అధ్యాయము 45

 డాక్టర్ జోషి....

అక్కడే ఉన్నా హార్వే తో....

మిత్రమా! నీవు తయారు చేసిన ఈ ఆలోచనల రీడింగ్ చేసే మెషిన్ సరిగ్గా పని చేస్తుందా? అని అడిగాడు.

జోషి! ఇపుడు ఆ సందేహము ఎందుకు వచ్చింది? అన్నిరకాల దృశ్యాలు గూడ ఇది రికార్డింగ్ చేస్తుంది గదా. నువ్వు చూస్తున్నావు గదా.

"అదిగాదు! మన గురూజీ అయిన పరమహంస ఆలోచనలు రికార్డింగ్ చేస్తుందా లేక ఆయన ఊహలు లేదా భావాలు రికార్డు చేస్తోందా " అని డౌట్ వస్తోంది. ఎందుకంటే..... గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో ఇప్పటికి మన శాస్త్రవేత్తలు ఎన్నో వందల సంవత్సరాల నుండి ప్రయోగాలు చేస్తున్నారు.

ఇపుడికి  వాళ్ల జాడ మనకి తెలియలేదు. కేవలము బుధ, శని గ్రహ పరిసర ప్రాంతాలలో ఉన్న నీటిజాడను బట్టి  పాలపుంత ఏర్పడిన 800 కోట్ల సంవత్సరాలలో ఏలియన్స్ పుట్టి ఉండాలి. ఇపుడు మనమున్న  పాలపుంత పుట్టి 1300 కోట్ల సంవత్సరాలు అయింది. ఈ లెక్కన చూస్తే ఏలియన్స్ పుట్టి 400 కోట్ల సంవత్సరాలు అయ్యి ఉంటుంది. మన 100 టెక్నాలజీ వాళ్లది 400 సంవత్సరాల టెక్నాలజీ గావడము వలన వాళ్లు మనకన్నా చాలా ఉన్నత స్థాయిలో ఉండి ఉంటారు. ఈ మధ్యనే మన సౌర కుటుంబము అవతలి నుంచి భూమికి 51 కాంతి సంవత్సరాల దూరము నుంచి శక్తివంతమైన రేడియో సిగ్నల్స్ వచ్చాయని తెలిసింది. అలాగే భూమి దగ్గరగా ఉన్న కుజ గ్రహము మీద జీవమున్నదో లేదో తెలియడానికి మనకి అనగా 20 కోట్ల km దూరములో ఉన్న ఈ గ్రహానికి చేరడానికి మనకి ఒక సంవత్సరము పట్టింది. మరి అలాంటిది 50 కాంతి సంవత్సరాలు అంటే ఎన్నో వందల సంవత్సరాలు పూర్తి అయితే కాని మనకి తెలియడానికి పడుతుంది గదా. అంటే గ్రహాంతరవాసులు ఎక్కడ ఉన్నా వారిని మనం చూడటం దాదాపు అసంభవమే గదా. మరి అలాంటిది నిన్న మన గురూజీ ఎలా గ్రహాంతరవాసులను చూశారు. ఎలా కలిశారు? నాకైయితే అర్థము గావడము లేదు. అంటే ఇలా వీళ్లు వచ్చిన దృశ్యాలు అన్ని గూడ ఆయన ఆలోచనల నుంచి రాలేదు. ఆయన ఊహలు లేదా భావనల వలన అవి కాస్త మనకి ధ్యాన దృశ్యాలుగా కనబడి ఉంటాయని అనుకోవచ్చు గదా? అనగానే......

హార్వే వెంటనే

అలా జరగటానికి అవకాశమే లేదు. ఎందుకంటే గ్రహాంతరవాసుల విషయము మన గురూజీ భావనలు, ఊహలు అయితే ప్రారంభ చక్రమైన మూలాధార చక్రము లోనే ఆయన వాళ్ల గూర్చి ఊహించవచ్చు లేదా భావించుకోవచ్చు. కాని మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక. అనాహత చక్రాలు దాటి విశుద్ధ చక్రము వద్ద ఆయన ఎందుకు వీళ్లని ఊహించుకొని ఉంటారు అనగానే.

