అధ్యాయము 10


చారుకేశకి విపరీతమైన దాహము వేసింది! అంతటి చిక్కటి అడవిలో జలము కోసము ఎక్కడికి వెళ్లాలో తెలియక దప్పికతో అవస్థలు పడుతున్న వీడిని చూసిన కర్కోటకుడు వెంటనే....

తన చేతి సంచిలోంచి ఒక వేరును బయటికి తీసి.......దీనిని నములుతూ చప్పరిస్తూ ఉండు! నీ దాహ దప్పికలు వెంటనే తీరిపోతాయి! ఈ వేరును మింగితే అధిక దప్పిక వేసి ప్రాణాలు పోతాయి! అదే ఈ వేరు ఇచ్చే రసమును మింగితే నీ అధిక దప్పిక తీరిపోతుంది అంటూ ఒకవేరు మొక్క ఇచ్చాడు! దానిని చారుకేశ చప్పరించగానే దాహ దప్పిక తగ్గడము మొదలవ్వడము గమనించి......

గురూజీ! మీ మూలికా వేర్ల జ్ఞానము అమోఘం! వీటి గూర్చి గ్రంధాలలో గూడ ఉన్నట్లు లేవు! అనగానే

పిచ్చివాడా! శబ్ద పాండిత్యము కన్నా అనుభవ పాండిత్యము మిన్న! ఎవరో రాసిన నాలుగు పుస్తకాలు చదివితే అది జ్ఞానము అయిపోదు! అదే నాలుగు ఊర్లు తిరిగి నలుగురితో నాలుగు మాటలు మాట్లాడితే వారి అనుభవాల ద్వారా నీకు ఈ పుస్తకాలలో లేని తెలియని ఎన్నో నిగూఢ విషయాలు బోధపడ్తాయి!అప్పుడు నీవే మరొక పుస్తకమును రాసే స్థితికి వస్తావు!

                 ప్రకృతిలో అన్ని ఉన్నాయి! సమస్యలున్నాయి! వాటికి పరిష్కారాలున్నాయి! రోగాలున్నాయి! వాటికి మందులున్నాయి! దోషాలున్నాయి! వాటికి పరిహారాలున్నాయి! ఏవి వేటికి ఉపయోగపడతాయో మనము తెలుసుకుంటే చాలు! అది గూడ ప్రకృతియే నేర్పిస్తుంది! కేవలము మన చుట్టూయున్న ప్రకృతిని, మొక్కల్ని, జంతువులను దగ్గరగా చూస్తూ వాటి ప్రవర్తన వలన మనకి ప్రకృతి జ్ఞానము కలుగుతుంది! 

ఉదాహరణకు పాములకు కళ్లు కనిపించక మసకమారిపోతుంటే అవి సోంపు గింజలు ఉన్న మొక్కలను తింటాయి! అలాగే కుక్కలకి తిన్నది అరగక పోయిన, విషపదార్థాలు తిన్న గూడఇవి వెంటనే గడ్డిని తింటాయి! నిజానికి ఇవి గడ్డి లాంటి గరికెను తింటాయి! ఈ జంతువుల ద్వారా కళ్ల సమస్యకి సోంపు గింజలు, అరుగుదలకి గరికె పచ్చడి తినడము మన మన పూర్వీకులు ప్రకృతి వైద్యము గా చేసుకున్నారు!ఇపుడు ఈ కాలము యువతకి గరికె అంటే ఏమిటో తెలియదు కాని పిజ్జా బర్గర్ అంటే బాగా తెలుస్తాయి! అందుకే ప్రకృతి దూరమై యంత్ర ప్రపంచము దగ్గర అయింది! అంటూ.....పద! మన పూజకి గావాలసిన మూలికలు అన్ని గూడ దొరికాయి! మన ఆశ్రమానికి వెళ్దాము అనగానే....

గురూజీ! మీరెందుకు మహాకాళి మాత ప్రత్యక్ష దర్శనం కోసము ఇంతగా తపన తాపత్రయము పడుతున్నారు!

