అధ్యాయము 63

ఆ తర్వాత ఈయన మనోదృష్టి యందు పరమశూన్యము దర్శనమైంది.అంటే గాడాంధకార చీకటి ప్రాంతములాగా పరమశూన్యము అగుపించినది.చుట్టూ దట్టమైన చీకటి. ఏమిలేదు.సర్వము శూన్యములాగా అగుపించినది.ఈ శూన్యము మధ్యలో ఉన్నట్టుండి స్వయంభూ తెల్లని పానవట్టముండి తెల్లని శివలింగము దర్శనమైంది.దీనిని చూడగానే ఇదికాస్త పురుష శివలింగమని పరమహంసకి అర్ధమయ్యేలోపుల బ్రహ్మరంధ్రము నుండి నీలి రంగు కాంతి ఈ శివలింగముమీద పడటము దానితో ఈ తెల్లని శివలింగము కాస్త గాలిలోనికి లేస్తూ దాని పరిమాణము తగ్గించుకొంటూ  కాంతి వెంబడి బ్రహ్మరంధ్రం వైపు ప్రయాణిస్తూ ఈ రంధ్రము నుండి బయటికి విశ్వ శూన్యములోనికి వెళ్ళి అదృశ్యమైంది.

అసలు ఈ పురుష శివలింగము దేనికి సంకేతమో ఇది ఎలా ఎందుకు ఏర్పడినదో ఎందుకు బ్రహ్మరంధ్రము నుండి బయటకి వెళ్ళినదో పరమహంసకి ఒకపట్టాన అర్ధముకాలేదు.ఇంతలో ఉన్నట్టుండి నీలిరంగు శరీరముతో కండలు తిరిగిన శరీరముతో జటాజూటమున్న ఒక ఆజానుబాహుడు కనిపించాడు.మెదలో రుద్రాక్ష మాలలు,చేతికి రుద్రాక్ష మాలలు ఉన్నాయి.పైగా అటవిక జాతి మనిషిలాగా కనిపించాడు.అపుడిదాకా ప్రశాంతముగా కనిపించిన ఈయన కాస్త ఉన్నట్టుండి ఉన్మాద అవధూత స్థితికి వెళ్ళి విలయతాండవము చేస్తూ కనిపించాడు.ఒక్కసారిగా గుండ్రని పానవట్టమున్న నల్లని శివలింగమును పట్టుకొని దానిని నోటిలో వేసుకొని మ్రింగేసరికి ఈ లింగము కాస్త కడుపులోకి చేరి అదికాస్త తెల్లని స్ఫటికలింగముగా మారే దృశ్యము పరమహంసకి చాలా స్ఫష్టముగా కనిపించసాగింది.ఆ తర్వాత ఈ దేహము అదృశ్యమై తెల్లని శివలింగములాగా మారిపోయాడు.అంటే..అంటే..ఈయన పురుష ప్రకృతికి సంకేతమయ్యే ఉంటాడని ఈ ప్రకృతి వినాశనము చెంది తెల్లని పురుష శివలింగమైనదని ఇపుడు ఈ శివలింగము కాస్త తన బ్రహ్మరంధ్రము నుండి బయటికి వెళ్ళి విశ్వశూన్యములో శూన్యమవ్వడము బట్టి చూస్తే ఈ పురుష ప్రకృతి సంపూర్తిగా విశ్వశూన్యమైనదని పరమహంసకి అర్ధమయ్యేసరికి ఈయన కాస్త పెద్దగా అరుస్తూ పిచ్చివాడిలాగా ఉన్మాదస్థితిలోకి బాలోన్మత్త పిశాచ అవధూత స్థితి పొందాడు.సరిగ్గా 48ని||తర్వాత కాని మామూలు స్థితికి రాలేకపోయాడు.

ఆ తర్వాత ఉన్నట్టుండి ఈసారి నలుచతురస్రాకారముగా నల్లని పానవట్టముండి తెల్లని లింగమున్న శివలింగము దర్శనమైనది.అకస్మాత్తుగా ఈ తెల్లని లింగము మీద ఎర్రటి రక్తాభిషేకము జరిగేసరికి ఈ లింగము కాస్త ఎరుపు లింగమైనది.నల్లటి చతురస్రాకార పానవట్టము మరియు ఎర్రని లింగము కాస్త స్త్రీ శివలింగమని పరమహంసకి అర్ధమయ్యేలోపుల తన బ్రహ్మరంధ్రమునుండి నీలిరంగు కాంతి ఈ లింగము మీద పడటముతో ఈ శివలింగము గూడ తన పరిమాణము తగ్గించుకొంటూ బ్రహ్మరంధ్రము నుండి బయటికి వెళ్ళి విశ్వశూన్యములో శూన్యమైనది.అంటే ఈ స్త్రీ శివలింగము కాస్త స్త్రీ ప్రకృతికి సంకేతమనిచివరికి ఈ ప్రకృతిగూడ శూన్యమైందని అర్ధమయ్యేలోపుల ఉన్నట్టుండి గోముఖతీర్ధము దర్శనమైనది.ఈ తీర్ధములో 28 సం|| వయస్సు ఉండి జీవ సమాధిస్థితిలో యోగనిద్రావస్థలో ఉన్న బంగారపు శరీరచాయలో నగ్నముగా ఉన్న ఒక స్త్రీ దేహము పరమహంసకి కనిపించింది. నగ్న దేహమూర్తిని చూసిన గూడ పరమహంస మనస్సు చలించలేదు.కామవికారాలు కలుగలేదు.ఎందుకంటే ఈమె లజ్జాగౌరి అని ఈయనకి తెలుసు.ఈవిడే దేవతలలో నగ్నదేహముగా ఉండేది.తల ఉండదు.తల భాగము దగ్గర సహస్ర దళ కమలము ఉంటుంది.

కొన్ని క్షణాల తర్వాత ఈమె యోని దగ్గర నుండి ఒక నల్లని త్రేలు బయటికి వచ్చి పాకుకుంటూ ఈమె ఎడమచెయ్యి యొక్క చూపుడు వ్రేలు మీద కాటు వ్రేయగా నీలిరంగు విషము ఈమే దేహము అంతా వ్యాపిస్తూండగా ఈమె కాస్త సమాధి స్థితి నుండి జాగృతి అయ్యి యోగనిద్ర నుండి కళ్ళు తెరిచి లేచి చుట్టూ చూసుకోవడము పరమహంసకి కనిపించసాగింది.ఆ తర్వాత ఈమె కాస్త తిరిగి ధ్యాన తపస్సు చెయ్యడము ప్రారంభించినది.ఉన్నట్టుండి ఈమె నగ్న దేహముకాస్త బంగారపు వర్ణము అంచుతో ఎర్రని పట్టుచీరతో నుదుటిమీద రూపాయంత పరిమాణము ఉన్న ఎర్రటి గుండ్రని బొట్టు మెడలో బంగారు ఆభరణాలతో నడుముకి ఒక బంగారు వడ్డాణముతో కుడీచేతిలో త్రిశూలముతో ఎడమ చేతిని తన నడుము మీద వేసుకొని నిలుచున్న స్థితిలో ఉన్న ఒక ముత్తయిదువులాగా నిలబడి కనిపించినది.ఉన్నట్టుండి..అపుడిదాకా ఆనందస్థితిలో ఉన్న ఈమె కాస్త త్రిశూలముతో విలయతాండవము వేస్తూ కనిపించసాగింది.ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత ఈమె వెనకనుండి ఒక రూపములేని నల్లటి ఆకారము తన హస్తాలతో ఈ ముత్తయిదువును బంధించడానికి ప్రయత్నాలు చేస్తూండగా ఈమె కాస్త తన దగ్గర ఉన్న త్రిశూలముతో పొడుస్తున్నగూడ ఈ ఆకారము మాత్రము ప్రతిఘటిస్తూ ఈ ముత్తయిదువును తన హస్తాలతో బంధిస్తుండగా ఈమెను తన నల్లటి ఆకారములో శాశ్వతముగా బంధించివేసిన దృశ్యము ఈయనికి లీలగా కనిపించసాగింది.ఆ తర్వాత కొద్దిసేపటికి ఈ వీరిద్దరి పోరాటము శాశ్వతముగా ఆగిపోవటముతో నల్లటి ఆకారము కాస్త జయం పొందటముతో ఉన్నట్టుండి నల్లటి చతురస్రాకారముగా తెల్లని శివలింగమున్న స్త్రీ శివలింగముగా  క్షణాలలో మారిపోయింది.అంటే ఈ ముత్తయిదువు అయిన స్త్రీ అనేది స్త్రీ ప్రకృతి అని ఈమె కాస్త శాశ్వత మరణము పొందటముతో స్త్రీ శివలింగము ఏర్పడినదని ఇపుడు ఈ శివలింగము కాస్త తిరిగి తన బ్రహ్మరంధ్రము నుండి బయటికి వెళ్ళి విశ్వశూన్యములో శూన్యమైనదని అంటే ఈ లెక్కన చూస్తే స్త్రీ ప్రకృతి గూడ విశ్వశూన్యమైనదని ఙ్ఞాన స్ఫురణ కలిగేసరికి పరమహంస తల్లికోసము ఏడ్చే చిన్నపిల్లాడిలా ఏడ్వటము ఆరంభించాడు.ఇలా 48ని|| తర్వాత మామూలుస్థితికి వచ్చాడు.

నిజానికి ఈ విశ్వములో ఇద్దరు మాత్రమే ఆనందపడుతూ ఉంటారు.అందులో ఒకరు పసి వాళ్ళు రెండవవారు పిచ్చివాళ్ళు అన్నమాట.మోక్షగమ్యాన్ని చేరుకోవాలంటే సాధకుడికి పిచ్చితనము పడుతుంది.దీనినే బాలోన్మత్త పిశాచ అవధూత  స్థితి అవుతుంది.చేరుకున్న ఈ గమ్యమును ఆనందించాలంటే వీళ్ళు కాస్త పసిపాప మనస్తత్వమున్న చిన్నపిల్లలైపోతారని చెప్పిన సత్యము సత్యమే అని పరమహంసకి ఙ్ఞానోదయమైనది.ఎలా అంటే పురుష ప్రకృతి శూన్యమయ్యేసరికి ఈయన కాస్త పిచ్చితనము ఉన్న అవధూత స్థితిని పొందటము జరిగినది.ఆ తర్వాత స్త్రీ ప్రకృతి గూడ శూన్యమయ్యేసరికి తల్లిని కోల్పోయిన పసిపిల్లాడిలాగా  వల వల ఏడ్వటము జరిగినది గదా.

ఇది  ఇలా ఉంటే ఉన్నట్టుండి..

పరమహంసకి ఒక ధర్మ సందేహము వచ్చింది.అసలు ఈ రెండు రకాల ప్రకృతులు దేని వలన ఏర్పడ్డాయి అనుకోగానే ఈయన మనోదృష్టియందు పరమశూన్యము దర్శనమైనది.ఈ శూన్య మధ్య భాగములోంచి తెల్లని కాంతితో ఉన్న నిలువుగా ఉన్న త్రినేత్రము దర్శనమైనది.దీని నుండి ఒక కన్నీటి చుక్క బయటికి రావడము జరిగినది.ఈ నీటిచుక్క కాస్త పసుపురంగు నిరాకార రుద్రాక్ష అనగా పసుపు నిరాకార రుధ్రాక్ష అంటే ఎలాంటి గీతలు అదే ముఖాలు లేని రుధ్రాక్ష దర్శనమైంది.దీని నుండి అడ్డముగా ఉన్న ఒక కన్ను ఆకారము ఉన్న రుద్రాక్ష ఏకముఖముతో శివలింగము దానిమీద పాము పడగతో ఉన్న రుద్రాక్ష దర్శనమైనది.ఈ రుధ్రాక్ష ఒక క్షణము పాటు పురుష స్త్రీ కలిసిన మూడో ప్రకృతిలాగా పరమహంసకి కనపడినది. ఆ తర్వాత దీని నుండి ఒక కన్నీటిచుక్క బయటికి రాగానే ఈ బిందువు కాస్త తెల్లని ఏకముఖ రుధ్రాక్షగా మారింది.దీనియందు పురుష ప్రకృతి ఉన్నట్లుగా  దర్శనమైంది.ఆ తర్వాత దీని నుండి ఎరుపు రంగు ఉన్న ద్విముఖ రుద్రాక్ష- స్త్రీ ప్రకృతి ఇలా ఆ తర్వాత వరుసగా 3 నుండి 64 ముఖాలు రుద్రాక్షలు నలుపు రంగులో ఏర్పడ్డాయి.ఇవే కాలక్రమముగా 64 విశ్వాలుగా 64 కాల డైమన్ష్స్ గా యత్ భావము తత్ భావముగా కనబడుతున్నాయని పరమహంసకి అర్ధమైనది.అసలు రుద్రాక్షలు అనేవి ఆదియోగి రుద్రుని కన్నీళ్ళ వలన ఏర్పడాయని అందుకే రుద్ర+అక్ష =రుద్ర కన్నీళ్ళు=రుద్రాక్ష అయినది గదా.మరి తనకి నిరాకార రుద్రాక్ష నుండి అన్ని రకాల ముఖాల రుద్రాక్షలు ఏర్పడినట్లుగా ఎలా అగుపించినది అనుకొని విచారణ చేసుకుంటే రుద్రుడు గూడ తీవ్ర ధ్యాన తపస్సులో ఉండగా..తన కపాలములోని పురుష  శివలింగమైన పురుష ప్రకృతి అలాగే స్త్రీ శివలింగమైన స్త్రీ ప్రకృతి గూడ విశ్వ శూన్యమైన అనుభవ అనుభూతి కలిగేసరికి ఈ మహా రుద్రుడి కంటి వెంట కన్నీళ్ళు వచ్చి ఉండాలి.ఈ కన్నీళ్ళే కాస్త రుద్రక్షలై ఉండాలి.అవే ఏకముఖి నుండి 21 ముఖాలు రుద్రాక్షలు ఏర్పడి ఉండాలి.అంటే ఈ లెక్కన చూస్తే సహజసిద్ధముగా పరమశూన్యము నుండి పసుపు రంగు నిరాకార రుద్రాక్ష అలాగే తెల్లగా ఉండి శివలింగమున్న రుద్రాక్ష స్వయంభూగా ఏర్పడి ఉండి ఉంటాయి.ఆ తర్వాత రుద్రుడి కన్నీటి బిందువులనుండి ఏకముఖి నుండి 21 ముఖాలు దాకా ఉన్న నల్లటి రుద్రాక్షలు ఏర్పడ్డాయి.ఇలా ఈ 21 ముఖాల రుద్రాక్షలున్న మాలను ఇంద్రమాల అంటారు.ఇది ధరించినవారు ఇంద్రియత్వమును పొంది జితేంద్రియుడు అవుతాడని తద్వారా వీరికి అసాద్యమనేది ఉండదని సకల కోరికలు తీరుతాయని రుద్రాక్ష శాస్త్రము చెప్పిన విషయము పరమహంసకి ఙ్ఞాపకము వచ్చింది.అలాగే ఈ రుద్రుడి భౌతిక నేత్రాలైన సూర్యుడైన కుడి కంటి నుండి 12 ఎర్రని రకాల రుద్రాక్షలు అదే ఎడమ కన్ను అయిన చంద్రుడి నుండి  16 తెల్ల రకాల రుద్రాక్షలు అదే అగ్ని నేత్రమైన త్రినేత్రము నుండి నల్లగా ఉన్న 10 రకాల రుద్రాక్షలు రావడము జరిగినదని పరమహంసకి ఙ్ఞాన స్ఫురణ అయింది.ఇంతవరకు బాగానే ఉంది.

ఆ తర్వాత ఉన్నట్టుండి .... ..... .....

పరమశూన్యము దర్శనమై దీని మధ్యభాగములో పురుషుడి అరచెయ్యి దర్శనమై దాని మధ్యభాగములో జేగురురంగులో ఉన్న మణి దర్శనమైనది.ఇది అదృశ్యమైన తర్వాత మళ్ళీ అరచెయ్యి మీద ఈసారి లేత పాలపిట్ట రంగు మణి దర్శనమైంది.కొన్ని క్షణాల తర్వాత ఈ మణి అదృశ్యమైతే తిరిగి అరచెయ్యి మీద బంగారపు వర్ణములో ఉన్న మణి దర్శనమైంది.ఇది గూడ అదృశ్యమైన కొన్ని క్షణాల తర్వాత అరచెయ్యి మీద ఈసారి కారు నలుపు రంగులో ఉన్న మణి దర్శనమై అదృశ్యమైన తర్వాత అరచెయ్యి మీద ఈసారి నీలిరంగులో ఉన్న మణి దర్శనమై ఇది గూడ అదృశ్యమైన తర్వాత అరచెయ్యి మీద ఈసారి లేత ఎరుపు రంగులో మణి దర్శనమైంది.ఇలా మొత్తము 6 రకాల మణుల దర్శనమైనట్లుగా పరమహంసకి అర్ధమైంది.కనిపించిన మణుల యొక్క రంగును బట్టి మొదటి మణి చింతామణి,ఆ తర్వాతది కౌస్తుభమణి, రుద్రమణి,ఇంద్రమణి, నాగమణి, శమంతకమణి అని పరమహంసకి అవగాహన అయింది.అంటే ఈ మణుల మూల కారకులు వరుసగా ఏనుగు దంత గణపతి, శంఖు విష్ణువు, ఆది రుద్రుడు, మత్స్యావతారము,నాగ సర్పము,చిన్ముద్ర ఉన్న మేధాదక్షిణామూర్తియని పరమహంసకి ఙ్ఞాన స్ఫురణ అవుతూండగా ఈసారి ఒకేసారిగా ఈ ఆరుమణులు దర్శనమిచ్చి షట్ కోణాకారముగా ఏర్పడి ఒక మణి కాంతిని మరొక మణి మీద పడేటట్లుగా చిన్ముద్ర అరచెయ్యిలో అమరిన ఈ దృశ్యము చూస్తున్న .... .... .....


హార్వే వెంటనే మిగతా వాళ్ళతో ....

ఈ ఆరు మణులను చూస్తుంటే నాకు అయితే ఎవేంజర్స్  ఎండ్ గేము (avengers endgame) మూవీ చూస్తున్నట్లుగా ఉంది.విచిత్రమేమిటంటే అందులో గూడ  ఆరు మణులు ఉన్న చెయ్యినే వెతకడము జరుగుతుంది.ఆ ఆరు మణులు ఏమిటంటే స్పేస్ స్టోన్,మైండ్ స్టోన్,పవర్ స్టోన్,రియాలిటి స్టోన్,టైం స్టోన్,సన్ స్టోన్ అని చెప్పటము జరిగింది.అంటే ఈ సినిమా దర్శకులకి ఈ విశ్వములో ఈ అనంత మణులు ఉన్నాయని అవగాహన ఉండి ఉండాలి అనగానే..

దేవి వెంటనే..ఒకవేళ ఈ సినిమాలోని మణులు అలాగే పరమహంసగారు చూసిన మణులు ఒక్కటేనా లేదా వేర్వేరా?  అనగానే 

హార్వే వెంటనే.... ....

ఒక్కటే అవ్వడానికి అవకాశము ఉంది.ఎందుకంటే ఈ మణుల యొక్క రంగులు సరిపోతున్నాయి.కాని పేర్లు మాత్రమే వేరు అని నాకు అనిపిస్తోంది.నాకు తెలిసినంతవరకు టైం స్టోన్ అనేది శమంతక మణి అయి ఉండాలి.ఎందుకంటే శ్రీకృష్ణుడు కాలపురుషుడు కదా.ఇది ఈయన దగ్గరే గదా ఉంది.అలాగే సన్ స్టోన్ అంటే ఆత్మలను వశపరచుకోవడము వాటిని కంట్రోల్ చేయడము లాంటి పనులు చేయడము బట్టి చూస్తే రుద్రుడే ఇలాంటివి చేస్తాడు.కాబట్టి ఈ రుద్రమణియే ఇది అవుతుందని నాకు అనిపిస్తోంది.ఇలా వరసగా చూస్తే స్పేస్ స్టోన్ అంటే నాగమణి అలాగే రియాలిటి స్టోన్ అంటే చింతామణి మరియు కౌస్తుభమణి అంటే పవర్ స్టోణ్ అని మైండ్ స్టోన్ అంటే ఇంద్రమణి అవుతుందని ఈ ముగ్గురికి అర్ధమైంది.  

హర్వే వెంటనే..ఇది అంతా బాగానే ఉంది.నిజానికి ఈ ఆరు మణులు ఈ భూమీద ఉండటము నిజమేనా?వీటిని ఎవరైన ప్రత్యక్షముగా చూశారా ? అనగానే ఇంతకు ముందు దేవి చూపించిన అరిజోనా ఎడారి చింతామణి శిలను చూస్తూ

అపుడు హర్వే కాస్త దేవితో...అవును..నీకు ఈ మణి గూర్చి ఎలా తెలిసింది అనగానే..

దేవి వెంటనే..ఇదింతా మన గురూజీ వలన తెలిసింది.ఎలా అంటవా? ఈ రిపోర్డ్స్ చూడు...మన పరమహంస అసలు ఎవరో తెలుసా?ప్రపంచ దేశాలలో టాప్ 5 లో ఒకరైనా ప్రఖ్యాత జియాజిస్ట్.ఈయన కాస్త బుద్దుడి చెప్పిన చింతామణి మీద అలాగే శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న శమంతకమణి మీద పరిశోధన చేసి అవి ఈ భూమీద ఎక్కడ ఉన్నాయో ఖచ్చితమైన ఆధారాలతో ఈ ప్రపంచానికి అందించి ఈయన గుప్తయోగిగా మారారు.అవే ఈ రిపోర్ట్స్...అంటూ హర్వే చేతికివ్వగానే...ఇతను 

శమంతకమణి మీద పరిశోధన అనే రిపోర్ట్ చడవడము ఆరంభించాడు.అందులో

సత్య, కృష్ణ.....

భార్య భర్తలు....పైగా పురావస్తు శాఖకు

చెందిన ఉన్నత అధికారులు!

 అనుకోకుండా వీరి దృష్టి వినాయక చవితి కధలో వచ్చే శమంతకమణి మీద పడింది! అసలు ఈ మణి ఉండటము నిజమేనా? ఒకవేళ ఉంటే అది ఇప్పుడికి ఉందా? ఉంటె ఎక్కడ ఉంది? ఇది నిజముగానే ప్రతిరోజు ఎనిమిది మాడుగుల బంగారము అంటే సుమారుగా 77 kg  బంగారము ఇస్తుందా? అనే ధర్మసందేహలు వీరిద్దరికి వచ్చాయి! దానితో ఈ మణికి  సంబంధించిన భారతీయ పురాణ ఇతిహాస గ్రంధాలు చదవటము ఆరంభించారు! ఈ మణి మీద పరిశోధనలు చెయ్యడము ప్రారంభించారు!

               యుగాల ఆరంభములో అంటే దేవతలు, అలాగే రాక్షసులు కలిసి పాల సముద్రమును చిలికినపుడు లక్ష్మీదేవితో పాటుగా కౌస్తుభమణి వచ్చిందని. దీనిని విష్ణుమూర్తి తీసుకున్నాడని తెలిసినది! ఆ తర్వాత వచ్చిన చంద్రుడితో పాటుగా శమంతకమణి వస్తే.....దీనిని మహాశివుడు తీసుకున్నాడని......ఆయన కాస్త చంద్రుడిని తల సిగలో అర్ధ చంద్రుడిగా పెట్టుకున్నాడని.......ఈ శమంతకమణిని మాత్రము ధరిస్తూ సోమనాథ్ శివలింగమూర్తిగా మారినాడని....శాపం వలన వచ్చిన కుష్టు వ్యాధిని శివుడు నివారణ చెయ్యడము వలన దీనికి కృతజ్ఞతగా చంద్రుడు తన దగ్గర ఉన్న మణిని శివుడికి ఇచ్చి...... ఒక శివలింగమూర్తిగా తన చేతుల మీద పూజించాడని అందుకే గుజరాత్ లోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రధమ శివలింగముగా సోమనాథ్ శివలింగము ఉన్నదని వీరిద్దరు తెల్సుకోవడము జరిగినది! అంటే ఈ లెక్కన చూస్తే యుగాలలో ప్రధమ యుగమైన కృతయుగము నందు ఈ శమంతకమణి కాస్త సోమనాథ్ శివాలయములో మహాశివుడి ఆధీనములో ఉండేదని వీరిద్దరు ఊహించారు!

               ఆ తర్వాత వచ్చిన త్రేతాయుగములో....ఈ సోమనాధ్ శివాలయము కాస్త బంగారపు స్తంభాల నుండి వెండి స్తంభాలుగా రావణ బ్రహ్మ చేసి.....శివానుగ్రహము పొంది....ఈ శమంతక మణిని వరంగా పొంది తనతో లంక ప్రాంతమునకు ఈ మణిని తరలించినాడని మరొక కధనము ద్వారా వీరిద్దరు తెలుసుకున్నారు! ఎందుకంటే సుందరకాండలో ఈ మణికి సంబంధించిన ప్రస్తావన ఉండటము గమనించారు ! అది ఏమిటంటే రావణ సంహారము జరుగుతున్న సమయములో శ్రీరాముడు కాస్త రావణ బ్రహ్మ మెడలో ఒక దివ్యమణి మెరవడము గమనించాడు! ఆయన మరణానంతరము ఈ మణిని హనుమంతుడికి శ్రీరాముడు ఇస్తూ దీని  శక్తిని భరించే ప్రాంతములో ఈ మణిని దాచమని...ఈ మణి ప్రభావము వలన రాబోవు కాలములో ఎన్నో అనర్ధాలు,ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని......అందువలన ఇది ఎవరి కంటపడకుండా  గుప్తముగా దాచమని చెప్పడముతో హనుమంతుడు కాస్త ఈ మణిని రావణబ్రహ్మ ఉపయోగించిన దివ్య నౌక యొక్క ముందు భాగములో....అడుగున ఈ మణిని అమర్చి.... ఈ నౌకను సముద్ర గర్భము అట్ట అడుగున దాచి ఉంచినాడు! ఆనాటి నుండి ఈ మణిని నౌకామణి అనడము జరిగినదని వీరిద్దరు తమ పరిశోధన ద్వారా తెలుసుకున్నారు! అప్పుడు వీరిద్దరికి ఒక చిన్న సందేహము వచ్చినది! అది ఏమిటంటే ఈ నౌక మణియే శమంతకమణి అని ఎలా అనగలము అనుకుంటే దీనికి సమాధానము వాల్మీకి రామాయణము ఇచ్చినది! అందులో రావణబ్రహ్మ సంహారము జరగటానికి ముందు....రావణ బ్రహ్మ భార్యయైన మండోదరికి మహాశివుడు దర్శన మిచ్చి "అమ్మా! రావణ బ్రహ్మ తన భక్తితో నా మెప్పుపొంది నా దగ్గర ఉన్న ఈ మణిని వరముగా పొందినాడు! రాబోవు కాలములో రావణ సంహారము జరుగుతోంది! అపుడు ఈ మణి వలనఎవరికి ఉపయోగముండదు! పైగా దీని వలన పెను ప్రమాదాలు జరుగుతాయి! కాబట్టి ఈ మణిని తిరిగి ఇవ్వమని అడిగినాడని......" దానికి ఈమె ఇవ్వనని...... శివుడి ఆజ్ఞను ధిక్కరించినదని అనే కథనముండటము వీరిద్దరికి ఆశ్చర్యమన్పించినది. అంటే శివుడు దగ్గర ఉన్న శమంతకమణియే ఈ నౌకమణి అని తెలుస్తోంది గదాయని వీరిద్దరు సమాధానపడినారు! అంటే కృతయుగములో ఈ మణి కాస్త సోమనాధ్ శివలింగములో ఉంటే ఆ తర్వాత వచ్చిన త్రేతాయుగములో ఈ మణి కాస్త నౌకలో ఉంది కాబట్టి నౌకామణి అయినదని వీరిద్దరు గ్రహించడానికి అట్టే సమయము పట్టలేదు! ఎందుకంటే వీరిద్దరు పురావస్తు శాఖ రంగమునందు ఆరితేరినవారు గదా!

                ఆ తర్వాత వచ్చిన ద్వాపరయుగము నందు శ్రీ కృష్ణుడి కాలములో ఈ మణి కాస్త సత్రాజిత్తు అను  మహారాజుకి సూర్య అనుగ్రహము వలన చేరినది! ఆ తర్వాత వినాయక చవితిలో చెప్పబడిన శమంతోపాఖ్యానం కధనము ప్రకారము అంతా జరిగి చివరికి ఈ మణి కాస్త శ్రీ కృష్ణుడి దగ్గరికి అదిగూడ శమంతకమణిగా చేరినదని వీరిద్దరు గ్రహించినారు! గాకపోతే వీరిద్దరికి అర్ధముకాని విషయము ఏమిటంటే త్రేతాయుగములో హనుమంతుడు కాస్త ఈ మణిని సముద్ర గర్భములో దాచిపెడితే.......ఆ తర్వాతవచ్చిన ద్వాపరయుగములో సూర్యుడికి ఈ మణి ఎలా చేరినదో అర్ధము కాలేదు! ఆ తర్వాత శ్రీ కృష్ణుడి నుండి ఈ మణి ఎక్కడికి వెళ్ళినదో గూడ అర్ధముకాలేదు! గాకపోతే శమంతకమణి ఉండటము నిజమేనని తెలుస్తోంది! పైగా ఇది బంగారము ఇస్తుందా? లేదా అనే సందేహాలకి సమాధానాలు లేవు! అనుకుంటూ వివిధ రకాల ఆలోచనలు చేస్తూ........తమ ఆఫీసు గదులలో గూడ వీరిద్దరు దీర్ఘ ఆలోచనలు చెయ్యడము ప్రారంభించినారు!

               వీరి అవస్థలను గమనించిన ఒక సీనియర్ అధికారి వీరిద్దరితో కలిసి రహస్య సమావేశమును ఏర్పాటు చేసుకొని వీళ్ళు శమంతకమణి మీద పరిశోధన చేస్తున్నారని గ్రహించి వీళ్లకున్న ధర్మసందేహాలు తెలుసుకొని వారి ముఖాల కేసి చూస్తూ "మీకు ఈ మణికి సంబంధించిన అన్నిరకాల ధర్మసందేహాలకి సమాధానాలు చెప్పగల ఏకైక వ్యక్తి ఉన్నాడు! అతను ఎవరోగాదు! ఈ మణి మీద ప్రభుత్వానికి తెలియకుండా రహస్యముగా పరిశోధనలు చేసి ఈ కలియుగములో ఈ మణి ఎక్కడ ఉన్నదో తెలుసుకొని దానిని దగ్గరగా చూసి.......... స్మశాన వైరాగ్యము చెంది ప్రస్తుతము కాశీక్షేత్రములో ఒక అఘోర మూర్తిగా మారి సంచారము చేస్తున్నాడు! నాకు ఈయన సీనియర్ ఆఫీసర్! ఆయనను నేను కేవలము ఒకటికి రెండు సార్లు మాత్రమే ఈ క్షేత్రమునందు చూశాను!  పరమహంస పవనానందగా ఈ క్షేత్రమునందు ఉన్నారు! మీరు ఆయనను పట్టుకుంటే ఈ మణికి సంబంధించిన అన్ని రకాల ధర్మ సందేహాలు తీరతాయి! అంటూ ఆయన ఎలా ఉంటాడో గుర్తు పట్టడానికి తన సెల్ ఫోన్  లో ఉన్న ఆయన ఫోటోను  వీరిద్దరికి ఇస్తూ ఈయన వెళ్ళిపోయినాడు. దానితో వీరిద్దరు కలిసి ఈ మణి సంగతిని తెలుసుకోవాలని అనారోగ్య కారణాలున్నాయని చెప్పి ఆఫీసుకి డుమ్మా కొట్టి కాశీ క్షేత్రమునకు చేరుకున్నారు!

