ఈ ముగ్గురు కలిసి కాగితములో ఉన్న అడ్రసున్న ఇంటికి వెళ్లితే......
అక్కడ....కూలిపోవటానికి సిద్ధముగా ఉన్న ఒక పెంకుటిల్లు దర్శనమిచ్చింది! విశాలమైన హాల్..... దీని మధ్యలో
భగ...భగ..... మండుతున్న నిత్య అగ్నిహోత్రం దీని చుట్టున్న నాలుగు స్తంబాలకి వ్రేలాడుతూ ఆటోమెటిక్ ఫోటోలు తీస్తున్న అత్యాధునిక కెమెరాలు.....
ఇంటి గోడలపై.....
ఎవరో గీసిన పెయింటింగ్స్ వ్రేలాడుతున్నాయి!
అందులో.....
36 కపాలాలుండి ధ్యాన నిష్ఠలో పద్మాసనములో ఉన్న అస్థిపంజరము......
ఏవో ఆరుమణులు ఒకదానికొకటి వ్యతిరేక దిశలలో ఉండి కాంతి ప్రసారాలు చేసుకుంటున్న చిత్రము......
పురుష శివలింగ చిత్రము.....
స్త్రీ శివలింగ చిత్రము.....
ఆత్మలింగ చిత్రము....
ఏదో స్పటిక లింగమున్న చిత్రము....
ఏదో ఒక త్రికోణము..... దాని మధ్యలో బిందువున్న చిత్రము....
రెండు త్రిభుజాలు కలిసి నక్షత్రాకారములో ఉన్న చిత్రము....
డైమండ్ గుర్తు చిత్రము.....
రెండు రకాల ఓంకారాల చిత్రాలు....
పాంచజన్య శంఖ చిత్రము....
సుదర్శన చక్ర చిత్రము.....
విష్ణు శాలిగ్రామము, బాణలింగాలు, త్రిశూలము చిత్రాలు.....
ధ్యానముద్రలో ఉన్న గౌతమ బుద్ధుడు చిత్రము కైలాస పర్వతము, అరుణాచల పర్వతము చిత్రాలు......
ఇలా ఎన్నో అర్ధమై అర్ధముకాని పెయింటింగ్స్ చూసుకుంటూ డాక్టర్ జోషి, హార్వే, శకుంతలాదేవి ముందుకి సాగుతూండగా.....
ఆశ్చర్యముగా....
వారికెదురుగా...
ఒక పెయింటింగ్ గీసుకునే కాన్వాస్ కనబడింది! దాని మీద ఈ ముగ్గురి ముఖాలు వారు వేసుకున్న దుస్తుల రంగులతో సహా గీయబడింది!
అంటే.....
స్వామిజీ తాము ఇక్కడికి వస్తున్నామని....
తాము ఎలాంటి రూపురేఖలతో ఉంటామో గూడ తెలిసిపోయినదని అర్ధమయ్యేసరికి వీళ్లకి ముచ్చెమటలు పట్టడము మొదలైంది! గుండె దడ పెరిగింది! తల తిరగడాలు ఆరంభమైంది!
ఇంతలో.....
లోపలి నుండి ఒక వ్యక్తి వచ్చి.... వీళ్లని చూస్తూ....
రండి! రండి! మీరు ఈ రోజు ఈ సమయానికి వస్తారని మా గురుదేవుడు చెప్పారు!
అందుకే మీ కోసము ఎదురుచూస్తున్నాను!
డాక్టర్ జోషి తేరుకొని.....
అయ్యా! మేము ఇక్కడికి వస్తున్నామని గురువుగారికి ఎలా తెలుసు? అనగానే
ఆ వ్యక్తి చిరు నవ్వి......
అయ్యా! తమరి పేరు డాక్టర్ జోషియే గదా!
వైద్యవృత్తిలో 36 సంవత్సరాలకు పైగా అనుభవమున్న వ్యక్తి మీరు! పైగా మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తులకి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ఇప్పుడిదాకా 148 మంది మీద ప్రయోగాలు చేశారు! వీరంతా ఏదో గు....గు....గు.... అంటూ.... లేదా
దేనినో చూస్తూ భయపడుతూ, బాధపడుతూ, ఆవేదన చెందుతూ చనిపోతే.... మరి కొందరు ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, అచేతన మయినారు! వాళ్లు దేనిని చూసి భయపడినారో.... భయపడుతున్నారో మీకు అర్ధము కాలేదు! దాని కోసము శాస్త్రీయ
ఆధారాలు చూపించే వ్యక్తి కోసము మీరు వెతుకులాడుతూ ఇక్కడికి వచ్చారు గదా?అనగానే....అయ్యా! నా వ్యక్తిగత ప్రయోగ వివరాలు మీకు ఎలా తెలుసు అనగానే....ఆ వ్యక్తి మళ్లి చిరునవ్వి.....
