అధ్యాయము 37

 పరమహంస కాస్త

జలముద్ర సాధనతో స్వాధిష్టాన చక్రము మీద ధ్యాన అభ్యాసము చేస్తుండగా....

ఈయన మనో దృష్టి ముందు....

ఉన్నట్టుండి 21 వేల 600 భూగోళాలు, ఏడు వేల కుజ గ్రహ లోకాలు ఒక్కొక్కటిగా అదృశ్యము అయ్యే దృశ్యాలు హార్వే పరికరము ద్వారా మిగిలిన వారందరు చూస్తూ ఆశ్చర్యానందాలకి గురి అయ్యారు. ఏదో బల్బు ఆరిపోయినట్లుగా ఈ గ్రహ లోకాలు,ఈ దైవ లోకాలు ఒక్కొక్కటిగా అదృశ్యమవ్వడము మొదలైంది. చివరికి తాము ఉన్న భూలోకము అలాగే ఒక కుజ గ్రహ లోకము మాత్రమే మిగిలి ఉన్నాయి. అంటే ఇపుడిదాకా అంతరించిపోయినవి అన్నియు గూడ వీటి ప్రతిభింబాలేనని అర్ధమైంది.ఇవి గూడ అంతరించాలంటే వీటికి కారకమైన మూల ప్రకృతి లోకాలకి తను వెళ్లవలసి ఉంటుందని పరమహంసకి అర్ధమైన విషయము వీళ్లకి అర్ధమైంది.

అపుడు.....

పరమహంస మనో దృష్టి యందు సూర్యుడు మరియు చంద్రుడి యొక్క కాంతి వ్యాపించేయున్న ప్రాంతములో వీటికి ఆధారమైన మూలలోకాలున్నాయని.... ఇవి ప్రస్తుతానికి తనకి కొన్ని లక్షల యోజనాల దూరములో ఉన్నాయని పరమహంస గ్రహించాడు. తను ఎపుడైతే డైమెన్షన్స్ ప్రక్రియకి వస్తాడో అపుడే మూల ప్రకృతి కనబడుతుందని అపుడిదాకా ప్రతిబింబ ప్రకృతులే కనబడతాయని ఈయనకి అర్ధమై.....

స్వాధిష్టాన చక్ర ధ్యానము చేస్తుండగా....

ఉన్నట్టుండి....

ఈయనకి మధుర పదార్ధాల రుచులు గుర్తుకు రావడము మొదలైంది. రుచి గుణమైన స్వాధిష్టాన చక్ర జాగృతి మొదలైనదని గ్రహించాడు. ఆ తర్వాత తన కుడి చెవి నుండి వేణునాదము విన్పించడము మొదలైంది.ఆ తర్వాత అర్ధ చంద్రాకారములో ఉండి నీటి రంగులో ఉన్న తన లింగస్థాన ప్రాంతము నందు ఉన్న ఆరు కోణాలలో ఉన్న ఈ చక్ర దర్శనమైంది. ఆ తర్వాత 'వం' అనే బీజాక్షరము దర్శనమైన కొద్దిసేపటికి అనంత పద్మనాభుడి నిజ రూప దర్శనమైంది. అంటే ఈ చక్ర మాయ యైన మహా ధనలక్ష్మి మాయ మొదలైనదని ఈయనకి అర్ధమై సాక్షిభూతంగా ఉన్నాడు. ఆ తర్వాత గుప్త నిధులు, మణులు, మాణిక్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారము ఎన్నో కుప్పలు, తెప్పలుగా ఒక మహా పర్వతము లాగా ఉన్నట్లుగా కన్పించిన ఈయన స్పందించలేదు. దానితో ఈ దృశ్యము కాస్త అదృశ్యమైంది.

ఇదంతా గుప్త నిధులు చూసిన ఈ ముగ్గురికి నిజముగా అనంత పద్మనాభుడి ఆరు నేల మాళిగాలిలో ఉన్న సంపద ఈ సంపద ముందు పిసరంత అని వీళ్లు తెలుసుకుకొనేసరికి ముచ్చెమటలు పడటము మొదలైంది. ఈ చక్ర దైవమైన చతుర్ముఖ బ్రహ్మదేవుడు అలాగే ఈ శక్తి దేవత అయిన రాకినీ అమ్మవారి దర్శనమైన పరమహంస వీరిని ఎలాంటి వరాలు కొరకపోయేసరికి వీళ్లు గూడ అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఈయనకి జలాధిపత్యము వచ్చినదని సూచనగా భూమిపైన అధిక వేడి తాపాలతో భగ భగ మండుతున్న సూర్యుడికి ఉన్నట్టుండి నీటి మేఘాలు రావడము.... సరిగ్గా అదిగూడ జల యోగము చేస్తున్న పరమహంస ఉన్న ప్రాంతములో కొన్ని నిముషాలు తుఫానులాగా కుండపోత వర్షము కురుస్తున్నట్లుగా ఈయన మనో దృష్టికి వచ్చింది. ఆ తర్వాత ఈయనకి ఆకలి, దాహం, కామం, దుఃఖం, మొహం, మొదలగు వాటికి తాను అతీత స్థితిలో ఉన్నానని మనస్సుకి అన్పించసాగింది. అంటే తనకి అనూర్మిమతత్వ సిద్ధి లభించిందని తెలిసిన పెద్దగా పట్టించుకోకుండా ధ్యాన నిష్ఠను కొనసాగించడము ఈ దృశ్యాలు చూస్తున్న జోషి బృందానికి ఆశ్చర్యమేసింది.

