కర్కోటకుడు ....
గత 64 రోజులుగా నిరాహారిగా మారి.....
నవఖండ సిద్ధితో....
హ◌ోమాగ్నికి తన శరీర భాగాలను తొమ్మిది ఖండాలుగా తొడలు, భుజాలు, తల, మెడ, మొండెము, మోకాళ్లు, మోచేతులు, చేతి వ్రేళ్లు, పాదాలు ఇలా నవభాగాలుగా
హ◌ోమాగ్నిలో వేస్తూ....
కీనారామ్ జీవసమాధి ముందు ఘ◌ోరముగా సాధన చేస్తున్నాడు. పూర్ణాహుతి పూర్తి అవ్వగానే తిరిగి పోయిన శరీర భాగాలు క్రొత్తగా పుట్టుకు రావడము జరగడముతో హ◌ోమము నుండి ఆ రోజు క్రతువు పూర్తి అయినట్లుగా భావించుకొని మరుసటిరోజు హ◌ోమ క్రతువు చేస్తున్నాడు.
తన దీక్షలో ఎలాంటి లోపము లేకపోయినా గూడ కీనారామ్ స్వామి తనకి ప్రత్యక్ష దర్శనము ఇవ్వడము లేదు. ఓ పట్టాన కర్కోటకుడికి అర్ధము కాలేదు. అర్ధరాత్రి అమావాస్య రోజున ఈ హ◌ోమ క్రతువు పూర్తి చేసుకొని.....
గంగానది స్నానానికి బయలుదేరాడు.
మణికర్ణిక ఘాట్ వద్దకి వచ్చేసరికి అక్కడ కాలుతున్న శవాలను చూసి.... నవ్వుకుంటూ.... గంగానదిలోకి వెళ్లిపోతూండగా.....
నీళ్లలో పాదాలుంచి.... ఓడ్డున ఒక యోగి కూర్చున్నట్లుగా కనిపించింది. ఇంత చీకటిలో ఈయనకు ఇక్కడ ఏమి పని అనుకుంటూ....
కర్కోటకుడు ఈయన దగ్గరికి వెళ్లిపోతే.... అక్కడ ఆయన....
చచ్చి కాలిపోయిన శవాల కాపాలాలు గాలిలో కన్పించాయి. వాటికి శెనగలు వెయ్యగానే.... అవి పళ్లతో నమిలి తినడము చూసిన కర్కోటకుడికి ఒక్క క్షణము మెదడు పని చెయ్యలేదు. ఈయన ఎవరో కాని ఏకముగా కాపాలాలకే కపాల భోజనము పెడుతున్నాడు గదా...
వామ్మో! ఎంతటి సాధన సిద్ధి పరుడో గదా అనుకుంటూ.... ముందు వైపుకి రాగా...
ఎదురెదురుగా....
ఆ యోగి ఎవరో గాదు. సాక్షాత్తు తను ఇన్నాళ్లు ఆరాధించిన
కీనారామ్ అఘ◌ోరి బాబా వారు.
కర్కోటకుడు వెంటనే ఆయన పాదాలమీద పడి.....
స్వామి!స్వామి! ఇన్నాళ్లకి నా మీద మీకు దయ కల్గిందా? నన్ను అనుగ్రహించాడానికి ఇలా వచ్చారా?
రాక తప్పదు గదరా? నీ కోసము నా సమాధి విడిచి బయటికి రాక తప్పలేదు. నీ తాంత్రిక పూజలతో... నీవు నాకు బలి దానము అయినపుడు రాక తప్పదు గదా.నీ విశ్వాధినేత ఆకాంక్ష కోసము పరమహంస తల బలికోసము నువ్వు ఇపుడు 'ఛోడ్' విద్యను నేర్చుకోవాలా?అందుకే నన్ను పట్టుకున్నావు గదా అనగానే....
స్వామి! మీరు త్రికాల వేదులు. త్రికాల జ్ఞానులు. సృష్టి, స్థితి, లయ, స్థితి గతులు తెలిసినవారు. నా ఆలోచనలు, కోరికలు మీకు తెలియకుండా ఉంటాయా? ఆ మార్గము ఏదో నాకు చూపిస్తే.....
