కర్కోటకుడు.....
కొన్ని రోజుల నుండి తదేకదీక్షతో స్థిరమైన మనస్సుతో 'ఛోడ్' తంత్ర ప్రయోగ మంత్రము శ్రద్ధగా 10 లక్షలు పూర్తి చేసేసరికి వీడికి ఈ మంత్రసిద్ధి కలిగింది. అంటే ప్రయోగము మాత్రమే మిగిలింది. కాకపోతే ఒకే వ్యక్తి మీద మూడు సార్లకి మించి తంత్ర ప్రయోగము చెయ్యరాదు. చేస్తే ఈ మంత్ర దేవత అయిన అగ్ని భేతాళుడి చేతిలో ఘ◌ోరమైన మరణము తను పొందక తప్పదని వీడికి తెలుసు.
పైగా ఈ ప్రయోగానికి పరమహంస రక్తము గావాలి. అందుకోసము తను ఈయన ఇంటికి వెళ్లి ఎలాగోలా అక్కడున్న పని వాడిని మంచి చేసుకొని వాడికి నయానో, భయానో, బెదిరించో ఆ ఇంటిలో ఉన్న పరమహంస రక్తము ఎలాగైనా సేకరించాలని అనుకొని బయలుదేరాడు.
ఇంటికి కనుచూపుమేరలో ఉండగా పని వాడు బయటకి వస్తూ కర్కోటకుడికి కనిపించగానే... వాడి దగ్గరికి వెళ్లి సూటిగా తనకి కావాలసినది ఏమిటో చెప్పే సరికి వాడు కాస్త బిత్తరపోయి
ఏమిటి? మా గురువుగారి రక్తము కావాలా? దేనికి ఏమి చేస్తావు? ఆ! ఆ! గుర్తుకు వచ్చింది. మొన్న ఈ మధ్య ఈ దేవి అమ్మగారికి ఎవరో రక్తము, జుట్టు, గోరులు, వెంట్రుకలు, క్షుద్ర ప్రయోగము చేసి చంపాలని ప్రయత్నించారని మా గురువు గారు చెప్పారు. అలాగే ఈ ప్రయోగ సమయములో అమ్మగారు పడిన మరణ నరకయాతనలు నేను కళ్లారా చూసి గూడ వీటిని ఎందుకు ఇస్తాను? అంటే నువ్వేనా? ఆ కర్కోటకుడివి? క్షుద్ర ప్రయోగాలు చేసేవాడివి అనగానే.....
అయ్యా! స్వామి! మీరు అనుకుంటున్నా వ్యక్తిని నేను కాను. నాకు ఎలాంటి తంత్ర క్షుద్ర ప్రయోగాలు రావు తెలియవు. అవి అంటే నాకు భయము. మా అన్నయ్యకి గావాలసిన రక్త గ్రూప్ ఆసుపత్రిలో దొరకడము లేదు. ఎవరు గూడ రక్త దాతలు రావడము లేదు. దానితో ఈ రక్త గ్రూప్ కోసము నాకు తెలిసిన మీలాంటి వ్యక్తుల రక్తమును సేకరించి పరీక్షలు జరిపి ఈ రక్త గ్రూప్ మా అన్నయ్య రక్త గ్రూప్ ఒక్కటే అయితే వారి నుండి రక్తమును సేకరించి మా అన్నయ్యను బ్రతికించవచ్చుననే చిరు ప్రయత్నము ఇది అనగానే....
అయితే నా రక్తము అడగకుండా మా గురువు గారి రక్తము ఎందుకు అడుగుతున్నావు? అనగానే....
వీడు పైకి డింగరిగా కన్పించిన మంచి కాలాంతకుడని అనుకొని
అయ్యా! ఆయన రక్తము అడిగి పరీక్షలలో అది గాదని తేలితే మీ రక్తము అడగాలని అనుకున్నాను. మీరు వయసులో ఉన్నారు. ఆయన వృద్ధాప్యములో ఉన్నారు. ఇంక మీరు ఏమీ చూడలేదు. ఆయనేమో అన్ని చూసేశారు గదా. అందుకే ఆ పెద్దాయన రక్తము గావాలని అడగడము జరిగింది. ఈ పని చేసి పెడితే నీకు పది లక్షలు ఇస్తాను అంటూ ఈ నోట్లున్న సూట్ కేస్ చూపించగానే పనివాడిలో ధనాశ మొదలై గురువు మీద గురుభక్తి తగ్గి......
సరే! సరే! మీ అన్నయ్య ప్రాణాలు ప్రమాదములో ఉన్నాయని అంటున్నారు. పైగా నాకు గూడ డబ్బులతో ఏవో చిన్నా చితక అవసరాలు ఉంటూనే ఉంటాయి గదా. ఆ డబ్బులు ఏదో మీరు ఇస్తారు అంటే నేను ఎందుకు కాదనాలి. సరే! ఇక్కడే ఉండండి, ఒక గంటలో మీరు అడిగిన పెద్దాయన రక్తము తీసుకొని వస్తాను అంటూ....
తిరిగి ఇంటి లోపలికి వెళ్లి.....
భోజనాలు సిద్ధము చేసి వాటిని ఇవ్వటానికి వీళ్లు ఉన్న రహస్య గదికి భోజనాలు తీసుకొని వెళ్ళాడు. వంట వాడు వీళ్లకి వడ్డన చేస్తూ నెమ్మదిగా తన గ్రద్ద దృష్టితో గది పరిసరాలను చూడటము ఆరంభించాడు.