      యోగశక్తుల విషయములో, యోగ సిద్ధుల విషయములో యోగ ఆశక్తుల, యోగ ఆసిద్ధుల విషయాలలో సాధకుడు బహు జాగ్రత్తగా ఉండాలి. యోగశక్తులు, యోగ సిద్ధులు సాధకుడికి వస్తే గాని సాధన పురోగాభివృధి ఉన్నట్లేనని తెలుస్తుంది.ఇవి వచ్చిన తర్వాత వీటిని ఎలా పడితే అలా ఎపుడు పడితే అప్పుడు ఉపయోగిస్తే జాగృతి అయిన కుండలిని శక్తి తిరిగి మళ్లి నిద్రావస్థకి చేరుకుంటుంది. అది తిరిగి లేవటానికి 10 లక్షల జన్మలే పట్టవచ్చును. అలాగే సిద్ధులు, శక్తులు రాకపోతే సాధకుడు తనకి తెలియకుండానే ఏదో మాయలో ఉన్నట్లుగా గ్రహించాలని కాలాముఖుడు కాస్త ఈ ముగ్గురికి సందేశము ఇవ్వడము జరిగింది.

ఆ తర్వాత

పరమహంస మనోదృష్టి యందు ఆ చక్రమును పరివేక్షణ చేస్తున్న గ్రహాలోకమైన శుక్ర గ్రహము అలాగే దేవలోకమైన భువర్లోకము దర్శనమైన వీటిలో లోకవాసులని చూడాలనే ఆసక్తి ఈయన చూపించలేదు. కారణము ఇవి గూడ మూల ప్రకృతికి ప్రతిబింబ లోకాలేనని అర్ధమైంది. ఇలా 20 వేల శుక్ర గ్రహాలోకాలు,ఆరు వేల భువర్లోకలున్న దృశ్యము కానవచ్చింది. ఆ తర్వాత ఈ చక్ర క్షేత్రమైన కంచి క్షేత్రము భూలోకము నందు దర్శనమైంది. ఆఖరిగా ఈ చక్ర దైవమైన చతుర్ముఖ మహా బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు.అయిన గూడ పరమహంస ఎలాంటి స్పందనలు లేకుండా ఈయననుండి ఎలాంటి వరాలు, ఆశలు, కోరికలు, సంకల్పాలు, ఆశయాలు అడగకపోయేసరికి ఈయన గూడ నెమ్మది నెమ్మదిగా అదృశ్యమై శూన్యములో కలిసిపోవడము జరిగింది. అంటే మూలాధార చక్ర మహా గణపతి అలాగే ఈ చక్ర మహా బ్రహ్మ దేవుడు గూడ శాశ్వతము కాదని పరమహంసకి అర్ధమై మౌనము వహించగానే..... అపుడికే ఈ చక్రము జాగృతి, శుద్ధి, ఆధీనము అయ్యి.... చివరికి ఈయన అన్నింటి యందు సాక్షిభూతముగా ఉండేసరికి ఈ చక్ర విబేధానము గావడము మొదలైంది. దానితో ఈ చక్ర దైవాలు, శుక్ర గ్రహ లోకాలు, భువర్లోకలు అన్ని గూడ నెమ్మదిగా శూన్యములో శూన్యమవ్వడముతో ఈయన కళ్లు తెరిచి విశ్రాంతి తీసుకోవడము ప్రారంభించడముతో....

దానితో ఈ దృశ్యాలను తన మనో దృష్టితో శవాసనములో చూస్తున్న కాలాముఖుడు యోగనిద్ర నుండి లేచి పద్మాసనములో కూర్చొని విశ్రాంతి తీసుకోవడము ఇదంతా తమ పరికరాలలో చూస్తున్న జోషి, హార్వే, దేవి గూడ విశ్రాంతి తీసుకోవడము ఆరంభించారు.

        ఆ తర్వాత మరో 48 నిమిషాల పాటు ధ్యాన నిష్ఠలోనికి వెళ్లి మూలాధార, స్వాధిష్టాన చక్రాల అనుసంధానమైన బ్రహ్మ గ్రంధి విబేధనము చెయ్యగానే త్రిలోకాలలో సృష్టి కర్త బ్రహ్మ దేవుడి దర్శనమైంది.అయిన గూడ ఈయన వరాలు గావాలని ఆశించక పోవడము ఈ గ్రంధి బ్రహ్మ విధాత కాస్త అదృశ్యమవ్వక తప్పలేదు. ఆ తర్వాత పరమహంస విశ్రాంతి తీసుకొని 3 వ చక్రమైన మణిపూరక చక్రము మీద ధ్యాన దృష్టి పెట్టడము ఆరంభించారు. 


No comments:

Post a Comment