అధ్యాయము 7

 

గురుదేవుడు పరమహంస బయటికి వచ్చి..... అక్కడే ఉన్న వాలుకుర్చీలో కూర్చొని....ఈ ముగ్గురు కేసి....చూస్తూ....అర చిరు నవ్వు నవ్వి....వచ్చారా? అనగానే...ఈ ముగ్గురు కాస్త వెనువెంటనే ఆయన పాదాల మీద పడి పాదాభివందనము చెయ్యగానే...'శుభం భూయాత్' నా కాళ్ల మీదగాదు! ఉన్నాడో లేడో తెలియని సర్వేశ్వరుడి పాదాల మీద పడండి! కాస్త పుణ్యమైన దక్కుతుంది!మా దృష్టిలో ఆ సర్వేశ్వరుడు మీరే గదా స్వామి అనగానే...

'అవునా? నన్ను దేవుడిని చేసేశారా? ఇంకేముంది? కొబ్బరికాయలు కొట్టి హారతులు పట్టి కోరికలు కోరుకుంటే తీరుస్తాను' అంటూ... ఇంతకీ నాకు ప్రశ్నగా మిగిలిపోయిన 'ది గాడ్ కోడ్' సంగతి ఏమి చేశారు?అది ముందు చెప్పండి! అనగానే....

స్వామి మీరు ఏమి అంటున్నారో మాకు అర్ధము కాలేదు అనగానే.....నాకు ధ్యానములో కన్పించిన వివిధ రకాల ధ్యానదృశ్యాలను ఈ గోడలపైన పెయింటింగ్స్ రూపములో గీశాను! వాటి అన్నింటిని కలిపితే ఈ విశ్వానికి చెందిన రహస్యము ఏదో తెలుస్తుందని నా మనస్సు చెపుతోంది! ఆ దృశ్యాలు నిజమో కాదో గూడ నాకు తెలియదు! శాస్త్రీయముగా నిరూపించలేను! వ్యక్తి గతముగా చూస్తే అవి నా పరంగా సత్య ధ్యాన దృశ్యాలేనని నేను ఖచ్చితముగా చెప్పగలను! కాని వీటిని అందరికి అర్ధమయ్యే విధంగా చెప్పాలంటే శాస్త్రీయముగా నిరూపించాలి గదా! అది ఎలా సాధ్యపడుతుందో నాకు అర్ధము కాలేదు! అప్పుడు నా ధ్యానములో మీ ముగ్గురు కనిపించారు!నా ఈ ప్రశ్నకి సమాధాన కర్తలు మీరేనని నాకు అర్ధమై మీ బొమ్మలు గీశాను అంటుండగా.....

హార్వే వెంటనే...

గురూజీ! మీ ఆలోచనలకి నా దగ్గర ఉన్న పరికరాలతో 3D రూపములో హాలోగ్రామ్ చిత్రాలు సృష్టించగలను! తద్వారా ఆ ఆలోచనరూపము ఏర్పడుతుంది! అప్పుడు ఈ రూపము ఈ విశ్వములో ఎక్కడ ఉన్నదో మన జ్యోతిష్యవేత్త అయిన దేవి చెపుతుంది! మీరు తీవ్రమైన ఆలోచన స్థితికి వెళ్ళినపుడు మీరు కోమాలోకి వెళ్లకుండా మన డాక్టర్ జోషి తన వైద్యముతో మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అనగానే......

పరమహంస వెంటనే.....

హార్వే! ఇందాక నేను ధ్యానములో ఉన్నప్పుడు ఉపయోగించిన కెమెరాల వివరాలు చెప్పగలవా?సారీ! గురూజీ! వాళ్లు తయారుచేసిన వస్తువులు ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాను కాని ఎవరు తయారు చేశారో నాకు తెలియదు! తెలుసుకోవాలనే ఆలోచన గూడ ఇంతవరకు రాలేదు!

