అధ్యాయము 33

 తాపీగా ఇంకా పద్మాసనములో కూర్చొనియున్న కాలముఖా చార్యుడిని చూసిన హార్వే....


స్వామి! ఇంకా మా గురువు పరమహంస యొక్క ధ్యాన అనుభవాలు మొదలు అవ్వలేదా? నా మాటలు మీకు వినిపిస్తున్నాయా ? అని అడిగాడు.


నాయనా! వినబడుతున్నాయి. ఇంకా మీ గురువుగారు ధ్యాన నిష్ఠలోనికి రాలేదు. ఓంకారనాదము చేస్తూ కుండలినీశక్తిని జాగృతి చేసుకుంటున్నారు. అది 48 నిమిషాలు పడుతుంది. అందుకే నేను విశ్రాంతిగా కూర్చున్నాను. నా మాటలు మీకు వినబడుతున్నాయా?


చక్కగా వినబడుతున్నాయి. స్వామి! అయిన నాకు ఒక సందేహము. మా గురువు గారి ధ్యానానుభవాలు అలాగే మీ ధ్యాన అనుభవాలు ఒక్కటే ఎలా అవుతాయి?


నాయనా! ఈ విశ్వములో 36 మందికి ఒకే విధమైన ధ్యాన అనుభవ స్థితి ఉండి సమకాలికులుగా ఉంటారు.అలా మా ఇద్దరి ధ్యానానుభవాలు 100 % శాతము కలిసాయి. అనుభవాలు వేరు అయిన అనుభూతి అందరికి ఒక్కటే గదా. ఈ విశ్వములో ఆది నుండే జ్ఞానము, (విజ్ఞానము, తత్వాలు) అలా 64 తత్వాలు పరమ శూన్యమునందు ఇమిడి ఉన్నాయి. వాటిని అందుకొనే వాడే అనగా జ్ఞానము అందినవాడిని ఆది గురువు... విజ్ఞానము అందినవాడిని ఆదిదేవుడు... ఈ రెండు అందుకున్నవాడిని ఆది యోగి గా పిలువడము జరిగింది. దేవుళ్లు అంటే జ్ఞాన సముపార్జనలో మనకి ముందు ఉన్న ఆత్మలేనని తెలుసుకో. ఎవరు తమ సాధన శక్తితో 64 సాదానుభవాలు పొందుతారో వారే మోక్షగామిగా మారి మోక్షమును పొందుతారు. ఎవరు ఏ సాధన స్థితి వద్దయున్నమాయ, మోహ, వ్యామోహాలకి గురి అయ్యి అంతడితో తమ సాధన ఆపుకుంటున్నారు. ఇలా నూటికి 80 % మంది సాధన మాయలలో చిక్కుకుంటున్నారు. మిగిలిన 18 % మా లాంటి వాళ్లకి ఆది మాయ అని తెలిసిన దాటలేకపోతున్నాము. ఇక 2 % మందిలో ఒకడు మాత్రమే పరిపూర్ణముగా సాధనను పూర్తి చేసుకుంటున్నారు.


అక్కడే ఉన్న దేవి వెంటనే....

స్వామి! ఇపుడు మీరు చెయ్యబోయే సాధన విధానము చెపుతారా?


ఏముంది! తల్లి! నేను అంతర్యామిగా సాధనస్థితి ద్వారా 64 డైమెన్షన్స్ దర్శనము చేసుకుంటే.... మీ గురువుగారు సర్వాంతర్యామిగా 64 డైమెన్షన్స్ చూస్తారు.


అర్ధము కాలేదు స్వామి?


ఇందులో అర్ధము గాకపోవటానికి ఏముంది. నేను  ఇక్కడే ఉండి నా శరీరములోని సుషుమ్న నాడి యందు నా సూక్ష్మశరీరమును ప్రవేశ పెట్టి 64 డైమెన్షన్స్ చూస్తూ మీకు ఆ అనుభవాలు చూపిస్తాను. అదే మీ గురూజీ అయితే స్థూల శరీరము విడిచి పెట్టి సూక్ష్మ శరీరమును చేసి విశ్వములో ఉన్న 64 డైమెన్షన్స్ చూస్తారు.


