అధ్యాయము 52

కర్కోటకుడు

స్మశానమునకు చేరుకొని ఈసారి ఎలాగైనా పరమహంస తల పొందాలని ధృడమైన సంకల్ప సిద్ధితో పెద్ద ఎత్తున్న భారీ తనముగా పంచ మాంసాలను  అనగా ఏనుగు, గుర్రము, ఆవు, మేక, మనిషి మాంసాలను తేవడము జరిగింది. ఇపుడిదాకా ఆవు, పిల్లి, ఎలుక మలాలతో సాధన చేసిన వాడు కాస్త మాంసాలతో ఆరాధన చేసి అగ్ని భేతాళుడి అనుగ్రహము పొందాలి అనే కృత నిశ్చయముతో వచ్చాడు. తాడో పేడో తేల్చుకోవాలని అనుకొని ఈ 'ఛోడ్' తంతు మొదలు పెట్టాడు.

    అష్టదిగ్బంధన ముగ్గు వేశాడు. నిమ్మకాయలు పెట్టాడు. అష్టదిక్కులలో మంత్రించిన అష్ట మేకులు దించాడు. స్మశాన దేవతలు వీడి చేసే తంతులో లోపాలు వెతికి చంపటానికి సిద్ధముగా దక్షిణ దిక్కులో కూర్చొని కాపుకాస్తున్నాయి. గ్రద్దలు, రాబందులు, తోడేళ్ళు, నక్కలు చేరాయి. తన చేతి సంచిలోంచి పిండి బొమ్మను బయటికి తీసి దానికి యధావిధిగా జంతువుల మాలలు పూసి ఒక కోడిని చంపి దాని రక్తముతో ఈ పిండిబొమ్మ రక్త తర్పణము చేసి తను తెచ్చిన పరమహంస రక్తము పుయ్యగానే...

జలసిద్ధి యోగములో ఉన్న పరమహంస భౌతిక శరీరము నుండి సూక్ష్మ శరీరము బలవంతముగా బయటికి ఎవరో లాగుతున్నట్లుగా వచ్చే దృశ్యాలు హార్వే పరికరములో చూస్తున్న ఈ ముగ్గురికి అలాగే ధ్యాన దృశ్యము చూస్తున్న కాలాముఖుడు ఇదంతా ఆ కర్కోటకుడు మంత్ర ప్రయోగమని అర్ధమైన ఏమి చెయ్యలేని స్థితిలో... పరిస్థితిలో వీళ్లంతా ఉండిపోయారు.

    అలా ఈయన సూక్ష్మ శరీరము బయటికి వచ్చి నీటి పై నుండి ఆకాశ మార్గములో స్మశానము వైపు ప్రయాణించి కర్కోటకుడు ఉండే చోటుకి వెళ్లి మంత్రించి తనని బంధించిన పిండి బొమ్మలోనికి ఈ ఆత్మ వెళ్లి ఆత్మ దిగ్బంధన అయింది. ఇదంతా గమనించిన కర్కోటకుడు అమిత ఉత్సాహము ఎక్కువై పిండిబొమ్మ ఇక పరమహంసయేనని అనుకొని పూజ తంతు మొదలు పెట్టాడు.

ఉన్నట్టుండి ... ....

వాతావరణము అంతా ఉరుములు, మెరుపులు,పిడుగులతో దద్దరిల్లిపోతోంది. ఏదో లోక వినాశనము జరగబోతుందని ఆకాశము తన ఆవేదనను భూమికి భవిష్యవాణిగా అందించాలని జడివాన మొదలు పెట్టింది. అయిన కర్కోటకుడు పూజ ఆపలేదు. ఈ సారి  పంచభూతాలే ఎదురు వచ్చిన ఆగేదిలేదని వీడు బలంగా నిశ్చయించుకున్న అక్కడ ఉన్న అందరికి అన్ని జీవరాశులకి అర్ధమై మౌనము వహించాయి.