ఈ సారి విలియమ్ హార్వే వైపు తిరిగి.......
అయ్యా! తమరి పేరు విలియమ్ హార్వే గదా!
యువ మెకానిక్ ఇంజనీర్! 12 సంవత్సరాల అనుభవముంది! ఆత్మలను ఫోటో తీసే పరికరాల నుండి మెదడు యొక్క ఆలోచనలు హాలోగ్రామ్ గా 3D లో చూపించే పరికరాలు దాకా తయారు చేశారు! కాని వాటిని ఉపయోగించే
అవకాశము మీకు ఇంతవరకు రాలేదు! వీటిని ఉపయోగించే వ్యక్తి కోసము వెతుకుతూ ఇక్కడిదాకా రావడము జరిగింది గదా అనగానే.....
విలియమ్ హార్వే నోరు వెళ్ల బెడుతూ మౌనముగా 'అవును' అంటూ తల ఊపగానే....ఈసారి....ఆ వ్యక్తి అక్కడే ఉన్న శకుంతల వైపు తిరిగి....
అమ్మాయి! నువ్వు ప్రపంచ టాప్ 5 లో ఉన్న ఒక గొప్ప మాధమెటిక్ వ్యక్తి!ఎంతటి లెక్క అయినా నిమిషాలలో జవాబు చెప్పగలవు! ఆనాడు
శకుంతలాదేవి అనే భారతీయ మేధమేటిక్స్ లో ఆరితేరిన వ్యక్తి ఉండేది! చిన్న వయస్సులో ఉండి ఎంతటి కఠినమైన లెక్కకి అయిన క్షణాలలో జవాబు చెపుతూండేసరికి అందరు ఆశ్చర్యపోయినారు!
దానితో ఈమె కాస్త తనకున్న లెక్కల విద్యతో భుక్తిని ఏర్పరచుకొని క్యాలిక్యులేటర్, ఈ నాటి కంప్యూటర్ గూడ చెప్పలేని జవాబులు క్షణాలలో ఆమె చెప్పేది! ఈమె జీవితమును మీ అమ్మగారు స్ఫూర్తిగా తీసుకొని
నీకు ఆమె పేరు పెట్టడము జరిగింది! పేరుకి తగ్గట్లుగా ఆమెకి లాగానే నువ్వు గూడ మాధ్స్ నందు తిరుగులేని రాణిగా ఉన్నావు! పైగా ఇప్పుడు ఖగోళ శాస్త్రము నందు, అంతరిక్ష గ్రహాల మీద ప్రయోగాలు చేస్తూ
మానవ మేధస్సుకి నవ గ్రహాలకి గల సంబంధాలు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి..... శాస్త్రాలను శాస్త్రీయముగా చెప్పే వ్యక్తి కోసము వెతుకుతూ ఇక్కడికి రావడము జరిగింది గదా అనగానే....
శకుంతలదేవి వెంటనే మారు మాట్లాడకుండా ఆయన కాళ్ల మీద పడి పాదాభివందనము చేస్తూ.... 'అవును' అని మాత్రమే తల ఉపగలిగింది!
విలియమ్ హార్వే వెంటనే...
ఎక్కడో దూరముగా ఉన్న మా వివరాలు, మా ఫోటోలు, మీకు ఎలా తెలిసినాయి అనగానే....
ఆ వ్యక్తి వెంటనే....
అయ్యా! ఇప్పుడు నేను చెప్పిన వివరాలు నాకు తెలిసినవి కావు! మీ
గూర్చి మా గురుదేవుడు పరమహంస గారు చెప్పిన విషయాలే మీకు చెప్పడము జరిగింది! మూడు నెలల క్రితమే ఒకరోజు ఆయన ధ్యానము పూర్తి
అయిన తర్వాత..... అదిగో.... అక్కడ కాన్వాస్ మీద..... ఇందాక మీరు చూసిన మీ చిత్రాలను గీసి..... ఈ వివరాలు
నాకు చెప్పడము జరిగింది!
అంటే... మేము వస్తున్న విషయము ఆయనకి ముందుగానే తెలిసిపోయిందా....
