అధ్యాయము 38

 పరమహంస కాస్త....

అగ్ని ముద్రతో 3 వ చక్రమైన మణిపూరకము మీద ధ్యాన దృష్టి పెడుతూ అభ్యాసము చేస్తుండగా.....

ఉన్నట్టుండి తనకి ఇష్టమైన స్త్రీ, పురుష, దైవ, గురువుల రూపాల దర్శనమిస్తూ ఉండటముతో రూప గణము అనేది ఈ చక్ర జాగృతికి సూచనయని గ్రహించి సాధన కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ఎవరో చెవిలో వీణను మ్రోగిస్తున్న వీణా నాదము విన్పించసాగింది. దానితో ఈ చక్ర శుద్ధి ఆరంభమైనదని గ్రహించి ఈ నాదమును మరింత శ్రద్ధగా వినడము ఆరంభించారు. అపుడు కొద్ది సేపటికి నాభి యందు అనగా బొడ్డు ప్రాంతములో త్రికోణాకారములో పసుపు లేదా అగ్ని రంగుతో 10 రేకులున్న 'రం' మధ్య బీజాక్షరము ఉన్న మణి పద్మము కనబడింది. ఇది కనిపించిన కొన్ని క్షణాల తర్వాత ఉన్నట్టుండి దేవతల రాజు అయిన దేవేంద్రుడు కన్పించగానే.... అంటే ఇపుడు తను ఈ చక్ర మాయ అయిన దైవ సాక్షాత్కార మాయ మొదలైనదని గ్రహించి సాక్షి భూతముగా ఉన్నాడు.


తీరా తను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. నిజానికి దేవేంద్రుడి దర్శనము ఈయనకి తపో భంగము కల్గించడానికి సంకేతముగా చెప్పడానికి వచ్చాడు. తనతోపాటుగా దేవలోక అతి సౌందర్య రాశులైన రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ అను అప్సరసలను  తెచ్చాడు. వీరి నృత్యగానాల ప్రదర్శన ఆరంభమవ్వగానే ఇంద్రుడు అక్కడ నుండి అదృశ్యమయ్యాడు. వీరి నృత్య గానాలు, మేలిమి బంగారు వర్ణ కాంతి దేహ శరీరాల దృశ్యాలను కాలాముఖుడు, హార్వే, జోషి, దేవి తమ పరికరాల ద్వారా కళ్లు ఆర్పకుండా చూస్తున్నారు. సాక్షాత్తు పరమహంస కాస్త దేవేంద్రుడిగా..... ఈ అప్సరసలు ఆయన చెలికతైలుగా వీరందరికి కొన్ని క్షణాలు అన్పించింది.

    కాని పరమహంస ఏమాత్రము చలించలేదు! స్పందించలేదు! పట్టించుకోలేదు! దానితో మీరు అదృశ్యమైన కొన్ని క్షణాలకి మరి కొంత మంది అప్సరసలు వచ్చారు. వాళ్లకి ఇదే అనుభవము అవ్వడముతో మరి కొంత మంది దేవలోకము నుండి వచ్చారు. ఇలా సుమారుగా 32 మంది దాకా అప్సరసలు వచ్చి వస్త్రాలు విడిచి నగ్న నాట్యగానాలు చేసిన పరమహంస మనస్సు ఇసుమంత గూడ చలించకపోయేసరికి వీరంతా ఈయన విషయములో అపజయము పొంది దేవేంద్రుడికి చెప్పటానికి తిరిగి దేవలోకమునకు వెళ్లిపోయారు.

ఆ తర్వాత

ఈ చక్రదైవమైన మహావిష్ణువు సాక్షాత్కారమైంది. అయిన పట్టించుకోలేదు. వరాలు గావాలని అడగలేదు. కోరికలు లేని వాడికి వరాలతో ఏమి పని ఉంటుంది. ఈయనే ఆయనకి వరాలు ఇచ్చే స్థితిలో ఉన్నాడు. దానితో దైవ సాక్షాత్కార మాయను ఈయన దాటుకోవడము జరిగింది. ఆ తర్వాత ఈ చక్ర దేవతయైన 'లాకిని' శక్తి దేవత అనుగ్రహము, ఈయనకి 'దూరశ్రవణ' సిద్ధి వచ్చినట్లుగా అనుభవ అనుభూతి అయింది. అయిన గూడ ఈయన పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని నిమిషాల తర్వాత.... ఈ చక్రము తనకు ఆధీనము అయినదని సూచనగా అగ్ని మీద ఆధిపత్య సిద్ధి లభించినదని గ్రహించాడు. తన శరీరము నుండి అధిక వేడి గల సెగలు రావడము గమనించాడు. అంత చల్లని నీరు కాస్త తన శరీర సెగల వలన అధిక వేడి నీరుగా మారి పోవడము గమనించినా ఈయన పట్టించుకోలేదు.