    ఇక ఈ పిండిబొమ్మ మీద 108 తుమ్మ ముళ్లు గ్రుచ్చడము మొదలు పెడుతూండేసరికి ధ్యాన నిష్ఠలో ఉన్న పరమహంస భౌతిక శరీరము మీద గాట్లు పడి రక్తము బయటికి రావడము మొదలైంది. ఇలా రికార్డు అవుతున్న ఈ దృశ్యాలను చూడలేక ఈ ముగ్గురు బాధతో, ఆవేదనతో ఏమి చెయ్యలేకపోతున్నామనే కసితో కళ్లు మూసుకున్నారు.

అపుడు....

కర్కోటకుడు కాస్త నగ్నముగా మారి తన చేతిలో ఉన్న చాకుతో శరీరము మీద గాయాలు చేసుకుంటూ వచ్చిన రక్తముతో పిండి బొమ్మ మీద అభిషేకము చెయ్యడము ప్రారంభించాడు. ఆ తర్వాత తను బంధించి తెచ్చిన ఆవు, ఏనుగు, గుర్రము, మేక లను వరుసగా మంత్ర యుతముగా బలి ఇస్తూ వచ్చాడు. అవి ఆవేదనతో బాధతో అరుస్తూ ప్రాణాలు వదిలాయి. వీటి అరుపులతో స్మశానమంతా దద్దరిల్లిపోయింది.

అయిన వీడి  మనస్సు చలించలేదు, కరుగలేదు. ఇక మనిషి మాంసము కోసము తను తెచ్చిన గోతాము లోంచి ఆడ మనిషిని బయటికి తీసి ఆవిడకి ఉన్న తాళ్ల బంధనాలు తీసి తన చేతిలో ఉన్న చాకుతో ఆమె మీద విపరీతంగా గాయాలు చెయ్యడము ప్రారంభించాడు. దానితో ఈమె చేసే అరుపులు,ఆర్తనాదాలు ఎవరికి పట్టలేదు. ఉన్నవాడు ఊరుకోక ఆమెతో చంపిన జంతువుల రక్తమును బలవంతముగా నోటిలో పోసి త్రాగించాడు. సారాయి పట్టించాడు. దానితో ఈమె  విపరీతమైన ఉన్మాదములోనికి వెళ్లి లైంగికవాంఛ తీర్చమని వీడిని ఒత్తిడి చేసేసరికి ఇక అగ్ని భేతాళుడు  వచ్చే సమయము ఆసన్నమైందని వీడు గ్రహించి తన పురుషాంగమును బలవంతముగా కత్తితో కోసుకొనేసరికి.... ఆమె కాస్త బిత్తరపోయింది. భయపడి పోయింది. అపుడు వీడు కాస్త ఆవేశముతో ఈమె తలను నరికి అగ్ని భేతాళుడికి సమర్పించగానే...

అగ్ని భేతాళుడు ప్రత్యక్షమై....

దేవరా! పంచ మాంసాలతో నన్ను సంతృప్తి పరిచావు. ఏమి నీ ఆజ్ఞ.

భేతాళ! నాకు జల సిద్ధితో నీటిలో ఉన్న పరమహంస తల కావలి. అనగానే....

సరే! దేవరా! క్షణాలలో వాడి తలను తెస్తాను. అంటూ మాయం అయ్యాడు.

కొన్ని క్షణాల తర్వాత....

అగ్ని భేతాళుడు చేతిలో పరమహంస తల ఉంది. ఆ తలను చూసి చూడగానే ఆవేశములో వివేకమును కోల్పోయి కర్కోటకుడు విపరీతమైన ఆనందస్థితికి చేరుకొని... అంటే... అంటే... తను కొన్ని క్షణాలలో ఈ విశ్వానికి విశ్వాధినేతను కాబోతున్నాను. ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి ఉన్న తన కోరిక తీరపోతోంది. అమ్మకి ఈ తలను సమర్పించి ఆమె కోరికను తీర్చి తన కోరికను తీర్చుకోవాలి అని మహాకాళీ మాతను ప్రసన్నము చేసుకొనేందుకు మంత్రోచ్చారణ పెద్దగా మొదలు పెట్టాడు.