ఆయన తిరిగిరాడు. నేను తిరిగి వచ్చి బ్రతుకుతాను. ఆయన సర్వాంతర్యామిగా యానము చేస్తున్నపుడు నేను అంతర్యామిగా యానము చేస్తాను అన్నమాట. ఈ విశ్వములో ఏముందో ఈ దేహములోను అదే ఉంటుంది. గాకపోతే దేహము గోరంత.... అదే విశ్వము కొండంత లాగా కనబడుతుంది. ఈ రెండింటిలోను ఒకే విధమైన ప్రక్రియలు జరుగుతాయి. రూపాలు వేరు. కాని లోపల ఉన్నది. ఒక్కటే కేకుకి అలాగే దీని కేకుముక్కకి ఏమైనా రుచిలో తేడా ఉంటుందా? ఉండదు గదా. నేను మూలాధారము నుండి బ్రహ్మరంధ్రము దాకా అంతర్యామి సాధన చేస్తే.... మీ గురూజీ మాత్రము విశ్వము ఆది నుండి అంతము దాకా సర్వాంతర్యామి సాధన చేస్తారు.


డాక్టర్ జోషి వెంటనే....

స్వామి! ఇలా ఎవరైనా గూడ 64 డైమెన్షన్స్ చూడవచ్చునా?

నాయనా! దానికి అర్హత, యోగ్యత ఉండాలి. ప్రతి డైమెన్షన్స్ కి పరిధులు ఉంటాయి. నియమాలుంటాయి.ఈ విశ్వమంతా కాలనియమానుసారముగా నడుస్తోంది. కాలము గతి తప్పితే గ్రహాలు గతి తప్పుతాయి. తద్వారా జీవకోటి కర్మఫలితాలు, దైవకోటి కర్మ అనుభవాలు గతి తప్పుతాయి. చివరికి విశ్వమే గతి తప్పి గతించిపోతుంది. సూర్యుని చుట్టూ క్రమానుసారముగా, నియమానుసారముగా నవగ్రహాల సంచారము జరగడము అనేది కాల నియమ ప్రకారమే జరుగుతోంది. కాబట్టి ఎవరు విశ్వాధినేత అయితే వారికి కాలము ఆధీనము అవుతుంది. వారు చెప్పినట్లుగా కాలము నడుచుకుంటుంది. కాని ఆది గూడ కొంతమేర అలా జరుగుతుంది. ఎవరు గూడ సంపూర్ణముగా కాలాతీత స్థితిలో 48 నిమిషాలు మించి 100 సంవత్సరాల నుండి 10 లక్షల సంవత్సరాలు లేదా ఒక మహా కల్పము ఆయిష్ గా మాత్రమే ఉండగలుగుతారు. ఆ తర్వాత వీరు గూడ కాలమునకు అకాల మరణము పొందవలసి ఉంటుంది. మోక్షగామి మాత్రమే ఈ కాలాతీత స్థితిలో శాశ్వతముగా ఉంటాడు. ఎందుకంటే ఆయనే కాలములో శూన్యముగా మారిపోతాడు. కాల శూన్యస్థితిని పొందడమే అసలు సిసలైన మోక్ష స్థితి అవుతుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్లు విశ్వాధినేత అవ్వకుండా ఉండటానికి 62 డైమెన్షన్స్ లోని కాల ప్రతినిధులు కొన్ని అర్హత, నియమాలు పెట్టడము జరిగింది. ధర్మ గుణము, బాహ్య శుద్ధి, అంతర శుద్ధి, అరిషడ్వార్గాలు లేకుండ, సప్త వ్యసనాలు లేకుండ, ఆశ-భయం లేకుండ, ఆలోచన, సంకల్పము, స్పందన, ఆనందరాహిత్యం, కర్మ-జన్మ రాహిత్యం, త్యాగం, క్షమ, ఓర్పు,సహనం, అచంచల విశ్వాసం, విరుద్ధాలోచన, క్రమశిక్షణ, అహం లేకుండుట, అణుకువ, అనవసరమైన వాటిని తిరస్కరించడం, లజ్జ లేకుండుట కోరికలు అదుపులో ఉంచుకోవటం, శాంత గుణం, సంతృప్తి, ఏకాదశి ఉపవాసం, శివరాత్రి జాగరణ, దొంగ బుద్ధి లేకుండుట, వ్యభిచారము లేకుండుట, సత్యము పలుకుట,సంకల్పబలం, ఆత్మ విశ్వాసం, మనో ధైర్యం ఇలా ఉన్న 112 దైవిక లక్షణాలలో ఏదో ఒకటి సాధకుడు 12 సంవత్సరాలు క్రమము తప్పకుండా, వేళ తప్పకుండా పాటించగల్గితే వాళ్లకి తన సాధన స్థితిగతులను బట్టి ఈ 64 డైమెన్షన్స్ చూసే అర్హత, యోగ్యత వస్తుంది. అంతెందుకు సత్య హారిశ్చంద్రుడు సత్యపాలన అనే గుణము వలన అలాగే శ్రీరాముడు పితృ వాక్య పరిపాలన అనే

