కాలము ప్రకారము మూడు క్షణాలు అంటే మూడు శ్వాసలు అనగా 36 బ్రహ్మ కల్పాలతో సమానమని అదే భూలోక కాల ప్రకారముతీసుకుంటే 1000000000000 లక్షల కోట్ల కాంతి సంవత్సరాలు పడుతుందని ఈయనకి జ్ఞాన స్ఫూరణ అయింది.
ఇంతవరకు బాగానే ఉంది.
కాని పంచభూతాలు, కాలము యొక్క చావు పుట్టుక వివరాలు తెలిశాయి. కాని కాంతి అలాగే శబ్ద నాదాల పుట్టుక వివరాలు ఇంక తెలియరాలేదని అనుకుంటున్న సమయములో.......
ఉన్నట్టుండి..
పరమహంసకి ఎదురుగా ఉన్న 64 కపాలధారి యొక్క 1వ బ్రహ్మకపాలము కాస్త ఈయన కపాలాల నుండి ఊడి ఒక్కసారిగా సుడిగాలిలా ఏర్పడి మారి ఈ బ్రహ్మకపాలము విబేధన చెందుతూ అదృశ్యమై బ్రహ్మరంధ్రము నుండి బయటికి వెళ్ళి శూన్యములో కలిసిపోయింది.అంటే 1వ డైమన్షన్ శూన్యమైనదని కపాలమోక్షము పొందినదని పరమహంసకి ఙ్ఞాన స్ఫురణ అయింది.ఇలా వరుసగా 15 కపాలాలు ఆపై 13 కపాలాలు ఆపై 11 కపాలాలు ఆపై 9 కపాలాలు ఆపై 7 కపాలాలు ఆపై 5 కపాలాలు ఆపై 3 కపాలాలు ఇలాగే టొరొంటోగా మారి బ్రహ్మకపాలాలు విబేధన చెంది అదృశ్యమై తన బ్రహ్మరంధ్రము నుండి బయటికి వెళ్ళి శూన్యమైనాయి.అంటే దాదాపుగా 63 కపాలాలు కపాలమోక్షము పొందినట్లుగా పరమహంసకి కనిపించింది. ఆఖరిగా ఏకబ్రహ్మకపాలముతో ఉన్న అస్థిపంజరము ధ్యానస్థితిలో ఉన్నట్లుగా కనిపించింది.దీనికున్న 63 కపాలాలకి కపాలమోక్షము పొందాయి అన్నమాట.
ఈ ఏక బ్రహ్మకపాల అస్థిపంజరము కాస్త తన చుట్టూ తాను తిరుగుతూ సుడిగాలి వేగముతో తిరగడము ఆరంభమైంది.కొన్ని క్షణాల తర్వాత ధ్యాననిష్ఠ అస్థిపంజరము అదృశ్యమై ఏకబ్రహ్మకపాలముమాత్రమే దర్శనమిచ్చినది.అంటే ఇదే 64 వ బ్రహ్మకపాలము.ఇదియే 64వ డైమన్షన్ అనుకుంటున్న సమయములో ఈ బ్రహ్మకపాలము యొక్క బ్రహ్మరంధ్రము వద్ద రక్షణకవచముగా ఒక స్ఫటిక సుదర్శన చక్రము తిరుగుతూ ఉన్నట్లుగా పరమహంసకి కనబడింది.ఇది దివ్యకాంతులతో దివ్యతేజస్సుతో సుడిగాలిలాగా తిరుగుతూ అదృశ్యమయ్యేసరికి అపుడికి కాకి ఈ 64 వ బ్రహ్మకపాలము యొక్క బ్రహ్మరంధ్రము కనిపించింది.కొన్నిక్షణాలు తర్వాత ఈ బ్రహ్మరంధ్రము ద్వారము తెరుచుకోవడము ఆరంభమవుతుండగా పరమహంస యొక్క స్థూల శరీరము యొక్క బ్రహ్మరంధ్రము తెరుచుకొంటున్నదని ఙ్ఞాన స్ఫురణ అయింది.అంటే 64వ బ్రహ్మకపాలము తన శరీరకపాలమే అని ఈయనకి అర్ధమై తన చావును తానే చూస్తున్నానని అర్ధమయ్యేలోపుల బ్రహ్మకపాలరంధ్రము తెరుచుకోవడము పూర్తి అయ్యింది.లోపలకి తొంగిచూస్తే బ్రహ్మరంధ్ర అంతర గుహ దర్శనమైంది.ఈ గుహలోపలకి ఈశ్వర ఆత్మలింగము అలాగే ఈయన ఆత్మ శరీరము ప్రవేశించాయి.ఈశ్వర ఆత్మలింగము కాస్త గోముఖతీర్ధములోనికి ప్రవేశించినది.ఆత్మశరీరము కాస్త తీవ్రమైన ధ్యానతపస్సులోకి వెళ్ళింది.
No comments:
Post a Comment