అధ్యాయము 51

 ఈ దృశ్యాలు అన్ని గూడ....

హార్వే పరికరములో రికార్డు అయ్యాయి. వీటిని చూసి ఈ ముగ్గురు కంగారుపడుతుంటే....

తాపీగా.... విశ్రాంతి స్థితిలో ఉన్న కాలాముఖాచార్యడు వీళ్లకి కనిపించగానే....

స్వామి! కర్కోటకుడు వచ్చి ఎంతపని చేశాడో తెలిసిన గూడ మీరు తాపీగా ఎలా ఉండ కల్గుతున్నారు. వాడి వలన మా గురువు గారికి ఏదైన ప్రాణాపాయము కల్గుతుందేమో గదా. అన్నారు

నాయనా! కాలము తీరితే ఇక్కడ ఎవరు ఉండరు. జరిగేది జరుగక మానదు. జరగనిది ఎన్నడికి జరుగదు. మన ప్రయత్నము మనము చేశాము. వాడి ప్రయత్నము వాడు చేశాడు. మనము రక్షించాలని అనుకుంటే వాడేమో భక్షించాలని అనుకుంటున్నాడు. ఎవరి పని వాళ్లు చేస్తున్నారు. చెయ్యనియ్యండి.

కాలమే అన్నింటికి పరిష్కారము చూపిస్తుంది. సమస్య ఇచ్చేది అదే పరిష్కారము ఇచ్చేది అదే.

 ఇపుడు వాడి కాలము నడుస్తోంది. ఆ తర్వాత మన కాలము వస్తుంది గదా. అపుడు మనము ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో కాలమే మన చేత చేయిస్తుంది. అది మనకి మంచిదా  లేదా అనేది మన కర్మ ఫలితము బట్టి కాలమే ఇస్తుంది. అపుడిదాకా ఎవరు గూడ ఏమి చెయ్యలేరు. అష్టదిగ్బంధన చేసిన దత్తుడికి ఈ విషయము తెలియదా? తెలియకుండా ఉంటుందా? తెలిసే ఉంటుంది. అయిన కాలధర్మమును తప్పకూడదని ఆయనే అనుకున్నపుడు మనమెంత ఆలోచించండి. జరిగేదానిని సాక్షీభూతముగా చూడటము తప్ప మనమేమి చెయ్యలేము. చెయ్యాలి అనుకోవడము తప్ప ఏమి చెయ్యలేము. అంటూ ఏదో దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. ఈ విషయము గమనించిన

దేవి వెంటనే "స్వామి! మీరు ఏదో విషయమును సుదీర్ఘముగా ఆలోచిస్తున్నారు?" అంది

ఏమిలేదు తల్లి! ఇపుడిదాకా మీ గురువుగారు ఈ ఆరు చక్రాలను దక్షిణాచార పద్దతిలో జయించారు. ఇపుడున్న కర్మ, గుణ, కాల, బ్రహ్మ చక్రాలకు వామాచార పద్దతిలో జయించాలి. మరి దక్షిణాచారుడైన మీ గురువుగారు మాకులాగా వామాచారములోనికి వస్తారా? లేదా? అనే సందేహము. రాకపోతే ఈ నాలుగు చక్రాలను జయించలేరు. ఒకవేళ వస్తే దక్షిణాచార పద్ధతి మంట కలిసిపోతుంది.ఎలా? ఏమి చేసి ఈ చక్రాలను దాటతారా అని ధర్మ సందేహము వచ్చింది. దీనికి గూడ కాలమే సమాధానము చెప్పక తప్పదు" అంటూ వాయుభక్షణ ద్వారా వాయువునే ఆహారముగా తీసుకోవడం ఆరంభించారు.

అక్కడేమో....

