అధ్యాయము 23


పరమహంసకి

ఉన్నట్టుండి మనస్సులో ఏదో తెలియని ఆవేదన, ఆందోళన మొదలైంది. ఏదో జరగబోతుంది. అది ఏమిటో తనకి అర్ధముగావడము లేదు. కడుపులో త్రిప్పినట్లుగా అన్పించసాగింది. తన మనస్సు జరగబోయే ప్రమాద సంకేతాలు ఇస్తోందని తనకి తెలిసినా ఏమి చెయ్యలేకపోతున్నాడు.

ఇది ఇలా ఉంటే.....

అకస్మాత్తుగా ఇంటి మీదకి ఒక డజను దాకా నల్ల కాకులు వచ్చి అరవడము మొదలుపెట్టాయి. కుక్కల ఏడుపులు మొదలైనాయి. నక్కల, తోడేళ్ల అరుపులు వినిపించాయి. పిల్లి చచ్చి పడి ఉంది. అంటే తనకి ప్రకృతి గూడ ఏదో ప్రమాద సంకేతాలు చూపిస్తోందని   ఈయనకి అర్ధమైంది.

అపుడు జాతక ప్రశ్న వేసుకుంటే దేవికి ఏదో తెలియని తాంత్రిక ప్రమాదము కలుగుతోందని ఈయనకి అర్ధమైంది. అన్ని తెలిసినా తను ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నందుకు తన మీద తనకే అసహ్యం, ఆవేదన, బాధ కల్గడము మొదలైంది. దానితో ఈయన తనని తాను నిగ్రహించుకోవటానికి కాలభైరవుడి దేవాలయానికి వెళ్లాలని అనుకొని హార్వెకి, జోషికి ఈ విషయం చెప్పి దేవిని జాగ్రత్తగా చేసుకొమ్మని చెప్పి.....

ఆయన ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు.

కాలము కలిసి రాకపోతే ఉన్న అదృష్ట అవకాశాలు జారిపోతాయి అన్నట్లుగా ఈయన ఏదో కారణముతో ఇంటి నుండి వెళ్లడమే దేవికి ఒక పెద్ద శాపమైంది. అదియే ప్రయోగ మరణ శాసనమైంది.

ఇంతలో.....

పనివాడు బయట నుండి కూరలు తెస్తూ లోపలకి వచ్చాడు. ఇంటిలో  పరమహంస లేడని తెలుసుకొని ఇంటిలో ఉన్న వ్యక్తులైన హార్వే గదికి వెళ్లగా.... అతను ఏవో పరికరాలు రిపేర్లు చేస్తూ కనిపించాడు. జోషి గూడ తన గదిలో పుస్తకము చదువుతూ కన్పించగానే..... వీళ్లు తమ పనులలో బిజీగా ఉన్నారని..... తను ఏమి చేసిన ఎవరు గూడ పట్టించుకోరని.... తప్పుడు ఆలోచనలతో...... తప్పుడు ఉద్దేశ్యముతో వంటవాడు....ఏకాంతముగా.... ఒంటరిగా... స్పృహలేకుండా....వస్త్రాలు చెదిరి, నిద్రలో ఉండి ఉన్న దేవి గదికి పిల్లిలా అడుగులో అడుగు వేస్తూ చేరుకున్నాడు.

తలుపులు నెమ్మదిగా...శబ్దము రాకుండా వేశాడు. దేవి మంచి నిద్రలోనే ఉందని.... మెలుకువ రాలేదని ఈ పనివాడు నిర్ధారణ చేసుకొని.... ఆమె పాదాల దగ్గరికి చేరాడు. తనని ఎవరు గమనించడము లేదని.... చుట్టూ ఒకసారి చూసి ఇదే మంచి అవకాశమని... ఇంతటి దేహ సౌందర్యమును చూసినవాడు ఏమి చెయ్యకుండా ఉండలేడని అనుకుంటూ.....

తన ప్యాంట్ మీద చెయ్యి వేసి.....

లోపల నుంచి.... చిన్నపాటి కత్తి తీసి....

పాదాలకి ఉన్న గోరులు, చేతికున్న గోరులు, తల వెంట్రుకల కొసలు, చేతి మణికట్టు మీద చిన్నపాటి గాడి చేసి రక్తము తీసుకొని.....

యధావిధిగా....

అక్కడ నుండి పిల్లిలా నడుచుకుంటూ బయటికి వచ్చి... తలుపులు మూస్తుండగా.......

హార్వే, జోషిలకి ఉన్నట్టుండి శవాల వాసన గుప్పుగా రావడముతో.....

ఏమి జరుగుతుందోనని అంటూ అనుమాన భయముతో దేవి ఉన్న గది వైపు వచ్చారు.

పనివాడు కాస్త....

దేవి వాంతి చేసుకున్న అరటి చెట్టు దగ్గర ఆమె నడిచిన పాదాల ముద్రల ఇసుకను సేకరిస్తూ వీళ్లని గమనించిన అంతగా పట్టించుకోలేదు.

దేవి గది వైపుకి వీళ్లు వెళ్లగానే...

పనివాడు.... ఏదో తెలియని భయముతో అక్కడ నుండి శరవేగముగా బయటికి వెళ్లిపోయాడు.