లక్షణము వలన, గౌతమ బుద్ధుడు శాంతము అనే గుణము వలన, శ్రీకృష్ణుడు కర్మ రాహిత్యస్థితి వలన, అనసూయమాత పాతివ్రత్య ధర్మము వలన, మహాశివుడు త్యాగము వలన ఇలా ఎందరో ఏదో ఒక గుణ లక్షణాలను పట్టుకొని వాటిని జీవితాంతము పాటించి మోక్షగామి అయ్యి మోక్ష స్థితిని పొంది మనకి

ఆదర్శముగా నిలిచారు. దైవ ప్రతినిధులుగా మారారు.


స్వామి! ఇందాక మీరు 62 డైమెన్షన్స్ ప్రతినిధులే అని చెప్పారు. మరి మిగిలిన రెండు డైమెన్షన్స్ లో ప్రతినిధులుండరా?


నాకు తెలిసి 63 వ డైమెన్షన్ లో జీవాత్మ అలాగే 64 లో పరమాత్మ నిరాకార స్థితిలో ఉండి ఉంటారు. ఏమో ప్రస్తుతానికి నేను ఏమీ చెప్పలేను. ఎందుకంటే నా సాధన స్థితి 62 వరకు మాత్రమే ఉంది.


డాక్టర్ జోషి వెంటనే....

స్వామి! ఒకరి ఆలోచనలు మరొకరు మార్చే వీలుందా?


నాయనా! నువ్వు చెప్పాపోయేది ప్రాజెక్ట్ 2045 గూర్చియేగదా. వాళ్లు గూడ ఆలోచనలు మార్చి తాము చిరంజీవి తత్త్వముగా శాశ్వతముగా బ్రతకాలని కొంతమంది బిలియన్ రులు ప్రయత్నాలు చేస్తున్నారు గదా. అంటే వీళ్ల ఆలోచనలను శాశ్వతముగా బ్రతికేటట్లుగా చేస్తే తాము శాశ్వతముగా జీవించినట్లేనని అనుకుంటున్నారు. ఇది క్రొత్త ఆలోచన గాదు. పాత ఆలోచనయే. ఇది ఎపుడో మన పూర్వీక మహర్షులకి వచ్చింది. శివోహం,అహంః  బ్రహ్మాస్మి, తత్త్వమసి అంటే ఏమిటో తెలుసా? శివోహం అనగా తానే శివుడు అవ్వడం, అహంః బ్రహ్మాస్మి తానే బ్రహ్మ అవ్వడం, తత్త్వమసి అంటే తానే విష్ణువు అవ్వడం.... అంటే సాధకుడు సాధన చేసి....శివుడిగా లేదా బ్రహ్మగా లేదా విష్ణువుగా మారి పోతున్నాడు. మరి సాధకుడి వ్యక్తిగతము లేదు గదా. వాడి పేరు లేదు. వాడే త్రిమూర్తుల రూపాలలో ఒక రూపముగా మారిపోతున్నాడు. అనగా మన పూర్వీక దైవాలు తమ ఆలోచన రూపాలను సాధకుడికి తమ మంత్ర విధి విధానాలతో ఇవ్వడము జరిగినదని....తద్వారా సాధకుడు తన వ్యక్తిగత ఉనికి కోల్పోయి వాళ్లలాగా మారిపోతున్నాడు గదా.