ఎందుకంటే విశుద్ధ చక్రము అనేది ఊహశక్తి ఇస్తుంది గదా? ఆ కోణములో ఆలోచించు అనగానే....

ఒకవేళ అదే నిజమయితే వాళ్లు రావడము, ఈయన రానని చెప్పడము, ఆ తర్వాత ఈయన మనస్సుతో అంతరిక్ష ప్రయాణము చెయ్యడము ఎందుకు చేస్తారు. ఖచ్చితంగా ఇది ఊహ అలాగే భావన గాదు. ఈ చక్రపు ఆలోచన స్థితియే అదికాస్త మనకి 3d హలో గ్రామ్  చిత్ర దృశ్యాలుగా చూపించింది.ఆలోచన ఉంటేనే రూపము వస్తుంది. అపుడే ఆ రూపానికి ఏమి చెయ్యాలనే   భావనలు వస్తాయి. ఈ భావనాలే  ఊహలకి దారి తీస్తాయి.


ఈ సిద్ధాంతమే కొంతసేపు నిజము అనుకుందాం మనస్సు అంతా ఆలోచనల మయము గదా. మరి నీ లెక్క ప్రకారము మనస్సుకి రూపముండాలి గదా. మరి అది లేదు గదా?

ఎందుకు లేదు! మనస్సుకి ఆలోచన రూపమే ఆత్మ.  అదే సూక్ష్మశరీరము. మనస్సు అస్థిరమైతే రూపము లేని మనస్సు. అదే మనస్సు స్థిరమైతే రూపమున్న ఆత్మ గదా. మనస్సు వేరు! ఆత్మ వేరు! భావాలు ఉన్నది మనస్సు. ఆలోచనలున్నది ఆత్మ. ఆత్మల సంయోగము వలనే మనస్సుకి అపార రూపమైన భౌతిక శరీరము ఏర్పడుతోంది. అంటే ఆలోచనలకి స్పందించేది మనస్సు అయితే ఆశయాలు పెట్టుకునేది ఆత్మ అవుతోంది. ఆలోచన, స్పందన, సంకల్పాలు, ఆశ, భయాలు, ఆనంద రాహిత్య స్థితి పొందితే కాని నిశ్చల మనస్సు అయితే పరిశుద్ధ ఆత్మగా అవ్వదు. అదే పరమాత్మ సాధన స్థితి.  తద్వారా ఈ స్థితి వలన మానవుడు కాస్త మాధవుడవుతాడు.

ఇంతలో....

ప్రతిరోజు ఆన్లైన్ తెలుగు న్యూస్ పేపరు చదివే అలవాటున్న దేవి ఉన్నట్టుండి......

జోషి, హార్వే ఒకసారి ఇలా రండి. ఈ న్యూస్ చదవండి. విషయము మీకే అర్థమవుతుంది అనగానే....

వీళ్ళిద్దరు ఆమె ఉన్న చోటుకి వెళ్లి.....

ఆమె చూపించిన న్యూస్ చూడగానే.....

అందులో.... ఈరోజే శనిగ్రహ చంద్రుడు ఎన్ సెలాడ్  పైన జీవము ఉండేందుకు ఆస్కారమున్నదని  తాజాగా నాసా పరిశోధకులు తమ పరిశోధన నేచర్ ఆస్ట్రానమీ అనే జర్నల్ లో ప్రచురించిన  విషయము చదవగానే.... అప్పటిదాకా జోషిలో ఉన్న అనుమానాలు అన్ని గూడ సమూలముగా నాశనము అయ్యాయి. ఎందుకంటే రెండు రోజుల క్రితమే ఈ విషయము తన గురూజీ ధ్యాన దృశ్యాలు చూపించాయి. ఇప్పుడు నాసా శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని శాస్త్రీయముగా నిరూపించి చూపించారు. జీవముండే అవకాశముంది అంటే అక్కడ ఖచ్చితంగా మానవుడి భౌతిక నేత్రాలకి కన్పించకుండా కేవలము మనో దృష్టియున్న మూడవ నేత్రమైన త్రినేత్రమున్నవారికి అక్కడున్న గ్రహాంతరవాసులు కనబడతారని పరమహంస కాస్త శాస్త్రీయముగా లోకానికి చూపించారు గదా. అంటే తన గురూజీ ధ్యాన అనుభవ దృశ్యాలు అన్ని గూడ అక్షర సత్యమేనని శాస్త్రీయముగా నిరూపించబడుతోంది గదా అనుకొని.....