అవును! ఈ గోడల మీద గీసిన అన్ని పెయింటింగ్స్ అయన గీసినవే! త్రికాల జ్ఞానికి తెలియని విషయము ఉంటుందా? సాధ్యము కాని విషయము ఉంటుందా? ఉండదు గదా?
సాధన సాధ్యతే సర్వం సాధ్యమని ఆయన జీవితమే అందుకు ఉదాహరణగా ఉంటుంది!
డాక్టర్ జోషి వెంటనే....
అయ్యా! ఈయన గీసిన చిత్రాలకు ఎవరు స్ఫూర్తి అనగానే...
అయ్యా! మా గురుదేవుడు తన ధ్యాన నిష్ఠలో కనబడిన ధ్యాన దృశ్యాలను ఈ చిత్రాలుగా గీయడము జరుగుతుంది! ఈయనకి ఈ దృశ్యాల యొక్క అర్ధము, పరమార్ధము ఏమిటో తెలుసుకోవాలనే ఆశతో... ఆశయముతో ఉన్నారు! కాని 36 కపాలధారి ఎవరో, ఆ ఆరు మణులు ఏమిటో, స్త్రీ, పురుష శివలింగాలు ఏమిటో, ఆత్మ, పరమ లింగాలు ఏమిటో.... ఆయనకి ప్రశ్నలుగానే ఉండిపోయాయి!
వీటికి సమాధానాలు చెప్పెవారు ఒక స్త్రీ, ఇద్దరు పురుషులు వస్తారని.... వారి సమస్యలకి పరిష్కారాలు ఇస్తే.... తన ప్రశ్నలకి అవే సమాధానాలు అవుతాయని తెలుసుకొని...... 'అవే విశ్వ రహస్య చేధన మవుతుందని దానిని
'ది గాడ్ కోడ్' గా
పీల్చుకోవడము జరిగింది! ఈ గోడలపైన ఉన్న చిత్రాలకి అలాగే మీకు ఉన్న సంబంధము ఏమిటో నాకైయితే ప్రస్తుతానికి అర్ధము గావడము లేదు! అనగానే....
అయ్యా! ప్రస్తుతము గురుదేవుడు ఎక్కడ ఉన్నారు అనగానే....
అయ్యా! ఆయన ధ్యానము చేసుకుంటున్నారు అది పూర్తి అయ్యేదాకా బయటికి రారు! గంట లేదా నాలుగు గంటలు పట్టవచ్చు! లేదా 48 నిమిషాలే పట్టవచ్చు! ఏది చెప్పలేను అపుడిదాకా మీరంతా
ఇక్కడ కూర్చోండి అంటూ అక్కడున్న బల్లకేసి చూపించగానే వీళ్లు కూర్చున్నారు!
ఆ వ్యక్తి ఏదో పని ఉన్నట్లుగా బయటికి వెళ్లేసరికి....
విలియమ్ హార్వేలో ఏదో తెలియని ఉత్సాహము వేసి.... ఆనందముతో
విజిల్ వేస్తూ... తను తెచ్చుకున్న ఒక పెద్ద బ్యాగ్ లోంచి.... కెమెరాలు బయటికి తియ్యడము చూసిన
శకుంతల వెంటనే....
"ఒరేయి! కోతి! మళ్లీ ఏ కోతి చేష్ఠలు చేస్తున్నావు! ఆయన కాముగా కూర్చోమని చెపితే.... కెమెరాలు ఎందుకు తీస్తున్నావు?" అనగానే....ఊరుకో! దేవి! నీకు నా పనులు అన్నిగూడ కోతి చేష్ఠలుగానే కనబడతాయి! నాకేమో నేను కనుగొన్న పరికరాలు పనికి వస్తాయో లేదా తెలుసుకోవాలని ఉంది! ఎటూ మన గురుదేవుడు ధ్యాన నిష్ఠలో ఉన్నారు గదా! ఇదిగో కిల్లియన్ కెమెరాతో ఆయన ఆత్మను అదే సూక్ష్మ శరీరమును ఫోటోలు తీస్తాను! అలాగే జపానుకి చెందిన మోతోయాను శాస్త్రవేత్త తయారు చేసిన కెమెరా పరికరముతో
ఆయన యోగచక్రాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఫోటోలు తీస్తాను!
అనగానే....
అక్కడే ఉన్న డాక్టర్ జోషి వెంటనే "హార్వే! నిజముగానే ఆత్మను ఈ కెమెరాతో ఫోటోలు తియ్యవచ్చా?"
