అధ్యాయము 24

 చారుకేశ....

స్మశానములో కూర్చొని అదృశ్యమైన తన కర్కోటక గురువు గూర్చి దీర్ఘ ఆలోచనలో ఉండగా....

ఉన్నట్టుండి.....

పరమహంస పనివాడు స్మశానములో ప్రత్యక్షమయ్యేసరికి.....

గురువు స్థానములో పనివాడు రావడము ఏమిటి? అసలు వీడికి ఈ స్మశానములో ఏమి పని అనుకుంటూ.... వాడితో.....

ఏరా! నీకు స్మశానములో ఏమి పనిరా? శవాలతో మాట్లాడటానికి వచ్చావా? అంటూండగా......

ఏమిరా! నన్నే 'రా' అంటావా? నీకెంత ధైర్యమురా! నేను ఎవరో తెలుసుకోరా? అని గురువు గొంతు విన్పించేసరికి....

చారుకేశ చుట్టూ చూస్తూ.....

స్వామి! గురూజీ! మీరు ఎక్కడ ఉన్నారు? మీ గొంతు మాత్రమే వినబడుతోంది. మీ దేహము కన్పించడము లేదు. మీరు అదృశ్యము నుండి సాదృశ్యమునకు రండి. అనగానే.....


ఒరేయ్! పిచ్చివాడా! నేను నీ ఎదురుగానే దేహముతో ఉన్నాను. నువ్వే నన్ను గుర్తు పట్టలేదురా. నేను పరమహంస పని వాడిని కానురా. వాడి రూపములో ఉన్న నీ గురువుని. నేను కామరూప విద్యతో వాడి లాగా పరమహంస ఇంటికి వెళ్లి దేవి యొక్క పిండ దేహమును ఇక్కడికి రప్పించడానికి ఆమె చేతి.. కాలి గోర్లు, తల వెంట్రుకలు, పాదాల ఇసుక, రక్తము తెచ్చాను రా! అంటూ పనివాడు కాస్త క్షణాలలో కర్కోటకుడిగా మారేసరికి చారుకేశకి నోటమాటరాలేదు.

అంటే తన గురువుకి తెలియని విద్యలు లేవని.... అవసరమును బట్టి పరిస్థితులను బట్టి వాటిని ప్రయోగిస్తాడని తనకి అర్ధమయ్యేసరికి 

కర్కోటకుడు కాస్త తను తయారు చేసిన దేవి యొక్క పిండి బొమ్మకి తను తెచ్చిన వాటిని ఆయా భాగాలలో పెడుతూ....

ఒరేయ్!శిష్య! ఈ పిండ దేహమునకు ప్రాణ ప్రతిష్ట చెయ్యాలిరా. అపుడే ఇది పిండదేహముగా మారుతుంది.అపుడు ఈ దేహము యొక్క శ్వాస బంధనము చేస్తే....

అదియే చేతబడి అవుతుంది. ఈ దేహానికి ఏ భాగాలయందు మనము శ్వాస ఆపితే.... అక్కడ శవములాగా పడియున్న దేవి భౌతిక దేహము యొక్క శ్వాసలు ఆగిపోయి ఆ దేహ భాగాలు దెబ్బతిని చివరికి రక్తము కక్కుకొని చనిపోవడము జరుగుతుంది. అంటూ ప్రాణ ప్రతిష్ఠ మంత్రాలను బిగ్గరగా చదవడము ప్రారంభమైంది.

    నిర్జలమైన శిల విగ్రహాలకి

    ప్రాణ ప్రతిష్ఠ చేసి దైవాలుగా మార్చే విధానం ఉన్నట్లే.....

    నిర్జీవమైన దేహాలకి.....

    ప్రాణప్రతిష్ట చేసి పిండదేహముగా

    మార్చడం ఏమాత్రము కష్టముగాదు.


అరగంట వ్యవధిలో......


పిండి బొమ్మ కాస్త దేవి పిండదేహముగా మారింది. అందులో ఆమె జీవకళ కన్పించడము చారుకేశ గమనించి ఆశ్చర్యానందాలకి గురి అయ్యాడు. వాడి ఆనందమును చూసిన కర్కోటకుడు

వెంటనే.....

నాయనా! శిష్య! ఇక్కడ ఒక విషయము గమనించాలి. మనము స్త్రీ లేదా పురుషుడి మీద చేతబడి ప్రయోగము చేస్తున్నపుడు వారి శ్వాసలు బంధించే విధానములో తేడాలుంటాయి. స్త్రీలకి అయితే నాభిస్థానములో ఉండే 'శంఖినీ' నాడి మీద అదే పురుషులకైతే నడుము దగ్గర ఉండే 'లకుహా' నాడి మీద ప్రయోగము చెయ్యాలి.

అలాగే పిండదేహములోని వాయు ప్రసరణ అనగా ఏమి వాయువులను ఆపితే ఏయే భాగాలు వాడి భౌతిక శరీరము మీద దెబ్బతింటాయి అనే జ్ఞానము మనకి ఉండాలి. అనగా మనము ఈ రెండు పిండ దేహలలో ఉండే వాయువులను, ఉపవాయువులను మన మనోదృష్టితో చూడటము అభ్యాసము చేసుకోవాలి. గుండెలో ఉండే ప్రాణవాయువు లేత నీలిరంగులో ఉంటుంది. అదే బ్రహ్మ రంధ్రము ఉండే వాయువు అనేది లేత పసుపు లేదా బంగారపు వర్ణములో ఉంటుంది. కడుపులో ఉండే అపాన వాయువు ఎరుపు రంగులో,శ్వాస ప్రాణవాయువు ఆకుపచ్చ రంగులో,బొడ్డు దగ్గర ఉండే సమాన వాయువు తెలుపు రంగులో ఇలా పంచ వర్ణాలలో పంచ వాయువులు సుషుమ్న నాడిలోని అతి సూక్ష్మముగా కంటికి కనిపించని వజ్ర నాడిలో ఉంటాయి. ఈ వాయువుల యొక్క వాయు ప్రసారాలు ఆపేటట్లుగా మనము చెయ్యాల్సి ఉంటుంది అంటూ.... 

