అధ్యాయము 57

హార్వే ఉన్నట్టుండి

దేవికేసి చూస్తూ...

దేవి నువ్వు ఒక మ్యాధ్స్ మేజిషియన్ గా ఉండవలసిన దానివి ఇలా ఎందుకు ఆస్ట్రోనాట్ గా మారి అంతరిక్షము మీద గ్రహాల మీద ప్రయోగాలు చేస్తున్నావు అని అడిగేసరికి...

హార్వే! నేను చిన్నప్పటి నుండి లెక్కల్లో ఆరితేరాను. ఎంతటి కష్టమైన అసాధ్యమనుకొనే లెక్క ఇచ్చిన క్షణాలలో దాని సమాధానము చెపుతూండేసరికి మా కుటుంబ సభ్యులు నన్ను ఒక ప్రముఖ రిసెర్చి మాధ్స్ శిక్షణ కేంద్రములో చేర్చారు. దానితో నాకు విపరీతముగా లెక్కల మీద అవగాహన కల్గింది.వాళ్లకి సాధ్యంకాని లెక్కలకి నేను సరియైన సమాధానాలు ఇచ్చేసరికి నన్ను విదేశాలకి పంపించి మ్యాధ్స్ లో ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్లారు.దానితో నాకు అవార్డులు, రివార్డులు రావడము మొదలైంది. నా మ్యాధ్స్ ప్రదర్శన ఎంతో మంది లెక్కల మేధావులు నాకు ఒక ఐకాన్ గా గుర్తింపు ఇవ్వడము జరిగింది. దేశములోనికి ప్రముఖ బిరుదులు నా పేరుకు వచ్చి చేరాయి. మా కుటుంబ సభ్యులు అందరు సంతోషించిన మా తాతయ్య, అమ్మమ్మ పెద్దగాసంతోషించక మాములుగా ఉండేసరికి వాళ్లని అసలు విషయము ఏమిటని అడిగినపుడు మా తాతయ్య కాస్త నా చేతిలో నా జాతక చక్రము ఉంచి దీనిని ఒకసారి చదువుకో. నీకే అన్ని విషయాలు తెలుస్తాయి. మేము ఎందుకు స్పందించడము లేదు నీకే తెలుస్తుంది అన్నారు. అపుడు నాకు ఆశ్చర్యమేసి ఆ జాతకము నాదేయని అది నా 5 వ యేటనే గీయించారని అందులో నేను గొప్ప మ్యాధ్స్ మేజిషియన్ అవుతానని అలాగే గొప్ప జ్యోతిష్య వేత్తగా మారతానని అంటూ నాకు ఏయే సంవత్సరాలలో ఏయే అవార్డులు, బిరుదులు వస్తాయో అలాగే నేను ఏయే సంవత్సరాలలో విదేశాలయానము చేస్తానో ఇలా ఎన్నో విషయాలు రాసి ఉన్నాయి. విచిత్రము ఏమిటంటే ఆ జాతకము చెప్పిన ఏ విషయము ఇపుడి వరకు తప్పు అవ్వలేదు. నేను తప్పు చెయ్యాలని ఎన్నో సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. ఎందుకంటే ఈ విషయము గూడ అందులో ఉండేసరికి నా బుర్ర పని చెయ్యలేదు. మానవుడి కర్మ ఫలితాలు అన్ని గూడ గ్రహస్థితి గతులే కారకమని తెలుసుకొనేసరికి నేను కాస్త జ్యోతిష్యవేత్తగా మారాను. అనగానే....

డాక్టర్ జోషి వెంటనే....

అంటే దేవి నువ్వు ఒక సైన్స్ శాస్త్రవేత్త అలాంటిది నవ గ్రహ ప్రభావము మనిషి మెదడు మీద పని చేస్తుందని ఇలా నమ్మావో నాకైయితే అర్ధము గావడము లేదు అనగానే....