ఆ తర్వాత

ఈ చక్రమును పరివేక్షణ చేస్తున్న సూర్య గ్రహ లోకవాసుల అలాగే దైవలోకమైన సువర్లోకము దర్శనమైంది. ఇవి గూడ మూల ప్రకృతికి ప్రతిబింబలోకాలేనని గ్రహించడముతో...అంతరిక్షములో ఉన్న 10 వేల స్వర్గాలు అలాగే ఆరు వేల సూర్య లోకాలు నెమ్మది-నెమ్మదిగా కనిపించడము మొదలైంది. ఆ తర్వాత ఈ చక్ర క్షేత్రమైన అయోధ్య క్షేత్రము దర్శనమైంది.

ఆ తర్వాత....

నాలుగు చేతులలో... గధ, శంఖు, సుదర్శన చక్రము, తామరపువ్వుతో.... ఆది మహా విషుమూర్తి సాక్షాత్కరించినా ఈయన స్పందించకపోవడముతో....

ఈ దేవుడు గూడ అదృశ్యమై.... శూన్యమవుతుండేసరికి....

అంటే ఈయన గూడ శాశ్వతుడు గాదని పరమహంసకి అర్ధమయ్యే లోపల ఈ చక్ర విబేధన మొదలైంది. దానితో ఈ చక్ర దైవాలు, శక్తిదేవత, గ్రహాలోకాలు, స్వర్గాలు కాస్త అంతరిక్షమునందు ఒక్కొక్కటిగా నెమ్మది నెమ్మదిగా అదృశ్యమవుతూ శూన్యమవ్వడము హార్వే పరికరము ద్వారా ఈ ముగ్గురు చూస్తూ ఆశ్చర్యము చెందసాగారు.

దానితో ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీనము అలాగే విబేధనము గావడముతో పరమహంస కాస్త 48 నిమిషాల పాటు విశ్రాంతి స్థితికి చేరుకోగానే....

అక్కడ శవాసనములో ఉండి ఈయన ధ్యాన దృశ్యాలు చూస్తున్న పరమహంస విశ్రాంతికి రావడముతో  కాలముఖా చార్యుడు కాస్త యోగ నిద్రలేచి పద్మాసనములో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ హార్వే, జోషి, దేవికి కన్పించడముతో....

హార్వే వెంటనే...

స్వామి! ఇంద్రుడి వెంట వచ్చిన 32 అప్సరసల గూర్చి మీకు తెలుసా? అనగానే....

తెలుసు! బాగా తెలుసు! అందులో ఒకదాని మేలిమి దేహ మాయలో పడి చలించిన మనస్సు చేసే ధ్యానము చేస్తున్న ప్రణవ మంత్రము కాస్త ప్రణయ మంత్రముగా మారిపోయిన విషయము నేను గమనించలేదు. అపుడే మీ గురూజీ నాకు టెలిపతిలో కలిసి తప్పు ద్రోవపడుతున్న నన్ను సరియైన ద్రోవలోనికి తేవటానికి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు చేసిన రంభ శృంగార దృశ్యాలు అలాగే మేనకతో చేసిన శాపాల వివరాలు 20 లక్షల సాధన శక్తి కోల్పోయిన వివరాలు నాకు చెప్పి చూపించి ఈ మాయను దాటించారు. వీళ్ల పేర్లు ఏమిటంటే రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ, ఘృతాచి .. సహజన్య .. నిమ్లోచ .. వామన .. మండోదరి .. సుభోగ .. విశ్వాచి .. విపులానన .. భద్రాంగి .. చిత్రసేన ..  ప్రమోచన .. ప్రమ్లోద .. మనోహరి .. మనో మోహిని .. రామ ..  చిత్రమధ్య ..  శుభానన .. సుకేశి .. నీలకుంతల .. మన్మదోద్ధపిని .. అలంబుష .. మిశ్రకేశి .. పుంజికస్థల .. క్రతుస్థల .. వలాంగి .. పరావతి .. మహారూప .. శశిరేఖ....ఇలా దాదాపుగా పరమహంసకి ప్రత్యక్షమైన 32 అప్సరసల పేర్లు చెప్పేసరికి వీళ్లకి నోట మాట రాలేదు.

అక్కడ.....