                       వీరిద్దరు ఈ క్షేత్రమునందు పరమహంస కోసము వెతకని ప్రదేశము లేదు! విశ్వనాధ్ మందిరము నుండి కాలభైరవుడి మందిరముదాకా......శ్రీ త్రైలింగస్వామి మఠము నుండి ఆంధ్రా మఠము దాకా........అనేక ఆశ్రమాలు, 64  ఘాట్  లలో తిరిగినగూడ వీళ్ళకి ఈయన అగుపించలేదు! ఈయన ఉన్నాడో లేడో గూడ జాడ తెలియలేదు! దానితో వీరిద్దరికి ఎనలేని నిరుత్సాహము ఆవరించి శవాల దహనము జరిగే మణికర్ణికా ఘాట్ యందు వచ్చే అఘోరాలను చూస్తూ ఆశగా ఏడురోజులు పైగా గడిపినారు! 

చివరికి అనుకోకుండా ఒక అఘోరమూర్తి తమ దగ్గరికి వస్తూనే పెద్దగా "ఎవర్రా మీరు! నా గూర్చి ఎందుకు వెతుకుతున్నారు? నా ధ్యానమునకు మీ ఆవేదనలతో ఎందుకు అవాంతరాలుకలిగిస్తున్నారు!మణి గూర్చి రావడము జరిగితే తక్షణమే ఇక్కడ నుండి వెళ్లిపోండి! అనగానే......

వీరిద్దరు కలిసి ఏక కంఠముతో "స్వామి! మీరే పరమహంసయని తెలుస్తోంది!మాకు కావాల్సిన సమాచారము మీరు తప్ప ఇంకా ఎవరు మాకు ఇవ్వలేరు! నిజానికి మేము శమంతకమణి వివరాలు తెలుసుకోవటానికి మాత్రమే వచ్చాము! కాని మాకు ఆ మణి మీద కాని అది ఇచ్చే బంగారము మీద కాని ఆశ,అత్యాశ లేదు! కేవలము మణి ఉందా?లేదా? ఉంటే ఎక్కడ ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహముతో ఇక్కడికి వచ్చాము......

పరమహంస వెంటనే "అయితే ఈ మణి వివరాలు తెలుసుకుంటే మీకు ఏమిటి లాభము? లాభము లేనిదే మానవుడు ఏది చెయ్యడుగదా? 

కృష్ణ వెంటనే "స్వామి! మన భారతీయ ఆధ్యాత్మిక రంగములో చెప్పబడిన పురాణ ఇతిహాస గ్రంధాలు పుక్కిటి పురాణాలు గావని........పూర్వీక మహర్షులు తమ దివ్యదృష్టితో తెలుసుకున్న నగ్నసత్యాలని లోకానికి చెప్పాలని మా ఇద్దరి తాపత్రయం!

పరమహంస వెంటనే " ఈ మణి వివరాలు మీకు చెపితే కాని ఈ లోక ప్రజలు అది ఉందో లేదో  తెలుసుకోలేని దుస్థితిలో  ఉన్నారా? ఆధారాలుంటే గాని ఇతిహాసాలు నమ్మలేరా? అయితే వినండి!

త్రేతాయుగములో ఈ శమంతకమణి కాస్త నౌకమణిగా మారినదని మీరు ఈ పాటికే తెలుసుకున్నారు గదా! ఆ తరువాత ఇది శ్రీకృష్ణుడి దగ్గరికి ఎలా చేరినదో తెలుసుకున్నారు! కాని అసలు సూర్యుడికి ఎలా చేరినది తెలుసుకోవాలని నేను పరిశోధనలు చెయ్యడము ప్రారంభించాను! త్రేతాయుగములో హనుమంతుడు కాస్త ఈ నౌక మణి వలన చిరంజీవి తత్వమును పొందినాడు! దానితో ఈయన ఈ మణికి కాపలా కాస్తున్నాడు! ఒకానొక సమయములో తనకి సకల విద్యలు నేర్పించిన సూర్య భగవానునికి తన గురుదక్షిణగా ఈ నౌకమణిని ఆయనకి ఇస్తూ హనుమంతుడు కాస్త రామనామ తపో ధ్యానము కోసము హిమాలయాలకి వెళ్లిపోవడము జరిగినది! ఆ తర్వాత వచ్చిన ద్వాపరయుగములో తనను త్రికాల సంధ్యలతో సూర్యారాధన చేస్తూ తన మెప్పు పొందడము వలన సత్రాజిత్తుకి సూర్యభగవానుడి ద్వారా ఈ మణి అందడము జరిగినది! ఈయన నుండి చివరికి శ్రీకృష్ణుడికి ఈ మణి  చేరినదని మనకి వినాయక చవితి కధలో వచ్చే శమంతకోపాఖ్యానము ద్వారా తెలుస్తుంది!

ఆ తర్వాత శ్రీకృష్ణుడి నిర్యాణ సమయములో ఈ మణిని తిరిగి సోమనాధ్ దేవాలయములో ప్రతిష్టించాడు! ఎలా అంటే మధుర ప్రాంతము నుండి ద్వారకా నగరమునకు వచ్చినాడు! పైగా ఈయన ప్రభాస తీర్ధము వద్ద నిత్య సూర్యారాధన చేసినాడని   తెలుస్తోంది! పైగా ఈయన కాస్త సోమనాధ్ దేవాలయానికి ఉన్న వెండి స్తంభాలు తొలగించి సీసపు స్తంభాలతో ఈ దేవాలయము కట్టించాడని.......మరికొందరు గంధపు స్తంభాలతో ఈ దేవాలయమును కట్టించారని చెప్పడము జరుగుతోంది! నిజానికి ఈ దేవాలయములో ఇప్పుడికి ఉన్న 56  స్థంభాలలో రెండు సీసపు స్తంభాలు ఉన్నాయి! మిగిలిన 54  స్థంబాలు రాతితో ఉండటము మనము గమనించవచ్చును!

సత్య వెంటనే "స్వామి! నిజముగానే ఈ మణి కాస్త ప్రతిరోజు బంగారము ఇచ్చేదా?"

పరమహంస వెంటనే "అమ్మా! ఈ విశ్వ సృష్టిలో స్వయముగా రెండు మణులు మాత్రమే బంగారమును ఇవ్వగలవు! అదియే పరుసవేదిమణి అలాగే శమంతకమణి! పరుసవేదిమణి అయితే ఏదైనా లోహమును బంగారముగా మారిస్తే........శమంతకమణి మాత్రమే పాదరసమును బంగారముగా మారుస్తుంది!

కృష్ణ వెంటనే " ఇది ఎలా సాధ్యము స్వామి?" 

పరమహంస వెంటనే "ఎందుకు సాధ్యము కాదు? ఈ మణులు కేవలము ఒక పదార్థమును మరొక పదార్ధముగా మార్చి ఇస్తున్నాయని తెలుసుకో! వీటికి లోహాలు లేదా పాదరసము ఇవ్వకపోతే ఇవి కాస్త బంగారమును ఇవ్వలేవు! దీనినే సైన్స్ లో ఆల్ కెమిఅంటారు! ఒక పదార్థమును మరొక పదార్ధముగా మార్చడాన్ని ఆల్కెమీ అంటారు! ఒక ఐసోటోప్ ను తగ్గించడము లేదా పెంచడము వలన ఆ పదార్ధము  కాస్త మరొక పదార్ధముగా మారిపోతుంది! అంతెందుకు పాదరస ఐసోటోప్ 234 ను కాస్త ఐసోటోప్ 235 గా మారిస్తే అదికాస్తా బంగారముగా మారిపోవడము మన శాస్త్రవేత్తలు తమ ప్రయోగశాల యందు కృత్రిమ బంగారమును తయారు చేసి నిరూపించినారు గదా! పూర్వీక మహర్షులు ఈ విధి విధానమునే రసవిద్యగా చెప్పడము జరిగినది! యోగివేమన, సి.నా.రే. స్వామి, భక్త రామప్ప ఇలాంటి వారందరు గూడ ఈ రసవిద్యజ్ఞానము పొందిన రస విద్య సిద్ధపురుషులు.ఈ లెక్కన చూస్తే శమంతకమణి అనేది బంగారము ఇవ్వడము జరుగుతుంది గదా! అదిగూడ సూర్యరశ్మి సమయములో ఇది కాస్త పాదరసమును బంగారముగామార్చి ఇస్తుంది! అంతెందుకు ఈ మణి ప్రభావము వలన అపుడికే పొందిన 1000 టన్నుల బంగారమును శ్రీకృష్ణుడు తన నిర్యాణ సమయములో బలరాముడికి ఇస్తూ దీనిని దేనికైనా వినియోగించమని చెప్పితే ....... ఆయన కాస్త విశ్వకర్మను పిలిపించి 108 వైష్ణవ దేవాలయ నిర్మాణాలకి ఈ బంగారమును ఉపయోగించినాడని చెప్పడము జరిగినదిగదా! ఇప్పుడికి మనకి అది ద్వారక మునిగిపోయే ప్రదేశములో శ్రీ కృష్ణుడు ఏర్పరిచిన రహస్య సొరంగ మార్గములలో ప్రయాణిస్తే వారికి అతి విలువైన బంగారపు ఆభరణాలు, విలువ కట్టలేని వజ్రాలు,కెంపులు, పచ్చలు ఇలా ఎన్నో ఉన్నాయని తెలుసుకొని.....పైగా వీటికి కాపలాగా సహస్ర నాగబంధము ఉండుటవలన ఈ మార్గములోనికి ఆశకొద్ది వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో వెనక్కి తిరిగి రాకపోవడముతో బ్రిటిష్ వాళ్ళు ఈ రహస్య సొరంగ మార్గమును మూసి వెయ్యడము జరిగినది అని ఈనాటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చెప్పడము జరిగినది గదా! ఈ లెక్కన చూస్తే శమంతకమణికి బంగారము ఇచ్చే గుణమున్నదని మీరిద్దరు తెలుసుకున్నారుగదా!

           ఇక ప్రస్తుత విషయానికి వస్తే ద్వాపరయుగములో ఈ మణి కాస్త తిరిగి సోమనాధ్ కి చేరినదని తెలుస్తోంది! మరి ప్రస్తుత కలియుగములో ఇది ఎక్కడ ఉన్నది అనే సందేహముతో నేను కాస్త దీని మీద లోతుగా పరిశోధన చెయ్యడము జరిగినది! ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సోమనాధ్ ఆలయములో ఈ మణి ఉన్న దాఖలాలు లేవు గదా! దానితో సోమనాథ్ దేవాలయ చరిత్రకి సంబంధించిన పుస్తక గ్రంధాలు తిరగవెయ్యడము ప్రారంభించినాను! ఈ దేవాలయము కాస్త ఏడు సార్లు ధ్వంసమై తిరిగి ఏడుసార్లు కట్టబడినదని నా పరిశోధనలో తెలుసుకున్నాను! ఈ విధ్వంస కాండ ఔరంగజేబుతో మొదలై ఘోరితో అంతమయినది! ఈ ఘోరీ దగ్గర నుండి రాజపుట్ లు ఈ మణిని సొంతము చేసుకున్నారు. వీళ్లల్లో చివరి రాజపుట్ రాజమాన్ సింగ్ ఈయన శ్రీకృష్ణ భక్తుడు! మధుర క్షేత్రములో ఏడు అంతస్థుల బృందావన దేవాలయమును నిర్మించినాడు! ఈయనకి సంతానము లేదు! దానితో ఈయన అన్నగారి కుమారుడైన జగత్ సింగ్ ను దత్తతు తీసుకొని తన అధికారాలతో పాటు ఈ మణి సంరక్షణ బాధ్యతను ఈయనకి ఇచ్చాడు! ఈయన హనుమాన్ చాలీసా రచించిన గోస్వామి తులసీదాసుకి పరమశిష్యుడు గావడము విశేషము! ఒకానొక సమయములో ఈయనకి గురుదక్షిణగా ఈ జగత్ సింగ్ తన దగ్గర ఉన్న వంశ పార్యంపరముగా వస్తున్న శమంతకమణిని ఇవ్వడము జరిగినది! దానితో చివరికి ఈ మణి కాస్త తులసి దాసుకి చేరినది! అప్పుడికే ఈయనకి అన్నింటి యందు స్మశాన వైరాగ్యము ఉండడము వలన ఈ మణి మీద ఈయన అంతగా ఆశపడలేదు! శ్రద్ధ పెట్టలేదు! గాకపోతే భద్రముగా దాస్తూ ఉంచినాడు!

       ఒకానొక సమయములో ఈయనకి శ్రీరామ సాక్షాత్కారమును పొందాలని విపరీతమైన ఆకాంక్ష మొదలైంది! దానితో తనకి ఈ సాక్షాత్కారము పొందాలంటే హనుమంతుడి అనుగ్రహమును పొందాలని తెలుసుకున్నాడు! దీని కోసము ఈయన కాస్త తులసి రామాయణము రచించి ప్రచారము చేస్తుండేవాడు! ఈ ప్రచార సమయములో ఒక వృద్ధుడు అందరికన్నా ముందుగా వచ్చి అందరికన్నా చివరగా వెళ్ళడము ఈయన గమనించాడు! ఎందుకంటే శ్రీరామ  నామ సంకీర్తన లేదా రామాయణ కధనము జరుగుతున్న సమయాలలో హనుమంతుడు ఇలా వృద్దుడి రూపములో వచ్చి వీటిని వింటాడని ఈయనకి తెలుసు! బహుశా ఈ వృద్ధుడే హనుమంతుల వారైతే అనే ఆలోచన వచ్చి రాగానే.....తులసీదాసు ఒకరోజు ఈ వృద్దుడి వెంట రహస్యముగా వెంబడించాడు! కాశీలో ఉన్న ప్రస్తుతమున్న హనుమత్ ఘాట్ దగ్గరికి రాగానే తులసీదాసు వెంటనే ఏమి జరిగితే అది జరుగుతుంది అని ఈ వృద్ధుడి కాళ్ళ మీద పడగానే 

ఆ వృద్ధుడు కాస్త "స్వామి! మీలాంటి పెద్దలు నాలాంటి కుష్టు వ్యాధి ఉన్న వారి కాళ్ళ మీద పడవచ్ఛునా? నిత్యరామ నామమును పలికే పెదవులు,రామ పాదాలు చూసే కళ్ళు, రామ పూజలు చేసే చేతులు, రామ అర్చనకి ఉపయోగించే కాళ్ళుతో....... దేహమంతా రామమయముగా చేసుకున్న మీలాంటి రామ భక్తులు నా బోటి వృద్ధుల కాళ్ళ మీద పడవచ్చునా? 

తులసీదాసు ఏమాత్రము ఆలోచించకుండా "స్వామి! మీరు వృద్ధులుగా కనిపించే చిరంజీవితత్వమును పొందిన హనుమస్వామి యని ఈనాడే తెలుసుకున్నాను! మీ వలన నాకు రామ సాక్షాత్కారము కలిగేదాకా నేను మీ పాదాలు వదిలిపెట్టను అన్నాడు!"

                       దానితో ఈ వృద్ధుడు కాస్త నిజస్వరూపముగా హనుమంతుడిగా  దర్శనమిస్తూ "నాయనా నీ రామ భక్తికి మెచ్చాను! నీ రామాయణము వింటే ఆనాటి దృశ్యాలు నాకళ్ళ ముందు సజీవ దృశ్యాలుగా కనిపించినాయి! ఈ జన్మను ధన్యత చేకూర్చుకున్నావు! కాని శ్రీరామ సాక్షాత్కారమునకు ఒక అవాంతరముంది! అదియే నీ దగ్గర ఉన్న నౌకమణి నాకు గురుదక్షిణగా ఇవ్వగలవా? ఇస్తే నీకు తప్పకుండా రామ సాక్షాత్కారమును కలిగిస్తాను........

తులసీదాసు వెంటనే తన చేతి సంచిలో ఉన్న జగత్ సింగ్ ఇచ్చిన శమంతకమణి తిరిగి హనుమంతుడికి మారు మాట్లాడకుండా ఇవ్వడము హనుమంతుడు సంతోషిస్తూ "తులసీదాసు! ఇదే సమయములో ఇద్దరు  వ్యక్తులు రాజుల వేషములో గుర్రాల మీద ఇక్కడ నుండి వెళ్తారు! వాళ్లే శ్రీరామ లక్ష్మణులు! వారి పాదాలు పట్టుకో! నిజ స్వరూపముతో దర్శన మిస్తారని చెప్పి ఈయన ఈ మణితో సహా అంతర్ధాన మయినారు!

            కొద్దిసేపటికి హనుమంతుడు చెప్పినట్టు ఈ ఘాట్ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు రాజుల వేషధారణతో వస్తూండడము గమనించిన తులసీదాసు ఏమాత్రము ఆలోచించకుండా అందులో పెద్దవాడి పాదాల మీద పడగానే....ఈ విషయము గ్రహించిన వీరిద్దరు కాస్త తమ నిజ స్వరూపముతో శ్రీరామ సాక్షాత్కారమును దర్శనమిచ్చేసరికి తులసీదాసు కాస్త అమిత ఆనందపడినాడు! ఈ విధంగా తనకి శ్రీరామ సాక్షాత్కారము అలాగే హనుమత్ సాక్షాత్కారము ఈ ఘాట్ యందు కలుగుటవలన తులసీదాసు ఈ ఘాట్ కి హనుమాన్ ఘాట్ అని నామకరణము చేసినాడని ఈ స్థల పురాణము చెపుతోంది! ఈ లెక్కన చూస్తే శమంతకమణి తిరిగి హనుమంతుడి చేతికి రావడము ఆయన తిరిగి దానిని త్రేతాయుగములో ఏ సముద్రగర్భమునందు దాచి ఉంచినాడో మళ్ళీ ఈ కలియుగములో దానిని అక్కడే తిరిగి దాచి ఉంచినాడని నేను గ్రహించాను!

వెంటనే సత్య అందుకొని "స్వామి! తులసీదాసు చేతికి చేరిన ఈ మణి తిరిగి హనుమంతుల ద్వారా సముద్ర గర్భమునకు చేరినదని ఎలా చెప్పకలుగుతున్నారు"

దానికి పరమహంస చిరునవ్వునవ్వి "అమ్మ! తులసీదాసు చేతికి ఖచ్చితముగా శమంతకమణి చేరినదని రూఢి అయినదిగదా! గాకపోతే దానికి హనుమంతుడు తిరిగి సముద్రగర్భములో పెట్టినాడా? లేదా అన్నప్పుడు తులసీదాసుకి వచ్చిన వృద్దుడు హనుమంతుడు అని ఎలా తెలుసుకో కలిగినాడో మొదట మనము తెలుసుకోవాలి! అందుకు తులసీదాసు జీవితములో జరిగిన యదార్ధ సంఘటన ఒకటి నిదర్శనమవుతుంది! ప్రతిరోజు తులసీదాసుకి ఈ కాశిఘాట్ ల యందు గంగాస్నానము చెయ్యడము అలవాటు! అలాగే శ్రీరాముడి అభిషేకానికి గంగా జలమును ఒక కుండలో తీసుకొని వెళ్ళడముగూడ పరిపాటే! ఒకరోజు ఈయన అనుకోకుండా ఈ క్షేత్ర ఘాట్ దగ్గరిలో ఉన్న ఒక చెట్టు క్రింద నీళ్ల కుండతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది!అప్పుడు ఈ చెట్టు క్రింద పెట్టిన నీళ్ల కుండలోని నీళ్లు మాయం అవ్వడము తులసీదాసు గమనించి ఇలా పలుమార్లు తెచ్చిన నీళ్లు మాయం అవ్వటము గమనించి ఈ చెట్టు మీద జలరాక్షసి ఉన్నదని తెలుసుకొని దానికిగూడ ప్రతిరోజు నీళ్లు సమర్పించడము అలవాటు చేసుకున్నాడు! 

ఒకరోజు ఈ చెట్టు నుండి అశరీరవాణితో ఒక గొంతు వినపడి "స్వామి! ఇలా ప్రతిరోజు మీరు నీళ్లు తెచ్చి నాకున్న దాహార్తి తీరుస్తున్నారుగదా! ఇందుకు మీకు ఏదైన ప్రత్యుపకారము చెయ్యాలని ఉంది అన్నపుడు

తులసీదాసు వెంటనే "నాకు శ్రీరామ సాక్షాత్కారము కలిగించగలవా? అన్నపుడు

వెంటనే అశరీర వాణి "స్వామి! నాకు అంత అర్హత ,యోగ్యత లేవు! కాని హనుమత్ సాక్షాత్కారమును కలిగించగలను! ఈయన అనుగ్రహమును మీరు పొందితే మీకు తప్పకుండా శ్రీరామ సాక్షాత్కారము కలుగుతుంది! అందుకు మీరు రామాయణము పారాయణము చెయ్యండి! అపుడు మీ దగ్గరికి అందరికంటే ముందుగా.......అలాగే అందరికంటే చాలా వెనుకగా ఒక వృద్ధుడు వెళుతూ ఉంటాడు! అయన శ్రీరామ బంటు అయిన హనుమంతుడని తెలుసుకోండి! ఆయన పాదాల మీద పడి వేడుకుంటే శ్రీరామ సాక్షాత్కార మార్గమును ఆయన మీకు చూపగలడని చెప్పడముతో.....తులసీదాసు కాస్త తులసీ రామాయణమును రచించి అందరి ముందు దానిని పారాయణము చెయ్యడము ప్రారంభించినాడు! ఆ తర్వాత ఈయనకి హనుమత్ దర్శనము......ఆపై శ్రీరామ సాక్షాత్కారము కలిగినది! 

ఇక్కడ మనము గమనించవలసిన విషయము ఏమిటంటే జల రాక్షసి విషయం! త్రేతాయుగములో ఈమె ఉన్నదని చెప్పటానికి మనకి సుందరకాండలో 1 వ సర్గలో 187 ,189 ,196 శ్లోకాలు చూస్తే జలరాక్షసి గూర్చి వివరాలు తెలుస్తాయి! అనగా.......

దక్షిణస్య,సముద్రస్య, మిధ్యే తస్యతు

రాక్షసీ అంగారకేతి విఖ్యాతా , ఛాయాం

ఆకృష్య భోజనీ- 26 (కిష్కింద కాండ -4 )వ సర్గ

సుందరకాండ (1 వ సర్గ )

సమాక్షిప్తోస్మి సహసా, పంగూకృత పరాక్రమః

ప్రతిలోమేనవాతేన , మహా నేరివ సాగరే-1


తద్రుష్ట్వా చింతయామాస  

మారుతిర్ వికృతాననం

కపి రాజేన కథితం

సత్వం అద్భుతదర్శనం - 189


తతస్తస్యానఖై  స్త్రీక్షణై

మర్మాన్యుః కృతవానరః -196


ఈ శ్లోకాల ఆధారముగా చూస్తే సుగ్రీవుడు కాస్త హనుమంతుడితో "హనుమ! దక్షిణ సముద్రములో  మధ్య భాగములో నీడలన్నీ పట్టుకొని ఆకర్షించుకొని పట్టుకుని తినే రాక్షసి ఒకటి ఉన్నదని దానితో జాగ్రత్తగా ఉండు అని చెప్పడము జరిగినది! అలాగే హనుమంతుడు సీతాన్వేషణ కోసము దక్షిణవైపు సముద్రయానము చేస్తున్నపుడు తన శక్తిని లాగుకొనే ఆశ్చర్య శక్తి ఉన్న స్త్రీ రాక్షసిని చూడటము జరిగినదని.....ఈమెను తన గోర్లతో మర్మాంగాలను నాశనము చేసినాడని వాల్మీకి రామాయణములో ఉంది! అంటే జలరాక్షసి ఉన్న ప్రాంతములోనే ఈ శమంతకమణిని హనుమంతుడు దాచిపెట్టి ఉండాలని నా పరిశోధనలో తెలిసినది  అన్నప్పుడు........

కృష్ణ వెంటనే "స్వామి! ఈ లెక్కన చూస్తే మీకు శమంతకమణి ఎక్కడ ఉన్నదో తెలిసే ఉండాలి గదా" అన్నప్పుడు  

పరమహంస "తెలుసు! అది ఇలా వృత్తపురములో ఉంది"

వీరిద్దరు ఆశ్చర్యము చెందుతూ "ఇలా వృత్త పురమా? అంటే ఏ ప్రాంతము! అది ఎక్కడ ఉంది?"

పరమహంస వెంటనే "ఇలా వృత్తపురము అంటే బెర్ముడా ట్రయాంగిల్ అన్నమాట! దీనినే డెవిల్స్ ట్రయాంగిల్ అని గూడ పిలుస్తారుగదా! ఈ ప్రాంతములో ఇప్పుడికి ప్రయాణించే నౌకలు అలాగే గాలిలో ఎగిరే విమానాలు అంతు చిక్కకుండా అదృశ్యము అవుతుంది గదా! ఇదంతా అక్కడున్న జలరాక్షసి పనియే! ఎందుకంటే దీనికి నీడలు పట్టుకొని వాటిని మ్రింగడము అలవాటున్నదని...... సాక్షాత్తు హనుమంతుడిని మ్రింగితే ఆయన దీని కడుపులోకి వెళ్లి దాని అవయవాలు నాశనము చెయ్యడము అది చనిపోయినదని......కాని, ఈ వంశ వారసురాలు అక్కడ నుండి పారిపోయి ఈ ప్రాంతమునకు వచ్చి ఆవాసము చేస్తోందని హనుమంతుడు గ్రహించి ఈమె రక్షణలో తిరిగి తనకి వచ్చిన శమంతకమణిని సముద్రగర్భములో అదిగూడ బెర్ముడా ట్రయాంగిల్లో దాచినాడని నా పరిశోధన ద్వారా తెలుసుకున్నాను. పైగా ఇది పాతాళలోకము వెళ్ళుటకు దారిమార్గమని గ్రహించాను! అంటే ఊర్ధ్వలోకాలకు వెళ్ళుటకు కృష్ణబిల్వము (బ్లాక్ హోల్స్) సహాయపడితే..... అదే అధోలోకాలకు వెళ్ళుటకు ఈ ట్రయాంగిల్ ఉపయోగపడతాయని నేను గ్రహించాను!

గాకపోతే కృష్ణ బిల్వాలలో అలాగే ఈ ట్రయాంగిల్  లో పడిన వస్తువులు లేదా వ్యక్తులు సరాసరి భూలోకము దాటి ఆయా లోకాలకి వెళ్లిపోవడము మనకి ఇవి ఆనవాళ్లు దొరకకుండా అదృశ్యమవుతున్నాయని నా పరిశోధనలో గ్రహించాను! దానితో బంగారము తయారు చేసినవాడు ఎలా అయితే బైరాగి అవుతాడో అలాగే ఇలాంటి మణుల మీద ప్రయోగాలు చేసినవాడు మణివేదాంతి అవ్వక తప్పదని నాకర్ధమయినదని చెపుతూ పరమహంస మౌనము వహించాడు! అంటే ఈ లెక్కన చూస్తే కలియుగములో సోమనాధ్ శివలింగము నుండి తిరిగి సముద్ర గర్భమునకు అదే బెర్ముడా ట్రయాంగిల్  కి శమంతకమణి చేరినదని......ఇది పాతాళలోకములో ఉండుటవలన సూర్యరశ్మి లభించకపోవడము వలన ఈ మణి కాస్త బంగారము ఇవ్వలేక పోతుందని అలాగే శమంతకమణిని కళ్లారా చూసే యోగము లేదని వీరిద్దరు గ్రహించి పరమహంసకి కృతజ్ఞతలు చెప్పి ఆ కాశీ క్షేత్రము నుండి మౌనముగా బయలు దేరినారు! అని రిపోర్డ్ లో ఉంది.

ఆ తర్వాత చింతామణి మీద పరిశోధన రిపోర్డ్ చదవడము ఆరంభించాడు.కాకపోతే ఈ రిపోర్ట్ కాస్త 300 పేజీల ఉన్న "ది బుద్ద కోడ్" అనే పుస్తకముగా ముద్రించడము జరిగినదని..ఈ మణి అనేది కైలాసపర్వతములో ఉన్న శంబల గ్రామములో ఉన్నదని..అక్కడకి ఎలా వెళ్లాలో బుద్దుడు ఈ లోకానికి మణిపద్మ మంత్రములోను అలాగే కాలచక్రతంతులో చెప్పడము జరిగినదని..అది ఎలాగో పరమహంస తన పరిశోధించి తెలుసుకొని ఈ పుస్తకము రూపములో రచించి లోకానికి అందించారని హర్వేకి అలాగే జోషికి అర్ధమయింది. 