జోషి! అంతెందుకు అమావాస్య, పౌర్ణమి, గ్రహణాలు సమయములో సముద్రములో ఆటు పోట్లు అమితంగా పెరగడము నువ్వు గమనించావా? గమనించే ఉంటావు. అది చంద్రుడి గ్రహ ప్రభావము ఇలా జరుగుతుందని  సైన్సు ఏనాడో ఓప్పుకుంది గదా. అలాగే మనము త్రాగే కాఫీ కప్పులో చంద్రుడి ప్రభావము వలన మనకి తెలియని స్థితిలో అందులో తరంగాలు ఏర్పడుతున్నాయని సైన్సు చెప్పింది గదా. సూర్యుడు లేకపోతే జీవుడు బ్రతకలేదని నీకు బాగా తెలుసు..అలాంటిది ఎక్కడో కొన్ని లక్షల మైళ్ల దూరములో ఉన్న సూర్య, చంద్రులే మనకా ఉనికి మీద ప్రభావము చూపుతున్నపుడు జన్మ లగ్నము అనుసరించి ఏర్పడిన జాతక గ్రహ స్థితులు మనిషి మీద ప్రభావము చూపకుండా ఉంటాయా? అంతెందుకు మనము ఇక్కడికి వస్తున్నామని మన గురూజీకి ఎలా తెలిసింది. మన జాతక గ్రహస్థితి ఆయన గ్రహస్థితులు ఆధారముగా అంచనా వేసుకొని మన రాకను ఆయన ముందుగానే ఊహించారు. చిత్రాలు గీశారు. నవగ్రహ ప్రభావము అనేది ఆరు రకాల రుచుల లేదా అరిషడ్వర్గ సమానమని నాకు స్వానుభవము. ఈ గ్రహ స్థితిగతుల మార్పులు లేకపోతే జీవుడి జీవితములో ఎలాంటి మార్పులు, చేర్పులు, బాధలు, ఆనందాలు, సుఖ దుఃఖాలు ఉండవు.బ్రతికున్న శవములాగా నిర్వేదముగా వైరాగ్యముతో ఉంటాడు. ఎలాంటి స్పందనలు, ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, సంకల్పాలు, ఆనందాలు, బాధలు, భయాలుండవు. కోమా పేషెంట్ లాగా జీవితము కొనసాగుతుంది అనగానే....

హార్వే వెంటనే.....

దేవి! నువ్వు చెప్పింది బాగానే ఉంది. కాని మన జన్మ కాలమును బట్టి ఈ గ్రహస్తితులు ఏర్పడతాయని చెపుతున్నావు. మరి మనము జన్మించే కాలమును నిర్దేశించేదెవరు? అనగానే....

హార్వే! ఇదే విషయము తెలుసుకోవటం కోసం నేను ఇక్కడి వరకు రావడము జరిగింది. సహస్ర చక్రము  విశ్వము యొక్క అంతరిక్షమంతా ఉన్నదని మన గురూజీ ద్వారా తెలుసుకున్నాను. కాలమును నడిపించేవాళ్లు ఎవరో తెలుసుకోవాలి. కాని ప్రస్తుత గురూజీ సాధన స్థితి ప్రకారము కాలము అనేది హృదయ చక్రములోని ఇష్ట కామేశ్వరుడు, కామేశ్వరి అదే ఇష్ట కోరికయైన కామ గుణ స్పందన వలన ఈ కాల చక్రము తిరుగుతోందని తెలుస్తోంది. కాని ఈ కాలమును ఆధీనము చేసుకొని ఆడించే ఆటగాడు ఎవరో మనకి తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగితే కాని మనకి తెలియదు.అపుడే మన గురూజీ ఆయన ఎవరో తెలుసుకొనే అవకాశముంటుందని అనుకుంటున్నానని అనగానే....

డాక్టర్ జోషి ఉద్రేకముగా....

దేవి! అంటే ఆ మనిషి జీవితములో సాధించిన విజయాలు అన్నిగూడ గ్రహస్థితులే కారణమా? అనగానే.....

జోషి! కర్మ ఫలితమును బట్టి గ్రహ స్థితులుంటాయి. ఇది కర్మను బట్టి కాలము నిర్ణయిస్తుంది. కాలము అనేది మనకి ఏది ఏయే కాలములో ఏ సమయములో అది సంచారించే నవగ్రహ స్థితుల గతుల బట్టి మనకి అందిస్తుంది.నువ్వు పుట్టకముందే నీ తల్లి దండ్రుల జాతకములో ఒక కొడుకు పుడతాడని, వాడు ఒక పెద్ద డాక్టరు అవుతాడని ఒక జ్యోతిష్యవేత్త ఎలా చెపుతున్నాడో ఆలోచించు. విషయము నీకే అర్ధమవుతుంది. అర్ధమైతే నీ చేతులలో ఏమి లేదని తెలుసుకొని ఈ విషయము జీర్ణించుకోలేక విషము తీసుకోక తప్పదు అంటూ అప్పుడికప్పుడే జోషి జాతక చక్రము గీసి అతను ఏయే సంవత్సరాలలో ప్రయోగాలు మొదలుపెట్టాడో, ఎవరి మీద చేశాడో, ఎపుడు చేశాడో, ఆ ఫలితాలు ఏమిటో అక్షరము పొల్లు పోకుండా అక్షర సత్యముగా చెప్పేసరికి తనకి తప్ప ఎవరికి తెలియని తన రహస్యాలను కేవలము ఏదో గ్రహ జాతక చక్రము గీసి దేవి కాస్త చెపుతుండేసరికి జోషికి కళ్లు తిరగడము మొదలైంది. డాక్టరు కాబట్టి తట్టుకొని నిలబడ్డాడు.మరొకడు అయితే తనకి మాత్రమే తెలిసిన నిజాలు తనకే చెపుతున్న వ్యక్తిని చూసి మూర్ఛపోయేవాడు.