మరి శవాల వాసన తమకి ఎక్కడ నుండి వచ్చినదోనని దేవి గది అంతా వీళ్లు చూశారు. అక్కడ వీళ్లకి ఏమీ కన్పించలేదు, ఎవరూ కన్పించలేదు. కాని ఆ గదిలో గూడ శవాల వాసన చాలా లైటుగా ఉన్నట్లుగా వీళ్లు గమనించి గది నుండి బయటికి రాగానే....

ఎదురుగా.....

పనివాడు కాస్త కూరగాయల మూటను నెత్తిమీద పెట్టుకొని లోపలికి రావడము జరిగింది.

జోషి.... వెంటనే....

ఆ పనివాడితో.....

ఇందాక వచ్చావు కదా. మళ్లీ ఇంతలో బయటికి ఎపుడు వెళ్లావు అనగానే

ఆ పనివాడు వెంటనే.......

అయ్యా! ఉదయము కూరగాయల బజారుకి వెళ్లి ఇపుడే వస్తున్నాను. గావాలంటే నా నెత్తిమీద ఉన్న కూరగాయల మూట చూడండి. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో. నేను మాత్రము ఇపుడే వస్తున్నాను. ఇది నిజము అంటూ వాడు యధావిధిగా ఇంటి వంట గది వైపు వెళ్లిపోవడము

చూసిన వీరిద్దరికి ఏదో తెలియని అనుమానము మొదలైంది.మరి తాము చూసిన మొదటి వంటవాడు ఎవరు? మనము నిజముగానే భ్రమ పడ్డామా? వాడు వంటవాడా కాదా అని తర్జన భర్జన పడుతూండగా......

పరమహంస లోపలికి వాస్తు.....

వీళ్ల అవస్థను గమనించి

నాయనా! ఏమి జరిగింది? అనగానే......

తామిద్దరు చూసిన దానిని పూస గుచ్చినట్లుగా చెప్పగానే....

పరమహంస వెంటనే.....

మీకు నిజముగానే శవాల వాసన వచ్చిందా? అయితే మొదటి పనివాడు మన పనివాడు గాదు. వాడి రూపములో వచ్చిన కర్కోటకుడు అయ్యి ఉంటాడు. ఇందాక నా మనస్సు అలాగే ప్రకృతి గూడ వీడి రాక గురించి నాకు తెలియ చెయ్యడానికి ప్రమాద సంకేతాలు ఇచ్చాయి అన్నమాట.

వీటి బాధ నాకు అర్ధము కాక నా బాధను ఆయనతో చెప్పుకోవాలని కాలభైరవుడి దగ్గరికి వెళ్లాను. నేను అటు వెళ్లగానే..... వాడు ఆ! కర్కోటకుడు! కామరూప విద్యతో పనివాడిగా  వచ్చి మిమ్మల్ని మాయ చేసి వాడికి గావాలసిన   వస్తువులు దేవి నుండి తీసుకొని వెళ్లి ఉంటాడు.

జోషికి, హార్వేకి పరమహంస అసలు ఏమి మాట్లాడుతున్నాడో ఒక పట్టాన అర్ధము కాలేదు.

పరమహంస వెంటనే....

దేవి గదికి వెళ్లి ఆమెను నిశిత దృష్టితో పరిశీలిస్తూ....

ఇదిగో చూడండి! ఆమె కాలి అలాగే చేతి గోరులు, చేతి మణి కట్టు మీద గాడి కట్ చేసి ఉన్నాయి. అలాగే కొంతమేర తల వెంట్రుకల కొసలు కత్తిరించి ఉన్నాయి. అంటే వాడు ఈ పనివాడి రూపములో వచ్చి ప్రయోగానికి గావాల్సిన వస్తువులు అనగా గోర్లు, వెంట్రుకలు, రక్తము, పాదాల ఇసుక తీసుకొని వెళ్లాడు అన్నమాట అనగానే......

హార్వే వెంటనే......

గురూజీ! ఇదంతా నిజమే గావొచ్చును. ఎందుకంటే మాకు వాడు ఆఖరిగా దేవి వాంతి చేసుకున్న అరటి చెట్టు క్రింద ఇసుకను చేతితో తాకుతున్నట్లుగా కనిపించాడు అనగానే.....

అంటే.... తను అనుకున్నంత పని వాడు చాలా తెలివిగా చేసుకొని పోయాడని.... తను ఇంటి నుండి బయటికి వెళ్లి ఉండకపొయ్యుంటే ఇంత అనర్ధము జరిగి ఉండకపోయేదని.....

     జరిగేది జరుగక మానదు

      జరగనిది ఎన్నడికి జరగదని

అనుకుంటూ గది నుండి పరమహంస నిరాశగా బయటికి వచ్చి తన ధ్యాన గదికి వెళ్లిపోవడముతో......

ఇది ఇలా జరగాలని కాలమే నిర్ణయించినపుడు దానిని ఆపాలని మనము అనుకోవడము అవివేకమే అవుతుందని వీరిద్దరు గూడ అనుకొని అక్కడ నుండి తమ గదుల వైపుకి వెళ్లారు.


1 comment:

  1. ఓం స్వామి.
    తరువాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాం

    ReplyDelete