హిమాలయాలకి చేరుకున్న కర్కోటకుడు, చారుకేశ
అక్కడ సంచారించే షెర్బాలను అలాగే లామా సన్యాసులను 'ఛోడ్' ప్రక్రియ చేసే వ్యక్తి వివరాలు ఆరా తియ్యడము ప్రారంభించారు. కొంత మందికి తెలిసిన చెప్పలేదు. మరి కొంత మందికి తెలియదు అన్నారు.
ఇలా గాదనుకొని....
తన మనో దృష్టితో ఈయన గూర్చి చెప్పగలిగే వృద్ధ లామా ఉన్న మఠానికి తన మనోజపసిద్ధితో చేరుకొని....
ఆయనను ఈయన గూర్చి ప్రశ్నించేసరికి ఆయన కాస్త.... అనుమానముగా వీరికేసి చూస్తూ....
మీరు ఎవరు? మీది ఏ సాంప్రదాయము అనగానే....
తను తాంత్రిక యోగి అని, అఘ◌ోర సాంప్రదాయము అని చెప్పగానే....
అంటే మీరు మా 'మహా చోహాన్' ప్రత్యక్ష దర్శనము కోసము వచ్చారా? ఆయన సామాన్యముగా ఎవరికి కనిపించడు. కారణము లేనిదే కార్యము లేనిదే ఆయన దర్శన భాగ్యము మనకి కలుగదు. పైగా మీరు ఆయనను తంత్ర విధానముతో
ఆరాధించడానికి వచ్చారు. నేను నా 108 సంవత్సరాల వయస్సులో ఇంతవరకు చూడలేదు. ఒకసారి మాత్రమే ఆయన పూరించే పాంచజన్య శంఖనాదము వినడము జరిగింది. ఆ సమయములో కురిసే తుఫాను వర్షం ఆగిపోయింది. మంచు తుఫాను నిలబడిపోయింది. ప్రవహించే అలక నదిప్రవాహము దిశ మార్చుకొని ఆ శబ్దము వైపు ప్రవహించింది. పంచభూతాలైన భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, జలము శాంతించాయి. ఆకాశములో ఏక కాలము సూర్య చంద్రులు నక్షత్రాలు కన్పించాయి. ఆయన మాట్లాడే నడయాడే భగవంతుడు.మాకు ఆయన కాస్త వజ్రపాణి బోధి సత్వువని అవతారముగా పూజిస్తాము. మీరేమో ఆయనను దత్త ప్రభువుగా ఆరాధన చేస్తారు.ఆయన చూడటానికి పిచ్చివాడి మాదిరిగా, మతి భ్రమణము చెందిన వ్యక్తిగా అగుపిస్తాడని మా గురువు ఒకసారి నాతో చెప్పారు. ఆయన చేతిలో రెండు అడుగుల పొడవున్న మహా శంఖము ఒకటి ఉంటుందని చెప్పారు. అలాగే అమావాస్య కాళరాత్రి సమయములో ఈయన ఈ 'ఛోడ్' తాంత్రిక ప్రక్రియ అయిన అగ్ని భేతాళ తాండవ పూజ ఈయనే స్వయంగా చేస్తారు. దానిని చూసిన వారికి మతి భ్రమణము చెంది పిచ్చి వాళ్లు అయ్యి పిచ్చాసుపత్రిలో సంకెళ్లతో బంధించబడిన వృద్ధ లామాలను ఎందరినో నేను చూసి ఆయనను చూడటానికి భయపడ్డాను. ఆయన చేసే శంఖ నాదముతో గుండె ఆగిపోతుంది.మరి ఆయన చేసే పూజ చూస్తే మనస్సు చెదరకుండా ఉంటుందా?ఆయన అనుగ్రహము లేనిదే ఎవరు ఆయనను చూడటము కాని అయన ఎవరో తెలుసుకోవడము జరగదు. ఇంతకంటే మీకు నేను ఏమి చెప్పలేను. రాబోవు మూడు రోజులలో అమావాస్య వస్తోంది. తప్పనిసరిగా ఆయన ఈ తంతు పూజ కోసము ఇక్కడికి వస్తారు. వచ్చే ముందు విన్పించే శంఖనాదమే ఆయన రాకను మనలాంటి వారికి సంకేతమని తెలుసుకొండి. ఆయన చేసే మూడు శంఖ నాదాల లోపలే మీరు ఆయనను వాయు మనో వేగముతో పట్టుకోవాలి. తెలుసుకోవాలి. అది మీకు సాధ్యపడితే ఆయన అనుగ్రహము మీకు తప్పకుండా కలుగుతుంది. అంటూ ధ్యానము చేసుకొని ఆయన మఠములోనికి వెళ్లిపోవడముతో వీరిద్దరురాబోయే అమావాస్య రోజు దాకా ఎదురు చూడక తప్పలేదు.