అనగానే.....జోషి! ఎందుకు తియ్యగూడదు! గావాలంటే మీ ఇద్దరి ఆత్మలను ఫోటోలు తీస్తాను
అంటూ....
డాక్టర్ జోషి, శకుంతల దేవి మీద ఒకరి తర్వాత మరొకరి మీద ఈ కిల్లియన్
కెమెరాతో ఫోటోలు తియ్యగానే
వారి శరీరాలతో.....
మూడు అంగుళాలుండి.... పసుపు వర్ణములో ఉండి తెల్లని కాంతి శరీరముతో తనలాంటి పోలికలున్న శరీరము ఉన్న ఫోటోలు చూడగానే.... వీరిద్దరికి నోటమాటరాలేదు!
ఇన్నాళ్లు స్థూల శరీరాలలో సూక్ష్మ శరీరము అదే ఆత్మగా ఉంటుందని వేదశాస్త్రాలలో చదవడమే కాని ఇంతవరకు ఆత్మను పైగా తమ శరీర ఆత్మలను తామే చూస్తామని అనుకోలేదు! ఆశ్చర్యానందాలకి గురి అవుతుండగా....వీళ్ల ఆనందమును పట్టించుకోని విలియమ్ హార్వే.... వెనువెంటనే.... గురుదేవుడు ధ్యానము చేసుకొనే ఏకాంత గది వైపు వెళ్లేసరికి.... కిటికీ నుండి లోపలకి తొంగి చూస్తే....
అక్కడ....
గది మధ్యలో....
సుమారుగా 60 సంవత్సరాలు వయస్సు ఉండి.... తెల్లని గడ్డముతో....
ముడి ఉన్న తెల్లని జుట్టుతో.... జందెముతో..... మెడలో స్పటికమాలలతో.... నడుముకి నీలిరంగు వస్త్రము మాత్రమే ధరించి.... కళ్లు మూసుకొని ధ్యాననిష్ఠలో ఉన్న వ్యక్తి కనిపించాడు!
వెను వెంటనే.....విలియమ్ హార్వే తన చేతిలో ఉన్న కిల్లియన్ కెమెరాతో ఫోటోలు తియ్యడము ప్రారంభించాడు! అలాగే మోతోయాను కెమెరాతో ఫోటోలు తీశాడు! కాని కిల్లియన్ కెమెరాతో తీసిన ఫోటోలలో
ఎక్కడ గురుదేవుడి సూక్ష్మ శరీరము కనిపించక పోయేసరికి హార్వెకి ఏదో తెలియని షాక్ కి గురి అయినట్టు అయ్యింది! వెంటనే మోతోయాను
కెమెరా ఫోటోలు చూడగానే.... అందులో షట్ చక్రాలు పరిశుద్ధముగా....
కాంతి వంతముగా....తేజోమయముగా ఉన్నట్లుగా యోగ చక్రాల ఫోటోలు కన్పించాయి! యోగచక్రాలు బాగానే ఉన్నప్పుడు మరి సూక్ష్మ శరీరము ఎందుకు కనిపించడము లేదో ఒక పట్టాన అర్ధము కాలేదు! మరి
ఈయనకి సూక్ష్మ శరీరము లేకపోతే ఈయన బ్రతికి ఉన్నట్టు కాదు!
చచ్చిన వాడితో సమానము! ప్రాణాలు వదలడము లేదా మరణించడము అంటే
మోక్ష శరీరము 3D డైమెన్షన్ నుండి తప్పుకుంటేనే మనిషికి లేదా జీవికి శ్వాస ఆగిపోయి గుండె పని
చెయ్యకపోవడము మెదడు చచ్చిపోతే అది మరణము అవుతుంది!మరి ఈ లెక్కన చూస్తే ఈయనకి సూక్ష్మ శరీరము లేదు అంటే ఈయన బ్రతికున్న శవము అయ్యుండాలి అనుకుంటా అని అనుకొని బయట ఉన్న తమ మిత్రుల దగ్గరికి శరవేగముగా వెళ్లి వాళ్లతో ఈ వివరాలు చెప్పగానే....
వాళ్లు గూడ ఏదో తెలియని షాక్ కు గురయ్యారు! కెమెరా పని చెయ్యడము లేదంటే తమ ఇద్దరి సూక్ష్మశరీరాలు వచ్చేవి గావుకదా అని వీళ్ల ఆలోచన!
దానితో....అసలు ఆ గదిలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కాస్త ఆశగాను.... ఆపై ఆశయముగా మారి.....
No comments:
Post a Comment