పరమహంస కాస్త
విశుద్ధ చక్ర జాగృతి కోసము ఆకాశ ముద్ర సాధన చేస్తున్న దృశ్యము కాలాముఖుడి మనో దృష్టికి రావడముతో ఈయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే సమయములో....
హార్వే తన పరికరము ద్వారా ఈయన చక్ర స్థితి చూడగా నాలుగు చక్రాలు జాగృతి, శుద్ధి, ఆధీన స్థితిలో ఉన్నాయని కాని విబేధనము కాలేదని తెలుసుకున్నాడు.
ఇంతలో....
డాక్టర్ జోషి ఇది గమనించి స్వామిజీ కాస్త విశ్రాంతి స్థితిలో ఉండటము చూసి
స్వామి! నాకు ఒక సందేహము. ఆత్మలు అనేవి ఉన్నాయా? ప్రేతాత్మలు, పిశాచాలు, భూతాలు అనేవి ఉన్నాయా? చనిపోయిన వారు ఏదో లోకములో ఉండటము అనేది నిజమా లేదా భ్రమ అనగానే.... నాయనా! చనిపోయినవారు మహర్లోకం అనబడే పితృ లోకములో ఆవాసము చేస్తుంటారు.ఈ లోకము సాధకుడి యొక్క అనాహత చక్రస్థితిలో ఉండటము. మీ గురూజీ ద్వారా ఈ పాటికే తెలుసుకొని ఉన్నావు. కోరికలు తీరనివారు, కోరికలు తీర్చాలని అనుకునేవారు, కోరికల కోసము ఎదురు చూసేవారు తమ వాళ్ల మీద ప్రేమ, మోహ, వ్యామోహాలు ఉన్నవారు, ఇతరులు అంటే గిట్టనివారు పడని వాళ్లు అందరుగూడ ఇలా ఈ లోకమునందు ప్రేతాత్మలుగా, పిశాచాలుగా, దెయ్యాలుగా, భూతాలుగా, మంచి ఆత్మలుగా ఆవాసము చేస్తుంటారు. ఇది నిజమే! భ్రాంతి, మాయ, భ్రమ కాదు. వీరి కోసము మనము ప్రతి నెల తద్దినాలు, సంవత్సరీకాలు చెయ్యడము జరుగుతోంది. వీరికి ఆత్మ శాంతి కలిగిస్తే మనకి మనఃశ్శాంతి కలుగుతుంది.
వీళ్లు నిజముగానే ఉన్నారో లేదో నీకు తెలియాలంటే ఆటో రైడింగ్ విధానము ద్వారా తెలుసుకోవచ్చు అనగానే.....
స్వామి! దీని గూర్చి కొంతమేర చదివాను. తెలుసుకున్నాను.
ఒక ఆవిడ చనిపోయిన తన భర్త ఆత్మ కోసము ఈ పద్ధతిని ఉపయోగించి ఒక సంవత్సర కాలము పాటు ఎదురుచూస్తే ఆయన కాస్త ఆత్మ రూపముగా ఈమె దగ్గరికి వచ్చి కాగితము మీద తన భర్త లాగా సంతకము పెట్టడము జరిగినదని దానితో ఈమె కాస్త ఈయన ద్వారా దగ్గర ఉండే వ్యక్తుల భవిష్య వివరాలు తెలుసుకొని ప్రమాదాల గూర్చి వారికి ముందుగానే హెచ్చరించి బాగా కీర్తి ప్రతిష్ఠలు, డబ్బులు సంపాదించినదని పేపర్ లో చదివాను. ఈ విధానము మీద నాకు నమ్మకము లేదు.
అనగానే...
అవునా? నీ ఎదురుగా ఉన్న పేపర్ మీద ఎవరు సంతకము చేశారో చూడు అనగానే.... ఆ సంతకము చూసిన డాక్టర్ జోషికి నోటమాట రాలేదు. కారణము సంవత్సరము క్రితము చనిపోయిన తన తండ్రి సంతకము లాగా ఉంది. అంటే....
అంటే... తన తండ్రి ఇపుడు తను ఉన్న గదిలో, కంటికి కనిపించని సూక్ష్మ శరీరముతో తన తండ్రి ఉన్నాడు అనే అనుభూతికి కంటి వెంట కన్నీరు సమాధానమైంది.
ఆ తర్వాత తెల్ల పేపరు కాస్త ఏదో విషయాలు చెపుతున్నట్లుగా కనిపించింది. ఆ విషయాలు తన తండ్రికి తప్ప మరొకరికి తెలియని రహస్యాలు గూడ ఉండేసరికి జోషికి నోటమాట రాలేదు. నమ్మకానికి సాక్ష్యము కనబడుతోంది. కాని అపనమ్మకానికి సాక్ష్యము ఆయన తన ఎదుట కనిపించడము లేదు.
లేదు! లేదు! ఆయన ఉన్నాడు కాని తన నేత్రాలు ఆయనను చూడటము లేదు. ఒకవేళ స్వామీజీ కాస్త తన మైండ్ రీడింగ్ చేసి తనకి తెలిసిన యోగ విద్యతో కాగితము మీద మేటర్ రాయలేదు గదా అని అంటూండగా.....
దేవి ఉన్నట్టుండి.....
పెద్దగా అరుస్తూ......
జోషి.... జోషి.... ఇదిగో ఈ అద్దము దగ్గరికి ఒకసారి రా! అనగానే....
అద్దములో ఏముంది అని జోషి చూడగానే.....
అద్దములో ప్రతిబింబముగా తన తండ్రి రూపము కనిపించేసరికి నోటమాట రాలేదు. కన్నీళ్లు ఆగలేదు. గాకపోతే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు కాని అవి తన చెవులకి చేరడము లేదని తెలుసుకున్నాడు.