అమ్మవారి దర్శనము కాలేదు. భేతాళుడు అదృశ్యమయ్యాడు. పూజలో ఏదైన పొరబాటు జరిగితేనే ఇలా జరుగుతుంది అని కర్కోటకుడికి బాగా తెలుసు.

అందుకు తగ్గట్లుగా స్మశాన దేవతలు భయంకరముగా ఆనంద నృత్యము చేస్తున్నాయి. నువ్వు తప్పు చేశావని చెప్పడానికి...

ఇంతలో...

తన దగ్గరికి విపరీతముగా శవాల వాసన ఉన్నట్టుండి బాగా రావడము కర్కోటకుడు గమనించాడు.అఘెరులకి తప్ప ఇలాంటి వాసన ఉండదని గ్రహించి తల ప్రక్కకి తిప్పి చూసేసరికి

ఎదురుగా....

తల లేని అఘెరుడైన శ్రీత్రైలింగస్వామి దేహము రావడము కనిపించింది. నడయాడే కాశీ విశ్వనాధుడైన ఈయన తన దగ్గరికి తల లేకుండా ఎందుకు వస్తున్నాడు. పైగా అఘెరములో ఆరి తేరిన వ్యక్తి. పంచభూతాలు, కాలము అధీనము చేసుకున్నవాడు. అకాల మృత్యువును జయించినవాడు. విశ్వాధినేత బ్రహ్మపదవిని తుచ్ఛమని వదుకున్నాడు. అలాంటి సిద్ధ పురుషుడు తన దగ్గరికి పైగా తల లేకుండా వస్తుండడముతో ఇందులో ఏదో తెలియని మర్మ రహస్యమున్నదని అనుకొని భేతాళుడు తెచ్చిన తలను చూసి చూడగానే... అది కాస్త శ్రీ త్రైలింగ స్వామి తల లాగా మారేసరికి.....

అంటే పరమహంస తలకి బదులుగా ఆయన రూపములో ఉన్న త్రైలింగ స్వామి తలను భేతాళుడు తెచ్చాడని అర్ధమయ్యేసరికి... అప్పుడు పిండి బొమ్మలో పరమహంస ఆత్మ బదులుగా ఈయన ఆత్మదర్శనమయ్యేసరికి వీడికి అసలు విషయము బోధపడింది. మర్మము తెలిసింది. కాని అపుడికే ఆలస్యమైంది.


ఈ తల కాస్త తలలేని శరీరము దగ్గరికి వెళ్లగానే... తల ఉన్న త్రైలింగ స్వామి దగ్గరికి వచ్చి....

ఏమిరా! పవిత్రమైన కాశీ క్షేత్రమును అపవిత్రము చెయ్యాలని అనుకుంటే నేను ఎలా ఊరుకుంటాను. ఈ క్షేత్రానికి రక్షకుడిగా, భిక్షకుడిగా నేనే ఉన్నాను. ఏ తంత్రమైన, ఏ మంత్రమైన, ఏ యంత్రమైన నాకు తెలియంది గాదు. నన్ను మించిన మాయగాడు, ఆటగాడు ఎవరు లేరు. నాది దత్త స్వరూపము. విశ్వనాధుడి అవతారము.

పరమహంస తల గావాలిరా? ఇచ్చాను గదరా! తీసుకున్నావు! ఏమి చేశావు? ఎవరి తలను ఎవరికి సమర్పించాలిరా? అంతా ఒకే బ్రహ్మ పదార్ధము. నాలోను నీలోను ఉండేది. ఒక్కటే రక్త మాంసాలు. కాని బుద్ధివేరు. నువ్వు పంపించిన భేతాళుడు నా శిష్యుడైన పరమహంస దగ్గరికి రాబోతుంటే... వాడిని ఏమార్చి పరమహంసలాగా నేను మారి నా తలను వాడి చేతికి ఇచ్చి పంపించాను. నువ్వు ఏమో ఈ విషయము గ్రహించకుండా అమ్మకి నా తలను సమర్పించాలని విశ్వ ప్రయత్నాలు చేసిన ఆ విశ్వమాత కరుణించలేదు. దర్శనమివ్వలేదు! అది విషయము.

