అధ్యాయము 60

 క్షణాలు .... ...... .....

యుగాలుగా మారుతున్నాయి. కాలము తన పని తను చేసుకొని పోతోంది.

పరమహంస కాస్త బ్రహ్మరంధ్ర గుహ యందు తదేకదీక్షతో తన ఆరు శరీరాలను సమాధి స్థితి నుండి బయటికి తీసుకొని వచ్చే స్థితిలో యున్నారు.

 48 క్షణాలు కాస్త 36 క్షణాలకి వచ్చింది. ఈ విషయము తెలుసుకున్న మిగిలిన వారిలో చెప్పలేని ఆవేదన మొదలైంది. ఏ క్షణానికి ఏమి జరుగుతుందో ఎవరికి అంతు పట్టడము లేదు. చెప్పలేని అలివికాని గుండె ఆవేదన వీరందరిలో క్రమక్రమంగా పెరుగుతుంటే...

    36 క్షణాలు కాస్త 24 క్షణాలకి వచ్చింది. అపుడికి పరమహంస యొక్క సంకల్ప, వాయు మరియు కారణ శరీరాలకి ఆత్మశక్తి ప్రవేశించి సమాధి స్థితి నుండి మేల్కోవడము జరిగింది. దానితో ఈ దృశ్యాలు చూస్తున్న వీరందరు చెప్పలేని ఉద్రిక్తతకు గురి అవుతున్నారు.

24 క్షణాలు కాస్త 12 క్షణాలకి వచ్చింది. అప్పుడు సూక్ష్మ శరీరము గూడ సమాధి నుండి మేల్కోవడము జరిగింది. ఈ దృశ్యము చూస్తున్న వారు నరాలు తెగిపోయేంతగా ఉద్రిక్తతకు గురి అవుతున్నారు. కాలాముఖాచార్యుడు అయితే ఒక చోట స్థిరముగా కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు. స్థిరముగా ఉండలేక అస్థిరముగానే తన మనోనేత్రము నందు కనిపిస్తున్న పరమహంస ధ్యాన దృశ్యాలను చూస్తూనే ఉన్నాడు. కన్ను ఆర్పకుండా...

ఇంతలో....

12 క్షణాలు కాస్త 6 క్షణాలకి వచ్చింది. గంగానదిలో జల సిద్ధి యోగముతో ఉన్న ఈయన భౌతిక శరీరములోనికి ఆత్మశక్తి ప్రవేశించగానే... ఇది కాస్త జీవశక్తి పొంది మేల్కొంది. కళ్లు  తెరిచింది. ఇది చూడగానే అంటే పరమహంస యొక్క సప్తశరీరాలు అన్నిగూడ యధావిధిగా మేల్కొనే స్థితి చేరుకున్నాయన్న ఆనందము ఒక ప్రక్క మరి కొన్ని క్షణాలలో ఏమి జరుగుతుందో అనే ఆవేదన మరో ప్రక్క ఈ దృశ్యాలను చూస్తున్న వారందరిలో కలుగసాగింది.

మిగిలిన చివరి ఆఖరి

6 క్షణాలు కాస్త....

5 .....

4 ......

3 ......

2 ......

1 .......

చివరి ఆఖరి క్షణములోని 1000 వంతు మిల్లి సెకండ్ మిగిలి యుండగా....

వీరందరికి గుండెలు ఆగినంత పని అవుతున్న సమయములో.....

అక్కడ బ్రహ్మరంధ్ర గుహకి ఉన్న రంధ్రము నుండి తీవ్రమైన జ్వాలలతో కాంతి ప్రసారము పరమహంస యొక్క ఆత్మ శరీరము మీద పడిపోతున్న సమయములో.......

ఎవరు గూడ కలలో ఊహించని విధంగా పరమహంస భౌతిక దేహము దగ్గరికి అపర సిద్ధ పురుషుడైన నడయాడే కాశీ విశ్వనాధుడైన....

శ్రీ త్రైలింగస్వామి వారి సూక్ష్మశరీరము చేరి..... పరమహంస శరీరములోనికి ఆత్మశరీరముగా ఈయన చేరి చేరగానే పరమహంస భౌతిక శరీరము కాస్త బొంగరము లాగా... అద్వితీయమైన యాంటి గ్రావిటి శక్తితో తిరగడము మొదలైంది.

ఈ శక్తి తాకిడికి గంగానది అంతా సుడులు తిరుగుతూ వీళ్లు ఉన్న చోట ఒక పెద్ద సుడిగుండము ఏర్పడింది. అపుడు ఈ గుండము నుండి ఏనుగు తొండము లాగా ఒక పెద్దసుడిగాలి ఏర్పడింది.ఇది ఆకాశమును భూమిని కలిపినట్లుగా ఉవ్వెత్తున లేచింది. దానితో గంగానది నీటి మట్టము ఉన్నట్టుండి 65 అడుగుల ఎత్తుకి చేరుకుంది. కాశీ పట్టణము అంతా గంగపాలు అయింది.