పరమహంసకి గూడ ఇదే సమస్య వచ్చింది. ఇపుడిదాకా తను దక్షిణాచార పద్దతిలో సాధన కొనసాగించాడు. ఇపుడు వామాచార పద్దతిలో సాధన కొనసాగించాలి. ఇప్పుడు వామాచార పద్దతిలో అనగా కాపాలికుడిగా కర్మచక్రమును..... అఘెరుడిగా గుణచక్రమును ...భైరవుడిగా కాలచక్రమును..... నాగసాధువుగా బ్రహ్మ చక్రమును సాధన చెయ్యాల్సి ఉంటుంది. ఆదియోగియే ఈ చక్రాల దగ్గరికి వచ్చేసరికి పంచముఖ అవతారములో ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత అనే ఐదు ముఖాల అవతారాలు ఎత్తి సాధన చెయ్యక తప్పలేదు. అందుకే ఈ చక్రాలను మరుగుపర్చడము జరిగింది. ఎవరైతే ఆజ్ఞ చక్రము దాటుతారో వాళ్లకి ఈ చక్రాల జ్ఞానము అందేటట్లుగా మాత్రమే మన పూర్వీక మహర్షులు చేశారు. అపుడిదాకా ఎవరికి గూడ ఈ నాలుగు చక్రాలున్నట్లుగా తెలియదు. తెలిసిన నమ్మరు.అంతటితో 13 చక్రాలు కాస్త సప్త చక్రాలుగా  లోకానికి తెలిశాయి. ప్రచారములోనికి వచ్చాయి. కాని ఈ నాలుగు చక్రాల గూర్చి లోకానికి తెలియకుండా మరుగున పడ్డాయి. ఎందుకంటే ఈ చక్ర సిద్ధి పొందాలంటే వామాచారములో ప్రవేశించక తప్పదు. ఇపుడు తను ఏమి చెయ్యాలి. తనకి వామాచారములోనికి వెళ్లడము ఇష్టము లేదు. ఏమి చెయ్యాలి అనుకుంటున్న సమయములో....

ఈయన మనో దృష్టి యందు...

ఈ చక్ర గురువైన సద్గురువుగా....

శ్రీ శ్యామా లాహిరి మహాశయుడు కన్పించాడు.

అపుడు...

పరమహంస! నీ సాధన స్థితి తెల్సింది. నీ మనో సంకల్పము అర్ధమైంది. నీ సంకట స్థితి తెలిసి ఇక్కడికి రావడము జరిగింది. మీ గురువైన శ్రీ త్రైలింగ స్వామి వారు నన్ను నీ దగ్గరికి పంపించారు. మేమిద్దరము సాధనలో సమకాలికులమే. ఆయనేమో దక్షిణా, వామాచార పద్దతులలో సిద్ధ హస్తుడైతే నేనేమో  

దక్షిణాచార పద్ధతి చేసే ఆచార వంతుడని. నువ్వు గూడ నాలాంటివాడివేనని తెలిసి నన్ను ఇక్కడికి పంపించారు. వామాచారములో పంచమకారాలు అనగా మాంసము, మద్యము, మత్స్య, మగువ, మైధునము ప్రక్రియల ద్వారానే ఈ నాలుగు చక్రాల మీద సాధన చేసి జయం పొందాలి. కాని ఎవరికి తెలియని విషయము ఏమిటంటే దక్షిణాచారములో గూడ పంచ మకారాలున్నాయి. అవి మద్యపానము అనగా కొండ నాలిక నుండి కారే అమృత సేవనము చేస్తే ఈ అమృత ధారా సేవనమే మధ్యపానమవుతుంది. ఇక మాంసము విషయానికి వస్తే ఖేచరీ ముద్రతో నాలికను వెనక్కి మడిచి కొండనాలికను అందుకుంటే అది మాంససాధన సమానమని.... ఇక మత్స్యం విషయానికి వస్తే ఇడా, పీడా నాడులలో శ్వాస.. ప్రశ్వాస అనే రెండు చేపలు సంచారము చేస్తుంటాయి.

అంటే వాయు  భక్షణ ప్రక్రియే మత్స్యం అవుతుంది. ఇక ముద్ర విషయానికి వస్తే ఎవరైతే తమ స్వస్వరూప ఆత్మ దర్శనము పొందుతారో వాళ్లు ముద్ర సాధకులే  అవుతారు. ఇది వాళ్లకి మగువతో సమానము అన్నమాట. ఇక 'మైధునం' అంటే మణిపూరక  చక్రములోని 'రం' అనే బీజాక్షరమునకు ఆజ్ఞచక్రములో 'మం' అనే బీజాక్షరమును కలిపితే 'రామం' అనే మైధునం అవుతుంది. ఇదియే రామ తారకమంత్రము అవుతుంది. ఇది విన్న వాళ్లు మైధున సాధకులు అవుతారు. ఇలా నీవు ఈ సాధనల యందు జయం పొందితే ఆజ్ఞ, కర్మ, గుణ, కాల, బ్రహ్మ చక్రాల యందు జయం పొందుతావు.శుభంభూయాత్ అంటూ అదృశ్యమయ్యేసరికి అంటే ఈ చక్ర సద్గురువు మహా మాయ గూడ తొలగిపోవడముతో పరమహంస కాస్త మౌనము వహించి  ఈయన చెప్పినట్లుగా దక్షిణాచార పద్దతిలోని  పంచమకారాల సాధన చెయ్యడము ప్రారంభించారు.