ఇంతలో....

హార్వేకి ఒక సందేహము వచ్చి

దేవి! ఇపుడు పుట్టిన పిల్లవాడికి గ్రహస్థితి ప్రభావముంటుందా? ఎందుకంటే విశ్వములో గ్రహాలే లేవు గదా? మా గురుజీ వీటిని శూన్యము చేశాడు గదా? అనగానే....

దేవి చిరునవ్వు నవ్వి

హార్వే! భూలోక కాలమాన ప్రకారము మనము ప్రస్తుత కాలము  లో ఉన్నాము. కాని అదే ఇదే కాలము విశ్వము ప్రకారము చుస్తే మనమంతా దాని గతములో  ఉన్నట్లుగా అవుతుంది. ఏనాడో ఆదిలో విశ్వము ఏర్పడింది. చైతన్యము పొందింది. నాశనమైంది. ఇదంతా మూడుక్షణాలలో జరిగింది. అసలు ఈ మూడు క్షణాలలో ఈ విశ్వములో ఏమి జరిగింది అలాగే ఇది ఏర్పడింది ఎలా నాశనమయిందో ఆ రికార్డు దృశ్యాలను మన గురూజీ తన సాధన శక్తితో తన మనో దృష్టి యందు సాక్షి భూతముగా ఒక సినిమా చూస్తున్నట్లుగా చూస్తున్నారు. అసలు ఈయనేమి చెయ్యడము లేదు.గ్రహాలు, లోకాలు ఆ కాలములో ఎలా అదృశ్యమయ్యేయో ఈనాడు మనము చూస్తున్నాము అంతే. నిజానికి మూల ప్రకృతిలో జరిగిన మార్పులు ఈ భూమ్మీద ప్రభావము చూపటానికి కొన్ని కోట్లాను కోట్ల కాంతి సంవత్సరాలు పడుతుంది. మూల ప్రకృతిలో అన్ని నాశనమయ్యాయి. అంతరించిపోయాయి కాని దీని ప్రభావము ప్రస్తుతము మన భూమ్మీద చూపలేదు. చూపటానికి 1300 కోట్ల కొన్ని సంవత్సరాల సమయము పెట్టవచ్చును. అపుడిదాకా మనమంతా గతకాల జీవులైన ప్రస్తుతకాల జీవులుగా బ్రతకవలసిందే. లేకపోతే మన చావు ఎపుడు వస్తుందో అంత ఖచ్చితంగా ఒక జ్యోతిష్య వేత్త ఎలా చెపుతున్నాడో ఆలోచించు. అంటే ఈయన మన భవిష్య గ్రహస్థితుల ఆధారముగా చెపుతున్నాడు.అంటే మనమంతా గత కాలములోనే ఉన్నట్టున్నాము అనే కదా. ఇదే విషయాన్ని మన వేదాలు, పురాణాలు చెప్పడము జరిగింది. వేదాల ప్రకారము ఈ విశ్వము అనేది 64 తత్త్వాలతో ఏర్పడినదని చెప్పితే బ్రహ్మ పురాణము అనేది ఈ విశ్వము అనేది 65 తత్త్వాలతో ఏర్పడిందని చెప్పడము జరుగుతోంది. ఇందులో ఏది నిజమో ఎవరికి తెలియదు. ఈ తత్త్వాలే మూల ప్రకృతి మూల స్తంభాలు. ఈ తత్త్వాలే కాలమునకు డైమెన్షన్స్ అన్నమాట. ఈ తత్త్వాలు కలిగిన ఆదియోగి లేదా ఆది పురుషుడు లేదా ఆది దైవము ఎవరో మనము మన గురూజీ సాధన ద్వారా తెలుసుకుంటున్నాము. అది గూడ గతించిన జ్ఞాపక సంఘటనలు ప్రస్తుతకాల ధ్యాన దృశ్యాలుగా చూస్తున్నామని గుర్తుంచుకో. ఈ జ్ఞాపక దృశ్యాలను సాక్షి భూతముగా చూడటము తప్ప వీటిలో ఎలాంటి మార్పులు, చేర్పులు చెయ్యలేము. ఎందుకంటే ఇవన్నీగూడ రికార్డింగ్ దృశ్యాలే. ఒక సినిమాలాగా లేక ఒక నాటకములాగా చూడాలి తప్ప దానిని నాశనము చెయ్యాలని ప్రయత్నించరాదు. ఎందుకంటే అది ఎపుడో నాశనము అయింది. ఎపుడు, ఎలా నాశనమయినదో మనము చూస్తున్నాము అంతే అన్నమాట.