అంతెందుకు ఎవరైనా 12 సంవత్సరాల పాటు క్రమము తప్పకుండా వేళ తప్పకుండా జపము, ధ్యానము, ఉపాసన చేస్తే వాళ్లు కాస్త తాము నిత్యము పూజించే దైవ స్వరూపాల రూపురేఖలుగా మారిపోవడము అందరికి తెలిసిన విషయమే గదా. ఆయన చూడటానికి సాక్షాత్తు మహాశివుడిలాగా ఆవిడ చూడటానికి

అమ్మవారిలాగా ఉన్నదని దైవ ఉపాసకులను చూసినపుడు ఎవరికైనా అన్పించక మానదు గదా. అంటే మన దైవ సిద్ధాంతమే మన ఉనికి సిద్ధాంతమును మార్చి వేస్తోందని ఎవరికి తెలియని నగ్న సత్యము. నిజానికి సాధకుడు బ్రతకడము లేదు. 12 సంవత్సరాల సాధన తర్వాత ఆ సాధకుడిలో దైవము లేదా ఆ గురువు శక్తి బ్రతుకుతోంది.పూర్వమే ఆది దేవుడు ఈ ఆలోచన విధానము చేశాడు. ఇపుడు ఇదే శాస్త్రవేత్తలు చెయ్యాలని అనుకుంటున్నారు. అంతే తేడా. అంతెందుకు ఇలా 36 దైవాలు కలిసి 36 మాయలుగా 36 డైమెన్షన్స్ లో ఆలోచన రూపాలతో ఉన్నారు. ఇందులో 80% సాధకులు ఈ దైవ ఆలోచన మాయలు దాటలేక తమ ఉనికిని కోల్పోయి వాళ్ల ఉనికితో బ్రతికేస్తున్నారు. తమ దైవాలే సర్వస్వమని భ్రమ, భ్రాంతి పడుతున్నారు. వాళ్ల దైవమే ఏదో ఒక మాయలో ఇరుక్కొని పోయి ఆగిపోతే.... వీళ్లు ఆ దైవమును పట్టుకొని దైవ మాయ దాటలేక ఆగిపోతున్నారు 18% మంది గురువుల మాయను దాటలేకపోతున్నారు. కేవలము 2% మంది ఈ ఆలోచన రూపాల మాయలను దాటుతున్నారు.


దేవి వెంటనే....

స్వామి! అంటే దైవారాధన అలాగే గురు ఆరాధన చెయ్యకూడదా?


ఈ రెండు గావాలి. ఈ రెండు గూడ అవసరమే. ఒకటి కుండలినీశక్తి జాగృతి చేస్తే మరొకటి కుండలిని శక్తి ప్రవాహము చేస్తుంది. కాని అవసరము తీరిన తర్వాత వాటి గూర్చి పట్టించుకోకూడదు. భాషకి అక్షరాలు అవసరమే. కాని అక్షరాల దెగ్గరే ఆగిపోతే వ్యాసాలు ఎలా వ్రాస్తావు. నువ్వు ఎపుడు ఒకటవ తరగతిలో ఉండిపోతే పి.జి ఎపుడు పూర్తి చేస్తావు. ఆది ఆలోచించు. ఇలా గురు, దైవ మాయల దెగ్గర ఆగిపోతే శూన్యస్థితిని పొందలేవు గదా. వీళ్లే శాశ్వతము అనుకొని నువ్వు అశాశ్వతముగా కర్మ-జన్మ చక్ర మాయలో పడిపోతావు. అదే వీళ్లు అశాశ్వతము అనుకుని ఉంటే శాశ్వత మరణస్థితియైన మోక్షమును పొందుతావు. అంతెందుకు రామకృష్ణ పరమహంసను కాళీమాత ఎందుకు తోతాపురి గురువు దగ్గరికి పంపించింది. అలాగే గురువులు ఎందుకు దైవము దగ్గరికి పంపిస్తాడో  ఎవరికి తెలియదు. అంటే వీరిద్దరు గూడ కలిసి ఇలా చేస్తున్నారు. దైవారాధన చేస్తే గురురాధన చెయ్యమని అలాగే గురురాధన చేస్తే దైవారాధన చెయ్యమని చెపుతారు. ఇలా వీళ్లు ఎందుకు చేస్తారో నాకైయితే తెలియదు.దేవుడికి కోపము వస్తే డాక్టరు దగ్గరికి పంపిస్తాడు. అదే డాక్టరుకి కోపము వస్తే ఏకముగా దేవుడి దగ్గరికి పంపిస్తాడు. ఇలాగే మన గురు-దైవాల అనుబంధముంది. వీళ్ల యందు సాధకుడు కాస్త ప్రేమ, మోహ, వ్యామోహాల యందు

