అధ్యాయము 42

    ఫ్లయింగ్ సాసర్ నీటి అడుగు భాగములోనికి చేరి తపస్సు చేస్తున్న పరమహంస దగ్గరికి చేరింది.అందులోంచి ముగ్గురు వ్యక్తులు క్రిందకి దిగారు. వాళ్ల  ముఖాలు కోడి గ్రుడ్డు ఆకారముగా కపాల తలగా ఉన్నాయి. చర్మము 0 . 1 mm మందముతో ఎముకలకి అతుక్కొని ఉంది. కళ్లు చాలా పెద్దవిగాను, ముక్కు, నోరు, చెవులు ఉండి లేనట్లుగా ఉంది. తలకాయ చాలా పెద్దగా ఉండి కాళ్లు, చేతులు చాలా చిన్నవిగా,పొట్టభాగము పెద్దదిగా, నడుము వక్షస్థలము అంతా సన్నగా, పీలవముగా ఉన్నాయి. అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నట్లుగా వీరు వచ్చిన వాహనమే చెపుతోంది. గాకపోతే వీరికి మూడు వ్రేళ్లు ఉండి... ఈ వ్రేళ్ల చివర నీలము, పసుపు, ఆకుపచ్చ కాంతులు వెదజల్లుతున్నాయి. వీరి శరీరాలు గూడ ఇదే రంగులతో మిళితమై కనిపించింది. వీరు తమ ఆలోచనలనే భాషగా మార్చుకుంటున్నారు. పెదవులు కదల్చడము లేదు, మాట్లాడటము లేదు.

           ఇలా క్రిందకి దిగిన వాళ్లు పరమహంసను  తాము ఉండే లోకానికి రమ్మని అభ్యర్థన చేశారు. బెదిరించారు, భయపెట్టారు. తమ మూడు కాంతులు ఈయన మీదకి ప్రసరింపచేసినా ఈయనకి ఉన్న అష్టదిగ్బంధనం శక్తి ముందు వీరి కాంతి శక్తి పనిచెయ్యకపోవడము వీళ్లు ఎలా వచ్చారో అలా వెను తిరిగి వెళ్లిపోయే దృశ్యాలు ఈ ముగ్గురు చూశారు.

ఛ! ఛ! ఈయన గూడ వాళ్లతో వెళ్లి ఉంటే వాళ్లు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో లోకానికి తెలిసేది గదా అని ఈ ముగ్గురు అనుకొన్నారు. మాయ అంటే ఏమిటో వీళ్లకి తెలియదు గదా. మాయ ఏమిటో తెలిసిన వాడికి మాయ మాయం అమవుతుంది గదా. అంటే ఈ ముగ్గురు సాధన చేసి ఉంటే ఏలియన్స్  దర్శనము అవ్వగానే ఈ ముగ్గురు వాళ్ల మాయలో పడి ఆయా లోకాలకి వెళ్లే  వాళ్ళు గదా. అందుకే వీళ్లు శాస్త్రవేత్తలుగా మిగిలిపోతే పరమహంస సాధన వేత్తగా మారాడు.

     కాని ఏలియన్స్ వెళ్లిన తర్వాత పరమహంస కాస్త ఇపుడివరకు తను గ్రహలోకవాసులు అలాగే దేవలోక వాసులు గూర్చి వేదాల ద్వారా, శాస్త్రాల ద్వారా, పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా జ్ఞానము పొందాడు. గాకపోతే ఇపుడు వాటిని మనోనేత్రముతో ప్రత్యక్షముగా చూస్తున్న పెద్దగా పట్టించుకోవడం కాని.... ఈ గ్రహాంతర వాసుల గూర్చి తను ఎక్కడ చదవలేదు. శాస్త్రవేత్తలు అసలు వీళ్లు ఉన్నారో లేదో ప్రయోగాలు చేస్తున్నారు. హై ఫ్రీక్వెన్సీ లో ఉన్న రేడియో తరంగాలు భూమిలాంటి ఇతర గ్రహాల వైపు పంపిస్తున్నారు. ఇంతవరకు వీరికి అవతలి నుంచి తాము ఉన్నామని సంకేతాలు రావడము లేదు. కారణాలు అర్థము కావడము లేదు. వీళ్లు ఉన్నారో లేదో తెలియని అయోమయ స్థితిలో ఉండగా.... తనకి వీళ్ల దర్శనము అవ్వడముతో...... పరమహంసలో ఏదో తెలియని ఆసక్తి మొదలైంది. ఈ లోకవాసులు ఎక్కడ, ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఉత్సుకత ఈయనలో మొదలైంది.