శిష్య! ఈ కోరిక ఈ నాటిది గాదు! నా చిన్ననాటి నుండి నా మనస్సులో ఉంది! నా ప్రమేయము లేకుండానే నా తల్లి దండ్రి చనిపోయారు! నన్ను అనాధ చేశారు! భుక్తి కోసము ఒక స్మశాన కాపరి దగ్గర పని చేశాను! వాడికి తెలిసిన ఏవో నాలుగు తంత్ర విద్యలు నేర్పించాడు! దానితో నాకు తంత్ర శాస్త్ర ప్రయోగాలు నేర్చుకొని మనుష్యులను, దేవతలను, ఈ విశ్వసృష్టిని ఆధీనము చేసుకొని నా చెప్పు చేతలలో ఉంచుకోవాలనే కోరిక మొదలైంది! 

ఎందుకంటే నేను ఒక స్మశాన వాసియని, జనాలు నన్ను వాళ్లుండే చోటుకి రానిచ్చేవారు గాదు! పైగా నన్ను నానా మాటలు తిట్టేవారు! మరికొందరు రాళ్లతో కొట్టేవారు! పేడ పురుగును చూసినట్లుగా చూసేవారు! శవాలను తీసుకొని వచ్చేటప్పుడు బాగానే చూసేవారు! ఆ శవదహనము అయిన తర్వాత నన్ను పట్టించుకునేవారు కాదు! ప్రతిరోజు శవాలు రావు గదా!నాకు ఆకలి బాధ కలిగేది! అన్న ముద్ద కోసము  ఇంటింటికి తిరిగి భిక్ష అడిగిన ఎవరు పెట్టేవారు గాదు! దానితో నాకు ఈ జనాల మీద కోపావేశాలు కలిగేవి! అపుడు నన్ను బాధించే వారి మీద చిన్నపాటి తంత్ర ప్రయొగాలు చెయ్యడము మొదలు పెట్టాను! దానితో వాళ్లు బాధలు పడుతూంటే అంటే వాళ్లకి అతిగా విరేచనాలు లేదా వాంతులు అయ్యే విధంగా చేసేవాడిని! దానితో నాకు ఆనందమేసేది!

ఈ ఆనందము కోసము అవసరమున్నా లేకపోయిన గూడ జనాల మీద అనారోగ్య ప్రయోగాలు చేస్తూండేవాడిని! జనాలకి నా మీద అనుమానము  వచ్చి హనుమంతుడి దేవాలయము కట్టించి ఒక పూజారిని నియమించేవారు! ఆయన ప్రతి నిత్యము అందరి ఇళ్ల మీద మంత్ర అక్షింతలు, మంత్ర జలము చల్లుతూ ఉండేవాడు! దానితో నేను చేసే అనారోగ్య మంత్ర ప్రయోగాలు పని చేసేవి గావు! నాకు ఆనందము దొరక్కపోయేసరికి  పిచ్చి వాడిని అయిపోయే స్థితికి చేరుకుంటున్న సమయములో నాకు అతి భయంకరమైన తంత్ర శాస్త్ర ప్రయోగాల యందు అనగా చేతబడి, బాణమతి, కిల్లాంగి, కాష్మోరా, భేతాళ వశము, రుద్ర వశము,భైరవ వశము లాంటి యందు ఆరితేరిన తంత్ర యోగి నా దగ్గరికి వచ్చి తన మంత్రశక్తిని నాకు ధారాదత్తము చేసి నన్ను తంత్ర ప్రయోగాలకి వారసుడిగా చేసి ఆయన కన్నుమూశాడు! దానితో నేను ఆలయ పూజారికే చేతబడి ప్రయోగము చేసి చంపెయ్యడముతో జనాలకి విషయము అర్థమై మరొక మరొక పూజారిని రప్పించడము ఆయన గూడ నా చేతిలో కుక్క చావు చచ్చేసరికి.....

