అర్ధరాత్రి....
అమావాస్య....
చంద్రుడు కనిపించని
గాఢాంధకార వేళలో....
వంటిని వణికిస్తూ చలిపులి ఒకవైపు.....
కీచురాళ్ల రోదన మరోవైపు.....
ఇదే సమయములో....
ఏమి కనిపించని దట్టమైన చీకటిలో ఉన్న దారిలో .....
ఒక చేతిలో తోలుసంచితో.....
మరొక చేతిలో తలకిందులుగా వేలాడుతున్న కోడితో...... అది బాధగా రోదించే శబ్దముతో పాటుగా....
తీతువు పక్షి ఆర్తనాదము వినబడినగూడ రాళ్లు రప్పలున్న నిండిన సన్నని బాటపై రుద్రాక్షమాలతో , కపాలమాలలతో, పసుపు,కుంకుమ, విభూధిరేఖలతో నల్లటి శరీరముతో.... ఉగ్రచూపులతో తదేకమైన తీవ్రదృష్టితో కాలిబాటపై నడుస్తున్న కర్కోటక తాంత్రిక మాంత్రిక కాలి మీద నుండి ఒక పాము జరాజరా పాక్కుంటూ అటుగా భయము భయముగా దాటుకుంటూ వెళ్ళిపోయినా గూడ ఏమాత్రము పట్టించుకోకుండా కాలిబాటపైన నడవసాగాడు!
తన నాశికరంధ్రాలకి శవాలు కాలుతున్న వాసన, శవాలజుట్టు కాలుతున్న వాసనలు, పుర్రెలు, ఎముకలు,సమాధులు లీలగా కనిపించేసరికి....శంకర వాసమైన స్మశానము వచ్చినదని గ్రహించి..
స్మశానానికి మధ్యకి చేరుకున్నాడు! చుట్టూ చూశాడు! ఎవరులేరని నిర్ధారణ చేసుకొని....
తన మొలలో ఉన్న నాలుగు మేకులు బయటికి తీసి.....తాంత్రిక దేవతలు అయిన బేతాళుడు, భైరవుడు, కాలుడు,రుద్రుడు మహామంత్రాలను చదువుతూ....దక్షిణమువైపు నడిచి అక్కడ తన చేతిలో ఉన్న ఒక మేకుని పాతుతుండగా......ఎవరో రోధిస్తున్న స్త్రీ మూర్తి ధ్వని వినిపిస్తున్న గూడ పట్టించుకోలేదు! ఎందుకంటే తాంత్రిక దేవతలు తమ సాధకుడికి పెట్టె పరీక్ష మాయలలో ఇలాంటిది ఒక్కటని ఇతనికి బాగా తెలుసు!ఈ ఆర్తనాదాలు పట్టించుకుంటే తనకి కుక్కచావు వస్తుందని గూడ తెలుసు! కాబట్టి ఏ మాత్రము ఈ స్త్రీ ఆర్తనాదము పట్టించుకోకుండా తన చేతిలో ఉన్న మూడు మేకులను తను ఒక దిక్కులో పాతిపెట్టి.... మౌనముగా.... ప్రశాంతముగా మంత్రాలను చదువుతూ....
తన చేతి సంచిలోంచి....
పసుపు, కుంకుమ, సున్నము బయటికి తీసి.....
అష్టదశ పద్మమును గీసి....అందులో సజీవ మూర్తి రూపముగా ఉన్న ఉగ్ర రూపమైన మహాకాళి జీవ ప్రతిమను ఉంచి.... ఉంచగానే...
విచిత్రముగా...
మూడు అడుగుల విగ్రహమూర్తి నోటి నుండి....రక్తము రావడము.... గమనించిన కర్కోటకుడు....
ఏమాత్రము ఆలస్యము చెయ్యకుండా తన తోలు సంచిలోంచి అక్షకంకాళము, కుంకుమ, నిమ్మకాయలు, దివ్య సాంబ్రాణి, పిల్లి, ఎలుక, పులి, గుర్రము మాలలు బయటికి తీసి వాటిని స్త్రీ ముంచేతి ఎముకలో ముంచి.... మానవుడి క్రొవ్వుతో ఉన్న దీపము వెలిగించి....ఆ ప్రక్కనే....కాలుతున్న శవము యొక్క తొడ భాగమును విరిచి.... చితిమంటలోంచి బయటికి తీసి....అమ్మవారికి ప్రసాదముగా పెట్టగానే....ఆ విగ్రహమూర్తి నాలుక నుండి రక్తము కారడము ఆగింది! లేదంటే తన ప్రాణాలు అమ్మవారికి బలి గావాల్సి ఉండేది!
ఆ తర్వాత....
సంచిలోంచి గంగాజలమును బయటికి తీసి.... నీటితో నోటిని శుభ్రముగా కడుక్కోవడము ప్రారంభించాడు! ఎందుకంటే సాధకుడి నోట్లో ఎలాంటి చిన్న ఆహార పదార్ధము గూడ ఉండకూడదు! ఒకవేళ ఉంటే దాని వలన తాంత్రిక మంత్రాల ఉచ్చారణ దోషము కల్గి ఆ మంత్ర దేవతలు సాధకుడినే బలికోరుతాయి!
ఒకసారి తన తాంత్రిక గురువుని మనస్ఫూర్తిగా తల్చుకుని మనస్సును నిశ్చలము చేసుకోవడము ప్రారంభించాడు!దానితో లయ యోగము అనగా బుద్ధిని ఆత్మలో లగ్నము చెయ్యడము ప్రారంభించి మనస్సు నిశ్చలమైనాక.... తన చుట్టు ఉన్నతాంత్రిక దేవతలు రావడము తన దృష్టికి తెలియడము మొదలైంది!అడుగుల శబ్దాలు, గజ్జెల శబ్దాలు, భయంకర ఆర్తనాదాలు, రోదనలు, ఆవేదనలతో....ఆ స్మశానము అంతా భీకర వాతావరణము క్షణాలలో మారిపోయింది!అయిన గూడ కర్కోటకుడు తన తదేక దృష్టితో.... మనస్సును నిశ్చల స్థితి నుండి ఏమాత్రము ఏమార్చలేదు! అచంచల ఏకాగ్రతతో తన గురువు చెప్పిన మహా ఉగ్రరూప భద్రకాళి బీజాక్షర మంత్రమును శ్రద్ధాభక్తితో.... అనురక్తిగా చేస్తున్నాడు!
ఆమెను ప్రత్యక్ష దర్శనము చేసుకోవాలని....... .......... ........
No comments:
Post a Comment