హార్వే వెంటనే....

అయితే మనకి భవిష్యత్ లేదా?

ఎందుకు లేదు! ఉంది! కాని అది మన భవిష్య తరాల  వారికి మన భవిష్యత్ కాస్త వాళ్ల గతమే అవుతుంది. అర్ధముకాలేదా?ఉదాహరణకి మనకి ఉన్న టెక్నాలజీ కి 50 సంవత్సరాల అడ్వాన్స్ టెక్నాలజీతో జపాను వాళ్లు ఉన్నారు. వాళ్లు ఎప్పుడో బుల్లెట్ ట్రైన్స్ ఉపయోగిస్తుంటే ఇక మనవాళ్లు ఇపుడు వాటిని ఉపయోగించే పనిలో ఉన్నారు గదా. అలాగే వీళ్లకి 100 సంవత్సరాల అడ్వాన్స్ టెక్నాలజీలో హిమాలయ గురువులుంటే వీళ్లకి 1000 సంవత్సరాల అడ్వాన్స్ టెక్నాలజీతో శంబల గ్రామ వాసులుంటే వీళ్లకి 10 వేల సంవత్సరాల అడ్వాన్స్ టెక్నాలజీతో గ్రహాంతర వాసులుంటే.... వీళ్లకి లక్ష సంవత్సరాల అడ్వాన్స్ టెక్నాలజీతో దైవాత్మజీవులు వీళ్లకి పది లక్షల సంవత్సరాల అడ్వాన్స్ టెక్నాలజీతో పరమాత్మకజీవులున్నారు. దీనిని బట్టి మనకి భవిష్యత్ ఉన్నదో లేదో నీవే అర్ధము చేసుకో.అంటే మన భవిష్యత్ మరొకరి గతమే అవుతోంది. బుద్దుడు అన్నట్లుగా మన ప్రకృతి ప్రతిక్షణము మారుతూనే ఉంటుందని చెప్పింది నిజమేనని నమ్మక తప్పదు. పరమజీవి పరమాత్మక శ్వాస ఒక మహా కల్పానికి సమానము. శ్వాస అంటే 12 క్షణాలు అనగా ప్రతి 12 క్షణాలకి విశ్వమే మారుతోందని..... 12 వేల సంవత్సరాలకి మార్పు ఏమిటో అని కాని మానవుడు తెలుసుకోలేడు అంటే నమ్మక తప్పదు గదా. ప్రకృతిలో 5 వేలు లేదా 10 వేల సంవత్సరాలకి మార్పులు వస్తాయని అలాగే సాధనలో 12 సంవత్సరాలకి ఒకసారి ఒకానొక కొత్త అనుభవాలు మొదలు అవుతాయని శాస్త్రవేత్తలు అలాగే సాధన వేత్తలు చెప్పడము జరిగింది. మార్పు అనేది సహజము. కాని మారింది అని తెలుసుకోవడమే... ఏమి మారింది ఎలా మారింది తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన అవుతుంది. దీనికి ధ్యానమే ఉత్తమమైన మార్గము. దీని ద్వారానే ప్రస్తుత కాలములో విశ్వము యొక్క గత కాల దృశ్యాలను ధ్యాన అనుభవ అనుభూతులుగా చూడటము జరుగుతోంది అనగానే....

హార్వే వెంటనే....

అయితే మన అందరికి ఒకే విధమైన ధ్యాన దృశ్యాలు కనిపించాలి గదా? అలా కనిపించడము లేదు గదా? అనగానే....