చింతామణి మీద పరిశోధన రిపోర్డ్ చదవడము ఆరంభించాడు.అందులో

1
అది  1963 సంవత్సరం...జూన్ 11
వియత్నాం దేశములో..
బౌద్ధమత సన్యాసుల మీద అకారణముగా ప్రజలు మరియు ప్రజాపతులు విపరీతముగా దాడులు చేస్తున్న విపత్కర సమయములో..
తమ ఉనికిని కాపాడుకోవటానికి దాదాపుగా 1000 మందికి పైగా బౌద్ధమత సన్యాసులు శాంతియుతముగా తమ నిరసనలు గత కొన్ని నెలలుగా తెలుపుతున్నా గూడ ప్రభుత్వములోని చట్టాలలో ఎలాంటి మార్పులు రానందున..
బౌద్ధమతము ఉనికి కాపాడటానికి అలాగే బౌద్ధమత సన్యాసులను హింసించడాన్ని ఆపటానికి తన ఆత్మహత్యయే నాంది అవ్వాలని...
థీచ్ క్వాంగ్ డక్ అను మహాయాన బౌద్ధమత సన్యాసి... సైగాన్ ప్రాంత రహదారి కూడలికి తన కారులో తన స్నేహితులతో కలిసి చేరుకొని అక్కడ రోడ్డు మీద అందరూ చూస్తూండగా...చిరునవ్వుతో పద్మాసనము లో కూర్చుని తన స్నేహితులకి కనుసైగ చెయ్యగా..వారు తాము వచ్చిన కారు దగ్గరికి వెళ్ళి కారులోంచి పెట్రోల్ తీసి..ఇతని మీద దానిని పొయ్యడము ప్రారంభించారు.అసలు అక్కడ ఏమి జరుగుతుందో అక్కడున్నవారు ఉహించేలోపే..ఆ స్నేహితులు తాము తెచ్చిన అగ్గిపెట్టెతో ఈయనకి నిప్పుపెట్టడము క్షణాలలో జరిగిపోయింది. కాని విచిత్రము ఏమిటంటే ఈ 80సం!!రాల వయోవృద్ద బౌద్ధ సన్యాసి ఈ దహనాగ్ని తన శరీరమును దహించువేస్తూ.. తన శరీర మాంసమును కాలుస్తున్నగూడ ఏమాత్రము భయపడకుండా.. బాధపడకుండా
.. కదలకుండా.. మెదలకుండా.. అరవకుండా..ఎలాగైతే కూర్చున్నాడో అలాగే తన దేహ అస్ధిపంజరము నేలమీద పడిపోయేదాకా నిశ్చలస్ధితిలో ఉండిపోయిన వీడియోను నిర్వాణ లామా తన చెమర్చిన కళ్ళతో  తదేకముగా చూస్తున్నాడు.
ఎందుకంటే తను గూడ ఆత్మహత్య పేరుతో శరీర త్యాగము చేసుకోవాలని గత కొన్ని నెలలుగా తట్టుకోలేని మరణ ఆలోచనలు చేస్తున్నాడు. కారణము తన సాధన పూర్ణస్ధితికి అనగా “ఏమిలేదు..నేను లేను..సర్వం శూన్యం” అనే శూన్యత భావానికి గురి అవుతున్నాడు. అనగా “నేనే లేనపుడు కనిపించే ఈ విశ్వము అసత్యమైనపుడు..కనిపించేది అసత్యము..కనిపించని శూన్యము సత్యమైనపుడు”..తను ఈ దేహముతో ఉండుట దండగ అని ఈ ఆత్మశూన్యత భావానికి గురి అవుతున్నాడు.
వస్తువు పగిలితే శబ్ధం వస్తుంది. అదే మనస్సు పగిలితే మిగిలేది నిశ్శబ్ధం! దీనిని తట్టుకోవడము చాలా కష్టమని నిర్వాణ లామా అనుభవపూర్వకముగా తెలుసుకున్నాడు.దానితో ఈ శూన్యత భావమును ఎలా తట్టుకోవాలో...ఎలా దాటాలో తెలియక..అది ఉన్నదని చెప్పి ఈ స్ధితిని ఎలా దాటాలో చెప్పని శబ్ధపాండిత్యమును తిట్టుకుంటూ..దీనికి  అనుభవపాండిత్య మహాగురువైన భగవాన్ బుద్ద ఏమైనా సందేశమిస్తాడోనని ఆశతో తన చిట్టచివరి ప్రయత్నముగా..తన కెదురుగా ఉన్న
బోధిసత్వులు...అవలోకితేశ్వర మరియు క్షితిగర్భ విగ్రహామూర్తుల కేసి ఆర్తిగా..దీనముగా..శరణాగతితో చూడగా...
తనలో నుండి..తన ప్రమేయము లేకుండా...తన హృదయ పద్మము నుండి 
ఓం-మణి-పద్మ-హుం
అను గురుమంత్రము వినపడటము నిర్వాణ లామా గమనించి ఆశ్చర్యానందనమునకు గురి అవుతుండగా….
“నాయనా...నువ్వు ఒక సత్యాన్వేషిగా మారి..ఈ శూన్యత భావస్ధితిని నేను ఎలా దాటుకున్నానో ప్రత్యక్షానుభవాలతో తెలుసుకొని...ఈ మంత్ర గూడార్ధమును లోకానికి తెలియచేసి...అందరికి ఎదురయ్యే ఈ స్ధితిని దాటటానికి నేను తెలుసుకున్న మార్గము చెప్పి  తధాగతుడిగా మహా నిర్వాణ నిర్యాణము చెందు” అని అశరీరవాణి సందేశమివ్వడముతో...
ఏ బోధి వృక్షము క్రింద భగవాన్ బుద్ధుడికి జ్ఞానబోధ అయినదో ఆ వృక్షమున్న బుద్ధగయ క్షేత్రానికి నిర్వాణ లామా బయలుదేరాడు.
*** *** *** *** *** *** 
2
బుద్ధ పూర్ణిమ రోజు గావడంతో.....
బుద్ధ గయలో....
బౌద్ధ సన్యాసులతో... ఈ క్షేత్రము నిండిపోయినది.అలాగే ఈ క్షేత్రములో ఉన్న బుద్ధుడు ఙ్ఞానము పొందిన బోధి వృక్షము మరియు బౌద్ధ మందిరమును వివిధ రకాల పుష్పాలతో..సూక్తులతో..బోధనలతో..అలంకరించే పనిలో 1800 మంది బౌద్ధ భిక్షువులు నిమగ్నమైన వేళలో..
నిర్వాణ లామా ఈ మందిరమునకు చేరుకోవడము జరిగినది.సరాసరిగా మందిరము లోపల ఉన్న బుద్ధుడి  విగ్రహమూర్తికి నమస్కారము చేసి అక్కడే ఉన్న ఈ క్షేత్ర పరిరక్షక లామాల దగ్గర నుండి ఆశీస్సులు అందుకొని...బుద్ధ భగవానుడు ఙ్ఞానము పొందిన బోధి వృక్షము క్రిందకు చేరుకొని ధ్యానం చేసుకోవడం ఆరంభించాడు..
ఇంతలో...మరికాసేపటిలో అక్కడికి ధర్మశాల నుండి దలైలామా వస్తున్నారని...ధర్మ బోధ చేస్తారని..కాబట్టి అందరూ గూడ వారికి కేటాయించిన కుర్చీలలో ప్రశాంతముగా కూర్చోవాలని మైకులో చెప్పడము జరిగినది.
 అనుకున్న సమయానికి దలైలామా కాస్త ప్రసంగము కోసము ఏర్పరిచిన వేదిక వద్దకు రావడము ....ఈ ప్రసంగము వినడానికి అక్కడ పనిచేస్తున్న బౌద్ధ సన్యాసులు,బౌద్ధ భిక్షువులు,బౌద్ధ లామాలు అందరు గూడ తమకి కేటాయించిన కుర్చీలలో కూర్చోవడము మొదలుపెట్టారు! 
దలైలామా కాస్త మైకు అందుకొని.. “నాయనలారా!ఈ రోజు మీకు నేను ఎలాంటి ఙ్ఞాన బోధ చేయను.కాని మీ సాధనలో వచ్చే ధర్మ సందేహాలకు మరియు సాధన సందేహాలకు సమాధానాలు చెపుతాను” అనగానే...
ఎవరో ఒక బౌద్ధ సన్యాసి లేచి..”లామాజీ!మనము నిత్యము పూజించే ఓం-మణి-పద్మ-హుం మంత్రము యొక్క అర్ధము ఏమిటో చెప్పగలరా?” అనగానే.. 
“నాయనా!ఈ మంత్రార్ధము మణి గల పద్మము లేదా మణి పద్మము.నిజానికి మణి పద్మము అంటే మణి కాంతి ఉన్న స్పటిక పర్వతమైన పద్మాకార కైలాస పర్వతము. ఈ మంత్రార్ధములో మణి అర్ధము అనగా పరిశుద్ధమైన మనస్సు ఉన్నవాడు స్పటిక పర్వతమంత పరిశుద్ధుడని..ఇంక పద్మము అనగా పరిపూర్ణ ఙ్ఞాన చిహ్నము అని మన బౌద్ధ గ్రంధాలలో చెప్పబడి ఉంది.”
ఒక న్యూస్ విలేఖరి లేచి...”స్వామి! బౌద్ధధర్మములో బుద్ధుడు, బోధిసత్వుడు,తధాగతుడు అంటే ఏవరు?” అనగానే..
“నాయనా ..ఈ మూడు పేర్లు అనేవి బుద్ధుడు సాధన స్ధితులు అనగా సిద్దార్ధుడు బోధివృక్షము క్రింద జ్ఞానము పొందినపుడు ఆ సాధన స్ధితిని బుద్ధుడిగా..తను పొందిన జ్ఞానమును బోధ చెయ్యడముతో ఆయనను భోదిసత్వుడిగాను..ఆపై తను పూర్ణశూన్యస్ధితిని పొందడముతో తనకి తాను తధాగతుడిగా నామము పెట్టుకున్నారు.నిజానికి ఈ మూడు స్ధితులు ప్రతివారు తప్పకపొందాలని తన కాలచక్రతంతులో వీటిని శరీర,వాక్క్,మనస్సు సోపానాలుగా చెప్పడము జరిగింది.అంటే తనే కాకుండా అందరుగూడ బుద్ధుడు, బోధిసత్వుడు,తధాగతుడు అవ్వాలని అవుతారని” చెప్పడము జరిగింది.
ఒక యాత్రికుడు లేచి..”స్వామి! శూన్యత మరియు శూన్యతాభావము అంటే ఏమిటి?” అనగానే..
“నాయనా!శూన్యత అంటే మనస్సు లేని స్థితిని పొందడము. అదే శూన్యభావస్ధితి అంటే ఇందులో మనస్సు అలాగే భావముంటుంది. శూన్యత స్థితిని పొందడము అనగా నువ్వు ఒక ఉల్లిపాయను తీసుకొని దానికున్న పొరలు తీసుకుంటూ పోతుంటే అప్పటిదాకా ఆకారంగా కనిపించిన ఉల్లిపాయ కాస్త ఎలా అయితే కనిపించకుండా పోతుందో..అలా సత్యముగా కనిపించే ఈ ప్రపంచము అలాగే ఈ దేహ మనస్సు గూడ సాధన ద్వారా వీటికున్న లక్ష పాతిక వేల కర్మ బంధ మాయ పొరలు తొలిగితే అపుడు భావనలు చేసే మనస్సు కనిపించదు. భావాల వలన ఆలోచనలు కలుగుతాయి.వీటి వలన భావానికి రూపము ఏర్పడుతుంది. ఈ రూపము మీద ప్రేమ,మోహ, వ్యామోహ, భ్రాంతి, భ్రమ, ఆశ, భయము,ఆనందము, ఆలోచన, సంకల్పము కలుగుతాయి.దానితో రేణువు కాస్త భౌతిక పదార్ధముగా రూపంతరము చెందుతుంది.ఈ భావ రహిత స్థితికి చేరడమే నిజమైన సంపూర్ణ శూన్యస్థితి అవుతుంది.ఈ శూన్యస్థితిలో సుమారుగా 18 రకాల శూన్యస్థితులు అనగా శూన్యత స్థితి,శూన్య భావ స్థితి,శూన్య స్థితి,మహా శూన్య స్థితి,  పరమ శూన్య స్థితి అంటూ  సాధన స్థితులు ఉంటాయి. అదే శూన్యభావస్థితిని పొందడము అనగా ఇందులో మనస్సు అలాగే భావము మిగిలే ఉంటాయి..ఇది దాటితే మనము పొందేది పూర్ణశూన్యస్ధితి అవుతుంది.”
ఇంతలో...ఒక న్యూస్ విలేఖరి లేచి...”స్వామి! బుద్ధుడి కాలములోనే శూన్యత భావ స్థితిని తట్టుకోలేక చాలామంది బౌద్ధ సన్యాసులు ఆత్మహత్య చేసుకున్నారని విన్నాను నిజమేనా” ?...
“నిజమే నాయనా..శూన్యత వేరు… శూన్య భావ స్థితి వేరు అని ఇపుడు మీరు తెలుసుకున్నారు.కాని ఆయన కాలములో సాధకులకి ఈ తేడా తెలియకనే దేహం అశాశ్వతం-జీవితం అశాశ్వతం అని ధారణ చేసినారు. కనిపించేది అసత్యం అయినప్పుడు కనిపించని శూన్యము సత్యమైనప్పుడు..నేను  లేను..సర్వము శూన్యము అనే శూన్య భావ స్థితి చేరుకొని దానిని తట్టుకోలేక శరీర త్యాగాలు చెయ్యడము ప్రారంభించినారు.దీని నివారణ కోసం ఆనాడు బుద్ధ భగవానుడు ఏకముగా "సర్వ భిక్షు" సమావేశమును పెట్టి శూన్యత భావము గూర్చి భోధన చెయ్యడము జరిగినది.సాధనకి శరీరము ఉండాలని..ఇది లేకపోతే శూన్యత స్థితిని చేరుకోలేమని..మనది అహింసవాదము కాబట్టి ఆత్మహత్య చేసుకోవడము అనేది హింస క్రిందకి వస్తుందని అశాశ్వతం అంటే శరీరం లేకుండా పోవడం కాదని.. ఈ భావన కాస్త పూర్ణ శూన్యత స్థితికి రహదారి గావాల్సి ఉంటుందని శరీరము పైన అలాగే జీవితము పైన ద్వేషము పెంచుకోరాదని నా సూత్రాలను అర్ధము చేసుకోలేకపోతే ఇలాంటి అనర్ధాలు అపార్ధాలు కలుగుతాయని... ఈ సూత్రాలు వినడము కాదని వాటిని వివేకముతో  విశ్లేషించి అన్వయించుకోవాలని చెప్పడము జరిగినది. ఉదాహరణకు చంద్రుని చూపించే వ్రేలు మీద శ్రద్ధ పెడితే అది కాస్త శూన్యత భావ స్థితికి చేరుతుందని..దానిని తట్టుకోవడము చాలా కష్టము అని..అదే వ్రేలు మీద దృష్టి పెట్టకుండా అది చూపించే దిక్కులో ఉన్న చంద్రుడి వైపు చూడటము ఆరంభిస్తే మనస్సుకి ఏర్పడిన శూన్యత భావ స్థితి నుండి అది విముక్తి పొంది మనఃశాంతిని పొందుతూ శూన్యస్థితిని పొందుతుంది.అంటే నేను చెప్పిన సూత్రాలలో సూత్రము చెప్పిన దిక్కులో సత్యాన్ని దర్శించాలి. సత్యాన్ని అన్వేషించాలి.అలాగే సూత్రానికి మరియు ధ్యాన అనుభవానికి మధ్య అతి సున్నిత అంశముగా 18 రకాల శూన్య స్థితులు ఉంటాయని ఎవరికి వారే ఙ్ఞాన సిద్ధి పొంది తెలుసుకొని అనుభవించి ఆనందస్థితిని పొందవలసి ఉంటుందని” చెప్పడము జరిగింది.  
మరో యాత్రికుడు లేచి..”స్వామి!మరి శూన్యత భావ స్థితిని తట్టుకోవడానికి బుద్ధుడు ఏమి చెప్పలేదా?” అనగానే..
“నాయనా!దీనికోసం ఆయన చాలా పరిశ్రమ చేశాడు.ఏదైన అనుభవ అనుభూతి పొందడానికి శూన్యత భావ స్థితి తట్టుకోవడానికి ఆయన ఏకముగా హిమాలయ యోగులను అలాగే శంభలయోగులను కలసి వారి అనుగ్రహముతో సప్త ధాతువులతో ఒక సింగింగ్ బౌలు నిర్మాణము చేశారు..దీని వలన విశ్వములో వినిపించే ఓంకార నాదమును మనము వినగలుగుతాము.అలాగే మనలోని ఓంకారనాదమును వినడానికి మన యోగచక్రాలకు తగ్గట్టుగా ఒక ప్రార్ధన గంటను తయారు చేయడము జరిగినది.దీనిని లయబద్ధముగా మ్రోగిస్తుంటే మన శరీర చక్రాలలో జాగృతి కలిగి మనలో ఓంకారనాదము వినబడుతుంది.ఇలా విశ్వములోని ఓంకారనాదమును అలాగే శరీరములోని ఓంకారనాదమును అనుసంధానము చేయడానికి డోర్జే అనే ఆయుధ పరికరమును తయారు చేయడము జరిగినది.దీని వలన ఈ రెండు నాదాలు అనుసంధానమై ఈ ఓంకారనాదాలు మిళితమై నిశ్శబ్ద నాదమైన తుంకార నాదము వినే స్థితిని సాధకుడు పొందటానికి ప్రేయర్ వీల్ ను తయారు చేయడము జరిగినది.ఈ సాధన పరికరాల వలన సాధకుడికి ధ్యానములో నిద్ర - మెలుకువ గాని మధ్యమ స్థితికి మనస్సు వెళ్ళుతుంది.ఈ స్థితిలో ఎవరైతే 48ని. దాకా ఉండగలుగుతారో వారికి సంపూర్ణ శూన్య స్థితి అనగా మనస్సే లేని స్థితిని పొందటము జరుగుతుంది. గాకపోతే ఈ సాధనస్ధితిని అనుభవజ్ఞానమున్న లామాల సమక్షములో అభ్యాసము చెయ్యాలి.లేదంటే మతిభ్రమణము లేదా శూన్యతభావస్ధితిలో శాశ్వతముగా ఉండిపోయే ప్రమాదముంటుంది.”
ఇంతలో ఒక విలేఖరి లేచి..”స్వామి!ఇంత వివరముగా మీరు చెబుతున్నారంటే బుద్ధుడు దీనిని ఎక్కడైన రహస్యముగా దాచారా? “అనగానే..
“నాయనా!మీరు ఎప్పుడైన ప్రేయర్ వీల్ ను నిశితముగా చూసి వుంటే తెలిసేది.దీని చుట్టూ అష్ట మంగళ వస్తువులలో మూడు వస్తువులకి మూడు రంగుల రత్నాలు అనగా ఎరుపు,తెలుపు,నీలం రంగు రాళ్ళు అమర్చడం ఉంటుంది.అలాగే దీనిలోపల కాగితము చుట్టలో ఓం-మణి-పద్మ-హుం అను గురుమంత్రము 1000 సార్లు రాసి ఉన్న పేపరు చుట్ట కనబడుతుంది.అంటే బుద్ధుడు తాను తెలుసుకున్న ఈ సాధన రహస్యమును ఈ మంత్రములో ఒక కోడ్ గా అమర్చడము జరిగినది.”
అంటే “మీ ఉద్దేశ్యములో ఈ మంత్రార్ధము నిజముగా ఏదైన మణిని సూచన చేస్తుందా?”
“నాయనా!అది నిజము గావచ్చును కాకపోవచ్చును. గాకపోతే 14వ శతాబ్దమునాటి బోధిసత్వుడు, అవలోకితేశ్వర,క్షితిగర్భ బుద్ధుడి అవతారాల ఫోటోలలో వీరి చేతులలో ఒక మణి ఉన్నట్లుగా మనకి కనబడుతుంది.అలాగే 1903-1909 ఈ మధ్య కాలంలో ఉన్న లామా ద్యోర్జి చోగ్యాల్ హిమాలయాలకి ఒక బృందముగా వెళ్ళి రహస్య గ్రామములో ఉన్న మణి ప్రాంతమును కనుక్కోవడము జరిగినది.ఈయన అక్కడికి వెళ్ళి అక్కడున్న మణి దర్శనము పొందడము గూడ జరిగినదని ఆయన ఆత్మకధలో చెప్పడము జరిగినది. లోక క్షేమము దృష్టిలో పెట్టుకొని ఈ మణి రహస్యము లోక విదితము అలాగే ప్రచారము కాలేదు.దానితో అది నిజమో లేక అబద్ధమో తెలియని సంధిగ్దత స్థితికి మాలాంటి వాళ్ళు చేరుకోవడము జరిగినది. మా దృష్టిలో మణి అంటే సహస్ర చక్రములోని అనగా మెదడు మధ్య భాగములో ఉండే పిట్యూటరీ గ్రంధియే ఈ మణిగా భావించడముగా జరుగుతోంది. ప్రత్యక్షముగా అంటే హిమాలయలలోని కైలాస పర్వతమే స్ఫటికమణి.”
 “అవును!పూర్ణ శూన్య స్థితికి సాధకుడు ఎలా చేరుకుంటాడు” అనగానే..
“నాయనా!దీని విధి విధానమంతా బుద్ధ భగవానుడు కాస్త కాల చక్ర నిర్మాణము ద్వారా లోకానికి చెప్పడము జరిగినది.ఈ చక్ర నిర్మాణములో మనకి అయిదు సాధన స్థాయిలుంటాయి.అనగా 1.ఆనందం 2.ఙ్ఞానము3.మనస్సు4.వాక్కు,5.శరీరము పంచస్థితులుంటాయని...మళ్ళీ వీటిలో ఆనంద సాధన స్థాయిలో శూన్యత స్థితి,మార్పు లేని ఆనందం,బ్రహ్మ ఙ్ఞానము,పరిహారము,త్యజించుడము అనే ఉప స్థాయిలుంటాయి.ఈ స్థితులు పొందటానికి అష్ట నియమాలు ఉన్నాయి.అనగా 1.శక్తి 2.ఆకాంక్ష 3.సిద్ధాంతం 4.ఇచ్చుట 5.క్రమశిక్షణ 6.సహనం 7. ఉత్సాహం 8.ధ్యానము అనే సాధనలు ఉన్నాయని తన కాల చక్రము ద్వారా చెప్పడము జరిగినది.అంటే ధ్యానముతో మొదలైన సాధన కాస్త పూర్ణ శూన్యత స్థితి అనే సాధన స్థితితో పూర్తి అవుతుంది” అన్నమాట.  
“స్వామి!ఈ మణి రహస్య చేధన చెయ్యడానికి దారి ఏమిటి?”
“ఇంక ఏముంది.ఓం-మణి-పద్మ-హుం అను గురు మంత్రమే దారి చూపుతుంది. అని అంటూండగా..
ఆ ప్రక్కనే ఉన్న బౌద్ధ మ్యూజియము భవనము నుండి ఒక స్త్రీ మూర్తి భయముతో పెద్దగా….
“శవము..శవము..ఒక బౌద్ధ సన్యాసి శవముగా మ్యూజియము లోపల పడి ఉన్నాడు” అని అరుస్తూ కేకలు వేస్తూ పరుగులు తీయడముతో ……
ప్రసంగము చేస్తున్న దలైలామాకి అక్కడున్న అందరికి ఈ అరుపులు వినబడటముతో అందరూ గూడ ఆమె వైపు ఆందోళనగా చూస్తూ ఆమె చెప్పిన ఆ భవన గది వైపు కొందరు బౌద్ధ సన్యాసులు పరుగుతీశారు..
*** *** *** *** *** ***
మ్యూజియం లోపల నగ్నముగా ఒక బౌద్ధ మత సన్యాసి నిర్జీవముగా పడి ఉన్నాడు.చేతిలో పద్మాకార తాళం చెవి అలాగే గుండెల మీద ఒక డైమండ్ గుర్తు దాని క్రింద ఒక త్రికోణ గుర్తును గాయముతో గీసుకున్నట్లుగా కనబడుతుంది.పైగా తన రెండు కన్నులలో ఒక కన్ను మాత్రమే తెరిచి చనిపోయాడు.
ఈ శరీర స్థితిని దలైలామాతో పాటుగా అక్కడున్న వారంతా పరిశీలించి విశ్లేషించి బాధతో ఆవేదనతో  దలైలామా వెంటనే అక్కడే ఉన్న తన అనుచరవర్గం వారితో 
“పోలీసులకు సమాచారము ఇవ్వమని” అనుఙ్ఞ ఇవ్వడంతో వాళ్ళు ఈ పనిలో బిజీగా ఉండటము జరిగినది.
దలైలామా మరొక్కసారి ఈ శవమును తేరిపారా చూస్తూ అక్కడున్నవారితో ….
“బహుశా ఇతను గూడ శూన్యత భావ స్థితిని తట్టుకోలేక దాని బాధను తన గుండెలమీద ఏదో గుర్తుతో తెలియచేసినారని” చెపుతుండగా 
ఇది విన్న నిర్వాణలామా మాత్రము తన మనస్సులో “ఇది సత్యము గాదని ఈ బౌద్ధ సన్యాసి మరణము ఆత్మహత్య గాదని ఖచ్చితముగా హత్యేనని ఎందుకంటే ఎడమ చేతి బ్రొటనవ్రేలు మాత్రమే లేకపోవడము పైగా 14 వ శతాబ్ధము  నాటి మణియున్న బుద్ధుడి అవతారాల ఫోటోల దగ్గర చనిపోవడము బట్టి చూస్తుంటే మణి రహస్యమును ఇతను తెలుసుకున్నాడని ఇతగాడి శత్రువులెవరో గ్రహించి ఆ మణి రహస్యము కోసము ఇతనిని బాగా వేధించి హింసించి చంపి ఉంటారని తను తెలుసుకున్న ఈ రహస్యమును లోకానికి చెప్పటానికి ఆధారాలుగా తన గుండెలమీద ఉన్న గుర్తులు అలాగే ఎడమ చేతిలోని పద్మాకార తాళం చెవి పెట్టుకొని చనిపోయి ఉంటాడని” గ్రహించి ఏమి జరుగుతుందో మౌనముగా ఎదురుచూడసాగాడు.
ఇంతలో..అక్కడికి హడావుడిగా 
పోలీసు జీపులు సైరన్లు వేసుకొని రావడము అందులోంచి ఎస్.పి.స్థాయి పోలీసు అధికారి దిగడము ఇతనితో పాటుగా సాయుధ పోలీసులు దిగి ఈ శవమున్న చోటులో ఉన్నవారిని దూరముగా ఉంచి ఈ శవము చుట్టూ కంచెలాగా టేపులు వెయ్యడము ఆ అధికారి లోపలికి వచ్చి ఈ శవమును నిశిత దృష్టితో చూడటము క్షణాలలో జరిగిపోయింది.
అక్కడే ఉన్న దలైలామాను చూస్తూ ఈ అధికారి కాస్త “స్వామి! నా పేరు త్రివేది.ఈ ఏరియా ఎస్.పి.ఇది హత్యా లేదా ఆత్మహత్యయా?”
“నాయనా!నాకు తెలిసి ఇది ఆత్మహత్యయే.ఎందుకంటే ఇతను ఆరు నెలలనుండి శూన్యత భావ స్థితి ఎలా దాటుకోవాలో తెలియక పలువిధాలుగా ఆత్మహత్య ప్రయత్నము చేసుకోవడము ప్రారంభించాడు.సమయానికి ఇతర భిక్షులు వీడిని రక్షించడము జరిగినది.అది ఈనాడు తీవ్రస్థాయిలోనికి ఈ భావ స్థితిని పొంది ఉండటముతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని ఉంటాడు “అని అనగానే 
“అయితే స్వామీజీ!మరి ఈయన గుండెల మీద ఏవో గుర్తులు అలాగే చేతిలో పద్మాకార తాళం చెవి ఉన్నది గదా!ఒక వేళ ఈ గుర్తులు బౌద్ధధర్మ చిహ్నాలా? అనగానే.. 
“నాయనా!ఈ గుర్తులకి బౌద్ధధర్మ చిహ్నాలకి ఎలాంటి సంబంధము లేదు.ఇక తాళము చెవి అంటారా?బహుశా అది అతని గది   తాళం చెవి అయ్యి ఉండవచ్చు” అంటూ అక్కడ నుండి దలైలామా కాస్త తన అనుచరగణముతో పోలీసుల కోరిక మేర బయటికి వెళ్ళడము జరిగినది.
అనుమానము తీరని త్రివేది కాస్త..అక్కడున్న ఇతర బౌద్ధ సన్యాసులను ఉద్ధేశించి 
“మీలో ఎవరైనా ఇతని శరీరము మీద ఉన్న గుర్తులను గూర్చి చెప్పగలరా?” అని అడగగానే..
“స్వామి!నేను చెప్పగలను” అంటూ నిర్వాణలామా ముందుకి వచ్చేసరికి 
“స్వామి!మీరు ఎవరని?” అడగగానే 
“స్వామి!నా పేరు నిర్వాణలామా. దలైలామా ప్రసంగము వినడానికి నేను టిబెట్ నుండి రావడము జరిగినది.ఇతని దేహము మీద ఉన్న రెండు గుర్తులలో డైమండ్ గుర్తు ఒక మణికి సంకేతము అయితే త్రికోణ గుర్తు అయితే పంచకోణ నక్షత్రములోని ఒక కోణ సూచన” అని నాకు అనిపిస్తోంది.
“అయితే స్వామి… వీటికి బౌద్ధధర్మానికి ఏమిటి సంబంధము?” అనగానే..
“స్వామి!ఈ గుర్తులను బట్టి చూస్తుంటే బుద్ధుడి అత్యంత విలువైన మణి రహస్యమును ఈయన తెలుసుకొని ఉండి ఉండాలి.ఎందుకంటే ఈ గదిలో మణియున్న బుద్ధుడి ఫోటోల మధ్యనే ఈయన చనిపోవడము జరిగినది.పైగా ఈయన చేతిలో అంతే విచిత్రముగా పద్మాకార తాళం చెవి ఉన్నదని” అనగానే..
అపుడుగాని త్రివేది గది పరిసరాలను చూసి “అవును!ఇతను చెప్పినది నిజమే” అనుకుంటూ 
“స్వామి!మీ దృష్టిలో ఇది హత్య లేదా ఆత్మహత్యా?” అనగానే
“స్వామి!ముమ్మాటికి ఇది హత్యయే.ఎందుకంటే శవము యొక్క ఎడమ చేతికి ఉన్న బొటనవ్రేలును కత్తిరించి తీసుకొని వెళ్ళినట్టుగా ఉంది”అనగానే..
ఆ విషయము ఇంతసేపటివరకు తను ఎందుకు గమనించలేదో అని తిట్టుకొంటూ త్రివేది కాస్త తన మనస్సులో ” కొంపతీసి వీడు సన్యాసి వేషములో ఉన్న సి.బి.ఐ ఆఫీసర్ గాదుగదా” అనుకుంటుండగా 
త్రివేది మనస్సు గ్రహించిన నిర్వాణలామా కాస్త వెంటనే 
“స్వామి!మనస్సు పెట్టి చూస్తే అన్ని రహస్యాలు అర్ధమౌతాయి. దానికి సి.బి.ఐ ఆఫీసర్ కానవసరము లేదు” అనగానే త్రివేది ముఖము మాడ్చుకొని ప్రక్కకు తిరిగాడు.
వీరిద్దరి సంభాషణలు ఎంతో శ్రద్ధా భక్తులతో వింటున్న ఆనందభిక్షువుకి నిర్వాణలామా చెప్పిన విశ్లేషణ బాగా నచ్చి తను ఎన్నాళ్ళనుంచో నిజ ఙ్ఞాన గురువు కోసము ఎదురు చూస్తున్నాడు.అది ఈనాడు నిర్వాణలామా రూపములో తీరబోతున్నదని గ్రహించి..
“స్వామి!నిర్వాణలామా గారు.నా పేరు ఆనందభిక్షువు.ఈ రోజు నుండి మీరే నాకు ఙ్ఞాన గురువులు.నాకు కావలసిన ఙ్ఞాన బోధను అందించగలరు”.
“స్వామి!మీరెవరో నాకు తెలియదు.ఇక్కడ ఎవరికి వారే గురువులు.ప్రత్యేకముగా గురువులుగా ఉండవల్సిన అవసరమే లేదు.ఎందుకంటే ఎవరికివారే స్వయముగా ఙ్ఞానమును సంపాదించుకోవాలని మన బుద్ధ భగవానుడి ఉవాచగదా.”
“అది నిజమే స్వామి. కాని మాలాంటి వాళ్ళు ఈ చనిపోయిన సన్యాసి లాగా శూన్యతభావ స్థితివద్ద ఆగిపోతే..
“మిత్రమా!యోగముంటే యోగి గాక తప్పదు.ఏది ఎపుడు ఎలా ఇవ్వాలో మన ప్రకృతి మాతకి బాగా తెలుసు. అదిగూడ ఎంతవరకు ఇవ్వాలో గూడ తెలుసు.మనము భరించలేని దానిని అది ఏనాడు మనకు ఇవ్వదు.”
“ఇది నిజమే గావచ్చును.కాని మీలాంటి వాళ్ళ సహచర్యము వలన మాలాంటి వారికి సత్ ప్రవర్తన కలుగుతుంది కదా.ఎటూ నన్ను మీరు మిత్రమా” అని అన్నారు గదా.”ఈనాటి నుండి గురు మిత్ర అనుబంధము మన మధ్య ఉంటుంది.అవును కాని “స్వామి!శూన్యత భావ స్థితిని తట్టుకోవడము అంత కష్టమా?” 
“మిత్రమా!
వస్తువు పగిలితే శబ్దం వస్తుంది.
అదే మనస్సు పగిలితే మిగిలేది నిశ్శబ్దము.
దానిని తట్టుకోవడము చాలా చాలా కష్టము. నా భార్య పొందిన శూన్యత భావ స్థితి నుండి పడిన కష్టము తెలుసు కనుక చెప్పగలుగుతున్నాను. అలాగే నేను పొందిన శూన్యత భావ స్థితి నుంచి ఈ స్థితి గురించి చెప్పగలుగుతున్నాను” అంటూ గది నుండి బయటకు వెళ్ళుతుండేసరికి ఆనందభిక్షువు కాస్త ఆనందముతో అనుసరించాడు.    
*** *** *** *** *** *** 
4
