అధ్యాయము 22


కర్కోటకుడు, చారుకేశ కాస్త దేవి మీద చేతబడి చెయ్యటానికి స్మశానమునకు చేరుకున్నారు. ఒక చేతిలో ఉన్న చిన్న మూటను అలాగే మరొక చేతితో  తెచ్చిన కోడిని నేల మీద పెడుతూ కర్కోటకుడు అష్టదిగ్బంధన ముగ్గు వెయ్యడము ప్రారంభం చేసాడు.అలాగే చారుకేశ తాను తెచ్చిన మూటలోంచి ఆవు, పిల్లి, గుఱ్ఱము, ఏనుగు, ఎలుక మలాలు బయటికి తీశాడు. మానవ క్రొవ్వుతో చేసిన నూనె బయటికి తీసి ఒక ప్రమిదలో పోసి ఓత్తి వేసి వెలిగించడానికి సిద్ధము చేశాడు.

ఈ లోపల....

కర్కోటకుడు తన ముగ్గును పూర్తి చేసి దాని మీద పసుపు, కుంకుమ చల్లి మంత్రించిన మేకులను తీసుకొని అష్టదిక్కులలో కొట్టటానికి వెళ్ళిపోతూ.... శిష్యుడి కేసి.....

శిష్య! ఈ రోజు నువ్వు చేతబడి ఎలా చేస్తారో నన్ను చూసి నేర్చుకో. ఈ ముగ్గును అష్టదిగ్భంధన ముగ్గు అంటారు. దీని వలన అష్ట దిక్కులలో స్మశాన పిశాచాలు, ప్రేతాత్మలు, దెయ్యాలు, భూతాలు వచ్చి చేరతాయి. వీటివలన మనకి ఎలాంటి ప్రమాదము రాకుండా ఉండటానికి ఈ అష్ట దిక్కులలో మంత్రించిన మేకులు పెట్టాలి. తంత్ర శాస్త్రములో 'మేకు' అదే ఇనుప వస్తువులకి ఉన్నత స్థానముంది. ఏ ప్రయోగానికైనా ఈ అష్టమేకులు అవసరము. ఎందుకంటే ఈ మేకుల ద్వారా తాంత్రిక దేవతలు వచ్చి మనల్ని రక్షిస్తుంటాయి. గాకపోతే ఈ దేవతలు ఓ పట్టాన మనకి బంధీ గావటానికి ఇష్టమును చూపవు. వాటిని నయానా,భయానా, ఆశ పెట్టి లొంగతీసుకోవాలి. అవి లొంగడానికి వచ్చినపుడు వివిధరకాల శబ్దాలు, అరుపులు , ఆర్తనాదాలు బాధాకరమైన దృశ్యాలు చూపిస్తాయి, చేస్తాయి. వాటికి సాధకుడు ఎట్టి పరిస్థితుల్లో చలించకూడదు. ఏమి విననట్లుగా, ఏమి చూడనట్లుగా అంతాగూడ ఒక నాటకము చూస్తున్నట్లుగా.... చేస్తున్నట్లుగా మనము వ్యవహరించాలి. లేదంటే మన ప్రాణాలు వీటి చేతికి చిక్కుతాయి. అపుడు మనకి కుక్క చావే వస్తుంది. ఇలాంటి చావులు చాలా భయంకరముగా ఉంటాయని తెలుసుకో. ఇపుడు ఈ అష్ట మేకులను అష్ట దిక్కులలో కొడుతున్నపుడు దిక్కుల దేవతలు చేసే విన్యాసాలు నువ్వే కళ్లారా చూడు. అంటూ ఉత్తర దిక్కుకి వెళ్లగానే..... కాలి అందెల శబ్దాలు విపరీతముగా వినిపించిన గూడ కర్కోటకుడు అటుకేసి చూడకుండా మేకు ఆ దిక్కులో దించాడు. దానితో ఆ శబ్దములు ఆగిపోయాయి. ఆ తర్వాత దక్షిణ వైపు దిక్కుకి వెళ్లగానే ఒక స్త్రీ మూర్తి హృదయ విదారకమైన ఆర్తనాదాలు విపరీతముగా విన్పించాయి. అయినా కర్కోటకుడు పట్టించుకోకుండా ఆ దిక్కులో మేకును కొట్టాడు. ఆ తర్వాత పడమర వైపుకి వెళ్లితే అక్కడ పెద్ద పెద్దగా అరుపులు, గోలలు విన్పించాయి.అయినా పట్టించుకోకుండా కర్కోటకుడు ఒక మేకు ఆ దిక్కులో దించాడు. ఆ తర్వాత తూర్పుదిక్కుకి వెళ్లితే విపరీతంగా ఏడుపు శబ్దాలు, ఎవరో చచ్చిపోయినట్లు ఏడుపులు విన్పించినా కర్కోటకుడు పట్టించుకోకుండా మేకు కొట్టాడు. ఇలా ఈశాన్యము, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి ఉపదిక్కులలో గూడ ఏమి విన్పించిన గూడ పట్టించుకోకుండా కర్కోటకుడు నాలుగు మేకులు కొట్టి మొత్తంగా అష్ట దిక్కులలో అష్ట మేకులు ఎలాంటి ఆటంకాలు వచ్చిన గూడ పట్టించుకోకుండా కొట్టడము చారుకేశ చూస్తూ ఆశ్చర్యానందమునకు గురి అయ్యాడు.

