అధ్యాయము 19


నాయనా! నిజానికి కాలానికి 64 డైమెన్షన్స్ ఉన్నాయి. ఆఖరిదైన మన కంటికి కనిపించని పరమ శూన్యమైన 65 వ డైమెన్షన్ అయిన మోక్ష డైమెన్షన్ ఉంది. నిజానికి ఇది ఉందో లేదో ఎవరికీ తెలియని స్థితి. ఇది ఎవరైనా పొందిన గూడ పొందామో లేదో తెలియని విచిత్రస్థితి. అంటే ఈ డైమన్షన్ యందు ప్రవేశించిన వాడి ఆకార శరీరము అంటూ ఏమి ఉండదు. నిరాకారస్థితిగా.... శూన్యమైపోతాడు.

                సైన్స్ రిత్యా క్లాసికల్ స్ట్రింగ్ సిద్ధాంతము ప్రకారము చూస్తే కాలానికి 11 డైమెన్షన్స్ ఉన్నాయని చెప్పింది. అదే సూపర్ స్ట్రింగ్ సిద్ధాంతమైతే కాలానికి 26 డైమెన్షన్స్ ఉన్నాయని చెప్పింది. అదే మన వేదాలు అయితే 64 డైమెన్షన్స్ ఉన్నాయని...... అందులో 11వ డైమెన్షన్ వరకు మాత్రమే మానవుడి యొక్క మనస్సు వెళ్లగలుగుతుంది చెప్పడము  జరిగింది.

అదే యోగశాస్త్రము ప్రకారము అయితే మనకి ఉన్న 13 యోగ చక్రాలలో 13వ యోగ చక్రమైన బ్రహ్మ రంధ్ర బ్రహ్మాండచక్రము వద్ద నుండి ఈ కాలము యొక్క డైమెన్షన్స్ మొదలు అవుతాయని చెప్పడము జరిగింది. మన శిరస్సు యొక్క రంధ్రమే మనము బ్రహ్మరంధ్రము అంటే సైన్స్ వాళ్లు దీనిని కాలారంధ్రము అంటారు.

                   నా దృష్టిలో కాలమే దేవుడు. కాలమే సృష్టిస్తుంది. కాలమే నడుపుతోంది. కాలమే నాశనము చేస్తోంది. మనకి కాలమే సుఖదుఃఖాలు ఇస్తోంది. ఒకప్పుడు ఆనందము ఇస్తే మరొకప్పుడు బాధలను ఇస్తోంది. ఇదంతా కాల మహిమ. కాలమాయా. ఈ కాలమును నడిపించే నవగ్రహాల స్థితి గతుల ఆధారముగా ఈ విశ్వములో పుట్టే ప్రతీ జీవి యొక్క సృష్టి, స్థితి, లయ అలాగే ఆనందాలు, కష్టాలు, నష్టాలు, చావులు, జననాలు, ఇలా 12 రకాల భావ గడులలో ఉన్న జాతక చక్రము ద్వారా మనకి కాలమే తెలుపుతోందని నాకు అన్పిస్తోంది.  అందుకే మనము కాలానికి కలిపురుషుడు, యుగ పురుషుడు, కాలభైరవుడు, కాలరుద్రుడు,కాళిక, కాలభైరవి ఎలా దేవి దైవాల రూపాలు చూసి పూజించడము జరుగుతోంది.కాలాన్ని ఒక క్షణము నుండి నిముషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు, మహా కల్పాలు, పరమాత్మ శ్వాసగా విభజించడము జరిగింది.

ఒకసారి కనురెప్ప మూసి తెరిచే సమయాన్ని లిప్త కాలము అంటారు. ఇలాంటి 20 లిప్త కాలాలు కలిస్తే ఒక క్షణం అవుతుంది ఇలాంటి 12 క్షణాలు కలిస్తే ఒక నిమిషము అవుతుంది. ఇలా 60 నిమిషాలు ఒక గంటకు సమానము. ఇలాంటి 24 గంటలు ఒక రోజుకి సమానము. ఇలాంటి ఏడు రోజులు ఒక వారానికి, ఇలాంటి నాలుగు వారాలు ఒక నెలకి, ఇలాంటి 12 నెలలు ఒక సంవత్సరానికి సమానము. ఇక మనిషి ఒక సంవత్సరకాలము మనిషి ఒక సంవత్సర కాలము దైవానికి ఒక రోజు అవుతోంది. ఇలాంటి 365 దేవత రోజులు దైవానికి ఒక సంవత్సరము అవుతుంది. ఇలాంటి 3000 సంవత్సరాలు ఒక యుగము ఇలా 12  వేల దేవత సంవత్సరాలు కలిపి నాలుగు యుగాలతో సమానము. నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం అవుతుంది. ఇలాంటి 71 మహాయుగాలు కలిసి ఒక మన్వంతరము అవుతుంది. ఇలాంటి 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పము అవుతుంది. రెండు కల్పాలు కలిస్తే బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. ఇలాంటి 360 బ్రహ్మ రోజులు కలిస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది.ఇలా 100 బ్రహ్మ సంవత్సరాలు అయితే అది ఒక మహా కల్పము అవుతుంది. ఇలాంటి 10 మహాకల్పాలు 64 వ డైమెన్షన్స్ లో ఉండే పరమాత్ముడికి ఒక శ్వాసతో సమానమని మన వేదాలు కాస్త కాల ప్రయాణము గూర్చి చెప్పడము జరిగింది.