అమావాస్య రోజు
రానే వచ్చింది. మిట్ట మధ్యాహ్న సమయములో ఉన్నట్టుండి పాంచజన్య శంఖ నాదము వీరికి వినిపించేసరికి.... ఆ శబ్ధము వినిపించిన దిశ వైపుకి వీరిద్దరు వాయు వేగముతో....... క్షణాలలో ఈ శంఖ నాదము చేసే వ్యక్తిని చేరుకోవడము జరిగింది.
తీరా చూస్తే....
ఒక పిచ్చివాడి మాదిరిగా ఉన్నవాడు, చింపిరి జుట్టుతో.... గంజాయి మత్తులో, చిరిగిన బట్టలతో... కుక్క మాంసము తింటూ వీళ్లకి ఒక వ్యక్తి అగుపించాడు ఇతనే దత్త ప్రభువు అవటానికి వీళ్లకి శంఖ నాదము తప్ప ఎలాంటి ఆధారము లేదు.
చారుకేశ వెంటనే.....
గురూజీ! ఈయనే ఆయన! లేదా పిచ్చివాడా?
అనగానే....
శిష్య! ఖచ్చితంగా ఈయనే ఆయన. పిచ్చివాడిగా ఉంటాడని లామా చెప్పాడు గదా. చేతిలో రెండున్నర అడుగుల మహా శంఖముంది గదా. మన దత్త ప్రభువే ఈయన అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే నా మనోనేత్రము పనిచెయ్యడం లేదు. కారణజన్ముల సమక్షములో, నిజ యోగులు, నిజ యోగగురువులు, దైవికశక్తులున్నవారు నా మధ్యకి వచ్చినపుడు నా మనోనేత్రము పని చెయ్యదు. నా మనోదృష్టికి వీళ్లు ఎవరో సమాచారము అందదు. కాబట్టి ఈయనే ఆయన అని నాకు అనిపిస్తోంది. దగ్గరకి వెళ్లి చూద్దాం అనగానే...
దగ్గరికి వెళ్లగానే.....
దుర్గంద పూరిత చెమట వాసన, శవాల వాసన, తలంటు లేని జుట్టు వాసన విపరీతముగా రావడము జరిగింది. చారుకేశ అయితే వాంతి చేసుకోక తప్పలేదు.
వీళ్లని చూసి.... ఆ వ్యక్తి....
ఏమిరా! నీ ప్రక్కనే ఉన్న తోక వాంతి చేసుకుంటే.... నీకు రావడము లేదురా. అనగానే....
స్వామి! దత్తప్రభువు! నీ దర్శన భాగ్యము కలిగించినందుకు నా దండాలు!
ఏమిరా! దండాలు పెట్టి దండలు వేయించుకోవాలని అనుకుంటున్నవా? నా సంగతి తెలుసుకొని వచ్చావు గదా. నీ సంగతి ఏమిటో చూస్తాను అంటూ.....
తింటున్న కుక్క మాంసము ఇవ్వగానే.....
అది బాగా క్రుళ్లి పోయింది. పాచి వాసన వస్తోంది. దానిని చూస్తేనే వాంతి అయ్యేలాగా ఉంది. దానిని కర్కోటకుడు అందుకొని.....
'మహా ప్రసాదము' అంటూ ఆప్యాయంగా తినడము మొదలుపెట్టాడు.
భళారా! భళా! అయితే ఇపుడు నా మాంసము తిను అంటూ మోచేతి చెయ్యి విరిచి ఇవ్వగానే......
కర్కోటకుడు
ఏమాత్రము క్షణము గూడ ఆలోచించకుండా ఆయన మోచేతిని తినడము మొదలు పెట్టాడు.
ఇది చూసిన ఆ వ్యక్తి.....
ఒరేయి! దరిద్రుడా! నీకు మానవ మాంసానికి, మాధవ మాంసానికి తేడా తెలియడము లేదురా. రెండింటిని కరువులో ఉన్నవాడిలాగా అంత ఆబగా తింటున్నావు. నీకు పోయే కాలము వచ్చిందిరా. వీడు ఏది పడితే అది తింటున్నాడు. ఒరేయ్ తిన్నది అరగక ఛస్తుంటే .... లేనివాడు తినటానికి ఏమీ లేక ఛస్తున్నాడు.
నీలాంటి వాళ్ల వలనే నాలాంటి వాళ్లు అడుక్కొంటున్నారు అనగానే.....
స్వామి! మీరు ఇలాంటి ఎన్ని పరీక్షలు పెట్టినా మీరు నన్ను ఎన్ని మాటలు అన్న గూడ పట్టించుకోను. వినిపించుకోను. ఇంకా నన్ను పరిక్షిస్తారా? మహా ప్రభు! నీ నిజరూప దర్శన భాగ్యము కల్గించు.
నిజరూపము ఏమిటిరా? ఇదియే నా సదృశ్యరూపము. నా అసలు అదృశ్య రూపము నువ్వు చూడాలంటే నేను చేసే తంతు చూసి తట్టుకోవాలి. తట్టుకుంటే తంతు తెలుస్తుంది. లేదంటే తంతు తెలుసుకోకుండా పోతావు. దానికి సిద్ధ పడితే నా వెంట రావచ్చును అనగానే....