ఓరేయి! అది అసాధ్యమైన విద్యారా! కాని సాధన సాధ్యతే సర్వం సాధ్యం. సాధ్యమైనదే. గాకపోతే ఓర్పు, నేర్పుఉండాలి. ఈ విద్యకి మూలదైవము దత్తాత్రేయుడు. ఆయన పెట్టె యోగమాయ పరీక్షలో నువ్వు జయం పొందితే ఆ విద్య నీకు అలవడుతుంది. లేదంటే నీ నిజ స్వరూపము బయట పడుతుంది. ప్రాణాలకి తెగించిన వాడికి తెడ్డే గతి లాగా నువ్వు ఉండాలి. నేను గూడ ఈ విద్యను నేర్చుకోవాలని ఇపుడు నువ్వు చేసిన పూజా విధానము ఆయన కోసము 54 రోజులపాటు చేశాను. పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత స్వామి వారు ప్రత్యక్షదర్శనము ఇచ్చి.....
తన చేతిని నన్ను తినమని తన చెయ్యి నాకు ఇవ్వగానే....
నేను 12 క్షణాలపాటు అనగా ఒక నిమిషము పాటు ఆలోచనలో పడి మాయకి గురియై....
స్వామి! మీ చెయ్యిని నేను ఎలా తినగలను. నా వల్ల గాదు అన్నాను.
దానికి ఆయన విరగపడి నవ్వి......
అంటే నీకు.... నాది..... నీది అనే బేధ భావముంది.నరమాంసము తినేవాడివి మాధవుడి మాంసము తినలేకపోతున్నావు. నరుడికి నారాయణుడికి అలాగే మానవుడికి మాధవుడికి బేధము లేదని ఏనాడు నువ్వు ఏకత్వ స్థితికి చేరుకుంటావో ఆనాడు..... నీకు ఇలాంటి తంత్ర ప్రయోగ విద్యాలతో పనియే ఉండదు అంటూ అదృశ్యమయ్యారు.
ఆ క్షణమే....
నేను నా సాధనలో చేసిన తప్పు ఏమిటో అర్ధమైంది. ఏకత్వ సాధన అనగా అద్వైతసిద్ధి కోసము జీవసమాధి చెంది ఆరు శరీరాలతో సాధన చేస్తున్నాను. నువ్వు నాకు లాగా అవ్వగూడదని ఇదంతా నీకు చెప్పడము జరిగింది. నేను ఆనాడు ఆ మాధవుడి చెయ్యి తిని ఉంటె కధ మరోలాగా ఉండేది. అఘ◌ోరుడికి విశ్వాధినేత అనే బ్రహ్మ పదవి లభించి ఉండేది. విశ్వమంతా అఘ◌ోర సంప్రదాయమే ఉండేది. కానీ ఇప్పుడు అది అంతరించే స్థితికి వెళ్ళిపోయింది. 412 సంవత్సరాల తర్వాత నాలాంటి వాడిని నీలో చూడటము జరిగింది. నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకూడదు. నువ్వు విశ్వాధినేత అవ్వాలి. అందుకు హిమాలయాలలో రహస్య రూపధారిగా 'ఛోడ్' ప్రక్రియ చేసే దత్తస్వామి అనుగ్రహము నువ్వు పొందాలి. ఆయన ఈ ప్రక్రియను చేస్తున్న సమయములో నువ్వు కళ్లారా ప్రత్యక్షముగా 48 నిమిషాలపాటు ఉండి భయపడకుండా సాక్షిభూతంగా చూడగల్గితే ఆ విద్య నీకు ప్రాప్టించినట్లే. ఆయన రాక వచ్చేటపుడు మూడు సార్లు హిమాలయాలు అదిరిపోయే విధంగా నల్లటి మహా పాంచజన్య శంఖనాదము వినబడుతుంది. ఆ సమయానికి నువ్వు ఆ మాయ దత్తరూపధారిని చేరుకొని ఆయన చేసే తంతును చూడాలి. విజయోస్తూ......శుభంభూయాత్ అంటూ ఆయన అదృశ్యమయ్యేసరికి......
గంగాస్నానము చేసి ఆశ్రమానికి చేరుకొని తన శిష్యుడైన చారుకేశతో కలిసి హిమాలయాల వైపు ఆకాశ గమన సిద్ధితో స్థూల శరీరయానముతో క్షణాలలో అక్కడికి చేరుకున్నారు.
Waiting for climax sir....
ReplyDelete