ఆ తర్వాత........

కర్కోటకుడు బియ్యపు పిండితో ఒక పిండి బొమ్మను తయారు చేస్తూ.....

శిష్య! నిజానికి శ్రాద్ధ కర్మలు చేసేటపుడు మనము చచ్చిన వాడి పిండి బొమ్మ తయారు చేస్తాము. ఆ తర్వాత ఒక మనిషి బొమ్మ గీస్తారు.అందులో ఒక్కొక్క  అంగము మీద మంత్రించిన నీళ్లు మన చేత పురోహితులు చెల్లిస్తూ చచ్చినవాడి పిండదేహము తయారు చేస్తాము. ఈ పిండదేహము కాస్త అరచేయ్యంత ఉంటుంది. దీనినే యాతన శరీరము అని గూడ అంటారు. ఇదియే వాడి కర్మానుసారము స్వర్గానికి లేదా నరకానికి వెళ్లుతుంది. జీవుడికి పాపకర్మలు ఎక్కువగా ఉంటే నరకానికి వెళ్లి అక్కడున్న శిక్షలు అనుభవించి పుణ్య ఫలము ఉన్నంతవరకు స్వర్గానికి వెళ్లి సుఖాలు అనుభవిస్తుంది. అదే పుణ్య కర్మఫలాలు ఎక్కువ ఉన్న మొదట స్వర్గానికి వెళ్లి సర్వసుఖాలు అనుభవించి ఆపై కర్మశేషముగా ఉన్న పాపకర్మలను అనుభవించటానికి నరకానికి వచ్చి నరక యాతనలు అనుభవిస్తాడు. ఇదంతా గూడ మనము తయారు చేసే చచ్చినవాడి పిండదేహమే అనుభవిస్తుంది. చచ్చిన వాడు తిరిగి వాళ్ల వంశములోనే పుట్టాలని మనము కోరుకొని వాడికి పిండ కార్యక్రమాలు చేస్తాము. తద్దినాలు పెడతాము. దశదిన కార్యక్రమాలు,దానాలు చేస్తాము. ఇవే ఈ పిండదేహము చేసే స్వర్గ లేదా నరక యాత్ర సమయములో ఉపయోగపడతాయని గరుడపురాణము చెపుతోంది.

స్వామి! ఇలా నిజముగానే జరుగుతుందా? నాకు నమ్మకము కుదరడము లేదు అనగానే.....

కర్కోటకుడు....

ఆ స్మశానములో ఉన్న శవాల సమాధుల

కేసి తేరిపారా చూస్తూ.....