పరమహంస విశ్రాంతి స్థితి పూర్తి చేసుకొని నాలుగవ చక్రమైన అనాహత చక్ర ఆధిపత్యము కోసము వాయు ముద్రతో సాధన అభ్యాసము మొదలు పెట్టే దృశ్యము ఇక్కడ ఉన్న కాలాముఖుడి ధ్యాన దృష్టికి రావడముతో ఈయన విశ్రాంతి స్థితి నుండి శవాసనము స్థితికి వచ్చి ఈ చక్ర ధ్యాన దృశ్యాలు చూడటానికి సిద్ధపడేసరికి ఈ ముగ్గురు మౌనము వహించక తప్పలేదు.

పరమహంస కాస్త....

వాయు ముద్ర సాధనాభ్యాసము చేస్తుండగా ఉన్నట్టుండి అతడి మనసులో తలంపులుగా తన తల్లిదండ్రి స్పర్శానందాలు,కుటుంబ సభ్యుల స్పర్శానందాలు, బంధుమిత్రుల స్పర్శానందాలు, గురువుల స్పర్శానందాలు ఇలా ఎందరివో స్పర్శానందాలు జ్ఞాపకము రావడముతో అంటే ఈ చక్రమునకు ఉన్న గుణ అనుభూతి వలన ఈ తలంపులు వస్తున్నాయని అంటే ఈ చక్ర జాగృతి ఆరంభమైనదని పరమహంస గ్రహించాడు.ఆ తర్వాత తన చెవులలో గుడి ఘంటానాదం వినిపించసాగింది. అంటే ఈ చక్రశుద్ధి ఆరంభ సంకేతమని గ్రహించి ఈ నాదమును శ్రద్ధగా వినడము ఆరంభించారు. అప్పుడు కొన్ని క్షణాల తర్వాత ఈ నాదము ఆగిపోయి తన దృష్టి యందు వక్షస్థ మధ్య భాగములో వృత్తాకారములో పచ్చ రంగులో 12 రేకులుండి మధ్యలో 'యం' అనే మధ్య బీజాక్షర ముండి ఉన్న యోగచక్రము దర్శనమైంది. ఆ తర్వాత కొద్ది సేపటికి యమధర్మరాజు దర్శనమవ్వగానే..... అంటే ఈ ఈ చక్ర మహామాయ అయిన మృత్యు భయం తనకి కలుగుతోందని ఈయన సంకేత మిస్తున్నాడని పరమహంస గ్రహించాడు.

ఉన్నట్టుండి తనకి ఊపిరి అందక చనిపోయినట్లుగా.... ఆ శవమును ఎవరో పీక్కొని తింటుండగా.... మహా కాళీ మాత వచ్చి తన శవము యొక్క తలను కత్తితో చీల్చి కపాలమును తీసుకొని తన మెడలోని కపాలమాలకి తన కపాలము గ్రుచ్చుకుంటున్న భయంకరమైన మృత్యు దృశ్యము కనిపించిన..... కాళీ మాత హా హా కారాలు చేస్తున్న గూడ  ఈయన పెద్దగా పట్టించుకోలేదు. కాని ఈ మనో దృశ్యాలు చూస్తూ కాలాముఖుడికి కొన్ని క్షణాల పాటు మెదడు మొద్దు బారింది. అదే ఈ దృశ్యాలను హార్వే పరికరము ద్వారా చూస్తున్న ఈ ముగ్గురికి మరణ భయము అంటే ఏమిటి అది ఎలా ఉంటుందో స్వానుభవముగా రుచి చూసినట్లుగా ఉంది.

చేసేదేమీ లేక కాళీమాత అదృశ్యమైంది.

ఆ తర్వాత.....

వరుసగా చనిపోయిన తన ఈ జన్మ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సూక్ష్మ శరీరాలు దర్శనమై.... తనతో మాట్లాడటానికి వివిధ రకాల ప్రయత్నాలు చేసిన ఈయన స్పందించకుండా సాక్షీభూతంగా వీరిని చూస్తూ ఉండిపోయాడు. ఇలా తనకి తెలియని తాతలు, ముత్తాతలు వారి ముత్తాతలు ఇలా 48  తరాల వాళ్లు కనిపించారు. అంటే వీరంతా పితృ లోకవాసులుగా ఉన్నారని ఈయన గ్రహించాడు. ఒకవేళ వీళ్ల మాటలకి,విన్నపాలకి తను స్పందిస్తే ఆ క్షణములో తను చనిపోయి మరణము పొంది వీరి లోకములో పితృ  దేవతగా మారక తప్పదని గ్రహించి శాంతమూర్తిగా శిలా ప్రతిమలాగా ధ్యాననిష్ఠలో ఉండిపోయాడు. దానితో వీరంతా గూడ అదృశ్యమయ్యారు. ఈ చక్ర అధిష్టాన దైవమైన ఈశ్వరుడు, ఆదిశక్తి దేవత 'కాకిని' కన్పించిన  వారిని  వరాలు కొరకపోవడము వీళ్లు గూడ అదృశ్యమవ్వక తప్పలేదు. దానితో ఈయన వాయువు మీద ఆధిపత్యము అలాగే దూరదృష్టి సిద్ధి లభించినట్లుగా ఈయనకి అనుభవము కల్గిన పెద్దగా పట్టించుకోలేదు.

