అధ్యాయము 17


పరమహంస...

ధ్యానము నుండి అకస్మాత్తుగా లేచి.....

గది బయటికి వచ్చి....ఏదో ఉన్మాద స్థితిలో.....కాన్వాస్ దగ్గరికి వెళ్లి.....

ఏదో పెయింటింగ్ గియ్యడము  హార్వే, జోషి గమనించారు. కాని అయనతో మాట్లాడటానికి భయపడ్డారు. 

దేవి మాత్రము తనకి జ్వరము కారణముగా లేవలేక విశ్రాంతిగా పడుకుని ఉంది.

పరమహంస అరగంట తర్వాత ఏదో బొమ్మ గీసి తిరిగి తన ధ్యాన గదిలోనికి వెళ్లిపోయారు.

వీరిద్దరికి ఏమి బొమ్మ గీశారో చూడాలని.....

కాన్వాస్ దగ్గరికి వెళ్లితే.....

ఒక మనిషి బొమ్మ గీసి..... మానవ తలకి బదులుగా పాముతల గీసి.... ఒక చేతిలో పరమహంస తల మరొక చేతిలో ఒక ఖడ్గము గీసి.....వీడి కాళ్ల క్రింద తమ ముగ్గురి తలలు చెల్లా చెదురుగా పడినట్లుగా.... ఈ వ్యక్తి వెనుక వైపు మహాకాళీ తల భాగము మాత్రమే గీసినట్లుగా ఉంది.  వీడిని చూస్తుంటే ఒక మాంత్రికుడిగా కనబడుతున్నాడు. ఈ బొమ్మ క్రింద 'కర్కోటకుడు' అని పేరు రాసి ఉంది. అంటే వీడి చేతిలో తమ అందరి ప్రాణాలు పోతాయని ఈ బొమ్మ చూపుతున్నట్లుగా వీరిద్దరికి అన్పించసాగింది.

ఇంతలో.....

పరమహంస బయటికి వచ్చి.....

శాంతముగా....ఈ పెయింటింగ్ చూస్తున్న వీరితో

"అవును! దేవి కనిపించడములేదు.

ఆమె ఏది?" అనగానే.....

గురూజీ మామూలస్థితిలో ఉన్నారని వీళ్లు తెలుసుకొని.....

హార్వే వెంటనే....

"గురూజీ! దేవి జ్వరమని పడుకుంది లేపమంటారా?"

"వద్దు! వద్దు! విశ్రాంతి తీసుకుంటే మంచిది. ఈ రోజు పాలు, బ్రెడ్ ఆహారముగా ఇవ్వండి. అన్నము వద్దులే అని చెప్పరే గాని.... .... 

ఈయన మనస్సులో అది జ్వరముగాదని దేవి బలహీన గ్రహస్థితికి సంకేతమని తెలుసు. ఇలాంటి స్థితి పోయేదాకా బలమైన గ్రహస్థితి వచ్చేదాకా ప్రతీవాడు జాగ్రత్త వహించాలి. లేదంటే ఇలాంటి సమయాలలో ప్రేతాత్మలు,ఆత్మలు,రాక్షస, భూత,పిశాచగణాలు దాడి చేసే అవకాశాలుంటాయి. ఉపాసన దైవ ఆత్మల ప్రభావము చూపే అవకాశము ఉంటుంది. వీటికి జీవుడి బలహీన జాతక గ్రహ దశస్థితి  గావాల్సి ఉంటుంది. ఈ క్షణాల కోసమే అవి చింతచెట్ల మీద, పాడుపడిన ప్రాంతాలలో, స్మశానాలలో పాడుపడిన బావులలో ఆవాసము చేస్తుంటాయి. ఎవరికైతే ఇలాంటి గ్రహస్థితి ఉంటుందో వారి శరీర ఆత్మను బయటికి పంపించి ఈ ఆత్మలు వారి శరీరములోనికి దూరి నానాయాగీ చేస్తాయి. కొన్ని అయితే ప్రాణాలు తీసేదాకా తీసుకొనేదాకా వెళ్తాయి. కొడుకు మీద మమకారము చంపుకోలేక చనిపోయిన ఒక తల్లి ఆత్మ ఇలాగే కొడుకు అనారోగ్య బలహీన గ్రహస్థితి యందు వాడి శరీరమునందు ప్రవేశించి నయము కాని రోగమును వాడికి కలిగించి వాడిని చంపి తనతో తీసుకొని వెళ్ళింది. ఇది నా స్వానుభవం అన్ని తెలిసిన నేను మౌనము వహించక తప్ప లేదు. ఎందుకంటే వాడు నా కన్నబిడ్డ! నేను లేకపోతే వాడు బ్రతకలేడని నాతో అంటూ పెళ్లాం పిల్లలున్న గూడ వాడిని తనతో తీసుకొని వెళ్ళిపోయింది. అనుకుంటూ......

సరేగాని....

"మీ ఇద్దరికి ఈ పెయింటింగ్ చూస్తోంటే ఏమని అనిపిస్తుంది? భయము వేస్తుందా?"

జోషి వెంటనే.....

"స్వామీజీ! లేదు కానీ మన ప్రాణాలకి ఇతని వలన ప్రమాదమున్నదని అర్థమవుతోంది. అలాగే మీ  ప్రాణాలకు గూడ హాని కలుగుతుందని అర్థమవుతుంది. అంటే వీడు మన ప్రాణాలు తీసే మాంత్రికుడా?"అనగానే......

'అవునని' పరమహంస అనగానే....