స్వామి! మీకు నా ప్రాణాలే ఇస్తాను. తంతు గూర్చి భయపడను. అనగానే.....
ఇలా నాతో చాలా మంది ఇలాగే అన్నారు. తంతు ప్రారంభములోనే ప్రాణాలు వదిలేశారు. తంతు మధ్యలో మనస్సు వదిలేసింది. చివరిదాకా నాతో ఎవరు లేరు. నువ్వు ఏమి చేస్తావో చూద్దాం అంటూ....
పది అడుగులు వేసేసరికి
ఉన్నట్టుండి....
ఆ పరిసరాలు కాస్త చచ్చిన లామల శవాలు పీక్కొని తింటున్న రాబందులు కనిపించాయి.
ఒరేయి! ఇక్కడ శవాలకి దహనము జరుగదు. అంతా మంచు మయం గదా. అందుకే శవాలను పీక్కుతినే నీలాంటి రాబందులకి ముక్కలుగా ఆ శవాలను కోసి ఆహారముగా ఇక్కడ వేస్తారు. ఇప్పుడిదాకా నువ్వు సామాధుల మధ్య పూజలు చేశావు. ఇపుడు శవాల మధ్య నా పూజ తంతు చూడవలసి ఉంటుంది. నా తంతు చూసి నువ్వు శవము అవుతావో శివమ్ అవుతావో నీ తలరాతయే చెపుతుంది.
ఆ తర్వాత
ఈయన నగ్నముగా మారి.... అష్టదిగ్బంధన ముగ్గు వేసి.... రాబందులు తింటున్న ఒక శవము యొక్క తొడను తెచ్చి.... పూజకి ఉపక్రమించాడు. ఇంతవరకు బాగానే ఉంది.
ఉన్నట్టుండి....
పిచ్చి ఉన్మాద స్థితిని పొంది పిచ్చివాని మాదిరిగా తన శరీరమును చేతిలో ఉన్న చాకుతో కోసుకొని పెద్దగా అరుపులు రావడము మొదలైంది. ఈ అరుపులకి ఆ స్మశానము అంతా దద్ధరిల్లిపోయింది.
ఉన్నట్టుండి తన మర్మాంగమును కోసుకొనే సరికి.... ఇది చూసిన చారుకేశకి ఒక్కసారిగా మతి భ్రమణము చెంది వెర్రిచూపులు చూడటము పిచ్చి పిచ్చిగా అరవడము మొదలుపెట్టాడు. ఇది చూసిన కర్కోటకుడికి ఒక క్షణము ఏమి జరిగిందో అర్ధముకాలేదు. అయిన ఎంతగానో నిగ్రహించుకొని జరగబోయే తంతు
చూస్తున్నాడు. ఆపై జరుగుతున్న భయంకర విన్యాసాల తంతును భయపడకుండా, బాధపడకుండా ఎంతో నిగ్రహించుకొని సాక్షిభూతముగా చూడసాగాడు.
ఆఖరిగా....
తంతు పూర్తి అయినది అనటానికి నిదర్శనముగా....
ఆ పిచ్చివాడు కాస్త....
మూడు తలల ఆస్వామిగా ..... శ్రీ దత్త ప్రభువుగా నిజరూప దర్శనమిచ్చి....
నాయనా! ఇదే 'ఛోడ్' పూజ తంతు. నేను ఎలా చేశానో నువ్వు గూడ చేసి అగ్ని భేతాళ శక్తిని వశము చేసుకో. వాడికి గావాలసింది ఇచ్చి నీకు గావాల్సినది కోరుకో. వాడు
తప్పక తీరుస్తాడు. గాకపోతే పూజ సమయములో చేసే తంతులో ఎలాంటి పొరబాటు జరగకుండా చూసుకో. ముఖ్యంగా నీ మర్మాంగము కోసి వాడికి బలిదానము చెయ్యాలి. పూజలో ఉన్న స్త్రీతో రతిక్రీడ జరుపరాదు. జరిపితే.....నీ ప్రాణాలు భేతాళుడు చేతికి చిక్కుతాయి గుర్తుంచుకో. నేను తంత్రమే చెప్పాను. మంత్రలోపము లేకుండా నువ్వు చూసుకో అంటూ అదృశ్యమయినాడు.
'ధన్యోస్మి' అంటూ ఆయనకి నమస్కారము చేసి.... మతి భ్రమణము చెందిన చారుకేశాని చూసి ఒకింత బాధపడి...ఇక ఇలాంటి మతిభ్రమణ స్ధితి బ్రతికున్న శవముతో సమానమని అనుకొని ఈ బ్రతుకు నుండి వీడికి విముక్తి కల్గించాలనుకొని వీడిని చంపి వాడి శవమును అక్కడ ఆకలితో ఎదురుచూస్తున్న రాబందులకి ఆహారముగా వేసి.... వాటికి ఆకలి తీర్చి.... వీడికి ఆకలి లేకుండా చేసి.... తిరిగి క్షణాలలో కాశీ క్షేత్రానికి చేరుకున్నాడు.
No comments:
Post a Comment