ఇలా గాదనుకుని వాళ్లు కాస్త గ్రామదేవత ఆలయమును పునః ప్రతిష్టించడం ఆలయానికి ఒక పూజారిని ఉంచడము  జరిగింది! ఈయన అందరిలాంటి పూజారి గాదని నేను ఎలా అయితే వామాచారపద్ధతుల యందు ఆరితేరినానో ఆయన గూడ దక్షిణాచార పద్ధతుల యందు ఆరితేరిన ఘనాపాటియని నాకు కొద్ది రోజులలో అర్థమయింది! నా తంత్ర ప్రయోగాలు స్మశానము దాటి రాకుండానే ఆయన ధ్యానముతో కట్టడి చేసేవాడు! ఆయనకి ఇది ఎలా సాధ్యమో నాకు ఒక పట్టాన అర్థముకాలేదు! ఆ తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే ఆయన నిత్య దేవత దుర్గాదేవియని.... ఆమె ప్రతినిత్యము ఆయన చుట్టూ తిరుగుతూ రక్షణ కవచముగా ఉంటుందని ఆయనకి ఎవరైనా ప్రాణహాని కల్గిస్తే అవతలి వాళ్లు కాటికి పోవడమే కాని ఈయనకి ఏమీ గాదని నాకు అర్థమైంది! 

పైగా ఆయన తంత్ర ప్రయోగాలు తిప్పికొట్టడాని కోసము కాలభైరవుడి ఆరాధన చేసేవాడని, ఎవరైతే ఈ ఆరాధన చేస్తారో అలాగే ఎవరి ఇంటి యందు కుక్కలు ఉంటాయో, లేదా కాపలాగా ఉంటాయో వారి మీద వారున్న ఇండ్ల మీద ఎలాంటి తంత్ర ప్రయోగాలు పని చెయ్యవని మనకి తంత్రశాస్త్రమే చెపుతోంది! పూర్వ కాలములో కాశీక్షేత్రము నందు అఘోర సత్ సంప్రదాయముండేది! రాను రాను వీళ్లు పది రూపాయలకే తంత్ర ప్రయోగాలు చేసే స్థితికి వచ్చారు! అపుడు ఈ క్షేత్రమునందు కాలభైరవుడు అలాగే అష్ట భైరవులను ప్రతిష్టించడము జరిగింది! దానితో తాంత్రిక అఘోరుల సాంప్రదాయము ఇపుడు అంతరించి పోయే స్థితికి  వచ్చింది!

     దానితో జనాలతో పాటుగా వారు ఆరాధించే దైవాల మీద గూడ ఈర్ష్యాద్వేషాలు మొదలైనాయి! ఇక మంత్ర దేవతలను వశము చేసుకొనే విద్యలను నేర్చుకున్నాను! ఇలా కొన్నాళ్లు సాగింది! కాని నాకు రాను రాను విసుగు, చికాకు మొదలైంది! ఎందుకంటే 1000 కోట్ల జనాలను, 36 కోట్ల మంది దైవాలను వశము చేసుకోవాలంటే ఈ విశ్వానికి విశ్వాధినేత అవ్వడమే ఏకైక మార్గమని నేను తెలుసుకున్నాను! దానితో మన బ్రహ్మరంధ్ర అధిదేవతయైన త్రిమాతలు అనగా దుర్గా, కాళీ, చంఢీలలో కాళీ మాతయే ఈ విశ్వసృష్టి పాలన చేస్తుందని నాకు తెలిసి ఈమె అనుగ్రహమును పొందితే విశ్వాధినేత అయ్యే అవకాశముంటుందని అపుడు ఈ విశ్వములోని వారు నేను చెప్పినట్లుగా వింటారని ఆమెను తంత్ర శాస్త్ర ప్రకారము ఆరాధించడము మొదలుపెట్టాను! ఇపుడికి 35 వత్సరాల నుండి ఈమెను ఆరాధన చేస్తున్నాను!

చిక్కినట్లే చిక్కి తప్పించుకొంటుంది! రేపే 36 సంవత్సరాల తిధి! ఈసారి  ఆమె వశము గాకపోతే నా ప్రాణాలే ఆమెకి ఆహారముగా ఇవ్వాలని కృత నిశ్చయముగా ఉన్నాను! ఆశ, భయం, ఆలోచన, ఆశయం, సంకల్పము, స్పందన, ఆనందం లేనివాడికి సాధన సాధ్యతే సర్వం సాధ్యం అవుతుంది! అంటూ ఆశ్రమము వైపు బయలుదేరారు

No comments:

Post a Comment