కర్కోటకుడు.....
తన ధ్యాననిష్ఠ యందు ఏకాగ్రత బుద్ధితో లయయోగములో మనస్సును స్థిరపరచి 18 నిముషాలు దాటుతున్న సమయములో.....అనుకొని విపత్తుగా .....
ఊహించని మాయగా....
అందమైన ఒక మానవ స్త్రీమూర్తి.... అది గూడ పూర్తి నగ్నముగా.... అర్ధరాత్రి సమయములో ఈ స్మశానానికి వచ్చి..... కర్కోటకుడి ముందు నిలిచింది.ఇదంతా గూడ కర్కోటకుడు తన భౌతిక నేత్రాలు తెరవకుండానే
మనో దృష్టితో చూస్తూ....
అంటే మూలాధార చక్రములోనికి తన కుండలినీశక్తి ప్రవేశించగానే....
ఈ చక్ర అధిదేవత తన మాయ అయిన కామమాయను తన మీద ప్రదర్శిస్తోందని తెలియగానే....
జాగ్రత్తపడ్డాడు! ఈమె ఎంత కవ్వించిన, మోహించిన తన మనస్సు చెదర
కూడదని చాలా నిష్ఠగా.... ఏకాగ్రతగా తన గురువు ఇచ్చిన కాళీమాత మంత్రము చెయ్యసాగాడు!
ఆ అందమైన అమ్మాయి....ఇతని చుట్టూ తిరుగుతూ....
తన మత్తు అయిన చూపులతో....
మత్తెక్కించే వయ్యారాలతో.....
గమ్మతుంచే కవ్వింపు మాటలతో....
రెచ్చకొడుతూ...
ఆశపెడుతూ...భయపెడుతూ....
బెదిరింపులకు దిగినా గూడ......
కర్కోటకుడు చలించకపోయేసరికి
ఆ మానవ స్త్రీ అదృశ్యమయింది!
మరికొద్ది సేపటికి...
అక్కడే ఉన్న ఒక సమాధి నుండి అందమైన స్త్రీ మూర్తి ప్రేతశరీరము వచ్చి..... కవ్వించడము మొదలు పెట్టింది!ఆశపెట్టింది!కోరిక తీర్చమని బ్రతిమాలింది!
కోరిక తీరిస్తే అడిగిన కోరికలు తీరుస్తానని ఆశపెట్టింది! అయిన గూడ కర్కోటకుడు చలించలేదు! పట్టించుకోలేదు! తన ధ్యాన నిష్ఠ కొనసాగిస్తూనే ఉన్నాడు!
దానితో ఈ ప్రేత స్త్రీ గూడ అదృశ్యమయింది.ఆ తరువాత....
అక్కడే ఉన్న చింత చెట్టు మీద నుండి ఒక రాక్షస స్త్రీమూర్తి క్రిందకి అందమైన నగ్న స్త్రీ మూర్తిగా మారి కర్కోటకుడి ముందుకి వచ్చి మాటలతో బెదిరిస్తూ
చేతలతో భయపెడుతూ.... చూపులతో కవ్విస్తూ రెచ్చగొట్టింది! ఇదంతా గూడ కర్కోటకుడు మనో దృష్టితో చూసిన గూడ పట్టించుకోకుండా తన ధ్యాననిష్ఠను
కొనసాగిస్తుండే సరికి ఈ రాక్షస స్త్రీ మూర్తి గూడ అదృశ్యమైంది!
ఈ సారి ఇదంతా గమనిస్తున్న ఊర్ధ్వ లోకాల అధిపతి అయిన ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేర యక్షిణి, కిన్నెర, గంధర్వ జాతి స్త్రీమూర్తులైన రంభ, ఊర్వశి,
మేనకలను ఏకకాలములో ఈ ముగ్గురిని కర్కోటకుడి తపోభంగము చెయ్యమని పంపించగానే....
ఆకాశము నుండి ఈ ముగ్గురు స్త్రీ మూర్తులు వచ్చి.... మొదట తమ నాట్యముతో కర్కోటకుడిని అలరించడము మొదలు పెట్టారు!
అయిన గూడ ఇతను చలించలేదు ఎందుకంటే సాధన సమయములో సాధకుడి మనస్సు దేనియందు, వీటి యందునైనా మనస్సు చలిస్తే.....
ఆ మరణము వర్ణించడానికి వీలులేని విధంగా ఉంటుంది! అందులో
తాంత్రిక మంత్రాలలో ఇలాంటి మరణాలు చాలా ఘోరాతి ఘోరముగా ఉంటాయని ఏకముగా తంత్ర శాస్త్రమే
చెప్పడము జరిగింది! పరీక్షలు
ఉంటాయి! వాటిని దాటుకొని
నిగ్రహించుకొని నిలబడే సాధకుడికి
మాత్రమే ఆ మంత్ర దేవత
సాక్షాత్కారము అయ్యి అతనికి
ఆధీనమవుతుంది! లేదంటే తేడాలు వస్తే ఆ మంత్ర దేవతకి
నరబలి గావాల్సి వస్తుందని కర్కోటకుడికి బాగా తెలుసు! అందుకే
తన మనస్సు ఎక్కడ చలించకుండా
తన మనో దృష్టియందు కనిపించే
దృశ్యాలను సాక్షిభూతముగా స్పందించకుండా
చూస్తున్నాడు! ధ్యాననిష్ఠను కొనసాగిస్తున్నాడు
ఇంతలో...