వీరిద్దరి గుండె ఆగినంత పని అయ్యింది. వాడి పేరు కర్కోటక.  కర్కోటక నాగ వంశీయుడు. తాంత్రిక ప్రయోగాలలో అనగా చేతబడి, బాణమతి, కిల్లాంగి, కాష్మోరా వంటి క్షుద్ర ప్రయోగాలలో ఆరితేరిన వ్యక్తి.. వాడి కున్న విశ్వాధినేత ఆకాంక్ష నెరవేర్చుకోడానికి నా తల బలిగా వాడి దైవమైన కాళీమాత కోరడముతో వాడు నేనున్న చోటుకి దగ్గరగా వస్తున్నాడు. నన్ను బలహీన పరచడానికి మీ ముగ్గుర్ని చంపాలని చూస్తున్నాడు. వాడి ప్రయోగానికి మొదట బలిపశువు అయ్యేది మన దేవినే. ఆమె అనారోగ్య బలహీన గ్రహస్థితియే వాడికి బలము చేకూర్చుతోంది. 18 రోజులు ఆమెకి మరణ గండ కాలము. వాడికి ఈమెను చంపే కాలము. మన జాగ్రత్తలో మనము ఉండాలి వాడి స్వార్ధ పూరితమైన విశ్వాధినేత ఆకాంక్షను నెరవేరకుండా మన ప్రయత్నము మనము చేసి ఆపవలసి ఉంటుంది. వాడు వామాచార ప్రయోగాలు చేస్తే..... మనము దక్షిణాచార ప్రయోగాలతో తిప్పికొట్టాలి. అందుకు మీరంతా  భయపడకుండా సహకరించాలి అనగానే.....

"స్వామి! అయితే మన దేవిని వాడి నుండి రక్షించలేమా?"

"నాయనా!ఈ క్షణము ఏమి జరుగుతుందో ప్రకృతికే తెలియదు. మనకి ఎలా తెలుస్తుంది. కాల నిర్ణయము కోసము ఎదురు చూడక తప్పదు. ఈ లోపు మన ప్రయత్న లోపము లేకుండా మన ప్రయత్నాలు మనము చెయ్యాలి" అంటుండగా.......

ఈ మాటలు లోపలి గదిలో పడుకొని ఉన్న దేవి విని.... లేని ఓపికతో బయటకు వచ్చి......

"గురూజీ! నేను గూడ ఒక జ్యోతిష్య వేత్తనే గదా. నా జాతక గ్రహస్థితి నాకు తెలుసు. ఇలాంటి స్థితి ఉన్నదని తెలిసి నిజ యోగుల సమక్షములో నా ప్రాణాలు విడవాలని నేను అనుకున్నాను. పైన ఉన్న  సర్వేశ్వరుడు అనుగ్రహించి మీలాంటి తనలాంటి సర్వేశ్వరుడినే నాకు పరమ గురువుగా ప్రసాదించి మీ పాదాల చెంతనే నా ప్రాణాలు వదిలిపెట్టాలని నిశ్చయించాడు. కాలానికి అన్ని తెలుసు. గాకపోతే అది మౌనముగా సాక్షీభూతముగా ఉంటుంది. కాని నా కోరికల్లా ఆ కర్కోటకుడి ఆకాంక్ష అదే వాడు విశ్వాధినేత గాకుండా ఉండటానికి మా ముగ్గురి ప్రాణాలు పణంగా పెడతాము. వాడు ఆ బ్రహ్మపదవి పొందకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అంతా చెయ్యండి. మా గూర్చి మా మరణాల గూర్చి మీరు ఆలోచించకండి! బాధపడకండి! దైవేచ్ఛ! పుట్టిన వాడు గిట్టక తప్పదు. గాకపోతే మా ప్రాణాలు అందరి ప్రాణాలుగా వృధాగా పోకుండా లోకకల్యాణార్థము పోతాయనే ఆనందముంది ... అంటూండేసరికి 

హార్వే, జోషి గూడ ఈ మాటలకి తమ మద్ధతుగా 'అవునని' తలలూపారు.

పరమహంసకి ఏదో తెలియని చిన్నపాటి ఆవేదన కల్గింది. మరణము ముందుగానే తెలిస్తే మానవుడు తట్టుకోలేడని బ్రహ్మదేవుడు కాస్త 80 % మాత్రమే భవిష్యత్ కష్టసుఖాలు జ్యోతిష్యము ద్వారా తెలిపి మిగిలిన 20 % మైన మరణాలు, మరణభయాల గూర్చి ఎందుకు చెప్పకుండా చేశాడని ఈయనకి అర్ధమయింది.

హార్వే వెంటనే....

విశ్వాధినేత గావాలంటే ఏమి అర్హత ఉండాలి అనగానే..... కాలము యొక్క 'ఫోర్త్ డైమెన్షన్' కి వెళ్లే యోగముండాలి అనగానే......

ఈ ముగ్గురు ఆశ్చర్యానందమునకు గురి అయినారు.

అంటే....స్వామి! ఇప్పుడు మనమంతా ఏ డైమెన్షన్ లో

ఉన్నాము?

మనము అలాగే 84 లక్షల జీవరాశులు ఈ భూమి అంతాగూడ..... కాలము యొక్క "3rd డైమెన్షన్ లో" ఉంది.

అంటే.....?

3 comments:

  1. బాగుంది sir....మీరు cheppina mother story....mirannattu ga 'ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి"లోకి తీసుకెళ్లాలని అనుకున్నరేమో ....అదే కదా 'అమ్మ" అంటే.....

    ReplyDelete
  2. వాళ్ళ అబ్బాయి ని....

    ReplyDelete
  3. And అమ్మ ప్రేమని ye dimension lonu yevaru express cheyaleremo complete ga.......kadandi

    ReplyDelete