ఇలా......

సుడులు తిరుగుతున్న పరమహంస భౌతిక శరీరము కాస్త తీవ్రముగా ఉద్రిత్తముగా తిరుగుతూండేసరికి భూమి గూడ కంపించడము మొదలైంది. అపుడే అనుకోని సంఘటన ఒకటి అక్కడ జరిగింది. అది ఏమిటంటే కాశీక్షేత్రనికి దూరముగా ఉన్న స్మశానములో ఉన్న బతికున్న శవములాగా అతిగాఢ నిద్రావస్ధలో పడియున్న కర్కోటకుడి భౌతిక శరీరము గూడ ఈ సుడి గుండములో చిక్కుకుంది. అంటే పరమహంస భౌతిక శరీరముతో పాటుగా కర్కోటకుడి భౌతిక శరీరము గూడ యాంటి గ్రావిటి శక్తితో భూమికి వ్యతిరేకదిశలో ఊర్ధ్వ ముఖముగా ఆకాశము వైపు శరవేగముగా విపరీతముగా సుడులు తిరుగుతూ... తిరుగుతూ... అదృశ్యమయ్యాయి. 

ఈ మహత్తరదృశ్యము చూసిన కాలాముఖచార్యుడికి నోటమాట రాలేదు. అంటే తన సమకాలీకుడైన పరమహంస కాస్త 3rd  డైమెన్షన్ నుండి 4th డైమెన్షన్ లోనికి అడుగుబెట్టాడని అనే విషయము జ్ఞాన స్ఫూరణకి రావటం కొంతసేపు షాకులో ఉండిపోయాడు. మిగిలిన వాళ్ల స్థితిగతులు గూడ ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. కాని కర్కోటకుడి భౌతిక శరీరము గూడ వీళ్లతో వెళ్లడమే కొంత బాధ అన్పించింది. అయిన ఆనందము ముందు బాధ పెద్దగా బాధించలేదు. ఎందుకంటే శ్రీ త్రైలింగస్వామివారు పరమహంసకి రక్షణ కవచముగా ఉంటారనే విశ్వాసముతో వీరందరు యున్నారు. ఈ విశ్వమును విశ్వాసమే గదా నడిపించేది.అదృశ్యమయిన పరమహంస, కర్కోటకుడు అంటే శ్రీ త్రైలింగస్వామి భౌతికశరీరాలు కాస్త అంతరిక్ష యానము చేస్తున్నాయి.


వీరికి ఒక చోట నీలిరంగు కాంతియున్న సొరంగ మార్గము కనిపించింది. దీని అవతల 4th డైమెన్షన్   ద్వారాలుంటాయని త్రైలింగస్వామి చెప్పేసరికి..... ఈ ముగ్గురు గూడ అందులోనికి ప్రవేశించారు. విచిత్రము ఏమిటంటే కర్కోటకుడు ఇంకా స్పృహలోనికి రాలేదు. కాని భౌతిక శరీరము మాత్రమే సమాధిస్థితిలో ఉండి యానము చేస్తోందని శ్రీ త్రైలింగ స్వామికి  తెలియడముతో.... ఈయన స్పర్శ తగలడముతో.... ఇతడి భౌతికశరీరములో యధావిధిగా కుండలినిశక్తి జాగృతి అవ్వడము తన పూర్వ జ్ఞానస్థితికి క్షణాలలో చేరుకొని.... అంటే తనుగూడ 4th డైమెన్షన్ లోనికి పరమహంసతో పాటు అడుగుపెడుతున్న విషయము తెలుసుకొని అమిత ఆనందమునకు గురి అయ్యాడు. తన సంకల్పము ఈ విధంగానైనా తీరుతోందని త్వరలో తను విశ్వాధినేత అవ్వపోతున్నాననే పగటికలలు కనే స్థాయికి వచ్చాడు.

మనము ఒకటి ఆలోచిస్తే కాలము మరొకటి చేస్తుంది గదా. అదే జీవితానుభవము గదా.

అలాగే కర్కోటకుడి విషయములోను జరిగింది. వీరంతా నీలిరంగు గుహ అవతలి వైపుకి చేరుకున్నారు. అక్కడ 4th డైమెన్షన్ ప్రధాన ద్వారము కనబడింది.

దాని చూడగానే....

శ్రీత్రైలింగస్వామి కాస్త పరమహంసతో

హంస! నువ్వే 3rd డైమెన్షన్ నుండి శాశ్వతముగా 4th డైమెన్షన్ వెళ్లే అర్హత, యోగ్యతను సంపాదించుకున్నావు. ఆపై నీ సాధన శక్తి సామర్ధ్యాలను బట్టి మిగిలిన అన్ని డైమెన్షన్స్ చేరుకుంటావో లేదో నీమీద ఆధారపడి ఉంటుంది. ఇంతవరకే నా బాధ్యత. నేను తిరిగి 3rd డైమెన్షన్ లోని కాశీ క్షేత్రానికి వెళ్ళిపోవాలి.నీ వలన గంగపాలు అయిన కాశీ క్షేత్రమును యదార్ధ స్థితికి తీసుకొని రావాలి. ఈ కర్కోటకుడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నిరభ్యంతరముగా ముందుకి సాగిపో

అంటూ....

