అధ్యాయము 6


కర్కోటకుడు శరవేగముతో తీవ్రమైన ఆవేశముతో.......

తన శిష్యుడైన చారుకేశతో కలిసి తన ఆశ్రమము వైపుకి వెళ్లుతుండగా......

ఎదురుగా.......

నీళ్ల కుండతో వచ్చే అమ్మాయిని చూసుకోకుండా..... అనుకోకుండా 'ఢీ' కొట్టడము......

అమ్మాయి నీటి కుండ పగిలిపోవడం కాలికి దెబ్బ తగలడముతో....... ఆమెకి కోపము వచ్చి.....

కర్కోటకుడికి కేసి అదోలా చూస్తూ

ఒరే! దరిద్రుడా! స్మశానములో శవాలను తినేవాడా? నీకు పోయేకాలము  వచ్చిందిరా!  బంగారము లాంటి నా కుండను బద్దలు కొట్టావు! నా కాలికి  గాయము చేసినావురా!

దుర్మార్గుడా? అనగానే....

కర్కోటకుడికి విషయము అర్థమై తల్లి! క్షమించు! పగిలిన కుండ ఖరీదు, నీ కాలి గాయానికి మందు ఇస్తాను! తీసుకో! అనగానే.....

ముష్టి వెధవా? సొమ్ములు ఎవరికి కావాలిరా! దరిద్రుడా! నువ్వే వెయ్యి ఇల్లా పూజారివి! అడుక్కొని తెచ్చుకున్న దానిని తినేవాడివి! ముష్టిలో నాకు ముష్టి వేస్తావా? నీ ముష్టి వద్దు! నీ సొమ్ము వద్దు అంటూ ముందుకి సాగుతుండగా.......

పదేపదే తనని ముష్టి వెధవా అనేసరికి కర్కోటకుడికి ఎనలేని ఆవేశము కల్గి అది కాస్త అధిక తీవ్రమైన ఉగ్రరూప కోపావేశముగా మారి వెళుతున్న అమ్మాయి కేసి

తన తీక్షణ కళ్లతో తాటకక్రియ ప్రక్రియతో స్థిరమైన మనసుతో తీక్షణముగా ఒక క్షణము పాటు చూసేసరికి....

వెళుతున్న అమ్మాయి జుట్టు కాలడము మొదలయ్యే సరికి ఆమె మంటలు మంటలు.....

నా జుట్టు కాలిపోతుందని కేకలు పెడుతూండగానే....... క్షణాలలో ఈ మంటలు ఈమె శరీరమును వ్యాపించి బూడిదగా మార్చి వేసింది!

ఈ దృశ్యము చూసిన శిష్యుడికి నోట మాట రాలేదు! అమ్మవారి మీద కోపమును ఈ విధంగా అమ్మాయి మీద తీర్చుకున్నారని వాడికి అర్థమై మౌనముగా తన గురువుని అనుసరిస్తూ ఆశ్రమానికి చేరుకున్నారు!

ఇంతలో....

చుట్టుప్రక్కల ఇళ్లలోని వ్యక్తులు వచ్చి అరచిన స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి బూడిదగా మారడము గమనించి ఏదో పిడుగుపడి ఇలా అర్ధాంతరముగా చచ్చిపోయినదని అక్కడ నుండి వెళ్లిపోయారు!


లోపలికి వెళ్లిన గురు శిష్యులు ఈ విషయము తెలుసుకొని తనకి ఎలాంటి ప్రమాదము  రాదని గ్రహించి గురువు కాస్త వసరాలో ఉన్న వాలుకుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా

చారుకేశ అక్కడికి వచ్చి....

గురూజీ! ఇందాక ఆ అమ్మాయి మీద మీరు కళ్లతో ఏదో ప్రయోగము చేశారని నాకు అనిపించింది! అది ఏమి ప్రయోగము అనగానే.....

ఒరే! చారుకేశ! ఆ విషయాలు ఇపుడే నీకెందుకురా !ఇంక నువ్వు తాంత్రిక శిక్షణ కాలములోనే ఉన్నావు! ఇపుడు వాటి గూర్చి నీకు చెప్పినా అర్థము  కావు! పైగా లేనిపోని భయాలు పెట్టుకుంటావు! పెంచుకుంటావు!

లేదు గురువుగారు! నేను భయపడే వాడిని అయితే ఈ విద్య నేర్చుకోవటానికి ఎందుకు వస్తాను? మీ మెప్పు పొందడానికి మూడు సంవత్సరాల నుండి ఎందుకు కష్టపడతాను! నేను ఇపుడే ఆ ప్రయోగాలు చేస్తాను అనడము లేదు! కేవలము వాటి వివరాలు, విధివిధానాలు మాత్రమే తెలుసుకుంటాను! ఎప్పుడైతే నాకు వీటిని ప్రయోగించే అర్హత, యోగ్యత వచ్చినప్పుడే అప్పుడే అనుభవ పూర్వక ప్రయోగాలు చేస్తాను అనగానే.......

