అధ్యాయము 55

హార్వెకి.....

పరమహంస యొక్క తత్త్వాలు అనగా శివుడిగా మారడము అలాగే విష్ణువుగా మారడము ఇలా సాధ్యపడినదో అర్ధముగాక ఇదే విషయాన్ని

డాక్టర్ జోషిని అడిగితే....

హార్వే! ఇలా దైవతత్త్వాలుగా మారడము నీకు తెలిసి సాధన సిద్ధి పొందిన పరమ యోగులకే సాధ్య పడుతుంది. అదే మానవుల విషయానికి వస్తే ఆలోచనలు మార్చే వీలుంటుంది.

 అంటే ప్రాక్టికల్ గా సాధన లేనివాళ్లు గూడ ఇలా మారవచ్చా?

ఇలా దైవాలుగా మారతారని నేను చెప్పలేను కాని ఒకరి ఆలోచనలు మరొకరికి వెళ్లి వాళ్ల లాగా వీళ్లు మారే అవకాశమున్నదని నేను చెపుతున్నాను. నీకు అర్ధమవ్వాలంటే నీకు లాగా దేవి మారే అవకాశముంది. అలాగే దేవికి లాగా నేను మారే అవకాశముంది. ఇక్కడ మా ఆలోచనలు మారతాయి. కాని శరీరాలు అలాగే ఉంటాయి అనగానే....

అంటే నువ్వు అనేది అపుడు పరకాయ ప్రవేశ విద్య అవుతుంది గదా అనగానే

పరకాయ విద్యలో శరీరాలు అలాగే వాళ్ల సూక్ష్మ శరీరాల స్థానాలు మారతాయి. ఇది అనుభవ పూర్వకముగా ఇంత వరకు సైన్స్ నిరూపించలేదు.ప్రయోగ స్థాయిలో ఉంది. కాని నా ప్రయోగములో శరీరాలు మారవు. వాళ్ల ఆలోచనలు మారతాయి. ఇవి శాశ్వతముగా వాళ్ల మెదడులో నిక్షిప్తమై ఉండుట వలన వాళ్లు మారిపోతారు. అదే పరకాయ విద్యలో శరీరాలు మారడము అనేది తాత్కాలిక అవసరాలున్నంత వరకు ఉండే అవకాశాలు ఉంటాయి.

ఇలా ఆలోచనలు మార్చడము సాధ్యమేనా?

అయితే నువ్వే ప్రాక్టికల్ గా చూడు, అంటూ అక్కడే దేవి యొక్క తలకి ఏదో హెల్మెట్ లాంటిది ఒకటి జోషి అమర్చి తన సిస్టమ్ ను ఓపెన్ చేసి దేవి యొక్క మెదడులోని జ్ఞాపకాలను, ఆలోచనలను, భావాలను, సంఘటనలు, దృశ్యాలు, అన్నింటిని కాపీ చేసి ఒక పెన్ డ్రైవ్ లో భద్రపర్చాడు. ఆ తర్వాత తన తలకి గూడ ఒక హెల్మెట్ పెట్టుకొని తన ఆలోచనలను ఒక కంప్యూటర్ లోనికి ఎక్కించాడు. ఆ తర్వాత మూడు అడుగులు ఉన్న ఒక యాంటైనా తీసుకొని దానికున్న రెండు డిష్ లలో ఒక డిష్ ను దేవి వైపుకి మరొక డిష్ ను తన వైపు త్రిప్పుకొని కంప్యూటర్ లో ఏవో స్క్రీన్ లు ఆపరేటింగ్ చేస్తూ బటన్ నొక్కగానే .... దేవి తలలో ఏవో చిన్నపాటి శబ్దాలు విన్పించడము మొదలైనాయి. అలాగే కంప్యూటర్ స్క్రీన్ మీద ఈమె మెదడు కన్పించడము మరియు ఈ మెదడు న్యూరాన్ లలోనికి ఏదో సమాచారము వెళ్లుతున్న దృశ్యాలు హార్వేకి కనిపించాయి.  ఈ సమాచారం వెళ్ళడము పూర్తి అవ్వగానే   దేవి ఉన్నట్టుండి జోషిలాగా ప్రవర్తించడము మొదలు పెట్టింది. జోషి లాగా మాట్లాడటం, నడవటం, జోషిలాగా ఆలోచించడము, డాక్టరులాగా ప్రవర్తించడము అన్ని గూడ అచ్చు గుద్దినట్లుగా జోషిలాగా ఉండేసరికి హార్వేకి నోటమాట రాలేదు. కేవలము వీళ్లకి శరీరాల తేడా తప్ప ఏమిలేదని హార్వే కి అన్పించసాగింది.