హార్వే! నీ నిజాయితి నాకు నచ్చింది! ఈ కాలము యువత ఎలా ఆలోచిస్తుందో నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు! ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు!నువ్వు ఉపయోగించిన రెండు కెమెరాల గూర్చి నేను వివరంగా చెపుతాను! జాగ్రత్తగా విను! వీటి గూర్చి తెలుసుకొనే ముందు అసలు ఆత్మ అంటే ఏమిటో మనము తెలుసుకోవాలి ?  మానవుడి శరీరము రెండు భాగాల కలయిక వలన  ఏర్పడుతుంది! అందులో ఒక భాగము మన భౌతిక నేత్రాలకి కనిపించే శరీరమును స్థూల శరీరమని అలాగే మన కంటికి కన్పించని రెండవ భాగ శరీరమును సూక్ష్మశరీరము అందురు! అదే ఇంగ్లీషులో అయితే 'Invisible energy body' లేదా Biopdas mic body లేదా Etheric body అంటారు! ఈ శరీరము నిజానికి భౌతిక శరీరము యొక్క లోపలి భాగములో ఆరు అంగుళాలు లోపలికి చొచ్చుకొని పోయి 83 అంగుళాలతోఅచ్చుగుద్దినట్లుగా భౌతిక శరీరములాగా ఉంటుంది! పైగా దీనికి సప్త వర్ణాలున్న ఆరా శక్తి ఉంటుంది! దివ్యదృష్టి గలవారు మాత్రమే ఈ జీవధాతు శరీరమును చూడగలరు!అంటే సూక్ష్మ క్రిములు, బాక్టీరియాలు, వైరస్ లు ఎలా అయితే మామూలు నేత్రాలకి కనిపించకుండా సూక్ష్మ దర్శిలో మాత్రమే కన్పిస్తాయో....అలా ఈ జీవధాతు శరీరము గూడ దివ్యదృష్టి లేదా త్రినేత్రము తెరుచుకున్న వారు మాత్రమే చూడగలరు! అలాగే జీవధాతు శరీరానికి మరియు భౌతిక శరీరానికి మధ్య ఎంతో అన్యోన్య సంబంధముంటుంది! ఈ రెండింటిలో ఏ ఒక్కదానికి అనారోగ్య సమస్య వచ్చినా అవి రెండవ దానికి గూడ వస్తుంది! ఉదాహరణకి జీవధాతు శరీరములోని గొంతు వద్ద ఉండే విశుద్ధ చక్రము ఒక వేళ బలహీనపడితే అదికాస్త స్థూలశరీరానికి దగ్గు, పడిశము, గొంతు మంట, ట్రాన్సిల్స్ వాయడము,లేదా గొంతుకు సంబంధించిన వ్యాధులతో బాధపడటము జరుగుతుంది! అంటే మన సూక్ష్మ శరీరానికి జబ్బు చేస్తే అది స్థూలశరీరము మీద పడుతుందని తెలుస్తోంది గదా! 

కాని సూక్ష్మశరీరము చూసేవారు ఎంత మంది ఉంటారోచెప్పండి! ఇది చూడాలంటే సాధకుడిలో 13 యోగచక్రాలు పరిశుద్ధమవ్వాలి! అనగా మూలాధార, స్వాధిష్టాన మొదలైన ఈ యోగచక్రాలు పరిశుద్ధ మయిన వాడికి ఆజ్ఞ చక్రములో ఉండే పీనియల్ గ్రంధి జాగృతి అయ్యి పని చెయ్యడము మొదలవుతుంది! ఇదియే మనోనేత్రము లేదా త్రినేత్రము అంటారు! ఇది చూసే దృష్టిని దివ్యదృష్టి అంటారు! ఇది సాధించాలంటే సాధకుడు యోగములో 12 సంవత్సరాలు సాధన చెయ్యవలసి ఉంటుంది! అన్ని రకాల యోగమాయలను దాటవలసి ఉంటుంది!అప్పుడు కాని మన శరీరములో ఉన్నమూడో నేత్రమైన పీనియల్ గ్రంధి జాగృతి అవ్వదు! అప్పుడే మన భౌతిక శరీరమును కాపాడే సూక్ష్మశరీరమును  చూడగలము! ఇంత శ్రమ పడకుండా రష్యాకి చెందిన సెమియోన్ డేవిడోవిచో కిర్లియాన్, ఇతని భార్య కిర్లియాన్ కలిసి ఫోటో గ్రఫీని అభివృద్ధి పరిచారు! అధిక ప్రకంపనాలు కలిగిన విద్యుత్ క్షేత్రాన్ని ఆధారము చేసుకొని వీళ్లు ఫోటోగ్రఫీని కనిపెట్టడము జరిగింది! ఈ కెమెరాతో ఆత్మలను ఫోటోలు తియ్యడము మొదలైంది! దానితో మనదేశములో వేదము కాలము నాటి నుండి చెపుతున్న ఆత్మ లేదా సూక్ష్మశరీరము మన భౌతిక శరీరములో ఉండటము నిజమేనని లోకానికి తెలిసింది !వీళ్లు మొదట 1906 సంవత్సరంలో ఆకులను కత్తిరించినపుడు ఆ ఆకుల చుట్టు అన్ని వైపులా నిప్పు రవ్వలలాంటి కాంతి మెరుపులతో తళతళలాడే స్పష్టమైన తేజస్సు ఈ ఆకుల చుట్టు ఉన్నట్లుగా వీళ్లు తీసినఫోటోలలో రావడముతో.... కత్తిరించిన ఆకు భాగము లాగానే.... ఈ తేజస్సు భాగము కన్పించేసరికి వీళ్లకి ఆశ్చర్యమేసింది! అంటే తేజోభాగము ఆకు యొక్క 'జీవాత్మ' యని, ఇది స్థూలభాగానికి కవల పిల్ల లాంటిదని తెలుసుకొని 1939 సంవత్సరములో మనుష్యుల యొక్క జీవధాతు తేజస్సును ఫోటోలు తీసే స్థాయికి వీరి పరిశోధన కొనసాగింది! దానిలో జయము పొంది మనుష్యుల యొక్క సూక్ష్మశరీరమైన ఆత్మను ఫోటోలు తీసి లోకానికి భారతీయ ఆధ్యాత్మికత గొప్పతనము చెప్పి శాస్త్రీయముగా నిరూపించారు! ఆత్మ అనేది ప్లాస్మావంటి ప్రాధమిక పదార్ధమని, ఇది ఆకాశములోని మేఘాల రంగు అంటే పొగరంగు లేదా బూడిదరంగులో ఉండి సప్తవర్ణాల దివ్య తేజస్సు ఉంటుందని వీళ్లు తీసిన ఫోటోల ద్వారా లోకానికి తెలిసింది! ఆత్మ అనేది స్థూల శరీరానికి కవల పిల్లలాగా ఉంది అన్ని పనులు స్వయంగా నిర్వహించగల వ్యక్తిత్వాన్ని గూడ కలిగి ఉంటుందని అలాగే పొరబాటున స్థూలశరీరానికి గాయమై చెయ్యి లేదా కాలు లేదా ఇతర భాగాలు తీసేసిన గూడ సూక్ష్మ శరీరములో ఏలాంటి మార్పులుండవని....ఆ భాగము దివ్య తేజస్సుతో ఉన్న ఎలక్ట్రానిక్ కణ రేణువులు అలాగే ఆ శరీర భాగము లాగానే ఉంటాయని తమ పరిశోధన ద్వారా నిరూపించారు!