గురూజీ! నన్ను క్షమించండి! నాకున్న అల్ప  విజ్ఞానముతో...... బ్రహ్మజ్ఞానవంతులైన మిమ్మల్ని అనుమానించాను. మీ ఆలోచనలు ధ్యాన అనుభవాలు శాస్త్రీయమేనని ఈ శాస్త్రవేత్తకి నిరూపించి చూపించినందుకు ధన్యవాదాలు అంటూ గంగానది వైపు తిరిగి పాదాభివందనము చేస్తున్న దృశ్యాలు చూసిన హార్వే కి, దేవికి ఆశ్చర్యానందము వేసింది.

ఆ తర్వాత....


దేవి! అసలు ఆలోచనలకి, భావాలకి, ఊహలకి తేడాలు ఏమిటి? అనగానే....

గత జన్మలలోని జ్ఞాపకాలే ఈ జన్మలో ఆలోచనలుగా మన మెదడులో నిక్షిప్తమవుతాయి. అలాగే గత జన్మల  కర్మలే ఈ జన్మలో భావాలుగా మారతాయి. ఇవి రెండు గూడ ఈ జన్మలో ఊహలు అవుతాయి. అంటే జీవుడు ఊహించుకున్న ఊహ ప్రపంచము కలల ప్రపంచము అవుతుంది. ఈ కలలే రాబోవు జన్మలో కర్మలు ఆపై జ్ఞాపకాలు ఆపై ఆలోచనలు పిట్యూటరీ గ్రంధి చేస్తోంది. అదే పీనియల్ గ్రంధి వీటికి ఒక రూపము ఉన్నట్లుగా చూపిస్తుంది. ఊహలు అనేవి ఈ జన్మ తాలూకా అంశాలే అవుతాయి. భావాలు అనేవి 27 జన్మల అంశాలు అయితే ఆలోచనలు అనేవి ఆది జన్మ నుండి వచ్చే అంశాలు అవుతాయి. మనకి మన గురూజీ యొక్క ఆది జన్మ నుండి అంత జన్మ వరకు ఉన్న ఆలోచనలు బయటికి తేవడమే ఆయన చేస్తున్న ధ్యాన దృశ్యాలు అవుతాయి. అదే ఈయన ఊహలు, భావాలు అయితే ఆది, అంతము గూర్చి చెప్పలేవు. కొంతమేర మాత్రమే మనకి అవి ప్రభావము చూపుతాయి. అందుకే హార్వే పరికరము చూపించే ధ్యాన దృశ్యాలు ఏమై ఉంటాయని నాకు సందేహానికి సమాధానము ఆయన ఆలోచనలేనని నాకు తెలిసేటట్లుగా ఇలా నాసా వాళ్లు ప్రకటన ద్వారా తెలియచేశారు అంటూ ఉండగా.....

హార్వే వెంటనే....

జోషి! నా పరికరము బాగా పని చేస్తోందని  తెలుసుకున్నావు గదా. మరి నీ ప్రయోగాల సంగతి ఏమిటి? అనగానే......

హార్వే! నేను మూడు ప్రయోగాలు మనుష్యుల మీద చేశాను. అందులో ఒకటి మనిషి మరణము తర్వాత ఎక్కడికి వెళ్తాడు? రెండవది మనిషి ఆయుష్ ను  నియంత్రించేది ఏది? మూడవది మనిషి ఆలోచనలు మరో మనిషి ఆలోచనలతో మార్చవచ్చా? అని ప్రయోగాలు చేశాను.