మ్యూజియము నుండి బయటికి వచ్చిన నిర్వాణలామా అలాగే ఆనందభిక్షువు కలిసి ప్రక్కనే ఉన్న బోధి వృక్షము క్రింద విశ్రాంతిగా కూర్చొని ఉండగా 
ఆనందభిక్షువుకి ఒక సందేహము వచ్చి 
“స్వామి!మీరు వివాహము అయినట్లుగా మీ భార్య ఏదో బాధ అనుభవించినట్లుగా నిన్న చెప్పారు గదా.వాటి వివరాలు.. “
“మిత్రమా!తెలుసుకొని ఏమి చేస్తావు?నాతో బాటుగా నీవు గూడ బాధ పడతావు.అంతేగదా.”
“స్వామి!ఏదో నాతో చెప్పుకొంటే మీ గుండె బాధ కొంత తీరినట్లే గదా.”
“మిత్రమా!అయితే విను.నా పూర్వ నామము శర్మ.నేను యువ శాస్త్రవేత్తను.సైన్సు ప్రయోగాలు అందులో అంతరిక్ష ప్రయోగాలు అనగా నక్షత్రాలు,గ్రహాల గతులు,బ్లాక్ హోల్స్ మీద వివిధ రకాలుగా ఉండే సిద్ధాంతాలు ఆధారముగా ప్రయోగాలు చేస్తుండేవాడిని.ప్రపంచ సైన్స్ శాస్త్రవేత్తలలో టాప్ 5 లో ఒకడిగా నేను ఉండాలని ప్రతి నిత్యము అనుకొనేవాడిని. మా గురువు స్టీఫెన్ హాకింగ్.   ఈయన రచించిన  కాల చరిత్ర  (A Brief History of Time) అను పుస్తకము చదివి ఈయనకి ఏకలవ్య శిష్యుడని అయిపోయాను.ఈయన శరీరము కదలక పోయిన, అంగాలు పనిచేయక పోయిన ఏ మాత్రము నిరుత్సాహము పడకుండా బాధ పడకుండా భూమి నుంచి అంతరిక్షము దాకా ....బిగ్ బాంగ్ థియరి నుంచి బ్లాక్ హోల్ థియరి దాకా ….. సైన్స్ సిద్ధాంతాలు దాటకుండా వాటిని ఒకదానినొకటి అనుసంధానము చేస్తూ తన ఆలోచనలతో ఎన్నో ప్రయోగాలు చేసిన ఉన్నత వ్యక్తి. ఈయన లాగానే నేను గూడ ఏదో క్రొత్త విషయాన్ని లోకానికి తెలియ చేయాలని నా ప్రయోగాలు ఉండాలని పరితపించేవాడిని.దానితో నేను గూడ బ్లాక్ హోల్స్ మీద ప్రయోగాలు చేయడము ప్రారంభించాను.అవి ఒకదానితో మరికటి అనుసంధానమై ఉంటాయా లేదా ఈ బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళితే చివర ఏమి ఉంటుందని నా ఆలోచన ప్రయోగాలు ఉంటుండేవి.కొన్ని సంవత్సరాల ప్రయోగాల తరవాత ఈ బ్లాక్ హోల్స్ చివర మన భూలోకము లాంటి గోళాలు అనుసంధానింపబడి ఉంటాయని, ఒక్కొక్క హొల్ కి ఒక్కొక్క లోకము ఉంటుందని అందులో మనకి లాగానే జీవరాశి ఉంటుందని, మనవి  వాయు శరీరాలు అయితే వారివి కాంతి లేదా జల లేదా సూక్ష్మ లేదా ఆత్మ శరీరాలతో ఆయాలోకవాసులు ఉంటారని ఈ ప్రయోగాలు నిర్ధారణ చేసుకొనే సమయానికి..
నేను కాస్త ప్రయోగాలకే నా జీవితము ఎక్కడ అంకితము అవుతుందనే భయముతో నా తల్లిదండ్రులు నాకు ఏరికోరి ఒక వెటర్నరి డాక్టర్ తో వివాహము జరిపించారు.ఆమె పేరు ప్రకృతి.పేరుకి తగట్లుగా ప్రకృతి ప్రేమికురాలు.పైగా జంతువులంటే చాలా పిచ్చి.కుక్కలు,పిల్లులు,ఆవులు,గేదెలు,పందులు,పక్షులు ఇలా వీటితోనే సహజీవనము చేస్తుండేది.నేను కాస్త ప్రయోగశాలలో ఎక్కువ సమయము గడిపితే ఈమె మాత్రము జంతువుల మధ్య, మొక్కల మధ్య ఎక్కువ సమయము గడుపుతుండేది.దానితో ఈమె మరీ సున్నిత మనస్కురాలైనది. మొక్కలు లేదా జంతువులు తన చేతిలో చనిపోతే ...మనిషి చనిపోతే ఎలాగైతే ఏడుస్తారో అలా ఏడుస్తుండేది.ఆమెను ఓదార్చడము నా వల్ల అయ్యేది కాదు.కొన్ని రోజుల నుండి కొన్ని నెలలు ఈమె కోలుకోవడానికి సమయము పట్టేది.ఈలోపు నా ప్రయోగశాలలో నేను ఉండిపోయేవాడిని.కొన్ని రోజులు ఆమెతో  మాట్లాడటానికి వీలుకానంతగా నా ప్రయోగశాలలో ఉండిపోయేవాడిని.అది నేను  తెలియకుండా చేసిన తప్పుయని నేను తెలుసుకొనేసరికి నా ప్రకృతి నా చేతిలో లేకుండా పోయే పరిస్థితి ఎదురైనది అంటుండగా..
పోలీస్ జీప్ లు విపరీతముగా హారన్ మ్రోగించుకుంటూ ఈ మ్యూజియము దగ్గరికి రావడముతో..వీరిద్దరు తమ సంభాషణను ఆపి ఎవరు వచ్చినారో తెలుసుకోవాలని ఉత్సుకతతో మ్యూజియము వైపుకు వెళ్ళడము జరిగినది. తీరా అక్కడికి వెళ్ళితే … హత్య జరిగిన బౌద్ధ సన్యాసి కేసు అది హత్య లేదా ఆత్మహత్య యని తెలుసుకోవటానికి ఉన్నత పోలీసుల అధికారులు వచ్చారని వీళ్ళు తెలుసుకొని వెనుతిరిగి తాము ఇందాక కూర్చున చెట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత
*** *** *** *** *** *** 
5
నిర్వాణలామా తన గొంతును సవరించుకొని 
“మిత్రమా.. నా భార్య ప్రకృతికి ఒకసారి తన క్లినిక్ కి ఒక పాప వచ్చి చావుబ్రతుకుల మధ్య ఉన్న ఒక కుందేలు పిల్లను తీసుకొని వచ్చి తన చేతులలో పెట్టి కాపాడమని వేడుకొంది.కాని అపుడికే దాని ప్రాణాలు పోయాయని ఆ పాపకి తెలియదు.దానిని ఎలా చెప్పాలో ఈమెకి అర్ధము గాలేదు.ఇంటికి వచ్చిన ఈమె ఈ సంఘటనను మర్చిపోవడానికి ఆరు నెలలు పైగా పట్టినది.దానితో నేను ఈమెను మంచి సైకాలజిస్టుకి దగ్గరికి తీసుకువెళ్ళి చూపించగా ఈమెకి ఉన్న మానసిక ఆందోళన ఉద్రిక్తత స్థితి తగ్గాలంటే ధ్యానమే సరియైన మార్గమని చెప్పడముతో ధ్యానము నేర్చుకొని అభ్యాసము చేయడముతో ఈమెలో మార్పు రావడముతో నేను కాస్త స్థిమితబడి నా సైన్సు పరిశోధనలలో ఎక్కువ సమయము కేటాయించడము మొదలుపెట్టాను. ఈమె గూడ ధ్యానమునకు ఎక్కువ సమయము కేటాయించినది.
ఇది ఇలాయుండగా..
నా సైన్సు పరిశోధనలలో బ్లాక్ హోల్స్ కి ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాను.కాని అవి ఎక్కడికి అనుసంధానము ఎలా అవుతాయో తెలుసుకొనలేకపోయాను.నా అవస్థను గమనించిన నా భార్య నా కోసము ధ్యానము చేస్తూ నేను చేస్తున్న బ్లాక్ హోల్ ప్రాంతము ఫలాన లోకమునకు వెళ్ళుతుందని..బ్రహ్మాండ పురాణములో ఈ అంశము ప్రస్తావన ఉన్నదని నిరూపించి చెప్పేసరికి నాకు మతిపోయినది.దానితో నా సైన్సు పరిశోధనలు ప్రక్కనపెట్టి ఈ పరిశోధన జయం పొందితే వచ్చే ఫలితాలను ముందుగానే నా భార్య ధ్యానము ద్వారా తెలుసుకోవడము ఆరంభించాను.నాలో ఉత్సాహము కొద్ది ఆమె ధ్యాన కాలమును గంట నుండి 18 గంటల దాకా వెళ్ళిపోయినది.ఇలా అంతరిక్ష రహస్యాలు అలాగే లోకాలు వాటి రహస్యాలు గ్రహ రహస్యాలు ఇలా ప్రతి దానిని తన ధ్యాన స్థితితో నా భార్య తన దివ్యదృష్టితో చూసి చెబుతుండేసరికి వాటిని నేను నోట్స్ రాసుకోవడము మొదలుపెట్టాను.ఇలా సుమారుగా 5 సం.పాటు ఇదేవిధముగా కొనసాగింది.
ఒకరోజు ఉన్నట్టుండి నాతో
“మనిషికి మరణము ఎందుకు వస్తున్నది?మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి?ఎవరి వలన మనిషి ఈ పాపపుణ్యాలు కర్మ ఫలాలు అనుభవిస్తాడు.రోగము,మరణము,ముసలితనము లేని మానవ జీవితమును తాను ఎలాగైనా పొందాలని అది లోకానికి తెలియజేయాలని” 
నాకు తెలియకుండా మెదడు శక్తి మించి ధ్యానము చేస్తుండేసరికి ఒకరోజు “నేను లేను!సర్వము ఏమి లేదు.సర్వము శూన్యము” అనే శూన్యత భావ స్థితికి చేరుకొనేసరికి నాలో తెలియని ఆందోళన మొదలైనది.నాటు వైద్యుడి నుండి విదేశీ డాక్టర్లు వరకు చూపించాను.అలాగే నవ ధాన్యాల నుండి నవరత్నాలతో దానము ఇస్తూ గ్రహ పూజలు చేయించాను.ఇలా ఎన్ని చేసిన గూడ మా ఆవిడ మామూలు యదార్ధస్థితికి రాలేకపోయినది. ఉన్నట్టుండి పెద్దగా ఏడ్వడము, నవ్వడము, బాధపడటము,కొట్టుకోవడము,కొట్టడము,పూనకమువచ్చిన దానిలాగా దెయ్యం పట్టిన దానిలాగా ప్రవర్తిస్తూ వచ్చేది. దానితో ఈమెను తీసుకొని భారతదేశ తీర్ధ యాత్రలు చేశాను.అన్ని నది స్నానాలలో స్నానాలు చేయించాను. ఉపశమనం లేదు.ఉపాయము లేదు.దానితో ఏమి చేయాలో ఎలా చేయాలో తెలియక నేను గూడ నాకు తెలియకుండానే శూన్యత భావ స్థితిలోనికి ప్రవేశించాను.
ఇలాంటి సమయములో నాకు కాశీ క్షేత్రము నందు జరుగుతున్న కుంభమేళాకి వచ్చే నాగ సాధువులలో ఒకరు మా ఇద్దరిని తేరిపారా చూసి “ఓరేయి!పశువుల్లారా!మీ అత్యాశకి హద్దు పద్దు ఉండదా?మానవ మెదడు 48ని. మించి ధ్యాన స్థితిని తట్టుకోలేదు గదరా.శివ పురాణము ఈ విషయము మీకు చెబుతుంది కదరా.అయినా ఏనాడైన మీరు వేదాలు,పురాణాలు చదివారా!మీకు తెలియడానికి అన్నట్లు..దీనికి పరిష్కార మార్గముగా హిమాలయాలలో ఉండే రహస్య గ్రామములోని మణి యొక్క పంచామృత అభిషేక జలమును ఈమెకి పట్టిస్తే గాని ఈమె మామూలు స్థితికి రాదు.దీనికి నీకు 108 రోజుల సమయమే మాత్రము ఉన్నది. ఆ సమయములోపల ఈ మణి తీర్ధమును ఈమెకి అందించకపోతే బ్రతికున్న శవములాగా మారిపోతుంది.అపుడు ఏ భగవంతుడు ఈమెను రక్షింపలేడు.ళే!వెళ్ళు!ఆ గ్రామమును చేరుకో!సర్వేశ్వరుడి అనుగ్రహము పొందు”అంటూ పెద్దగా అరుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
దానితో ఈ మణి గూర్చి అలాగే రహస్య గ్రామము గూర్చి అందరిని విచారణ చేస్తూ ఎవరికి తెలియదని చెబుతుండేసరికి విచారపడుతూ బౌద్ధగయలోని బుద్ధుడి బోధి వృక్షమును దర్శించుకోవడానికి వచ్చాము.ఆ సమయములో బౌద్ధ భిక్షువులు చేసే మణి మంత్రమును వినగానే..అలాగే వీళ్ళలలో 1903-1909 సం.కాలములో లామా ద్యోర్జీ చోగ్యాల్ మరియు మిత్ర బృందము కలసి హిమాలయాలలోని రహస్య గ్రామమునకు వెళ్ళి ఈ మణి దర్శనము పొందినాడని ఎవరో లామా చెప్పేసరికి నాలో ఉత్సాహము బయలుదేరి మేమిద్దరము ధర్మ దీక్ష తీసుకొని బౌద్ధధర్మములోకి అడుగుపెట్టాము. కాని నా శూన్యత భావ స్థితి కాస్త బుద్ధుడు చెప్పిన దైవిక వస్తువుల సాధనతో తొలగించుకున్నాను గాని మా శ్రీమతి యొక్క శూన్యత భావ స్థితి  వేరని ఆమె కాస్త 17వ స్థితియైన మూల శూన్య  స్థితికి చేరుకున్నదని ఆపై 18వ స్థితికి వెళ్ళితే ఈ దేహ జన్మకి విదేహ ముక్తి కలుగుతుందని అదే వారి భాషలో మహానిర్వాణమని చెప్పడము దీని పరిష్కారముగా హిమాలయాలకి దగ్గర సానువులలో టిబెట్ ప్రాంతముండుట వలన అక్కడ ఉండే రహస్య గ్రామములోని మణి ప్రభావము అంతా ఈ సానువులలో చూపుతుందని చెప్పడముతో మా భార్యను అక్కడున్న బౌద్ధ ఆశ్రమములో చేర్పించి నేను కాస్త బౌద్ధగయకి చేరుకొని ఈ మణి శోధన పరిష్కారము చూపమని మా బుద్ధ భగవానుడిని వేడుకోవడము తప్ప ఏమి చెయ్యలేకపోయాను. కొన్ని నెలలు తర్వాత నాకు అనుకోకుండా ఈయన అనుగ్రహము వలన బుద్ధుడు స్వయంగా రచించిన కాలచక్ర తంత్రములో హిమాలయములో ఉండే శంభలగ్రామ రహస్య దారి ఉన్న అతిపురాతన తాళపత్ర గ్రంథము దొరికింది.వీటి ద్వారా వెళ్ళితే శంభల గ్రామములో ఉన్న చింతామణికి వెళ్ళవచ్చునని ఇక్కడున్న కొంతమంది వృద్ధ లామాలు నాకు చెప్పడము జరిగింది.దానితో నేను కాస్త మా ఆవిడిని తీసుకొని ఎలాగైన హిమాలయ పర్వతములో ఉన్న ఆ రహస్య గ్రామములో ఉన్న మణితీర్ధమును నా భార్యకు ఒక నెలరోజుల లోపుల త్రాగించాలి.అందుకని నేను త్వరలో తక్లాకోట్ లోని మాట్లాడే విగ్రహామూర్తి అయిన ఖోజార్ నాథ్ ఆశీస్సులు తీసుకొని అక్కడ నుండి కైలాస పర్వతమునకు చేరుకొని అక్కడ ఉన్న రహస్య గ్రామమైన శంభల గ్రామమునకు చేరుకొని చింతామణి దర్శనము పొంది ఆ తీర్ధమును మా ఆవిడ చేత త్రాగించాలని అనుకుంటున్నాను.అందుకని మా ఆవిడిని తక్లాకోట్ కి తీసుకొని మూడురోజులలో రమ్మని మా వాళ్ళకి చెప్పాను. రేపు ఉదయమే నా హిమాలయ యాత్ర ప్రారంభమవుతుంది అనగానే 
ఆనందభిక్షువు వెంటనే “గురూజీ..మీతోపాటే నేను గూడ వస్తాను. మీరు, మా గురుమాత ఎక్కడ ఉంటే నేను గూడ అక్కడే ఉంటాను” అనగానే
అనుకున్నట్లుగానే వీరిద్ధరుగూడ హిమాలయాల యాత్రకి బయలుదేరారు.
*** *** *** *** *** *** 
6
నిర్వాణలామా బృందము మణికైలాష్ పర్వతము నుండి కైలాస పర్వతములో ఉన్న శంభల గ్రామములో చింతామణి దర్శనము కోసము అటువైపుగా ప్రయాణించడము మొదలుపెట్టారు.కాని వీళ్ళకి తెలియని విషయము ఏమిటంటే తాము అంతాగూడ చాలా చాలా డీప్ హిమాలయ ప్రాంతాల వైపు వెళ్ళుతున్నామని..అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ -18 డిగ్రీల నుండి -72 డిగ్రీలగా ఉంటుందని.. ఈ ఉష్ణోగ్రతలలో మానవశరీరము మనుగడ సాగించలేక మంచుకి బిగిసిపోయి కట్టెలాగా మారుతుందని పాపము వీళ్ళలకి తెలియదు.ఇలాంటి ప్రయాణాలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవ జ్ఞానుల సహాయము తీసుకొవాలని మన పెద్దల ఉవాచ.ఎవరు వింటారు.ఎవరికి తోచింది వారు చేస్తారు గదా.ఇలా వీళ్ళుగూడ చేస్తున్నారు.
ఇంతలో ఆనందభిక్షువుకి ఒక సందేహము వచ్చి “గురూజీ..అసలు నిజముగానే శంభల గ్రామము ఉన్నదా?దీనిని చూసినవాళ్ళు ఎవరైనా ఉన్నారా?” అడగానే..
”మిత్రమా..
శంభల గ్రామస్య ముఖ్యస బ్రహ్మణస్య మహాత్మన:
భవనే విష్ణుయశస: కల్కి ప్రాధుర్భవిష్యతి
అంటే దీని అర్ధము విష్ణుమూర్తి యొక్క దశమ అవతారమైన కల్కి భగవానుడి అవతార ఆరంభ స్ధానమే శంభల గ్రామమని మనకి స్వయంగా విష్ణుపురాణము చెపుతోంది.ఇదేగాకుండా రామాయణములోని బాలకాండలో విశ్వామిత్ర మహాముని సిద్ధాశ్రమము ఉన్న ప్రాంతం అలాగే పాండవులు చేసిన యాగాలకి అనంత సంపదలు సమకూర్చిన రహస్యగ్రామమే అయిన ఈ శంభల గ్రామము అని మనకి రామాయణము,మహాభారత ఇతిహాస గ్రంథాలు చెపుతున్నాయి.పైగా ఈ గ్రామ ప్రస్తావన మన బౌద్ధధర్మానికి చెందిన కాలచక్ర తంతులో ఏకముగా ఈ నగర ప్రవేశ దారినే మన బుద్ధుడు పెట్టాడు గదా.దీనిని ఆధారము చేసుకొని ఫ్రాన్స్ కి చెందిన డేవిడ్ నీల్ అనే ఆవిడ ఈ నగర సంచారము చేసి అక్కడున్న శంభలయోగుల ఆశీస్సులు పొందివచ్చి 101 సం.రాలు పైగా ఆరోగ్యముగా జీవించినదని మన టిబెట్ లామాలు చెప్పుకోవడము నేను విన్నాను.
1920 సం.లో రష్యాకి చెందిన సైనికబృందము ఈ నగరమునకు గూర్చి అన్వేషించినారని తెలుసుకొని 1930 సం.లో జర్మనీ నేత అయిన హిట్లర్ కాస్త హెన్రిచ్ ఇమలర్ నేతృత్వములో ఒక బృందమును ఈ నగర పరిశోధన కోసము నియమించడము జరిగింది.వీళ్ళు ఈ గ్రామవాసులలో కొంతమందిని కలుసుకొని వాళ్ళు ఉపయోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ విజ్ఞానము వీళ్ళు పొంది ఇక్కడికి వచ్చినారని అలాగే వాళ్ళు నిత్యము పూజించే బ్రహ్మచింతామణి మీద ఉన్న స్వస్తిక్ గుర్తును హిట్లర్ కాస్త తన జెండా గుర్తుకు ఉపయోగించుకోవడము జరిగినదని ఒక కథనం ప్రచారములో ఉంది. మేడం బ్లవట్ స్కీ అనే యోగిని ఈ నగరమును ప్రత్యక్షముగా చూడటము జరిగినదని అక్కడ ద్వాపరయుగము నాటి మనుష్యులను చూడటము,వారితో మాట్లాడము,వారితో ఫోటోలు దిగడము జరిగినదని వీటిని రహస్య సిద్ధాంతం [The Secret Doctrine] అను తన పుస్తకములో వివరించడము” జరిగింది. 
ప్రకృతి వెంటనే “స్వామి..ఈ శంభల గ్రామములో పరిశోధన చేసే ప్రత్యేకతలు ఏమి ఉన్నాయి” అనగానే
“ప్రకృతి.ఇపుడు మన భూమ్మీద ఉన్న టెక్నాలజీకి సుమారుగా నాకు తెలిసి 10లక్షల కోట్ల సం.లు వాళ్ళు అడ్వాస్ టెక్నాలజీని వాడుతున్నారని నా పరిశోధనలో తెలుసుకున్నాను.అంతెందుకు గంగానది కుంభమేళాకి వచ్చే నాగసాధువులు గూర్చి నేను తెలుసుకున్న ఒక విషయము చెపుతున్నాను.వీళ్ళు మనకి 12సం.రాలని వచ్చే కుంభమేళాకి వీరంతా గుంపులు గుంపులుగా తండోపతండాలుగా సుమారుగా ఒకేసారి 18లక్షల నుండి 36 లక్షల దాకా ఒకే గుంపుగా వచ్చి మొదటి స్నానము చేసి వెళ్ళిపోతారు.విచిత్రము ఏమిటంటే ఇన్ని లక్షల మంది ఒక గుంపుగా వచ్చినను మనకి ఎక్కడ ట్రాపిక్ సమస్య రాకపోవడము పైగా వీళ్ళు ఎలా ఏమి ఎక్కి వస్తారో ఇపుడివరకు ఎవరికి తెలియదు.ఎందుకంటే ఇంతమంది రైళ్ళు లేదా విమానాలు లేదా బస్సులు లేదా ఇతర వాహనాలు ఎక్కి వచ్చినట్లుగా ఎక్కడ మనకి కనిపించదు.నదీ స్నానము చేసే ముందు ఉన్న ఈ లక్షల గుంపు ఈ స్నానము అయిన తర్వాత ఈఈ గుంపు ఎక్కడికి ఎలా వెళ్ళతారో ఇంతవరకు తెలియదు.నా పరిశోధనలో వీళ్ళు సరిగ్గా నదీస్నానానికి రెండు కి.మీ దూరములో కనపడతారు. స్నానము చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఒక కి.మీ దాకా కనపడి ఆపై కనిపించకుండా పోతారు.అంటే వీళ్ళు సూక్ష్మశరీరయానముతో హిమాలయాల నుండి వచ్చి స్నానాలు చేసుకొని తిరిగి తమ స్వస్ధలాలకి వెళ్ళిపోతారని నేను తెలుసుకొని ఆశ్చర్యము చెందాను.అంటే వీళ్ళకి ఈ నానో టెక్నాలజీని ఎక్కడి నుంచి తెలుసుకున్నారని అనుకున్నపుడు వీళ్ళకి మాత్రమే ఎపుడు గావలంటే అపుడు రహస్యగ్రామాలైన శంభల గ్రామము దర్శనానికి వెళ్ళివస్తుంటారని మన బుద్ధుడు ప్రతిపాదించిన కాలచక్ర తంతులో చెప్పిన జ్ఞాన నిర్మాణములో ఉన్న 16 స్తంభాలలో నాలుగు స్తంభాలకి నాలుగు నల్లని కత్తులు ఉంచడము అనేది ప్రతి నిత్యము ఆయుధాలుగా  ఖడ్గము లేదా త్రిశూలము లేదా గద లేదా మహా శంఖం ధరించే నాగాసాధువుల గూర్చి చెప్పడము జరిగినదని నేను తెలుసుకున్నాను.అందరు అనుకున్నట్లుగా ఈ సంప్రదాయము ఆదిశంకరాచార్యుడి నుండి రాలేదు అంతకు ముందే ఉన్నదని దానిని ఈయన వెలుగులోనికి తీసుకొని వచ్చి అభివృద్ధి చేశారని నాకు అర్ధమైంది. అంటే ఈ నాగసాధువులు కాస్త శంభలయోగుల ద్వారా ఈ నానో టెక్నాలజీని పొందారని మనకి ఖచ్చితముగా తెలుస్తోంది గదా.ఇది వీళ్ళలకి అతి చిన్న విషయము గావచ్చును కాని మనకి అంతుబట్టని రహస్యాలలో ఇది ఒకటిగా మిగిలిపోయింది.ఇంతటి టెక్నాలజీని పొందాలని హిట్లర్ ఏకముగా ఒక సభ్యుల బృందమునే ఏర్పాటు చేసి విశ్వ ప్రయత్నాలు చేశాడంటే ఈ గ్రామములో పరిశోధన చెయ్యడానికి మనము ఊహించని... కలలో గూడ అనుకొని ఎన్నో ప్రత్యేకతలు ఉండి ఉంటాయి గదా.అంతెందుకు శంభల గ్రామవాసులు పూజించే సప్తధాతువుల నిర్మిత పాదరస చింతామణి నుండి విశ్వశూన్యములో వినిపించే ఓంకారనాదము వస్తోందని ఈ గ్రామ దర్శనము చేసిన మన బుద్ధభగవానుడు కాస్త ఈ సప్తధాతువులతో సింగింగ్ బౌల్ తయారుచేసి దానిని నుండి 7mhz ఉన్న విశ్వ ఓంకారనాదము వచ్చేటట్లుగా నిర్మాణము గావించాడు గదా.దానితో ఈ సింగింగ్ బౌల్ కాస్త శాంతి బౌలు అయినది గదా.ఇంక ఇంతకన్నా మనకి ఏమి నిదర్శనాలు గావాలో ఆలోచించు” అనగానే
ఆనందభిక్షువు వెంటనే “గురూజీ.ఈ రహస్యగ్రామము ఇపుడు ఎక్కడ ఉన్నదో” అనగానే 
“మిత్రమా…..మనకి దొరికిన తాళపత్రాలలో ఉన్న ప్రాంతాల పేర్లు ఇక్కడ ఇపుడున్న వాటి కొత్తపేర్లులకి ఏలాంటి సంబంధము కనిపించడము లేదు.దీని ప్రకారము చూస్తే గోబి ఎడారి ప్రాంతములో ఉన్న రహస్య సొరంగమార్గము ద్వారా వెళ్ళితే కైలాస పర్వతము అడుగుభాగమునకు చేరుకుంటుందని ఈ మార్గము ద్వారా మన బుద్ధభగవానుడు వెళ్ళి ఈ గ్రామదర్శనము చేసుకున్నాడని ఈ తాళపత్రాలు చెపుతున్నాయి.కాని ప్రస్తుతము ఈ మార్గము ఇపుడు అక్కడ ఎక్కడ ఉన్నదో ఎవరికి తెలియని పరిస్ధితి.కేవలము అక్కడ ప్రస్తుతము ఈ రహస్య గ్రామ నమూనాల సిమెంట్ కట్టడాలు మరియు ఆశ్చర్యముగా ఎరుపు,పసుపు రంగుల దేవాలయాలు అలాగే సహజసిద్ధమైన ధ్యానగుహలు మనకి ఇక్కడ కనపడతాయి.ఆ తర్వాత ఈ శంభల గ్రామదర్శనానికి మరో మార్గముగా మనకి ఎవరెస్ట్ శిఖరమునకు వాయువ్యదిశలో ఉన్న సరస్వతినది మంచుమైదానము అడుగు ఉన్న సొరంగమార్గము ద్వారా వెళ్ళితే మనము కైలాస పర్వతము అడుగుభాగమునకు చేరుకోవచ్చును.అలాగే మరో మార్గముగా మన బౌద్ధలామాల అభిప్రాయము ప్రకారము అయితే కైలాస పర్వతమునకు ఈశాన్యముగా ప్రవహించే గోముఖ మంచు జలపాతానికి ఈశాన్యములో ఉండే మంచు పర్వతాల మధ్య ఉన్న మంచులాంటి స్ఫటికమందిరములోనికి వెళ్ళితే అక్కడ ఉన్న సొరంగమార్గము ద్వారా వెళ్ళితే మనకి కైలాస పర్వత అడుగుభాగములోనికి చేరుతాము.వీటిలో నాకు తెలిసి ఎవరెస్ట్ శిఖరము దగ్గర ఉన్న సరస్వతినది మార్గము ద్వారా వెళ్ళడానికి మనకున్న తాళపత్రాల ఆధారాలున్నాయి” అనగానే
 ప్రకృతి వెంటనే “స్వామి..మరి మనము ఈ మార్గము ద్వారా వెళ్లవచ్చుగదా” అనగానే..
“ప్రకృతి..మనము ఈ మార్గములోనే వెళ్ళితే కాని శంభల గ్రామ దర్శనాలు అవ్వవు.కాని ఈ ప్రయాణము అంతాగూడ పద్మవ్యూహము లాంటిది.మనకి ఉన్న ఆధారాల ప్రకారము చూస్తే మనకి నాగసాధువు,మంచు జంతువులు,మహా చౌహాన్ దర్శనం,మాట్లాడే ఖోజార్ నాథ్ దర్శనం,యతి దర్శనం,సప్తచిరంజీవి దర్శనం ఆపై దేవత పుష్పవనము దర్శనాలు అయితే కాని మనము ఈ రహస్యగ్రామాకి చేరుకోలేము.ఇవి అన్నిగూడ జరుగుతాయో లేదా ఎలా జరుగుతాయో ఎవరికి వారే స్వానుభవాల బట్టి మారుతుందని..ఇందులో వీళ్ళు పెట్టే దర్శన అనుగ్రహ మాయలలో పడిపోయి ఆగిపోయిన వారు ఎందరో ఉన్నారని నా పరిశోధనలో తెలిసింది.మనకి ఈ మార్గము తప్ప వేరే అవకాశము లేదు.ఏమి జరుగుతుందో మనకి తెలియని పరిస్ధితి” అనగానే 
ఆనందభిక్షువు వెంటనే “గురూజీ..మీరు చెప్పిన వ్యక్తులు మరియు జంతువులు అనగా మంచుపులి,మంచు ఏనుగు,మంచుసింహము బలిష్ట వ్యక్తి గాలిగోపురాలు మోస్తు ఉన్నట్లుగా అలాగే దేవతలు ఉన్నట్లుగా మరియు దేవత పుష్పాలు,మణులు,దోర్జీలు,అమరికలను మన కాలచక్రతంతులో అమర్చి ఈ రహస్యగ్రామకి వెళ్ళేటపుడు వచ్చేవాటిని ఈ విధంగా అమర్చి ఉంటారని నాకు అనిపింస్తోంది” అనగానే 
“ఇది నిజమే” అంటూ నిర్వాణలామా అనేసరికి ఈ ముగ్గురు కలిసి మాట్లాడే ఖోజార్ నాథ్ విగ్రహమూర్తి ఉన్న తక్లాకోట్ ప్రాంతము వైపు నడకయాత్ర కొనసాగించారు.
ఇలా వీళ్ళు సుమారుగా మూడు మైళ్ళు నడిచి వెళ్ళుతున్నపుడు 
వీళ్ళకి అనుకొని అతిధి లాగా 
నగ్న విభూదిధారి….చేతిలో ఒక త్రిశూలము,మరొ చేతిలో ఒక మహా శంఖమును పట్టుకొని గట్టిగా దానిని ఊదుతూ నాగసాధువు వీళ్ళ ముందు దర్శమిచ్చి హిందీ భాషలో ఈ బృందమును చూస్తూ పెద్దగా 
“ఒరేయి మానవ పశువులు లారా..ఏటు వెళ్ళుతున్నారు.దట్టమైన మంచులో మీ శరీరాలు గాలిలో కలిసి పోతాయి.ఉష్టము లేక చలికి గడ్డ కట్టి చనిపోతారు.ఇటు రండి” అనగానే 
నిర్వాణలామా బృందము ఈయన దగ్గరికి వెళ్ళి నమస్కారము చేసి హిందీలో తను ఎక్కడికి వెళ్లుతున్న విషయము చెప్పగానే “అయితే మీరు తెలుగు వాళ్ళా? పైగా రహస్య గ్రామ దర్శనానికి వెళ్ళుతున్నారు.ఇలా వెళ్ళితే మీ శరీరాలు నాశనమవుతాయి.అందుకు నా దగ్గర ఉన్న మూలికలు మీకు అవసరపడతాయి.ఇవి మీకు గావాలంటే నాకు మీ తెలుగు సాహిత్యములో శ్రీనాధుడు ఒక వేశ్యకాంతతో చెప్పిన పద్యమునకు ఆ వేశ్యకాంత చెప్పిన సమాధాన పద్యము యొక్క అర్ధము నువ్వు చెప్పాలి”
అంటూ వేశ్యకాంతతో శ్రీనాధుడు అన్న పద్యము అంటూ
"పర్వతశ్రేష్ట పుత్రిక పతి విరోధి,
అన్నపెండ్లాము అత్తను గన్న తండ్రి
ప్రేమతోడుతవానికి పెద్ద బిడ్డ!
సున్నమిప్పుడే తేగదే సన్నుతాంగి!"
అనగనే దీనికి ఆ వేశ్యకాంత  ఈయనికి ఒక పద్యము రూపములో ఈ విధంగా సమాధానము చెప్పింది. ఆ పద్యము ఏమిటంటే

