అందరు కలిసి
రహస్య గదికి వెళ్లిపోతూండగా....
"స్వామి! ఒక్క క్షణము ఆగండి" అని పిలుపు వినగానే...
అందరు బయటికి వచ్చి చూశారు.ఎవరికి గూడ ఎవరు పిలిచారో కనిపించలేదు.
అర్ధముగాలేదు.
విషయము అర్ధమైన పరమహంస....
మహానుభావా? మీరు ఎవరో నన్ను కలువడానికి అదృశ్యముగా వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్లంతా మనవాళ్లే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. కాబట్టి అదృశ్యము నుండి సాదృశ్యము గావచ్చును అనగానే....
మొదట ఒక మంచు దిమ్మె కనబడింది. దాని లోపల నుంచి జడలతో, రుద్రాక్ష మాలతో, స్పటికమాలతో, కాపాలమాలతో ఒక శివదీక్షాపరుడు సదృశ్యముగా అగుపించాడు. ఆ దిమ్మె నుండి ఈయన బయటికి రాగానే.... ఇది కాస్త క్షణాలలో కరిగిపోయి ఆవిరి అయింది. అపుడు ఈయనను చూస్తే నడుముకి చిన్నపాటి పులి చర్మము, చేతిలో త్రిశూలము, మరొక చేతిలో కమండలము ఒంటినిండా విభూధితో, జడధారి, విభూధిరేఖధారిగా.... సాక్షాత్తు పరమేశ్వరుడు డిలాగా వీరందరికి ఒక్క క్షణము పాటు అగుపించాడు. అందరి వైపు చిన్ముద్ర ముద్రను చూపిస్తూ పరమహంస వైపు తిరిగి....
స్వామి! నేను గూడ మీకు సమకాలికుడినే. నా పేరు కాలాముఖాచార్యుడు. మాది శివ ధర్మ శాఖలో ఒక శాఖ. మేము శ్రీశైల క్షేత్రమును కేంద్రముగా చేసుకొని నల్గొండ జిల్లాలోని దేవచెర్లకు 4 km దూరములోని నల్లమల్ల అడవులలోని కొండచరియలలో మేము పూజించే కాలాముఖ దేవాలయముంది. అక్కడున్న శివలింగానికి ఎదురుగా ఆయనకి అంజలి ఘటించి కూర్చున్న నా శిల్పము ఒకటి ఉంటుంది. మాది 3 -12 శతాబ్దము కాలము నాటి సాంప్రదాయము ప్రస్తుతానికి ఇది గూడ అంతరించి పోయే స్థితిలో ఉంది. ఇపుడు నేను హిమాలయాలలో 1572 సంవత్సరాల నుండి (సూక్ష్మశరీరములో) సాధన చేస్తున్నాను నాకు మోక్షము గావాలి. కాని చిరంజీవి తత్త్వము వచ్చింది. నాకు సాధన స్థితి, శరీరము లేని స్థితి గావాలి. అందుకు మీరే సమర్థులు అని నా మనోదృష్టికి వచ్చింది. నేను ఏదో ఒక్క కారణము వలన నా సాధన ఒక్క అడుగు దూరములో ఆగిపోయినదని....
దానితో నేను నా అభిమతాలను కలిపి శివమతములో కాలాముఖ శాఖను ఏర్పాటు చేసినానని నాకు అర్ధమైంది. మీరు ఎలాంటి అభిమతాలు, మతాలు, ఆశయాలు, ఆశ్రమాలు లేకుండా గుప్త సాధనతో గుప్తయోగిగా మరి కనక, కాంత,కీర్తి మహా మాయలను, అరిషడ్వార్గాల మాయలను, సప్త వ్యసన మాయలను,ఆశ, భయం, ఆలోచన, సంకల్పము, స్పందన, ఆనంద స్థితి గతులను దాటి నేను పూర్తి చెయ్యలేని అడుగును మీరు దాటి మీ సాధన పరిపూర్ణము చేసుకున్నారని నేను గ్రహించి మీ దగ్గరికి ఇలా రావడము జరిగింది. ఎందుకంటే మీరు ఒక్కరే నేను నిత్యము పూజించే శివలింగ సాధన స్థితికి చేరుకున్నారు. ఎవరైతే ఈ నా సాధన స్థితికి చేరుకుంటారో వారే నా సాధన సమస్యకి సమాధానము చెపుతారని నా మనో దృష్టికి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు చిరంజీవి తత్త్వముతో హిమాలయాలలో సూక్ష్మశరీర సాధన చేస్తూ నా సమకాలికుడి కోసము ఎదురు చూస్తూ 1572 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇపుడు మీరు అగుపించారు. కాబట్టి నా సాధన స్థితి పరిపూర్ణము చేసేది మీరేనని నాకు తెలుసు. కాని మీరు చెప్పే విషయాలే రాబోవు కాలములో సిద్ధాంతము అవుతుంది. గావున అందుకు మీకు అర్హత, యోగ్యత ఉందోలేదో మీకు నేను జ్ఞాన పరీక్ష పెడతాను. అందులో మీరు నెగ్గితే నేను మీ సిద్ధాంతానికి కట్టుబడతాను. మీరు ఓడితే అది రాద్ధాంతము చేస్తాను. అనగానే
పరమహంస చిరునవ్వు నవ్వి....