పడిపోయి వాడి ఉనికిని కోల్పోయి వాళ్ల ఉనికిని బ్రతికిస్తున్నాడని నా ఆవేదన. ఏదైన శ్రుతి మించకూడదు. అతి చెయ్యకూడదు. అతి దానాలు చేసిన కర్ణుడికి ఎలాంటి చావు వచ్చిందో లోకానికి తెలియంది కాదు. అతి గురు భక్తి చూపించిన ఏకలవ్యుడికి ఎలాంటి స్థితి గతి పట్టిందో తెలుసుగదా. నాకు తెలిసి సాధకుడికి భౌతికముగా కనకము, కాంతము మాయలుగా ఉంటే మానసికముగా గురు- దైవాలు మహా మాయలుగా ఏర్పడతాయని నా స్వానుభవములో తెలుసుకున్నాను. మేము, మాలాంటి వాళ్లు తెలుసుకున్న నగ్న సత్యానుభవాలు లోకానికి అర్ధమైతే సిద్ధాంతము, అర్ధము గాకపోతే వేదాంతము, అర్ధమై అర్ధము గాకపోతే రాధ్ధాంతము అవుతాయని తెలిసి మౌనము వహించక తప్పడము లేదు.


దేవి వెంటనే....

స్వామి! ఏ నియమానుసారము కాలము అనేది గ్రహాల స్థితులను నిర్ణయిస్తుంది?

మనము చేసిన గత జన్మల కర్మల ఆధారముగానే.... కర్మ ఫలితాలు ఇవ్వడానికి

కాలము కాస్త నవగ్రహాల స్థితి గతులను కాలానుగుణముగా మారుస్తుంది. కర్మ ఫలితాలు సంపూర్తి అయ్యేదాకా జీవులు కర్మ-జన్మ పునః జన్మలు ఎత్తుతునే ఉంటారు. ఇదంతా కాలచక్ర పరిధిలో జరుగుతూనే ఉండే నిరంతర ప్రక్రియ. ఒక జీవి తను చేసిన సర్వ కర్మ నివారణ కోసము సహస్ర కోటి జన్మలు ఎత్తక తప్పదు.

అదే పూజలు, జపాలు, ఉపాసనాల వలన శతకోటి జన్మలకి వస్తాడు. కర్మ, భక్తి, జ్ఞాన, మార్గాలలో ఇలా 18 యోగాలలో సాధన చేస్తే 10 లక్షల జన్మలకి వస్తాడు. అదే ధ్యాన మార్గములో అయితే 12 సంవత్సరాల నుండి 7 జన్మలు లేదా 48 జన్మల లోపల కర్మ నివారణ అవుతుంది.

     సూర్య గమనము బట్టి కాలము నిర్ణయించబడుతుంది. జనన కాలమును బట్టి జాతక చక్రము తయారు అవుతుంది. ఇందులోని 12 భావాలలో జాతకుడి పూర్వ కర్మల అనుసారము గ్రహాలను, గ్రహష్టితిగతులను ఏయే కాలములో ఏది ఇవ్వాలో కాలము నిర్ణయించి జన్మ లగ్నము ఏర్పడుతుంది. ఈ నవగ్రహ