"శతపత్రంబులమిత్రుని
సుతుజంపినవానిబావ సూనుని మామన్
సతతము తలదాల్చిన శివ
సుతు వాహన వైరి వైరి సున్నంబిదిగో"
 అని చెప్పగానే ఈ కవిసార్వభౌముడు ముక్కున వేలువేసుకొని ఎంత మాట అంది అని ఎందుకు అన్నాడో ఇపుడు నాకు చెప్పు” అనగానే... 
దానికి నిర్వాణలామా గూడ చిరునవ్వు నవ్వి “స్వామి.అసలు శ్రీనాధుడు ఆమెతో ఏమి అన్నాడంటే “ఓ దర్రిదపు దానా.. సున్నము తీసుకొని రావే” అన్నాడు.దీనికి ఆమె అంతే సమాధానముగా “ఓ కుక్కా..ఇదిగో సున్నము అంటూ” సమాధానమిచ్చింది.
 నాగసాధువు వెంటనే” ఈ పద్యాలు చూస్తూంటే ఇలాంటి అర్ధములు ఎలా వస్తాయి” అనగానే
“స్వామి..మీకు వివరముగా చెపుతున్నాను. శ్రీనాధుడు చెప్పిన పద్యమును విశ్లేషణ చేస్తే అనగా 
పర్వతశ్రేష్ట పుత్రిక అనగా పర్వతాలలో శ్రేష్ఠుడైన హిమవంతుని కూతురు పార్వతి..
పతి విరోధి  అంటే పార్వతి పతి శివుడు.ఈయన విరోధి అంటే మన్మధుడు. 
అన్న పెండ్లాము = మన్మధుడు అన్న బ్రహ్మ..ఈయన భార్య సరస్వతి.
అత్తను గన్న తండ్రి = అంటే సరస్వతి అత్త మహాలక్ష్మీ.ఈమె కన్న తండ్రి అంటే సముద్రుడు..
ప్రేమతోడుతవానికి పెద్ద బిడ్డ అంటే సముద్రుడు ప్రేమతో కన్న పెద్ద బిడ్డ జ్యేష్ఠదేవి..మరి ఈమెను దరిద్రదేవత అంటారు.అంటే ఓ దర్రిదపు దానా… సున్నము తీసుకొని రావే అన్నట్లే గదా.
దీనికి సమాధానముగా ఈ వేశ్యకాంత చెప్పిన పద్యమును విశ్లేషణ చేస్తే అనగా 
శతపత్రంబుల మిత్రుడు అంటే తామరపుష్పాలకి మిత్రుడు సూర్యుడు.. 
సుతుజంపినవానిబావ అంటే... సుతు అంటే సూర్యకుమారుడు కర్ణుడు..చంపినవాని బావ అంటే కర్ణుడిని చంపినవాడు అర్జునుడు.మరి ఈయన బావ అంటే శ్రీకృష్ణుడే గదా. 
సూనుని మామన్ =శ్రీకృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుని గదా. ఈయన మామ అంటే చంద్రుడు గదా.
మామ సతతము తలదాచ్చిన శివ అంటే చంద్రుడిని నిత్యము తలలో ధరించేవాడు శివుడే గదా.
సుతు వాహన వైరి వైరి అంటే శివుడి కుమారుడు గణపతి.ఈయన వాహనము ఎలుక..దీని శత్రువు పిల్లి..మరి దీని శత్రువు కుక్కయే గదా.  కుక్కా..ఇదిగో సున్నము అన్నట్లే గదా.”
నాగసాధువు వెంటనే “చాలా బేషుగ్గా విశ్లేషణ చేసి సరిగ్గా నేను అడిగిన పద్యాలకి సమాధానము చెప్పావు.నీ విశ్లేషణ తాత్విక తార్కిక వివేకబుద్ధి ఎలా ఉన్నదో అని ఈ పరీక్ష పెట్టాను.ఒకటి బాగా గుర్తుంచుకో..ఈ గ్రామముకి నీవు వెళ్ళుతున్న దారిలో ఇలా ఎన్నో మర్మరహస్యలను నీకున్న వివేకబుద్ధితో దాటుకోవాలి.నీకు ఈ గ్రామ దర్శనమునకు అర్హత,యోగ్యత ఉన్నాయి.ఇదిగో ఈ వేర్లు మీ పంటి కింద పెట్టుకొని రసమును పిలుస్తూ ఉండాలి.ఇలా ఇది 41 రోజుల మాత్రమే ఈ వేరు ప్రభావము ఉంటుంది.ఆ తర్వాత ఈ వేరు మీకు పనిచెయ్యదు.అంటే ఈ లోపులే మీరు అనుకున్న చోటుకి వెళ్ళాలి.అపుడిదాకా ఈ వేరు రసము అధిక  చలి నుండి రక్షిస్తుంది.అలాగే మీకు అడ్డుగా కంటికి కనిపించని అదృశ్యశక్తులను చూపిస్తుంది.వాటిని ఎలా దాటుకోవాలో అప్పటి పరిస్ధితులను బట్టి మీరే నిర్ణయించుకోవాలి అంటూ హర ఓం..సాంబ..ఓం నమ:శివాయ అంటూ ముందుకి వెళ్ళి అదృశ్యమయ్యే దృశ్యము చూసిన ఆనందభిక్షువుకి, ప్రకృతికి నోటమాట రాలేదు.ఇలాంటి నాగసాధువుకి కామరూప విద్య,అదృశ్యవిద్య,ఆకాశయానం,పరకాయప్రవేశ విద్య లాంటి ఎన్నో విద్యలు చాల చిన్నవి.అదే మానవులకి అంతుపట్టని విద్యలు అంటూ నిర్వాణలామా అనగానే ఈ బృందము ముందుకు బయలుదేరారు.
*** *** *** *** *** *** 
7
వీళ్ళు ఇలా ముందుకి వెళ్ళుతుండగా ప్రకృతి వెంటనే “స్వామి..మన బుద్ధుడు ప్రతిపాదించిన కాలచక్రము ద్వారా ఎవరో శంభల గ్రామ దర్శనమునకు వెళ్ళారని చెప్పారు గదా.అది ఎలా సాధ్యం” అనగానే..
“ప్రకృతి..మనకి కాలచక్ర నిర్మాణములో అయిదు సోపానాలు కనపడతాయి.అంటే దీనిని క్రిందకి నుండి పైకి  ఒకసారి చూస్తే మనకి మొదట ఆరు వృత్తాలు కనపడతాయి.ఆ తర్వాత నాలుగు ద్వారాలున్న గాలిగోపురాల నిర్మాణము కనపడుతుంది.దీనిని శరీరం (body) అంటారు. ఈ గాలిగోపురాలను మోస్తూ మనకి మంచు ఏనుగులు, మంచు సింహాలు, బలిష్ఠమైన మంచు మనుష్యులు కనపడతారు.అలాగే వీరి మధ్య కాంతిశరీర దేవతలు కనపడతారు.అలాగే ఖరీదైన ఆభరణాలు, రత్నాలు,మణులు ఉన్నట్లుగా మనకి కనపడతాయి. ఈ నిర్మాణ మూలాలలో మనకి డబుల్ దోర్జీలుంటాయి.దీనిపైన ఇలాంటి నిర్మాణమే మళ్ళీ కొంచెము తక్కువ పరిమాణములో మరొకటి కనపడుతుంది.దీనిని వాక్కు (speech) అంటారు.దీనిపైన ఇలాంటి నిర్మాణమే మళ్ళీ కొంచెము తక్కువ పరిమాణములో మరొకటి కనపడుతుంది.దీనిని మనస్సు (mind) అంటారు. ఆ తర్వాత మనకి మూడు పొరలుండి సీలింగ్ ఉన్న 16 స్తంభాల నిర్మాణము ఉంటుంది.దీనిలో నాలుగు స్తంభాలలో నాలుగు నల్లని కత్తులు మరో నాలుగు స్తంభాలలో నాలుగు ఎరుపు రత్నాలు మరో నాలుగు స్తంభాలలో నాలుగు పసుపు ధర్మచక్రాలు అలాగే ఆఖరికి నాలుగు స్తంభాలలో నాలుగు తెల్లని పద్మాలుంటాయి. ఈ 16 స్తంభాల మధ్యలో ప్రతి రెండు స్తంభాల మధ్యలో అనగా ఎనిమిది స్తంభాలకి ఎనిమిది తెల్లని పద్మాలుంటే మిగిలిన ఎనిమిది స్తంభాల సీలింగ్ మీద ఎనిమిది ఎరుపు పద్మాలుంటాయి.అలాగే క్రింద ఉన్న ఎనిమిది తెల్లని పద్మాలలో రెండు రంగుల మిళితమైన ఎనిమిది బిందులుంటాయి.అలాగే ఈ పద్మాల ప్రక్కనే ఎనిమిది తెల్లని కూజా(vases) నిర్మాణములుంటాయి.ఈ అంతటి నిర్మాణమును జ్ఞానం (wisdom) అంటారు.ఆ తర్వాత మనకి మూడు పొరలుండి నలుచదర నిర్మాణము మూలలో నాలుగు బిందువులు ఉన్న నిర్మాణము కనపడుతుంది.ఈ నాలుగు బిందువులు వరుసగా మనస్సు,వాక్కు,జ్ఞానం,శరీరం సంకేతముగా నల్లని ముత్యం , శంఖము,ఒక వంశ వృక్షం,పద్మం కనపడతాయి.ఈ నిర్మాణము పైన మనకి ఒక అష్టదళ పద్మముంటుంది.దీనిలో ఎనిమిది బిందువులుంటాయి.వీటి సంకేతాల ప్రకారము చూస్తే శక్తి(power), ఆకాంక్ష(aspiration), సిద్ధాంతము(method), ఇచ్చుకొనేగుణము(giving), క్రమశిక్షణ(discipline), సహనం(forbearance),ఉత్సాహం(zeal),ధ్యానము(meditation) అని చెప్పడము జరుగుతుంది.ఈ పద్మమునకు మధ్యలో మళ్ళీ మనకి అయిదు పొరలున్న గుండ్రని పీఠము కనపడుతుంది. ఈ అయిదు పొరలు సంకేతముగా కేతు, రాహు, సూర్యుడు, చంద్రుడు,కమలం ఉంటాయి.వీటిలో కేతు అనేది నిరాకార శూన్యం(empty form),రాహు అనేది మార్పు లేని ఆనందం(immutable bliss),సూర్యుడు అనేది మంచి జ్ఞానం(wisdom),చంద్రుడు అనేది చేసిన పాపాల పరిహారం(compassion),అదే కమలం అయితే త్యజించడం(renunciation) అనే వాటికి సంకేతాలుగా మనకి కనపడతాయి.  ఈ పీఠభాగము మధ్యలో మనకి నీలమణిలాగా ఒక నీలిరంగు దోర్జీ మధ్యబిందువుగాను,దీని పక్కనే పసుపు రంగులో ఒక చిన్న దోర్జి నిర్మాణాలు కనపడతాయి.వీటిలో నీలిరంగు దోర్జీ అనేది పురుషశక్తిగా, పురుషాంగముగా, వీర్యకణముగా,అవలోకితేశ్వరుడిగా సంకేతమైతే..పసుపు రంగు దోర్జీ అనేది స్త్రీ శక్తిగాను,యోని భాగముగా, అండముగా,అవలోకితేశ్వరీకి సంకేతముగా చెప్పడము జరుగుతోంది.ఈ నిర్మాణమును ఆనందము (bliss) అంటారు.ఇదింతా 3డి కాలచక్రనిర్మాణము అన్నమాట.
ఇపుడు ఇది ఎలా కైలాస పర్వతమునకు దారి చూపుతుందో మీకు వివరముగా చెపుతాను.మనకి కనిపించే ఆరు వృత్తాలు అనేవి హిమాలయ పర్వతాలైన ఎవరెస్ట్,కాంచనగంగా,అన్నపూర్ణ,ఛోవ్ లా,నంగా పర్వత,ఖుంబూ ఇలా ఉన్న ఆరు పర్వతశ్రేణులను చూపడము జరిగింది.అలాగే మనము ఈ రహస్య గ్రామానికి వెళ్ళలంటే మూడు పురాలను దాటవలసి ఉంటుంది.దీనికి సంకేతముగా శరీరం,వాక్కు,మనస్సు అనే నాలుగు గాలిగోపుర నిర్మాణాలు పెట్టడము జరిగింది.ఈ మూడు పురాలలో ముందుగా మనకి శరీర మాయలకి సంబంధించినది. అనగా ఈ నిర్మాణ గాలిగోపురములో మనకి మంచు సింహాలు కనపడతాయి.అంటే మొదటి పురము నందు మనకి మంచు జంతువులు అనగా మంచు కుక్కలు,మంచు పులులు,మంచు సింహాలు,మంచు ఏనుగులు వలన మనకి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని సూచించడము జరిగింది.ఇక రెండవ నిర్మాణమైన వాక్కును చూస్తే మనకి దీనికి సంబంధించిన మాయలను మనము దాటుకోవాలి.అనగా గాలిగోపురాలను మోసే బలిష్ఠ వ్యక్తులను పెట్టడము వెనుక ఈ వ్యక్తులు మనకి దర్శనము అవుతారు.అపుడు మనము మన వాక్కును అదుపులో ఉంచుకోవాలి.లేదంటే వారి కోపావేశాలకి గురై శాపాలు పొందవచ్చును.ఇక మూడవ నిర్మాణమైన మనస్సు చూస్తే మనస్సు మాయలో పడకుండా చూసుకోవాలి.అనగా ఈ గాలిగోపుర నిర్మాణములో మనకి కాంతి శరీర దేవతలను ఉంచడము జరిగింది. అంటే సిద్ధులున్న సిద్ధపురుషులు మనకి దర్శనమిచ్చి వారి సిద్ధమాయలలో మన మనస్సును ఉంచే అవకాశాలున్నాయి.వీటిని మనము సాక్షిభూతముగా చూస్తూ వారి అనుగ్రహముతో ముందుకి సాగిపోవాలి అన్నమాట.ఇక నాలుగ నిర్మాణమైన జ్ఞానం నిర్మాణములో మనకి 16 స్తంభాల నిర్మాణము మళ్ళీ అందులో నాలుగు స్తంభాల చొప్పున నాలుగు నల్లని కత్తులు,నాలుగు ఎరుపు రత్నాలు,నాలుగు పసుపు ధర్మచక్రాలు,నాలుగు తెల్లని పద్మాల అమరికను ఉంచారు.దీనిని బట్టి చూస్తే మనకి నాలుగువ పురము నందు నాలుగు యుగాల కాలము నాటి వ్యక్తులు దర్శనమవుతారు.అనగా కత్తులు అనేవి కలియుగముగాను,ఎరుపు రత్నాలు అనేవి ద్వాపరయుగముగాను,ధర్మచక్రము అనేది త్రేతాయుగముగాను, తెల్లని పద్మము అనేది సత్యయుగముగాను మనము అనుకోవచ్చును.కలియుగములో కుతంత్రాల యుగము గదా అందుకే కత్తులను,అదే ద్వాపరయుగములో యుద్ధకాంక్ష వలన ఎర్రని రక్తము ఏరులై పారడము వలన ఎరుపు రత్నాలతో,అదే త్రేతాయుగం అనేది ధర్మపాలన అందించిన శ్రీరాముడి కాలసూచనగా ధర్మచక్రమును, అదే తెల్లని పద్మాలు అనేవి పరిశుద్ధ మనస్సులున్న సత్యయుగ సంకేతాలుగా చెప్పడము జరిగింది.ఇలా ఈ జ్ఞాన నిర్మాణమును మనము దాటితే అష్టదళ పద్మ నిర్మాణము కనపడుతుంది.అంటే కైలాస పర్వతము చుట్టు మనకి అష్టదళ పద్మకార పర్వతాలు ఉంటాయని చెప్పడము జరిగింది.అలాగే అయిదు పొరలున్న మణిపీఠ నిర్మాణము చూస్తే మనకి స్ఫటిక మణి అయిన కైలాస పర్వతము సూచిస్తుంది.ఈ పొరలు అనేవి నాకు తెలిసి ఈ పర్వతము అడుగుభాగములో మనకి అయిదు పొరల నిర్మాణమును సూచన చేస్తోంది.అంటే మనము ఈ పొరలు లోపలకి వెళ్ళితే మనకి మధ్యబిందువుగా చింతామణి దర్శనమవుతుందని సూచనగా  నీలి మరియు పసుపు రంగు ద్యోర్జాల నిర్మాణాలు అనేవి మనకి గావలసిన రెండు చింతామణులకి సంకేతాలుగా పెట్టడము జరిగింది. జరిగినదని నా పరిశోధనలో తెలుసుకున్నాను అనగానే
ఆనందభిక్షువు వెంటనే “గురూజీ..అంటే ఈ కాలచక్రతంతు అంతాగూడ హిమాలయములోని కైలాస పర్వతమును సూచించుటకు ఇంతా తంతంగము అవసరమా” అనగానే 
“మిత్రమా.. ఇపుడున్న టెక్నాలజీ అపుడు ఆయన కాలములో లేదు గదా. ఇపుడు నువ్వు కైలాస పర్వత దర్శనము అంటే రోజుల నుంచి గంటలలో విమానాలు లేదా హెలికాఫ్టర్ ద్వారా వెళ్ళే సౌలభ్యము అవకాశాలున్నాయి. ఆ కాలములో జంతువులనే వాహనములను చేసుకొని కాలినడక యాత్రలు పూర్తిచేసుకొని వాళ్లు ఇలా కష్టపడి తెలుసుకున్న సత్యాలు లోకానికి అలాగే రాబోవు తరాలకి అందించటానికి ఇలా చక్రాలరూపములో,యంత్రాలరూపములో,దైవస్వరూపాల నిర్మాణ రూపలలో మనకి అందించడము జరిగింది. వాళ్ళు ఈ ఆలోచన మనకి ఇవ్వకపోతే మనము ఈనాడు మనకి వాళ్ళు తెలుసుకున్న సత్యాలుగా వాస్తవికత రూపములోనికి వచ్చేది కాదుగదా.ఇలా మన పూర్వీకులు చెప్పినవి ఉన్నాయో లేదో అవి సత్యాలు అవునో కాదో అని మనవాళ్ళు ఇపుడు ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని అవి సత్యాలేనని లోక ప్రచారము చేస్తున్నారు.అంటే వేదజ్ఞానం అనేది ఆలోచనలు అయితే శాస్త్రాల విజ్ఞానం అనేది ఈ ఆలోచనలకి వాస్తవికత రూపమును ఇచ్చేవి అన్నమాట.ఆలోచన లేకపోతే భావరూపము ఎక్కడనుండి వస్తోందో ఒకసారి ఆలోచించు.ఇలా మన పూర్వీకులు కష్టపడి పరిశోధన చేసి అలాగే తమ ధ్యాన అనుభవ జ్ఞానముతో తెలుసుకున్న సత్యాలు మనము ఇపుడు తిరిగి అవి ఉన్నాయో లేదో అని ప్రయోగాలు చేసి తెలుసుకుంటున్నాము.అంతెందుకు మన బ్యాటరీ తయారి విధానము మన అగస్య సంహిత గ్రంథములో మనకి కనపడుతుంది..అలాగే ఈ గ్రంథములో మనకి విమాన విద్య గూడ ఉంది. అంటే ఆనాటి పుష్పకవిమానాలు ఈ విధానముతోనే నడిచినాయి.ఇపుడే ఇదే విద్యతో మనము విమానాలు తయారు చేసినాము అన్నమాట.ఆనాటి మాయదర్పణ వీక్షణ సిద్దాంతము ఇపుడు మనము వాడుతున్న ఇంటర్నెట్ అన్నమాట.అలాగే దుర్యోధనుడి మరియు వీరి సోదరుల కుండ జనన విధానము ఇపుడున్న టెస్ట్ట్యూబ్ విధానము అన్నమాట.అంతెందుకు ఆ కాలములో మన గణపతికి ఉన్న నరముఖము తొలగించి గజముఖమును అమర్చి ప్రాణాలు పోసిన విధానము ఇపుడు ఉన్నవారికి అందాలంటే ఇంక 300 సం.పైనే పడుతుంది.ఎపుడో సత్యయుగము వాళ్ళు అందుకున్న టెక్నాలజీ మనము 12లక్షలు పూర్తిచేసుకొని కలియుగములోనికి అడుగుపెట్టిన గూడ అందుకోలేదంటే మన టెక్నాలజీ విజ్ఞానం ఏపాటిదో ఆలోచించుకోవచ్చును” అనగానే 
ప్రకృతి వెంటనే “స్వామి మనకి మూలము కైలాస పర్వతమని తెలిసినపుడు సరాసరి అక్కడికి వెళ్లవచ్చు గదా” అనగానే 
“ప్రకృతి.. అలా మనము వెళ్ళితే మనకి అందరికి కనిపించినట్లే నాలుగు ముఖాల పిరమిడ్ ఆకారము కనపడుతుంది.మనము వెళ్లవలసినది ఈ పర్వత అడుగుభాగములోనికి వెళ్ళితే కాని మనకి రహస్య గ్రామము దర్శనము కాదు.వీటికోసము వాళ్ళు ఏర్పరచిన సొరంగ మార్గాలలోనికి వెళ్ళాలి.ఈ మార్గాలు ఎక్కడ ఎలా ఉన్నాయో మనకి తెలియవు.ఎందుకంటే ఈ మార్గాలు అంతాగూడ మనకి తెలిసి అర్ధమయ్యే అర్ధముకాని పద్మవ్యూహములాగా ఉంటాయి.దారితప్పితే అభిమన్యుడిలాగా అర్ధాంతర మరణమును పొందుతాము.అదే దారి తెలిస్తే అర్జునుడిలాగా ఈ వ్యుహమును ఛేదించగలము.అందుకే మనకి ఈ ఆధార రూట్ మ్యాప్ ను మనపూర్వీకులు అంత భద్రముగా గీచి దానిని దాచి ఎవరి చేతిలో పడకుండా ఒకవేళ పడిన గూడ అర్ధము కాని రహస్యభాషలో రాయడము జరిగింది.అర్హత,యోగ్యత ఉన్నవారి చేతికి అందేటట్లుగా వారికి మాత్రమే అర్ధమయ్యే విధంగా వీటిని ఏర్పరచి భద్రపర్చడము జరిగింది” అనగానే 
ఆనందభిక్షువు వెంటనే “గురూజీ..మీరు చెప్పినది అక్షర సత్యము ఎలా అంటారా..నేను ఎన్నోసార్లు కాగితాలమీద,నేలమీద 2డిలో కాలచక్రాలు గీశాను. కాని నాకు ఎన్నడు మీరు చెప్పిన విధాన దృష్టిలో చూడలేకపోయాను. ఇపుడు మీరు చెప్పిన కాలచక్ర తంతువిధానము విన్న తర్వాత నా బుర్ర కాలచక్రములాగా తిరగడము ఆరంభమైంది. అర్హత,యోగ్యతఉన్నవారికి మాత్రమే దైవ రహస్యములలోని మర్మాలు అర్ధమవుతాయని ఇపుడు నాకు అర్ధమైంది” అంటుండగా 
ఉన్నట్టుండి...హఠాత్తు పరిణామముగా 
గుర్రు..గుర్రు..గుర్రు మంటూ 
మంచు పొదల నుంచి ఆకస్మాత్తుగా సుమారుగా...
*** *** *** *** *** *** 
8
నాలుగు మంచుకుక్కలు కనిపించేసరికి అందరు కంగారు పడ్డారు.ఇంతలో నిర్వాణలామా ముందుగా తేరుకొని మిగిలిన వారితో 
“మీరు కంగారుపడి నన్ను కంగారు పెట్టకండి.మీరు భయపడకండి.వీటిని ఇక్కడ రేచు కుక్కలు అంటారు.ఇక్కడ ఉండే షేర్పాలు అనేవాళ్ళు వీటిని తమ గొర్రెలమందను కాపాడుకోవటానికి వీటిని వేటకుక్కలుగా పెంచుతారు.ఇవి ఇపుడు మనల్ని తమ శత్రువులుగా భావించుకుంటున్నాయి.కదలకుండా శిలలగా నిశ్చలముగా నిలబడిపొండి.వీటి యాజమాని ఇక్కడికి వచ్చేదాకా ఇవి కాపల కాస్తూ మనల్ని చూస్తూ అరుస్తూనే ఉంటాయి.మనము కదిలాము అంటే మన కండలు పీకేదాకా ఇవి నిద్రపోవు అని” హెచ్చరించగానే అందరుగూడ వీటి యాజమాని రాక కోసము ఎదురుచూస్తూ విగ్రహాలుగా నిలబడిపోయారు.కొద్దిసేపటికి అక్కడికి గొర్రెలమందను మేపుకొని వస్తున్న వీటి యజమాని షేర్పా కనిపించి..ఈ నాలుగు కుక్కలను చూస్తూ తన చేతిలో ఉన్న కర్రను వాటికి అర్ధమయ్యేభాషలో నేలమీద కొడుతూ ఏవో సంజ్ఞలు చెయ్యగానే అపుడిదాకా అరిచి గోల చేసిన ఈ కుక్కలు కాస్త వీళ్ళ దగ్గరికి వచ్చి ప్రేమగా కాళ్ళను నాకి ముందుకి వెళ్ళిన తర్వాత షేర్పా తన గొర్రెలమందను తీసుకొని పర్వతము దిగడము ప్రారంభించాడు. 
ఆ తర్వాత నిర్వాణలామా మిగిలిన ఇద్దరితో “అయితే మనము ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే ఈ కుక్కలను ఇక్కడవాళ్ళు పెంచుతున్నారంటే వీళ్ళు పెంచే గొర్రెలమందకి ప్రాణాపాయము కల్గించే తోడేళ్ళు లేదా పులులు లేదా సింహాలు ఈ పరిసర ప్రాంతాలలో తిరిగే అవకాశాలు చాలా ఎక్కువని తెలుస్తోంది.అంటే మనము మరింత ప్రమాదకర స్ధాయి ప్రాంతమునకు అదుగు పెట్టినట్లే.ఇపుడిదాకా మనము తినే జంతువులనే చూసి ఉన్నాము.ఇపుడు మనల్ని తినే జంతువులను చూడబోతున్నాము.కాబట్టి అందరుగూడ అతిజాగ్రత్తగా అప్రమత్తగా మలచుకోండి.ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్న మన ప్రాణాలు మన చేతిలో ఉండవు.సరాసరి యముడు చేతి పాశమునకు చేరతాయని గుర్తుపెట్టుకొండి” అని హెచ్చరిక చేసి తమకి ఎదురైన ప్రతిపొదను అనుమానముగా చూస్తూ అక్కడ ఏమిలేదని రూడి చేసుకొంటూ వీరంతా ముందుకి సాగుతుండగా..
వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నగూడ జరిగేది జరగక మానదని అన్నట్లుగా 
ఇంతలో అనుకొని ఆపద లాగా … 
ఒక మంచుపులి యొక్క భయంకర పులిగ్రాండిపులు తమకి సమీపములో వినిపించేసరికి ఈ ముగ్గురు గూడ బిత్తరపోయి భయపడుతూ నిశ్చలముగా శిలలుగా నిలబడిపోయారు.
ఆనందభిక్షువు తేరుకొని “గురూజీ..వేటకుక్కలకి అయితే బొమ్మలుగా నిలబడవచ్చును.ఎందుకంటే అవి మనల్ని తినవు.అదే పులులు దగ్గర గూడ ఇలా బొమ్మలుగా నిలబడటం నా వల్ల కాదు.ఎందుకంటే నేను ఖచ్చితముగా దీనికి ఆహారము అవుతానేమో భయముగా ఉంది.ఏదో ఒకటి చెయ్యండి.మీకు మంత్రాలువచ్చు గదా. వాటితో దీనిని స్తంభన చెయ్యవచ్చు గదా” అనగానే 
నిర్వాణలామా వెంటనే “మిత్రమా.ఇపుడు మనము ఉన్న స్ధితిలో నాకు వచ్చిన మంత్రాలు ఏవి గుర్తుకు రావడము లేదు. ఆ వచ్చేది పులి కాబట్టి మనము ఏమైన మంత్రము లేదా తంత్రము చేసేలోపే అది మనల్ని తిని చక్కా పోతుంది.అది వచ్చి ఏమి చేస్తోందో చూసేదాకా మనము ఏమి చెయ్యలేము.అది ఆకలి మీద ఉంటే మనము దానికి ఆహారమవ్వక తప్పదు.ఒక వేళ దానికి ఆకలి లేదంటే మనల్ని ఏమి చెయ్యకుండా తనదారి తాను వెళ్ళిపోతుంది.కాని నాకు దీని గాండ్రింపు వింటూంటే మంచి ఆకలి మీద ఉన్నట్లే అనిపిస్తోంది” అనగానే
ఆనందభిక్షువు వెంటనే “మీ మంత్రతంత్రాలు పనిచెయ్యవు.ఆ వచ్చే పులి ఆగదు.ఇక్కడ నాకు తడవడము ఆగదు.ఏంది స్వామి.నిన్ను నమ్ముకొని వస్తే పులికి అప్పచెపుతావా? ఇది ఏమైనా న్యాయముగా ఉందా..అమ్మా..గురుమాత..నీవైన ఏదో ఒకటి చెయ్యి.నాకు ఇక్కడ ఒకటి ఆగకుండా ధారపాతముగా రావటానికి సిద్ధముగా ఉంది” అనగానే 
ప్రకృతి వెంటనే “ఆనందా..నీవు పొరపడుతున్నావు.మన కోసము ఒకటి గాదు ఏకముగా పులి గుంపు వస్తోంది.ఒక పులి గాండ్రింపుకే నీకు ఒకటి వస్తే అదే పులుల గుంపుకి నీకు రెండు గూడ రావడము ఖాయముగా అనిపిస్తోంది” అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూండగా
ఏదో అనుమానము వచ్చి నిర్వాణలామా నేలను చూడగానే ఆ మంచు మీద ఏకముగా పులుల గుంపు పాదముద్రలలో సుమారుగా 20 దాకా చిన్న పులి పిల్లల పాదముద్రలుండేసరికి అంటే ఇక్కడ దగ్గరలో పులిపిల్లలున్నాయని గ్రహించి చుట్టుప్రక్కల కేసి  పరిశీలించి చూడగా ఎదురుగా సుమారు 50 గజాల దూరములో ఒక మంచు గుహ ఉన్నట్లుగా కనిపించేసరికి విషయము అర్ధమైన 
నిర్వాణలామా “మిత్రమా...మనము ఏకముగా పులుల కుటుంబము నివసించే మంచుగుహ అయిన వాటి గృహము దగ్గర ఉన్నాము.వాటి పిల్లలకి మనము ఏమైన ప్రమాదము కల్గిస్తామోనని అవి అరుపులతో బెదిరిస్తున్నాయి.మనము సన్యాసదీక్షలో ఉండుటవలన అవి అరుపులే అరుస్తున్నాయి.లేదంటే ఈ పాటికి వాటికి మనము ఆహారము అయ్యేవాళ్ళము” అనగానే..
ఆనందభిక్షువు వెంటనే” గురూజీ..వాటికి మనము ఆహారము అవ్వడము లేదని మీకు బాధగా ఉన్నట్లుగా ఉంది.ప్రమాదము గూర్చి ఆలోచించకుండా వాటి గూర్చి ఆలోచనలు చేస్తున్నారే.అవి ఎక్కడ ఎందుకు ఉంటే మనకెందుకు.వాటి నుండి మనము ఎలా బయట పడాలో ఆలోచించండి.ఇక్కడ నాకు రెండు ప్రకృతి కార్యాలు ప్రారంభము అవ్వడానికి అట్టే సమయము పట్టదు.ఆపై మీ ఇష్టం.అందుకే మన పెద్దలు మనము తినే వాటిని పెంచుకొండి..మనల్ని తినేవాటికి దూరముగా ఉండండి చెపితే ఏమో అనుకున్నాను.ఇపుడు కళ్ళారా చూస్తేకాని నాకు అర్ధమై చావలేదు” అని అంటూండగా 
ఇంతలో ఎవరు ఊహించని విధంగాఎదురుగా …. …..
రెండు పెద్ద పులులు పైగా వీటి సంతానమైన అయిదు పిల్ల పులులు సహా వీళ్ళ ముందుకి వచ్చేసరికి ఎవరికి నోటమాట రాలేదు.
వీళ్ళు ఏమి చేస్తారని అవి చూస్తున్నాయి.
ఇవి ఏమి చేస్తాయని వీళ్ళు చూస్తున్నారు. 
ఇంతలో ఒక పెద్దగా ఒక తాగుబోతు అరుపులు వినబడేసరికి వీళ్ళు చూపు అటు వైపు పడగా..ఆ తాగుబోతు అయిన పిచ్చోడి మాదిరిగా వాడి చూపు వీళ్ళ మీద పడగా--చూడటానికి ఇతను కోలముఖముగా..చిరు గడ్డముతో..చింపిరి జుట్టుతో..అర్ధ నగ్నముగా..నడుమకి చిరుగులున్న పసుపు రంగు వస్ర్తముతో...ఒక చేతిలో ఆడకుక్కను పట్టుకొని మరొ చేతిలో సారాయి ఉన్న పాత్ర పట్టుకొని వీళ్ళ కేసి..అక్కడున్న పులులు కేసి అదోలా చూస్తూ 
వీళ్ళతో “ఎంది భయముగా ఉందా..ప్రాణాలు పోయేదాకా ప్రాణాలు హరించే హరుడిని తల్చుకోరు గందా..ఏమిటి సంగతి..అంతే గందా..ఇదే జీవిత సత్యమే గందా... అవును మీ ప్రాణాలు ఎలాగో వాటి ప్రాణాలు అంతే గందా..ఇపుడు నేను మీలో ఎవరి ప్రాణాలు కాపాడాలో మీరో తెల్చుకొండి.అపుడిదాకా నేను ఇక్కడే ఉంటా.ఏమి జరుగుతుందో చూడాలి గందా.అదే నా పని గదా.”అంటూ 
మాట్లాడే జీవాల కన్నా మాట్లాడని జీవాలే మిన్న అంటూ 
అక్కడ ఉన్న పులుల గుంపు కేసి చూస్తూ “ఏమే..ఈ బోడిగుండు జీవాలు మీ పిల్ల జీవాలను ఏమి చెయ్యరు.ఏమి చెయ్యలేరు.ఎందుకంటే వీళ్ళు శాంతమూర్తులు.పైగా వీళ్ళకి తెలిసి ఎవరికి వేటికి హాని కల్గించరు.నాకు ఇలాంటి దీక్షాపరుల గురించి  నాకు బాగా తెలుసు.పొండి.మీ మంచు గృహమునకు పొండి.”అనగానే 
ఇవి కాస్త ఈయన పెంపుడు జంతువులులాగా ఆనందముగా పెద్ద తోకలు ఆడిస్తూ..సంతోషముగా చిన్నతోకలు ఆడించుకుంటూ ఈ గుంపు కాస్త తాముండే గుహ వైపు వెళ్ళడము చూసిన ఆనందభిక్షువుకి అదుపులేని ఆనందమును పొందుతూండగా 
ఇది గమనించిన పిచ్చోడు వెంటనే “స్వాములు.ఎందాకా మీ ప్రయాణము.ఇంత భయంకరమైన ప్రాంతములోని అదిగూడ లోకాని తెలియని చోటుకి ఎందుకు వచ్చారు.ఎందుకు వెళ్ళుతున్నారు.కొంపతీసి ఇక్కదున్న మణుల కోసమా?లేదా ఇవి ఉన్నాయో లేదో చూద్దామని వచ్చారా లేదా వీటిని దొబ్బుకొని వెళ్ళద్దామని వచ్చారా?  ముందు మీలో ఉండే జీవమణులు సంగతి ఆలోచించండి.వాటిని మహాకాలుడు తన మృత్యువుతో ఎత్తుకొనేలోపుల వాటిని ఉపయోగించుకోండి.ఈ ప్రకృతిలో ఉండే మణులు ఎలాగో అలాగే ఉంటాయి.వాటిని చూడటానికి తప్ప ఏమి చెయ్యలేరు.అయిన ఇవి ఉన్నాయో లేదో ఈ పాటికి ఎంతో మంది ఎన్నో సం.రాల నుండి వస్తున్నారు.పోతున్నారు గందా.ఇపుడు మీరు కొత్తగా వీటి గూర్చి తెలుసుకొని ఏమి చేస్తారు” అనగానే
 నిర్వాణలామా అందుకొని “స్వామి...మేము మణుల కోసము అలాగే అవి ఉన్నాయో లేదో అని నేను శోధన చెయ్యటానికి రాలేదు.నా ప్రక్కనే ఉన్న మా ఆవిడికి చింతామణి తీర్ధము తాగిస్తే ఈమెకి వచ్చిన అనారోగ్యము పోతుందని నాగాసాధువు చెప్పితే తెలియని ఆ మణి కోసము ఇలా ఇక్కడిదాకా వచ్చి మీ వలన రక్షించబడినాము” అనగానే 
ఈ పిచ్చోడు కాస్త ప్రక్కనే ఉన్న ప్రకృతి కేసి అదోలా చూస్తూ..
“దీనికి ఏమైంది.బాగానే గుండ్రాయి లాగా గుండ్రముగా ఉంది గదా.దీనికి ఏమి మాయరోగం” అనగానే 
ఇది విన్న ప్రకృతికి అమితకోపము వచ్చి ఈయనతో “ఏమయ్యా..నాకేమి రోగముంటే నీకు ఎందుకు..లేకపోతే నీకెందుకు..మమ్మల్ని రక్షించావు. నీ దారి నీవు పో. మా రోగాలు గూర్చి మేము చూసుకుంటాము” అనగానే
 పిచ్చోడు వెంటనే “అరే..స్వామి.నువ్వు చెప్పితే నాకు అర్ధము కాలేదు.నిజముగానే మీయావిడికి ఏదో ఉన్మాదరోగముంది.ఈ రోగమున్న వారికి తప్పనిసరిగా మణితీర్ధము త్రాగించాలి.లేదంటే ఇలాగే అయినకాడికి కానికాడికి గొడవలకి దిగుతారు.ప్రతి చిన్నదానికి ఉన్మాదము పొందుతారు.అపుడపుడు నేనుగూడ ఈ ఉన్మాదమును పొందుతూ ఉంటానని నన్ను కొందరు ప్రాపంచిక విషయాలు దాటిన “అవధూత” అంటారు. అపుడు నేను నాకున్న ఉన్మాదము తగ్గించుకోవటానికి చతుర్ధశి అమావాస్య కాళ రాత్రి సమయములో పిశాచాలు,దెయ్యాలు,ప్రేతాలు,భేతాళుడు వంటి మహాశక్తులన్ని వశము చేసుకోవటానికి  “ఛోడ్” అనే తాంత్రిక హోమము చేస్తూ భేతాళ తాండవము చేస్తాను. ఆ తర్వాత రహస్యగ్రామానికి వెళ్ళి అక్కడున్న మణితీర్ధమును సేవించగానే నాకున్న ఉన్మాదము పూర్తిగా తగ్గిపోతుంది. ఓ పిల్లా..నీవు ఆ తీర్ధము తీసుకోగానే నీ మాయరోగం తగ్గుతుందిలే.భయపడకు.నీ రోగము ఏమిటో నాకు తెలిసింది.నీ మాయరోగం నాకు అర్ధమయింది” అనగానే అపుడు కాని నిర్వాణలామాకి ఈయన ఏవరో తెలియరాలేదు.తెలిసిన తర్వాత మౌనము వహించాడు.
ఆ తర్వాత ఈ అవధూత “అందరితో కలిసి భిక్ష చెయ్యాలని ఉంది” అనగానే అందరు కలిసి భిక్షకి కూర్చున్నారు.ఈయన ఏవరో తెలియని ఆనందభిక్షువు ఈయనను ఆటపట్టించాలని అనుకొని 
“స్వామి..మా భిక్ష అయితే దుంపలు,పళ్ళు,తేనె మరి మీ భిక్ష ఏమిటి?” అనగానే 
ఇలాంటి వారిని ఒక ఆట ఆడించే ఆయన గూడ వెంటనే “స్వాములు..నా భిక్ష ఇంక తయారు చేసుకోలేదు.ఇది తయారు చెయ్యడము చూసినవారు భయపడని వాడే చాలా అరుదుగా నాకు లాగా ఉంటారు.మరి నా భిక్ష తయారి చూడటానికి నువ్వు తయారా?” అంటూ 
తన పాత చేతిసంచి లోంచి ఒక పాము కుబసమును బయటికి తీసి అందరికి చూపిస్తూ..ఇందాకే ఇది ఆ మంచురాళ్ళ మధ్య  దొరికింది.ఈ పొట్లకాయ తిని చాలా రోజులైనదని దీనిని తెచ్చుకొన్నాను. నా స్వామి రంగ..దీనికి ఆడకుక్క పాలలో కలిపి తింటూంటే ఎమి రుచిగా ఉంటుందో గందా.అమృతములాగ ఉంటుంది” అంటూ ఈ రెండింటిని కలిపి పిసికి ఒక ముద్దగా చేసుకొని తింటూంటే
ఆనందభిక్షువుకి నోటమాటలేదు.అదే ప్రకృతి అయితే బిత్తరపోయింది.
కాని నిర్వాణలామా వెంటనే “స్వామి..నాకు ప్రసాదముగా మీరు తినే బ్రహ్మపదార్ధము కొంచెం పెడతారా?” “స్వాములు..ఇది బ్రహ్మ పదార్ధము కాదురా..ఆ బ్రహ్మము దగ్గరికి ఏకముగా పంపే విషపదార్ధము రా..నువ్వు తిన్నావంటే నీ భార్యకి దక్కకుండా పోతావు.అసలే అది పిచ్చిది.నువ్వు లేకపోతే మరింత పిచ్చి ఎక్కుతుంది.ఇక వీడికి గురువు లేకుండా పోతాడు” అన్నగూడ 
నిర్వాణలామా తను చాచిన చెయ్యి వెనక్కి తీసుకోకుండా అలా భిక్షకి ఉంచగానే ఈ అవధూత కాస్త “నిర్వాణా..నువ్వు గూడ నాకు లాగానే అసాధ్యుడివిరా. మొండోడివి. సాధన సాధ్యతే సాధ్యం నిరూపించేవాడివి.అందుకు నీకు యోగ్యత,అర్హత ఉంది.దీని వలన నీ సంకల్పము నేరవేరుతుంది.నేను ఏవరో నువ్వు గ్రహించినావని నాకు అర్ధమయింది.నా యోగమాయ పరీక్ష మాయం అయింది” అంటూ నిర్వాణలామా చేతిలో ఇది పెట్టగానే అదికాస్త సువాసనలు వెదజల్లుతూ మగ్గిన మామిడిపండు లాగా మారడం..దానితో ఈ అవధూత లేచి నిలబడి మంచులోంచి సుమారుగా  మూడు అడుగుల పాంచజన్యశంఖమును బయటికి తీస్తూ దానిని పూరించగానే ఈ శంఖ ఓంకారనాదానికి హిమాలయల పర్వతాల దిక్కులు అదిరిపోయే విధంగా మారుమోగుతూండగా 
ఈ పిచ్చి అవధూత అదృశ్యమయ్యేసరికి..
ఇలాంటి భయంకర శంఖనాదమును మన “మహాచౌహాన్ స్వామి”(దత్తాత్రేయస్వామి) తప్ప ఎవరు చెయ్యలేరని..ఎవరికో ఈయన దర్శన అనుగ్రహభాగ్యము కల్గినదని ఈ పర్వత గుహలలో తపస్సు చేసుకుంటున్న వృద్ద లామాలు,యోగులు,గురువులు,సన్యాసులు అనుకొని ఆనందపడుతుండగా ఇదే విషయాన్ని నిర్వాణలామా మిగిలిన వారికి చెప్పగానే ఈ ముగ్గురు కలిసి ఈయనకి తమ కృతజ్ఞతలు చెప్పుకొని ఖోజార్ నాథ్ ఆలయము వైపు వడివడిగా నడకయాత్రను కొనసాగించారు.
*** *** *** *** *** *** 
9
గురువులకే మహా గురువైన విశ్వగురువు శ్రీ దత్తాత్రేయ స్వామి అదే శ్రీ మహాచౌహాన్ దర్శన భాగ్యముతో నిర్వాణలామా బృందము అమిత ఉత్సాహముతో తక్లాకోట్ దగ్గర ఉన్న మాట్లాడే విగ్రహమూర్తి అయిన ఖోజార్ నాథ్ ఆలయానికి వీరంతా చేరుకున్నారు.
లోపల వీళ్ళకి సుమారుగా అయిదు అడుగుల సింహసనము మీద నాలుగు వెండి విగ్రహామూర్తులు ఎనిమిది అడుగుల ఎత్తు ఉండి నిల్చోని ఉన్నట్లుగా కనిపించాయి. వీటిని చూసిన నిర్వాణలామా మిగిలిన వారితో “చూడండి.ఈ విగ్రహాలలో మధ్యలో ఉన్న విగ్రహమూర్తి మాట్లాడే ఖోజార్ నాథ్.ఈయన ప్రక్కన ఏడు అడుగుల ఎత్తులో ఉండి పసుపురంగు ముఖముతో ఉన్న విగ్రహమూర్తి మంజుఘోషుడు గాక ఈయనకి కుడివైపు ఉన్న ఏడు అడుగుల ఎత్తుండి శ్వేతరంగు ముఖముతో ఉన్న విగ్రహమూర్తి అవలోకితేశ్వరుడైతే ఇక ఖోజార్ నాథ్ కి ఎడమవైపు ఏడు అడుగుల ఎత్తు ఉండి నీలిరంగు ముఖము ఉన్న విగ్రహమూర్తి వజ్రపాణి విగ్రహము అంటూ..అవును..మీరు ఒక విషయము గమనించారా?ఖోజార్ నాథ్ కి ప్రక్కనే ఉన్న ఈ మూడు విగ్రహల ముఖాలు వరుసగా పసుపు,తెలుపు,నీలిరంగు ఉన్నాయి గదా.మనము వెతికే చింతామణి తెలుపు,నాగమణి లేతనీలముగా,రుద్రమణి పసుపు లేదా బంగారపు రంగులోనే ఉంటాయి.అంటే ఈ విగ్రహముఖ రంగులతో మణులు రంగులు ఎలా ఉంటాయో లోకానికి తెలియచేసినారు అన్నమాట” అంటుండగా 
ప్రకృతి వెంటనే “స్వామి.. మాట్లాడే ఖోజార్ నాథ్ విగ్రహమూర్తి గూర్చి చెప్పండి?” అనగానే
“ప్రకృతి..హైందవధర్మము ప్రకారం చూస్తే ఈయన మహాకాలుడు.ఈయన కోసము విశ్వకర్మ ఇక్కడ ఒక దేవాలయము కట్టించాడని అలాగే రహస్యగ్రామముకి దారి చూపటానికి మనకి గంధర్వుడు,యక్షుడు ఉంటారని సూచనగా ఈ రెండు విగ్రహాలు కూడ ఈయన తయారు చేసి పెట్టాడని పురాణగాథ చెపుతోంది.అదే బౌద్ధధర్మము ప్రకారము చూస్తే ఈయన జాంబ్యంగ్ బుద్ధుడిగా కొలువడము జరుగుతోంది.వీరి గాథ ప్రకారము అయితే పూర్వము ఒక వృద్ద లామాకి ఒక శిష్యుడు ఉండేవాడు.ఇతను రాత్రిపూట దగ్గరలో ఉన్న కన్నాలీ నది నుండి నీళ్ళు తెచ్చే అలవాటు ఉంది.ఆ సమయములో ఈ నది ఒడ్డున ఇసుక తిన్నెల మీద ఒక కాంతిపుంజము పడుతూ ఉండటము ఇది పగటిపూట కనిపించకపోవడము ఇతను గమనించి తన గురువుకి చెప్పగానే అయితే నువ్వు ఆ కాంతిపుంజము కనిపించినచోట రాళ్ళను ఒక గుట్టగా పెట్టు అని చెప్పిగానే ఇతను ఆ రాత్రి ఇలాగే చెయ్యగానే మరుసటి ఉదయము కల్లా ఈ రాళ్ళు కాస్త ఒక పెద్దరాయిగా మారిపోయిన విషయము ఇతను గమనించి గురువుకి చెపితే కంగారుపడకు.ఆ కాంతిపుంజము జాంబ్యంగ్ ఆత్మరూపమని అది అలా ఏర్పడటానికి ఏదో మనకి తెలియని మర్మరహస్యముండి ఉండాలి.దీనికి కాలమే సమాధానము చెపుతోంది” అని వివరించాడు.
ఇది ఇలా ఉంటే ఆ రాజ్యమును పరిపాలించే రాజు దగ్గరికి ఏడుగురు సన్యాసులు వచ్చి తాము తెచ్చిన ఏడు సంచుల వెండి నాణెముల మూటలను ఈ రాజుకిస్తూ"రాజా.మళ్ళీ మీ దగ్గరికి ఏడు సం.రాల లోపు వస్తాము.ఒకవేళ మేము రాకపోతే ఈ నాణెములను మీ కోరిక మేర వినియోగించుకోవచ్చును అని చెప్పి వెళ్ళిపోయారు.ఇలా వీళ్ళు తొమ్మిది సం.రాల రాకపోతే ఈ రాజు వీటిని ఒక శిల్పికి ఇస్తూ ఒక దేవతవిగ్రహమును తయారు చెయ్యమని ఆజ్ఞ ఇవ్వడముతో..ఈ శిల్పి ఈ వెండినాణెలను కరిగించి ఒక పోతగా పోస్తుండానే ఉన్నట్టుండి ఈ వెండిపోత కాస్త జాంబ్యంగ్ విగ్రహముగా తనంతట అదే రూపాంతరము చెందిన విషయము తెలుసుకున్న రాజు వెంటనే ఇలా మారిన విగ్రహమును కార్డుంగ్ ప్రాంతములో ప్రతిష్టించాలని ఒక రథములో ఎక్కించుకొని అటువైపుగా బయలుదేరుతుండగా..సరిగ్గా ఈ రథము కాస్త అపుడుకే జాంబ్యంగ్ ఆత్మ నిర్మిత రాయి దగ్గరికి రాగానే ఈ ఆత్మరాయి నుండి ఖోర్-ఛాక్ అని పలికింది.అనగా నేనిక్కడకి వచ్చాను.ఇక్కడే ఉంటాను అని ఈ మాటలకి అర్ధం.దానితో ఈ రథము ఆగిపోవడము..ఆపై ఈ ఆత్మరాయి నుండి ఒక మెరుపుకాంతి ఈ వెండి విగ్రహములోనికి మారిపోవడము ఏకకాలములో జరిగింది.
“నేనిక్కడకు వచ్చాను-ఇక్కడే ఉంటాను” మొదటి మాట అయితే ఆ తర్వాత “మాప్ ఛూ అనగా నది పొంగుతుంది” అని..ఆ తర్వాత “ఓరీ మహా పాపాత్ముడా” అని ఆ తర్వాత “నాకు సాష్టాంగ నమస్కారము చేస్తే మీకు సంతానప్రాప్తియని” ఆ తర్వాత “మంత్రించిన కాగిత పక్షి యంత్రము ఉంచాడు తీసివేయండి” అని ఆ తర్వాత “తన పోయిన పద్మం స్ధానే కొత్త పద్మం పెట్టమని” కోరడము జరిగింది. ఇలా ఈ విగ్రహము ఇపుడిదాకా 6 సార్లు మాట్లాడింది.ఇక 7 సార్లు అనగా మొత్తము 13 సార్లు మాట్లాడము పూర్తి అయితే ఈ విశ్వానికి విశ్వప్రళయము వస్తోందని బౌద్ధ ఇతిహాసాలు చెపుతున్నాయి” అనగానే 
ఆనందభిక్షువు వెంటనే “గురూజీ.అంటే ఈ దేవాలయము హైందవ-బౌద్ధ ధర్మ మిళిత దేవాలయము అన్నమాట” అనగానే “అవునని” నిర్వాణలామా సమాధానము చెపుతూ అక్కడ దేవాలయ గోడలకి ఉన్న కుడ్యచిత్రాలను చూస్తుంటే అతడికి ఒక పులిని బంధించి తీసుకొని వెళ్ళుతున్న బలిష్టుడి కుడ్యచిత్రము మీద దృష్టి పెట్టి చూస్తోంటే …
ఆనందభిక్షువు వెంటనే “గురూజీ.ఆ చిత్రములో ఏముంది” అనగానే 
“మిత్రమా.ఈ కుడ్యచిత్రము చూస్తూంటే నాకు కాలచక్రములో గోపురాలను మోసే బలిష్టు వ్యక్తి గుర్తుకు వచ్చాడు.అంటే ఈ చిత్రము ఇక్కడ ఉంది అంటే మనము మనకి తెలియకుండానే రెండు పురాలు అనగా మంచుపులి దర్శనం,మహాచౌహన్ దర్శనం బట్టి మనము రెండు పురాలు దాటి ఈ బలిష్టు వ్యక్తి మనకి దర్శనమైతే మూడవపురము అలాగే దేవతపుప్పాల వనాలు దర్శనమైతే నాలుగువ పురమును చేరుకున్నట్లే అన్నమాట.ఈ లెక్కన కాలచక్రములోని 16 స్తంభాలలో నాలుగు స్తంభాలలో నల్లటి కత్తులు అనేవి జంతువుల రాకను అలాగే మరో నాలుగు స్తంభాలలో ధర్మచక్రములు ఉంటే ఇవి మహాచౌహన్ దర్శనానికి సంకేతము అయితే మిగిలిన ఎనిమిది స్తంభాలలోని నాలుగు తెల్లని పద్మాలు,నాలుగు ఎరుపు రత్నాలు బట్టి చూస్తే ఇందులో తెల్లని పద్మాలు అయితే దేవత పుష్పాలు అనుకుంటే ఇక రత్నాలు అనేవి ఇవి ఉన్న రహస్యగ్రామముకి మనము చేరుకున్నట్లే.ఇపుడు మనకి బలిష్టుడు అలాగే దేవతపుష్పాల వనాల దర్శనమైతే మనము మణుల దగ్గరికి చేరుకున్నట్లే అంటూ అయిన మనకి ఈ  ఖోజార్ నాథ్ అనుగ్రహము ఇంక లభించలేదు గదా.లభించి ఉంటే ఆయన చేతినుండి మనకి బంగారు మణిపద్మము వచ్చేది కదా.ఇది వచ్చేవరకు మనము ఎదురుచూడక తప్పదు” అంటూ నిర్వాణలామా మరియు ప్రకృతి మాత్రమే గుడి నుండి బయటికిరాగా 
ఆనందభిక్షువు బయటికి రాకపోయేసరికి నిర్వాణలామాలో ఏదో అనుమానభయము మొదలు అవ్వడముతో లోపలకి వెళ్ళేసరికి ఆనందభిక్షువు లోపలే ఉండి ఖోజార్ నాథ్  విగ్రహమూర్తి చేతిలో ఉన్న బంగారుపద్మము కేసి తదేకముగా చూస్తూ ఏదో తెలియని తన్మయత్వమును పొందుతూ 
“స్వామి..మేమంతా నీ అనుగ్రహము కోసము ఇక్కడి దాకా వచ్చాము.కాని నీ అనుగ్రహ ఫలమైన నీ చేతిలోని బంగారు పద్మము మాకు అనుగ్రహించి ఇవ్వాలి గదా.పైగా నువ్వు సజీవమూర్తివని..మాట్లాడతావని మా గురూజీ నాతో చెప్పారు.కాని నిన్ను చూస్తోంటే అలా అనిపించడము లేదు.మీ మణిపద్యము లేకపోతే మేము ముందుకి వెళ్ళలేము.దాంతో మాకు ఎపుడికి చింతామణి తీర్ధము లభించదు.ఇది అందకపోతే మా గురుమాత ఆరోగ్యము కుదటపడదు.తద్వారా ఆమె శూన్యతభావము దాటలేక తీవ్రమైన ఉన్మాదస్ధితిలో భౌతిక మరణము అకారణముగా పొందవలసి ఉంటుంది.ఇదింతా జరగకుండా ఉండాలంటే నీ బంగారు పద్మము గావాలి.కాని అది నీవు మాకు ఇచ్చేటట్లుగా లేవు.కాబట్టి ఈ పద్మమును నేనే తీసుకుంటాను” అంటూ 
ఏదో తెలియని ఆవేశ ఉన్మాదములో అనుకోనివిధంగా అనుకోకుండా ఖోజార్ నాథ్ విగ్రహము చేతిలో ఉన్న బంగారు మణిపద్మము ఇతను బలవంతముగా లాక్కుతున్న దృశ్యమును చూసిన 
నిర్వాణలామా వెంటనే “మిత్రమా..ఆగు..నీవు అలా చెయ్యకూడదు.ఆయన అనుగ్రహమును పొందవలసిన చోట ఆగ్రహమును పొందుతావు.ఆగు.నీవు చేస్తున్న పని మంచిది గాదు.విశ్వానికి అనర్ధము” అంటున్నగూడ ఈ మాటలు విని గూడ ఆనందభిక్షువు పట్టించుకొనే స్ధితిలో చేసేపని ఆపే స్ధితిని అపుడికే దాటిపోయి అతి ఉన్మాదస్ధితిలో ఈ విగ్రహము చేతిలో ఉన్న పద్మమును బలవంతముగా పెకలించడము 
దానితో ఈ విగ్రహమూర్తి కాస్త “ఇంతడితో నీ ఆయువు తీరింది” అనగానే ఈ మాటలు విన్న ఆనందభిక్షువు ఆనందపడుతూ గిల్లాగిల్లాడుతూ ఈ విగ్రహము ముందే రక్తము కక్కుకొని నేల ఒరిగి చేతిలో పద్మమును పట్టుకొని తనవైపు వస్తున్న నిర్వాణలామా వైపు ఆనందచూపు చూస్తూండగా.. నిర్వాణలామా అక్కడికి చేరుకొని ఇతని తలను చేతిలో తీసుకొని కొన ఊపిరితో ఉన్న ఆనందభిక్షువుతో 
“మిత్రమా.ఎంత పని చేశావు మా కోసము ఎంత పెద్ద పొరబాటు చేశావు.నీకు గుర్తు లేదా?మనకి దొరికిన దేవతాపుష్పాలు ఆయనికి సమర్పిస్తే ఆయన అనుగ్రహమును పొందవచ్చును గదా.ఇది నేను మనమంతా భిక్ష పూర్తిచేసుకొని వచ్చి చేద్దామని అనుకొనే లోపలే నువ్వు తొందరపడి ఈ అవివేక పని చేశావు.మాకు దూరమయ్యే పరిస్ధితిని తెచ్చుకొన్నావు” అని అంటూండగానే 
“నన్ను క్షమించండి” అంటూ సైగ చేస్తూ ఆనందభిక్షువు ప్రాణాలు గాలిలోనికి వదిలేశాడు.
దానితో ఇతని చేతిలో ఉన్న పద్మము నేలమీద పడేలోపులే అది గాలిలో ఎగురుకుంటూ మళ్ళీ యధావిధిగా ఈ విగ్రహమూర్తి చేతికి చేరడము  చేసేదేమి లేక ఆనందభిక్షువు శవమును ఈ ఆలయము నుండి వైర్యాగ్యభావముతో మౌనముగా తీసుకొని  వస్తొంటే ఇది చూసిన ప్రకృతి తన మనస్సులో మనిషితో బయటికి రావాలసినవాడు శవముతో వస్తూండేసరికి ఏదో తెలియని ఆందోళతో నిర్వాణలామాను సమీపించి శవముగా మారిన తన కుమారుడుతో సమానమైన ఆనందభిక్షువు శవమును చూస్తూ అసలు ఏమి జరిగినదో నిర్వాణలామా చెపుతూంటే స్మశానవైరాగ్యముగా అదోలా చూస్తూండగా 
ఇంతలో అక్కడికి కొంతమంది టిబెట్ లామాలు వచ్చి “స్వామి.మీ చేతిలో ఉన్న బౌద్ద సన్యాసి శవమును మాకు ఇవ్వండి.ఇక్కడ మంచు పర్వతాలలో శవ దహనము చెయ్యడానికి అవకాశముండదు గదా.  అందుకని మేము ఈ శవమును ముక్కలు ముక్కలుగా కోసి ఆకలిగా ఉన్న మూగజీవాలైన గ్రద్దలకి,రాబందులకి,రేచు కుక్కలకి ఆహారముగా వేస్తాము” అనేసరికి నిర్వాణలామా ఏమాత్రము కాదనకుండా వారికి ఈ శవమును అప్పగించి 