        దానితో తనకి వచ్చిన ఈ చక్ర మనోజప సిద్ధి ద్వారా వాళ్లు ఎక్కడ ఉంటారో తెలుసుకోవచ్చు గదా. అనగా మనస్సుతో మనో వేగముగా కావాలని అనుకున్న చోటుకి వెళ్లి అంతే వేగముగా తిరిగి రావచ్చు. అది కొన్ని క్షణాలలో జరిగిపోతుంది. ఒక రకముగా చెప్పాలంటే తను అదృశ్యమైన ఆ తర్వాత సదృశ్యము అవ్వవచ్చును గదా. అని అనుకోగానే.....

  ఈయన మనస్సు కాస్త వీళ్లు వెళ్లుతున్న ఫ్లయింగ్ సాసర్ చూపించడము మొదలుపెట్టింది. ఈయన కదలకుండ మాయం అవ్వకుండా ఉన్నచోటునే కూర్చొని.... తన మనస్సు వెళ్లే వైపుకి మనో దృష్టితో చూడటము మొదలుపెట్టారు. అనగా టెంపుల్ రన్  ఆట మొదలైంది. తన మనస్సు శరవేగముగా ముందుకి పరిగెత్తుతోంది. ఆకారవ్యక్తిగా ఇది కనిపించదు. కేవలము దీనికి కనిపించే దృశ్యాలు అన్నిగూడ శరవేగముగా కదిలి తప్పుకున్నట్లుగా పరమహంస మనో దృష్టికి వస్తోంది. అంతరిక్షము దర్శనమైంది, భూగోళము దాటిపోయింది, నక్షత్రాలు దాటిపోయాయి, సూర్య చంద్ర గ్రహాలు దాటిపోయాయి. అప్పుడు ఆకుపచ్చరంగులో బుధ గ్రహము దర్శనమైంది. తను ప్రత్యక్షముగా ఈ గ్రహమును చూస్తున్నాడని ఈయనకి అర్థమైంది. ఇపుడిదాకా తను కేవలము మనో దృష్టితో గ్రహలోకాలు, దైవలోకాలు చూస్తున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షముగా మనస్సుతో చూస్తున్నాడు.

బుధగ్రహము సమీపానికి వచ్చినట్లుగా అగుపించింది. చంద్రుడి  కంటే పెద్దదిగా కన్పించింది. గాకపోతే విపరీతమైన అధిక వేడిమి ఉన్నట్లుగా ఈయనకి అనుభూతి కల్గింది. చీకటి భాగములో  వేడిమికి బదులుగా అతి చల్లదనము ఉండుట గూడ ఈయన గ్రహించాడు. తనకి కనిపించిన ఏలియన్స్ ఫ్లయింగ్ సాసర్ సరాసరి బుధ గ్రహము వైపు వెళ్లకుండా దీనికున్న కక్ష్యలలో అది గూడ చల్లదన ప్రాంతము వైపు వెళ్లడము ఈయన గమనించాడు. అంటే వీళ్లు బుధగ్రహానికి, ఆపై శనిగ్రహానికి, ఆపై గురుగ్రహానికి మధ్య ఉన్న మండలాలలో ఆవాసాలు అంటే ఈ మూడు గ్రహాల సమీపములో వీళ్లు నివాసము చేస్తున్నారనే విషయము ఈయన దృష్టికి వచ్చింది. విచిత్రము ఏమిటంటే వీళ్లున్న ఈ మూడు ప్రాంతాలు గూడ అతి చల్లని ప్రాంతాలు. అంటే వీళ్లు అధిక వేడిమి భరించలేరని ఈయన గ్రహించాడు.