ఇపుడు చూశావా? అచ్చు గుద్దినట్లుగా నాకు లాగానే దేవి ప్రవర్తిస్తోంది అనగానే.... హార్వే ఇది నిజమేనని తల ఊపాడు. 

కాని ఈ విషయాలు ఏవి దేవికి తెలియదు తను జోషి గాదని దేవి అనే విషయమే ఆమెకి జ్ఞాపకము లేదు. ఎందుకంటే ఆమె జ్ఞాపకాల, ఆలోచనల స్థానములో జోషి యొక్క జ్ఞాపకాలు, ఆలోచనలు ఆమె మెదడులో నిక్షిప్తమవ్వడం వలన తను జోషిలాగా ప్రవర్తించడము మొదలు పెట్టింది. అంటే ఒక రకముగా చెప్పాలంటే అపుడిదాకా కంప్యూటర్ లో పని చేసే పాత సాఫ్ట్ వేరు ను తీసేసి క్రొత్త వర్షన్ ఇదే సాఫ్ట్ వేరును లోడ్  చేస్తే ఎలా అయితే పని చేస్తుందో అలా దేవి యొక్క మెదడు పని చెయ్యడము మొదలు పెట్టిందని హార్వేకి అర్ధమయింది. తన ఆలోచనలు మర్చిపోయి ఉన్న ఆలోచనలతో దేవి మెదడు పని చేస్తుందని గ్రహించాడు.

జోషి! ఇది ఎలా సాధ్యపడింది. అంటే ఒకరి జ్ఞాపాకాలు మనము చెరిపి వెయ్యవచ్చా?

హార్వే! మానవ మెదడులో 100 మిలియన్ న్యూరోన్స్ ఉంటాయి. ఇవి అన్ని గూడ మనము చూసిన సంఘటనలు అలాగే చేసిన సంఘటనలు కొన్ని గుంపులుగా ఏర్పడి జ్ఞాపకాలుగా వాటిలో భద్రపరుచుకుంటాయి. అవసరమైనపుడు మనకి సమాచారము ఇవ్వడానికి ఈ న్యూరాన్స్ గుంపుల మధ్య ఒక విధమైన బ్రిడ్జ్ ల అనగా కణాల సముదాయముతో అనుసంధానమై ఒక జ్ఞాపక గుంపులాగా ఏర్పడతాయి. ఎప్పుడైతే మనము వీటికున్న అనుసంధాన బ్రిడ్జ్ లను తొలగిస్తే..... వాటిలో ఉన్న జ్ఞాపకాలు వేరే న్యూరోన్స్ అందక అవి కాస్త మర్చిపోవడము జరుగుతుంది. ఇదే నియమమును నేను మన దేవి మెదడుకి చూశాను. మొదట ఆమె నిజమైన జ్ఞాపకాలు అన్నింటిని నేను భద్రపరిచి ఆ తర్వాత ఆమె మెదడు భాగములో ఉన్న బ్రిడ్జిలను అన్నింటిని ఒక దానితో మరొకటి సంబంధము లేకుండా చేశాను. ఆ తర్వాత నా ఆలోచనలను ఆమె మెదడుకి పంపించి మెదడు న్యూరాన్స్ లలో వీటిని భద్రపరిచి తిరిగి బ్రిడ్జ్ లు అనుసంధానము అయ్యే విధంగా చేశాను. దానితో ఆమెకి నా ఆలోచనలే మార్గ దర్శిగా మారాయి అనే విషయము గూడ ఆమెకి తెలియదు. ఎందుకంటే ఆమె దేవి కాదని జోషి అనే అనుకునే స్థాయిలో నా ఆలోచనలు ఆమెను ప్రభావితము చేశాయి. అనగా ఆమె ఆలోచనలు లేవు. ప్రస్తుతము నా ఆలోచనలే ఆమె ఆలోచనలు అన్నమాట అనగానే...