కొండ నాలిక నుండి వచ్చిన అమృతధారను సేవించే సాధన చేస్తుండగా కర్మ చక్రము ఇచ్చే సర్వ కర్మలు నశించడము మొదలైంది. కర్మ శేషము గూడ సశేషము అవ్వడముతో కర్మ రాహిత్య స్థితి కలిగి ఈ చక్ర దేవతగా మహాదేవి దర్శనమైంది. అయిన ఈమెను వరాలు గావాలని కోరక పోవడముతో ఈమె కాస్త అదృశ్యమై శూన్యమైంది. అంటే ఈమె గూడ శాశ్వతము గాదని ఈయనకి అర్ధమై.... గుణ చక్ర ఆధిపత్యం కోసము ఖేచరీ ముద్ర సాధన చేస్తూండగా..... గుణాలకి స్పందించడము వలన ఏర్పడే జన్మలు గూడ సశేషముగా నశించేసరికి జన్మరాహిత్య స్థితి కల్గడముతో ఈ చక్ర దేవతగా శ్రీ మహావిష్ణువు దర్శన మిచ్చిన వరాలు కొరకపోవడముతో ఈయన గూడ అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత పరమహంస కాస్త కాలచక్రము మీద ఆధిపత్యం కోసము వాయు భక్షణ ప్రక్రియ చేస్తుండగా మహాకాలుడు, మహాకాళిక మైధున దృశ్యాలు కన్పించాయి. ఒక స్మశానము నందు నగ్నముగా యువకుడి రూపములో మహాకాలుడు ఉండగా... ఈయన దగ్గరికి శరవేగముగా ఉగ్రముగా.... ఉద్రేకముగా నగ్నముగా మహాకాళిక వచ్చి.... ఈయనను నేలమీద పడుకోబెట్టి తన మర్మాంగములో ఈయన మర్మాంగమును పెట్టుకొని అమితముగా ఉద్రేకమవుతున్న శృంగార దృశ్యము చూసిన గూడ ఈయన మనస్సు చలించలేదు. ఎందుకంటే వీళ్లు సృష్టియజ్ఞము చేస్తున్న ఆది తల్లిదండ్రులుగా పరమహంసకి కన్పించారు. దానితో ఈ దృశ్యము కాస్త అదృశ్యమైంది.తద్వారా కాలము యొక్క పుట్టుక ఈ చక్రమునందు ఈ విధంగా కలుగుతుందని ఈయన గ్రహించారు.

ఆ తర్వాత ఆజ్ఞ చక్ర ముద్రతో తన స్వరూప ఆత్మ జ్ఞానమును పొందడముతో బ్రహ్మ చక్రము ఆధీనమైన బ్రహ్మ జ్ఞానము అందసాగింది. ఆపై తన చెవుల నుండి అప్రమేయముగా కాశీక్షేత్రములో విశ్వనాథుడు ఉపదేశించే 'తారకరామా' మంత్రము లీలగా వినబడుతూ.... కొన్ని క్షణాల తర్వాత స్పష్టముగా వినబడటము కాశీ క్షేత్ర వాసులుగా విశ్వనాథుడు, విశాలాక్షి నిజ స్వరూప దర్శనాలు పరమహంసకి దర్శనమైంది. అయిన వీళ్లని గూడ వరాలు గావాలని అడగకపోవడముతో వీళ్లని సాక్షిభూతముగా చూస్తూ ఉండేసరికి వీళ్లు గూడ అదృశ్యమై.... శూన్యమైపోయేసరికి ఈ ఆజ్ఞ చక్ర దైవాలు గూడ శాశ్వతము గాదని

పరమహంస అనుకొనేసరికి.....

ఆజ్ఞాచక్రము విభేధన చెందడముతో దీనికున్న నాలుగు చక్రాలైన కర్మ, గుణ, కాల, బ్రహ్మ చక్రాలతో  పాటుగా రుద్ర గ్రంధి గూడ విబేధనము చెందముతో.... ఈ చక్ర దైవ లోకమైన తపోలోకాలు, శనిగ్రహ లోకాలు, ఈ చక్ర క్షేత్రమైన మహా కాశీ క్షేత్రముగా అదృశ్యమై శూన్యమైంది.

ఇక దానితో....