అక్కడే ఉన్న ప్రకృతిని తీసుకొని లోపలకి ఖోజార్ నాధ్ విగ్రహము ముందు ప్రకృతిని ఉంచి..తన చేతి సంచి లోంచి కాలచక్రయంత్రములో ఉన్న రెండు దేవతాపుష్పాలను ప్రకృతి చేతికిస్తూ స్వామికి సమర్పించమనగానే ఆమె అలా చెయ్యగానే నిర్వాణలామా ఆవేశము పొందుతూ 
“స్వామి.నువ్వు ఈ విధముగా నా మిత్రుడు మీద ఆగ్రహించినందుకు ఎలాంటి కోపము అలాగే బాధ లేదు.ఈ విధముగా ఒక జీవికి విముక్తి కల్గించావు.పైగా వాడి శవముగూడ వృధా కాకుండా ఆకలిగా ఉన్న జీవులకి ఆహారముగా అవుతోంది.ఆహారజీవిగా పుట్టి ఆహారము కోసము ఆలమటించి ఆహారముగా మారిపోయాడు.ఇక నీ ముందున్న ఈమెను ఏమి చేస్తావో నీ ఇష్టం..ఆమెను అనుగ్రహిస్తావో లేదా ఆగ్రహిస్తావో నీ చేతులలోనే ఉంది.ఏది జరిగిన అంతా మన మంచికే అనుకుంటున్నాను” అనగానే 
ఉన్నట్టుండి ….  
ఈ విగ్రహా పాదాల మధ్య మణి కాంతికిరణాలు బయటికి ప్రసరిస్తూండగా అందులోంచి సుగంధభరితమైన సువాసనాలను వెదజల్లుతూ బంగారపు రంగుతో మెరిసిపోతున్న ఒక మణిపద్మము కాస్త గాలిలో తేలియాడుతూ నిర్వాణలామా చేతికి రావడము దీనిని అందుకొని వీరిద్ధరు ఈయనకి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ ఆలయము నుండి బయటికి వచ్చి అటునుండి తమ చేతిలో ఉన్న రూట్ మ్యాప్ ఆధారముగా కైలాస పర్వతము వైపు బయలుదేరారు.
*** *** *** *** *** ***
10 
నిర్వాణలామా కాస్త ప్రకృతితో 
“ఏమిటి..నువ్వు ఆనందభిక్షువు మరణము గూర్చి ఆలోచిస్తున్నావా?” అనగానే 
“స్వామి..నాకు అతని మరణ బాధలేదు కాని నా కోసం అతను చనిపోయాడని బాధగా ఉంది” అనగానే
“ప్రకృతి..అంతాగూడ ప్రకృతిమాత చేతులలో చేతలలో జనన-మరణ-జన్మల చక్రము తిరుగుతూ ఉంటుంది గదా.రెండు రెప్పలు తెరిస్తే జననం..అదే రెండు రెప్పలు మూస్తే మరణము గదా.మన ఏమరుపాటు,గ్రహపాటు,పొరబాటు మన మరణానికి కారణమవుతాయి.వాడికి అలా రాసి పెట్టి ఉంది.ఇంతవరకే వాడికి మనకి ఋణానుబంధముంది” అనగానే
ప్రకృతి వెంటనే “స్వామి..విధివ్రాతను ఎవరు తప్పించుకోలేరు.మరణము గూడ అంతే.మన జననముతోపాటు మరణము గూడ పుట్టి మన నీడలాగా వెంటాడుతూనే ఉంటుందని లోకవిదితమే కదా.ఏది ఎపుడు జరగాలో అది అపుడు జరుగుతుంది.జరిగేది జరగక మానదు.జరగనిది ఎన్నడికి జరుగదు కదా. ఇంక మీకు తెలిసిన హిమాలయ విశేషాలు,వింతలుంటే చెప్పండి” అనగానే..
“ప్రకృతి...నీకు ఒక విషయము తెలుసా..ఈ ఖోజార్ నాథ్ దేవాలయమును కైలాస పర్వత పరిక్రమ యాత్ర పూర్తిచేసుకొని ఆఖరిగా ఈయనను దర్శించుకొంటే కైలాస-మానస సరోవర యాత్రఫలితము లభిస్తుందని ఇక్కడివారి నమ్మకము.ఇక్కడ నుండి 16 వందల కి.మీ దూరములోనే ఖాట్మాండ్ అదే పశుపతినాథ్ దేవాలయమునకు చేరుకొని అటుపై భారతదేశానికి వెళ్ళిపోవచ్చు.అంటే మనము దీనికి వ్యతిరేక యాత్ర అనగా మొదట ఈయనను దర్శించుకొని ఆపై కైలాసనాధుడైన అవలోకితేశ్వరుడి దర్శనానికి వెళ్ళుతున్నాము.ఎందుకంటే మన యాత్ర వెనక్కి వచ్చేది గాదుకదా.సరే.ఈ హిమాలయాలలో నా పరిశోధన వలన నేను తెలుసుకున్న వింతలు,విచిత్ర విషయాలు నీకు మనము ప్రయాణము చేస్తూ చూపిస్తాను” అంటూ ముందుకి ప్రయాణము కొనసాగించారు.
ఈ ప్రయాణములో వీరికి రాత్రిపూట కాంతులు విరజిమ్మే చెట్ల లతలు కన్పించాయి! వాటిని చూడగానే నిర్వాణలామా ప్రకృతితో 
"ప్రకృతి! వీటిని జ్యోతిర్ణత అంటారు!  ఇవి స్వయం సిద్ధగా రాత్రిపూట మిణుగురు పురుగులాగా ఇవి గూడ మెరవడము మీరు చూసి ఉంటారు గదా! ఇది మన యోగనాడులను , యోగ కేంద్రాలకు శక్తిని మేలుకొలిపి ఒక దివ్యమైన ఆధ్యాత్మిక చైతన్యమును కల్గిస్తాయి! కాబట్టి మనము ఈ లతలను తిందాము” అంటూ వీటిని తిని తినగానే... వీరికి అలివికాని అద్వితీయమైన ఆనందానుభూతి లోనికి కొంతసేపు వెళ్లారు! ఆ తర్వాత ముందుకి ప్రయాణము సాగించగా.....వారికి “దామోదర కుండం” అనే సరస్సు కనబడింది! దీనిని నిర్వాణలామా చూసి వెంటనే " ఈ సరస్సు అడుగున మనకి సహజ సిద్ధమైన సాలగ్రామాలు దొరుకుతాయి! వీటిలో బంగారముంటుంది! ఈ సాలగ్రామాలలో శ్రీమూర్తి సాలగ్రామాలు అంటే లక్ష్మీదేవి సాలగ్రామాలుంటే... విష్ణు స్వరూప సాలగ్రామాలు అనగా నారసింహ, కూర్మ, సుదర్శన, మత్స్య , మహాసుదర్శన , షట్చక్ర సీతారామ లాంటి దివ్యమైన స్వచ్ఛమైన నిజమైన సాలగ్రామాలు ఈ సరస్సులో కనబడతాయి అని చెప్పగానే వీరిద్దరికి అందులోంచి సుదర్శన శాలిగ్రామము మరొకరికి శ్రీ సాలిగ్రామము దొరికినాయి! వీటిని తమ చేతి సంచిలో భద్రముగా పెట్టుకున్నారు! ఆ తర్వాత మరి  కొంత ప్రయాణము చేస్తుంటే ఒక చెట్టు ఆకులను ఆశ్చర్యముగా చూస్తుంటే ప్రకృతికి ఏమి అర్ధము కాని ముఖము పెట్టగానే... ఇది చాలా అరుదైన రుదంతి మహాహాధి లత! దీనిమీద రాత్రిపూట పడిన మంచు బిందువులు తెల్లవారేసరికి ముత్యాలవలె పేరుకొని ఈ ఆకుల మీద అలా ఉండిపోతాయి! వీటిని కదపకుండా పాదరసముపైన కొంత సేపు ఉంచితే... ఆ పాదరసం వెంటనే గడ్డ కట్టి రస బంధనము అవుతుంది! ఇలాంటి పాదరసానికి శమంతకమణి లేదా పరుశవేది మణి కాని తాకిస్తే అదికాస్త సహజ సిద్ధమైన బంగారములాగా మారుతుంది అని చెప్పగానే...
ప్రకృతికి ఒక సందేహము వచ్చి " స్వామి! ఇన్ని విషయాలు తెలిసిన మీకు.... ఆ బంగారమును లేదా మణులు లేదా వేరులను విదేశాలకి అమ్మి సొమ్ము చేసుకుంటే ఈ పాటికి బికారి నుండి బిలియనీరు అయ్యే వాళ్ళు గదా” అనగానే...
నిర్వాణలామా ఒక నవ్వు నవ్వి " ప్రకృతి! మణులు , లేదా లతలు లేదా సాలగ్రామాలు ఎలాంటి దివ్యలక్షణాలుండాలో.... వాటిని భరించేవాడికి , ధరించేవాడికి , అనుభవించే వాడికి దివ్య లక్షణాలుండాలి! అనగా అతడి శరీరము మీద శంఖు , సుదర్శన చక్ర రేఖలు , తామరపువ్వు లాంటి పద్మ రేఖలు శరీరములో చెమటవాసన , కుళ్లు వాసన లేని సుగంధ పరిమళం వెదజల్లే యోగ శరీరము ఉన్నవారికి మాత్రమే ఇవి ఆధీనమవుతాయి! ఆజ్ఞలు పాటిస్తాయి! లేదంటే అనర్ధాలు కల్గిస్తాయి. అంతెందుకు ఇలాంటి లక్షణాలున్న మీ యోగ పుంగడైన శ్రీకృష్ణుడు కాస్త శమంతకమణి ధరించాడు గదా! కాని ఆయన మహా నిర్యాణము చెందిన తర్వాత ముసలం పుట్టి ద్వారకయే వినాశనము పొందింది గదా! అలాగే అర్హత లేని ఔరంగజేబు , గజినీ , విక్టోరియా మహారాణి ఇలాంటి వారు కోహినూరు వజ్రం ధరించి రాజ్యాలే కోల్పోయినారని చరిత్రయే చెపుతోంది గదా! అంటూ...    నిర్వాణలామా తన చుట్టూ పరిసరాలను ఒకసారిగా పరిశీలించి చూస్తూ... ఇప్పుడు మనము ఎవరెస్టు శిఖరానికి వాయువ్య దిశలో ఉన్నాము! నాకు తెలిసి ఈ దిక్కుగా మనము అరవై మైళ్లు వెళ్ళితే మనకి గావలసిన మనము అనుకున్న స్ఫటిక పర్వతము వస్తుంది! అని చెప్పగానే ప్రకృతికి ఆనందమేసింది!
ఉన్నట్టుండి…. … 
అనుకోని విపత్తుగా…ఇంతలో అనికోని అతిథిలాగా.. 
సుమారుగా 15 లేదా 18 అడుగుల ఎత్తు ఉండి భారీకాయ శరీరముతో పైగా ఒంటినిండా చీము,పుండ్లలతో,గాయాలతో,వీటిపైన ఈగలు,దోమలు ముసురుతున్న దేహ పరిస్ధితిలో వంటిమీద అతిపలుచని బాగా మురికి పట్టి చిరిగిపోయిన పసుపు వస్త్రము ధరించి..నుదటికున్న గాయము కనిపించకుండా దానికి ఒక మాసిపోయిన బట్టపీలిక కట్టుకొని ఉన్నగూడ ఈ గాయము నుండి ఒక్కొక్క నెత్తురు బొట్టు బొట్టుగా కారుతున్న గూడ పట్టించుకోకుండా వీరిద్దరిని తన రౌద్రచూపులతో చూస్తూ 
“నాకు బాగా ఆకలిగా ఉంది.తినడానికి ఏమైనా పెట్టండి” అనగానే 
నిర్వాణలామా వెంటనే “స్వామి..మీరు ఎవరో శాపగ్రస్తులైన యతీశ్వరులుగా ఉన్నారు.మీ ముఖము మీద నయము కాని గుంట గాయము బట్టి నేను అనుకుంటున్నాను.పైగా మీ భారీ కాయానికి ఉండే భారీ ఆకలి తీర్చే ఆహారము మా ఇద్దరి దగ్గర లేదు.కావలంటే మేమిద్దరము గూడ మీకు మనస్ఫూర్తిగా ఆహారము అవుతాము.అలా మీ భారీ ఆకలి కొంత అయిన తీరుతుంది” అనగానే..
“నాకు కావాలసిన ఆహారము మీరు కాదు” అంటూ నిర్వాణలామా చేతిసంచి బలవంతముగా లాక్కుని అందులో ఉన్న ఒక జామపండును తీసుకొని దాని తింటూ వీటి రుచి కనిపెట్టి నిర్వాణలామా కేసి చూస్తూ..
“అంటే ఈ జామకాయలు జంబూద్వీపములోని కల్పవృక్షము కాయలు గదా.ఎపుడో కాని ఇవి దొరకవు.ఇవి నీకు దొరికాయి అంటే నువ్వు ఖచ్చితముగా కారణజన్ముడివి.గత జన్మములో శాపము పొందిన శివయోగివి అంటూ నా ఆకలిబాధ తీర్చావు.మరో ఆరు నెలలు వరకు నాకు ఆకలి లేకుండా చేశావు.ఈ కాయలు ఉన్నవారిని కైలాస పర్వతము యొక్క అడుగుభాగమునకు వెళ్ళుటకు ఉన్న సొరంగమార్గమును చూపించాలని నాకు విధాత విధించిన విధి.నన్ను అనుసరించు.మీకు మేలు జరుగుతుంది” అనగానే
ప్రకృతి లోగొంతుతో నిర్వాణలామాకి మాత్రమే వినిపించేటట్లుగా 
“స్వామి..ఈయన ఎవరో ఏమిటో తెలియకుండా ఈయన వెంట ఎలా వెళ్ళేది?పైగా ఈయన అవతారము చూస్తూంటే దీర్ఘకాలిక నయముకాని కుఘ్ఠవ్యాథితో ఉన్నాడు.పైగా నుదటి మీద నయంకాని గాయముతో ఉన్నాడు.శరీరము అంతా దుర్గంత పూరితము.ఎన్ని సం.రాలు అయినదో స్నానము చేసి ఒక్కటే చెమట కంపు..గాయల క్రుళ్ళు వాసన..పుండ్ల చీము వాసన..భరించలేకపోతున్నాను” అనగానే
“ప్రకృతి ఈయన ఎవరో నీకు తెలియకపోవచ్చును.కాని ఈయన ఎవరో గ్రహించాను.ఈయన వివరాలు నీకు చెప్పే అవకాశము నాకు ఇపుడు లేదు.ఈయన చూపే మార్గము మనకి అవసరము.మారుమాట్లాడకుండా మనము ఆయన వెంట మౌనముగా వెళ్ళడము తప్ప మనము ఏమి చెయ్యలేము.మనము ఈయన వెంట వెళ్ళలేకపోతే మన వెంట ఈయన పడుతూనే ఉంటాడు” అనగానే 
ప్రకృతి మౌనముగా తన అంగీకారమును తెల్పేసరికి వీరిద్దరు కలిసి ఈ భారీకాయుడు వెంట బయలుదేరారు.ఇలా వీరందరు ఒక మంచుమైదానము లాంటి ప్రాంతమునకు తీసుకొని వచ్చి 
“ఇదిగో ఇది మంచుమైదానములాగా కనిపించే అతిపురాతనమైన సరస్వతినది.దీని అడుగున ఒక సొరంగమార్గముంది.దీని లోపలకి వెళ్ళితే మీరు కైలాస పర్వత అడుగుభాగములో ఉన్న శంభల గ్రామానికి చేరుకుంటారు.ఆపై ఈశ్వరేఛ్చ” అంటూ పది అడుగులు వేశాడో లేదో ఈ భారీకాయుడు కాస్త అదృశ్యమయ్యేసరికి...ప్రకృతి బిత్తరపోయింది.
వెంటనే “స్వామి..ఈ మహానుభావుడెవరు” అనగానే ...
నిర్వాణలామా అందుకొని “ప్రకృతి..భయపడకు.ఈయన సప్తచిరంజీవులలో ఒకరైన ఆశ్వద్ధామ మహర్షి. ఈయనకి పుట్టుకతోనే నుదుటి మీద ఒక దివ్యమణితో సహజసిద్ధముగానే జన్మించాడు.గాకపోతే పంచపాండవుల సంతానమైన ఉపపాండవుల్ని ఆధర్మముగా అర్ధరాత్రి ఇతను చంపడముతో శ్రీకృష్ణుడు ఇందుకు శిక్షగా పుట్టుకతో వచ్చిన నుదటి మణిని భీముడు చేత బలవంతముగా పెకలింపచెయ్యగానే ఆపై నయముకాని నుదటి గాయము ఏర్పడినది.పైగా శాపము కారణముగా నయముకాని కుఘ్ఠవ్యాథి ఇచ్చి మరణయాతన పడేవిధంగా చిరంజీవితత్త్వమును ప్రసాదించి ఎపుడు తనకి శాపవిముక్తి అడుగగా ఏపుడైతే కల్కిభగవానుడి మానవరూపమును ఈ భూలోకములో తనకి దర్శనము కలుగుతుందో ఆ క్షణమే ఈయనకి శాపవిముక్తి కలిగి సప్తరుషులలో ఒకరిగా వెలుగొందే వరమును పొంది ఈ శాపాల కారణముగా ఇలా చిరంజీవిగా నయముకాని గాయలతో భరించలేని ఆకలి బాధతో కలిపురుషుడైన కల్కిభగవానుడి అనుగ్రహము కోసము ఈ హిమాలయపరిసరాలలో సంచారము చేస్తున్నారు అంటూ..మన కాలచక్రతంతులోని గాలిగోపురాలను మోస్తూ ఒక బలిష్టుడైన వ్యక్తులు ఉన్నారు గదా.వాళ్ళే ఇలాంటి సప్తచిరంజీవులు అన్నమాట.అంటే ఈ లెక్కన చూస్తే మనము కైలాస పర్వతమునకు 20 లేదా 30 కి.మీ దూరమునకు వచ్చిఉండాలి”  అనుకుంటూ
ఈ మైదానము చుట్టుప్రక్కలకేసి చూడగా వీరికి అల్లంతదూరములో మహిమాన్వితమైన కైలాసనాథుడైన సదాశివమూర్తి ఆవాసము చేస్తున్న కైలాస పర్వతము కనిపించగానే వీరిద్దరూ అమితానందమునకు గురి అవుతూ 
“స్వామి..మీరు గమనించారా? ఈ పర్వతమును చూస్తూంటే తెల్లని స్ఫటిక మణి లాగా మెరుస్తూ కనపడుతోంది కదా” అనగానే 
“ప్రకృతి..నువ్వు చెప్పినది అక్షర సత్యము.ఇంకొక విషయము గమనించావా? ఈ కైలాస పర్వతము చుట్టు ఉన్న అష్టపర్వతాలను కలిపి చూస్తే మనకి ఈ కైలాస పర్వతము ఒక అష్టదళ పద్మములో ఉన్న స్ఫటిక మణి లాగా కనపడుతుంది.అంటే 
ఇదే నిజమైన “మణిపద్మం” అంటూ 
వీరిద్దరు కలిసి 
ఓం-మణి-పద్మ-హుం 
అంటూ నమస్కారభక్తితో ఈ మణిపద్మ స్ఫటికమణి అయిన కైలాస పర్వతము కేసి ఆర్తిగా చూస్తూ తన్మయత్వము పొందసాగారు.
ఆ తర్వాత వీళ్ళు 20 కి.మీ దూరము నడవగా…
వీరికి సుగంధభరిత పరిమళ సువాసనలు అమితముగా వచ్చేసరికి ఆ దిశగా వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ వీళ్ళకి పారిజాతపుష్ప వనము దర్శనమైంది.అంటే శ్రీకృష్ణుడు తన సత్యభామ అలక తీర్చటానికి దివి నుండి భువికి తెచ్చిన పారిజాతపుష్పాలు అలాగే కుంతిదేవి పూజకోసము అర్జునుడు ప్రార్ధనమేర ఇంద్రుడిచ్చిన పారిజాతపుష్ప వనములోనికి తాము ప్రవేశించినామని నిర్వాణలామా గ్రహించిడానికి అట్టే సమయము పట్టలేదు. 
అపుడు ప్రకృతి వెంటనే “స్వామి..ఈ పుష్పాలు ఏమిటి?మంచి సువాసనను ఇస్తున్నాయి” అనగానే
“ప్రకృతి..వీటినే పారిజాతపుష్పాలు అంటారు.ఇవి దేవతాపుష్పాలు.మన కాలచక్ర ఆధార బాక్స్ లో ఉన్న పుష్పాలలో ఇది ఒకటి.ఇవి ఉన్నచోట దేవతలు కాస్త సూక్ష్మశరీరధారిగా ఆవాసము చేస్తూంటారు.ఈ చెట్ల వయస్సు సుమారుగా 1000 సం.రాల నుండి 5000 సం.రాల దాకా ఉంటుంది.ఇవి పండ్లు,విత్తనాలను ఉత్పత్తి చెయ్యదు.ఈ చెట్టు పువ్వులు ఎపుడు మెరుస్తూంటాయి.గావాలంటే చూడు నీకే తెలుస్తోంది.అలాగే ఈ చెట్టు ఆకులు మన చేతివేళ్ళను పోలి ఉంటాయి.నువ్వు గమనించావా?చూడు.పైగా ఈ ఆకులు ఏడు భాగాలుగా చీలి ఉంటాయి.ఈ చెట్టుకి ఉన్న విశేషము ఏమిటంటే ఈ చెట్టు ఆకులు కాని పువ్వులు కాని కొమ్మలు కాని ఎప్పడికి ఎండిపోవు.అలాగే ఈ పువ్వులతో పూజ చేస్తే సకల దేవతలందరుగూడ మహాప్రీతి చెందుతారని పురాణవచనము.ఇది పాలసముద్రమును చిలికి నపుడు బయటికి వచ్చిన పవిత్ర వస్తువులలో ఈ పారిజాతం చెట్టు ఒకటని..దీనిని కల్పవృక్షమని అంటారని.. ఇది సర్వకోరికలు తీరుస్తుందని హైందవధర్మ పురాణ ఇతిహాసాలు మనకి చెప్పుతున్నాయి. అంటూ తలో ఒక పుష్పమును తీసుకొని వీరిద్దరు ముందుకి బయలుదేరుతుండగా..
*** *** *** *** *** ***
11 
నిర్వాణలామా తన చుట్టూ పరిసరాలను ఒకసారిగా పరిశీలించి చూస్తూ... ఇప్పుడు మనము ఎవరెస్టు శిఖరానికి వాయువ్య దిశలో ఉన్నాము! నాకు తెలిసి ఈ దిక్కుగా మనము అర మైళ్లు వెళ్ళితే మనకి గావలసిన మనము అనుకున్న స్పటిక పర్వతము వస్తుంది! అని చెప్పగానే ప్రకృతికి ఆనందమేసింది! ఇక్కడ నుండి వీళ్లు 13 రోజులపాటు అనేక అవాంతరాలు , వింతలు , విశేషాలు దాటుకుంటూ... ఈ చోటుకి చేరుకున్నారు! ఇంతలో నిర్వాణ లామా చిరునవ్వు నవ్వుతూ " అదిగో అల్లదిగో మనకు గావలసిన మంచులాంటి స్పటిక పర్వతము అయిన మన కైలాస పర్వతము" అనగానే....
ప్రకృతి ఆసక్తిగా అటువైపుచూడగా...  హిమాలయపర్వతాలు... అష్టాదశ పద్మాకారములో మణి పద్మములాగా... ఒక మంచు పర్వతము లీలగా వీళ్లకి కనబడింది! దానితో
ప్రకృతి ఎంతో తన్మయత్వముగా అతిసమీపముగా ఈ కైలాస పర్వతము కేసి నమస్కారభక్తితో చూస్తూండగా ఆమెకి ఈ పర్వతము గూర్చి తెలుసుకోవాలని అనిపించి 
“స్వామి!ఈ కైలాస పర్వత విశేషాలు గూర్చి చెప్పగలరా?”
“ప్రకృతి..ఈ కైలాస పర్వతము చూడటానికి ఒక పిరమిడ్ నిర్మాణములాగా కనపడుతుంది.అలాగే ఈ పర్వతమును ఎవరైనా నిశిత దృష్టితో చూస్తే మనకి ఈ పర్వతశిఖరము మీద ఎద్దు ముక్కురంధ్రాలు,చెవుల ఆకారము కనపడుతుంది.దీనికి కారణము మహాభారతములో ఒక కధ  చెపుతుంది.అది ఏమిటంటే పంచపాండవులు హిమాలయలకి వచ్చి సదాశివుడి జాడ తెలుసుకోవాలని విశ్వప్రయత్నాలు చెయ్యడము ప్రారంభించారు.ఈ విషయము తెలుసుకున్న సదాశివుడు వెంటనే ఒక పెద్ద ఎద్దుగా మారి అక్కడ ఉన్న పశువుల మందలో కలిసిపోవడము భీముడు గమనించి తన శరీరమును అమాంతముగా భారీగా పెంచి తన రెండు కాళ్ళను రెండు పర్వతాలమీద ఉంచి తన పంగాలో అక్కడ ఉన్న పశువుల మందను తొలమని మిగిలిన వాళ్ళకి చెప్పగానే వాళ్ళుచెయ్యగానే ఒక మానవుడి కాళ్ళ సందులోంచి వెళ్ళడము ఇష్టములేక ఆ పెద్ద ఎద్దు ఉన్నచోటులోనే భూమిలోనికి చొచ్చుకొని పోవడము ఆరంభించి తల కాస్త కైలాస పర్వతముగానే దీని మూపురము అనేది కేదార్ నాథ్ గా ప్రసిద్ధి గాంచినదని పురాణగాథ.అలాగే ఈ పర్వతమును చూసే శివుడికి చిహ్నముగా శివలింగమును ఉంచిఉంటారని అనిపిస్తుంది.ఈ పర్వత తూర్పుముఖము స్ఫటిక నిర్మితమని..పడమర ముఖము మాణిక్య నిర్మితమని..ఉత్తర ముఖము అయితే స్వర్ణ నిర్మితమని..అదే దక్షిణముఖము అయితే నీలమణి నిర్మితమని..అదేవిధముగా కాలానుసారముగా మనకి ఈ పర్వతము ఈ నాలుగు రంగులలో కనపడుతూ అందరిని ఆశ్చర్యానందాలకు గురిచేస్తుంది.అలాగే ఈ శిఖరముపైన మనకి మృందగం,గంట,తాళం,శంఖం అనే ఈ నాలుగు నాదాలు వినబడుతుంటాయి.ఈ శిఖరము మీద మనకి ఎన్నో దివ్యశక్తులు ఇచ్చే మొక్కలు అనగా అమరత్వమును,త్రికాలజ్ఞానము,సంజీవిని,పరశువేది వేరు ఇలా ఎన్నో ఉన్నాయని మన వృద్ధ లామాల పరిశోధనలో తెలుసుకున్నారు.పైగా ఈ పాదాల చెంతన నరవానర రూపములో అనగా వానరయతిగా భగవాన్ హనుమ రక్షకుడిగా ఉంటారని వీళ్ళు ధ్యానానుభవాలు పొందినారు.అంతెందుకు మన బౌద్ధధర్మ గ్రంథాలు ప్రకారము ఈ పర్వతము మీద మన భగవాన్ అవలోకితేశ్వరుడు తనకి సంబంధించిన 500 దేవతలు చొప్పున 990 వరుసలలో  కూర్చుంటారని వచనము. ఈ పర్వత నాలుగు ముఖాలను నిశిత దృష్టితో చూస్తే మనకి ఎద్దు,ఏనుగు,సింహము,గుర్రం ముఖాలుగా కనపడతాయి.పైగా ఇక్కడి వాతావరణము మిగిలిన చోట్ల కన్నా భిన్నముగా ఉంటుంది.అందువలన ఇక్కడున్న వారికి వేరే ప్రాంతాలలో ఉండేవారికి ఒకరోజులో పెరిగే గోర్లు,వెంట్రుకలు,వృద్దాప్యం ఇక్కడ ఉన్నవారికి ఒక గంటలో పెరుగుతుందని మన శాస్త్రవేత్తలు పరిశోధనలో తెలుసుకున్నారు చెపుతూండేసరికి….
పరిసరాలలో ఉన్నట్టుండి మార్పులు రావడము మొదలైంది.చెట్ల మీద ఉన్న పక్షులు దేనినో చూసి భయపడుతున్నట్లుగా విపరీతముగా గోల చెయ్యడము మరోవైపు మంచు దుప్పిలు,కస్తూరిమృగాలు,గొర్రెలు దేనిదో రాక వాసనను కనిపెట్టి బెదిరి పారిపోవడము నిర్వాణలామా గమనించి తన మనస్సులో శంక మొదలై విపరీతముగా తన మనస్సు ఆందోళనకి గురి అవుతోందని గ్రహించి ఏదో ప్రమాదము తమని వెతుకుంటూ వస్తోందని అనుకోనేలోపులే...
హఠాత్తు పరిణామముగా 18 అడుగుల ఎత్తు ఉండి ఓంటినిండా తెల్లని దట్టమైన బొచ్చుతో ఒక పెద్దసైజు గొరిల్లా ముఖముతో పిల్లి కళ్ళతో ఉన్న నర వానరము దగ్గరికి వస్తూండగా..అంతే వేగముగా ఈ పరిసరాలు అంతా గూడ సుగంధభరిత పరిమాళాలతో అనగా సౌగంధిక పుష్పాలు వాసన రావడముతో..ఈ పువ్వుల సువాసన మత్తులోనికి వీరిద్దరు జోగుతూండగా పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ పెద్దపెద్ద అరుపులతో అరుస్తూ వీళ్ళని దాటుకుంటూ ఈ నరవానరము శరవేగముతో దాటుకుంటూ వెళ్ళిపోయింది.ఇది వేసిన అడుగున్నర పాదముద్రలను చూసిన నిర్వాణలామా వెంటనే ఈ నరవానరము ఏవరో గాదని కైలాస పర్వత పాద పీఠభాగమున నిత్య రక్షకుడైన వీర హనుమ యతీశ్వరుడని గ్రహించి ఇదే విషయాన్ని ప్రకృతికి చెప్పగానే వీరిద్దరు ఈయన వెళ్ళిన వైపు నమస్కారభక్తితో “స్వామి..మా ఇద్దరిని ఈ విధంగా అనుగ్రహించినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము” అని చెప్పి స్వస్వరూపముతో ఇంతకముందు దర్శనమిచ్చిన సప్తచిరంజీవులలో ఒకరైన ఆశ్వద్ధామ మహర్షి చూపించిన సొరంగమార్గము వైపు వీళ్ళు బయలుదేరారు.