ఈ ముగ్గురుగూడ తమ ఆభరణాలు తీసి...
ఆపై.... వస్త్రాలు తీసి....
నగ్నముగా మారుతున్న దృశ్యాలను
చూసేసరికి....
కర్కోటకుడి మర్మాంగము
ఉద్రేకము చెందడము మొదలైంది!
అప్పుడికి ధ్యానములో కూర్చొని 47 నిముషాలు
గావస్తోంది! ఇక ఒక నిమిషము
అంటే 48 నిముషాలు దాటితే తనకి మంత్ర సిద్ధి కలుగుతుందని....
అంతవరకు
ఇంద్రియ నిగ్రహముతో ఉండాలని
తన గురువు చెప్పిన బోధ గుర్తుకు వచ్చేసరికి..... ఎంతో కష్టము మీద మనస్సును కామము నుండి నిగ్రహించుకొని ధ్యాన నిష్ఠను కొనసాగించే సమయములో...
ఈ ముగ్గురు స్త్రీ మూర్తులు అదృశ్యమై వారి స్థానములో.....
దేవతా స్త్రీ మూర్తి అయిన 'లజ్జాగౌరి'
నగ్న శరీరము చూసి చూడగానే....
అపుడిదాకా....
ఎంతో ఇంద్రియ నిగ్రహముతో ఉన్న కర్కోటకుడి మనస్సు కాస్త ఆఖరి నిమిషములో ఒక 2 క్షణాలపాటు
చలించేసరికి....
మర్మాంగము నుండి తనకు తెలియకుండానే తన ప్రమేయము లేకుండానే వీర్యకణము బయటికి వచ్చేసరికి....
ఒక్కసారిగా....
ఆ స్మశానమంతా....
కర్కోటకా!...ఈ సారిగూడ నువ్వు జయం పొందలేదు!
ఇంద్రియ నిగ్రహ పరీక్షలో ఓడిపోయావు!దేహ భ్రాంతి దాటలేని వాడివి! నీకు బ్రహ్మ పదవి ఎలా వస్తుంది? వెళ్లు! వెళ్లిపో!
అనే మాటలు ధ్వనించేసరికి.....
అమ్మా! రక్షించే దేవతయే భక్షించడానికి
వస్తే ఎలా? కన్న తల్లియే బిడ్డ ముందు
నగ్నముగా వస్తే ఎలా? ఇంద్రియ
నిగ్రహము పొందవలసిన చోట
ఇంద్రియ జిత్తుడిని చేస్తే ఎలా?
ఇది నీకు తగునా? గత 35 సంవత్సరాల
నుండి నీ ఆరాధన తప్ప నేను ఏమి చెయ్యడము లేదే? నాకున్న విశ్వాధినేత అవ్వాలనే కోరికను తీర్చే మార్గమును నువ్వే చూపగలవని నీ ఆరాధన చేస్తుంటే.... నువ్వేమో నాకు అగుపించకుండా పరీక్షలు పెడుతూ నన్ను మాయలో ముంచుతున్నావు!ఇది నీకు న్యాయమా? అమ్మా! ఈసారి
మళ్లీ వస్తాను! అప్పుడుగూడ నేను మళ్లీ నీ కామమాయ పరీక్షలో తప్పితే నా తలను నీకు నైవేధ్యముగా పెట్టి నరబలి అవుతాను! అంటూ...శరవేగముగా.... తీవ్రమైన ఆవేశముతో ఆవేదనతో....స్మశానము నుండి బయటికి వచ్చేసరికి....అక్కడ తన కోసము ఎదురుచూస్తున్న ప్రియశిష్యుడు చారుకేశ చూసి స్వామి!ఈసారి అమ్మవారు కరుణించలేదా? మీ కోరిక తీరే మార్గము చూపలేదా?
చారుకేశ! లేదురా! అమ్మ నాతో ఆటలు ఆడుకుంటుంది! ఈ సారి ఇలా గాదురా! నా ప్రాణాలే ఫణంగా పెట్టి పూజ చేస్తాను! మళ్లీ వచ్చే అమావాస్య రోజున పూజకి అన్ని సిద్ధము చెయ్యరా! నేనా లేక అమ్మ జయం పొందుతారో వచ్చే అమావాస్య చెపుతుంది రా! పద! మన ఆశ్రమానికి వెళ్లదాం! జనాలు మేల్కొనే సమయము ఆసన్నమైంది! మనల్ని ఇక్కడ ఎవరైనా చూస్తే మన ప్రాణాలకి ప్రమాదము అంటూ ముసుగులు ధరించి వీరిద్దరు అక్కడ నుండి తమ ఆశ్రమము వైపు బయలుదేరారు!
No comments:
Post a Comment