పరమహంస కాస్త సహస్ర చక్రము మీద ఆధిపత్యము కోసము శూన్య ముద్రతో సాధన చేస్తున్న దృశ్యాలు గూడ హార్వే పరికరములో కనిపించేసరికి ఈ దృశ్యాలు చూస్తున్న హార్వెకి, జోషికి, దేవికి, కాలాముఖుడికి ఏదో తెలియని ఆనందస్థితికి వెళ్లిపోయారు.

కొన్ని క్షణాలు తర్వాత కాలాముఖుడు కాస్త వాయుభక్షణ ప్రక్రియను పూర్తి చేసుకొని తాపీగా విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యమును చూసిన ఈ ముగ్గురు కాస్త ఆయనతో స్వామి..నాకు ఒక ధర్మసందేహము...మనకి 18 పురాణాలున్నాయి గదా.వాటిలో ఏన్నో వేల శ్లోకాలతో ఈ విశ్వసృష్టి రహస్యలు చెప్పడము జరిగింది గదా.ఇపుడు నాలాంటి వాడు ఈ వేల శ్లోకాలు చదివే ఓపిక,సమయము లేవు . మరి నాలాంటి వాళ్ళు ఏలా విశ్వజ్ఞానము పొందవచ్చో చెప్పండి అంటూ హర్వే అడిగిన ఈ ప్రశ్నకి 

కాలాముఖుడు చిరునవ్వు నవ్వి..అసలు మొదట ఈ 18 పురాణాల పేర్లు చెప్పు అనగానే..హర్వే కాస్త నీళ్లు నమలడము చూసిన 

దేవి కాస్త స్వామి..నాకు తెలుసు ... అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందములో చెప్పబడింది అంటూ

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం

అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

పైన చెప్పిన వాటిలో:

"మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం

"భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం

"బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం

"వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం

మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:

అ -- అగ్ని పురాణం

నా—నారద పురాణం

పద్—పద్మ పురాణం

లిం -- లింగ పురాణం

గా -- గరుడ పురాణం

కూ -- కూర్మ పురాణం

స్క—స్కంద పురాణం


అని చెప్పగానే...

అమ్మా..ఈ 18 పురాణాల పేర్లు సరిగ్గా చెప్పావు.కాని దానిని ఒక వరుస క్రమములో చెప్పి ఉంటే ఈ పురాణాల శ్లోకాలు చదవకుండానే ఈ పురాణాల పేర్లుతో ఈ విశ్వసృష్టి జ్ఞానము మనకి తెలిసేది.ఆ విధంగా మన పూర్వీక మహర్షులు అమర్చారు అనగా ఈ ముగ్గురికి ఆశ్చర్యానందాలు కల్గుతుండగా...