హార్వే! ఇందాక చెప్పినట్లుగా మనమంతా 64 లేదా 65 తత్త్వాలతో ఉన్నాము. అంటే మనమంతా ఒకే భూమ్మీద ఉన్నప్పుడు మనమంతా వేర్వేరు విశ్వలోక తత్త్వాలతో ఉన్నామని ఎవరికి తెలియదు. అందరు కలిసి ఉన్న ఎవరికి వారే విడి విడిగా విడిపోకుండా మన మధ్య ఉన్న తత్త్వ బంధము ఉన్నదని తెలియదు.నువ్వు భూలోకములో వేరే తత్త్వ  విశ్వముతో ఉండవచ్చును. అలాగే నేను మరియు జోషి ఉండవచ్చును. నేను జ్యోతిష్య వేత్త నువ్వు శాస్త్రవేత్త అలాగే జోషి కాస్త వైద్యవేత్తగా వృత్తులలో మార్పులున్నట్లుగా మన మధ్య నున్న బంధాలలో తత్త్వ బేధము ఉండి ఉండాలి. అంటే ఈ లెక్కన చూస్తే భూగోళాలు ఎన్నో ఉన్నట్లుగానే విశ్వాలు ఎన్నో ఉండి ఉండాలి. ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క తత్త్వముతో పనిచేస్తూ ఉండి ఉండాలి. ఇపుడు నేను జ్ఞాన తత్త్వ విశ్వములో ఉండి భూమ్మీద ఉంటే నువ్వు కాస్త మాయా తత్త్వ విశ్వములో ఉండి ఈ భూమ్మీద ఉండవచ్చును. కాని మనము ఒకే భూమ్మీద ఉన్నాము కాని మనలో తత్త్వాలు వేరు అని తెలిసింది గదా. అపుడు తత్త్వాలు వేరు అయినపుడు మనకి కనిపించే విశ్వము యొక్క గతకాల తత్త్వ దృశ్యాలు గూడ వేరు వేరు అవుతాయి గదా. అంటే ధ్యాన దృశ్యాలు మారతాయి గదా. ఆలోచించు! నీకే తేడా తెలుస్తుంది, అర్ధమవుతుంది. ఎవరు ఏమి తత్త్వములో ఏ తత్త్వ విశ్వములో ఉన్నాడో ఎవరికి వాళ్లే సాధన చేసి జ్ఞానము ద్వారా తెలుసుకోవాలి. మనమంతా గూడ మన భూమికి లాగానే 21 వేల భూమండలాలలో ఇదే విధానము నడుస్తోంది. ప్రస్తుతానికి మన గురూజీ అయితే 65 తత్త్వాలలో జ్ఞాన తత్త్వ విశ్వానికి చెందినవారు. అందుకే ఆయన తన సాధన అంతాగూడ ధ్యాన యోగము ద్వారా సాధిస్తున్నారు. అనుభవ జ్ఞాన పాండిత్యమును పొందుతూ మనకి శాస్త్రీయముగా నిరూపిస్తున్నారు. అంతేకాకుండా ఒకే జననకాలము అలాగే ఒకే మరణ కాలము గూడ ఉండదు. కొన్ని లిప్త కాలాల నుండి కొన్ని క్షణాలు లేదా నిమిషాల తేడా తప్పని సరిగా ఉంటుంది. అంతెందుకు కవల పిల్లలు జన్మ కాలము గూడ ఒకే విధంగా ఉండదు. ఒకడు నక్షత్ర 4 పాదములో పుడితే మరొకడు ఆ తర్వాత వచ్చే క్రొత్త నక్షత్ర పాదములో పుట్టడము నా స్వానుభవ జాతకాలను బట్టి తెలుసుకున్నాను. అలాగే గుంపులుగా చచ్చేవారు గూడ వారి మరణ సమయాలలో మిల్లి సెకండ్స్ తేడాలుండటము గమనించాను. ఇలా ఇంత పగడ్భందిగా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలని ఆధ్యాత్మిక విద్యవైపు మొగ్గు చూపాను. ఇక్కడిదాకా వచ్చాను. అనగానే....

డాక్టర్ జోషి వెంటనే....

దేవి! నీకు ఈ 64 తత్త్వాలు ఏమిటో తెలుసా? అనగానే....