స్వామి! మీరు వస్తున్నారన్న విషయమే నాకు తెలియకుండా టేలిపతిలో రాకుండా, ధ్యాన అనుభవ దృశ్యము చూపించకుండా నా దగ్గరికి వచ్చినపుడే మీరు గూడ నాకు లాగా సామాన్యముగా కనిపించే అసామాన్యులని... లోక కళ్యాణార్ధము వచ్చారని నాకు అర్ధమైంది. మీ జ్ఞాన పరీక్ష మొదలు పెట్టండి.... అనగానే...
1. స్వామి..... మేము పూజించే శివలింగము?
స్త్రీ శివలింగము. శివలింగాలలో పురుష మరియు స్త్రీ లింగము తేడా ఉంటుంది.
2. భగవంతుడున్నాడా?
ఇపుడు లేడు. ఒకప్పుడు ఉన్నాడు.పుట్టి, పెరిగి, సమాధి చెందాడు.
3. శివ అంటే అర్ధము?
లేనివాడు! చావు, పుట్టుకలు లేనివాడు. ఆకార, నిరాకార స్వరూపము లేనివాడు.
4. మనము నిజమా లేక అబద్దమా?
మనము, మన భూమి అంతా గూడ నిజము గాదు. నిజము లాంటి కల..... కల లాంటి నిజము. సత్యములాగా కన్పించే అసత్య కల్పిత పాత్రలం.
5. అదెలా సాధ్యము?
మనము కాలము యొక్క 3 వ డైమెన్షన్ లో ఉన్నాము. మొదటి డైమెన్షన్ లో పొడవు మాత్రమే ఉన్న జీవులు ఉంటాయి. వీటి కదిలిక ముందుకి లేదా వెనక్కి మాత్రమే ఉంటుంది. అదే రెండవ డైమెన్షన్ లో పొడవుతో పాటుగా వెడల్పున్న జీవులుంటాయి. దీని వలన ముందుకి వెనక్కి అలాగే క్రిందికి పైకి వెళ్లగలవు. ఇక మూడవ డైమెన్షన్ లోని జీవులకి పొడవు, వెడల్పు,మందము ఉంటాయి. అనగా xyz Axis లుంటాయి. ఈ మూడు రేఖలు ఒక్క దానికొకటి లంబంగా 90॰ లో ఉండుటవలన మనమంతా 3D హాలోగ్రామ్ జీవులుగా ఉండిపోయాము. అంటే మనము కదలలేము. ఉదాహరణకు సినిమా తెరమీద ఉన్న బొమ్మలు నిజమని అనుకుంటే అవి తెరమీద ఎంత కదిలినా నిజానికి అవి తెరను వదిలిపెట్టి థియేటర్ లోనికి రాలేవు గదా. అలాగే కనీసం వాటిని చూస్తున్నాము అనే విషయము గూడ వాటికి తెలియదు. అలా మనము గూడ భూమి యొక్క పంచ భూతాలతో చేసిన తెరమీద ఆడుతున్న తోలు బొమ్మలం. కల్పిత పాత్రలలో కల్పిత జీవితాలతో ఉన్నాము. సినిమాలోని పాత్రలుగా మనమంతా ఉన్నాము. అది సినిమా అయితే మనది జీవనాటకము.
