అధ్యాయము 20


తుమ్మ పొదల చాటున ఉన్న

చారుకేశలో అసహనము పెరిగిపోయి....

అక్కడే తాపీగా కూర్చొని ఉన్న కూర్చొనియున్న కర్కోటకుడితో....

గురూజీ! అన్నము తినే సమయము గూడ దాటిపోయింది. అరటి ఆకుల కోసము ఇంతవరకు ఎవరు రాలేదు. మన ఎర దొరకానట్టేనా? పరమహంసను బంధించలేమా అనగానే....

శిష్య! దేనికైనా సమయము, సందర్భము రావాలి. సాధకుడికి ఆవేశము పనికిరాదు. సహనము, ఓపిక, ఓర్పు ఉండాలి. అన్నింటికి తొందర పనికిరాదు. నిదానమే ప్రధానం. మరికొన్నింటికి వేగమే ప్రధానం అవుతుంది. ఇప్పుడు మనకి నిదానమే గావాలి. జరగబోయే దానిని సాక్షిభూతంగా చూడు.ఏమి జరుగుతుందో కొన్ని క్షణాలలో నీకే తెలుస్తుంది అంటూండగా.......

దేవి కాస్త ఆ ఇంటి నుండి బయటికి వచ్చి...... వాంతి  చేసుకోవటానికి సరిగ్గా చారుకేశ పాతిపెట్టిన మంత్రించిన మూట ఉన్న చెట్టు దగ్గరకి వచ్చి ఒక పెద్ద వాంతి చేసుకుంది. 

ఈ దృశ్యము చూసిన చారుకేశ ఆనందపడుతూ.....

స్వామి! అంటే! మన ఎర ఈ అమ్మాయా? బాగుంది! చాలా బాగుంది! అందముగా సొగసుగా ఉంది. ఈమె నగ్న దేహమును చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఈ ఎరతో ఆ పరమహంస చేపను పట్టుకోవడము  ఖచ్చితంగా జరుగుతుందని అనిపిస్తోంది అంటూండగా.......

దేవి కాస్త.....

తను వాంతి చేసుకున్న దాని మీద ప్రక్కనే మట్టితో కప్పి వెయ్యాలని ప్రయత్నిస్తూ.... యధాలాపంగా... గుంట తీసి పూడ్చినట్లుగా మట్టి కనిపించేసరికి.... ఇది ఏమై ఉంటుందని.... కాలితో ఈ మట్టిని తడుతూండగా చారుకేశ పాతి పెట్టిన మంత్రించిన చిన్న మూటను కాలితో తట్టుతూ..... ఆ మూటను చేతితో తీసుకొని- దానిని తెరిచి....... అందులో కనిపించిన వస్తువులు చూస్తూ.... మనస్సుకి ఏదో తెలియని ఆందోళనలో.....

ఒక్కసారిగా పెద్దగా అరిచి.....స్పృహ కోల్పోయింది. 

ఈ దృశ్యము చూసిన కర్కోటక, చారుకేశ ఆనందపడుతూ.....

భళారా! ఎర చిక్కింది! మూట విప్పింది. తంత్ర ప్రయోగానికి బలి కోరుకుంది. అంటూ వారిద్దరు అక్కడ నుండి శరవేగముగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు.

ఇదేమి తెలియని.....

జోషి,హార్వే కాస్త....

దేవి అరుపులు విని బయటికి వచ్చి అరటి చెట్టు క్రింద స్పృహ తప్పియున్న ఈమెను చూసి..... శరవేగముగా ఈమెను సమీపించి తమ భుజాల మీద పెట్టుకొని ఆమె గదికి చేర్చారు.


No comments:

Post a Comment