అనగా ఎక్కడో దూరముగా ఉన్నా కాలాముఖుడు, హార్వే, జోషి, దేవి తన మనో దృష్టి ముందుకి రావడముతో తనకి దూరదృష్టి వచ్చినదని అలాగే తన చుట్టూ ఉన్న నీళ్లు వాయు వేగము వలన విపరీతముగా  సుడులు తిరుగుతున్నాయని అవి సుడిగుండముగా మారినా గూడ తన శరీరమును ఏమాత్రము కదల్చలేకపోవడము గ్రహించి తనకి వాయువు మీద  ఆధిపత్యసిద్ధి లభించినదని తెలిసిన పెద్దగా పట్టించుకోలేదు.

 ఆ తర్వాత

ఈ చక్రమును పర్యవేక్షించే చంద్రగ్రహ వాసులు అలాగే ఈ చక్ర దేవలోకమైన మహర్లోక వాసులు కన్పించిన ఈయన ఆసక్తి చూపలేదు. ఇలా అంతరిక్షము నందు 10 వేల చంద్ర గ్రహ లోకాలు మరియు 12 వేల మహర్లోకాలు కన్పించిన పెద్దగా పట్టించుకోలేదు. ఆతర్వాత భూలోకము నందు ఈ చక్ర క్షేత్రమైన మధుర క్షేత్రము దర్శనమైంది. 

ఇది కనిపించిన కొన్ని క్షణాలకి.......

మహాకాలుడి ఉగ్ర స్వరూప దర్శనమైన పరమహంస ఇసుమంత భయ స్పందన చూపించక పోయేసరికి ఈయన గూడ అదృశ్యమై శూన్యమయ్యేసరికి అంటే  కాలస్వరూపుడైన మహాకాలుడు గూడ ఆశాశ్వతుడేనని అనగా కాలము గూడ శాశ్వతము గాదని పరమహంస గ్రహించాడు. మరి వీరందరు ఎవరిలో శూన్యమవుతున్నారో ఓ పట్టాన ఈయనకి అర్థము  కాలేదు. వీళ్లు ఆదిలో ఉన్నారు. కాని అంతములో లేరు. కేవలము వీళ్లంతా ఉన్నారనే విశ్వాసము, మాయ,భ్రమ, భ్రాంతి మాత్రమే ఉన్నాయని ఈయన గ్రహించగానే......

ఈ చక్ర విబేధనము మొదలైంది. దానితో ఈ చక్ర దైవాలు, దేవతలు, మాయలు, మర్మాలు, ప్రేత లోకాలు, పితృ లోకాలు, మహర్లోకాలు,చంద్రగ్రహ లోకాలు, గూడ అంతరిక్షము నందు అదృశ్యమైన  దృశ్యాలను హార్వే పరికరము ద్వారా జోషి, హార్వే, దేవి చూస్తూ ఆశ్చర్యపోతూ ఇవి సరిగా రికార్డు అవుతున్నాయో లేదో అనే పనిలో పడ్డారు.

ఆ తర్వాత

పరమహంస ఈ చక్రము పైన ఉండే విష్ణు గ్రంధి విబేధనము కోసము ధ్యాన దృష్టితో సాధన చేస్తుండగా కుండలినీ శక్తి ప్రవాహము కాస్త అనాహత చక్రము నుండి విష్ణు గ్రంధిలోనికి ప్రవేశించింది. అపుడు పరమహంసకి ఆది మహావిష్ణువు సాక్షాత్కారమైన గూడ  పెద్దగా పట్టించుకోకపోవడము ఈ గ్రంథి విబేధన జరిగి తన శక్తి ప్రవాహము కాస్త ఈయన కంఠములో ఉండే విశుద్ధ చక్రము వైపు ప్రవహించసాగింది.

ఈ ధ్యాన దృశ్యాలు అన్నీ గూడ హార్వే పరికరము నందు రికార్డు అవుతూనే ఉన్నాయి. వీటిని ఈ ముగ్గురు గూడ చూస్తున్నారు.


No comments:

Post a Comment