ఈ విశ్వసృష్టి కర్త ఎవరు అన్ని ప్రశ్నించినపుడు దీనికి సమాధానముగా సృష్టి కర్త అయిన బ్రహ్మ గురించి మనకి చెప్పేది మొట్టమొదటి పురాణము బ్రహ్మపురాణము అవుతుంది.ఆ తర్వాత ఈయన ఎలా ఉద్బవించాడు అనే ప్రశ్నకి సమాధానముగా పద్మము నుండి బ్రహ్మ పుట్టాడని రెండవదిగా పద్మపురాణము చెపుతుంది.ఇక ఈ పద్మమునకు మూలం ఏది అన్నపుడు దీనికి సమాధానముగా ఇది విష్ణువు నాభి నుంచి పుట్టినదని మనకి మూడవ పురాణముగా విష్ణుపురాణము చెపుతుంది.ఇక ఈ విష్ణువు స్ధానము ఆదిశేషుడని..ఈయనికి ఆధారము వాయువు అని నాలుగవ పురాణముగా వాయుపురాణము చెపుతుంది.ఇక విష్ణువు సృష్టిస్ధితిగతులు మనకి వివరముగా భాగవతపురాణము వివరిస్తే..ఆ తర్వాత ఈ విష్ణువు సన్నిధికి చేరడానికి ఉన్న సన్యాసి ధర్మాలు గురించి మనకి నారద పురాణము చెపితే..ఆ తర్వాత ఈ సృష్టిచక్రములో సృష్టిధర్మమును పాటించే విశ్వదేవి శక్తి గూర్చి మనకి మార్కేండయ పురాణము చెపితే..ఆ తర్వాత ఈ దేవి శక్తి అగ్ని రూపములో ఉన్నదని మనకి అగ్నిపురాణము చెపితే..ఆ తర్వాత ఈ అగ్నితత్వము విశ్వములో సూర్యుడు,నక్షత్రాలు రూపములో ఉంటుందని ఇలా విశ్వ అంతరిక్షము గూర్చి మనకి భవిష్యపురాణము చెపితే..ఆ తర్వాత బ్రహ్మము వలన ఏర్పడిన ఈ జగత్తు ఎన్నడికి శాశ్వతము గాదని అశాశ్వతమని మనకి బ్రహ్మజ్ఞానమును బ్రహ్మవైవర్త పురాణము చెపితే..ఆ తర్వాత ఈ బ్రహ్మము యొక్క త్రిమూర్తుల రూపాలలోని శివుడి గూర్చి మనకి లింగపురాణము చెపితే..ఆ తర్వాత ఈ శివుడి అనుగ్రహమును పొందుటకు చెయ్యవలసిన వ్రతాలు,తిరగవలసిన క్షేత్రాల గూర్చి మనకి స్కాంద పురాణము చెప్పితే..ఆ తర్వాత మనకి విష్ణువు అంశ అయిన ఈ విశ్వసృష్టిలో ఏర్పడిన తొలి ప్రాణి అయిన చేప గూర్చి మనకి మత్యపురాణము చెపితే ...ఆ తర్వాత రెండవ ప్రాణి యైన తాబేలు గూర్చి మనకి కూర్మ పురాణము చెపితే..ఆ తర్వాత క్షీరదాల ప్రాణి అయిన వరాహము గూర్చి మనకి వరాహపురాణము చెపితే...ఆ తర్వాత మనకి తొలి మానవుడి గూర్చి మనకి వామన పురాణము చెపితే.. ఆ తర్వాత ఈ మానవుడు ఎలాంటి ధర్మాలు,గుణాలు ఉంటే మాధవుడు అవుతాడో మనకి గరుడ పురాణము చెప్పితే..ఈ విశ్వసృష్టి లోని సకల జీవరాశులు,వాటి స్ధితిగతులు గూర్చి మనకి 18వ ఆఖరి పురాణముగా బ్రహ్మాండ పురాణము చెపుతుంది.ఇలా ఈ వరుసలో ఈ 18 పురాణాల పేర్లులలోనే విశ్వసృష్టి రహస్య జ్ఞానము చెప్పడము జరిగింది.


అష్టాదశ పురాణములలో శ్లోకాలు మనము చూస్తే....


బ్రహ్మ పురాణం - బ్రహ్మదేవుడు మరీచికి బోధించింది. 10,000 శ్లోకములు కలది.

పద్మ పురాణము - బ్రహ్మదేవునిచే చెప్పబడింది. 55,000 శ్లోకములు కలది.

విష్ణు పురాణం - పరాశరుని రచన. దీనిలో 63,000 శ్లోకములు ఉన్నాయి.

శివ పురాణం - వాయుదేవునిచే చెప్పబడింది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.

లింగ పురాణము - నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉంది.

గరుడ పురాణం - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.

నారద పురాణము - నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.

భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించింది. 18,000 శ్లోకములు కలది.

అగ్ని పురాణం - భృగుమహర్షిచే చెప్పబడింది. 16,000 (8,000?) శ్లోకములు కలది.

స్కంద పురాణం - కుమారస్వామిచే చెప్పబడింది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.

భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం - శతానీకుడు సుమంతునకు బోధించింది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.

బ్రహ్మవైవర్త పురాణం - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించింది. 18,000 (12,000) శ్లోకములు కలది.

మార్కండేయ పురాణం - పక్షులు క్రోష్టి (జైమిని) కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉంది.

వామన పురాణము - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.

వరాహ పురాణం - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించింది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.

మత్స్య పురాణం - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.

కూర్మ పురాణం - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.

బ్రహ్మాండ పురాణం - బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.


ఇలా ఈ 18 పురాణాలలో శ్లోకాలున్నాయి.వీటిని మనము చదివితే మనకి ఉన్న శోకాలు సమసిపోతాయి అంటూ మీ గురువు గారు ధ్యాననిష్టలోనికి వెళ్తుతున్నారు.నేను గూడ వెళ్ళుతున్నాను అనగానే ఈ ముగ్గురు గూడ ఇలా కేవలము 18 పురాణాల పేర్లులలో విశ్వజ్ఞానమును ఉంచిన భారతీయ పూర్వీక మహర్షులకి వీళ్ళు కృతజ్ఞతలు చెప్పుకొని తమ పనులలో నిమగ్నమైనారు.



No comments:

Post a Comment