అదిగో.... అక్కడ కాలుతున్న శవము ఒకటి కనబడుతోంది. ఇవ్వాళ ఉదయమే వాడు చచ్చాడు. ప్రొద్దున్నే వీడి శవ దహన సంస్కార కార్యక్రమము జరిగింది. వాడి కపాలము పగలగానే వాడి కుటుంబ, బంధు మిత్రులు వెళ్లిపోయారు. ఇంకా ఆ శవము చితిమంటలలో కాలుతూనే ఉంది అంటూ....

ఇపుడు ఏమి జారుతుందో చూడు అనగానే .......

చారుకేశ కాస్త ఆ శవము కేసి చూడగా....

చచ్చినవాడి కపాలము నుండి ఒక నీలిరంగు మంట రావడము మొదలైంది. ఒక అర చెయ్యి పరిమాణములో ఆ వ్యక్తి లాంటి వాడు వెలుతున్న కాంతి శరీరముతో బయటికి రావడము జరిగింది. గాకపోతే ఈ దేహమును బంధిస్తూ ఒక సన్నని కాంతితో ఉన్న త్రాడు ఉంది. వీడిని ఈ కపాలము నుండి బలవంతముగా బయటికి లాగుతున్నట్లుగా వీడికి కన్పించింది. ఈ త్రాడును మూడు అడుగుల ఎత్తులో ఉండి ఇద్దరు కొమ్ములుండి నీలి రంగు శరీరాలతో రాక్షసుల ఆకారములో ఉన్నవారు లాగుతూ చారుకేశకి  కన్పించారు. అపుడు వీళ్లు ఈ పిండ దేహముతో ఏదో చెపుతూ... వాడిని ఆకాశములోకి బరబరా లాక్కుంటూ   తీసుకొని పోవడము కళ్లారా చూసిన చారుకేశకి నోటమాట రాలేదు.

కర్కోటకుడు వెంటనే....

ఏమిరా! శిష్య! నేను చెప్పింది అక్షర సత్యమే గదరా? వాళ్ళు యమ దూతలు. చచ్చినవాడి పాపాలు బాగా చేసి ఉంటాడు. అందుకే నరకానికి వెళుతున్నాడు. వాడి సంగతి వదిలెయ్యి. దీని సంగతి చూడు. దేవి పిండి బొమ్మ తయారు అయింది. ఇపుడు దీనికి దాని పిండ దేహముతో ప్రాణ ప్రతిష్ట చెయ్యాలి.

స్వామి! చచ్చినవాడికి గాకుండా బ్రతికున్న వాడికి గూడ పిండ ప్రదానము చేస్తున్నారా?

పిచ్చివాడా! చచ్చిన వాడి పిండదేహము వాడి శరీరములోని ఉంటుంది. మరి దేవి ఇంకా బ్రతికే ఉంది గదా. దాని పిండదేహము దాని శరీరములోనే ఉంటుంది గదా. మరి దాని శరీరము మన దగ్గర లేదు గదా. ఆ పిండదేహము మన దగ్గరికి వస్తే కాని మనము ఏమి చెయ్యలేము. ఎందుకంటే ఈ పిండదేహానికి వాయు ప్రసరణ ఆపడమే చేతబడి ప్రయోగము అవుతుంది. ఈ దేహానికి వాయువు అందకపోతే భౌతిక శరీర అంగాలు ఒక్కొక్కటి దెబ్బ తింటాయి. అది నాలుగు క్షణాల నుండి నాలుగు రోజులలో ఈ ప్రయోగము పూర్తి చెయ్యవచ్చును. ఈ పిండ దేహము మన దగ్గరికి రావటానికి ప్రయోగము చేయబోయే వ్యక్తి యొక్క గోరులు,తల వెంట్రుకల కొసలు, రక్తము, కాలిపాదాలకున్న ఇసుక మనకి గావాలి. ఇపుడు నేను వాటిని దేవి దగ్గర నుండి తీసుకొని వస్తాను. అందాక నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ.....

ఉన్నట్టుండి కర్కోటకుడు స్మశానము నుండి అదృశ్యమయ్యాడు.


No comments:

Post a Comment