        అంతెందుకు ఇప్పుడు మీ ఊహకందని సత్యాన్ని మీ కళ్ల ముందే ఆవిష్కరిస్తాను అంటూ పరమహంస తను కూర్చున్న కుర్చీలోంచి లేచి ఇవతలికి రాగానే.... ఈయన లాంటి ఆకార మనిషి ఇంక ఆ కుర్చీలో కూర్చుని ఉండటము చూసి ఈ ముగ్గురికి అసలు ఏమి జరుగుతుందో అర్ధము కాలేదు! కుర్చీలో కూర్చున్న వారు స్థూలశరీరమా లేదా కుర్చీలోంచి బయటికి వచ్చి నిలబడిన వారు స్థూలశరీరమా ఒక క్షణము అర్ధము కాలేదు! ఏది స్థూలశరీరమో ఏది సూక్ష్మశరీరమో కొన్ని క్షణాల పాటు అర్ధము కాని అయోమయ స్థితిలో వీరుండగా....

పరమహంస వెంటనే....కంగారు పడకండి! కుర్చీలో ఉన్నది నా స్థూలశరీరము....అలాగే కుర్చీ ప్రక్కన నిలబడి ఉన్నది నా సూక్ష్మశరీరము అన్నమాట! ఇందాక నేను ధ్యానములో ఉన్నప్పుడు నా సూక్ష్మశరీరము కాస్త మూలాధారచక్రము నుండి ఆజ్ఞాచక్రము వైపు ప్రయాణము చేస్తున్నప్పుడు హార్వే తీసిన ఫోటోలలో నా సూక్ష్మ శరీరము కన్పించలేదు! కారణము నా సూక్ష్మశరీరము మూలాధార చక్రములో లేదు! ఉండి ఉంటే ఫోటోలలో కన్పించేది! ఇపుడు మీకు విషయము అర్ధమై ఉంటుంది!

అంటూండగా....కుర్చీ ప్రక్కనే నిలబడి యున్న ఈయన సూక్ష్మశరీరము యధావిధిగా ఈయన భౌతిక శరీరములోనికి వెళ్లిపోవడము జరిగింది!

పరమహంస వెంటనే....

ఆశ్చర్యమేసిందా? భగవంతుడు నేర్పరి తనముతో సృష్టించి మనిషిలో మనిషి అదే సూక్ష్మశరీరము చూడటము జరిగింది! ఇది అందరికి తెలిసిన విషయమే కాని లోకానికి తెలియని విషయము ఇపుడు జరగబోయే వింతను చూడండి! అంటూ తను

ధ్యానము చేసుకొనే గదిలోనికి వెళ్లి ధ్యాననిష్ఠయందు ఉండిపోయారు ఏమి జరుగుతుందా అని ముగ్గురు అమిత ఆసక్తితో ఆ హాల్ లో ఖాళీగా ఉన్న వాలు కుర్చీ కేసి కళ్లు ఆర్పకుండా చూస్తున్నారు!

No comments:

Post a Comment