సరే బాగానే అనుభవము పొందావు.కాని ఇంతకి నీకు నీవు శూన్యంగా అనుభవము అయ్యిందా లేదా శూన్యములోనికి శూన్యం కలిసింది అని అనుభవము అయ్యిందా లేదా ఇపుడికే అనాదిగా ఉన్న శూన్యం నీవుగా అనుభవం అయ్యిందా ? అనగానే
స్వామి..నాకు ఈ మూడు రకాల ధ్యానానుభవాలు అయ్యాయి.ఉల్లిపాయలు పొరలు తీస్తే ఎలా అయితే ఉల్లిపాయ ఆకారము ఏలా ఉండదో..అలా నా మనస్సుకి కున్న మాయ పొరలు తీసుకుంటుపోతే మనస్సు లేని స్ధితికి నేను చేరుకోవడము జరిగింది.అంటే నేను శూన్యస్ధితి చేరుకున్నాను.కాని పూర్ణశూన్యస్ధితికి చేరుకోలేదు.ఎందుకంటే నాకున్న స్ధితిలో నేను వేరు..శూన్య వేరు అని శూన్యభావస్ధితి ఉంది.అంటే ద్వైత స్ధితి అన్నమాట.అదే ఈ ద్వంద్వ భావ స్ధితి పోతే కాని నేను పూర్ణశూన్యస్ధితి అవుతుంది.ఇదియే అద్వైత స్ధితి అవుతుంది.అంటే ఈ స్ధితి పొందాలంటే నేను అనే భావము నశించాలి.సాధన చేసి సాధనానుభూతి పొందడముతో నేను అనేది నశించి శూన్యమని అనుభవమైంది.దానితో నేను కాస్త శూన్యమై శూన్యములో కలిసింది.అనగా ఆత్మ కాస్త ఆత్మలింగమైంది.ఇది కాస్త అనాది శూన్యమునకు ప్రతీకయైన పరమ లింగము యందు నా ఆత్మలింగము చేరుతుందో ఆనాడే నాకు నేను అనాదిగా ఉన్న శూన్యమని అనుభవానుభూతి పొందడటము కోసము ప్రస్తుత ఈ దేహ సాధనలో ఉన్నదని ఈ పాటికే మీరు గ్రహించే ఉంటారు
అనగానే.......
శభాష్! నాకు సంతృప్తి నిచ్చే సమాధాన మిచ్చారు.మీరు చూడపోయే ధ్యాన దృశ్యాల ప్రక్రియలో నన్ను గూడ భాగస్వామి చేసుకొండి. మీ అనుభవాలే రాబోవు తరాలకి కొత్త ఆలోచన కల్గి ఆశయము మారి సంకల్ప సిద్ధి పొంది దైవ సిద్ధాంతముగా మారుతుంది.
అంటే స్వామి నాకు అర్ధము గాలేదు.
పరమహంస! రాబోవు కాలము నీకు మరణకాలము. అది నీకు తెలుసు. అది గూడ తాంత్రిక ప్రయోగము వలన నువ్వు మరణము పొందుతావు. అది కర్కోటకుడు విశ్వానికి తెలియని 'ఛోడ్' అనే తాంత్రిక ప్రయోగ ప్రక్రియను నీ మీద ప్రయోగించాలని వాడు ప్రయత్నాలు మొదలు పెట్టాడని నా మనోదృష్టికి వచ్చింది. వాడి స్వార్ధ పూరితమైన విశ్వాధినేత ఆకాంక్ష కోసము కీనారామ్ అఘ◌ోరి అనుగ్రహము కోసము విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ ప్రక్రియను దాటించేవాడు శ్రీ దత్తాత్రేయుడు మాత్రమే. కాని ఆయన మనకి యోగ పరీక్ష దత్తుడు గదా. మానవులకే, గురు యోగులకే ఆయన దర్శన భాగ్యము లభించడము చాలా అసాధ్యము గదా. కాబట్టి నా వంతు ప్రయత్నముగా నీ ప్రాణాలు కాపాడటానికి వచ్చాను. నువ్వు కాలములోనికి ప్రయాణించేటప్పుడు నువ్వు 48 రోజుల పాటు 64 డైమెన్షన్స్ కి వెళ్లటానికి పడుతుంది.