అయితే నువ్వు ఇంత పర్ ఫెక్ట్ గా ఈ ప్రయోగము విజయవంతము చేసినపుడు మరి ఇతర జనాల మీద ప్రయోగము చెయ్యవచ్చు గదా?

హార్వే! అందులోనే అసలు చిక్కు వచ్చింది. ఎందుకంటే ఈ ప్రయోగము వేరే వాళ్ల మీద చెయ్యాలంటే తప్పని సరిగా ఈ పరికరాలు ఉపయోగించి వాళ్లకి ఉన్న ప్రస్తుత ఆలోచనలు తీసేసి మన ఆలోచనలు పెట్టాలంటే కనీసము మూడు గంటలు పడుతుంది. ఇలా ప్రతి మనిషికి మార్చడము అంటే సాధ్యపడే విషయం కాదు గదా. కాని ఈ పరికరాలు ఉపయోగించకుండానే క్షణాలలో కవల పిల్లల్లో ఆలోచనల మార్పిడి శరవేగముగా జరిగే అవకాశాలున్నాయని నా ప్రయోగము ద్వారా తెలుసుకున్నాను. ఎలా అంటే వీరు పోలికలలో కాదు ఆలోచనలు గూడ ఒకే విధముగా 98 % కలుస్తాయి. అపుడు వీళ్ల మధ్య స్పర్శ లేదా చూపు ద్వారా ఒకరి ఆలోచనలు మరొకరు మార్చుకొనే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అదే నార్మల్ మనిషికి మరొక మనిషికి ఆలోచనల తేడా 80 % ఉంది. వీళ్లకి తప్పనిసరిగా నా ప్రయోగ పరికరాలు ద్వారానే వీరి ఆలోచనలు మారతాయని గమనించాను. ఇలా 1000 కోట్ల మంది జనాలలో నా ఆలోచనలు పూర్తిగా చేరాలంటే వాళ్లు కాస్త నాకు లాగా మారాలంటే సుమారుగా 1000 సంవత్సరాల పైన పడుతుంది. అపుడిదాకా నా ఆయిష్ ఉండదు గదా. అంటూ దేవి యొక్క ఆలోచనలను తిరిగి యధావిధిగా ఆమె మెదడుకి అందించగానే ఆమె కాస్త మామూలు దేవి లాగా ప్రవర్తించడము మొదలు పెట్టింది. ఈ దృశ్యాలన్నింటిని దేవికి చూపించగానే దేవికి ఒక క్షణము బుర్ర పని చెయ్యలేదు. తను జోషిలాగా ఎలా ప్రవర్తించానో కళ్ల ముందు కన్పించేసరికి సిగ్గు పడింది. భయపడింది. ఆశ్చర్యపడింది. జోషిని సక్సెస్ పార్టీ అడిగింది.

ఇంతలో....

పరమహంస యొక్క ధ్యాన దృశ్యాలు తమ పరికరాలలో కన్పించేసరికి అందరు గూడ విశ్రాంతి స్థితి నుండి డ్యూటీ స్థితికి రావడము మొదలు పెట్టారు.


No comments:

Post a Comment