దానితో వీరు ఈ పర్వతము దగ్గరికి వెళ్లి చూడగా.... చూడటానికి ఇది ఒక ముక్కోణాకారముతో ఉన్న గూడ నిజానికి నలు చదరపు పీఠము పైన నాలుగు త్రిభుజాల నిర్మాణముతో...ఒక పిరమిడ్ ఆకార నిర్మాణముగా ఉంది!అక్కడున్న ఒక శిలాఫలకమును చూస్తే.... ఇది 13 ఎకరాల విస్తర్ణములో... 120  అడుగుల ఎత్తున్న వేదిక మీద... భూమికి 2 , 160 అడుగుల ఎత్తున నిర్మించినట్లుగా తెలుసుకున్నారు! ఇంతలో వీరిద్దరికి ఉత్తర ముఖము మీద చిన్న సూది బెజ్జం వంటి రంధ్ర నిర్మాణము కనబడింది! ప్రకృతి ఆసక్తి గమనించిన నిర్వాణ లామా వెంటనే ' ఆకాశము కేసి చూపిస్తూ.... ధృవ నక్షత్రము ఏ దిక్కులో ఉందో... ఈ రంధ్రము చెపుతుంది! తద్వారా సప్త ఋషుల మండలము మనకి కనబడుతుంది! ఆ తర్వాత నిర్వాణలామా ప్రకృతికేసి చూస్తూ " ప్రకృతి! కనిపించే రంధ్రము క్రింద వంద అడుగుల లోతుకి దిగువ మెట్లు కనిపిస్తాయి! అక్కడకి వెళ్ళితే మనకి మంచుతో ఉన్న ఒక ద్వార బంధనము కనబడుతుంది! కాని ద్వారము తెరవటానికి సంవత్సరములో ఒక రోజు మాత్రమే అవకాశముంటుంది! అదిగూడ సూర్యుడు మేషరాశియందు ప్రవేశించే రోజు... అది పౌర్ణమిరోజు గావాలి! ప్రస్తుత ఈరోజు ఘడియలు నడుస్తున్నాయి అంటూ
తీరా ఈ సొరంగ మార్గము దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వీళ్ళకి ఒక ద్వారబంధనము కనపడినది.పైగా ఇది దట్టమైన మంచుతో కప్పబడి మంచు ద్వారములాగా కనపడేసరికి ఈ మంచు తొలగించడము మానవమాత్రుడి సాధ్యముకాదని కేవలము సూర్యకాంతికిరణాలు వలనే ఈ మంచు కరుగుతుందని నిర్వాణలామా గ్రహించి ప్రకృతితో ఒక సుముహర్త కాలములో ఇక్కడ పడే సూర్యకాంతి కిరణాల వలనే ఈ ద్వారబంధనము తెరుచుకునేటట్లుగా ఏర్పాటు చేశారని అది గూడ కాలగమనంలో మన భూమి తిరిగే ఉత్తర,దక్షిణ దిశ ప్రతి 72 సంవత్సరాలకి ఒక డిగ్రీ చొప్పున పెరుగుతూ ఎపుడైతే ఇది 72 డిగ్రీలకి చేరుకుంటుందో ఆ సమయములో సూర్యుడు కాస్త మేషరాశికి చేరుకుంటాడు.ఈ రాశికి అధిపతి కుజగ్రహము గావడము ఈయన అగ్నితత్వము కలిగి ఉండుటవలన ఈ అధిక వేడిమి యొక్క సూర్యకాంతికిరణాలకి ఈ మంచు ద్వారము కరుగుతుందని కాలచక్ర తంతులో ఉన్నదని..ఇపుడు మరో గంటలో ఈ సుముహర్త ఘడియలు ప్రారంభమవుతాయని చెప్పి అపుడిదాకా వీరిద్దరు ఓం-మణి-పద్మ-హుం అను మణిమంత్రమును జపముగా చేసుకోసాగారు.అనుకున్న సమయానికి ఈ మంచు ద్వారబంధనము మీద అధిక వేడి సూర్యకిరణాలు పడిన సుమారు 5 గంటలు దాకా ఈ మంచు కరగటానికి సమయము తీసుకుంది.అపుడిదాకా వీరిద్దరు జపము చేస్తూనే ఉన్నారు.ఎపుడైతే మంచు పూర్తిగా కరిగి ఉక్కుతో చేసిన ద్వారము కనిపించి దానికున్న బంధనమును నిర్వాణలామా తన ఆయుధచేతులతో తొలగించి ద్వారము తెరిచి లోపలకి వెళ్ళగానే యదావిధిగా ఈ ద్వారము మూసుకొనిపోవడము జరిగింది.మళ్ళీ ఇది తెరుచుకోవాలంటే సూర్యుడు కాస్త మేషరాశికి రావలంటే మరో  ఒక సం! పడుతుందని అనుకుంటూ వీరిద్దరు లోపలకి వెళ్లారు.
లోపలికి వీళ్ళు కొంతదూరము పోయిన తర్వాత వీరికి టీ జంక్షన్ వచ్చింది.ఎటు వెళ్ళాలో..ఎటు వెళ్ళితే ఏమి వస్తుందో అర్ధము అవ్వక ఏమి చెయ్యాలో అని అనుకుంటూ బుద్ధ భగవానునిని తలుచుకుంటూ మణిమంత్రము చేసుకుంటూ ఉండేసరికి వీరికి ఈ జంక్షన్ మధ్యలో ఒక కాంతిపుంజము గాలిలోంచి ఏర్పడి అది కాస్త మానవమాత్రుడిగా మారి 
“స్వామి.కంగారుపడకండి.నేను ఒక శాపగ్రస్త గంధర్వుడిని.నా వేణుగానముతో గంధర్వలోకమును మెప్పించేవాడిని.ఒకరోజు అనుకోకుండా గానసభలో నా శృతి తప్పినది.దానితో మా రాజు నన్ను ఈ శంభల గ్రామమునకు దారి చూపే వ్యక్తిగా ఉండమని నాకు శాశ్వత శాపమిచ్చాడు.దానితో ఇలా ఏకాంతముగా ఒంటరిగా కూర్చుని వేణుగానమును అభ్యాసము చేస్తున్నాను.అలాగే ఈ దారిగుండా వచ్చేవారికి అసలు దారి చూపిస్తూ ముందుకి తీసుకొని వెళ్తాను.మీరు ఒకవేళ ఆ దారిగుండా వెళ్ళితే సరాసరిగా కైలాస పర్వతము దగ్గరికి మళ్ళీ వెళ్ళేవాళ్ళు.అదే ఈ దారిగుండా వెళ్ళితే మీకు గావాలసిన పాదరసచింతామణి ఉండే శంభల గ్రామము వస్తుంది.నిజానికి నేను ఈ మణికి నిత్యపూజారిని అన్నమాట.ఈ మణి దగ్గరికి మనము వెళ్ళాలంటే శ్రీ చక్ర నవనిర్మాణ అడుగు త్రికోణము దగ్గరికి వెళ్ళాలి.అక్కడ ఈ నవావరణాలు దాటుకుంటూ అడుగుభాగానికి చేరుకుంటే గాని మనకి పాదరస చింతామణి దర్శనము గాదు.అర్హత,యోగ్యత ఉన్నవారికి మాత్రమే ఈ మణి దర్శనము అవుతుంది.అంతే గాని నేను మీ వెంట ఉన్నంతమాత్రమున ఇది జరుగదని తెలుసుకొండి.అలాగే ఈ నవావరణాలను దాటడానికి మనము ఏన్నో మాయలు,మర్మాలు దాటవలసి ఉంటుందని గ్రహించండి.నేను కేవలము మీ వెంట ఒక సాక్షిభూతుడిగా ఉండి మార్గము చూపిస్తాను.కాని ఆ మార్గములో వచ్చే మాయలను మీ వివేకబుద్ధితో దాటవలసి ఉంటుంది.ఇందులో నేను ఎలాంటి సహాయము మీకు చెయ్యను.ఒకవేళ మీకు ఇపుడే భయము కలిగితే ఆ దారి నుండి వెళ్ళితే యధావిదిగా కైలాస పర్వత భూభాగమునకు క్షేమముగా చేరుకుంటారు” అనగానే 
నిర్వాణలామా వెంటనే “స్వామి..మాకు ఏలాంటి ఆశ కాని మృత్యుభయము లేవు. మాకు మీ సహాయముగా మౌనముగా మాకు గావాల్సిన పాదరసచింతామణి దర్శనమార్గము చూపించండి.అక్కడికి వెళ్ళటానికి వచ్చే అన్ని ఆవాంతరాలు మా బుద్దులతో దాటుకుంటాము.లేదంటే దారిలోనే మా ప్రాణాలు వదిలి వేస్తాము” అనగానే 
“సరే..మీరిద్దరు ఇంత మనో సంకల్పముతో నిశ్చయించుకొని వచ్చినపుడు నా వంతు సహాయము నేను చేస్తాను” అంటూ వీరిద్దరిని ఎదురుగా కనిపించే దారి వైపుకి తీసుకొని వెళ్ళాడు.
వంద అడుగులు దిగి లోపలికి వెళ్లగా... అక్కడ ఎవరో వెలిగించియున్న కాగడాల వెలుతురు స్వాగతము పలికింది! లోపల వైపు ఎన్నో సంవత్సరాల నుండి యోగసాధన నిష్ఠలో ఉన్న యోగులు , సాధువులు , లామాలు ఇలా ఆశ్చర్యముగా... వింతగా కేవలము 18 మంది కనిపించేసరికి.... అంటే వీరంతా జీవసమాధి చెందిన వారని వీరిద్దరు గ్రహించి  ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి ఈ ద్వారము గుండా లోపలకి ప్రయాణిస్తుండగా... గంధర్వుడు వెంటనే... ఉత్తర ద్వారము వైపు వెళ్ళితే నాలుగు రోజులలో కైలాస పర్వతమునకు వెళ్లవచ్చును! అదే ఈశాన్యం దిక్కుగా వెళ్ళితే  శ్రీచక్రం ఉన్న స్పటికపు ఆలయమునకు వెళ్లవచ్చును! ఇప్పుడు మనము ఈ ఆలయము వైపుకి వెళ్లుతున్నాము అని చెప్పి ముందుకి సాగారు! సొరంగం లోపల విపరీతమైన చలిగా ఉంది! కాని ఆశ్చర్యముగా చీకటి లేకపోవడము వీరిద్దరు గమనించారు! కారణము ఈ గుహకి కిటికీల లాంటి రంధ్రాలు ఏర్పర్చబడినాయి! సరిగ్గా కొలతల ప్రకారము ఎక్కడైతే సూర్య కిరణాలు పడతాయో.... సరిగ్గా ఆ ప్రాంతములో అంతర్గత గుహయందు ఈ కిటికీల నిర్మాణము చేసిన భారతీయ యోగుల జ్ఞానానికి వీరిద్దరు మనస్సులోనే జోహార్లు చెప్పుకున్నారు! భూమిపై ఉన్న ధృవ నక్షత్ర కాంతి ఒక చోట ఈ అంతర్గత గుహ యందు ఉన్న చిన్న మంచు ఫలకము  మీద పడుతూ ఉండటము ఈ ముగ్గురు గమనించారు! వెంటనే గంధర్వుడు ఏమాత్రము ఆలోచించకుండా ఈ శిలను తాకగానే... అది పెద్ద శబ్దము చేస్తూ ఒకవైపు ఉన్న స్పటికగోడ తెరుచుకొంది!  లోపలివైపు వెళ్లగా... స్పటిక మందిరములోని 2 వ అంతస్థుకి చేరుకున్నామని వీళ్లు గ్రహించినారు! గాకపోతే అక్కడ ఒక త్రిభుజాకారముగా అడుగుకి పోయే ముక్కోణపు హాలులోకి క్రిందకి  వెళ్ళటానికి దిగుడు బావిలాగా మెట్లు ఉన్నాయి! అంటే బయట ఉన్న వరండా త్రిభుజాకారముగా పిరమిడ్ ఆకారముగా ఉంటే లోపల ఉన్న వరండా తలక్రిందులుగా ఉన్న త్రిభుజాకారపు త్రికోణములాగా ఉన్నదని వీళ్లు గమనించారు! పైగా ఇది దాదాపుగా 13 మెట్లు ఉన్నాయి! పైగా ఈ 13 మెట్ల క్రిందకి ఎలా దిగాలో 13 బాణపు గుర్తులు సూచనగా ఉండటము బట్టి చూస్తే ఇది ఎంతటి ప్రమాదకరమైన ప్రాంతమనో చెప్పకనే తెలుస్తుంది అని వీరిద్దరు అనుకున్నారు!
            ఇక ఇంత దూరము వచ్చిన తర్వాత పోయే ప్రాణాల గూర్చి ఆలోచనలు చేస్తే ఏమి లాభముండదని ఒక్కొక్క మెట్టు దిగడము ప్రారంభించారు! ఇది ఆశ్చర్యముగా ఒక ప్రదిక్షిణము పూర్తి చేస్తే కాని మళ్లీ దాని క్రింద ఉన్న తర్వాత మెట్టుకి దారి కనిపించడము వీళ్లకి ఆశ్చర్యము వేసింది! ఇలా ఉన్న 13  ప్రదిక్షిణాల మెట్లు దిగి వీరంతా బిందు స్థానానికి అడుగు భాగానికి చేరుకున్నారు! అక్కడ వాళ్లకి నలుపలకల గది వంటి నిర్మాణము కనబడింది! ఈ గదిలోనికి వెళ్లిన వీళ్లకి దక్షిణ ముఖముగా వెళ్లే ద్వారము తెరుచుకొని ఉండటము గమనించి లోపలకి వెళ్లితే....
అక్కడ వీళ్లకి ఒక సొరంగ మార్గము కనిపించింది! ఈ సొరంగ మార్గము గుండా వీళ్లు వెళ్లుతుంటే వేడి వేడి సెగలు పొగలతో ఉన్న వేడినీటి బుగ్గలు కనిపించాయి! అంటే అర్హత , యోగ్యత పరీక్షలు మొదలైనాయని వీరిద్దరు నెమ్మదిగా గ్రహించారు! అప్పుడు ఈ విషయము గమనించిన గంధర్వుడు వెంటనే "నాయనలారా! ఇక్కడి దాకా ఎవరైనా సంకల్ప సిద్ధి బలముతో రాగలుగుతారు! కాని ఇక్కడ నుండి మొదలై ప్రయాణము అంతాగూడ మనకి యోగ పరీక్షలు లాంటివే! మనకి అర్హత , యోగ్యత లేకపోతే వాటి వలన మనకి ప్రమాదాలు జరగవచ్చును! అందరు జాగ్రత్తగా ఉండండి! జాగ్రత్తగా ముందుకి నా వెంట నా వెనుక రండి" అంటూ ముందుకి పోసాగారు! కాని ఈ వేడి బుగ్గల వేడిమి వీరిద్దరి శరీరాలు తట్టుకోలేని పరిస్థితిగా ఉంటే అదే గంధర్వుడు మాత్రము ఏమాత్రము ఎలాంటి బాధలేని వాడిలాగా తాపీగా ముందుకి పోతూ ఉండటము వీరిద్దరు గమనించినారు!
ఇలా వీళ్లు వేడి నీటి పుష్కరిణి దాటుకొని పోతూండగా... గంధపు వాసన విపరీతంగా రావడము మొదలైంది! వెంటనే గంధర్వుడు తన చేతి లోంచి ఏదో ఒక మూలికను బయటికి తీసి దానిని వీళ్లకి ఇస్తూ ఇది ముక్కు దగ్గర పెట్టుకోండి! మీకు గంధపు వాసన సోకదు! ఇది దానిని హరిస్తుంది! ఒకవేళ నేను చెప్పినట్లుగా చెయ్యకపోతే ఈ వాసనకి మీరు కోమాలోనికి వెళ్లి క్షణాలలో చనిపోతారు అని చెపుతూ ముందుకి సాగారు! ఇలా వీళ్లు సుమారుగా ఇలాంటి 18 రకాల యోగపరీక్షలు ఎదుర్కొన్నారు!   ఆ తర్వాత వీరు సొరంగ మార్గము అటు వైపుకి క్షేమముగా వీరంతా చేరుకున్నారు! అప్పుడు గంధర్వుడు అక్కడ ద్వార బంధముండటము గమనించి అక్కడ ఉన్న ఒక గుడ్లగూబ బొమ్మతో ఉన్న మీటలాంటి స్పటిక ఫలకను తమతో వచ్చిన గంధర్వుడు ఈ మీటను నొక్కగానే.. ఈ ద్వారము తెరుచుకుంది!
అప్పుడు వీళ్లకి కళ్లుజిగేలుమంటూ ఏడురంగుల  దివ్య తేజస్సుతో వెలుగుతున్న స్పటిక గోడ వంటి గది కనిపించింది! ఈ గది లోపల గంధపు చెక్కతో చేసిన ఒక పెద్ద భోషాణము వీళ్లకి కన్పించింది! దీనిని తెరిచి చూస్తే ఎరుపు , తెలుపు రంగులు ఉన్న సిల్కు గుడ్డలతో చుట్టియున్న 18 తాళ పత్రాల గ్రంధాలు వీళ్లకి కనిపించాయి!  ఈ తాళపత్ర గ్రంధాలను చూడగా... అందులో ఏడు తెలుపు వస్త్రముతో...ఆరు ఎరుపు వస్త్రముతో ఉండటము గమనించి ఆశ్చర్యము చెందినారు! అప్పుడు గంధర్వుడు వెంటనే " నాయనా! ఈ ఏడు గ్రంధాలు కలియుగము ప్రారంభం నుంచి శ్రీ కృష్ణుడు అవతారము చాలించినపుడు నుండి మొదలై 21 వ శతాబ్ది వరకు రచించబడి ఉంటుంది! మిగిలిన ఆరు తాళపత్ర గ్రంధాలలో రానున్న 5000 వేల  జరగబోయే భవిష్యత్తు చెప్పబడుతుంది! ఇందులో అందరి జాతకము, పుట్టుక , చావులు , వేలిముద్ర గుర్తులతో, పేరులో వచ్చే అక్షరాలతో సహా... అంతాగూడ లిఖించబడి ఉంటుంది. ప్రపంచ దేశాల స్థితిగతులు , యుద్ధాలు , వ్యాపారాలు , కరువులు , జననష్టాలు , భూకంపాలు , సిద్ధపురుషుల అవతారాలు ఇలా ప్రతీది  లిఖించబడి ఉంటుంది! ఆది నుండి అంతము వరకు జరిగే ప్రతి మిల్లి సెకండ్స్ ఈ గ్రంధములో చెప్పినట్లుగా జరుగుతుంది! అనగానే...
ప్రకృతి వెంటనే "స్వామి! అయితే భూమ్మీద జరిగే ఉపద్రవాలు ముందే తెలుసుకొని జాగ్రత్త పడవచ్చుగదా!”
వెంటనే గంధర్వుడు అందుకొని "అమ్మా! ఈ గ్రంధాలు సిద్ధ పురుషులు తమ త్రినేత్రముతో చూసి రాసిన భవిష్యాలే! ఇది చదవటానికి తప్ప జాగ్రత్త పడటానికి ఏమి ఉండదు! భవిష్యత్ లో జరగబోయే సంఘటనాలను ముందుగా చెప్పి వాటికి మనల్ని సిద్ధపడేటట్లుగా చెయ్యడానికి ఈ గ్రంధాల రచన చెయ్యడము జరిగింది! జరిగేది జరుగుతుంది! జరగనిది ఎన్నడికి జరుగదు! అందుకే ఈ పురాణ సంహిత భవిష్య గ్రంధము నరమానవుడి కంట పడకుండా ఉండటానికి , అలాగే ఏవైతే బ్రహ్మ  జ్ఞాన రహస్యాలు , దేవ రహస్యాలు  స్వార్ధ పరుల చేతిలో పడకూడదని... ఈ గ్రంధము చుట్టూ 18 మంది సిద్ధ గురువులు ఎల్లప్పుడు వారి సూక్ష్మ శరీరాలతో కాపలా కాస్తూ... తమ మనోనేత్ర కాంతి దృష్టితో చూడగానే... ఈ గ్రంధము మాయమై హారతి కర్పూరము లాగా గాలిలో హరించుకొని పోతుంది! దీనిని ఎవరికి ఎప్పుడు ఏ సమయములో లభించాలో వాళ్లు లభించే సమయానికి వాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రంధము కాస్త నీటి ఆవిరి నుంచి వడగండ్లు గడ్డకట్టి నట్లుగా ఈ రహస్య గ్రంధము సాక్షాత్కరించి కనబడుతుంది! ఇలా నాకు తెలిసి వేదవ్యాసుడికి , శ్రీ శంకరాచార్యుడికి ఈ గ్రంధాలు కనిపించినాయని వినికిడి! అంటూండగా... 
వీరిద్దరికి రక్త ప్రసరణ వేగముగా కొట్టుకోవడము గమనించిన 
గంధర్వుడు "నాయనలారా! మనము ఉన్న గదిలో అతిశక్తివంతమైన అతినీల లోహిత కిరణాలను 18 ప్రక్కల నుండి ప్రసారము అయ్యేటట్లుగా అమర్చినారు! ఇక్కడ మనము 48 నిమిషాలకి మించి ఉండలేము! ఆపై ఉంటే రక్త ప్రసరణ ఆగిపోయి గుండె కొట్టుకోవడము నిలిచిపోయి శ్వాస ఆగిపోయే ప్రమాదము ఉంది అంటూండగా... భోషాణములోని గ్రంధము వీళ్ల కళ్ల ముందరే నీటి ఆవిరిగా మారిపోవడము గమనించి ఆశ్చర్యము చెందుతూండగా వారికి ఈ గదికి ఉన్న ద్వారము తెరుచుకుంది!
అప్పుడు వీళ్లకి శ్రీచక్ర అడుగున భాగములో ఉన్న బిందు స్థానమునకు వచ్చినట్లుగా అన్పించింది! ఎందుకంటే అక్కడ అడుగుభాగమున అష్టదళ పద్మము ఒకటి కనబడుతోంది! ఈ పద్మ కేంద్రములో ఒక వజ్ర నిర్మిత పీఠమున్నట్లుగా వీళ్లు గమనించారు! ఈ పీఠము మధ్య భాగములో ఒక గుండ్రటి పంపర  పనసకాయ సైజులో గోళము వంటి పాదరసములాగా దివ్యకాంతితో మెరిసిపోతూ కోటి సూర్య చంద్రుల కాంతితో కళ్లు కన్పించనంత దివ్య తేజస్సుతో మెరిసిపోతున్న ఒక దివ్య సాలగ్రామ శిల ఒకటి వీళ్లకి కనిపించింది! పైగా ఇది దాని అంతటే అదే తన చుట్టు తాను తిరుగుతూ ఓంకార నాదము హోరు చేస్తుంది! దీనిని చూస్తున్న గంధర్వుడు ఎంతో తన్మయత్వము చెందుతూ 
"అదియే....అదియే... అతి దివ్యమైన మణి అయిన పాదరసచింతామణి శిల”...
జీవించి నడిచే ప్రాణమున్న శిల...
రాబోవు కాలములో శంబల ప్రభువు దగ్గర ఉండే అతి మహిమాన్వితమైన శిల...
దీనిని చూడడమనేది 1000 కోట్ల జన్మల పుణ్య ఫలమే... అంటూండగా... ఈ పాదరసచింతామణి శిల... గాలిలో తేలుతూ.... గంధర్వుడు చేతికి చేరింది! అప్పుడు వీరిద్దరు దీనిని పరిశీలించి చూడగా... ఇది ఒక ప్రక్క అర్ధ చంద్రాకారములో ముఖము అనగా రెండు పెదవులు తెరచియున్న ద్వారము ఉంది! పైగా ఇది తన అంతట తానే తిరుగుతున్న ఓంకార నాద  హూరుతో పాటుగా, ప్రతిసారి వివిధ రంగుల కాంతులను విరజిమ్ముతోంది! ఒకసారి ఎరుపుగాను మరొకసారి ముత్యపు రంగులో... ఇంకొకసారి నీలములో... మరొకసారి బంగారపు కాంతితో, ఆకుపచ్చగాను, ఇలా నవగ్రహాలకి ఉండే నవరంగులతో ఈ సజీవ శిల ఉన్నదని వీరిద్దరు గమనించి దానిని తాకి తాకగానే... సృహ తప్పిపోగానే..ఆ గంధర్వుడు వెంటనే వీరిని తన మంత్రశక్తితో సృహ తెప్పించి..
“నాయనులారా..పంచామృత మణితీర్ధమును సేవించండి” అనగానే వీరిద్దరు సేవించగానే ఏదో తెలియని అలౌకిక ఆనందస్ధితిని అనుభవిస్తూండగా..
ప్రకృతి వెంటనే అక్కడున్న నిర్వాణలామాతో “స్వామి...ఇపుడు నా మనస్సు శాంతిని కోరుకుంటోంది.ఎంతో హాయిగా 1000 ఏనుగుల భారము తగ్గినట్లుగా అనిపిస్తోంది.నాలో ఏలాంటి శూన్యతభావ స్ధితి లేదు.కాని మనస్సుకి అతీతమైన ఆనందస్ధితిని పొందుతున్నాను అని నాకు అనిపిస్తోంది.ఇక నాకు మీ బంధనము నుండి విముక్తి కలిగించండి.నేను శివైక్యం చెందాలని అనుకుంటున్నాను” అంటూ అక్కడే ఉన్న పాదరస చింతామణిని మరొకసారి ప్రకృతి తాకుతూ దానితో 
“ఓ మణి పద్మమా..నాకు ఇహపర భోగభాగ్యాలు అనుభవించాలని లేదు.సంసారతాపత్రయాలు గూడ లేవు.కాని శాశ్వత ఆనందస్ధితి అదే పరిపూర్ణ శాంతిని పొందాలని అనుకుంటున్నాను.ఈ మన:శాంతి శాశ్వతముగా అనుభవించేలాగా నన్ను దీవించు” అంటూండగానే
అక్కడే ఉన్న గంధర్వుడు వెంటనే “అమ్మా..ఈ పాదరస చింతామణి ఒకే ఒక ఇష్టకోరికను మాత్రమే తీరుస్తుంది.ఆరోగ్యమును ప్రసాదిస్తుంది.దీర్ఘావును ప్రసాదిస్తుంది.మంచి జ్ఞానము ప్రసాదిస్తుంది.కాబట్టి ఇక్కడున్న పాదరస మణికి నీ ఇష్టకోరిక ఏమిటో చెప్పు..అది క్షణాలలో నెరవేరుస్తుంది” అనగానే
ప్రకృతి వెంటనే ఈ మణిపద్మము కేసి చూస్తూ..
“ఓ మణిపద్మమా..నా చిరకాల వాంఛ నాకు శివైక్యం ప్రసాదించు..ఇదియే నా ఇష్టకోరిక” అనగానే..
ఉన్నట్టుండి 
ఈ పాదరస చింతామణి నుండి ఒక నీలిరంగు దివ్యకాంతి ప్రసారము బయటికి వచ్చి అది కాస్త అక్కడే ఉన్న ప్రకృతి మీద మెరుపు కాంతిలాగా పడిపడగానే ఈ కాంతి ప్రసారము కాస్త ఈశాన్యదిక్కు వైపుకి ప్రసరించిగానే ఈ కాంతి మాయం అయింది.దీనితోపాటుగా అదేవిధంగా ప్రకృతి మాయమవ్వడము చూసిన మిగిలిన ఇద్దరు పెద్దగా ఆశ్చర్యచెందకపోగా ….
గంధర్వుడు వెంటనే “నిర్వాణలామా..మీ భార్య అనుకున్న ఇష్టకోరికను తీర్చుకోవడానికి తన ఆత్మశక్తితో శివైక్యం చెందినది” అంటూండగానే 
అక్కడే ఉన్న నిర్వాణలామా ధ్యాననిష్ఠలోనికి వెళ్ళి ఒక మెరుపు కాంతిలాగా మహా నిర్యాణము చెందడము చూసిన ఈ గంధర్వుడు వెంటనే తన మనస్సులో మీమీ ఈ మానవ జన్మాలు వృధా కాకుండా సాధన శక్తితో పున:కర్మ జన్మ లేకుండా కైవల్యమైన మహా నిర్యాణము చెందారు. మీలాంటి పుణ్యదంపతులకి ఈ చింతామణి దర్శనము కల్గించినందుకు నాకున్న శాపము తొలిగినది అనుకుంటూ గంధర్వుడికి శాపవిముక్తి కల్గి గంధర్వలోకమునకు చేరుకున్నాడు.
అయిపోయింది.

ఇలా ఇది పరమహంస చేసిన ఈ మణిపరిశోధన 300 పేజీల రిపోర్డ్ యొక్క 30 పేజీల సారాంశమని హర్వేకి అర్ధమై ఈయన ఈ విధంగా ఈ రెండు దైవ దివ్య మణులైన శ్రీకృష్ణుడి శమంతమణి అలాగే బుద్ధుడు చింతామణి మీద పరిశోధనాలు చేసి పరమహంస కాస్త స్మశానవైరాగ్యము చెంది మణివేదాంతి అయ్యారని ఈ ముగ్గురికి అర్ధమై మౌనము వహించారు.


No comments:

Post a Comment