నీ యోగనిద్ర సాధన స్థితిలో నువ్వు 48 నిమిషాలుంటే అది మానవకాలమాన ప్రకారము 48 రోజులు అవుతుంది. నీ యోగనిద్ర స్థితి అంటే తురియాతీత సమాధి స్థితి అవుతుంది గదా. మనస్సు, బుద్ధి, అహం, ఆనందము లేని స్థితి. శరీర స్పృహలేని స్థితి.. ఇలాంటి సమయములో ఆ కర్కోటకుడు తన ప్రయోగ కాలముగా ఎంచుకొనే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ 48 రోజులపాటు నీ శరీర రక్షణగా నేను ఉంటాను. నీకు శరీర స్పృహ రాగానే నా దారి నేను పోతాను. పైగా నువ్వు నీ ప్రయోగ గదిలో కూర్చునే బదులుగా మణికర్ణికా ఘాట్ వద్ద గంగానదిలో జలసిద్ధితో యోగసిద్ధితో ఈ 48 రోజులు ఉండు. అపుడు నీ కాల ప్రయాణములో నేను గూడ అదే నా సూక్ష్మ శరీరము గూడ నీతో ప్రయాణము చేస్తుంది. నువ్వు కనుక నిజముగానే మోక్ష డైమెన్షన్ అదే 65 వ డైమెన్షన్ చేరుకొని శూన్యము అయిపోతే అది నేను నా కళ్లారా చూసి అది నిజమేనని.... నీ సాధన అనుభవాలు, ధ్యాన దృశ్యాలు సత్యమేనని అది సిద్ధాంతముగా ఈ లోకానికి నేను వెనక్కి తిరిగి వచ్చి అందిస్తాను. ఒకవేళ నువ్వు ఏదైనా కారణము వలన లేదా మాయ వలన మోక్ష డైమెన్షన్ కి వెళ్లకపోతే నీ అనుభవాలు అసత్యమని రాద్ధాంతము చేసి మరీ నా దారి నేను పోతాను. నాలో మంచి అలాగే చెడు ఉంటుంది.గారడీ విద్యలు, మాయ మాటలు, అసత్య అనుభవాలు నాకు వద్దు. మరి ఏమంటావు. ఇందుకు నీకు సమ్మతమేనా?
స్వామి! నా ధ్యాన అనుభవ దృశ్యాలు మీకు గూడ కల్గినాయి గదా. గాకపోతే నాకు లాగా మీకు గూడ అవి సత్యాలా లేదా అసత్యాలు అనే అనుమాన భయము పిసరంత ఉంది.సత్యాలు గాకపోతే మన ఇద్దరికి ఒక విధమైన అనుభవ అనుభూతి కల్గుతుంది. ఇపుడిదాకా నాకు అనుమానముండేది. మీ రాకతో అది అనుమానమేనని నా స్వానుభవాలు సత్యమేనని నాకు అర్ధమయింది.అది మీ అందరికి అర్ధమవ్వాలని....అది గూడ శాస్త్రీయముగా ఆధారాలతో ఉండాలని.... అది నిరూపించడానికి వచ్చారు గదా. ఇక ఆలస్యమెందుకు. మీరు వచ్చిన నాటకము పూర్తి చెయ్యండి అనగానే....
ఉన్నట్టుండి....
కాలాముఖచార్యుడు కాస్త పరమహంస లాగా మారి పోయాడు. అంటే నిజ పరమహంస గంగానదికి వెళ్లి సాధన అనుభవాలు పొందితే నకిలి పరమహంస ఈ రహస్య గదిలో కూర్చొని..... తన చుట్టూ పరికరాల మధ్య ఉండి నిజ పరమహంస ధ్యాన అనుభవ దృశ్యాలను ఈ నకిలి పరమహంస మనో దృష్టియందు పొందుతూ ఆ అనుభవాలు యంత్ర పరికరాలకి దృశ్యాలుగా ఇస్తూ....అవి ఏమిటో అక్కడున్న వారికి వివరణలు ఇస్తూ వీరిద్దరూ కాలములో ఉన్న 64 డైమెన్షన్స్ లో ప్రయాణించి ఒకరు మోక్షము పొందితే మరొకరు మోక్షగామిగా వెనక్కి తిరిగి వస్తారని నిజ పరమహంస అక్కడున్నవారికి సవివరముగా వివరించేసరికి జోషిని, హార్వెకి, దేవికి విషయము అర్ధమై మౌనము వహించారు.
ఈ విషయాలు ఏమి తెలియని కర్కోటకుడు మాత్రము నకిలి పరమహంస మీద లేదా నిజ పరమహంస మీద తను నేర్చుకోబోయే 'ఛోడ్' తాంత్రిక ప్రక్రియ ప్రయోగిస్తాడో కాలానికి తెలియాలి. ఎవరి మరణము ఎవరి చేతిలో ఉందో కాళకర్తకే తెలియాలి.
అందరిని దీవించి...... ఆశీస్సులు ఇచ్చి
పరమహంస గంగానది ఓడ్డుకి చేరితే...... కాలముఖచార్యుడు కాస్త నకిలి పరమహంసగా మారి రహస్య గదికి చేరుకున్నాడు.
No comments:
Post a Comment