అధ్యాయము 35

 పరమహంస.....

నాలుగు గంటల నుండి ఓంకారనాద సాధన చేస్తున్న గూడ ఆయనకి కుండలిని శక్తి జాగృతి గాకపోవడము కాలాముఖాచార్యుడికి ఏదో సందేహము వచ్చి....

టెలిపతిలో.... ఆయనతో.....

పరమహంస! నువ్వు శక్తి పాత సిద్ధుడివి. నువ్వు సంకల్పించగానే కుండలిని శక్తి జాగృతి అవ్వాలి గదా. నాలుగు గంటల నుండి ఎందుకు కుస్తీ పడుతున్నావో నాకైయితే అర్ధము కావడము లేదు.

కాలముఖా! నాకు గూడ అదే అర్ధము గావడము లేదు. ప్రతిరోజు నాలుగు క్షణాలలో జాగృతి అయ్యే శక్తి ఈ రోజు నాలుగు గంటలైన మనస్సు,బుద్ధి తమ ఏకాగ్రత స్థితి పొందలేకపోతుంది. ఏదో శక్తి నన్ను అడ్డుపడుతోంది.ఏదో శక్తి? ఈ శక్తిని దాటకపోతే 64 డైమెన్షన్స్ లో ఉండే శక్తి ఎలా దాటగలవు.ఒకవేళ ఆ శక్తి కర్కోటకుడిది కాదు గదా. ఎందుకంటే నాకు వాడు కూతవేటు దూరంలోనే ఉన్నాడు.

అయ్యా! వాడు ఇపుడు వచ్చాడు. మీరు ఈ నీటిలో నాలుగు గంటల నుండి ఉన్నారు. ఇపుడు వచ్చిన వాడు నీ మీద ఎలా శక్తిని ప్రదర్శిస్తాడు. అయిన నువ్వు అక్కడ ఉన్నావని వాడికి తెలియదు. ఎందుకంటే వాడి మనోదృష్టి యందు నేను ఉన్న చోటు మాత్రమే కనబడుతోంది.

అవును! ఇది నిజమే! కాని నా శక్తిని ఆపగలిగే వ్యక్తి ఎవరై యుంటారు అనగానే....

ఒక వేళ మీరున్న నీటిలో కూతవేటు దూరములో ఎవరైనా వ్యక్తి ఉన్నారేమో చూడండి అనగానే.....

ఉండు చూస్తాను అంటూ పరమహంస కళ్లు తెరిచి చూడగానే....

నీటిలో....

తనకి కూతవేటు దూరములో ఒక నల్లని శివలింగము మీద ధ్యానము చేస్తున్న నల్లటి దుస్తులు ధరించియున్న ఒక వ్యక్తి అగుపించాడు.

పరమహంస మనస్సులో....

అదే! నేను ఇక్కడికి వచ్చినపుడు ఎవరూ లేరే. మరి ఈ వ్యక్తి ఎవరు? తను ధ్యాననిష్ఠలో ఉన్నపుడు వచ్చి ఉంటాడు. ఒక వేళ ఈయన తనకి లాగానే జల స్తంభన విద్యాభ్యాసము చెయ్యటానికి వచ్చాడా? లేదా తన శక్తిని ఆపటానికి వచ్చాడా? అని అనుకొని ఇదే విషయాన్ని

కాలాముఖుడికి చెప్పగానే....

ఖచ్చితంగా ఆ వ్యక్తియే నీ శక్తి లేవకుండా చేస్తున్నాడు. ఎందుకంటే నీకు కూతవేటు దూరములో ఉండి పైగా జల స్తంభన విద్యతో చేస్తున్నాడు. ఎందుకో ఆ వ్యక్తి సామాన్యముగా కన్పించే అసామాన్య వ్యక్తి లాగా ఉన్నాడు. వాడు ఎవడో ముందు తెలుసుకో. లేదంటే నీ ప్రయత్నము ఆదిలోనే హంసపాదులాగా మారుతుంది. ఆపై నీ ఇష్టము అంటూ టెలిపతి నుండి తప్పుకున్నాడు.


దానితో....

పరమహంస ఈ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని దివ్య దృష్టితో చూస్తే ఏమి కనిపించలేదు.

ఆ వ్యక్తి.... ఈదుతూ....

ఈయన దగ్గరికి వచ్చి....

స్వామి! నేను నీ మూడవ కన్నులో కానరాలేదా? కంగారుపడకు! అవును ఇంతకి నీటిలో కూర్చొని అధినేత అవ్వాలని అనుకుంటున్నావా? అదే వాడున్నాడు గదా. వాడే కర్కోటకుడు నేల మీద కూర్చొని విశ్వాధినేత ప్రయత్నాలు చేస్తున్నాడు గదా. వాడు భూమి నువ్వు నీటిలో ఉండి విశ్వాధినేత ప్రయత్నాలు మొదలు పెట్టావా?