      కాబట్టి ఈ విశ్వా మూల రహస్యాలు మనకి తెలియాలంటే నేను కాల రంధ్రము ద్వారా అదే మన బ్రహ్మరంధ్రము ద్వారా టైమ్ ట్రావెల్ చెయ్యాలని అనుకుంటున్నాను. ఈ విశ్వ సృష్టి ఎలా జరిగింది అలాగే ఎందుకు జరిగింది? దీనిని ఎవరైనా సృష్టించారా? ఎవరైనా నడిపిస్తున్నారు? భగవంతుడు అనేవాడున్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? ఇలాంటి ఆధ్యాత్మిక ప్రశ్నలకి సమాధానాలను శాస్త్రీయంగా తెలుసుకొని నిరూపించాలని అనుకుంటున్నాను. మన వేదాలలో చెప్పిన 64 కాల డైమెన్షన్స్ అనేవి ఉండటము నిజమా? లేదా అబద్దమా? ముందు మనము తెలుసుకోవాలి. కాలము గుట్టు  తెలిస్తే విశ్వ గుట్టు తెలిసినట్లే. ఎందుకంటే మనకి కనిపించే ఈ విశ్వమంతా గూడ  కాలముతోనే ముడిపడి ఉందని నా వ్యక్తిగత నమ్మకము.


హార్వే వెంటనే....

స్వామీజీ మీకు తెలిసినంతవరకు ఈ కాల డైమెన్షన్స్ లలో ఏమి ఉంటుందో చెప్పగలరా?

నాయనా! నేను అయితే ఈ దేహముతో 11 డైమెన్షన్స్ వరకు యోగ నిద్ర సిద్ధితో చూడగలిగాను. ఇక ఆ పైన డైమెన్షన్స్ ఉన్నాయని తెలిసినా నేను వెళ్ళలేకపోయాను. నా మనస్సు కాస్త బుద్ధి తీత స్థితిలోనికి వెళ్లిపోతూండడముతో నాకు అనుభవాలు తెలుసుకొనే అవకాశము దొరకలేదు. ఇప్పుడు నువ్వు తయారు చేసిన మైండ్ రీడర్ పరికరము ఆలోచనలకి హలో గ్రామ్ రూపాలు ఇచ్చే పరికరము ద్వారా నేను నా సూక్ష్మశరీరము తో టైమ్ ట్రావెలింగ్ అనగా ఎన్ని డైమెన్షన్స్ ఉంటే అన్నింటిని చూసి రావాలని అనుకుంటున్నాను. అప్పుడే మన సైన్స్ కి అందని ఎన్నో రహస్యాల గుట్టు తెలిసే అవకాశము ఉంటుంది. ఇక నేను చూసిన 11 డైమెన్షన్స్ దృశ్యాలు చెప్పడము  కన్నా వాటిని నీవే నీ మైండ్ రీడర్ పరికరము ద్వారా చూడవచ్చును గదా.

డాక్టర్ జోషి వెంటనే......

గురూజీ! మనిషి చనిపోతున్న క్షణాలలో దేనినో చూసి భయపడటం, బాధపడటం, గు.... గు.... అంటూ చనిపోవడం నా ప్రయోగాలలో ఇంతవరకు జరిగింది. అది ఏమిటో మీరు చూసే అవకాశము ఉంటుందా?