దశలే జాతకుడి 120 భావాల కర్మలు 120 సంవత్సరాల పాటు అనుభవించే విధముగా కాలము నిర్ణయించును. నిజానికి జీవుడి యొక్క సర్వ కర్మ ఫలితాలు అన్నిగూడ అతడి సహస్ర చక్రము నందు నిక్షిప్తమవుతాయి. అంటే కర్మ చేసేది వాడే కర్మ ఫలితాలు పొందేది వాడే అన్నమాట. చాలామంది దీనిని బ్రహ్మరాతగా

విధివ్రాత అనుకొని భ్రమ పడుతుంటారు. జీవుడిలోనే రెండు ఉండుట వలన అతడు చేసిన కర్మలకు అతడే కర్మ ఫలితమును అనుభవిస్తాడు అన్నమాట. కర్మ ఫలితము నశించాలంటే కర్మ నశించాలి. ఈ కర్మ నివారణ కోసము జీవుడు ప్రతినిత్యము ఆజ్ఞాచక్రము నందు ధ్యాన నిష్ఠలో ఉంటే ఇందులో నిక్షిప్తమై ఉండే సర్వకర్మలు నివారించబడతాయి. అంతేగాని పూజలు, వ్రతాలు, నోములు, దీక్షలు, ఉపాసనలు, ఆరాధనలు, హ◌ోమాలు, గ్రహజపాలు, దైవజపాలు అనేవి మాత్రము కర్మ ఫలితాల మీద ప్రభావము చూపి కొంతమేర ఫలితాలను మార్చివేస్తాయి. కాని కర్మనివారణ కాదు. ఇది నివారణ కానంతవరకు జీవుడు గత జన్మ కర్మ ఫలితాలు అనుభవిస్తూ కష్టసుఖాలు పొందుతూనే ఉంటాడు. 80 % పాపభారము 20 % పుణ్యఫలము జీవుడు చెయ్యడము వలన కర్మ-జన్మలు ఏర్పడతాయి. తద్వారా కర్మ-కర్మఫలితాలు అనుభవిస్తాడు. వీటి ఆధారముగా కాలము కాస్త గ్రహ స్థితి గతులు ఏర్పరుస్తుంది.

హార్వే వెంటనే....

స్వామి! కాలము అనేది ఒక్కటే అయినపుడు ప్రాంతానికి ప్రాంతమునకు కాలములో ఎందుకు తేడాలు వస్తున్నాయి అనగానే....

కాలము అనేది ప్రాంతము యొక్క ద్రవ్యరాశి బట్టి మారుతూ ఉంటుంది. నిమిషానికి నిమిషానికి ద్రవ్యరాశి మార్పుల వలన కాలము మారుతూ ఉంటుంది. ఇపుడిదాకా మీరంతా ఎన్నో సందేహాలు అడిగారు గదా. నాకు చిన్నప్పటినుండి ఒక సందేహము ఉంది. ఆది ఏమిటంటే మొట్ట మొదటి సారిగా గడియారం తయారు చేసిన వాడికి సమయం ఎలా తెలిసింది? అనగానే.....

ఈ ముగ్గురు ఆలోచనలో పడ్డారు. నిజమే గదా. వాడికి సమయము ఎలా తెలిసిందో వీళ్లకి ఒక పట్టాన అర్ధము కాలేదు. సమాధానము చెప్పలేక బిక్క మొహము వేస్తే....

కాలాముఖాచార్యుడు వీరి అవస్థను చూసి చిరునవ్వు నవ్వి.....గడియారము తయారు చేసిన తర్వాత ఆది అనుకోకుండా 10 :10 నిమిషాలకి పని చెయ్యడము మొదలు పెట్టింది. ఇదే గడియార ప్రారంభ సమయముగా తీసుకొని గడియారాలు తయారు చేశారు. ఈ సమయమునే 10 :10 నే గడియారము గూర్చి లేదా సమయాల గూర్చి చెప్పేటప్పుడు కాలము గుర్తుగా ఇపుడికి గూడ వాడటము జరుగుతోంది. గాకపోతే ఈ సమయము పగల లేదా రాత్రిది అని నన్ను అడక్కండి. నాకు తెలియదు అనగానే.... మిగిలిన వాళ్లకి నవ్వు ఆగలేదు అందరు నవ్వుకోసాగారు. 


No comments:

Post a Comment