కర్కోటకుడు
కాశీక్షేత్ర మహా స్మశాన ఘాట్ అయిన
మణికర్ణిక ఘాట్ కి చేరుకొని.....
అక్కడ ఉన్న గంగానది ఓడ్డున కూర్చొని ఆలోచనలో పడ్డాడు.
తను ఇన్నాళ్లు కష్టపడి నేర్చుకున్న 'ఛోడ్' తంత్ర ప్రయోగము విఫలమైనందుకు బాధగా ఉంది. ఉన్న మూడు అవకాశాలలో ఒక అవకాశము చేజారి పోయింది. అది గూడ తన తప్పు లేకుండా పోయింది అనే బాధ ఇతడి లో ఉంది. ఇక మిగిలిన ఈ రెండు అవకాశాలు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.లేదంటే పరమహంస తల దొరకదు. అమ్మ కాళీమాత కోరిక తీరదు. తద్వారా తను విశ్వాధినేత అవ్వాలనే సంకల్పము తీరదు. అసలు ఎక్కడ పొరబాటు జరిగిందో వీడికి ఒక పట్టాన అర్థముగాకపోయేసరికి......
48 నిమిషాల పాటు ఏకాగ్రత ధ్యాన నిష్ఠలోనికి వెళ్లాడు. ఇతడి మనో దృష్టి ముందు యధావిధిగా నకిలి పరమహంసయైన కాలాముఖుడు ఉన్న గది అలాగే గాజుబాక్స్ అలాగే శాస్త్ర కత్తలు కనిపించారు. అంటే పరమహంస కాశీ క్షేత్రములోనే రహస్య గదిలోనే ఉన్నాడు గదా. మరి అగ్ని బేతాళుడు తను మాయలో, భ్రమలో ఉన్నాడు అంటాడు. పైగా నువ్వు చూసే వ్యక్తి వేరు అంటాడు. పోనీ పరకాయ విద్యను పరమహంస చేస్తే శవముండాలి గదా. శవము లేదు. పరమహంస రూపముంది. ఇక తను మాయలో ఉండటము ఏమిటి? ఇందులో తన సాధన శక్తికి మించిన మర్మ రహస్యము దాగి ఉందని కర్కోటకుడికి అర్ధమై ధ్యానము నుండి లేచి....
కీనారామ్ సమాధి వైపు బయలుదేరి.....
అక్కడికి చేరుకొని....
ఆ సమాధి దగ్గర..... నాలుగు గంటలకు పైగా ధ్యాన నిష్ఠ లో ఉండగా.....
ఇతడి మనో దృష్టి ముందు లీల మాత్రముగా ధ్యాన నిష్ఠలో ఉన్న కీనారామ్ కన్పించేసరికి.....
ఈయన ధ్యాన నిష్ఠలో ఉన్నారు. ఇక కొన్ని నెలల దాకా తనకి ఈయన నుండి ఎలాంటి సమాధానము రాదని గ్రహించి....
స్వామి! ఇలా మీరు గూడ ధ్యాన నిష్ఠలో ఉండి మౌనము వహిస్తే నా మనస్సుకి ఎవరు సమాధానమిస్తారు అని ప్రార్థించగానే....
ఉన్నట్టుండి....
ఈ సమాధి ప్రక్కనే గోడమీద ఉన్న
ఒక పెద్ద గడియారము.....
భళ్ళున నేల మీద ముక్కలైంది. ఈ శబ్దానికి కర్కోటకుడు కళ్లు తెరిచి.....
అంటే కాలమే తనకి సమాధానము చెపుతుందని స్వామి వారి భావన అని తెలుసుకొని.... కాలమాయ వివరించే కాలజ్ఞానము కోసము ఎదురుచూస్తూ గంగానది అవతలి ఓడ్డుకి చేరుకొని....
'ఛోడ్' తంత్ర మంత్రమును పున:శ్చరన చేసుకొనే పనిలో పడ్డాడు.
No comments:
Post a Comment