కర్కోటకుడు కాశీక్షేత్రానికి చేరుకొని అక్కడ ఉన్న అఘోరాచార్యుడైన కీనారామ్ సమాధిని దర్శించుకొని ఆయనకి తన హిమాలయ అనుభవాలు చెప్పడము పూర్తి అయ్యేసరికి....
ఆ సమాధి మీద ఉన్న ఒక నల్లని పువ్వు ఎగిరి వీడి ఓడిలో పడింది. ఇది ఈయన అనుగ్రహ ప్రసాదము అనుకొని.... ఈ పువ్వును తీసుకొని.....
గంగానది అవతలి ఓడ్డుకి చేరుకొని అక్కడ చిన్న పూరిపాక వేసుకొని....
41 రోజుల 'ఛోడ్' తంత్ర యొక్క మంత్ర సిద్ధి కోసము సాధన చెయ్యడము ప్రారంభించాడు.
మధ్య మధ్యలో అనుమానము వచ్చినపుడల్లా తన మనోదృష్టితో పరమహంస ఏమి చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడని సంకల్పించుకోగానే....
వీడి దివ్యదృష్టికి గాజు పెట్టెలో వైరుల మధ్యయున్న నకిలి పరమహంస అయిన కాలాముఖాచార్యుడి శరీరము లీలగా కనిపించేది. దానిని చూసి పరమహంస తన అనుభవాలు శాస్త్రీయముగా నిరూపించే పనిలో ఉన్నాడని భ్రమపడి.... తన మంత్ర సాధన కొనసాగిస్తూ ఉండేవాడు.
ప్రతి రోజు అర్ధ రాత్రి.....
ఛోడ్ తంతు ప్రయోగము అభ్యాసము చేస్తూ.... మంత్ర సిద్ధి స్థితి గతులు తెలుసుకుంటూ రోజులు గడపసాగాడు. కాని వాడికి ఇంకా అగ్ని భేతాళుడు వశము కాలేదు. అంటే తనకి మంత్ర సిద్ధి లభించలేదని..... దానిని ఇంకా కొనసాగించాలని అనుకుంటూ ఈ సాధన సిద్ధి కోసము సాధన చేస్తూనే ఉన్నాడు.
నిజానికి పరమహంస తనకి కూతవేటు దూరములో గంగానది గర్భములో జలసిద్ధితో ఉన్నాడని కర్కోటకుడికి తెలిసి ఉండి ఉంటే కధ మరోలా ఉండేది. వాడికి ప్రస్తుతానికి అంతటి శక్తి లేనందున కాలాముఖుడినే పరమహంసగా భావించి భ్రమపడి ప్రశాంతముగా తన సాధనను కొనసాగిస్తున్నాడు .
కాని....
పరమహంస మనోదృష్టి యందు తనకి కూతవేటు దూరములో నేలమీద కర్కోటకుడు ఉండి ఏదో తంత్ర సిద్ధి సాధన చేస్తున్నట్లుగా కనిపించినగూడ ఈయన పెద్దగా స్పందించకుండా ఈ మనో దృశ్యమును సాక్షిభూతముగా చూస్తూ ఓంకారనాధ సాధన చేస్తున్నాడు. తన కుండలిని శక్తి జాగృతి కోసము.....
No comments:
Post a Comment