లేదు స్వామి! మీరు పొరబడుతున్నారు. నేను విశ్వాధినేత అవ్వాలనే కోరిక లేదు. ఇది సాధించాలనే ఆలోచన, సంకల్పము, ఆశయము, లేనేలేవు. గాకపోతే ఈ విశ్వము ఆది నుండి అంతము దాకా ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి ఈ సాధన చేస్తున్నాను. అంతే స్వామి!


ఏముంటుంది. ఆదిలో ఉండే జీవాలు అంతములో అంతరించి ఉంటాయి.దానిని చూసేది ఏముంది? అనగానే....


స్వామి! అలా కాదు. వేదాల ప్రకారము కాలము యొక్క 64  డైమెన్షన్స్ ఉన్నాయని..... ఈ విశ్వము యొక్క ఆది నుండి అంతము దాకా ఇవి ఉన్నాయని తెలిసింది. అవి ఎలా ఉంటాయో..... వాటిలో ఏమున్నాయో తెలుసుకోవాలనే ఆసక్తితో నా సాధన చేస్తున్నాను.

అవునా? నువ్వు గూడ ఏదో ఒక డైమెన్షన్ లో ఉన్నట్లే నీలాంటి జీవాలు గూడ ఆయా లోకాలలో ఆయా డైమెన్షన్స్ లలో ఉంటాయి వాటిని చూసేదేముంది. ఇక్కడ ఉన్నట్లే అక్కడ అలా ఉంటాయి.

 అలా కాదు స్వామి! ప్రస్తుతము నేను మూడవ డైమెన్షన్ లో ఉన్నాను. అదే ఎవరైతే 64 డైమెన్షన్ కి అనగా ఆఖరి డైమెన్షన్ కి చేరుకుంటారో వారికి కాలాతీత స్థితి కర్మ-జన్మ రాహిత్యస్థితి, జనన-మరణ చక్ర రాహిత్యస్థితి ఆలోచన, సంకల్పము, స్పందన, ఆశ,భయము, ఆనంద రాహిత్య స్థితులు పొంది నేను ఎక్కడ నుండి వచ్చినానో అక్కడికి చేరుకొని శూన్యము అయిపోవాలని నా సాధన ప్రయత్నము స్వామి!

మంచిది! ఇపుడు నాకు నచ్చావు. పై వాడి లాగా విశ్వాధినేత అవ్వాలనే బ్రహ్మపదవి అంటి పెట్టుకొని లేవు. నాకు లాగా చిరంజీవితత్త్వము పొందాలని, లోకానికి ఏదో చెయ్యాలనే తలంపులు లేకపోవడము నీ అర్హత, యోగ్యతను సూచిస్తున్నాయి. గాకపోతే ఇపుడిదాకా నా మనో శక్తితో నిన్ను అష్టదిగ్బంధనలో నీకు తెలియకుండా ఉంచాను. నువ్వు విశ్వ వినాశనము కోరుతావో క్షేమము కోరతావో నేను తెలుసుకోవాలి గదా. అందుకే ఇక్కడ నీ కోసము ఎదురుచూస్తూ కూర్చున్నాను.

       అలాగే ఇపుడు నువ్వు విశ్వా కాలము యొక్క డైమెన్షన్స్ ప్రయాణించవచ్చు. కాని అక్కడ కనిపించే దృశ్యాలను, కేవలము సాక్షిభూతముగా చూస్తూ అక్కడ ఉన్నవారు ఇచ్చే పదవులు తిరస్కరిస్తూ ముందుకి సాగిపో. నువ్వు దేనికైనా ఆశపడినా, భయపడినా, దేని గూర్చి క్రొత్త ఆలోచన చేసిన లేదా ఏదైనా క్రొత్తగా సంకల్పించిన

లేదా ఏదైనా దేనికైనా నువ్వు స్పందించినావో.... నువ్వు ఆ లోక వాసుడిగా ఆ డైమెన్షన్ లో శాశ్వతముగా ఉండిపోతావు. చాలా జాగ్రత్తగా జాగురతతో ఈ డైమెన్షన్ దృశ్యాలను చూస్తూ అంతానికి చేరుకొని అదృశ్యమై అంతరించిపోవటానికి విశ్వ ప్రయత్నములో నాకు లాగా జల సిద్ధుడిగా మారి సాధన చేసి నీ మనస్సును నిగ్రహించుకుంటావని ఆశిస్తూ నా ఆశీస్సులు ఇస్తున్నాను.

ఇంతకి తమరెవరు స్వామి.....