అంటే తన తండ్రియే స్వయంగా ఆత్మ రూపములో అదే సూక్ష్మ శరీరముగా వచ్చి కాగితము మీద మేటర్ వ్రాసినారని అపుడు కాని పూర్తి నమ్మకం జోషికి రాలేదు. హార్వే తన చేతిలో ఉన్న పోలరాయిడ్ కెమెరాతో జోషి చుట్టుప్రక్కల ఖాళీ ప్రదేశాలలో ఫోటోలు తియ్యగానే.... వాటిలో కొన్నింటిలో జోషి
తండ్రి తన ప్రక్కనే ఉన్నట్లుగా హార్వేకి కనిపించగానే గుండె ఆగినంత పని అయ్యింది. అంటే తను ఒక చచ్చిన వాడి ఆత్మతో సెల్ఫీ దిగాను అనే ఆలోచనకే హార్వేలో ఓణుకు మొదలైంది. వంటి నుండి వేడి ఆవిర్లు రావడము మొదలైంది.
ఇది ఇలా ఉంటే....
దేవి ఉపయోగించుకునే టేబుల్ మీద ఒక గాజు సీసా ప్రత్యక్షమైంది. ఈ సీసాలో తేనె రుచి తేనెరంగులో ఉన్న ద్రావకమున్నట్లుగా వీళ్లు గమనించారు.
అప్పుడు వీళ్ల కేసి కాలాముఖుడు చూస్తూ.....
మీ ముగ్గురు ఈ తీర్థమును సేవించండి. దీని ప్రభావము 18 నిమిషాలు ఉంటుంది. ఏమి జరుగుతుందో చూడండి అనగానే......
ఈ ముగ్గురు అనుమాన భయముతో ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ ఈ తీర్థమును సేవించారు. కళ్లు మూతలు పడ్డాయి. కొన్ని క్షణాల తర్వాత కళ్లు వాటంతట అవే తెరుచుకున్నాయి. అప్పుడు వీరి కళ్లకి ఏదో మానవాతీత అతీంద్రియ శక్తి ఉన్నట్లుగా వీళ్లు అనుభూతి పొందసాగారు. దానితో వీళ్లు
గది నుండి బయటికి వచ్చి పైకి వచ్చారు. హార్వే తన కళ్లతో ఎదురుగా ఉన్న బిల్డింగ్ కేసి చూస్తే..... గది గోడల అవతల ఏముందో ఏమి జరుగుతుందో చాలా స్పష్టముగా
కనబడసాగింది. అదే దేవి తన కళ్లతో ఎదురుగా ఉన్న మనుష్యులకేసి చూస్తే వారి శరీరాలలో జంతువుల ఆత్మలు అనగా పాము, కుక్క, ఆవు, పంది, ఏనుగు, పులి, గాడిద, గుర్రము ఇలా జంతువుల ఆత్మలు వారి శరీరాలలో ఉన్నట్లు కనిపించసాగింది. అంటే మానవ శరీరాలలో జంతువుల ఆత్మలున్నాయని
అనగా జంతువులే ఇలా మానవ జన్మలు ఎత్తాయని ఈమెకి అర్థమైంది. మరికొంతమంది మానవులలో వారి మానవ ఆత్మలే అగుపించాయి. అలాగే కొన్ని జంతువులకేసి చూడగా అందులో మానవ ఆత్మలు కనిపించాయి. మానవులు కాస్త జంతువుల జన్మలు ఎత్తినట్లుగా ఈమెకి అర్థమయింది. చెట్లలో జంతువుల ఆత్మలు, మానవ ఆత్మలున్నట్లుగా గమనించింది. మన పెద్దలు చింత చెట్టు మీద, మర్రి చెట్టు మీద చనిపోయిన ఆత్మలుంటాయని చెప్పడము సత్యమేనని ఈమె గ్రహించింది.
ఇక జోషి విషయానికి వస్తే ఇతను తన కళ్లతో ఎక్కడ చూసినా గోడలపైన ప్రాకుతూ నల్ల డ్రాకుల్లాలు, పాడుపడిన ప్రాంతాలలో, బావుల వద్ద, చెరువులలో, చెట్ల క్రింద, శిధిల భవనాల వద్ద, పాడుపడిన దేవాలయాలలో చనిపోయిన ఆత్మలు, ఆత్మహత్య చేసుకున్న ఆత్మలు, ప్రేతాత్మలు, పిశాచాలు, భూతాలు, దెయ్యాలు కనిపించేసరికి ఇవి ఉండటం అక్షరసత్యమేనని ఇతనికి అర్థమయ్యేలోపల 18 నిమిషాలు పూర్తి అవ్వడముతో వీరి కళ్లకి వచ్చిన దూరదృష్టి, దివ్యదృష్టి, జన్మాన్త జ్ఞాన దృష్టి సిద్దులు గూడ అంతరించిపోయింది. ఈ సిద్దుల గూర్చి తెలియని వీళ్లు యధావిధిగా తమకు కలిగిన స్వానుభవాలు ఒకరికొకరు చెప్పకుండా తిరిగి రహస్య గదికి చేరుకొని
శవాసనములో ధ్యానస్థితిలో కాలాముఖాచార్యుడికి నమస్కారము చేసి.... పరికరాలలో రికార్డు అవుతున్న దృశ్యాలను పరిశీలించడము మొదలుపెట్టారు.
గాకపోతే వీళ్లు చేసిన పొరబాటల్లా తమ శక్తి కళ్లతో తమ శరీరాలను ముందు చూసుకొని ఉంటే కధ మరోలా ఉండేది. ఎందుకంటే వీరి శరీరాలలో దైవాత్మలున్నాయి.
ఓం జీ
ReplyDelete