చేతి సంచిలోంచి 108  దాకా తుమ్మముళ్లు బయటికి తీసి..... వీటిని ఒకేసారి ఈ పిండదేహా బొమ్మకి గుచ్చితే....అక్కడ ఆమె నాలుగు క్షణాలలో చనిపోతుంది. ఇలాంటి మరణము వలన పరమహంస  పెద్దగా బాధపడడు. కాబట్టి ఈమెను మనము నాలుగు రోజుల పాటు రోజుకి 27 ముళ్లు చొప్పున ఈ నాలుగు ప్రధాన వాయువులుండే భాగాల మీద గ్రుచ్చుతుంటే ఆమె భౌతిక శరీరానికి

వాయువు అందక రక్తప్రసరణ జరగక ఆమె శరీర భాగాలు చచ్చుపడిపోతూ నరకయాతన పడే బాధను చూసి పరమహంస గూడ బలహీనపడతాడు. అపుడు అదను చూసుకొని 4 వ రోజు ఈమెను చంపి బలహీన పడిన పరమహంస పిండదేహము మనము వశము చేసుకోవచ్చును.కాబట్టి ఈమెను నాలుగు రోజులు నరకయాతనలు పెట్టక తప్పదు అంటూ.....


కడుపు భాగములోని అపాన వాయువు మీద ఈ పిండ దేహానికి 27  తుమ్మ ముళ్లు గ్రుచ్చి గుచ్ఛగానే .... అక్కడ శవములాగా పడియున్న దేవి భౌతిక శరీరమునకు అపాన వాయువు ప్రసరణ ఆగిపోయి కడుపుకి తద్వారా రక్త ప్రసరణ ఆగి పోవడముతో విపరీతమైన కడుపు నొప్పి రావడము దేవికి మొదలైంది.ఏమి తిన్న ఇమడకపోవడము, వాంతులు అవ్వడము మొదలైంది. డాక్టర్ జోషి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈమె నొప్పి తగ్గకపోగా ఇంకా అవ్వడముతో ఏమి చెయ్యాలో అర్ధముగాక తన ప్రొఫెసర్ లకి ఈ విషయాలు చెప్పడానికి ఫోన్ చేస్తున్నాడు.


      హార్వెకి ఈమె పడే బాధను చూడలేక ఈమె గదిలో ఉండలేక గది బయట మౌనః వేదన పడుతున్నాడు. పరమహంస మాత్రము ఇదంతా గూడ సాక్షిభూతముగా చూస్తూ మౌనముగా గది బయట ఉన్న వాలు కుర్చీలో కూర్చొని కళ్లు మూసుకొని ఉన్నాడు.ఆమె కడుపు నొప్పితో బిడ్డకి జన్మనిచ్చే తల్లి పడే పురుటి నొప్పుల కన్నా దేవి అంతకు రెట్టింపు స్థాయిలో బాధపడుతోంది. ఆర్తనాదాలు, అరుపులతో ఆ గది నిండిపోయింది.

ఇక్కడేమో....

స్మశానములో....

కర్కోటకుడు ఇదంతా తన మనోదృష్టితో చూస్తూ పైశాచిక ఆనందమును పొందుతూ.... తన ఉచ్ఛారణ దోషము లేకుండా తాంత్రిక మంత్రాలు చదువుతూ తన ప్రక్కనే ఉన్న చాకుతో....అక్కడే ఉన్న కోడిని చేతితో తీసుకొని..... ఈ ముగ్గు

మధ్యలో ఉన్న దేవి పిండి బొమ్మ మీద... ఈ కోడిని పెట్టి.... కర్కశముగా.... చాకుతో.... ఈ కోడి తలను కోసి....దీని రక్తముతో...... ఈ బొమ్మను తడుపుతూ.... ఈ కోడి తలను ఈ పిండి బొమ్మకి నైవేద్యముగా పెట్టి.... ఏవో మంత్రాలూ చదివి....

ఒరే శిష్య! ఈ రోజు ప్రయోగ క్రతువు పూర్తి అయ్యిందిరా! ఈ రోజు ఆమె కడుపు మీద ప్రయోగము చేశాను. రేపు మరో భాగము మీద చేద్దాం. ఇలా ఈ నాలుగు రోజుల పాటు మన ప్రయోగ బాధలు తాళలేక మరణావస్థల అరుపులు అరవలేక నానాయాగీ చేసి మతి చలించి చచ్చే అరుపులు చూసి మన చేపయైన పరమహంస ఏమి చేస్తాడో చూడాలి అంటూ.... తన సరంజామా అంతా సర్దుకొని....

ఒరేయి! ఈ నాలుగు రోజులకి మనము రేపు పిల్లి అలాగే మేక, గొర్రె, దున్నపోతు బలి ఇవ్వవలసి ఉంటుంది. వాటిని మనము తెచ్చుకొని మన ఆశ్రమములో ఉంచుకోవాలి. ఈ లోపుల దేవి పరిస్థితి ఎలా ఉందో వాకబు చేసుకొనిరా  అంటూ కర్కోటకుడు తన ఆశ్రమము వైపు వెళ్లితే చారుకేశ మాత్రము పరమహంస ఇంటి వైపు బయలుదేరాడు.


No comments:

Post a Comment