నేనా? నాకే తెలియదు. అందరు నన్ను దత్తత చేసుకొని దత్త....దత్త.... అంటారు అంటూ... అక్కడ నుండి ఈదుకుంటూ నేల మీదకి క్షణములో 1000  వంతు చేరుకున్నారు.

అంటే.... ఈయన.... ఈయన యోగపరీక్ష దత్తుడు.... విశ్వగురువు దత్త స్వామి అని పరమహంస తెలుసుకొనే లోపుల తన చుట్టూ అష్ట దిగ్బంధన శక్తి వలయము తనకి రక్షణ కవచములాగా కాపలా కాయడము కన్పించింది. అంటే తనని రక్షించటానికి దత్త స్వామి ఇలా వచ్చినారని పరమహంసకి అర్ధమై తిరిగి ధ్యాన ధ్యాన నిష్ఠ కొనసాగించి...


8 క్షణాలలో కుండలిని శక్తి జాగృతి అవ్వగానే...

ఆ నీటిలో .....

ఒక అడుగు పొడవు ఉండి బంగారపు వర్ణముతో ఉన్న ఒక దేవత సర్పము వచ్చి ఈయన చిటికెన వ్రేలు మీద కాటు వెయ్యగానే...... జాగృతి అయిన ఇడ, పింగళ,

సుషుమ్న నాడులు కనిపించి అందులో కుండలిని శక్తి కాస్త సుషుమ్ననాడి యందు ప్రవేశించి బూడిద రంగులో ఒక పాము కదిలినట్లుగా.... పాములాగా ప్రాకుతూ ఒక పొగ వంటి ఆకారము కాస్త మూలాధార చక్రము నుండి బ్రహ్మరంధ్రము దాకా శరవేగముగా క్రింద నుండి పైకి అలాగే పై నుండి క్రిందకి ప్రవహించి తిరిగి మూలాధార చక్రమునకు చేరుకుంది.

48 నిమిషాల తర్వాత పరమహంస విశ్రాంతి స్థితికి  చేరుకోగానే...

కాలాముఖుడు నిద్రలేచి విశ్రాంతిగా కూర్చొని....

నాయనలారా! ఇపుడు సాధన దృశ్యాలు మీ పరికరాలలో వచ్చిందా? వచ్చే ఉంటుంది. సాధకుడిలో కుండలిని శక్తి జాగృతి అయినపుడు మనకి ఒక పాము తల కనబడుతుంది. అలాగే ఈ శక్తి ప్రవాహము జరగాలి. మనకి ధ్యాన అనుభవముగా లేదా కలలో ఒక కృష్ణసర్పము కాటు వేసినట్లుగా కన్పించాలి. అపుడే ఈ శక్తి సాధకుడి యోగచక్రాల యందు క్రింద నుండి పైకి అనగా మూలాధార చక్రము నుండి బ్రహ్మరంధ్రము దాకా ప్రవహిస్తుంది. ఆ దృశ్యాలే ఇపుడు మీరు చూస్తున్నారు. అనగానే.....

స్వామి! మా గురూజీ దగ్గర జరిగిన అన్ని రకాల దృశ్యాలు మా పరికరాలలో రికార్డింగ్ అయింది. పైగా దత్త స్వామి దర్శనము అలాగే అష్టదిగ్బంధన ప్రక్రియలు గూడ కనిపించాయి. అనగానే.....

మంచిది! ఇపుడు నేను వాయు భక్షణ చేసి విశ్రాంతి తీసుకుంటాను అంటూ కళ్లు మూసుకున్నారు.

ఈ స్థితిగతులు అన్నిగూడ అక్కడ బాక్స్ లో ఉన్న కాలాముఖాచార్యుడి మనో దృష్టికి రావడము.... ఇవన్నీ గూడ శరవేగముగా ఈయనకి ఉన్న పరికరాలు అందుకొని క్షణాలలో వాటిని 3D హాలోగ్రామ్ చిత్రాలుగా మార్చడము జరిగింది. దానితో వీళ్లకి కృష్ణసర్పము అంటే ఏమిటో తెలిసింది. ఆది కాటు వేస్తే ఏ విధంగా సాధకుడిలో కుండలిని శక్తి ప్రవాహము అలాగే కుండలిని శక్తి రూపము, రంగు ఏమిటో జోషికి, హార్వేకి, దేవికి తెలిసింది. దానితో వీరి ఆనందానికి అవధులు లేవు. అలాగే మారు రూపములో ఉన్న దత్త స్వామి వారి దర్శన భాగ్యము కల్గినందుకు అమిత ఆనందమును అనుభవించసాగారు.

ఆ తర్వాత ఈయన చుట్టు షట్ కోణాకారము రక్షణ కవచ కాంతి వలయము ఏర్పడింది.

షట్ కోణాలు- షట్ కాలాలకి ప్రతీకగా.....

No comments:

Post a Comment