ఎందుకు ఉండదు! నువ్వు చెప్పేది మన ఆజ్ఞాచక్రము వద్ద కనిపించే శిలువ ఆకారపు గుర్తు లేదా స్వస్తిక్ ఆకార ద్వారమున్న గుహ గురించి  మాట్లాడుతున్నావు. ఈ గుహ ఒక మరణ బ్లాక్ హ◌ోల్ లాంటిది. దీనికి నాలుగు గదులుంటాయి. ఈ నాలుగు గూడ నాలుగు రకాల బ్లాక్ హోల్స్ కి దారి తీస్తాయి. ఇది మనకి ఆజ్ఞాచక్రము వద్ద తెలుస్తుంది.యోగశాస్త్రము ప్రకారము ఈ నాలుగు బ్లాక్ హోల్స్ అనగా గుణ,కర్మ,కాల,బ్రహ్మ చక్రాలవుతాయి. మరణము తర్వాత జీవితము ఎలా ఉంటుందో ఈ గుహ ద్వారా తెలుస్తుంది. ఇది ఎలా ఉంటుందో మనము శాస్త్రీయముగా హార్వే తయారుచేసిన మైండ్ రీడర్ పరికరము ద్వారా నీకే తెలుస్తుంది.

హార్వే అందుకొని.....

గురూజీ! మరి ఏ విధంగా టైమ్ ట్రావెలింగ్ ఎలా చేస్తారో కాస్త మాకు చెపుతారా? చెప్పడము గాదు! మీకు ఒకటి  చూపించాలి అంటూ వాలు కుర్చీలోంచి లేచారు. ఇంతలో.....

పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్న దేవి గూడ గది  నుండి బయటికి వచ్చి గురూజీ! మీ మాటలు అన్ని విన్నాను. మీరు ఏదో చూపించాలి అన్నారు. అదిగూడ  నాకు చూపించండి అనగానే.....

అమ్మాయి! ప్రస్తుతము నీకు ఆరోగ్యము బాగోలేదు గదా. కుదుటపడిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఎందుకు అనగానే.....

మన పక్కన డాక్టర్ గారు ఉంటే నాకు ఎందుకు భయము. ఏదైనా వస్తే ఆయన చూసుకుంటాడులే అని గది నుండి నీరసముగా వచ్చింది.

ఇలా వీరంతా కలిసి పరమహంస ధ్యానము చేసుకొనే గది వైపు దారి తీశారు. లోపల.......

ఉన్న దిమ్మెను పరమహంస చేతితో కదిలించగానే...

అది ప్రక్కకి తప్పుకొని ఒక మెట్లున్న చిన్నపాటి సొరంగ మార్గమును చూపించగానే....

అంటే....

ఈయన లోకానికి తెలియకుండా తన సైన్స్ ప్రయోగాల కోసము ఒక రహస్య గదిని ఏర్పరచుకున్నారని వీరికి అర్థమై ఆశ్చర్యమునకు గురి అవుతూ.... కనిపించే మెట్లు దిగుతూ సుమారుగా 300 అడుగులు క్రిందకి దిగారు

లోపలికి వెళ్లి....

అక్కడ  ఆ గదింతా.....

అత్యాధునిక టెక్నాలజీ అనగా అక్కడ ఉన్నవి అన్నిగూడ సెన్సార్ లతో పని చేసే వస్తువులు అనగా లైట్స్, టీవీ, కంప్యూటర్, మానిటర్, వాషింగ్ మెషిన్,  ఫ్రిడ్జ్, బ్రేడ్స్, రోబోలు, క్లీనింగ్ మెషిన్స్,సెక్యూరిటీ మెషిన్స్, ఇలా ఎన్నో ఆధునిక వస్తువులతో ఉన్న యంత్ర ప్రపంచము వీళ్ళకి కనిపించింది.

అంటే ఈయన పైకి ఆధ్యాత్మికవేత్తగా సన్యాసిగా ఉంటున్నారని... లోపల సైన్స్ శాస్త్రవేత్తగా పరిశోధకుడిగా ఉంటున్నారని వీళ్లకి అర్థమై మౌనము వహించారు.

ఇంతలో....

హార్వే దృష్టి ఒక పరికరము మీద పడింది. ఇది అచ్చంగా తను తయారు చేసిన మైండ్ రీడర్ పరికరము లాగా ఉన్నదని గాకపోతే దీనికి చిన్నపాటి తేడాలున్నాయని, తన పరికరము కన్నా ఇది ఆధునికమైన మోడల్ అని హర్వే గ్రహించి దాని దగ్గరికి వెళ్లి చూస్తుండగా......

పరమహంస అందుకొని.....