             మొదటి విషయము తెలుసుకోవటానికి నేను సుమారుగా 148 మంది కొన్ని క్షణాలలో చనిపోయేవారిని ఒక గాజు బాక్స్ లో ఉంచి వారికి వైరులు అనుసంధానము చేసి నా పరికరాలు అమర్చే వాడిని. వాళ్లు అంతా దాదాపుగా ఏదో ఒక గుహను చూస్తూ....గు....గు.... అంటూ చనిపోతే మరికొంతమంది దేనినో చూసి భయపడుతూ, బాధపడుతూ చనిపోతే మరికొంతమంది వైరాగ్యముతో మరణభయముతో చనిపోయారు. ఒక యోగి మాత్రము చిరునవ్వుతో జీవ సమాధి చెందాడు. ఇలా విభిన్న భావాలలో చివరి క్షణాలలో మరణాలు పొందారు. ఆ గుహ ఏమిటి? దేనికి వీళ్లు భయపడ్డారో నాకు తెలియలేదు.అంతటితో ఆ ప్రయోగము అసంపూర్ణమైంది.

      ఇక రెండవ ప్రయోగానికి వస్తే ఆయుష్, వయస్సు, వృద్ధాప్య ఛాయలు, మరణ కాలము నిర్ధారణ చేసేది మన మెదడులోని పిట్యూటరీ గ్రంధియే అని నా ప్రయోగాల ద్వారా తెలుసుకున్నాను. ఇది నిజమా కాదా అని శాస్త్రీయ ప్రయోగాల కోసము ప్రభుత్వ అనుమతి కోరితే అందుకు వాళ్లు సమ్మతించలేదు.దానితో ఆ ప్రయోగమును నా మీదనే నేను చేసుకున్నాను. దానితో నా ఆయుష్ 47 సంవత్సరాల దగ్గర శాశ్వతముగా ఆగిపోయింది. నిజానికి నా వయస్సు ఇపుడు 477 సంవత్సరాలు కాని 47  సంవత్సరాల వాడిలాగా మీ అందరికి కనబడతాను. గావాలంటే నా పాన్ కార్డులో నా పుట్టినరోజు వివరాలు చూడండి మీకే తెలుస్తుంది అనగానే.....

      ఈ మాటలు విని మతిస్థిమితము లేని స్థితికి అపుడికే హార్వే, దేవిలు వెళ్లిపోయారు. ఇలాంటి అయోమయ స్థితిలో జోషి చూపించిన పాన్ కార్డు  చూడగానే ఒకసారి వీళ్ల మెదడు మొద్దు బారింది. అంటే.... అంటే నిజముగానే జోషి వయస్సు ఇపుడు 477 సంవత్సరాలా. వామ్మో! అసలు అలా కనిపించడము లేదు.మధ్య వయస్కుడి వ్యక్తిలాగానే కనబడుతున్నాడు అనుకొని జోషికి దణ్ణం పెట్టారు. 


ఇది చూసి జోషి చిరునవ్వుతో


అప్పుడే ఏమైంది? ఇది ఎలా సాధ్య పడిందో తెలుసుకోవాలి గదా. నా పిట్యూటరీ గ్రంథిలో నిక్షిప్తమైన ఈ జన్మ ఆలోచనలు చెరిపేసి... పూర్వజన్మల ఆలోచనలను అందులో నిక్షిప్తము చేశాను. దానివలన నా ఆయుష్ 47 నుండి 477 సంవత్సరాలు అయ్యింది. ఇలా 1000  సంవత్సరాల దాకా ప్రస్తుతానికి కొనసాగుతుంది.ఆపై నేను చేసే ప్రయోగాలు విజయము పొందితే 1000 నుండి 10 వేలు ఆపై 10 లక్షల దాకా నా ఆయుష్ సాగించబడుతుంది.