జోషి! బ్రహ్మ పురాణములో ఈ 64 తత్త్వాలు ఉన్నట్లుగా గుర్తు. కాని అవి ఏమిటో నాకైయితే అంతగా గుర్తులేవు. కాని 36 తత్త్వాలు మాత్రము బాగా గుర్తు ఉన్నాయి. అవి శివ, శక్తి, మాయ, కాలము, జ్ఞానము, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచగుణాలు, సదాశివ, ఈశ్వర, కళ, విద్య, రాగము,శుద్ధ విద్య, పురుషుడు, ప్రకృతి, మనస్సు, బుద్ధి, అహంకారము అనే ఈ 36 తత్త్వాలుగా చెప్పబడుతున్నాయి. నీకు తెలుసా? ఈ 36 తత్త్వాలే 36 దేవతలు. వీరే ఒక్కొక్కరు కోటి చొప్పున 36 కోట్ల దైవాలుగా ఉన్నారు. అంటే నిజానికి మనకి 36 కోట్ల దైవాలు లేరు. 36 మంది మాత్రమే ఉన్నారు. వారే అష్ట వసువులు,ద్వాదశాదిత్యులు, ఏకాదశి రుద్రులు, కాగా కొంతమంది ఇంద్రుడు, ప్రజాపతి అంటే కాదు అని వాళ్లు ఇద్దరు అశ్విని దేవతలు అని చెపుతారు. ఇలా 8+12+11+2=33.  ఇక మిగిలిన ముగ్గురు మన త్రిమూర్తులు అన్నమాట. దీనితో 36 మంది అవుతారు. ఈ 36 తత్త్వాలకి ప్రతీకగా 36 తలలు లేదా కాపాలాలున్న సదాశివుడు మన హైందవ ధర్మములో ఉంటే అలాగే బౌద్ధ ధర్మములో 24 తలలున్న బుద్ధుడున్నాడు. మరియు 12 బుద్ధుడి అవతారాలు గూడ కలిపితే మొత్తము 36 తలలున్న బుద్ధుడవుతాడు అంటూ తన ఆధ్యాత్మిక ప్రసంగమును ఆపగానే 


హర్వే వెంటనే...నాకు ఒక సందేహము.జీవుల ఆయుష్ కి అలాగే దైవాల ఆయుష్ కి తేడాలు ఎందుకున్నాయి అనగానే...

దేవి వెంటనే నాకు తెలియదు అనగానే 

వీళ్ళ సంభాషణాలు అంతా గూడ విశ్రాంతి స్ధితిలో ఉండి వింటున్న కాలాముఖుడు అందుకొని

నాయనా..ఇది తేడా అనేది మన భూమి భ్రమణ తేడాలు బట్టి వారి ఆయుష్ తేడాలు వస్తాయి.అంతెందుకు శ్రీరాముడు 11 వేల సం!!రాలు ఆయుష్ తో ఉంటే అదే శ్రీకృష్ణుడు ఆయుష్ 124 సం!!రాలు ఉంది.అంటే త్రేతాయుగానికి అదే ద్వాపరయుగానికి భూమి భ్రమణ వేగము చాలా ఎక్కువుగా తిరుగుతూండేసరికి ఈ కాలాయుష్ లు తేడాలు వచ్చాయి.అంటే ఈ లెక్కన చూస్తే సత్యయుగ జీవుల ఆయుష్ ఒక లక్ష సం!!రాలుంటే అదే త్రేతాయుగ జీవులకి పదివేల సం!!రాలుంటే ద్వాపరయుగానికి 1000 సం!!రాలుంటే...అదే కలియుగానికి వచ్చేసరికి జీవుడి ఆయుష్ 100 సం!!రాలకి వచ్చింది.దీనికి కారణము మన భూమి యొక్క భ్రమణము అనేది సత్యయుగములో నెమ్మదిగా ఉంటే ఇదికాస్తా కలియుగానికి వచ్చేసరికి దీని భ్రమణము మనోవేగముగా మారడముతో జీవుల ఆయుష్ లలో తేడాలు అంతే వేగముగా మారినాయని నాకు అనిపింస్తోంది.నిజానికి కాలము అనేది ఎపుడు గూడ ద్రవ్యరాశి మార్పును బట్టి కాలమార్పు ఉంటుందని మీ అందరికి తెలిసిన విషయమే గదా అంటూ ఈయన తిరిగి ధ్యానస్ధితికి వెళ్ళగానే ...

అందరు గూడ విశ్రాంతి స్ధితికి చేరుకొని దేవి చెప్పిన ఈ 64 తత్త్వాల సిద్ధాంతము ఎంతవరకు సాధ్య అసాధ్యమోనని ఆలోచనలో పడ్డారు.


No comments:

Post a Comment