హార్వే! ఇది తమరు చేసిన మైండ్ రీడర్ పరికరము  యొక్క మొదటి అవతారము. నా జ్ఞాన ఆలోచనలు తమరు టెలిపతి ద్వారా  అందుకొని మీ ఇంటిలో ఇలాంటి పరికరమును తయారు చేశారు. కాని దానికి - దీనికి కొంచెం తేడాలున్నాయి. నీ పరికరము  కేవలము మనిషి యొక్క ఆలోచనలను రీడింగ్ చేసి వాటిని హలోగ్రామ్ చిత్రాలుగా మార్చి చూపిస్తే.... ఇది వాటితో పాటుగా ఈ ఆలోచనలకి వాయిస్, టెక్స్ట్ మరియు వీడియో రికార్డింగ్ చేస్తుంది.

హార్వే వెంటనే అంటే....ఆలోచనలను చదవవచ్చు అన్నమాట. 

'అవును' అని పరమహంస అంటూండగా 

వీరంతా ఆ గదిని నిశిత దృష్టితో పరిశీలించ సాగారు.

ఆ గది కాస్త మూడు భాగాలుగా ఉంది. ఒక భాగములో సౌండ్ ప్రూఫ్ తో ఉండి గది మధ్యలో అత్యాధునిక టెక్నాలజీ ఉన్న ఒక బెడ్ ఉంది. వాటి పక్కనే పల్స్ రీడింగ్బి, బి.పి రీడింగ్, షుగర్ లెవెల్స్ మెషిన్, ఇలా ఏవో పరికరాలున్నాయి. పైగా దానికి మైండ్ రిసీవర్ కూడా కనెక్ట్ చేయ్యబడి ఉంది. అంటే తను యోగనిద్ర స్థితి సాధన చేస్తున్నసమయములో వీటిని ఉపయోగించి తను చూసిన ధ్యాన అనుభవాలను ఈ పరికరాలు ద్వారా విశ్లేషణ చేసుకొనే వారని  పరమహంస చెపుతూ.... ప్రక్కన ఉన్న గదిలోనికి వెళ్లారు.

ఈ గది భాగములో అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. తనకి ఏ మందులు పడతాయో.... పడవో లిస్ట్ రాసి ఉంది. 477 వ్యాధులకు సంబంధించిన మందులు ఇందులో ఉన్నాయని చెపుతూ..... ప్రక్క గదిలోనికి వెళ్లగా....

అక్కడ వీళ్లకి యోగచక్రాల బొమ్మలు, వాటి వివరాలు, మంత్ర దేవతల మంత్రాలు, బీజాక్షరాలు, యోగ చక్రాలు బలహీనపడితే తీసుకోవలసిన ఆహారాలు, యోగచక్రాల మాయలు, మర్మాలు, ముద్రలు, లోహాలు, యంత్రాలు, రుద్రాక్షలు, శంఖాలు, శాలిగ్రామాలు, సుదర్శన చక్రాలు, స్ఫటికాలు, శివలింగాలు, శ్రీ చక్రాలు, నవరత్నాలు, ఏవో మణులు, దిష్టి తాడులు, కాపాలాల   బొమ్మల లాకెట్ లు, కాపాలాల బొమ్మల మాలలు...ఇలా ఎన్నో దైవిక వస్తువులు ఈ గది భాగములో వీరికి దర్శనమిచ్చాయి. వీటిని చూపిస్తూ..... యోగ చక్రాలు బలహీనపడితే ఆయా చక్రాలవస్తువులతో వాటికి బలము చేకూర్చి సాధన చేయాల్సి ఉంటుందని.... ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క దైవిక వస్తువు వస్తుందని.... పోను పోను ఈ వివరాలు మీకే తెలుస్తాయి దేవి ఆరోగ్యము కుదుటపడితే మనము ట్రావెలింగ్ ప్రయోగానికి ప్రయత్నించవచ్చు అని అంటూండగా......

దేవికి ఉన్నట్టుండి.....

వాంతి వస్తుంది అనే ఫీలింగ్ విపరీతముగా వస్తూండేసరికి......

ఒక్కసారిగా..... ఆమె.....

ఈ రహస్య గది నుండి బయటికి వచ్చి.....

పైకి వెళ్లటానికి ఉన్న మెట్ల వైపు శరవేగముగా

వెళ్లుతూండేసరికి....

ఇది చూసిన మిగిలిన ఇద్దరు కంగారు పడుతూ ఈమెను అనుసరిస్తూ......పైకి వెళ్లితే....పరమహంస మాత్రము....

 తన గదిలో మౌనముగా..... జరగబోయే దృశ్యము తన మనోదృష్టి యందు కనబడుతున్న గూడ స్పందించకుండా చూస్తూ సాక్షిభూతముగా.... ఉండిపోయారు.


No comments:

Post a Comment