          తనకి కనిపించిన ఫ్లయింగ్ సాసర్ ఏదో ప్రాంతములో దిగుతున్నట్లుగా కనిపించేసరికి ఈయన మనస్సు దృష్టి అటువైపు వెళ్ళింది. అక్కడ అతి చల్లని వాతావరణము అదికూడ ఆకుపచ్చరంగులో ఉంది. నేల, కొండలు అన్ని గూడ ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి. వీళ్లు దిగిన చోట గాజు గోళాలలాంటి నివాసాలు అగుపించాయి. అవిగూడ ఆ ప్రాంతములో అక్కడక్కడా చెల్లాచెదురుగా ఉన్నాయి. వీళ్లు గాజు గోళాల నివాసాలకి వెళ్లి అక్కడ ఉన్న మెషిన్స్ ఏవో  వాటిని ఆపరేటింగ్ చేస్తూ ఎవరికో ఏవో సందేశాలు ఇస్తూ ఈయనకి కనిపించారు. అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారని తెలుస్తోంది. కాకపోతే వీళ్ల జనాలు అంతగాలేరు. సుమారు 1000  దాకా ఇళ్లు లాంటి గాజు గోళాలు మాత్రమే కనిపించాయి. వీళ్ల శ్వాస చల్లదనము, వీళ్ల ఆహారము కేవలము నీళ్లేనని ఈయనకి తెలిసింది. వీళ్లకి కళ్లు పెద్దవిగా ఉన్న చూపు అంతగా కనిపించదు. రేచీకటి వ్యాధితో ఉన్నట్లుగా ఉన్నారు.తమ ఇండ్ల నుండి నీళ్ల కోసము ఏవో పైపులు తెచ్చుకొని తమ చేతికున్న బల్బుల ద్వారా నీటి జాడ తెలుసుకొని ఆ పైపులు వాటిలో దించి ఆహారముగా జలమును త్రాగే దృశ్యాలు కనిపించాయి. మరో ప్రక్క భూమికి ఉన్న ప్రస్తుత టెక్నాలజీకి 100 కోట్ల టెక్నాలజీ ముందున్న  పరికరాలు ఎందుకు పనికిరాకుండా కుప్పలుతెప్పలుగా ఉన్నట్లుగా ఈయనకి  కన్పించాయి. అలాగే వీళ్లు చూడటానికి సన్నగా, పీలగా, ఎముకల గూడులాగా ఉన్నారు.మానవ ఆకారాలు.శరీరమంతా రక్తమునకు బదులుగా జలమే కనబడుతోంది. చల్లటి ప్రాంతాలలో ఆవాసాలు ఉన్నాయి. ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బిడ్డ మాత్రమే గాజు గోళాలలో ఉన్నట్లుగా కనిపించింది. అంటే ఇక్కడున్న వారందరికి గూడ ఏక సంతానమే ఉంది. కొంతమంది పొడవుగా, పొట్టిగా ఉన్నారు. వీళ్లకి మర్మాంగాలు లేవు.