కర్కోటకుడి భౌతిక శరీరము యొక్క తలను పట్టుకొని అంతరిక్షములోనికి విసరడము జరిగింది. దానితో వాడి తల కాస్త క్రింద 3rd డైమెన్షన్ లోనికి కాళ్లు మాత్రము 4th డైమెన్షన్ ప్రధాన ద్వారము దగ్గర ఆగిపోవడముతో తల కనపడితే పాదాలు కనిపించడము లేదు. పాదాలు కనిపిస్తే తల కనిపించడము లేదు.

ఎందుకంటే ఏ డైమెన్షన్ వాళ్లు ఆ డైమెన్షన్ నే చూడగలుగుతారు. త్రిశంఖు స్వర్గమూలాగా తన పరిస్థితి మారిందని కర్కోటకుడికి అర్ధమై.... శ్రీ త్రైలింగ స్వామిని 

"అయ్యా! నన్ను క్షమించండి. మీ శిష్యుడి విషయములో నేను చేసిన తప్పుకి మీరు నన్ను ఈ విధంగా శిక్షించకండి. నన్ను ఉంచితే 3rd లో ఉంచండి లేదా 4th లో ఉంచండి. అంతేకాని ఎటూ కాకుండా నన్ను ఇలా వదిలేసి వెళ్లి ఏ గ్రహ శకాలానికి నా భౌతిక శరీరము తగిలి విచ్చేధనము అవుతుంది. ఎందుకూ పనికి రాకుండా పోతుంది" అని మొర పెట్టుకున్నాడు. 

జాలి గుండె గల శ్రీ త్రైలింగస్వామి స్థిమిత పడి అయితే "నువ్వు భూలోకమునకు నాతో పాటుగా వచ్చి నీ యదార్ధ రూపముతో నీ లోకానికి చేరుకోవాలి, చేరుకుంటానని నాకు మాట ఇస్తే నేను నిన్ను నాతోపాటుగా క్రిందికి తీసుకొని వెళ్తాను. లేదంటే నిన్ను ఇక్కడే నడిమార్గములో వదిలేసి నా దారి నేను పోతాను అనగానే 

కొన్ని క్షణాల పాటు కర్కోటకుడు ఆలోచనలో పడి...

చివరికి గతి లేక బ్రతికి ఉంటే బలిసాకులు తిని బ్రతకవచ్చుననే ఉద్దేశ్యముతో ఈయనతో పాటు భూలోకమునకు చేరుకొన్నాడు.

      యధావిధిగా శ్రీ త్రైలింగస్వామి వారు సూక్ష్మ శరీర ధారిగా దశాశ్వమేధ్ ఘాట్ దగ్గర ఉన్న పాతాళ గుహయందు ప్రవేశించి ధ్యాన తపస్సు చేసుకోవడము ఆరంభించారు.  కర్కోటకుడు భూమిని తాకిన మరు క్షణము వీడి ఆది జన్మయైన కర్కోటక నాగుడిగా మారిపోయాడు. తను ఉండే లోకానికి వెళ్లడానికి ఇష్టము లేక ఈ కాశీ క్షేత్రములోనే మహా సర్పముగా ధ్యాన తపస్సు చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. 

ఇంతడితో కర్కోటకుడి కథ సమాప్తము అయింది.

అక్కడేమో పరమహంస కాస్త 4th డైమెన్షన్ ప్రధాన ద్వారము దగ్గరికి చేరుకోగానే.... ద్వారాలు తెరుచుకున్నాయి. తెల్లని కాంతి శరీరాలతో కొంతమంది ప్రతినిధులు వీరి రాక కోసము ఎదురు చూస్తూ ఉన్నట్లుగా కన్పించారు. పరమహంస లోపలికి వెళ్లగానే... ఈ డైమెన్షన్ ప్రధాన ద్వారము మూసుకొని పోయింది.

దానితో...

హార్వే పరికరములో పరమహంస స్థితి గతులు తెలియకుండా పోయాయి. ఎందుకంటే ఈయన 3rd  డైమెన్షన్ నుండి 4th  డైమెన్షన్ లోనికి శాశ్వతముగా వెళ్లి పోయేసరికి టెలిపతి కట్ అయింది. అపుడు కాలాముఖచార్యుడి మనో దృష్టికి ఈయన స్థితి గతుల ధ్యాన దృశ్యాలు అందడము మాని వేశాయి. దానితో ఈయన ద్వారా వచ్చే సంకేతాలు అందుకొనే హార్వే పరికరము పని చెయ్యడము మానివేసింది. ఏమి చెయ్యాలో ఎవరికి ఏమి అర్ధము కాలేదు. 

ఈ ముగ్గురు ఆందోళనపడుతున్న సమయములో....


No comments:

Post a Comment