              ఇక మూడవ ప్రయోగము అయిన ఆలోచనలు మార్చడము అన్నమాట. అంటే ఉదాహరణకు నీ  ఆలోచనలు దేవికి ఇస్తే దేవి ఆలోచనలు సమసిపోయి నీ ఆలోచనలతో ఆమె బ్రతికి వేస్తుంది. అంటే నిజానికి దేవి చనిపోయి నీ ఆలోచనలతో నిన్ను బ్రతికిస్తుంది లక్షణాలు నీవి అన్నమాట. నీ ఆలోచనల రూపముతో నువ్వు మరణము లేని వారిలాగా ఇతర దేహాలలో బతుకుతావు. ఇదే చిరంజీవి తత్త్వము. దేవుళ్లు అవతారాల యొక్క ముఖ్య  ఉద్దేశ్యము గూడ ఇదే. మహా విష్ణువు, మహా శివుడు, మహా దేవి, దత్తాత్రేయుడు ఇలా మున్నగు వారంతా అవతారాలు ఎత్తి తమ ఆది జన్మ ఆలోచన రూపాలను ఈ అవతారాలలో పెడుతూ రావడము జరిగింది. అందుకే బుద్ధుడు కాస్త మహావిష్ణువు అయ్యాడు. కాలాలు మారినా వీరి ఆలోచన రూపాలు మారవు. గాకపోతే శరీరాలు మారతాయి. కాని ఆలోచన రూపాలు కొనసాగుతూ తాము మరణము లేని స్థితిలో ఉంటూ వస్తారు. కొనసాగుతారు. అంతెందుకు నిత్య చిరంజీవితత్త్వముతో నడయాడే శ్రీ దత్తాత్రేయుడు గూడ 16 అవతారాలు ఎత్తినవాడే. అలాగే హనుమంతుడు గూడ  తొమ్మిది అవతారాలు, అమ్మవారు నవదుర్గలు, దశావతారాలు, దశ మహా విద్య అవతారాలు ఇలా ఎత్తిన వారే. అంటే అది జన్మ ఆలోచన రూపమును ఇలా అవతారాల రూపములో కొనసాగినంత కాలము కొనసాగించారు. మహా అయితే ఇలా ఒక కల్పాంతం వరకు కొనసాగిస్తారు. ఆపై కొనసాగించలేకపోయారు. కారణాలు ఏమిటో నాకు తెలియలేదు. దానికోసము ఈ  ప్రయోగము చేస్తున్నాను అని చెప్పగానే......

     హార్వే కి, దేవికి నోటమాట రాలేదు. పైగా చాలా సైలెంట్ గా కనిపించే ఇతడు ఒక పెద్ద సైలెంట్ కిల్లర్ అని వీళ్లకి తెలిసింది.

అప్పుడు జోషి కాస్త వీరితో....

ఈ విధంగా నా మూడు ప్రయోగాలు అసంపూర్ణముగానే మిగిలాయి. మనకు కనిపించే గుహ ఏమిటది? ఆయుష్ నియంత్రించే పిట్యూటరీ గ్రంధిని ఎవరు నియంత్రిస్తున్నారు? మనకి మరణాలు ఇచ్చేదెవరు? ఈ మూడు ప్రయోగ ప్రశ్నలకి సమాధానాల కోసము మన గురూజీ దగ్గరికి రావడము జరిగింది. వీటికి ఆయన ఎపుడు  సమాధానమిస్తాడని ఎదురుచూస్తున్నాను అనగానే..... 

ఉన్నట్టుండి....

హార్వే పరికరములో.....

ఆజ్ఞ చక్ర ఆధిపత్యము కోసము పరమహంస కాస్త ఆజ్ఞ చక్ర ముద్రతో సాధన చేస్తున్నట్లు ఒక ధ్యాన దృశ్యము  కనిపించడము ఆరంభమైంది.

హార్వే వెంటనే...... కాలాముఖాచార్యుడి కేసి చూస్తే ఆయన కాస్త విశ్రాంతి స్థితి నుండి ధ్యాన స్థితిలోనికి వెళ్లిపోవడము గమనించి వీరంతాగూడ అలెర్ట్ అయ్యి ఈ పరికరము చూపించే ధ్యాన దృశ్యాల వైపు తమ భౌతిక దృష్టిని సారించారు.

No comments:

Post a Comment