సరే! రా! నువ్వు గూడ నాలాంటి మొండి ఘటమురా! అనుమానము వస్తే తీర్చుకునే దాకా వదిలిపెట్టవు గదా! ఇందాక నేను ఆ అమ్మాయి మీద నా కళ్లతో ప్రయోగము చేశాను! దాని పేరు ఆరుత్యుంగా ప్రయోగము అంటారు! ఇది ఎలా ఉంటుంది అంటే ఒక భూతద్దముతో కాగితమును సూర్యడి  కాంతితో అలా తగలబెడితే ఎలా ఉంటుందో.... అలా ఈ ప్రయోగము గూడ అంతే అన్నమాట!

కళ్లలోనికి న్యూక్లియర్ శక్తిని తెప్పించుకొని ఆ కిరణాలను ఏ వస్తువు లేదా వ్యక్తి లేదా జంతువుల మీద ప్రయోగము చేయాలని అనుకుంటున్నామో..... అప్పుడు త్రాటక క్రియ  ద్వారా అనగా రెండు కళ్లలో కన్పించే రెండు ప్రతిబింబాలను ఏక ప్రతిబింబముగా చేసి చూడటమే త్రాటక క్రియ అవుతుంది! ఈ ప్రయోగము రెండు మీటర్ల దూరము వరకు మాత్రమే పని చేస్తుంది! మన దృష్టిని వాళ్లు తప్పించుకొనే అవకాశముంటుంది! అంటేఇందాక అమ్మాయి మీద నా తదేక దృష్టి ఆమె జుట్టు మీద ఉంచాను! అదే సమయములో ఆ అమ్మాయి అనుకోకుండా వంగి ఉంటే నా దృష్టి పధము  నుండి ఆమె జుట్టు తప్పుకునేది! దానితో ఆమెకిగండము తప్పేది! 

ఇలా ఈ ప్రయోగమే కాకుండా తంత్రములో ఏనిమిది రకాల ప్రాథమిక ప్రయోగ విధి విధానాలున్నాయి! మధ్యమ స్థాయి ప్రయోగాలు అనగా ప్రేతాత్మలను బంధించడం, తాంత్రిక దేవతలను వశపరుచుకోవడం, మంత్ర తంత్ర యంత్ర అధిష్టాన దైవాల అనుగ్రహం పొంది సిద్ధులు పొందడం ఇక చివరిస్థాయి ప్రయోగాలు అంటే ఇతరుల మీద మంత్ర ప్రయోగాలు, చేతబడి, బాణామణి, కిల్లంగి, కాష్మోరా, అగ్ని బేతాళ, కాలభైరవ ఇలాంటి అతి మహా భయంకర ప్రయోగాలలో సిద్ధి పొందడం..... ఇక ఆపై అంతిమ ప్రయోగాలు పంచభూతాల ఆధీనం, 18 సిద్ధులు వశము, ఇంద్రియ పదవి, బ్రహ్మ పదవులు, దేవతలపై అధికారము, విశ్వాధినేత గావడము లాంటి ఉత్కష్ఠమైన కోరిక ప్రయోగాలు చేయడము అన్నమాట!

    వీటి అన్నింటి సిద్ధికోసము ముహూర్త బలము, నక్షత్ర తిధి, ----- ఉంటాయి! ఈ తంత్ర ప్రయోగాల కోసము వాడే వస్తువులు, మూలికా వేర్లు అన్నిగూడ కాలమాన ప్రకారము సేకరించి వాడవలసి ఉంటుంది! అప్పుడే మనము చేసే ప్రయోగ సిద్ధి కలుగుతుంది! అలాగే సాధకుడు గూడ ఈ ప్రయోగాలు నేర్చుకొనేటప్పుడు,  చేసేటప్పుడు ఎంతో ఇంద్రియనిగ్రహముతో ఓర్పుగా,సహనముగా, శ్రద్ధ భక్తితో ఉండాలి! లేదంటే వాడి ప్రాణాలు వాడి చేతిలో ఉండవు! ఆ మంత్ర దేవతలకి నరబలి గావాల్సి ఉంటుంది! తంత్ర ప్రయోగాలు అనేవి కత్తి మీద సాము లాంటివి! తేడాలు వస్తే శవము అవుతాము లేదంటే శివమ్  అవుతాము! ఇక అమ్మవారి ప్రయోగానికి గావలసిన వేర్ల కోసము అడవికి వెళ్లదామా అంటూ వీరిద్దరూ కలిసి ఆశ్రమమును వదిలి అడవి వైపు కి బయలుదేరారు!

No comments:

Post a Comment