డాక్టర్ జోషి నిత్యము ఉపయోగించే గదిలో ఏదో గాజు పరీక్ష నాళాలలో ఎవరిదో రక్తమున్నట్లుగా గమనించి..... జోషితో.....
సర్! అక్కడ ఏవో గాజు నాళాలున్నాయి.వాటిలో ఏదో ద్రావకముంది. అవి పగిలిపోతే ప్రమాదము వస్తుందేమో. వాటిని తీసి బయట పడవెయ్యమంటారా?
జోషి వెంటనే....
ఆ పని చెయ్యకు. అది గాజు బాక్స్ లో ఉన్న గురూజీ గారి రక్తము. పరీక్షలకోసము కొన్ని శాంపిల్స్ తీసుకోవడము జరిగింది. వాటిని అలాగే ఉంచు. అనగా
అయితే వాటిని గుడ్డతో బయటి భాగము తుడుస్తాను. దుమ్ము, ధూళి పట్టి ఉన్నాయి అనగానే....
నీ ఇష్టం! కాని అవి పగలకుండా చూసుకో అన్నాడు.
వీళ్ల భోజనాలు అయిన తర్వాత కాలాముఖుడు కాస్త నకిలీ పరమహంస ఉన్న గది బాక్స్ లోనికి ఆహారము తీసుకొని వంటవాడు వెళ్లుతుండగా.....
ఇది గమనించిన జోషి వెంటనే.....
నువ్వు ఆ గదిలోకి వెళ్లకు. ఆయన ధ్యాన దీక్షలో ఉన్నారు. ఆహారము తినరు. వాయు భక్షణ మాత్రము చేస్తారు అనగా అన్నము తినకుండా గాలి తిని ఎలా బ్రతుకుతారో వంటవాడికి అర్ధమవ్వక అయోమయముగా ముఖము పెట్టి....
సరేనండి! మీ ఇష్టము! మీరు ఏది చెపితే అది నేను చెయ్యడమే గదా నా పని అంటూ... భోజన పాత్రలు డైనింగ్ టేబుల్ మీద పెట్టి.... గాజు పరీక్ష నాళికలు శుభ్రము చేస్తున్న నెపముతో ఒక రక్త పరీక్ష నాళికను తన కండువాలో ఎవరు చూడకుండా దాచి పెట్టుకొని శ్రద్ధ భక్తి వాటిని పై పైన శుభ్రము చేసి....
ఖాళీ అయిన భోజన పాత్రలు తీసుకొని ఎవరికి అనుమానము రాకుండా గది నుండి బయటపడి వంటగదికి చేరుకొని.... ఆ పాత్రలు అక్కడ పడి వేసి....
తన కోసము ఇంటి బయట కాపలాకాస్తున్న కర్కోటకుడి దగ్గరికి వెళ్లి..... ఇదేమీ తెలియని పని వాడు కాస్త నకిలీ పరమహంస రక్తము సేకరించిన గాజు రక్తపరీక్ష నాళికను చేతిలో పెడుతూండగా.....
అయ్యా! మీ గురువు గారి భోజనము పూర్తి అయిందా?
'లేదు స్వామి! ఆయన ఏదో ధ్యాన దీక్షలో ఉన్నారట. భోజనము చెయ్యరంట. గాలినే తింటారట' అన్నాడు.
అవునా! ఆయన ఏమి తింటే నాకెందుకులే. నేను వచ్చిన పని పూర్త అయింది.ఇదిగో! ఇందా! ఈ పది లక్షలు తీసుకో. అంటూ రక్తపరీక్ష నాళికను తీసుకొని శరవేగంగా తిరిగి గంగానది ఓడ్డు వైపుకి బయలుదేరాడు.
అదే పనివాడు.....
గాలిని తింటారట అనకుండా 'వాయు భక్షణ' చేస్తారని అని ఉంటే అది కర్కోటకుడికి అర్థమై...కధ మరోలా ఉండేది. ఎందుకంటే పరకాయ ప్రవేశములో ఉన్నవారు ఆహారము తినరు. వాయు భక్షణ మాత్రమే చేస్తూ ప్రాణాలు నిలుపుకుంటారు. అదే ఆహారము తింటే మలమూత్రాదుల సమస్యలు వస్తాయి గదా. వీటిని నివారించడానికి వాయుభక్షణ చేస్తారని కర్కోటకుడి లాంటి ఆడి తేరిన తంత్ర ప్రయోగులకి తప్ప నర మానవులకి తెలియదు.వాయుభక్షణ ఎందుకు పరమహంస చేస్తున్నారని ఆలోచన కర్కోటకుడికి ఖచ్చితంగా వచ్చి ఉండేది. దానితో నకిలీ పరమహంస కధ బయటికి వచ్చేది. ప్రకృతికి ఎవరికి ఏమి ఎపుడు ఎలా ఇవ్వాలో ఎంతవరకు ఇవ్వాలో తెలిసినంతగా వేరే వారికి తెలియదు గదా.
ఎవరి ప్రాప్తము వారిది. ప్రాప్తమును బట్టి ప్రాప్తి ఉంటుంది.
No comments:
Post a Comment