అంటూ....

ఇక నుంచి నీ ఆటలు సాగవు. నీ ప్రయత్నాలకి ఇదే నీ చివరి అంకము అంటూ...

వాడి తల మీద ఉన్న బ్రహ్మరంధ్రము ప్రాంతములో బలముగా ఈయన చెయ్యితో మోదేసరికి.... వాడికి ఉన్నత స్థితిలో ఉండి జాగృతియైన కుండలినిశక్తి కాస్త శరవేగముగా మూలాధార చక్రము క్రింద ఉన్న అజ్ఞాన గ్రంథికి చేరుకొని నిద్రావస్థకు చేరిపోయింది. దానితో ఈయన గూడ అదృశ్యమయ్యారు.

కర్కోటకుడు స్పృహ కోల్పోయాడు. ఈ మహత్తర దృశ్యాలను చూస్తున్న ఈ నలుగురు గూడ సంతోషించి తమ గురూజీ అయిన పరమహంసను రక్షించిన ఈయన గురువైన శ్రీ త్రైలింగ స్వామి వారికి వీళ్లంతా తమ మనస్సులలో కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

ఇంతలో....

కర్కోటకుడికి మెలకువ వచ్చింది. వాడికి ఏమి జరిగిందో... తను ఎవరో గూడ మర్చిపోయాడు. ఎప్పుడైతే జాగృతి అయిన కుండలినిశక్తి తిరిగి నిద్రావస్థకి చేరితే అపుడిదాకా వాడు సాధించిన విజ్ఞానము, జ్ఞానము అంతా గూడ పోతుంది. అపస్మారక స్థితిలో ఉండిపోతాడు. ఒక రకముగా చెప్పాలంటే అల్జిమర్ పేషెంట్ లాగా మారతారు అన్నమాట. దానితో కర్కోటకుడు తను నేర్చుకున్న తంత్ర విద్య అంతా  గూడ క్షణాలలో ఆవిరి అయిపొయింది. జ్ఞాపకము లేదు. తను ఒక తాంత్రిక మంత్రగాడిని అనే విషయమే వాడికి గుర్తులేదు. తను ఎవరో మర్చిపోయాడు. తను ఎవరో జ్ఞాపకము రాక గతమును మర్చిపోయేసరికి వీడికి విపరీతమైన ఆవేదన కల్గింది. దానితో మళ్లీ స్పృహ కోల్పోయి దీర్ఘకాలిక నిద్రావస్థకి చేరుకున్నాడు. బ్రతికున్న శవములాగా మారిపోయాడు.

కాని.....

కాలాముఖుడు కాస్త మిగతవారితో...

శ్రీ త్రైలింగ స్వామి వారు వీడిని చంపకుండా ఇలా ప్రాణాలతో వదిలిపెట్టడమే ఆయన చేసిన ఒక చిన్న పొరబాటు అయింది. ఎందుకంటే ఎవరి స్పర్శ వలన వీడి కుండలినీశక్తి నిద్రావస్థకి వెళ్లిందో... మళ్లీ వాళ్ల స్పర్శ కల్గితే తిరిగి జాగృతి అయ్యే అవకాశముంది. అందాకా వాడు బ్రతికున్న శవమే. కాని స్పృహ, తెలివి వస్తే ఆరితేరిన తంత్రగాడే అవుతాడు. వాడు చావలేదంటే.... ఏదో మర్మము ఉండాలి  గదా. అది ఏమిటో కాలమే సమాధానము చెప్పాలి అంటూ ముగించాడు. 


No comments:

Post a Comment