ఆ భాగములో చిన్నపాటి గాడి లాగా రంధ్రముముంది. వీళ్ల సంయోగము 12 క్షణాలు. వీళ్ల గర్భము 17 గంటలు అంటే భూమ్మీద తొమ్మిది నెలల పాటు మొస్తే కడుపు భారము వీళ్ల 17 గంటల పాటు మోస్తే డెలివరీ అవుతుంది. 17 రోజులలో వాడు యవ్వన స్థితికి వస్తారు. ఇక్కడ కాలము చాలా వేగముగా ప్రయాణిస్తోందని ఈయన గ్రహించాడు. అలాగే వీళ్లకి శనిగ్రహ, గురు గ్రహ పరిసర ప్రాంతాలలో నివసించే ఇతర గ్రహాంతరవాసులతో సత్ సంబంధాలు ఉన్నట్లుగా ఈయన దృష్టికి వచ్చింది. గాకపోతే శని గ్రహాంతర వాసులు కాకి నీలిరంగులో ఉన్నట్లుగా గురుగ్రహ గ్రహాంతర వాసులు బంగారపు ఛాయతో ఉన్నట్లుగా గ్రహించారు. అందరికంటే గురుగ్రహ గ్రహాంతరవాసులు చూడటానికి అందముగా, తెలివితేటలు, జ్ఞాన సంపదములో ముందు ఉన్నారు. వీళ్లలో పురుషులెక్కువ. స్త్రీలు చాలా తక్కువ ఉన్నట్లుగా గమనించారు. వీళ్లకి మగ సంతానము చాలా ఎక్కువగా ఉంటుంది. అదే బుధ గ్రహ గ్రహాంతర వాసులు బుద్ధి బలము, వివేక బుద్ధి గలవారు. వీళ్లలో స్త్రీ లెక్కువ. పురుషులు చాలా తక్కువ. వీళ్లకి ఆడ సంతానమే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక శనిగ్రహ గ్రహాంతర వాసులు చూస్తే మోసబుద్ధి, అసూయ, ఈర్ష్య  ద్వేషాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాని న్యాయానికి, ధర్మానికి కట్టుపడతారు. వీళ్లు నపుంసకులు.బుధ, గురు గ్రహ గ్రహాంతరవాసులలో సంతాన యోగము లేని వారంతా ఈ శనిగ్రహ గ్రహాంతర వాసముగా వస్తారని తెలిసింది. ఎక్కువగా బుధ గ్రహ వాసులు కాస్త తమ కాంతి వాహనాలతో ప్రయాణిస్తూ గురుగ్రహ వాసులతో సత్ సంబంధాలు పెట్టుకొని వివాహ బంధనాలు  చేసుకుంటారని గమనించారు. వీళ్లు అందరిలో ఆహారపు అలవాట్లు, నడవడికలో, ప్రవర్తనలలో తేడాలున్నట్లుగా గమనించారు. నిజానికి ఈ ముగ్గురు గ్రహాంతరవాసులు బుధ, శని, గురు గ్రహాలలో ఉండకుండా బయట కక్ష్యలలో లేదా వీటి ఉపగ్రహ కక్ష్యలలో ఆవాసాలు చేస్తున్నారు. ఈ ముగ్గురి గ్రహవాసులుకి నీళ్ళు ప్రధాన ఆహారమే. చల్లదనము వీరి ఊపిరి. అధిక వేడిమి, అధిక కాంతిని భరించలేరు, తట్టుకోలేరు.అధిక శబ్దాలు గూడ భరించలేరు. గుండు క్రింద పడితే వచ్చే శబ్దాలను వీళ్లు భరించలేని స్థితిలో ఉన్నారు. బల్బ్  లేదా t . v లేదా సెల్ ఫోన్ కాంతి  వీళ్లకి సూర్యుడి కాంతి లాగా అగుపిస్తోంది. అంటే వీళ్లు పెంచుకున్న అత్యాధునిక టెక్నాలజీయే వీళ్లని అంతరించే స్థితికి  తీసుకొని వచ్చి ఉంటుందని, ఎందుకంటే ప్రస్తుతము  ఉన్న భూలోకవాసులు వాడే కంప్యూటర్, సెల్ ఫోన్, t . v  ల వలన షుగర్, బిపి, క్యాన్సర్ లాంటి నయముకాని రోగాలు వస్తున్నపుడు 100 కోట్ల సంవత్సరాలు ముందున్న టెక్నాలజీ ఉన్న ఈ ముగ్గురు గ్రహాంతరవాసులకి రోగాలు రాకుండా ఉంటాయా? నయంకాని భయంకర రోగాలు వచ్చే ఉండి ఉంటాయి. అందుకే వీళ్లు అంతరించే స్థితికి చేరుకున్నారు. ఇదే టెక్నాలజీ మన భూలోక వాసులు వాడితే 40 సంవత్సరాలకే ఖచ్చితంగా అంతరించిపోతారని ఆలోచన పరమహంస మనస్సుకి  రావడముతో.... టెంపుల్ రన్ ఆట ఆగిపోవడముతో........ 

తన మనస్సు కాస్త గ్రహాంతరవాసుల నుండి వెనక్కి తిరిగి తన దగ్గరికి వచ్చిందని తెలుసుకొని పరమహంస కాస్త విశ్రాంతి స్థితికి చేరుకున్నారు. ఈ దృశ్యాలు అన్ని గూడ హార్వే పరికరములో రికార్డు అవ్వడము జరిగింది. ఈయన ఏకముగా మూడు గ్రహాంతరవాసులని తమకి నిదర్శనము చూపించేసరికి హార్వే, జోషి, దేవిల   ఆనందానికి పట్టపగ్గాలు లేవు.


No comments:

Post a Comment